నారద ఉవాచ- నారదుడిట్లు పలికెను-
భూదానము చేసినందువలన కలుగు పుణ్య మెట్టిదో, దానము చేసిన భూమిని అపహరించినందువలన, ఇతరుల ఇండ్లలో శ్రాద్ధము చేసినందువలన, దిగుడుబావులలో మైల అంటుకొనిన కాళ్ళు పెట్టినందువలస, భూమిని తవ్వినందువలన, వీర్యమున భూమిపై వదలినందువలన, భూమిపై దీపాదులను పెట్టినందువలన ఏర్పడు పాపమును, పృథివి వల్ల సంభవించు ఇతర పాపములను, వాటి నివారణ మార్గములనన్నిటిని నాకు వివరించి చెప్పుడు.
నారాయణ ఉవాచ- నారాయణమూర్తి ఇట్లు చెప్పెను-
ఈ భారతదేశమున మూడుపూటలు సంధ్యావందనమాచరించి గాయత్రీ జపము చేసి పవిత్రుడైన బ్రాహ్మణునకు లేశమాత్రము భూమిని దానము చేసిన వాడు వైకుంఠమునకు తప్పక పోవును. గ్రామమును, భూమిని, ధాన్యమును ఎవరు దానము చేయుదురో, దానముగా స్వీకరింతురో వారిద్దరు సమస్త పాపములనుండి వినిర్ముక్తులై వైకుంఠమున నివసింతురు.
తానుదానము చేసినను, ఇతరులు దానమొనర్చినను, బ్రాహ్మణుల కిచ్చిన వృత్తిని ఎవరు నాశనము చేయుదురో వారు సూర్య చంద్రులున్నంతవరకు నరకలోకమున శిక్షలనుభవింతురు, ఆంతేకాక అతనీ సంతానము, వంశము భూమిని కోల్పోయి దరిద్రులై రౌరవనరకమున నివసించును.
ఆవులు తిరుగు త్రోవలన చెడగొట్టి వ్యవసాయమునకై వినియోగించుకొనువాడు, ఆవుల కొట్టమును, చెరువును చెడగొట్టి , ప్వార్ధమునకు వినియోగించుకోమవాడు, సూర్యచంద్రులున్నంతవరకు నరకమున కత్తులపై నిలుబడియుండగలడు.
శ్రాద్ధమున పంచపిండములు పెట్టకుండ ఇతరుల బావిలో స్నానము చేసినచో నరకము మాత్రమే కాక స్నానఫలము సహితము పొందలేడు.
భూమిపై తన వీర్యమును వదిలినవాడు, ఇతరులు తవ్వించిన బావి పూడ్కొనినచో ఆ పూడికను తీయించినవాడు దానఫలమును పొందలేడు. ఆ ఫలితము పూర్వపు యజమానికి మాత్రమే చెందును.
కాని ఇతరులు త్రవ్వించిన చెరువులోని పూడికను తీయించినచో క్షణకాలమైనను బ్రహ్మలోకప్రాప్తి కలుగును.
పిండము పెట్టక శ్రాద్దము చేసినవాడు నరకమును పొందగా, భూమిపై దీపమునుంచినవాడు వీడు జన్మలవరకు గుడ్డివాడు కాగలడు. అట్లే భూమి పై శంఖమునుంచీవ కుష్టురోగమునకు గురియగును. శివలింగమును, సాలగ్రామ శీలసు, మంత్రపుస్తకమును, సాలగ్రాముయొక్క అభి షేకతీర్థమును. పుష్పముసు. తులసిని, జపమాలను, కర్పూరమును, గోరోజనమును భూమిపై పెట్టువాడు తప్పక నరకవాసఫలమనుభవించును.
చందనపు కట్టెమ, రుద్రాక్షను, దర్భను భూమి పైనుంచినచో మన్వంతరము వరకు నరకమున నివసించును.
పుస్తకమును, యజ్ఞోపవీతమును భూమిపై ఉంచినచో అతడు తర్వాతి జన్మలలో బ్రాహ్మణుగా పుట్టరు. ఇది బ్రహ్మహత్యతో సమానమైన పాపము. ముడివేసిన యజ్ఞోపవీతము అన్ని కులములవారికి గౌరవించదగినది.
యజ్ఞమును చేసి యజ్ఞాంతమున ఆ భూమిని పాలచే తడుపనిచో అతడు తప్తసూర్మి అను నరకమును అనుభవించును. భూకంపము వచ్చినప్పుడు, గ్రహణ కాలమున భూమిని ఎవ్వడు త్రవ్వునో అతడు మహాపాపి యగును. ఇతర జన్మలలో ఆంగహిమడుగా పుట్టును. ధనమును రత్పాదులను (పసుపును) ధరించినందువలన వసుధయవి పిల్చిరి. శ్రీహరియొక్క ఊరువులనుండి పుట్టినందువలన దానిని "ఉర్వి" యనిరి. యాగవస్తువులను భరించుచున్నందువలన "ఇజ్య" యనిరీ. లయకాలమువ క్షీణించుచున్నందువలన "క్షీణియైనది. మహాలయకాలమున సంపూర్ణముగా క్షతి చెందుచున్నందువలన "క్షితి' ' అనే పేర ప్రసిద్ధిబడపినది. కశ్యపమహర్షికి సంబంధించినది కావున దీనినీ “కాశ్యపి" యనీరి. చంచలము కాకుండా ఉన్నందువలన "అచలమైనది. విశ్వమునంతయు భరించుచున్నందువలన “విశ్వంభర'గా ప్రసిద్ధి చెందినది. అనంతమైన రూపము ఉన్నందువలన "అనంత" యమ పేరుతో, పృథుమహారాజు కూతురు కావున "పృథ్వి" యను పేరుతో చాలా విస్తరించి యున్నందువలన “మహీ" యను పేర ప్రసిద్ది చెందినది.
శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండములో నారద నారాయణ సంవాదసమయమున తెలుపబడిన పృథివీ ఉపాఖ్యానమను తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 9 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
Recounting the historical background of King Bhagīratha's lineage, Śrī Sūta Gosvāmī narrated the history of King Sagara and the performance of his hundredth Ashvamedha sacrifice. When Lord Indra secretly stole the sacrificial horse and tied it near the hermitage of Maharshi Kapiladeva, the sixty thousand arrogant sons of Sagara mistook the silent meditating sage for a thief and insulted him deeply. Opening his eyes of fiery spiritual power, Maharshi Kapiladeva instantly burned the princes to ashes, leaving their souls bound until the holy waters of Gaṅgā touched their remains through King Bhagīratha's devotion, demonstrating the terrifying power of offending holy sages and the unmatched purifying grace of the divine river.