వారదఉవాచ- నారదమహర్షి ఇట్లనెమ-
ప్రభూ! వీదయవలన అపూర్వమైన విషయమును తెలపికొంటిని. ఇప్పుడు ప్రకృతి దేవతలకు సంబంధించిన వివరణను తెల్పగలవు. ఏదేవి పూజనెవరు చేపిరి? భూమిపై ఆమె ధ్యానాదికము నెవరు తెల్సి? ఆదేవియొక్క కవచము, స్తోత్రము, ధ్యానము, ప్రభావము, చరిత్ర ఎట్టివి? ఆ దేవతలు ఎవరికి వరములిచ్చిరి? మున్నగు విషయములనన్నిటిని వివరముగా నాకు తెలుపగలరు.
నారాయణ ఉవాచ- నారాయణుడిట్లు పలికెను-
ప్రకృతి సృష్టి సమయమున గణపతీ తల్లియైన దుర్గగా, రాధగా, లక్ష్మీదేవిగా, సరస్వతీదేవిగా, సావిత్రిగా ఐదువిధములు గా నగుచున్నది. వారియొక్క పూజ ప్రసిద్ధమైనది. వారి ప్రభావము చాల ఆశ్చర్యకరమైనది. వారి చరిత్ర సర్వమంగళములకు కారణమైనది. ఆది అమృతము. వంటిది. ఆ ప్రకృతియొక్క ఆంశలు, ఆరశాంశలు వారియొక్క శుభ చరిత్రము సర్వము నీకు తెలుపుదును.
సరస్వతీ, భూమి, గంగా, షష్ఠిదేవి, మంగళచండిక, తులసి మానసీదేవి, నిద్రాదేవి, స్వధా, స్వాహా, దక్షిణ, వీరందరు తేజస్సులో రూపములో గుణమున సాతో సమానమైవారు. వీరి చరిత్రను సంక్షేపముగా, నీకు తెల్పుదును. అట్లే సుందరమైన జీవకర్మవిపాకమును నీకు తెల్పుదును.
దుర్గాదేవి, రాధాదేవుల చరిత్ర చాల విస్తరమైనది, అందువలన వీటిని తరువాత చెప్పెదను. మిగిలిన వాటిని క్రమముగా, సంక్షేపముగా చెప్పెదను, వినుము.
సరస్వతీ దేవి పూజ శ్రీకృష్ణునితో రచింపబడినది. ఆమె యొక్క అనుగ్రహమువలన మూర్ఖుడు కూడ పండితుడగుచున్నాడు. శ్రీకృష్ణుని భార్యయగు ప్రకృతి ముఖమునుండి పుట్టిన సరస్వతీదేవి కాముకియై శ్రీకృష్ణుని కామించెను. కాని సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు ఆమె మనోభావమును గుర్తించి పరిణామకాలమున సుఖమును కల్గించు హితవును ఆమెకు చెప్పెను.
శ్రీకృష్ణ ఉవాచ- శ్రీకృష్ణుడిట్లనెను-
ఓ సాధ్వి. నీవు నాఅంశరూపుడు, చతుర్భుజుడు, యువకుడు, సుందరుడు, సమస్త సద్గుణయుక్తుడు, నాతో సమానమైనవాడు, కామీనుల కామము తీర్చువాడు, కోటి మన్మథుల లావణ్యము కలవాడగు నారాయణుని సేవించుము.
ఓ కాంతా! నన్ను ప్రియునిగా చేసికొని ఇక్కడ ఉండవలెనని కోరుకొనుచున్నావు. కానీ రాధాదేవి నీకంటే గొప్పది. అందువలన మీకిచట మంచి జరుగదు. తాను బలవంతుడైనచో ఇతరులను రక్షింపగలడు, కొని తానే బలహీనుడైనచో ఇతరులనేవిధముగా రక్షింపగలడు?
నేను సర్వేశుడను. ఆందరను శాసించగలవాడను, ఐనను రాధను వ్యతిరేకించలేను. ఎందువలన ఆంటే ఆరాధ తేజస్సున, రూపమున, గుణమున నాతో సమానమైనది. అట్లే ఆమె నా ప్రాణములకు అధిష్టాన దేవత. ఎవరు కూడ తమ ప్రాణములను వదులుకోరు కదా! అందువలన నేను రాధను దూరము చేసికొనలేను.
