నారద ఉవాచ- నారదమహర్షి ఇట్లు నారాయణునితో పలికెను-
నారాయణమహర్షి! సురథుడను రాజు ఏ వంశములో పుట్టెను. జ్ఞానవంతులలో శ్రేష్ఠుడగు మేధోమునీ సురథునకు ఏవిధముగా గురువయ్యెను? మేథోముని, మహారాజు ఇద్దరి మధ్య కలయిక ఎట్లేర్పడినది? అట్లే వైశ్యునకు మహారాజునకు స్నేహమెట్లేర్పడినది అను విషయములను నాకు వివరముగా తెల్పుమని ఆడిగెను.
నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-
బ్రహ్మదేవుని పుత్రుడు అత్రిమహర్షి అతని పుత్రుడు చంద్రుడు. అతడు రాజసూయ యాగముచేసినందువలన ద్విజు శ్రేష్ఠుడయ్యెను. ఆ చంద్రునకు గురువైన బృహస్పతి భార్యయగు తెరకు పుట్టినవాడు బుధుడు, బుధుని పుత్రుడు చైత్రుడు. చైత్రుని కుమారుడు సురథుడను మహారాజు.
నారద ఉవాచ- నారదుడిట్లనెను-
ఆచార్యా! గురుపత్నియగు తారకు చంద్రునకు పుత్రుడెట్లు కలిగెను. ఇది విపరీతముగానున్నది. అందువలన దీనిని వివరించి చెప్పమని అడిగెను.
నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-
చంద్రుడు అధిక ధనమువలన మదించి కాముకుడై గంగానదీ తీరమున తిరుగుచుండెను. అప్పుడు దేవగురువగు బృహస్పతి భార్యయైన తారాదేవి అచ్చటనుండెను. ఆమె ధర్మనిష్ఠ కలది. పతివ్రత. కానీ ఆ సమయమున ఆమె నదిలో చక్కగా స్నానము చేసివచ్చుచుండెను. ఆమె మంచి అందముగలదీ. పీవోన్నత సని, చక్కని నడుము, నీతంబములు కలది. మంచి యౌవనమున నున్నది. ఆమె ధరించిన వస్త్రములు చాలా పలుచగానుండెను. రత్నభూషణములతో, ముఖము కస్తూరీచుక్క దానికింద చందన బిందువులు, సిందూరబిందువులతో చాలా ఉజ్వలముగానున్నది. గాలివలన ఆమె ధరించిన వస్త్రము కొద్దిగా పైకి లేచినది. ఆమె కన్నులలో కామము కన్పించుచుండెను. ఆమే ముఖము శరత్కాల పూర్ణిమనాటి చంద్రబింబమువలెనుండెను. పెదవులు దొండపండువలె ఎఱ్ఱగానుండెను. ఆమె సుందరుడైన చంద్రుని చూచీ సిగ్గుతో తలవంచుకొని చిరునవ్వు నవ్వుచుండెను. మదించిన ఏనుగువంటి గమనముతో తన ఇంటికి పోవుచున్న తారను చూచి చంద్రుడు మన్మథబాధకు గురియయ్యెను. ఆందువలన శరీరము పులకించిపోగా, సిగ్గును వదలి కామముతో కూడుకున్నవాడే తారతో ఇట్లనెను.
చంద్ర ఉవాచ- చంద్రుడిట్లనెను-
నీవు స్త్రీలలో గొప్పదానవు, రసికస్త్రీలలో గొప్పదానివి. నీవు ఏదగ్గురాలవు. అందువలననే వీదగ్గులగు పురుషుల మనస్సును ఆకర్షించుచున్నావు. బృహస్పతి ప్రకృతిని వేలకొద్ది జన్మలనుండి పూజించి తన బహు తపః ఫలితముగా అందమైన నిన్ను భార్యగా పొందెను.
