స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కౌమారికా ఖండము

9వ అధ్యాయము

ఉలూక ఉవాచ -

ఉలూకమిట్లు చెప్పెను - పూర్వజన్మలో జరిగిన దానినంతాదీకు చెప్పితివి. వారూపము, దీర్ఘాయుష్సుకి కారణము, గుడ్లగూబగా మారుటకు కారణమును చెప్పితివి. అనీ ఆ గుడ్లగూబ ఊరకుండగా (మిన్నకుండగా నాడీజంఘుడను కొంగ దుఃఖించుచూ మిత్రునితో నిట్లనెమ - 'జానికి దేవికొరకు మేమిక్కడికి వచ్చామో ఆది నెరవేరలేదు - ఇక మా ముగ్గురికీ మరణమే ప్రాప్తించినది - ఇంద్రద్యుమ్నుని గూర్చి తెలియనిచో ఇతను మరణించదలచినాడు. అతనిననుసరిస్తూ మార్కండుడు, అతనినమసరిస్తూ వేమ మరణించెదము -మిత్రుని కార్యము పూర్తికాకపోగా మిత్రుడు మరణించుచుండగా చూచే దురాత్ముడైన, స్నేహితము లేవి మిత్రుని జీవితము తుచ్చము కనక విప్రుడా! మరణించగోరిన వీరిద్దరినే నేనునూ అమసరించెదను - నమస్కారము నీకు - వీడ్కోలు పలుకుచుంటిని - ఇదే చివరి కలయిక - మిత్రునికి, అభ్యాగతునికి ప్రతిజ్ఞనొనర్చి, నెరవేర్చకపుండు వారు హతాశులై ఎందుకు సిగ్గుపొందరు?  కమక వేను వీరితో పహా విప్సంశయముగా అగ్నిని ప్రవేశించెదను. స్నేహముతో నీకు వీడ్కోలు పలుకుచుంటివి - నాకు జలతర్పణము నిమ్ము - అవి గద్గదస్వరముతో నాడీజంఘడనగా గుడ్లగూబ కన్నీళ్ళతో స్థిరమై అమృతముమ చిలుకునట్లు ఇట్లు పలికెను.

 ఉలూక ఉవాచ –

నేను జీవించి యుండగా నా మిత్రుడవైన నీవు మరణించినచో నేటి నుండి నా హృదయమును ఎవడు పొందును? ఒక గొప్ప ఉపాయముగలదు- గంధమాదనపర్వతముపై నా కంటినూచిరాయువగు గద్ద యున్నది - నాకు ప్రాణముతో సమానమగు పహృదయుడు. 'మీరు కోరిన ఇంద్రద్యుమ్నుడను రాజును అతను తప్పక ఎజుగును' అని గుడ్లగూబ ముందు నిలువగా ఇంద్రద్యుమ్నుడు, మార్కండేయుడు ఆ కొంగ గంధమాదనమునకు వెళ్ళిరి. ఎదురుగా వచ్చుచున్న తన మిత్రుని చూచి ఆ గద్ద తన నివాసమునుండి సంతోషముతో ఎదురేగినది ముందు స్వాగతము, భోజనము మున్నగు వానితో మిత్రునికి మర్యాద చేసెను - తరువాత ఆ పక్షిరాజు గుడ్లగూబను తమ రాకకు కారణమేమని అడిగెను. అపుడు గుడ్లగూబ, కొంగ తన మిత్రుడని అతని మిత్రుడి మువియవి, మువి మిత్రుడు శరాజయవిఆతవి కొరకువచ్చితిమనిచెప్పమ-ఇంద్రద్యుమ్నుడిరో తెలిపినచో జీవించుమ. లేనిచో జీవించడు. అని ప్రవేశించి తప్పక జీవితముమ విడుమన అతని వయపరించి మేముమా ప్రాణములు విడిచెదము  వీపు చిరాయువని తెలిపి వేవితవిని విచారించితివి. ఆ ఇంద్రద్యుమ్నుడెవరో తెలిపివతో చెప్పి నలుగురి ప్రాణములను నిలుపుము. రక్షించుము. పత్కీర్తిని పొందుము. అన్ని పాపముల క్రయమున కూడా పొందుము.