నీవు వైకుంఠమునకు వెళ్ళినచో నీకు మేలు జరుగగలదు. నారాయణుని భర్తగా చేసికొని వీపు చాల కాలము సుఖముగా ఉండుము. లక్ష్మీదేవి లోభ, మోహ, కామ, కోప, హింసాది గుణములు లేనిది, తేజస్సులోను, గుణములోను, రూపములోను, నీతో సమానమైనది. ఆమెతో కలసి సుఖముగా కొలమును గడపగలపు. నీభర్తయగు నారాయణుడు కూడ మీఇద్దరిపై సమానమైన గౌరవమును చూపించును.
ఓ సరస్వతీ! ప్రతీ విశ్వమున వీ పూజను మాఘశుద్ధ పంచమినాడు విద్యారంభము చేయు సమయమున, మానవులు, దేవతలు, మునీంద్రులు, యోగులు, సిద్ధులు, వాగులు, గంధర్వులు, యక్షులు మొదలైన వారందరు భక్తితో కొణ్వశాఖయండు చెప్పబడినట్లు షోడశోపచారములను చేయుదురు.
జితేంద్రియులు, యమనీయమవంతులైన వారు పుస్తకమునందో, కలశమునందో నిన్నావాహన చేసి ధ్యానము, స్తోత్రము మొదలైన వాటితో నిన్ను పూజింతురు. నీ కవచమును పత్రముపై లిఖించి గంధము. చందనములతో ఆలకంరించీ బంగారు భరిణలో ఉంచి కంఠమున లేక కుడి భుజమున (తాయత్తుగా) ధరింతురు. విద్వాంసులు పూజోకాలమున నీ ధ్యానస్తోత్రములను, కవచమును పఠింతురు.
ఈవిధముగా పలికి సర్వపూజితుడైన శ్రీకృష్ణుడు ఆ సరస్వతీ దేవిని పూజించెను.
శ్రీకృష్ణుడు పూజించిన తరువాత ఆ ఆసరస్వతీ దేవిని బ్రహ్మవిష్ణు మహేశ్వరులు, ధర్ముడు, సనకాది మునీంద్రులు, ఇతర దేవతలందరు . రాజులు, మానవులు మొదలగువారందరు పూజించిరి. అందువలన ఆ దేవి ఆందరిచే ఎల్లప్పుడు పూజలందుకొనుచున్నది.
నారద ఉవాచ- నారదుడిట్లు పలికెను-
వేదములన్నియు తెలిసినవారిలో శ్రేష్ఠుడవైన శ్రీమన్నారాయణా! సరస్వతీ దేవి యొక్క పూజా విధానమును, ధ్యాన, స్తోత్రములను, కవచమును, పూజకు కావలసిన నైవేద్యమును, పుష్ప, చందనాదికముల నన్నిటినీ వివరముగా తెలుసుకొనవలెనని ఆనుకొనుచు న్నాను.
నారాయణ ఉవాచ- నారాయణుడు ఇట్లనెను-
నారద! కాణ్వ శాఖోక్త పద్ధతిలో నున్న సరస్వతీదేవి పూజా పద్ధతిని తెల్పుచున్నాను.
మాఘమాసముయొక్క శుద్ధ పంచమినాడైనను, విద్యారంభము చేయు దినమునందైనా ఉదయము నియమముతో స్నానము చేసి పరిశుద్ధుడు కావలెను. తరువాత నిత్యపూజాది కార్యక్రమములన్నీ చేసికొని భక్తితో కలశ స్థాపన చేయవలెను. ఆ తరువాత గణపతి, సూర్యుడు, అగ్ని, విష్ణువు, శివుడు, దుర్గ అను ఆరుగురు దేవతలను పూజించి నైవేద్యాదులను సమర్పించుకొనవలెను. అటుపిమ్మట ఇష్టదేవతను కూడ పూజించవలెను. ఆ తరువాత కలశమున సరస్వతీ దేవతనావాహనము చేసి ముందు చెప్పబోవు పద్ధతిలో ఆ దేవిని ధ్యానించి షోడశోపచారపూజలతో ఆరాధించి నైవేద్యమును పెట్టవలెను.
సరస్వతీ దేవి పూబియందు ఉపయోగించవలసిన నైవేద్యమును గురించి వేదమున ఈవిధముగా చెప్పబడినది.
