నారద ఉవాచ- నారదమహర్షి ఇట్లు పలికెను-
శ్రీమన్నారాయణమూర్తీ! నీ అనుగ్రహమువలన మనోజ్ఞమైన పృథివీ ఉపాఖ్యానమును వింటిని. ప్రస్తుతము మీరు వాకు గంగోపాఖ్యానమును వివరింపుడు. భారతీదేవియొక్క శాపమువలన సురేశ్వరియైన గంగాదేవి విష్ణుస్వరూపయైనను భారతక్షేత్రమునకు వచ్చెనని తెలిపితిరి. విష్ణుపదీయైన ఆ గంగాదేవిని భూమిపైకి ఎవరు ఏయుగమున తీసికొనివచ్చిరీ, పాపములను తొలగించునది పుణ్యములు కలిగించునది యగు ఆ వృత్తాంతమునంతయు నాకు వివరించి చెప్పగలరు.
నారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లు పలికెను-
నారదా! సూర్యవంశములో సగరుడను చక్రవర్తి కలడు. అతనికి వైదర్భీ, శైబ్య అను ఇద్దరు భార్యలు కలరు. సత్యమునే మాట్లాడు స్వభావము, సత్యమైన విషయములనే భావించువాడు, సత్యయుగమున పుట్టిన ఆ చక్రవర్తికి శైబ్యయమ భార్యయందు వంశవర్థనుడైన అసమంజసుడను పుత్రుడు కలిగెను. అందువలన సంతానములేని వైదరీ పుత్రసంతానము కావలెనని శంకరుని ఆరాధించినది. శివుని యొక్క వరమువలన ఆమె గర్భము ధరించినది. కాని నూరు సంవత్సరములవరకు ఆమె గర్భమట్లే ఉండెను. చివరకు నూరు సంవత్సరములు నిండిన తరువాత ఆమె ఒక మాంసము ముడ్డకు జన్మనిచ్చినందువలన ఆమె శివుని ధ్యానించుచు పెద్దగా ఏడ్వసాగెను. అప్పుడు శివుడు బ్రాహ్మణవేషధారియై అచ్చటకు వచ్చి ఆ పిండమును అరువదివేల తునకలుగా చేసి వాటికి జీవమును ప్రసాదించెను. ఆ ఆరువదివేల పుత్రులు మహాబలపరాక్రములు, మధ్యాహ్న సూర్యుని వంటి కాంతిగలవారు. కానీ ఒకప్పుడు కపిలమహర్షిని అవమానించి. ఆతని కోపాగ్నివలన ఆందరు బూడిదగా మారిరి. సగరుడు ఆతని పుత్రులు చనిపోయిన వృత్తాంతమును విని శోకముచే మరణమును పొందెను.
గంగానదిని భూమికి తెచ్చి తన తమ్ములను పాపవిముక్తులుగా చేయవలెనని ఆసమంజసుడు లక్షసంవత్సరములు తపస్సు చేసి కాలవశాత్తు చనిపోయెను. అతని పుత్రుడైన దిలీపుడు కూడ లక్షసంవత్సరములు గంగకొరకు తపస్సు చేసి లోకాంతరగతుడయ్యెను. తరువాత అంశుమంతుడనే దిలీపరాజు పుత్రుడు కూడ గంగకొరకు లక్షసంవత్సరములు తపస్సు చేసి కాలమునిండి చనిపోయెను.
దిలీప మహారాజు పుత్రుడు భగీరథుడు. అతడు గొప్ప విష్ణుభక్తుడు, విద్వాంసుడు. ఆ భగీరథుడు గంగను భూమికి తీసికొని రావలెనని లక్షవర్షములు తపస్సు చేయగా కోటి సూర్యులకాంతి కలవాడు, రెండు భుజములు కలవాడు, చేతిలో మురళిని ధరించినవాడు గొల్లవాని వేషమున నున్న కిశోరమూర్తి పరబ్రహ్మ స్వరూపుడు, బ్రహ్మాది దేవతలచే సేవింపబడినవాడు, భక్తులననుగ్రహించువాడు, బంగారు పన్నెగల వస్త్రము ధరించినవాడు, రత్న భూషణములు ధరించినవాడగు శ్రీకృష్ణుడు దర్శనమొసగెను.