గద్ద చెప్పెను -కౌశికా! (గుడ్లగూబా!) నేను జన్మించి యాభయి ఆరు కల్పములు గడిచినవి. కానీ ఇంద్రద్యుమ్నుడమ రాజును చూడలేదు, అతనిని గూర్చి వినలేదు - అనగా విని ఇంద్రద్యుమ్నుడు విస్మయము నొందెన - అమీత దుఃఖమునుపొందిననూ ఆ గద్దను నీ చిరాయువునకు కారణమేమని అడిగెను - అపుడు గద్ద ఇట్లు చెప్పిన - ‘విను నాయనా! పూర్వము నేను చపలత్వము గల కోతిగా జన్మించితిని. ఒకవాడు క్రమమున వసంతరును వచ్చెమ - ఆ ఋతువునందు, దేవదేవుడైన శివుని శివాలయము నందువవమున చతుర్ధశితిథియందు హస్తా నక్షత్రమున, హర్షణమన యోగమున చైత్రమాస శుక్ల పక్షమున మదనోత్సవమాదిమ - జనులు బంగారు ఊయలలో లింగమునుంచిరి. రాత్రి సమయానవేను చపలత్వముచేత ఆ ఊయలక్క దానిని కదిలించితిని -కోతికుండు సహజ చపలత్వము చేత వేమ ఆ ఊయలను చాలాసేపు ఊపితిని. ఉదయముకాగానే జనులు శివుని పూజించుటకు వచ్చిరి. ఊయల వెక్కి కూర్చున్న నన్ను చూచి కర్రలతో నన్నుకొట్టిరి. అపుడు ఊయలలో నుండి నేమ శివాలయమున మరణించితివి - వజ్రమువలె కఠినమైన అనేక దెబ్బలను తిని అక్కడ మరణించిన నేను శివుని ఊయలవెక్కిన మహిమచే రాజుల ఇంట జన్మించితివి - కాశీశ్వరుని పుత్రుడగు కుశధ్వజాడని పేరొందితిని - జాతి స్మరణచే ఐశ్వర్యమును పొందిన నేను క్రమముగా రాజ్యమున ఎల్లెడలా చైత్రమాసమున మదనోత్సవమున చేయించసాగితివి.

ఊయలలో నున్న శివుని నరుడు ఏవిధముగా ఊపుచుండునో అదేవిధముగా అతని అశుభము నశించి, పుణ్యము ప్రాప్తించును - శివదీక్షను పొంది, (నిత్యసంస్కారముచే) సంస్కరింపబడితిని నేను. శివార్చనచేత పశుపాశములనుండి ముక్తుడనై, ఆగమమునుండి నిర్వాహదీక్షవరకున్న సంస్కారముల పొందితిని - అట్లు దేవేశుడు, ప్రత్యగాత్మ, ఉమాపతియగు శివుని, అన్ని క్లేశముల విచ్ఛేదమునకు కారణమైన జగద్గురువును ఆరాధించసాగితిని - చిత్తవృత్తుల నిరోధించి, వైరాగ్యమునభ్యసించుట చేతనూ, ఓంకారమును జపించుచూ దాని అర్థమును భావన చేయుచూ శాంతుడనై యుంటిని - భక్తిచేత, దృఢమైన అభ్యాసము చేత వా అన్తరాయములు (చిత్త విక్షేపములు) నశించినవని తెలిసి శివుడు సంతసించి ఇట్లనెను - 'కుశధ్వజుడా! నేనీనాడు సంతసించితిని - నీకిష్టమైన వరమునుకోరుము. భూమిపై ఇట్టి అనుష్టానము వేరెవరికీ లేదు - అనగా విని నేను ఈ శరీరముతోనే గణములలో ఒకడినిగా కావలెనని కోరగా అట్లేనని శివుడు పలికెను - అంతట నన్ను కైలాసమునకు తెచ్చి అనేక రత్నములు గలిగి దివ్యాశ్చర్యములతో కూడిన దివ్యమైన విమానమును నాకిచ్చెను - దానిపై నేను యథేచ్ఛగా విహరించితిని కొంతకాలము గడవగా ఈ పర్వతముపై విమాన గవాక్షము వద్ద నున్న నేను వసంతర్తువున ఒక మునికన్యను చూచితిని. 