వెన్న, పెరుగు, పాలు, పేలాలు, నూవుండలు, చెరుకు, చెరుకురసము, తెల్లనీబెల్లము, స్వస్తికము (ఒకవిధమైన వంటకము) చక్కర, నూకలేమాత్రము లేనీ తెల్లబియ్యపన్నము, ఉడికించని తెల్లబియ్యపుటటుకులు, తెల్లని లడ్డులు, వేయి, సైంధవలవణములు కల వ్యంజనములతో సిద్ధము చేయబడిన వంటకము, నేయి కలిపిన యవలు, గోధుమలయొక్క పిండి, స్వస్తికము యొక్క పిండి, నేయితోనున్న పరమాన్నము, తియ్యని అన్నము, టెంకాయ, టెంకాయ నీళ్ళు, కేసరము, అరటిపండ్లు, నేరేడుపండ్లు, రేగుపండ్లు మొదలైనవి నైవేద్యముగా పెట్టవలెను.
సువాసనగల తెల్లని పువ్వులు, మంచివాసనగల తెల్లనీ చందనము, కొత్త తెల్లబట్ట, శంఖము, తెల్ల పువ్వుల మాల, ముత్యాల హారములు ఆ దేవీపూజలో ఉపయోగింపతగు వసప్తువులు.
వేదములలో చెప్పబడిన ధ్యానపద్ధతిని చక్కగా వినుము.
సరస్వతీదేవి తెల్లని వర్ణము కలది. చిరునవ్వుతో అందముగానుండును. కోటి చంద్రుల కాంతి గల శరీరముగలది.
బంగారు వన్నెగల వస్త్రమును, మంచిరత్నములున్న భూషణములను ధరించును. బ్రహ్మవిష్ణు శివాది దేవతలతో పూజలనందుకొనుచున్నది. మహర్షులు, నరులు మొదలైన వారితో నమస్కారముల నందుకొనుచున్నది.
ఇట్టి రూపముతో నున్న సరస్వతీ దేవిని నమస్కరించి మూలమంత్రమును. జపించుచు కవచమును ధరించి సాష్టాంగ నమస్కారమును చేయవలెను.
విద్యారంభకాలమున, మాఘ శుద్ధ పంచమినాడు ఇష్టదేవతయగు నీమెను ఎవరు పూజింతురో వారికి ప్రతిదినము శుభములే కలుగుచుండును.
లక్ష్మీ బీజమైన “శ్రీం” మాయాదేవి బీజాక్షరమైన “హీం” ముందు కల “శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా" అను వైదికమైన అక్షరమంత్రము చాలా శ్రేష్ఠమైనది. ఈమూల మంత్రము ఆందరకు ఉపయోగించునది. కల్పవృక్షము వంటిది.
ఈ మూలమంత్రమును దయగల నారాయణుడు వాల్మీకికి ఈ భారతమున -గంగాతీరమున ఉపదేశించెను. భృగువు పుష్కర క్షేత్రమున సూర్యగ్రహణ సమయమున శుక్రునకు ఉపదేశింపగా, మారీచ మహర్షి ఆదే పుష్కర క్షేత్రమున చంద్రగ్రహణ సమయమున బృహస్పతికి ఉపదేశము చేసెను. బ్రహ్మదేవుడీ మంత్రమును బదరికాశ్రమమున భృగుమహర్షికి ఉపదేశించెను. జరత్కారు మహర్షి తన పుత్రడుగు ఆస్తీక మహర్షికి క్షీరసముద్ర సమీపమున దీనిని ఉపదేశించెను. అట్లే విభాండకమహర్షి మేరు పర్వతమున తన పుత్రుడగు ఋష్యశృంగునకు ఉపదేశము చేయగా శివుడు కాణాదమహర్షికి గౌతమ మునీకి ఈ మంత్రమును ఉపదేశించెను. అదేవిధముగా సూర్యుడు యాజ్ఞవల్క్య మహర్షికి కాత్యాయనునకు ఉపదేశించెను. శేషుడు పాణిని మహర్షిక, భారద్వాజ మహర్షికి, శాకటాయనునకు, పాతాళమున ఈ మంత్రోపదేశము చేసెను.
ఈమూలమంత్రమును నాలు లక్షలు జపించినచో మంత్రసిద్ధి కలుగును. ఈ మంత్ర సిద్ధినందిన వ్యక్తి బుద్ధిలో బృహస్పతితో సమానమైన వాడగును.