ఆ పరాత్పరుని చూచి మహాభాగవతుడైన భగీరథుడు పువఃపునః నమస్కారములొనర్చి తన పూర్వీకులను తరింపజేయువరమును పొందెను.
ఆపరమాత్ముని స్మరించగానే గంగాదేవి అచ్చటకు వచ్చి చేతులు జోడించి నమస్కరించి నిలుచుండెను. అప్పుడు శ్రీకృష్ణుడు తనను ప్రోత్రము చేయుచు పులకించిపోయిన గంగాదేవిని చూచి ఇట్లనెను.
శ్రీకృష్ణ ఉవాచ- శ్రీకృష్ణుడిట్లనెను-
ఓ గంగాదేవి! సరస్వతి దేవి యొక్క శాపముననుసరించి వీపు భారత క్షేత్రమునకు వెంటనే వెళ్ళి సాగరుని యొక్క పుత్రులనందరను పవిత్రము చేయుము. వారందరు నీ స్వర్శవలన నీ వాయువు వలన పవిత్రులై దివ్యములైన శరీరరముల ధరించి దివ్యస్యందనములనధిరోహించి నాలోకమునకు వచ్చి ఎల్లప్పుడు నాకు అనుచరులుగానుందురు.
గంగయొక్క స్పర్శవలన గాలివలన భారతభూమీలోనున్న ప్రజలు తమ పూర్వ పూర్వజన్మలలో చేసికొన్న కర్మభోగమును పోగొట్టుకొని పాపములనన్నిటిని విడనాడుదురని వేదములలో చెప్పబడినది.
గంగాదేవి దర్శనముకంటె స్పర్శనము (స్నానం చేయుట) పదిరెట్లు ఎక్కువ పుణ్యము నిచ్చును. సామాన్య దినమున మౌసలస్నానము చేసినచో (రోకలివలె మునిగినను) కోటిజన్మలలో చేసికొన్న పాపము నశించునని వేదములందు చెప్పబడినది. నానాజన్మలలో చేసికొన్న బ్రహ్మహత్యాది పాపములన్నియు మౌసల స్నానమువలన నశించును. ఇక పుణ్యదినమున గంగలో స్నానము చేసినచో కలుగు ఫలితమును వేదములు కూడా చెప్పలేవు.
కొందరు నీయందు స్నానము చేసిన ఫలితమీవిధముగా నుండునని చెప్పుచున్నారు. కాని బ్రహ్మాది దేవతలు సహితము సీస్నానఫలమును తెలియజాలరు.
ఓ సుందరి! సామాన్య దినములలో చేయు స్నానఫలమీవిధముగా నున్నది. సామాన్య దీవసములందు స్నానము చేసిన మౌసల స్నానము కంటే పదిరెట్లు ఎక్కువ ఫలితము కలుగును. సూర్య సంక్రమణమున స్నానము చేసినచో సామాన్య దీవసస్నానము కంటె ముప్పది రెట్లెక్కువ ఫలితము చేకూరును. ఆమావాస్యనాడు చేసిన స్నానము సూర్యసంక్రమణస్నానమువంటి ఫలితమునొసగును. దక్షిణాయన పుణ్యకాలమున స్నానము చేసినచో సూర్యసంక్రమణ స్నానఫలము కంటే రెట్టింపు ఫలితమును పొందుదురు. ఉత్తరాయణ కాలమున స్నానము చేసినచో దక్షిణాయన పుణ్యకాల ఫలితము కంటే పదిరెట్లు ఎక్కువ ఫలితము పొందుదురు. చాతుర్మాస్యకాలమందలి పూర్ణిమనాడు గంగాస్నానము చేసినచో అనంతపుణ్యము కలుగును. ఆక్షతదీయనాడు గంగాస్నానము చేసినచో కలుగు ఫలితమెంతటిదో వేదములు సైతము చెప్పలేకపోయినవి. మన్వంతర కాలమున, సంవత్సరాది సమయమున చేసిన స్నానము వందరెట్లెక్కువ ఫలితమునిచ్చును. మాఘశుద్ధసప్తమినాడు, భీష్మాష్టమినాడు, అశోకాష్టమినాడు, శ్రీరామనవమినాడు గంగాస్నానము చేసినచో గొప్ప ఫలితమునిచ్చును. 'నందా' నాడు చేసిన గంగాస్నానము పైవాటికంటే రెండు రెట్లెక్కువ ఫలమునిచ్చును. దశపాపహరమైన విజయదశమినాడు గంగాస్నానము చేసినచో చాలా గొప్పఫలము లభించును. చంద్రసూర్యగ్రహణ కాలమున, ఆర్థోదయ కాలమున గంగాస్నానము చేసిన అనంతఫలము లభించును.
