నారద ఉవాచ- నారదుడిట్లనెను –
సమస్త ధర్మములు, సమస్త జ్ఞానములు తెలిసిన ఓ నారాయణా! బ్రహ్మాండముల నన్నిటిని మోహింపచేయు దుర్గాకవచమును నాకు చెప్పుమని అడిగెను.
నారాయణ ఉవాచ- నారాయణుడిట్లు పలికెను –
ఓ వత్స! సుదుర్లభమైన దుర్గాకవచమును నీకు చెప్పుదును. దీనిని పూర్వము శ్రీకృష్ణపరమాత్మ దయతో బ్రహ్మదేవునకు చెప్పెను. బ్రహ్మదేవుడు దీనిని గంగానదీ తీరమున ధర్మునకుపదేశించెను. ధర్ముడు దీనీనీ పుష్కర క్షేత్రమున నాకుపదేశించెను.
త్రిపురారియగు శంకరుడు ఈ కవచమును ధరించి త్రిపురాసురుల సంహరించెను. బ్రహ్మదేవుడి కవచమును ధరించి మధుకైటభుల భయమును తొలగించుకొనెను. భద్రకాళి ఈ కవచమును ధరించి రక్తబీజులను రాక్షసులను సంహరించెను. దేవేంద్రుడు దీవిని ధరించి రాజ్యలక్ష్మిని తీరిగి పొందెను. మహాకాళుడు దీనివలననే చిరంజీవియయ్యెను. అట్లే సందీశ్వరుడు దీనిని ధరించి మహాజ్ఞాని యయ్యెను. శ్రీరామచంద్రుడుకూడ దీనిని ధరించి మహాజ్ఞానియయ్యెను. మహాజ్ఞానియగు దుర్వాసమహర్షి ఈ కవచమును ధరించినందువలననే శిపునితో సమానుడయ్యెను అని నారాయణుడనెమ.
ఓం దుర్గా దేవ్యై స్వాహా అను షడక్షర మంత్రము నా శిరస్సును రక్షింపనిమ్ము. ఈ మంత్రము భక్తులకు కల్పవృక్షము పంటిది. ఈ మంత్రముయొక్క వివరణకాని, దీనిని గ్రహించిన వారి గురించిగాని వేదములలో ఎచ్చట కన్పింపదు. ఈ మంత్రమును గురుముఖతః పొందినంతమాత్రమున అతడు శివునితో సమానుడగుచున్నాడు.
"ఓం దుర్గాయైనమః" అనుమంత్రము నా ముఖమునెల్లప్పుడు రక్షించుగాక, “ఓం దుర్గిరక్షయ" అనుమంత్రము నా కంఠమును, "ఓం హ్రీం శ్రీం దుర్గాయై నమః" అను మంత్రము నా కంఠమును "ఓం హ్రీం క్లీం దుర్గాయై నమః" అను మంత్రము నా వృష్ఠభాగమును, "హ్రీం" అనునది నా వక్షః స్థలమును 'శ్రీం' అనునది నా చేతిని, "ఓం శ్రీం హ్రీం క్లీం" అనునది నా సర్వాంగములను స్వప్నమున, జాగ్రదవస్థలోను, ఎల్లప్పుడు రక్షించుగాక. దుర్గాదేవి నా తూర్పు దిక్కును, చండిక నా ఆగ్నేయభాగమును, భద్రకాళి నా దక్షిణ భాగమును, మహేశ్వరి నా నైఋతి భాగమును, వారాహి నా పశ్చిమ భాగమును, సర్వమంగళ నా వాయవ్య భాగమును, వైష్ణవి ఉత్తర భాగమును, శివప్రియ నా ఈశాన్యభాగమును, జగదంబిక నన్ను బలమున, స్థలమున, అంతరిక్షమున ఎల్లప్పుడు రక్షించుగాక.