ప్రపంచమున సర్వశ్రేష్టమైనది. సమస్త జయముల కల్గించునది యగు సరస్వతీ కవచమును బ్రహ్మదేవుడు పూర్వమున గంధమాదన పర్వతమున భృగుమహర్షికి ఉపదేశించెను.
భృగురువాచ- భృగుమహర్షి ఇట్లు పలికెను-
బ్రహ్మజ్ఞాన వంతులలో శ్రేష్ఠమైనవాడు, గొప్పని బ్రహ్మ జ్ఞానము కలవాడు, సర్వజ్ఞుడు, సమస్తమునకు కారణమైనవాడు, సమస్త పూజ్యులచే పూజింపబడిన ఓ బ్రహ్మదేవుడా! విశ్వజయమునిచ్చు సరస్వతీ కవచమును తెల్పుము. ఈ కవచము సమస్త మంత్రసారమైనది, పరమశ్రేష్ఠమైనది.
బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లనెను-
వత్స! భృగుమహర్షీ! సమస్త కోరికలను తీర్చు సరస్వతీ కవచమును వినుము, ఇది.వేదసారమైనది. వేదములలో చెప్పబడినది. వేదముల చేత పూజింపబడినది. చెవులకింపైనది. దీనిని రాసేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ గోలోకమునందున్న బృందావనములో నాకు చెప్పెను. ఇదీ కల్పవృక్షమువలె అన్ని కోర్కెలను తీర్చును. ఎన్నడు వినని అద్భుతమంత్ర సమూహములతో కూడుకున్నది. పరమరహస్యమైనది.
ఈ కవచమును జపించి, ధరించి బృహస్పతి బుద్ధిమంతుడయ్యెను. శుక్రుడు సమస్త దైత్య దానవులకు గురువయ్యెను. వాల్మీకిముని కవిశ్రేష్ఠుడయ్యెను. స్వాయంభువ మనువు సర్వపూజ్యాడయ్యెను, కణాదుడు, గౌతముడు, కణ్వుడు, పాణిని, శాకటాయనుడు. కాత్యాయనుడు శాస్త్రముల రచించిరి. కృష్ణద్వైపాయనుడగు వ్యాసుడు వేదములను విభజించి సమస్త పురాణములు . రచించెను. శాతాతపుడు సంవర్తుడు, వసిష్ఠుడు, పరాశరుడు, యాజ్ఞవల్క్యుడు ధర్మగ్రంథములను రచించిరి. ఋష్యశృంగుడు, భరద్వాజమునీ ఆస్తీకమహర్షి, దేవలుడు, జైగీషవ్యుడు, జాబాలి మహర్షి అందరిచే గౌరవింపబడుచున్నారు.
ఈ సరస్వతీ కవచమునకు బ్రహ్మదేవుడు ఋషి బృహస్పతి ఛందస్సు. రాసేశ్వరుడైన శ్రీ కృష్ణపరమాత్మ దేవత. సర్వతత్వముల తెలిసికొనుటలో, సమస్తకార్యముల సాధించుటలో సమస్త కవిత్వ సిద్ధిలో దీనికి విర్గియోగము కలదు.
ఓం హ్రీం సరస్వత్యై స్వాహా అనుమంత్రము నా శిరస్సునంతయు రక్షించుగాక “శ్రీవాగ్దేవతాయై స్వాహా" అనునది నా నొసటిని రక్షించుగాక.
“ఓం సరస్వత్యై స్వాహా" అనునది నా చెవులనెల్లప్పుడు రక్షించుగాక "ఓం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా" అనునది నా నాసిక సంతట రక్షించుగాక.
“హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహా" అను మంత్రము నా చెవులనెల్లప్పుడు రక్షించుగాక.
“ఐం" అను ఏకాక్షర మంత్రము నాకంఠమునెల్లప్పుడు రక్షించుగాక.
“ఓం శ్రీం హ్రీం" అనునది నామెడను. “శ్రీం" అనునది నాస్కంధముల రక్షించుగాక.
"శ్రీం విద్యాధిష్ఠాతృ దేవ్యై స్వాహా" అనునది నాపక్షమునీల్లప్పుడు రక్షించుగాక.
"ఓం హ్రీం విద్యాస్వరూపాయై స్వాహా" అనునది నానాభిని ఎల్లప్పుడు రక్షించుగాక.
"ఓం హ్రీం హ్రీం వాళ్యెస్వాహా" అనునది నా పృష్ఠమును - ఎల్లప్పుడు రక్షించుగాక.