ఆ బృహస్పతి తపస్వీ, కామవిషయములేమి తెలియనివాడు. నీవు రసికురాలవు, కామముపై ఆసక్తి కలదానివి. మీ ఇద్దరిని బ్రహ్మదేవుడన్యాయముగా ఒకచోట కూర్చెను. కామశాస్త్రమేమియు తెలియని వానితో కామ విషయములలో ప్రవీణవగు నీవు సంగమించిన ప్రయోజనమేమున్నది. విదగ్గ విదగ్గునితో కలిసి రమించిన వారిద్దరు సుఖసాగరమున తేలియాడుదురు. కామీనివగు నీవు మన్మథునివలన అనేక బాధలకు గురియగుచున్నావు, ప్రతిదినము నీయొక్క యౌవనము వ్యర్థముగా గడచిపోవుచున్నది. నీ భర్త వృద్దుడు. నీవో నవయౌవనవతివి. ఆతడెల్లప్పుడు తన ఇష్టదేవతయగు శ్రీకృష్ణుని ఆరాధించుచుండును. నీవు సమస్త కామవిషయములు తెలిసినదానవు. నీవెల్లప్పుడు యువకులు చేయు శృంగారమును మనస్సులో ఎల్లప్పుడు ధ్యానించుచుందువు.
నీ మనస్సులోనుండు కోరికయొకటి. నీ భర్త కోరికయొకటి. మీ ఇద్దరి కోరికలు చాలా భిన్నమైనవి. ఇట్టి మీ ఇద్దరి సమాగమమున ప్రీతి ఏమియుండును. వసంతకాలపు పుష్పశయ్య గంధము చందనములతో సువాసితమైయున్నది. ఆ శయ్యపై మాధవీలతా నీకుంజమున నాతో రమింపుము. జనులు లేని చందన వనమున సువాసనగల పుష్పములపై నీవు సుఖింపుము. చంపకవనమున చంపక పుష్పముల వాసనలు చల్లగా వచ్చుచుండగా చంపక పుషతల్పమున నాతో రతిక్రీడ సలుపుము.
మన్మథునికంటే అధిక సౌందర్యము గలవాడు, మన్మథునిచే బాధీశుడైన చంద్రుడు గంగానదీ తీరమున పై విధముగా మాట్లాడుచు ఆమె కాళ్ళపై పడెను. చంద్రుడు తనను ముందుకు పోకుండ ఆపివేయగా తారాదేవి గొంతెండిపోవుచుండగా కోపముతో ఇట్లనెను.
తారోవాచ- తార ఈవిధముగా అనెను-
ఓ చంద్రుడా నిన్ను గడ్డిపరకతో సమానముగా తలచుచున్నాను. నీవు స్త్రీలంపటుడవు. నీచుడవు. అత్రి మహర్షి దురదృష్టమున నిన్నుతుత్రునిగా పొందెను. రాజసూయ యాగము చేసినందువలన బలవంతుడనైతినని నిన్ను నీవు తలచుచున్నావు. విప్రస్త్రీని కామీంచుటవలన నీ పుణ్యమంతయు వ్యర్థమైపోయినది. ఇతరుల భార్యను కామించువాడు అపవిత్రుడు. ఆతడు తాను చేసిన పుణ్యకర్మలయొక్క ఫలితమును పొందజాలడు. అతనిని అందరు నిందింతురు.
నీవు నా సతీత్వమును చెడగొట్టవలెనని తలచుచున్నావు. కాని నీవు క్షయరోగముచే పీడింపబడుదువు. అత్యుచ్ఛయము పతన హేతువని వేదములందు కలదు. నీవు రాజసూయాదీ యాగములవలన సంపాదించుకొన్న పుణ్యమంతయు నశించి పాపఫలమనుభవింపగలవు. దుష్టులయొక్క గర్వమును అణచివేయు శ్రీకృష్ణుడు నీ గర్వమును కూడ అణచివేయగలడు. నేను నీకు తల్లివంటి చానీని. నీవు నాకు పుత్రునివంటివాడవు, నన్ను వదలి పెట్టినచో నీకు శుభముకలుగును.
తార ఈవిధముగా పలుకుచు ఏడ్వసాగెను. అట్లే చంద్రుని కర్మకు సాక్షులుగా ధర్మాది దేవతలను ఉంచెను.
