బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

39 – లక్ష్మీదేవి యొక్క పూజావిధానము

నారద ఉవాచ- నారదుడిట్లు నారాయణునితో ననెను-

మీ అనుగ్రహమువలన శ్రీహరి గుణకీర్తనము, లక్ష్మీదేవియొక్క ఉపాఖ్యానమును వినగలిగితిని. ఇక నాకు లక్ష్మీదేవియొక్క ధ్యానము స్తోత్రాదికమును తెలుపుడు.

పూర్వకాలమున ఆ దేవి శ్రీహరిచే ఆ తరువాత బ్రహ్మ మొదలగువారిచే, ఆ తరువాత రాజ్యభ్రష్టుడైన మహేంద్రువిచే దేవతా సమూహముచే పూజింపబడినట్లు తెలుసుకొంటిని.

ఆ దేవి  ఎట్టి ధ్యానమంత్రముచే పూజింపబడినది? వారు ఏ పద్దతిలో ఆమెను పూజించిరి? ఏ పోత్రముచే ఆమెను స్తుతించిరో ఆ విషయములనన్నిటిని నాకు వీపరింపుడని నారాయణుని ఆడిగెను.

శ్రీ నారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లనెను-

పూర్వము ఇంద్రుడు పుణ్యతీర్థమున స్నానముచేసి ఉతికిన వస్త్రములను ధరించి క్షీరసముద్ర తీరమున కలశమును స్థాపించెను. తరువాత గణపతిని, సూర్యుని, అగ్నిని, విష్ణుమూర్తిని, శివుని, దుర్గాదేవి అను ఆరు దేవతలను పుప్పుగంధాదులచే ఆర్చవ చేసి కలశమున పరమైశ్వర్య స్వరూపిణియగు మహాలక్ష్మిని ఆవాహనచేసి పూజ చేసెను. అచ్చట దేవతలు, మునులు, బ్రాహ్మణులు, బృహస్పతి బ్రహ్మదేవుడు, శివుడు ఉండిరి. వారి ముందు పారిజాత పుష్పమును చందనముతో అద్ది దానిని మహాలక్ష్మీదేవికి సమర్పించెను. తరువాత శ్రీహరి బ్రహ్మదేవునకుపదేశించిన సామవేదమందలి ధ్యానశ్లోకములతో ఆ మహాలక్ష్మిని ధ్యానించెను. ఆ మహాలక్ష్మీ ధ్యానమును నీకు వినిపింతును శ్రద్ధగా వినుము.

శ్రీ మహాలక్ష్మి సహస్ర దళములుగల పద్మముయొక్క కర్ణికయందు నివసించును. శరత్కాలమందలి కోటి పున్నమిచంద్రుల కాంతితో గొప్పనైన తన తేజస్సుతో ప్రకాశించును. ఆమె మిక్కిలి ఆందముగలది. మనోహరముగా నుండునదీ. బంగారువంటి శరీరము కలది. ఆనేక రత్నాభరణములను ధరించును. పీతాంబరమును ధరించి, చిరునవ్వులో భక్తులకు సమస్త సంపదలను ఇచ్చును. సుస్థిరమైన యావసముగల ఆ మహాలక్ష్మిని సేవింతును.

పై మహాలక్ష్మీ ధ్యానములో ఆమెను ధ్యానించి బ్రహ్మదేవుడు చెప్పినట్లు ఆమెను పూజించి దుర్లభమైనవి, స్థమైనవి ఆగు షోడశోపచారములను ప్రత్యేకమైన మంత్రములతో శాప్రపద్ధతిగా సమర్పించెను.

ఆసన మంత్రము-

ఓ మహాలక్ష్మి! అమూల్యమైన రత్నములచే విశ్వకర్మ నిర్మించిన విచిత్రమైన ఈ ఆసనమును స్వీకరింపుము.

గంగాజల మంత్రము (అర్ష్య) -

పాపములను ఇద్మములను అగ్నివలె కాల్చునది, పరిశుద్ధమైనది, అందరిచే నమస్కరింపబడినది, ఇష్టమైనది. అగు ఈ గంగోదకమును నీవు స్వీకరింపుము.

