నారాయణ ఉవాచ- నారాయణుడిట్లు నారదునితో పలికెను-
శంఖచూడుడు శివునకు నమస్కరించి తన అమాత్యులతో విమానమునెక్కెను. కాని వారందరు కుమారస్వామి వేసిన శక్తివలన చాలా బాధపడిరి. దేవతలప్పుడు సంతోషముతో పుష్పవృష్టిని గురీపించుచు దుందుభి ధ్వానమును చేసిరి. అప్పుడు స్కందుడు చేసిన యుద్ధము చాలా అద్భుతముగా నుండెను. దానవులకు ఆది ప్రాకృతికలయము వలె తోచినది.
అప్పుడు శంఖచూడుడు విమానమునెక్కి శరవర్షమును కురిపించెను. ఆ సమయమున మిక్కిలి చీకటి అలముకొను. నిప్పులు కూడ కురిసినవి. ఆ తనీ బాణయుద్ధమునకు భయపడి నందీశ్వరుడు మొదలగు దేవతలందరు పరుగెత్తుకొని పోయిరి. కేవలము కుమారస్వామి మాత్రము ఒంటరిగా యుద్ధమున నిలబడెను. శంఖచూడుడు పర్వతములు, సర్పములు, శిలలు, వృక్షములు వర్షముగా కురిపించెను. ఆ వర్షమున షణ్ముఖుడు కనిపించలేదు. అతని ధనుస్సు ఏరిగినది. రథము విరిగినది. రథాశ్వములు చనిపోయినవి. శంఖచూడుడు వేసిన సూర్య సన్నిభమైన శక్తివలన స్కందుడు కొంతకాలము మూర్ఛపోయెను.
షణ్ముఖుడు క్షణకాలములో తేరుకొని విష్ణుమూర్తీ ఇచ్చిన దివ్యధనుస్సును ధరించి రత్న విమానమునెక్కి శస్త్రాస్త్రముల ధరించి యుద్ధము చేయసాగెను, శంఖచూడుని రథమును సారథిని అశ్వములను భంగమొనర్చెను, ఆట్లే దివ్యమైన శక్తిని రాక్షసేంద్రునీ వక్షస్థలముపై వేయగా అతడు మూర్ఛచెందెను. కొద్దిక్షణములలో మరల శంఖచూడుడు చైతన్యమును పొంది ఇంకొక రథమును వేరొక ధనుస్సును స్వీకరించెను.
మాయలు చేయువారిలో మేటియగు శంఖచూడుడు యుద్ధమున తన బాణవర్షముచే కుమారస్వామిని కప్పివే సెను. ఆ తరువాత మిక్కిలి శక్తి గలిగిన శక్తిని చాలా వేగముగా కుమారస్వామిపై వేసెను. కార్తికేయుడు మహాబలసంపన్నుడైనను ఆ శక్తి తగులుటచే మూర్ఛనొందెను. మూర్ఛపడి యున్న కార్తికేయుని కాళికాదేవి తీసికొని మహాదేవుని సన్నిధికి చేరెను.
మూర్చపడియున్న కుమారస్వామిని శివుడు తన చూపుతోడనే బ్రతికించెను. పరమ శివుడాతనికి అనంతమైన బలమునిచ్చెను. తరువాత తన సైన్యమును యుద్ధము చేయుటకు పంపెను. ఆంత దేవతలకు శంఖచూడుని సైన్యములతో గొప్ప యుద్ధము జరిగినది.
దేవేంద్రుడు వృషపర్వునితోను, భాస్కరుడు విప్రచిత్తితోను, చంద్రుడు దంభునిలోను, కాలుడు కాళేశ్వరునితోను, అగ్ని గోకర్లుని తోడను, కుబేరుడు కాలకేయుని తోడను, విశ్వకర్మ మయునితోను, మృత్యువు భయంకరునితోడను, యముడు సంహారునీలోను, వరుణుడు కలవింకునితో, వాయువు చంచలునితో, బుధుడు ధృతపుష్టునితో, శని రక్తాక్షునిలో, జయంతుడు రత్నసారునితో, అష్టవసువులు వర్చోగణముతో, అశ్వినీకుమారులు దీప్తిమంతునితో, నలకూబరుడు ధూమ్రునితో, ధర్ముడు ధనుర్ధరునితో, కుజూడు మండూకాక్షునీతో, ఈశ్వరుడు శోభాకరునీలో, మన్మథుడు పిఠరునీలో, ద్వాదశాదిత్యులు ఉల్కాముఖాది రాక్షసులతో, ఏకాదశ రుద్రులు భయంకరులైన పదకొండుగురు రాక్షసులతో, నందీశ్వరాదులు ఇతర రాక్షస " గణముతో యుద్ధముచేసిరి. యుద్ధానంతరము వటవృక్షము క్రింద శంకరుడు మహాకాళితో, షణ్ముఖునితో కలిసి కూర్చుండెను. శంకరునీ సైనికులందరు యుద్ధమున ఓడిపోయినందువలన శంఖ చూడుడు తన దానవసమూహముతో రత్నసింహాసనమున కూర్చొనియుండెను.