కాని విష్ణుభక్తులగు వైష్ణవులు మాత్రము ఈ ఫలితము నాశించరు.
శ్రీవైష్ణవులు ఏ. ఫలితము నాశించరు. వారు చేయు కర్మలన్నియు నా ప్రీతికై చేయుదురు. వారు నా భక్తిని మాత్రమాశింతురు. అట్టి వైష్ణవులు జీవన్ముక్తులు. గురుముఖమునుండి విష్ణుమంత్రము ఎవరి చెవినబడునో ఆ వైష్ణవుని జీవన్ముక్తుడనీ వేదములు ఘోషించుచున్నవి. అతడు తనకంటే నూరు తరములు పూర్వులను, నూరు తరములు తరువాతి వారిని, ఆట్లే తల్లి పక్షముపారీని, తల్లిని, అమ్మమ్మను, చెల్లెలిని, సోదరుని, మేనల్లుని, మేనమామను, జ్ఞానమిచ్చు గురువును, స్నేహితుని, అతని పరివారమునంతయు విష్ణుమంత్రమును గ్రహించినంతమాత్రమున ఉద్ధరించును. ఆతడు జీవన్ముక్తుడు కూడ ఆగును.
శ్రీవైష్ణవుల యొక్క స్పర్శవలన ఈ భూమి పవిత్రమగుచున్నది. వారి పాదధూళి సైతము. ఈ భూమిని పవిత్రము చేయుచున్నది. వారి పాదోదకము కూడ ఈ భూమినీ తీర్థస్థానముగా చేయుచున్నది. విష్ణుమూర్తికి నివేదించని అన్నము మలమువంటిది. నీరు మూత్రము వంటిది. అందువలన వైష్ణవులు ఆనివేదితాన్నమునప్పుడు భుజింపరు. విష్ణుమూర్తి యొక్క పాదోదకమును స్వీకరించినచో వారి పాపములన్నియు గరుత్మంతుని చూచిన సర్పములవలె పరుగెత్తిపోవును. ఆ విష్ణుభక్తులు దర్శనము వల్లనే ఈలోకములన్నీ పవిత్రమగుచున్నవి.
శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శన చక్రము వారినప్పుడు రక్షించును. నాగుణములను వినుటవలన గగుర్పొడిచిన శరీరము కలవారై, గద్గద కంఠముతో కన్నీళ్ళు ప్రవీంచుచు ఉన్నమాసపులు నోములు, వారికి నాపై మిక్కుటమైన ప్రేమయుండును. వారి సర్వస్వమును నాకర్పించి, భక్తి భావనతో ఉందురు. అట్లే ఈ సమస్త ప్రపంచము నావలననే సృష్టింపబడినదనియు, తిరిగి నాలోనే విలీనమగుననియు భావింతురు.
ఈవిధముగా శ్రీమన్నారాయణుడు , గంగాదేవితో చెప్పగా ఆమె భక్తిచే వంగిన శిరస్సు కలదై ఇట్లు పలికెను.