ఓనారదా! ఇది సుదుర్లభమైన దుర్గాదేవి కవచము.
నారదా! ఈ కవచమును అందరకు తెలుపరాదు. కావున కవచమును పొందవలెనని అనుకోమవాడు గురువును శాస్త్రప్రకారముగా పూజించి అతనికి అలంకారములు, చందనాదికముల నిచ్చి సమ్మానింపవలెను. ఇట్లు గురువుచే అనుగ్రహింపబడి దుర్గాకవచమును ధరించినచో అతడు విష్ణుతుల్యుడగును.
సమస్త పుణ్యతీర్థములన్నీ తిరిగివచో, భూ ప్రదక్షిణము చేసినచో కలుగు ఫలితము ఈ దుర్గాదేవి కవచమును ధరించినచో కలుగును. ఈ కవచమును ఐదు లక్షలమార్లు జపించినచో కవచము సిద్ధించును. సిద్ధ కవచుడైనవానిని ఎట్టి అస్త్రము బాధింపదు. అతడు నీటిలో పడినను, నిప్పులో బడినను కవచప్రభావము వలన మరణము సంభవింపదు. అతడు జీవన్ముక్తుడగును. సర్వసిద్ధేశ్వరుడుకూడ అగును. దుర్గా కవచము సిద్ధించిన మానవుడు విష్ణుమూర్తితో సమానుడగును.
నారదా! నీకు అమృత ఖండము కన్నను శ్రేష్ఠమైన ప్రకృతి ఖండమునింతవరకు చెప్పితినని నారాయణుడు పల్కెను.
నారదా! దుర్గాదేవియే మూలప్రకృతి. గణపతి ఆ దేవియొక్క పుత్రుడు. దుర్గాదేవి శ్రీకృష్ణవ్రతమునాచరించి గణపతిని పుత్రునిగా పొందెను. శ్రీకృష్ణపరమాత్మయే తన అంశముచే గణపతిగా జన్మనెత్తెను.
సుశ్రావ్యము, అమృతమువంటి ఈ ప్రకృతి ఖండమును బ్రాహ్మణుని వలన విన్న తరువాత ఆ బ్రాహ్మణునకు మృష్టాన్న భోజనముపెట్టి బంగారమును దక్షిణగా ఇవ్వవలెను. అట్లే దూడతోనున్న ఆవును వస్త్రములను, అలంకారములను, పుష్పమాలలను దీనిని చదివిన బ్రాహ్మణునకు భక్తి పూర్వకముగా దానము చేయవలెను.
గ్రంథమును కూడ పుష్పాదులచే భక్తిశ్రద్దలతో పూజింపవలెను. ఈవిధముగా ఈ ఖండమును వినినచో శ్రీ మహావిష్ణువు సంతోషించును. అతనికి పుత్ర పౌత్రాది భాగ్యములనిచ్చును. శ్రీకృష్ణ భక్తుడై గోలోకమునకు పోవునవి నారాయణుడు నారదమునికి చెప్పెను.
శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతఖండమున నారదనారాయణుల సంవాదమున చెప్పబడిన దుర్గాదేవియొక్క ఉపాఖ్యానమున బ్రహ్మాండమోహన కవచమను అరవై ఏడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 67 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
Culminating the grand narrative of the sixty-seven chapters, Śrī Sūta Gosvāmī offers his final blessings and prostrate obeisances to the Supreme Divine Mother Parā Prakṛti and Lord Śrī Kṛshṇa before the assembled sages at Naimishāraṇya. He glorifies the immortal nectar of the Prakṛti Khaṇḍa, which fills the hearts of listeners with divine ecstasy, purifies the atmosphere of the entire world, and establishes the supreme harmony of energy and the energetic source. With this grand conclusion, the second section of the Brahma Vaivarta Purāṇa comes to a glorious close, preparing the hearts of devotees to enter the next sacred portal of the Gaṇesha Khaṇḍa.