స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కౌమారికా ఖండము

18వ అధ్యాయము

నారదుడు చెప్పసాగెను. సున్నిత స్థలములను దెబ్బతీయు బాణములతో కుబేరునికి జంభునితో యుద్ధము జరుగగా దిక్కులన్నీ కప్పబడెను. సైన్యము దెబ్బతీయబడెను. ఆ దైత్యుని కర్మ చూచిన కుబేరుడు చెవివరకు వింటిత్రాడునులాగి మహాబలుడగు జంభుని, అగ్నిని వర్షించు వేలకొలది బాణములలో ఎదపై దెబ్బతీపెను. ఆ వీరుడు నవ్వి లెక్కలేనన్ని బాణములను క్షణములో కుబేరునిపై విడిచెను. అతని వేర్పరితనమును చూచి కుబేరుడు కోపించి, గదను తీసుకొని స్వర్గమునుపొందగోరువాడు తన ధనాన్ని విడిచినట్లు అతనిపై విడిచెమ. అట్లు ఆ గద విసిరివేయబడగా ప్రళయ సమయంలో వలె పెద్దనాదమేర్పడెను. అపుడు ఆకాశంలో భయముమ కలిగించునట్లు భూతముల అరుపులు పుట్టెను. మేఘముల సమూహముతో ఆకాశమును చేరుచూ గొప్ప వాయువేర్పడెను. అట్లు ఆ కుబేరుని గద ముల్లోకములలో అర్చింపబడినదిగా మండెను. మెరుపు తీగల సమూహముతో చూడవీలులేని ఆ గద తనవైపు వచ్చుట చూచి దైత్యుడు దానిని దెబ్బతీయుటకు శస్త్రములను వర్షింపజేసేమ. చక్రములను, కుణపములను, ప్రాప, శతఘ్ని, పట్టిశ అను ఆయుధముల విడిచెను.

అసమాన పరాక్రముడగు దైత్యుడు పరీ, ముసలము, చెట్లు, పర్వతములు దీనిని పడవేసిననూ ఆ గద వానివి నిర్వీర్యము చేసెను. తరువాత అది కల్పాంత కాలమున సూర్యునివలెనే దైత్యుని ఎదపై పడెను. అపుడు ఎద పగిలి ఆ రైత్యుడు రక్తమును కక్కుచూ రథముపై నుండి స్పృహకోల్పోయి కిందపడెను.  జంభుడట్లు పడుటను చూచి కుజంభుడు ఘోరమగు విశ్చయముతో ధనాధిపుడగు కుబేరుని పట్ల కోపముతో దిక్కులను పూరించుచూ నినదించెను. పక్షికి సంజరమున కట్టినట్లు బాణములతో వలన విర్మించమ. బలవంతుడగు యక్షరాజు మాయాజాలము వలె పరమగు ఆ జలమును ఛేదించి మరికొన్ని బాణములమ జంభువిపై వేసెను. కోపించినవాడు మంచిమాటలను ఖండించునట్లు దైత్యుడా బాణములను అవలీలగా ఖండించేను. అవి అట్లు విష్ఫలమగుటమ చూచి కోపించిన కుబేరుడు, మారు గంటలతో ధ్వని, ఎదరించ వీలులేవి అమ ఆయుధముమ చేతబూనెను. దైత్యునికి ప్రయోగించబడిన ఆ శక్తి అతని ఎదమ చీర్చెను. ఆల్పబుద్దిగల పురుషుని సంసారమున సంభవించు దుఃఖముహృదయమున చీల్చునట్లు శక్తియగు ఆయుధము దైత్యుని దెబ్బతీపి భూతలమును చేరెను.