తారాదేవి మాటలను లెక్క సేయక చంద్రుడు కోపముతో సుందరియగు తారను ఎత్తిపట్టుకొని తన రథమునందుంచుకొని మనోగమనమున రథమును నడిపించెను.
తరువాత చందనము, పుష్పములు కల దేవతావనమున సువాసనగల పుష్పతల్పము పైన ఆమెతో రమించేను. ఆటుపిమ్మట వారిద్దరు ప్రతి పర్వతమున ప్రతి నదీ తీరమున రమించుచుండిరి. వారికప్పుడు నూరు సంవత్సరములు ఒక ముహూర్తమువలె గడచిపోయినవి.
ఆ తరువాత చంద్రుడు దేవతలవలన భయముచెందీ దైత్యులను శరణువేడెను. అట్లే రాక్షసుల గురువగు శుక్రునికూడ శరణువేడెను. అప్పుడు భృగునందనుడగు శుక్రుడు దయతో చంద్రునకు అభయము నొసగెను. తరువాత తనకు ప్రతిపక్షీయగు దేవతాగురువును సభలో చూచి శుక్రుడు పరిహసించెను. ఆదేవిధముగా దైత్యులాచంద్రునకు అభయమునిచ్చి బృహస్పతిని చూచి నవ్విరి.
కాని పతివ్రతయైన తారాదేవియొక్క సతీత్వమును చంద్రుడు ధ్వంసము చేసినందువలన ఆ కళంకరూపమైన పాపము చంద్రమండలమున శశరూపమైన కళంకముగా మారినది.
అప్పుడు మిక్కిలి భయపడుతున్న చంద్రుని చూచి వేదజ్ఞులలో శ్రేష్ఠుడైన ఈ క్రమహర్షి పరిణామకాలమున సుఖమును కలిగించునది హితవైనది అగు మాటలు పలికెను.
ఓ చంద్రా! నీవు బ్రహ్మదేవుని పౌత్రుడవు. అత్రిమహర్షియొక్క పుత్రుడవు. నీవు చేసిన పని నింద్యమైనది. అది నీచుడైనవాడు చేసిన పనివలె చెడుకీర్తిని కలిగించును. నీవు రాజసూయయాగమొనర్చి దాని ఫలితముగా నిర్మలమైన కీర్తిని పొందితివి. కాని నీవు చేసిన ఈ తప్పుడు పనివలన అమృతభాండమున సురాబిందువు పడినట్లు మచ్చ ఏర్పడినది.
బృహస్పతి దేవతలందరకు గురువు. అతడు సద్ధర్మ పరాయణుడు. బ్రాహ్మణులందరిలోను శ్రేష్ఠుడు, బ్రహ్మతేజో సంపన్నుడు. అతని భార్యయగు తార మహాపతివ్రత. ఈమెను తల్లిని వలె కామింపక వదిలి పెట్టుము.
శత్రువైనను సత్కర్మలు చేసినచో అతని సుగుణములను కీర్తింపవలెను. అట్లే గురువైనను తప్పుడు పనులు చేసినచో ఆతని చెడుగుణములను చెప్పవలెననుట సద్వంశమున పుట్టిన మంచీవారియొక్క స్వభావము.
ఓ చంద్రుడా! బృహస్పతి నాకు బద్ధశత్రువే అయినను ధర్మవిషయమున సహజమైన దానిని చెప్పితిని. లోకములు ధర్మమార్గమున నున్నప్పుడే సనాతనుడగు ధర్మదేవత అచ్చట ఉండును. ధర్మముండుచోట కృష్ణుడు, కృష్ణుడుండు చోట జయము కలుగును,
ఆవు ఒకే దూడను కనును. కాని వ్యాఘము ఐదు పిల్లలను, సింహము ఏడు పిల్లలను కనును. కాని అవి వాటిని చంపి తినును. కావున హింసచేయువారు త్వరగా చనిపోవుదురు. ధర్మము మాత్రము ధార్మికుని రక్షించును.
