నారద ఉవాచ- నారదుడిట్లనెను-
శ్రీమన్నారాయణ! మహాభాగt రూపమున, సుగుణములలో కీర్తియందు, తేజస్సున నీకు సమానుడు లేనేలేడు, జ్ఞానవంతులలో, సిద్ధులలో, యోగులయందు, తపస్వులలో వేదవేత్తలలో వీవే శ్రేష్టుడవు. నీవలన పరమాద్భుతమైన మహాలక్ష్మీ ఉపాఖ్యానమును వింటిని.
ఇంకను మిక్కిలి రహస్యముగానుండి అందరికీ ఉపయోగపడు ఉపాఖ్యానము నొక్కదానిని నాకు వినిపింపుము.
శ్రీ నారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లనెను-
నారదా! వేదములలో అనేకవిధములైన ఆఖ్యానములు గూడముగా నున్నవి. వాటిలో అనేకమైన ఉపాఖ్యానములను పురాణములు వివరించలేదు.
అందువలన నీకు వేదమునందు నిగూఢముగా ఉన్న ఆఖ్యానములలో ప్రధానమని తోచిన దానిని అడిగినచో నేను చెప్పెదను.
నారద ఉవాచ- నారదుడిట్లనెను-
శ్రీమన్నారాయణ! అగ్నికి హవిస్సునిచ్చునప్పుడు స్వాహా దేవి, కవ్యమును ఇచ్చునప్పుడు స్వధాదేవి, అన్ని కర్మలలో దక్షిణా దేవి శ్రేష్ఠురాలని అందురు. వీరి జన్మ, చరిత్ర, ప్రాధాన్యమును వినవలెనని అనుకొనుచున్నాను. అందువలన దయచేసి చెప్పుడు.
సౌతిరువాచ- సౌతి మహర్షి శౌనకునితో ఇట్లనెను-
నారదుని మాటలు విని నారాయణముని పురాణములందున్న ప్రాచీనమైన కథనట్లు చెప్పుటకు మొదలిడెను.
శ్రీనారాయణ ఉవాచ- శ్రీనారాయణుడిట్లనెను-
సృష్టి ప్రారంభకాలమున దేవతలు ఆహారమునకై ఎవ్వరు చేరలేని బ్రహ్మసభకు వెళ్ళి ఆహార విషయమున తమకున్న బాధలను నివేదించుకొనిరి. బ్రహ్మదేవుడు వారి మాటలు విని దేవతలకు మేలు చేయుదుననీ చెప్పి శ్రీహరి నివసించు వైకుంఠమునకు వెళ్ళి శ్రీహరిని సేవించేను. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన ఆంతచే యజ్ఞరూపుడాయెను. ఆ యజ్ఞమున బ్రహ్మదేవుడొసగిన హవిస్సులను ఆయా దేవతలు పొందిరి. కానీ బ్రాహ్మణులు క్షత్రియులు మొదలగు భూలోకవాసులిచ్చిన హవిస్సులు మాత్రము దేవతలకు అందలేదు.
అందువలన దేవతలు మరల దుఃఖించుచు బ్రహ్మదేవుని సభకు పోయి తమకు ఆహారము దొరుకుచులేదని విన్నవించిరి. బ్రహ్మదేవుడు వారి మాటలు విని దయదలచి శ్రీకృష్ణుని ధ్యానించుచునే అతని ఆజ్ఞననుసరించి ప్రకృతిని పూజించెను. సర్వశక్తి స్వరూపిణియగు ఆ ప్రకృతి తన ఆంశస్వరూపముతో అగ్నియొక్క దాకా శక్తి “స్వాహా" రూపమున ఆవిర్భవించినది.
స్వాహాదేవి గ్రీష్మకాలమందలి మధ్యాహ్న సూర్యునికన్న మిన్నయైన కాంతితో చిరునవ్వుగల ముఖముతో భక్తులను అనుగ్రహించునదై బ్రహ్మదేవుని వరము వేడుకొమ్మని కోరినది.
స్వాహాదేవియొక్క మాటలు విని బ్రహ్మదేవుడు ససంభ్రమముగా ఆమెతోనిట్లనెను.
బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లు పలికను-
ఓ స్వాహాదేవీ! నీవు ఆగ్నియొక్క దాహక శక్తివీ, ఆందమైన దానవు, ఆతనికి భార్యవుకమ్ము. నీవే లేనిచో అగ్ని దేవుడు తనకు సమర్పింపబడ్డ హవిస్సులను దగ్గము చేసికోవలేడు. మంత్రము యొక్క చివర నీ పేరును (స్వాహా) ఉచ్చరించి దేవతలకు మానవులు సమర్పించిన హవిస్సులను దేవతలు ఆనందముతో స్వీకరింతురు. నీవు అగ్నియొక్క సంపదవు. శ్రీ రూపమైన గృహిణివి. ఓ తల్లి నిన్ను ఎల్లప్పుడు దేవతలు, మానవులు పూజింతురు. ఆనీ బ్రహ్మదేవుడనగా స్వాహాదేవి విచారవదనముతో విట్లనెను.
స్వాహోవాచ- స్వాహాదేవి ఇట్లనెను-
ఓ బ్రహ్మదేవుడా! నేను చాలాకాలము తపస్సుచేయుచు శ్రీకృష్ణుని సేవించుచున్నాను. శ్రీకృష్ణుడు తప్ప మిగిలిన ప్రపంచమంతయు స్వప్నమువలె కరిగిపోవును. అశాశ్వతమైనది. అన్ని లోకములకు సృష్టికర్తవగు నీవు. మృత్యుంజయుడైన శంకరుడు. ఈ విశ్వమున తన పడగలపై మోయుచున్న ఆదిశేషుడు, ప్రాణులు చేయు కర్మలకు పాక్షియగు ధర్మదేవత, దేవతలందరిలో ఆదిపూజను పొందు గణపతి, ఈ ప్రపంచమునకంతయు తల్లియైన ప్రకృతి, వీరందరు ఆ శ్రీకృష్ణుని అనుగ్రహమువలననే పూజలనందుకొనుచున్నారు. అట్లే ఆ మహామహుని సేవించి ఋషులు, మునులు గౌరవింపబడుచున్నారు.
పరబ్రహ్మమునందు ఐక్యము కావలెనని నేను శ్రీకృష్ణుని పదపంకజములను ధ్యానించుచున్నాను.
తామరపువ్వు వంటి ముఖముగల స్వాహాదేవి బ్రహ్మదేవునితో నిట్లని, శ్రీకృష్ణునికై తపస్సు చేయుటకు పోయెను. ఆమె ఒంటికాలుపై నిలుచుండి లక్షసంవత్సరములు తపస్సు చేసెను. అప్పుడామె నిర్గుణ స్వరూపి, ప్రకృతీకంటే శ్రేష్టుడగు శ్రీకృష్ణుని దర్శించుకొనగలిగెను. శ్రీకృష్ణుని రూపమతీసుందరము కాన అతనిని చూడగనే కామముతో మూర్ఛనొందెను.
మూర్ఛపడివ స్వాహాదేవి మనోభావమును తెలిసికొన్న సర్వజ్ఞడు తపస్సుచే కృశించిపోయిన స్వాహాదేవిని తన ఆంకమున ఉంచుకొని ఆమెతో ఇట్లనెను.
శ్రీకృష్ణ ఉవాచ- శ్రీకృష్ణుడిట్లు పలికెను-
ఓ స్వాహాదేవీ! భావికాలమున శ్వేతవరాహ కల్పమున నీ ఆంశతో నీవు వాగ్నజితి యను పేర నా భార్యవగుదుపు. ఇప్పుడు నీవు ఆగ్నేయొక్క దాహకశక్తిగా అతని భార్యగా నుందువు. నా అనుగ్రహమువలన నీవు మంత్రాంగరూపపై పవిత్రురాలవగుదువు, అగ్నిదేవుడు నిన్ను భక్తిభావముచే గౌరవించి గృహేశ్వరీవగు నీతో రమించుము.
శ్రీకృష్ణుడు తన్ను పూజించిన స్వాహాదేవితో ఫైవిధముగా పలికి, ఆమెను ఓదార్చి ఆంతర్థానమునొందెను.
బ్రహ్మదేవుని ఆజ్ఞవలన అచ్చటకు అగ్నిదేవుడు వచ్చి స్వాహాదేవిని పామవేదముననున్న ధ్యానమంత్రములచే ధ్యానించి గౌరవించి మంత్రపూర్వకముగానామెను వివాహము చేసికొనెను.