శంఖచూడునితో జరిగిన యుద్ధమున దేవతలందరు ఓడిపోయి భయముతో పరుగెత్తిరి. దానిని చూచి కుమారస్వామి రాక్షసులపై కోపించి దేవతలకు అభయమునిచ్చెను.
కార్తికేయుడు తన సైన్యమునకు ఉత్సాహమును పెంచసాగను. అట్లే తానొక్కడే దానవులతో యుద్ధము చేయసాగెను. ఆతనీవలన రాక్షససైన్యమున నూరు అక్షౌహిణీల సైన్యము మృతిచెందెను.
అప్పుడు కాళికాదేవి కోపముతో నూరుపుజెలతో రాక్షసుల రక్తము తాగెను. అట్లే పదిలక్షల ఏమగులను సూరులక్షల గుఱ్ఱములను ఒకే చేత బట్టుకొని మ్రింగెను. వేలకొలదీ మొండెములు యుద్ధమున నేల రాలినవి.
స్కందుని యొక్క బాణములవలన దానవులు క్షతగాత్రులై భయపడి పరుగెత్తిరి. వృషపర్వది. దానవులు కార్తికేయువీతో క్రమముగా యుద్ధమొనరించిరి. రణరంగమున నున్న స్కందుని శివుడు రక్షించుచుండెను..
కాళికాదేవి రణరంగమునకు బయలు దేరగా నందీశ్వరాది వీరులు ఆమె వెంట నడిచిరి. రణరంగమును ప్రవేశింపగనే కాళీక సింహనాదమొనర్చివది. ఆ సింహవాదమునకు రాక్షసులందరు మూర్చిల్లి, సంతోషముతోనామె సురను సేవించి అట్టహాసమొనర్చినది. అట్లే రణరంగమున సంతోషమును పట్టలేక నాట్యమాడినది.
రణరంగమున వీరవిహారము చేయుచున్న కాలికను చూచి శంఖచూడుడు రణరంగమునకు వచ్చి భయపడి వరుడు తన సైన్యమునకు ధైర్యము చెప్పెను. కాళికాదేవి ఆగ్నేయాస్త్రము వేయగా శంఖచూడుడు వారుణాస్త్రముతో దానిని చల్లార్చాను. కాళికాదేవి వారుణాస్త్రమును సంధింపగా అతడు గాంధర్వాస్త్రముతో దోనీనుపశమీపడేసెను. కాళికాదేవి మాహ్విరాస్త్రమును ప్రయోగింపగా నారాయణాస్త్రముతో నతడు దానిని ఖండించెను. కాళికాదేవి నారాయణాస్త్రమును చేయగా శంఖచూడుడు వెంటనే రథమునుండి కిందికి దిగి సాష్టాంగ నమస్కారము చేయగా ఆ అసము ఆకాశములోనికి వెళ్ళిపోయినది. కాళికాదేవి ప్రయోగించుచున్న దివ్యాస్త్రములను శంఖచూడుడు దివ్యాస్త్రముల చేతనే ఉపసంహరించెను. చివరకు కాళిక {$ని ప్రయోగింపగా తన దివ్యాస్త్రములచే దానిని ముక్కలు ముక్కలు చేసెను.