కాని ఆ దైత్యుడు ఒక క్షణములోనే నిలదొక్కుకొని దారుణరూపము దాల్చి పర్వతములను కూడా చీల్చగల పట్టిశమమ ఆయుధమును చేతబూనెను. దుర్జనుడు నర్మగర్భంగా, తీక్షంగా నున్న మాటతో హృదయమున దెబ్బతీయునట్లు ఆ దైత్యుడు పట్టిశములో కుబేరుని ఎదపై దెబ్బతీసెను. ఆ దెబ్బతో కుబేరుడు స్పృహతప్పి చెడుపలుకుతో మంచివాడు సొమ్మసిల్లినట్లు రథముపై కూలబడెను. అట్టి కుబేరుని చూచి చనిపోయెనని తలిచి రాక్షసుడు విర్ఋతి విశాచర బలము వెంటరాగా, ఆమిత పరాక్రమవంతుడగు కుంభుని వెంటబడెను. అపుడా విర్ఋతువి చూచి కుజంభుడు తన దైత్యసేనను అతనిపైకి ప్రేరేపించెను. దానవసేనను ప్రవేశించి నిర్ఋతుడు ఏమగు పద్మసరములోకి ప్రవేశించి దానిని కల్లోలపరిచినట్లుగా దావనమ అనేకరీతుల కల్లోలపరిను. తన శ్రేష్ఠమగు ఖడ్గములో కొందరు దైత్యులను నరికివేసెను, మరికొందరిని దెబ్బతిసెను.

ఈ విధంగా నిర్ఋతుడు నెత్తురోడు ముఖాలు గల దైత్యులతో భూమిని నింపెవేసెమ. అటు పిమ్మట కుజంభుడు తన పేన నిశ్శేషమవబోవుటను చూచి కుబేరుని విడిచి విర్ఋతిని ఎదుర్కొనెను. ఇంతలో జంభుడు కూడా ప్పుహనొంది ధవాధ్యక్షుడైన కుబేరుని అనుచరులను ప్రాణముతో పట్టుకొని, పాశములతో బంధించెను. విలువైన రత్నములను, పద్మము మొదలగు విధులమ, వాహనములమ, దివ్య విమానములను గ్రహించెను. కుబేరుడు స్పృహవోంది ఆ స్థితిని చూచి దీర్ఘముగా వేడివిట్టూర్పులు విడిచి,కోపముతో ఎరుపెక్కిన కమ్నలతో విలువకు బాణమునెక్కుబెట్టి దివ్యమగు గారుడాస్త్రమును ధ్యానించెను. శతృవులను చీల్చివేయు ఆ బాణముమ తరువాత కుబేరుడు దావవ సైన్యముపై విడిచెను. అతని బాణము మొదట నిప్పులతో కూడినట్లు కనిపించినది. అపుడు ఆ ధనస్సు మండి కోట్లకొలదిగా మిణుగురులు పై కెగిసినవి. అంతట ఆ అస్త్రము ఆకాశమున అగ్నిబాలలతో నిండినట్లు చేసెను. భీకరపరాక్రమము గల జంభుడా అస్త్రమున చూచీ తటాలువ సంవర్తమము అప్రముమ విడవగా ఆ గారుడాస్త్రము నెమ్మదించేను. అటు పిమ్మట కోపముతో ఒడలు మరిచిన దానవుడు కుబేరుని చూచి పాదచారియై ఆతనిని దెబ్బతీయుటకు వేగముగా ఎదుర్కొనెను. అరుచుచూ తన పైకి వచ్చిపడుతున్న దైత్యుని చూచి కుబేరుడు ఏమీ తోచనివాడై పారిపోదలిచెను.