"ఓం సర్వ వర్ణాత్మికాయై" అనునది నా పాదములనెల్లప్పుడు రక్షించుగాక.
“ఓం రాగాధిష్ఠాతృదేవ్యై" అను మంత్రము నా సమస్తావయవములను రక్షించుగాక.
“ఓం సర్వ కంఠవాసిన్యై స్వాహా" అనునది నా తూర్పుదిక్కును ఎల్లప్పుడు రక్షించుగాక.
"ఓం హీం జిహ్వాగ్రవాసిన్యై స్వాహా" అను మంత్రము నా ఆగ్నేయదిశను రక్షించుగాక.
“ఓం ఐం హ్రీం శ్రీం సరస్వత్యై బుధ జనన్యై స్వాహా" అను మంత్రరాజము నాకు దక్షిణ దిక్కును ఎల్లప్పుడు రక్షించుగాక.
"ఓం శ్రీం హ్రీం" అను మూడక్షరముల - మంత్రము నా నైఋతి దిక్కును రక్షించుగాక. "కవి జిహ్వాగ్ర వాసిన్యై స్వాహా" అను మంత్రము నా పశ్చిమ దిక్కును రక్షించుగాక.
“ఓం పదంబికాయై స్వాహా" అనునది నా వాయవ్య దిక్కును రక్షించుగాక.
"ఓం గద్య పద్యవాసిన్యై స్వాహా" అనునది నా ఉత్తర దిక్కును రక్షించుగాక.
"ఓం పర్వ శాస్త్ర వాసిన్యై స్వాహా" అనునది నాఈశాన్య దిక్కును రక్షించుగాక.
“ఓం సర్వ పూజితాయై స్వాహా" అను మంత్రము నా ఊరు దిక్కును రక్షించుగాక.
"ఓం హ్రీం పుస్తక వాసిన్యై స్వాహా అనుమంత్రము నాఆధో దిక్కును రక్షించుగాక.
“ఓo గ్రంథ బీజరూపాయై స్వాహా" అను మంత్రము నన్ను అన్ని వైపులనుండి రక్షించుగాక.
ఈవిధముగా సర్వమంత్ర సారమైన విశ్వజయమను ఈ సరస్వతీ కవచమును నీకు తెల్పితిని.
ఈ పరస్వతీదేవి కవచమును ధర్ముని నుండి గంధమాదన పర్వతమున ఉపదేశము పొందితిని. నీపైగల స్నేహమువలన నీకిది తెల్పితిని. దీనిని ఆనర్హుడైనవానికి చెప్పవద్దు.
ఈ కవచమంత్రమును ఉపదేశించు గురువును శాస్త్ర పద్ధతిగా వప్రాలంకార చందనములచే గౌరవించి సాష్టాంగనమస్కారము చేసి ఈ కవచమును పత్రమున వ్రాసి దానినొక భరిణలో నుంచుకొని దానిని తనకుడిచేతికైనను లేక మెడలోనైనను ధరించవలెను.
ఈకవచమును ఐదు లక్షల మార్లు జపించిననది సిద్ధి పొందును. ఆవిధముగా సిద్దిపొందినచో అతడు బృహస్పతి వంటి పొడగును, చక్కగా మాటాడగలుగును. కవీంద్రుడగును. ఈకవచము యొక్క ప్రభావమువలన అంతటా జయమును పొందును.
కాణ్వశాఖయందు చెప్పబడిన ఈ సరస్వతీ దేవి కవచమును, స్తోత్రమును, పూజావిధానమును, ధ్యానమును, వందనమును అన్నిటిని నీకు చెప్పితిని.
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున నారదనారాయణ సంవాదమున సరస్వతీ కవచమను నాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 4 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
In the celestial court of Vaikuṇṭha, a poignant narrative unfolded involving the three divine consorts of Lord Śrī Nārāyaṇa, namely Goddess Sarasvatī, Goddess Gaṅgā, and Goddess Lakshmī. As Lord Śrī Nārāyaṇa affectionately gazed toward Goddess Gaṅgā, Goddess Sarasvatī felt aggrieved by what She perceived as an improper imbalance of divine attention and expressed Her sorrowful grievance open-heartedly. While Goddess Lakshmī gently attempted to mediate and soothe the rising tension between Her divine sisters with calm and gentle words, Goddess Sarasvatī's spiritual indignation flared, leading to an intense verbal confrontation that set the stage for profound cosmic transformations.