అగ్నిదేవుడు సంపూర్ణముగా నిర్ణవమైన వనమున దివ్యమైన వర్షశతము తన భార్యతో సుఖముగానుండెను. అప్పుడామెకు గర్భమాయెను. ఆ గర్భమును స్వాహాదేవి దివ్యమైన పన్నెండు సంవత్సరములు మోసి దక్షిణ్నా. గార్హపత్యాన్ని, ఆహవనీయాన్ని ఆను ముగ్గురు పుత్రులను కనెను.
ఆప్పటినుండి ఋషులు, మునులు, బ్రాహ్మణాదు లందరు మంత్రముయొక్క చీవర స్వాహాకారమును చేసి ప్రతీదివము అగ్నియందు హవిస్సుల నొసగుచున్నారు.
మంత్రము స్వాహాకారాంతమైనచో అది ప్రశస్తమగుచున్నది. దానివలన సమస్తసిద్ధులు కలుగును.
స్వాహాకారములేని మంత్రము విషములేని సర్పమువలె వేదములు వేర్వని ద్విజూనివటి, పతిసేవ చేయని స్త్రీవలె, విద్యాగంధములేని మానవునివలె పండ్లకొమ్మలు లేని చెట్టువలె పనికిరానిది.
ద్విజులందరు సంతుష్టులై స్వాహాకారంతమైన మంత్రములనుచ్చరించుచు ఆహుతుల నివ్వసాగిరి. సమస్త యః కర్మలు స్వాహాంతమైన మంత్రములవలననే సఫలమగుచున్నవి.
ఈవిధముగా మోక్షమును సుఖమునిచ్చు స్వాహోపఖ్యానమును నీకు తెలిపితిని. ఇంకను వినవలసినదేమైన ఉన్నచో ఆడుగుము.
నారద ఉవాచ- నారదుడిట్లనెను-
అగ్నిదేవుడు స్వాహాదేవిని ఏవిధముగా స్తుతించి పూజించెను. ఆ పూజావిధానమును, ధ్యానమును, స్తోత్రమును, నాకు తెలుపుడనీ నారాయణునితో అనెను.
నారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లనెను-
నారదా! సామవేదమునందున్న స్వాహాదేవి ధ్యానమును స్తోత్రమును పూజావిధానమును సావధానముగా వినుము.
సమస్తయజ్ఞములు ప్రారంభించునపుడు సాలగ్రామమున లేక కలశమందు స్వాహాదేవిని ఆవాహనచేసి ఆరాధించి యజ్ఞమును చేయవలెను.
మంత్రసిద్ధి స్వరూపిణి, మంత్రమునకు అంగభూతమైనది, స్వయముగా సిద్ధస్వరూపము కలది, మానవులకు సిద్ధిని కలిగించునది సమస్త కర్మలయొక్క ఫలితములనిచ్చు స్వాహాదేవిని ధ్యానింతుసని ధ్యానించి మూలమంత్రముచే పాద్యాది ఉపచారములనొసగి స్తోత్రము చేయవలెను.
ఇక స్వాహాదేవియొక్క మూలమంత్రమును, స్తోత్రమును నీవు వినుమని నారదునితో అనెను.
“ఓం హ్రీం శ్రీం వహ్నిజాయాయై దేవ్యై స్వాహా" అనుమూల మంత్రముచే స్వాహాదేవిని పూజించువాడు అన్ని కోరికలను పొందును.
వహ్నిరుదాచ- అగ్నిదేవుడిట్లనెను-
స్వాహా, ఆది ప్రకృతియొక్క అంశ, మంత్రతంత్రాంగ రూపిణీ, మంత్రములయొక్క ఫలితము నొసగునది. లోకములనన్నిటిని భరించునది, సిద్ధిస్వరూప, సిద్ధ, మానవులకెల్లప్పుడు సిద్ధిని చేకూర్చునది, అగ్నియొక్క దాహిళాశక్తి, అగ్నికి ప్రాణముల కంటే ఎక్కువ ప్రియమైనది, సంసార సారరూప, భయంకరమైన సంసారమునుండి కడకు చేర్చునది, దేవతలకు ప్రాణరూపమైనది, దేవతలను పోషించునది అను స్వాహాదేవియొక్క పదహారు పేర్లను భక్తితో ప్రతిదినము పఠించినవానికి ఇహపరలోకములలో సమస్త సిద్ధులు కలుగును. అన్నిపనులలో మంచి జరుగును. పుత్రులు లేనివానికి పుత్రులు, భార్యలేనిపానికి భార్య లభించును.