పారిపోవుచున్న కుబేరుని రత్నములచే అలంకరింపబడిన కిరీటము ఆకాశము నుండి జ్వలించుచున్న సూర్యబింబము పడినట్లు జ్వలిస్తూ క్రిందపడేను. అంతట కులీనులైన యక్షులు యుద్ధమున చెదిరిపోయిరి. ఆ భూషణము కొరకు యుద్ధభూమిక మరణించుటే యుక్తము అని నిశ్చయించుకొని యక్షులు వేగముగా అనేక శస్త్రాస్త్రములను చేతబూని యుద్ధమును చేయగోరుచూఆ కిరీటము చుట్టూ విలిచిరి. వారందరూ అభిమానమే ధనముగా కలవారు, వీరులు, కుబేరుని అనుచరులు. వారిని చూచిన అతిపౌరుషవంతుడగు దానవుడు కోపగించి పర్వతమువలె బరువుగా మన్నది, భీకరమగు భుశుండియను ఆయుధమును చేతబూనెను. ఆ ఆయుధము కిరీటమును రక్షించుచున్న యక్షులనందరినీ సంహరించినది. ఆట్లు వారిని వధించి దానవుడు ఆ కిరీటమును తన రథమున నిలుపుకొని యుద్ధమున కుబేరుని జయించిన ఆనందముతో నివసించేను. ధవవిధులను గ్రహించి ఆ దానవుడు తన సైన్యముతో కూడి గొప్పవాదమును చేసి దేవతలనందరినీ పారద్రోలెను. ఇక కుబేరుడు తన ధనమును కోల్పోయి, తలవెండ్రుకలు చెదిరిపోగా, పాదచారియై భయము నొంది దీనుని వలెనిలిచియుండెను. అంతట చంద్రుడు కుజంభుని ఎదుర్కొనెను. అపుడు రాక్షసరాజు అమోఘమగు మాయనాశ్రయించెను.

 ఆ దైత్యేంద్రుడు జగత్తు విండా చీకటివి వింపుచూ మోహింపసాగెను. అంత దావవుల బలములు కూడా చూడలేక అడుగు తీసి అడుగు వేయలేకపోయిరి. అపుడు చీకటిలో మునిగిన ఆ దానవుల గొప్పసేవను నిర్ఋతుడుఅనేక విధములఆప్రములను కురిపించి దెబ్బతీసెను. దైత్యులట్లు దెబ్బతినుచుండగా కుజంభుడు స్తబ్దుడై విలవగా దానవేంద్రుడగు మహిషుడు కల్పాంతకాలమున మేఘము వలె మండి ఉల్కల సమూహముతో వెలుగుచున్న పాత్రాస్త్రముమ ప్రయోగించను. ప్రతాపవంతమగు ఆసావిత్రాస్త్రము విజృంభించుచుండగా ఘోరమైన చీకటి చెదిరిపోయెను. అంతట ఆ అస్త్రము యొక్క మీణుగురుల నుండి తెల్లని ప్రకాశమేర్పడినది. శరత్తులో వికసించిన పద్మముల గుంపులోమన్న స్వచ్ఛమైన పరప్పవలె ఆ ప్రకాశముండెను. ఇక, చీకటి శమించగా దైత్యశ్రేష్ఠులు చూపును పొంది క్రూరమగు చీకటిలో దేవతల సైన్యమువకు ఒక మహాద్భుతమును కలిగించిరి. కుజంభుడు వెంటనే ఘోరమైన ధనస్సును, సర్పవిషమువంటి బాణమును తీసుకొని రాక్షసుల, దేవతల సైన్యమువైపు పరుగెత్తాను. పాదచారియగు రాక్షసరాజు తన వైపు వచ్చుచున్న ఆ దైత్యుని చూచి యుగాంతమున పిడుగుల వలె ద్వనించు పదునైన బాణములతో వానిని కొట్టెను.