శంఖజల మంత్రము (పాద్య)-

ఓ పద్మవాసిని! పువ్వులు, చందనము, గరిక మొదలైన వస్తువులు కల గంగాజలము శంఖమున నున్నది. ఇది మిక్కిలి పరిశుద్ధమైనది. ఈ శంఖజిలమును నీవు స్వీకరింపుము. ఆమలకీ జలమంత్రము-

ఓ శ్రీహరిప్రియా! శరీర సౌందర్యమును పెంచునది, సువాసనా భరితమైన తైలముగల ఉసిరిక ముద్దగల నీటిని నీకు సమర్పించుచున్నాను.

ధూపమంత్రము-

ఓ శ్రీకృష్ణకాంతా! చెట్ల యొక్క సారమనదగు జిగురునకు సుగంధద్రవ్యములు చేర్చబడినవి. పవిత్రము, సువాసనా భరితమైన ధూపమును నీవు స్వీకరింపుము. చందనమంత్రము-

ఓ మహాలక్ష్మి! ఈ చందనము మలయపర్వతమున పుట్టిన వృక్షములయొక్క సారరూపమైనది. పరమ సుగంధభరితము, సుఖమును, ఆహ్లాదమునిచ్చు ఈ చందనమును నీకు సమర్పించుచున్నాను.

దీపమంత్రము-

ఓ పరమేశ్వరి! ప్రపంచమునకంతయు కంటివంటిది, చీకటిని పారద్రోలునది, శుద్ధమైన ఈ దీపమును నీకు సమర్పించుచున్నాను.

నైవేద్యమంత్రము-

ఓ దేవి అనేక రసములు కలది, మిక్కిలి రుచికలది, అనేక ఉపాహార రూపములతో నున్న ఈ నైవేద్యమును స్వీకరింపుము, అట్లే బ్రహ్మస్వరూపము, ప్రాణములను నిలుపునది, తుష్టిని, పుష్టిని కలిగించునది, మధురమైనది అగు ఈ అన్నమును నీకు నివేదించుచున్నాను. అట్లే బాగుగా వండిన అన్నము, చక్కర, ఆవుపాలు కలిసినది ఇది మిక్కిలి రుచికలది, కంటికి ఇంపైనది. ఈ పరమాన్నమును నీవు స్వీకరింపుము. ఆవుపాలు చక్కర కలిపి వండిన ఈ స్వస్తికమను దానిని నీవు స్వీకరింపుము. బాగుగా పండినవి, అందమైనవి, మంచి రుచిగల రసముకల ఈ అనేక విధములైన పండ్లను నీవు ఆస్వాదింపుము.

క్షీరమంత్రము-

అచ్యుతునకు ప్రియురాలవగు ఓ దేవీ! సురభి స్తనములనుండి తీయబడినదీ, మంచీరుచికలది. మనోహరమైనది, మానవులకు అమృతమువంటిదగు ఈ ఆవుపాలను నీవు స్వీకరింపుము.

గుడమంత్రము-

ఓ దేవి చెరుకునుండి పుట్టిన మధురరసమును అగ్ని పక్వము చేయగా నేర్పడిన గుడమును, పక్వముచేయని ఇక్షురసమును నీవు ఆరగింపుము.

మిష్టాన్న మంత్రము-

యవలు, గోధుమపిండితో సిద్ధముచేయబడినది, బాగుగా పక్వమైన గుడము, ఆవుపాలు కల మిష్టాన్నమును స్వీకరింపుము.

పిష్టక మంత్రము-

బియ్యపుపిండి స్వస్తికము కలిపి సిద్ధము చేయబడిన ఈ పిండిని ఓ దేవి నీవు గైకొనము.

ఇక్షుమంత్రము-

ఈ చెరుకు భూమిలోనుండు ఒక వృక్షము. దీనివలన బెల్లము మొదలగు అనేకవిధ ద్రవ్యములు ఉత్పత్తియగును. ఇది మంచి రుచిగల రసముకలది. ఆట్టి. ఈ చేరుకును స్వీకరింపుము.

వ్యజన మంత్రము-

ఓ దేవి ఎండకాలమున మిక్కిలి సుఖమును కలిగించునది, చల్లని వాయువు విచ్చునది, తెల్లని చమరీమృగముల తోకల కుచ్చులచే నిర్మితము అగు వ్యజనమును (చామరమును) స్వీకరింపుము.

తాంబూల మంత్రము -

ఓ మహాలక్ష్మి! ఈ తాంబూలము కర్పూరము మొదలగు ద్రవ్యములు కలది. నాలుకను ఉత్తేజపరచును. ఇట్టి తాంబూలమును నీకు అర్పించుచున్నాను.