ఇతి స్వావోపాఖ్యానం సమాప్తం శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణములో రెండవదైన ప్రకృతిఖండములో నారదనారాయణ సంవాదములో తెలుపబడిన స్వాహోపాఖ్యానములో స్వాహాదేవి జన్మాది వృత్తాంతమును తెలుపు నలభయ్యవ అధ్యాయము సమాప్తము.
ఏకచత్వారింశత్తమ్శోఽధ్యాయః - స్వధాదేవి జన్మ మరియు పూజావిధానం
సారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-
నారదా! నీకిప్పుడు స్వధా చరిత్రను చెప్పుదును. ఇది పితృదేవతలకు తృప్తిని కలిగించును. శ్రాద్ధఫలమును పెంపొందించును.
సృష్టిప్రారంభమున బ్రహ్మదేవుడు పితృగణమును సృష్టించెను. వారిలో నలుగురికి శరీరమున్నది. తక్కిన ముగ్గురు తేజోరూపులు. బ్రహ్మదేవుడు ఈ ఏడుగురు పితృగణమును సృష్టించి వారికి శ్రాద్ధ తర్పణపూర్వకమైన ఆహారమును సృష్టించెను.
తర్పణాంతమైన స్నానమును, శ్రాద్ధాంతమైన దేవతాపూజను, త్రికాల సంధ్యాంతమైన ఆహ్నికకర్మను బ్రాహ్మణుడు చేయవలెనని వేదములలో కలదు. త్రిసంధ్యాకాలములందు శ్రాద్దమును, తర్పణమును, బలిని, వేదపఠనమును (స్వాధ్యాయము) చేయని బ్రాహ్మణుడు విషములేని పామువంటివాడు. శ్రీహరి సేవ చేయక శ్రీహరికి పెట్టిన నైవేద్యమును తనని బ్రాహ్మణునకు చనిపోవువరకు సూతకము (ఆశవ్చము) ఉండును. అందువలన ఆతడు వైదిక కర్మలు చేయుటకు ఏమాత్రము అర్హుడు కాడు.
బ్రహ్మదేవుడు పితృదేవతల ఆహారార్థమై శ్రాద్ధ తర్పణములు సృష్టించినను, బ్రాహ్మణులు పిండములు మొదలగు వాటిని ఇచ్చుచున్నను, పితృదేవతలకవి దక్కలేదు. అందువలన పితృదేవతలందరు ఆకలితో బాధపడుచు బ్రహ్మదేవుని సభకు వెళ్ళి అక్కడ తమ బాధను విన్నవించుకొనిరి.
అప్పుడు బ్రహ్మదేవుడు సుమనోహర, రూపయౌవన సంపన్న, శరత్కాలచంద్రునివంటి కాంతిగలది, విద్య, సుగుణములు, రూపము కలది, రత్నభూషణములు కలది, పరిశుద్ధమైనది, వరములనిచ్చునది, మంచి లక్షణములు కలది ఆగు స్వధా అను కన్యను మనస్సునుండి సృష్టించెను. పద్మములవంటి పాదములు, ముఖముకల స్వధాదేవిని పితృదేవతలకు భార్యగా బ్రహ్మదేవుడిచ్చెను.
స్వధాకారంతమైన మంత్రమునుచ్చరించి పితృదేవతలకు పిండము మొదలుగువానీని ఇవ్వవలయునని బ్రహ్మదేవుడు బ్రాహ్మణులకు రహస్యముగా ఉపదేశించెను. ఆనాటినుండి బ్రాహ్మణులు పితృదేవతలకు పిండాది దానమును స్వధాకారాంతముగ చేయుచుండిరి.
దేవతలకు ఆహుతులిచ్చునపుడు మంత్రాంతమందు స్వాహాకారమును ప్రయోగించుట శ్రేష్ఠము. అట్లే పితృదేవతలకు పిండదానము చేయునపుడు స్వధాకారాంతముగా చేయుట మంచిది. దేవపితృయజ్ఞములందు దక్షిణ తప్పక ఈయవలెను. దక్షిణలేని యాగము సఫలము కాదు.