ఆ రాక్షసరాజు బాణమును గ్రహించుట, ఎక్కుపెట్టుట, వదులుట అనునదేదీ తెలియలేదు. అట్లు అమిత కౌశలముతో అతను దానవుని బాణములను తన బాణ పరంపరతో భేదించెను. దైత్యుడు తన పదునైన బాణముతో అతని విల్లును విరుగగొట్టెను. రథము వద్దనుండి సారథిని కూడా తొలగించెను. మృత్యుతుల్యమైన బాణముతో ఎదపై కొట్టిన. అపుడు రాక్షసేంద్రుని చేత పీడింపబడిన దైత్యేంద్రుడు భూమి కంపించగా పర్వతము కంపించినట్లు కంపించెను. ఒక క్షణములోనే తెప్పరిల్లి యుద్ధమున అతడు జయింప శక్యముకానివాడని తలచి పాదచారుడై రాక్షసరాజు రథమును చేరి ఎడమచేతితో విర్ఋతువి జుట్టుపట్టి మోకాలునతనిపై మంచి కత్తితో తలనరకవలెనని అనుకొనెను. ఆంతలో దేవతలలో గొప్ప కలకలము ఏర్పడినది. యుద్దమున కుబింభువి పాలబడిన నిర్ఋతిని చూచి ఆందరూ కలవరపడిరి. ఇంతలో పాశమును ధరించిన వరుణుడు పాశములు ధరించిన వారు తననంటిరాగా దానవేంద్రుని భుజములను రెంటిని బంధించెను. పౌరుషము విఫలమై, భుజములు కట్టబడియున్న దైత్యేంద్రుని వరుణుడు దయను విడిచి గదతో కొట్టనారంభించెను.

అతనా దెబ్బవలన గాయమునుండి రక్తముస్రవించుచుండగా మెరుపు తీగలతో కూడివున్న కాలమేఘము వలె నుండెను. ఆ స్థితిలో మన్న కుజంభువి చూచి మహిషాసురుడు నోరుతెరచి ఆ దేవతలనిద్దరినీ మింగివేయదలిచెను. పదునైన కోరలలో పరమైన ముఖము గల మహిషాసురుడు విరఋతివి, వరుణుని తివేయదలిచినపుడు వారాదైత్యుని క్రూరకర్మను తెలుసుకొని భయపడి రథమును విడిచి తొందరగా పాదచారులై పారిపోసాగిరి. మహిషాసురుని మండి భయమునొంది వారు ఇంద్రుని శరణుజొచ్చిరి. ఇక కోపించిన మహిషుడు వరుణుని ఎదుర్కొవేమ. ఆతమ మృత్యుముఖమును సమీపించుటను చూచి చంద్రుడు మంచుగడవలే వ్యాపించు శస్తముమ, వాయవ్యాస్త్రమును సృజించెను. ప్రచండవాయువుచేత, చల్లని మంచుచేత, చంద్రుని చేత ప్రేరేపింపబడిన మంచుతుపామల వలన అపుర సైన్యము యొక్క శరీరాలు పూర్తిగా దహింపబడిను. శైత్యము తమ పౌరుషముమ కమ్మివేయగా దానవులందరూ వ్యథవొందిరి. కదులుటకు గానీ, శస్త్రాలమ గ్రహించుటకు గానీ వారు శక్తులు కారైరి. త్యము చేత మహిషుడు తల ఆదరుచుండగా ప్రయత్నము లేనివాడాయేను.

చేతులతో భుజముల కప్పుకొని తలదించుకొని నిలుచుండెను. దైత్యులందరూ ప్రతీకారము చేయలేనివారై చంద్రుని చేత జయింపబడిరి. వారు తమ జీవితమున కోరుచు, యుద్ధము చేయవలెనన్న కోరికన వదిలి నిలుచుండిరి. అపుడుడు కోపముతో మండిపోవుచున్న కాలవేమి రైత్యులమ చూచి ఇట్లనెను. 'దైత్యులారా! అలంకరించుకొని వున్న మీరు, అన్ని ప్రాస్తములను చక్కగా తెలిసినారు, క్రూరులు. మీరొక్కక్కరు జగత్తునంతా భుజములపై మోసి బరువు చూడగలవారు. చరాచర జగత్తును పూర్తిగా మింగివేయుటకు మీరొక్కొక్కరూ సమర్థులు. దేవతలంతా కలిసిననూ మీలో ఒక్కరికి సరితూగరు. యుద్ధమున ఓడి, బెదిరిన కళ్ళలో నిలిచితిరేమి? శూరులకు అందునా దైత్యజన్మనొందిన వారికిది తగదు. రాజైన తారకునికి ముఖమెట్లు చూపగలరు? రణమునుండి విరమించుకొనిన వారిని తారకుడు కోపించి ప్రాణములు తీయగలడు. అని పలికిననూ మహాపురులు బదులు పలుకకుండిరి. శైత్యముచేత వినికిడిని కోల్పోయి, మాటలు తొట్రుపడగా వారు మూగవారిగా నిలిచి ఆ గొప్పయుద్ధమున మృతులతో వములైరి.