జల మంత్రము -

ఓ లక్ష్మీదేవి! దప్పిని పోగొట్టునది, ప్రపంచములోని జీవులు జీవించు కారణమైనది, చల్లనిది, మంచి వాసన కలదియగు ఈ జలమును వీపు స్వీకరింపుము.

వస్త్రమంత్రము-

అమ్మా నేను సమర్పించుచున్న వస్త్రమును స్వీకరింపుము. ఇది దేహమునకు అందమును తెచ్చును. శోభను పెంచుచుండును. దీనిని పత్తితోగాని, పట్టుపురుగులలోగాని చేయుదురు. అట్టి వస్త్రమును స్వీకరింపుము.

భూషణమంత్రము-

రత్నములు బంగారము కలిపి నిర్మింపబడినది, శరీర సౌఖ్యమును, శరీరమునకు శోభను కలిగించునది ఆగు భూషణమును స్వీకరింపుము.

మాల్యమంత్రము-

ఆమ్మా! అనేక విధములైన పుష్పములు కలది, చక్కని శోభను కలిగించునది, దేవతలకందరకు ప్రియమైనది ఆగు ఈ పుష్పమాలను నీకు ఆర్పంచుచున్నాను. గంధమంత్రము-

ఓ దేవి! సమస్త మంగళవష్ణుపులలో శ్రేష్ఠమైనది. పరమ శుద్ధమైనది, రమ్యమైనది, గంధపు చెక్కనుండి ఏర్పడిన ఈ గంధమును స్వీకరింపుము.

ఆచమనీయ మంత్రము-

శ్రీకృష్ణ కాంతవగు లక్ష్మీదేవికి పవిత్రమైన తీర్థములకు చెందిన ఉదకమిది. ఇది చాల పరిశుద్ధమైనది. ఇతరులను కూడ పవిత్రము చేయునది. ఇట్టి ఆచమనీయమును వీపు స్వీకరింపుము.

శయ్యా మంత్రము-

మంచి విలువగల రత్నములు, పువ్వులు, చందనము, రత్నాలంకారములు కల ఈ శయ్యను స్వీకరింపుము.

ఓ మహాలక్ష్మి! ఈ భూమిలో అరుదుగా దొరుకునది, చాలా విచిత్రమైనది. రాజులు, ధనవంతులు మాత్రము అనుభవించునదియగు ద్రవ్యమును నీకు సమర్పింతును.

దేవేంద్రుడు పై ద్రవ్యములనన్నిటిని మూలమంత్రముచే మహాలక్ష్మికి సమర్పించి వీధి విధానమున మూలమంత్రమును పదిలక్షలమార్లు భక్తితో జపించెను. పదిలక్షల జపమువలన మంత్రసిద్ధి అతనికి జరిగెను. కల్పవృక్షమువలె అన్నికోరికలు తీర్చు ఈ మంత్రరాజమును బ్రహ్మదేవుడు దేవేంద్రునకుపదేశించెను.

లక్ష్మీ బీజమగు శ్రీం, మాయా బీజమంత్రమగు హీర, కామబీజాక్షరమగు క్లీం, సరస్వతీ బీజాక్షరమగు ఐం తరువాత చతుర్థి విభక్యంతమైన కమలవాసినీ అనుపదము చివరకు స్వాహా అను పదముగల ద్వాదశాక్షరమంత్రము వైదికమైనది.

శ్రీం హ్రీం క్లీం, ఐం కమలవాసిన్యై స్వాహా అను మంత్రమును జపించి కుబేరుడు సమ సైశ్వర్యమును పొందెను. రాజరాజేశ్వరుడు, దక్షుడు, సావర్ణిమనువు, మంగళుడు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు వీరందరు సిద్ధిపొందిరి. దేవేంద్రుడు మహాలక్ష్మీ మంత్రమును సిద్ధిపొందగనే మహాలక్ష్మి అతనికి దర్శనమొసగును.

శ్రీమహాలక్ష్మి విలువగల రత్నములు గల విమానములో కూర్చొని ఏడు ద్వీపములుగల భూమిని తన శరీర కాంతితో కప్పుచు ప్రత్యక్షమైనదీ. ఆ దేవి వరముల నొసగునది. తెల్లనీ చంపకపుష్పము వంటి శరీరకొంతీగలది, రత్నభూషణములు అలంకరించుకొనినది, చిరునవ్వుగల ముఖముతో, భక్తులననుగ్రహించు ఆ మహాలక్ష్మి చేతిలో రత్నముల మాలను ధరించును.