స్వధాదేవియొక్క వరమువలన దేవతలు, పితరులు, బ్రాహ్మణులు మొదలగువారందరు సంతోషమును పొందిరి.
నారదా! ఇంతవరకు నీకు స్వధాదేవి చరిత్రను చెప్పితిని. ఇంకను నీవు వినవలసినదేదైన ఉన్నచో అడుగుము. అని నారాయణుడనెను.
నారద ఉవాచ- నారదుడిట్లనెను-
శ్రీమన్నారాయణ! నాకు స్వధాదేవియొక్క పూజావిధానమును ధ్యానము, స్తోత్రపద్ధతిని వినవలెనని యున్నది. వేదార్థ విజ్ఞానవేత్తలలో శ్రేష్ఠుడా నాకు వీటిని వివరింపుము.
నారాయణ ఉవాచ: నారాయణుడిట్లనెను-
నారదా! స్వధాదేవి ధ్యానము, స్తోత్రము వేదములలో చెప్పబడినది. అది నీకు కూడ తెలియును. అయినను జ్ఞానవృద్దికై తెలిసికోదలచితివి కావున చెప్పుదును.
శరదృతువులోని ఆశ్వయుజ? కృష్ణ త్రయోదశినాడు, లేక మఖా నక్షత్రమునాడు, కానిచో శ్రాద్ధ దినమున స్వధాదేవిని, పూజించి శ్రాద్ధమునాచరింపవలెను. బ్రాహ్మణుడు అహంకారముతో శ్రాద్ధమునాడు ప్వధాదేవిని పూజింపక శ్రాద్ధమును చేసినచో అతనికి శ్రాద్ధతర్పణముల ఫలితము లభింపదు.
ఎల్లప్పుడు సుస్థిరమైన యావనము కలది, పితృదేవతలకు దేవతలకు పూజ్యారాలు, శ్రాద్ధఫలితము నొపగునది అగు బ్రహ్మమానస పుత్రికను (స్వధాదేవిని) నమస్కరించుచున్నాను.
ఈవిధముగా స్వధాదేవిని రమ్యమైన కలశమున, లేక సాలగ్రామశిలయందు ఆవాహనచేసికొని ధ్యానించి. మూలమంత్రముతో పాద్యము మొదలగు ఉపచారములను సమర్పించవలెను.
“ఓం హ్రీం శ్రీం క్లీం స్వధాదేవ్యై స్వాహా" అను మూలమంత్రముచే ఆమెను పూజించి స్తోత్రము చేసి నమస్కరింపవలెను.
బ్రహ్మపుత్రుడవగు నారదా! మానవులయొక్క సమస్త వాంఛలను తీర్చునది, బ్రహ్మదేవుడు చేసిన స్వధాస్తోత్రమును వినుము.
బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లనెను-
స్వధాశబ్దమునుచ్చరించినంత మాత్రమున మానవుడు పుణ్యతీర్థములందు స్నానముచేసిన ఫలమును పొందును. అతని సమస్త పాపములు తొలగిపోవును. వాజపేయయాగము చేసిన ఫలమును పొందును.
స్వధాస్వధా స్వధా యని మూడుమార్లు ఉచ్చరించినంతమాత్రమున శ్రాద్ధఫలితమును, సకాలమున తర్పణ చేసిన ఫలమును పొందును. శ్రాద్ధసమయమున స్వధాస్తోత్రమును విన్నవాడు నూరు శ్రాద్ధములు చేసిన పుణ్యమును పొందును. స్వధాయని మూడుమార్లు ప్రతిదినము పఠించినచో భార్యారహితుడు మంచిభార్యను పొందును.
నీవు పితృదేవతలకు ప్రాణముతో సమానురాలవు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు ప్రాణమువంటిదానివి. శ్రాద్దమునకు ఆధిష్టాన దేవతవు. శ్రాద్ధాదుల ఫలితము నొసగుదాన వు. పితృదేవతలకు సంతోషమునకై ద్విజులుల సంప్రీతికై గృహస్థుల అభివృద్ధికి నీవు బయటకు రమ్ము. నీవు నీత్యపు, నీత్యస్వరూపవు, సుగుణరూపిణి. సృష్టిలయములందు నీవు ప్రత్యక్షమగుదువు, మాయమగుదువు, .