దేవతలు, గురువు, బ్రాహ్మణులు ఆందరినీ రక్షింపగల్గినను, ధర్మమును చెడగొట్టు పాపిని మాత్రము వారు రక్షింపరు.
కులటలగు బ్రాహ్మణస్త్రీలను పొందినచో బ్రహ్మ హత్యా పాపమున పదునారంశగల పాపమును పొందుదురు. సమీపముననున్న బ్రాహ్మణ స్త్రీలను చెరచినచో బ్రహ్మహత్యాపాపమునకు నాలుగు రెట్లెక్కువ పాపమును పొందెదరు. వారిని బలాత్కారముగా అనుభవించినచో నూరు రెట్లెక్కువగా బ్రహ్మహత్యా పాపమును పొందుదురు.
అందువలన ఓ చంద్రుడా! ధర్మమును అనుష్ఠింపుము. బ్రాహ్మణస్త్రీని వదలి పెట్టుము. తరువాత ఆనుతాపమును పొంది పాపమునుండి నివృత్తుడవగుదువు. నీ పాపమును ఏదియో ఒక ఉపాయముచేత దూరము చేసికొనవచ్చును.
భయముచే శరణుజొచ్చిన వానిని తప్పక రక్షింపవలెను. శస్త్రములు లేని వానిని, భయముచెందినవారిని, దీనుడైనవానిని, శరణాగతుడైనవానిని రక్షింపని ధర్మహీనుడు కుంభీపాక నరకమునకు పోవును. వీరిని రక్షించినచో నూరు రాజసూయ యాగములు చేసిన పాపము పొందును. ధర్మము నాచరించినందువలన పరమైశ్యర్య సంపన్నుడగును.
దైత్యగురువగు శుక్రుడు చంద్రునితో నిట్లని స్వర్గముననున్న గంగానదీ తీరమున తాను స్నానముచేసి చంద్రుని స్నానము చేయించెను. తరువాత శుక్రుడు విష్ణుపూజను చేసి పుణ్యప్రదమైన గంగానదీ జలముతో చంద్రునకు భోజనము పెట్టెను. అటుపిమ్మట చంద్రుని తన తొడ పైనుంచుకొని దర్భలను చేతిలోనుంచుకొని చంద్రునితో నీవు శ్రీహరిని మాటిమాటికి స్మరింపుమనెను.
శుక్ర ఉవాచ- శుక్రుడిట్లనెను-
నా తపః ఫలితమున్నచో, నేను పూజించు శ్రీహారియొక్క పూజాఫలమున్నచో, నాయొక్క వ్రతముల ఫలితము, నా సత్యవాక్పలితము, నా తీర్థస్నాన ఫలము, నేను చేసిన దానములయొక్క ఫలము నా ఉపవాసముల ఫలమున్నచో చంద్రుడు అతడు చేసిన పాపములనుండి విముక్తుడగును.
త్రికాల సంధ్యలు ఆచరింపని వానికి, విష్ణుపూజ చేయనివానికి మహాభయంకరమైన చంద్రపాపము అంటును. తన భార్యను మోసగించి ఇతర స్త్రీలతో పోవువానీకి చంద్రపాపము ఆంటును. చెడునడక లేక కలహములు పెట్టుకొను స్త్రీ తన భర్తను బాధించినచో ఆమే చంద్రపాపము వలన తులాముఖమును నరకమును పొందును. శ్రీహరికి నివేదింపని అన్నమును పనికిరాని అన్నమును ఆనువాడు చంద్రపాపము వలన కాలసూత్రమను నరకమున నాలుగు యుగముల వరకుండును.