కోటి చంద్రుల కాంతిగల, జగములకన్నిటికి తల్లియగు ఆ మాతను ఇంద్రుడు దర్శించుకొని తన అవయవములు పులకించగా, కన్నీళ్ళు కారగా నమస్కరించెను. ఆ తరువాత సమస్తమైన కోరికలను తీర్చునది, వైదీకమును. బ్రహ్మదేవునిచే ఉపదేశింపబడినది అగు మహాలక్ష్మీ స్తోత్రముచే ఆ దేవిని స్తుతించెను.

ఇంద్ర ఉవాచ- ఇంద్రుడు మహాలక్ష్మితో ఇట్లనెను-

కమలవాసిని, నారాయణునకు ప్రియురాలు, శ్రీకృష్ణుని భార్య, పద్మ, తామరరేకులవంటి కన్నులు కలదీ, తామరవంటి. ముఖము కలది, పద్మమున నీవసించునది, పద్మిని, వైష్ణవి, సమస్తసంపదల స్వరూపము కలది. అన్ని కోరికలను తీర్చునది, సుఖమును, సిద్ధిని, మోక్షమునిచ్చునది, హరిభక్తిని, ఆనందమును ఒసగునది, శ్రీకృష్ణుని కాంతీకలది, రత్నాలంకారములచే అలంకరించబడినది, సంపదలకన్నిటికి అధిదేవత, మహాదేవి, సస్యములకు అధిష్టాన దేవత సస్యలక్ష్మి, బుద్ధిరూప, బుద్ధి నొసంగునది యగు మహాలక్ష్మికి అనేక నమస్కారములు.

నీవు వైకుంఠమున మహాలక్ష్మిగను, పాలసముద్రమున లక్ష్మిగాను, అమరావతిలో స్వర్గలక్ష్మిగను, రాజుల దగ్గర రాజలక్ష్మిగాను. గృహస్థుల దగ్గర గృహలక్ష్మిగాను వారి ఇండ్లలో గృహదేవతగాను, గోవులకు మాతయగు సురభిగాను, యజ్ఞ దేవతకు భార్యవైన దక్షిణగా ప్రసిద్ధిని పొందుచున్నావు.

నీవు దేవమాతయగు అదితివి, కమలాలయమున కమలవు. నీవు విష్ణుస్వరూపగాను నారాయణుపై భక్తి కలదిగాను, కోపము హింస లేనిది. వరములిచ్చునది. ఇంపైన ముఖము కలది, పరమార్థమును హరి దాస్యమును ఇచ్చునదిగా కీర్తిచెందితివి.

ఓ దేవి! నీవు లేనిచో ఈ ప్రపంచమంతయు భస్మమైనట్లు సారరహితముగా, జీవించియున్నను మృతమైనట్లు శవమువలె తేజోహీనముగా కనిపించును. నీవు అందరికీ పరదేవతవు. సమస్తబాంధవ స్వరూపిణివి, నీవు లేనిచో బంధువులు ఒకరికొకకరు మాటాడుకొనరు. నీవులేనిచో మానవుడు బంధువులు లేనివాడే. నీవున్నచో అతనికి నిజముగా బంధువులు లేకున్నను, ఏదోఒక విధముగా మానవులు బంధుత్వమును నెరపుదురు. ధర్మ, అర్థ, కామ, మోక్షములనే చతుర్వర్గములకు నీవే కారణమగుచున్నావు. పసితనమున స్తనంధయులగు శిశువులను తల్లి ఏవిధముగా లాలించి పాలించునో అట్లే సమస్త విశ్వములను నీవు. ఎల్లప్పుడు లాలించి పాలించుచున్నావు.

చంటిపిల్ల వానికి తల్లిలేకపోయినను అదృష్టమువలన ఆ శిశువు బ్రతుకవచ్చును. కాని నీవు లేనిచో జనము అసలు బ్రతుకలేదు. అమ్మా! నీవు సుప్రసన్నవగునీవు నాకు ప్రసన్నురాలవు కమ్ము, శత్రువు లాక్రమించుకొనిన నా రాజ్యమును నీ అనుగ్రహము వలన పొందునట్లు చేయుము.