నీవు వేదములందు ఓంకార రూపిణివిగా, నమ:, స్వస్తి, స్వాహా, స్వధా, దక్షిణా స్వరూపములలో కీర్తింపబడినావు, ఆట్లే నీవు పూర్వకాలము గోలోకమున రాధాదేవి ప్రియసఖియైన "స్వధా" అను గోపికపు. శ్రీకృష్ణుడు నిన్ను స్వక్షస్థలమున ధరించినందువలన "స్వధా" అను పేరు పొందితివి. అట్లే నీవు శ్రీకృష్ణుని వక్షస్థలమున ఉండగా రాధాదేవిచూచి శపించినందువలన నీవు భూలోకమునకు వచ్చితివి. నీవు శ్రీకృష్ణుని ఆలింగనము చేసికొన్న పుణ్యమువలన నాకు మానసపుత్రికగా జన్మించితివి. నీకు "స్వాహా" యను పేరుకూడ కలదు. శ్రీకృష్ణునితో రతిసమయమున స్వయముగా (ఆహా) జనీనందున నీకు "స్వాహా” యను పేరు కల్గినది.
రాసమండలమున శ్రీకృష్ణునితో కలిసి మైమరచి నిద్రించుచుండగా రాధాదేవీ చూచి శపించగా భూలోకమునకు చేరితీవి. శ్రీకృష్ణుని ఆలింగనము చేసికొన్న పుణ్యమువలన అగ్నికి భార్యవైతివి. 'స్వాహాదేవి' రూపముననుండు నీవు మిక్కిలి పవిత్రమైనదానవు, పూనపులు, దేవతలచే పూజింపబడితివి. నీ నామోచ్చారణచేసినంత మాత్రముననే మాసపులు చేసిన సమస్తపాపములు తొలగిపోవును.
రాధాదేవి ప్రియసఖియగు సుశీలయను గోపిక శ్రీకృష్ణుని ఆలింగనము చేసికొని అతని దక్షిణభాగమునమన్నందువలన ఆమె దక్షిణయైనది. అట్లే రతికార్యమున దక్షురాలు కొవున ఆమె దక్షిణమైనది.
ఈవిధముగా శ్రీకృష్ణపరమాత్మయొక్క ఇచ్ఛవలన మానవుల కర్మలను పూర్తిచేయుటకు "స్వధా", "స్వాహా "దక్షిణా" అను ముగ్గురు గోపికలు భూలోకమున జన్మించిది.
బ్రహ్మదేవుడు దేవతలతో పితృగణముతో ఈవిధముగా పల్కుచున్నప్పుడే స్వధాదేవి అక్కడ ఆవిర్భవించెను. ఆమెను బ్రహ్మదేవుడు పితృదేవతల కొసగగా వారు సంతోషముతో వెళ్ళిపోయిరి.
ఈ స్వధాస్తోత్రమును శ్రద్ధతో చదివినవారు సమస్త తీర్థములలో స్నానము చేసిన ఫలితమును, వేదాధ్యయనము చేసిన ఫలమును తప్పక పొందుదురు.
ఇతి స్వధోపాఖ్యానం
శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతిఖండమున నారదనారాయణుల సంహాదసమయమున తెల్పబడిన స్వధాచరీత్రయందు స్వధాదేవి ఉత్పత్తి పూజాదికములు కల నలభైయొకటవ అధ్యాయము సమాప్తము.
.
Summary of chapter 40 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
This grand chapter describes the heroic cosmic event of Samudra Manthana, where the Devas and Asuras united to churn the ocean of milk under the direct guidance of Lord Śrī Vishṇu, who assumed the divine Kurma Avatāra to support the sinking mountain upon His back. As the ocean churned, numerous divine treasures emerged, including the deadly Kālakūṭa poison absorbed by Lord Śiva, the divine wish-fulfilling tree, the celestial elephant, and the horse Uchchaiḥśravas. Finally, Goddess Lakshmī manifested from the glowing waves in radiant splendour, holding a garland of lotus flowers, and willingly chose Lord Śrī Nārāyaṇa as Her eternal consort amidst the joyful chants of all celestial beings.