భూమిని తవ్వు పాపాత్మునకు చంద్రపాపము వలన నూరు యుగములవరకు కాలసూత్ర నరకము లభించును. తన భర్తను మోసగించి ఇతర పురుషునితో పోవు స్త్రీ చంద్రపాపమువలన వహ్నికుండమను నరకమున నాల్లు యుగములుండును. తన తలిదండ్రులను, భార్యను తనగురువును పోషింపనివాడు చంద్రపాపమువలన చండాలుడగును. కులటయగు స్త్రీ పెట్టిన అన్నమును, భర్త, సంతానములేని స్త్రీ పెట్టిన అన్నమును, ఋతుస్నాతమైన స్త్రీ పెట్టిన అన్నమును భుజించువాడు చంద్రుని పాపమువలన నాలుగు యుగములవరకు కుంభీపాక నరకముననుభవించి తరువాత చండాలుడగును, పగటివేళయందు రతిక్రీడ సలుపువాడు, గర్భవతి, రజస్వలయగు స్త్రీతో రతిని చేయువాడు చంద్రపాపము వలన నాలుగు యుగములవరకు కాలసూత్రమను నరకమున యాతనలననుభవించును.
పరస్త్రీయొక్క ముఖమును, స్తనములను, పిరుదులను కామ దృష్టితో చూచు కాముకుడు చంద్రపాపమువలన లాలాభక్ష్యమను నరకమున నాలుగు యుగములుండును. అటుపిమ్మట బొండాలుడగును తరువాత నపుంసకుడగును.
అమావాస్య, పూర్ణిమ, సూర్య సంక్రాంతి, చతుర్దశి, అష్టమీ, ఆదివారములందు మాంసమును, సిరిశనగపప్పును, లకుచమును తినువాడు, పై దీనములలో రతికార్యము సలుపువాడు చంద్ర పాపమును పొందీ ఆ పాపమువలన నాలుగు యుగములవరకు కాలసూత్రమను నరకముననుభవించును. అటుపిమ్మట చండాలుడగును. ఏడు జన్మలవరకు రోగి మరియు దరిద్రుడగును,
ఏకాదశినాడు శ్రీకృష్ణాష్టమి, శివరాత్రి దినములందు భోజనము చేయు పాపాత్ముడు పదునలుగురు ఇంద్రులు గతీంచునంతవరకు చంద్రపాపము వలన కుంభీపాక నరకమును పొందును. తరువాత చండాలుడగును.
రాగిపాత్రలోనున్న పాలను, తేనెను, ఎంగిళ్ళలో పడిన నేతిని, కంచుపాత్రలోనున్న నారికేళ ఫలోదకమును, ఉప్పుగల పాలను, తాగగా మిగిలిన జలమును, తినగా మిగిలిన అన్నమును, మాటీకీమాటికి అన్నమును, సాయంసంధ్యయందు భోజనమును చేయువాడు చంద్రపాపమును పొంది. దానివలన నాలుగు యుగములు అంధకూపమను నరకమున యాతనలనుభవించును.
తన కూతురును డబ్బుకాశపడి అమ్ముకొనువాడు. దేవుని పూజించి బ్రదుకు బ్రాహ్మణుడు, ఎద్దుల వాహనము కల బ్రాహ్మణుడు, శూద్రుల శవదాహము చేయువాడు, శూద్రుల ఇండ్లలో వంటలు చేసి బ్రతుకు బ్రాహ్మణుడు, రావిచెట్టును నరకు బ్రాహ్మణుడు, విష్ణుమూర్తిని విష్ణుభక్తులను నిందించు బ్రాహ్మణుడు భయంకరమైన చంద్రపాపమువలన తప్తసూర్మియను నరకమును పొంది అచ్చట మన్వంతర కాలము బాధలననుభవించును. ఆ తరువాత చండాలుడై పుట్టును. అటుపిమ్మట ఐదు జన్మలవరకు వృషభమై జన్మించును. నూరుజన్మలవరకు గాడిదగా పుట్టును. అటుపిమ్మట, ఏడు జన్మలు అడవి పందియగును. ఏడు జన్మలు కాకిగాను ఆ తరువాత ఐదు జన్మలవరకు మలములోని క్రిమీగా జన్మించును.
వ్యర్థముగా మాంసమును తినువాడు తనకోరకు మాత్రమే వంటచేసికొని భుజించువాడు మహాపాపి. అతడు చంద్రపాపమును పొంది నాలుగు యుగములు అసిపత్రమను నరకమున బాధలుపడును. నరకానంతరము ఏడుజన్మలు సర్పముగాను, ఏడు జన్మలు పశువుగా పుట్టును.