శంఖచూడునితో జరుగుతున్న యుద్దమున తన శస్త్రాస్త్రములు విఫలమగుటవలన కాళికాదేవి కోపముతో పాశుపతాస్త్రమును సంధింపనెంచెను. కాని అశరీరవాణి శంఖచూడుని మరణము పాశుపతాస్త్రమున లేదనియు, ఆతని కంఠములోని శ్రీహరి కవచము, అతని భార్యయొక్క సత్త్వముండునంతవరకు అతనికి జర, మృత్యువులు లేవని చెప్పుటచే ఆమె పాశుపతాస్త్రమును సంధింపలేదు. ఆమె కోటి దానవులను ఒక్కసారిగా చంపి శంఖచూడుని తినుటకై వెళ్ళాను. కాని శంఖచూడుడు వాడియగు దివ్యాస్త్రముచే ఆమె ప్రయత్నమును వ్యర్థము గావించెను. ఆమె ప్రయోగించిన ఖడ్గమును సైతము తన దివ్యాస్త్రముచే తుత్తునీయలు గావించెను. అదేవిధముగ రెండవసారి అతనిని తినవలెనని కాళిక చేసిన ప్రయత్నము సర్వసిద్దేశ్వరుని వలన విఫలమయ్యెను. అందువలన కోపముతో ఆమె తన పిడికిటతో అతని రథమును, అతని సారథిని పడగొట్టి అతనిపై ప్రళయాగ్నిజ్వాల వంటి శూలమును వేసెను. కాళికాదేవి కోపముతో తన పిడికిటితో అతనినీ గుద్దగా క్షణకాలమతడు మూర్చిల్లెను. తరువాత వెంటనే తేరుకొని లేచి నిలబడెను. ఆమె బాహు యుద్ధము చేయుట కిష్టపడగా ఆతడు దానికి ఒప్పుకొనక నమస్కరించెను. ఆమె వేసిన శస్త్రాస్త్రములన్నిటిని ఆ దానవుడు వ్యర్థము చేయసాగెను. అట్లే ఆమెపైగల మాతృబుద్ధితో కాళికాదేవిపై అస్త్రములు వేయలేదు. ఐనను కాళికాదేవి కోపముతో అతనిని పట్టుకొని ఎత్తి గిరగిర చుట్టు తిప్పి పడవేసెను. అయినను ఆతడు వెంటనే లేచి నిలబడి భద్రకాళీకి నమస్కరించెను.
శంఖచూడుడు వెంటనే రత్ననిర్మితమైన విమానము నధిరోహించెను. ఇంతసేపు యుద్ధము చేసినను అతడు అలసిపోలేదు. పైగా సంతోషముతో అతడుండెను. భద్రకాళీ రాక్షసుల మాంసమును తీనీ రక్తమును త్రాగీ చిరపకు శంకరునివద్దకేగి యుద్ధవృత్తాంతమునంతయు పూసగుచ్చినట్లు వివరించినది. ఇప్పుడు దానవేంద్రుని దగ్గర. లక్షసైనికులు మాత్రమున్నారు. మిగిలినవారందరిని నేను తీంటిని. ఇంకను రణరంగమున అతని చంపుటకై పాశుపతాస్త్రమును సంధింపబోగా ఆశరీరవాణి అతడు నీతో చావడనీ నాకు చెప్పెను. ఎటైనను రాజేంద్రుడు మంచి బలపరాక్రమములు కలవాడు పైగా జ్ఞానవంతుడు. ఇంత యుద్ధము జరిగినను అతడు నా శస్త్రాస్త్రములను ఖండించెనే కాని తనకు తానుగా నాపై ఒక అస్త్రమును వేయలేదని భద్రకాళీ శంకరునితో ననగా శంకరుడు నవ్వి ఊరకుండెను.
శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతిఖండములో నారద నారాయణ సంవాద సమయమున తెల్పబడిన తులస్యుపాఖ్యానములో కాళీ శంఖచూడుల యుద్దమను పందొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 19 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
To fulfill the cosmic mandate and free Shankhachūḍa and Tulasī from their ancient curses, Lord Śrī Vishṇu assumed the disguise of an old Brāhmaṇa and approached Shankhachūḍa on the battlefield, begging for his divine Śrī Kṛshṇa Kavacha as charity, which the noble king willingly gifted without hesitation. Thereafter, Lord Śrī Vishṇu assumed the exact physical form of Shankhachūḍa and entered the palace of Tulasī, who welcomed Him as her victorious husband with deep marital affection. The moment Tulasī touched the disguised Lord with spousal intimacy, her absolute marital chastity was unwittingly broken, instantly neutralizing the divine defense that protected Shankhachūḍa on the battlefield.