చలిచేత పీడింపబడి, దిక్కుతోచనివారివలె నున్న ఆ దైత్యులను చూచి మహాసురుడగు కాలనేమి ఆ కాలమునకు తగిన పవివి గూర్చి ఆలోచించేను. వెంటనే అతడు మానవమాయనాశ్రయించి తన శరీరమును విస్తరింపజేపి ఆకాశమును, అన్ని దిక్కులను నిండిపోయెను ఆ దానవేంద్రుడు తన శరీరమున అసంఖ్యాకముగా సూర్యులను నిర్మించెను. అపుడా అగ్ని జ్వాలలచే అన్ని దిక్కులన విలపివేపెమ. ఒక్క క్షణములోనే ముల్లోకములు జ్వాలలచే విండి కల్లోలపడినట్టాయేను. ఆ జ్వాలల సమూహముచే చంద్రుడు వెంటనే కనబడకపోయేమ. మేఘములు విడిపోయెను. దానవుల సైన్యము కాలనేమి మాయచేత మరల ప్రకాశించపాగిమ. ఆ సైన్యము మరల చైతన్యముమ పొందుట చూచి సూర్యుడు కోపముతో కళ్ళు ఎబడగా ఆరుణునితో ఇట్లనెను. కాలవేమిరథమున్న చోటికి రథమును గొని పొమ్ము. అక్కడి సూరమైన యుద్ధములో ప్రాణినాశనము జరుగనున్నది. ఎవరి బలమునాశ్రయించి మనముంటామో అట్టి చంద్రుడే జయింపబడివాడు.

 అని సూర్యుడనగా అరుణుడు రథముమ దైత్యుని వైపు నడపసాగెను. రథమున నిలిచియున్నమా తెల్లని చామరములను ధరించు అశ్వముల చేత జగత్తును ప్రకాశింప జేయునట్లు సూర్యదేవుడుండెను. అర్జునా! సూర్యుడు విశాలమైన విల్లుని తీసుకొనెను. అంతట విషము వలె మెరియు బాణముల ప్రవాహము వెంటనే ఏర్పడెను. బాణమునొకదానివి శంబరాస్త్రముతో పంధానించి విడిచెను. మరియొక దానిని ఇంద్రజాలముతో కలిపి వదిలెను. శంబరాస్త్రము అందరి రూపమున ఒకక్షణములో మార్చివేసెను. అందుచే దేవతలకు దాపుల రూపము, దానవులకు దేవతల రూపమేర్పడెను. అపుడు ప్రళయకాలమున యముని వలే కోపించిన కాలనేమి దేవతలనుకొని తనవారైన దానవులనే భయంకర ఆఫ్రికాలముచే వధించేను. మరికొందరిని పదునైన ఖడ్గము, కొందరిని నారాచములను వర్షింపజేయుచూ, కొందరిని గదలచే, పరిసలచే, రమగు పరశ్వథములచే దెబ్బతీసేను. రథముసైమండి కొందరి తలలను, కొందరి భుజములమ, మంచి వేగము గల పారథులను పడవేసెమ. కొందరివి రథవేగముచేత మగ్గుచేసెను. కొందరివి బలమైన ముహూతములలో దెబ్బతీసెను.

ఇది శ్రీ స్కాందపురాణమున మొదటి మాహేశ్వరఖండమున కౌమారికాఖండమున తారకసైన్య-దేవసైన్యముల మధ్య యుద్ధము యొక్క వర్ణనము అను పద్దెనిమిదవ అధ్యాయము.