మలయమారుతము వీచుచుండగా నాకు కామాన్ని ఎక్కువాయెను -  అగ్నివేశ్యుని సుతయగు ఆ కన్య వివస్త్రయై వీటిమధ్యనుండెను - యవ్వనవతియై, సన్నని నడుముతో, విశాలనేత్రములతో నుండెను - జఘనము విశాలముగా నుండి, ఊరువులు అరటిబోదెలవలె నుండెను. స్తనములు కఠినముగా నుండి అపుడే లావణ్యము పొటమరించుచుండెను - అట్టి కన్య వా ఎదుట పగలే వివస్త్రయై జలకొలాడుటను చూచితిని -  వికసించిన పంకజమువలె ముఖముండి, ఆ కృతి సుందరముగా నుండెను. తమ పాండిత్యమునంతా వాస్తవముగా ఉపయోగించి పండితులు వర్తించదగినట్లుండెను - మన్మథుడు ఆమె అంగములనాశ్రయించి ఆమె కటాక్ష విక్షేపములతో నన్ను బాణసముహలతోవలె దృఢముగా కొట్టసాగెను -  తన సఖులతో గూడి యథేచ్చగా క్రీడించుచున్న ఆ కన్యను నేను విమానమునుండి దిగి మదనాతురుడనై అపహరించితిని.  నేనట్లు అపహరించగా ఆ కన్య మిగుల దుఃఖించుచూ గట్టిగా విమానమునుండే ' నాన్నా!' అని ఆరవసాగెను  అంతట ఆమె పఖులు దీన పరుగెత్తి వెళ్ళి అగ్నివేశ్యమునితో 'మీ కూతురును ఎవడో విమానముపై వచ్చి అపహరించుకొని పోవుచున్నాడు. దుఃఖించుచున్న నీ కూతురిని రక్షించుము  లెమ్ము మహర్షి!  అనిరి

'వారి మాటలను విని తపోనిధియగు ఆ ముని త్వరగా ఆమె వెళ్ళిన మార్గముననే అనుసరించి వచ్చెను - ‘నీలు,విలు’ మని నన్ను అడ్డగించి, తపశ్శక్తితో నా గమనమును ఆపివేసెను -  మిగుల కోపించిన ఆ ముని అంత వనిట్లు శపించిన - 'గద్ద మాంసపు ముక్కను అపహరించిపోయినట్లు నీవు నా కూతురును అపహరించుకొని ఆకాశమున కగిసినందున వెంటనే గద్దవు కమ్ము, ఇష్టపడని నా అసహాయురాలైన కుమార్తెను అపహరించినందున దాని ఫలితము వనభవించుము - దుర్మతీ!' అనగా భయముపొంది, సిగ్గుతో తలదించుకుంటిని -  ఆ ముని పాదములను పట్టుకొని మిగుల రోదించుచూ నేలపై పడి 'తెలిసి నేను ఈ కన్యను అపహరించలేదు - ఆమెను బెదిరించలేదు కూడా! తపోవీధీ! నా పట్ల అనుగ్రహముమ చూపి శాపమును మరలించుము. శరణుజొచ్చిన వారిని తపోధనులు సహజముగా క్షమించువారే యగుదురు కదా! నేను గద్దమ కాకుండా ప్రసాదించుము' అనీ ప్రపన్నుడైన నేను మహామునికి నమస్కరించితిని -  అంతట ప్రసన్నుడైన ఆ ముని 'వామాట ఎప్పటికీ మిథ్య కాదు. కానీ ఇంద్రద్యుమ్నుడను రాజును గూర్చి తెలియుటలో సహాయపడినచో వీవీ శాపమునుండి విముక్తుడవయ్యెదవు అనెను.

అని ఆ ముని పలికి తన శీలవతియగు కూతురిని తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయెను - నేనప్పుడే గద్దనైతిని - ఈ విధంగా మదనోత్సవమున ఈశ్వరుని ఊయలలోనుంచి సేవించినందున ఈ రాజ్యగృహమున నేమ జన్మించితిని - శంభుగణమునైతివి. అట్లే అగ్నివేశ్యుని శాపముచేత గద్దనైతిని. వాయనా ఇదంతా మీకు చెప్పబడినది -