వడ్డీ వ్యాపారము చేయుచు, వ్యభిచారము నడుపుచు బ్రతుకుచున్న బ్రాహ్మణుఁడు వైద్యుడగు బ్రాహ్మణుడు, శ్రీహరి పేరును చెప్పి బ్రతుకువాడు, తన అవయవములనమ్ముకొని బ్రతుకువాడు, తన ధర్మమును గురించి మాటలు మాత్రము మాట్లాడువాడు, ఆత్మ ప్రశంస చేసికొనువాడు. ఇతరులకు వ్రాసి పెట్టి బ్రతుకువాడు, ధోవకుడు, కులటను పోషించువాడు చంద్రపాపమును పొందును. అందువలన చంద్రునకు పాపవిముక్తి కలుగును. వీరందరు చంద్రపాపమువలన భయంకరమైన శూలప్రోతమను నరకమునకు పోవుదురు. అచ్చట మన్వంతరమునుండి తరువాత దరిద్రులై పుట్టి రోగములచే బాధపడుదురు.
లక్కను, మాంసమును, రసద్రవ్యములను, నువ్వులను, ఉప్పును, ఆశ్వములను, లోహములను, అమ్ముపోడు, తోటి మానవుని చంపు బ్రాహ్మణుడు, కులాలుడు, చోరుడు, వీరందరకు చంద్రపాపము చుట్టుకొనును. అందువలన ఆ పాపి ఒక మన్వంతర కాలము క్షుగధారమను నరకమున దుస్సహమైన యాతనలననుభవించును. ఆ తరువాత నక్కగాను, పిల్లిగాను, బజ్జిగాను, ఎలుగుబంటిగాను, కుక్కగా, చేపగా, ఎండీగా, బల్లిగా, గాడిదగా కప్పగా అనేకమార్లు జన్మలనెత్తి మానవుడై పుట్టును. ఆప్పుడు తొలుతచర్మకారుడుగో, అటుపిమ్మట, రజకుడుగా తైలకారుడుగా, వడ్డీలిచ్చువాడుగా, నావికుడుగా, శవముల మోసీ బతుకువాడు, వ్యాధుడుగో, స్వర్ణకారుడుగా, కుంభకారుడుగా, లోహకారుడుగా, జన్మనెత్తి తరువాత క్షత్రియుడై పుట్టి చివరకు బ్రాహ్మణ జన్మపొందును.
చంద్రుని ఈవిధముగా పాపరహితునిగా చేసి శుక్రుడు తారతో ఇట్లనెను. పతీవ్రతా! నీవు చంద్రుని వదిలి పెట్టి నీ భర్త దగ్గరకు పొమ్ము, నీవు పరిశుద్ధమైన మనస్సు కలదానవు. అందువలన నీకు జారత్వము వలన కలుగు పాపమంటదు. ప్రాయశ్చిత్తము చేసికొన నప్పటికి నీవు పవిత్రురాలవే. తనకు కోరికలేక బలవంతుడైన పురుషుని వలన బలాత్కరింపబడినచో ఆ స్త్రీకి జారత్వ పాపమంటదు అని శుక్రుడు వారిద్దరకు శుభాశీస్సులనొసగి పోయెను.
శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతిఖండములోని నారదనారాయణ సంవాదమున తెలుపబడిన దుర్గోపాఖ్యానములోని తారాచంద్రుల పాపనివారణమను యాభైఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 58 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
Addressing the sorrowful king and merchant, Maharshi Medhas revealed that their irrational attachment to worldly possessions and unfaithful family members was caused by Mahāmāyā, the cosmic deluding potency of Parā Prakṛti. The sage explained that Goddess Mahāmāyā binds all living beings, from the smallest insect to the highest celestial deities, in the web of egoism, attachment, and worldly desire to maintain the cosmic cycle of birth and death. However, Maharshi Medhas added that when this same Divine Mother is worshipped with sincere devotion, She lifts the veil of delusion and bestows both earthly prosperity and ultimate liberation.