శ్రీహరికి ప్రియురాలనైన ఓ తల్లీ నీవు లేనందువలన మేము ఆదుకోనుపోరులేక భిక్షుకులమైతిమి. సమస్త సంపదలను కోల్పోతిమి. అందువలన ఓ తల్లీ! నాకు రాజ్యమును, లక్ష్మిని, బలమును, కీర్తిని, ధనమును, కోరికను, తెలివిని, భోగములను, జ్ఞానమును, ధర్మమును, సమస్త సౌభాగ్యములను, సమస్త ఆధికారములను, పరాక్రమమును, రణరంగమున జయమును, పరమైశ్వర్యమును ఒసగుమని దేవేంద్రుడు మహాలక్ష్మిని కోరెను.

మహేంద్రుడు పైన చెప్పినట్లు మహాలక్ష్మికి దేవతలందరితో కలిసి కన్నీళ్ళు పెట్టుకొని ఆనేకమార్లు నమస్కారము చేసెను. బ్రహ్మ, శంకరుడు, ఆదిశేషుడు మొదలగు దేవతలందరు దేవేంద్రుని రక్షింపుమని అనేకమార్లు కోరిరి.

శ్రీమహాలక్ష్మి దేవతలకు వారు కోరిన వరమునిచ్చి ఆ దేవతల సమక్షముననే మనోహరమైన పుష్పమాలను కేశవుని మెడలో వేసెను.

దేవతలందరు సంతోషముతో తమ తమ ఇండ్లకు పోగా మహాలక్ష్మి శేషశాయియైన కేశవుని వక్షఃస్థలమునలంకరించినది.

బ్రహ్మ, పరమశివుడు దేవతలకు శుభాశీస్సులను సంతోషముతో నొసగి తమ తమ స్థానములకు చేరుకొనిరి.

ఈ మహాలక్ష్మీ స్తోత్రమును మూడు సంధ్యలలో చదువువాడు కుబేరునితో సమముగా ధనవంతుడు, చక్రవర్తి అగును.

ఐదులక్షలమార్లు ఈ స్తోత్రమును జపించినచో మంత్రసిద్ధి జరుగును. ఆ విధముగా సిద్ధించిన స్తోత్రమును పఠించువాడు కల్పవృక్షమువలె ఇతరులకు కోరినవన్నియు ఇచ్చును.

మంత్రసిద్ధిని పొంది ఈ స్తోత్రమును ఒక నెలవరకు దీక్షతో పఠించినవాడు రాజేంద్రుడై ఆనేక సుఖములను పొందును.

నారద ఉవాచ- నారదుడిట్లనెను-

ఇంతకు ముందు మీరు దుర్వాసుడు ఇచ్చిన పుష్పము ఎవరి శిరస్సుపై నుండునో అతనికి అందరికంటే ముందు పూజ జరుగునని చెప్పితీరి.

ఆ పుష్పమునే ఇంద్రుడు ఏనుగు శిరస్సుపై నుంచినందువలన మదించిన ఆ ఏనుగు అడవిలోకి వెళ్ళగా దానివలననే గణేశుడు పుట్టినట్లు చెప్పితిరి. అట్లే పూర్వము శనిదృష్టి గణపతిపై పడినందువలన ఆతని శిరస్సును ఖండించినపుడు శ్రీహరి స్వయముగా ఏనుగు శిరస్సును గణపతి కతికించినట్లును చెప్పితిరి.

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణము కానీ ఇప్పుడు దేవేంద్రుడు దేవతలతో కలిసి దేవషట్కమునగణపతిని మొదలు పూజించి మహాలక్ష్మిని పూజించినట్లు చెప్పితిరి.

పురాణము చెప్పువారిమాటలు గజిబిజిగా అర్థము కాకుండనున్నవి.

అందువల్ల దీనిని స్పష్టముగా నాకు వివరింపుడని నారాయణుని ప్రార్థించెను. శ్రీనారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లు పలికెను-

నారదా! దుర్వాసుడు దేవేంద్రుని శపించినపుడు గణపతి పుట్టనేలేదు. అందువలన పూబొకాలమున ఆ గణపతికి అగ్రపూజయనునది జరుగలేదు.

ఇక దుర్వాసమహాముని శాపమువలన దేవతలు రాజ్యభ్రష్టులై చాలాకాలము దు:ఖించుచు తిరిగి చివరకు శ్రీహరి అనుగ్రహమువలన రాజ్యలక్ష్మిని పొందిరి.

శ్రీలక్ష్ముపాఖ్యానం సమాప్తం శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతిఖండమున నారద నారాయణ సంవాదమున లక్ష్మీపూజా విధానమను ముప్పై తొమ్మిదవ యధ్యాయము సమాప్తము.