జగన్నాథ! భారతీదేవి శాపమును, నీ ఆజ్ఞను, ఈభగీరథుని తపస్పుననుసరించి భారతభూమికి వెళ్ళుదును. కాని పాపాత్ములు నా నీటిలో మునిగి తమపాపములను పొగొట్టుకొని నాకు వదలివేసినచో ఆ పాపములను నేనెటు పోగొట్టుకొందును. ఈ భారత భూమిలో ఎంతకాలము నేనుండవలెను. ఎప్పుడు నీలోకమునకు తిరిగివత్తును? సర్వజ్ఞాడా! నీవు అందరి మనోవాంఛితములను తెలుసుకొందువు. ఆందువలన వీటిని నాకు వివరించి చెప్పుడు.
శ్రీకృష్ణ ఉవాచ- శ్రీకృష్ణదేవు డిట్లనెను-
ఓగంగాదేవి! నీ మనోవాంఛితము నాకు తెలియును. ఇక రుద్రరూపుడు, నాఅంశ స్వరూపుడగు సముద్రుడు నీకు భర్త యగును. సరస్వతి మొదలగు నదులకంటే సముద్రుడు నీన్నే ఎక్కువగా ప్రేమించును. నీవు నేటినుండి కలియుగమున ఐదువేల సంవత్సరముల వరకు సరస్వతి నదితో కలిసి భారతదేశమున ఉందువు, ఆంతవరకు నివెల్లప్పుడు సముద్రునితో సంగమించుచుందువు.
భారతీయులు నిన్నెప్పుడు భగీరథుడొనర్చిన స్తోత్రముచే నిన్ను సంతోషపెట్టుదురు. వారు కౌథుమ మహర్షిచే చెప్పబడిన ధ్యానము స్తోత్రములచే నిన్ను ప్రతిదినము స్తుతింతురు.
దానివలన వారు అశ్వమేధయాగము చేసినంత ఫలమును పొందుదురు.
గంగా, గంగా యని వందయోజనముల దూరమునుండి నిన్ను పిల్చినను అతని సర్వపాపములు తొలగి విష్ణులోకమును పొందును. వేలకొద్ది పాపాత్ములు నీ నీటిలో స్నానము చేసినచో కలుగుపాపము నాభక్తులను చూడగానే నశించిపోవును. వేలకొలది పాపాత్ముల శవములు నీ నీటిలో వేసినందువలన కలుగుపాపము నామంత్రమును ఉపాసించు భక్తులు స్నానము చేసినందువలన తొలగిపోవును. ఎక్కడైతే నా నామగుణ సంకీర్తన జరుగునో అచ్చట పాపరహితవై నీవుండగలవు. ఆ ప్రదేశము పుణ్యక్షేత్రమగును.
నా భక్తుల పాదరేణుస్పర్శతో పాపి పవిత్రుడగును. అంతమాత్రమే కాక వైకుంఠమున కొంతకాలముండును. ఎవరు జ్ఞానము కలిగి నా పదభక్తితో నా నామస్మరణ చేయుచు ప్రాణములు వదులుదురో, వారు వైకుంఠమునకు తప్పక వెళుదురు. అట్లే వారు నాకు అనుచరులై అసంఖ్యాకమైన ప్రాకృతిక లయములు చూతురు. ఆధికమైన పుణ్యమువలన చనిపోయిన అతని శవమును నీ నీటిలో వేసినచో ఆలని ఎముకలు నీ నీటిలో ఉండుసంతవరకు అతడు వైకుంఠమున ఉండును. ఆతనీ కర్మలనన్నిటిని తీర్చి అతనికి సారూప్యమునిచ్చి నాసహచరునిగా ఉంచుకొందును.
ఆబ్దానీయైనను నీ జలమును స్పృశించి ప్రాణములు వదలినచో అతనికి సారూప్యమోక్షమునిచ్చి నా అనుచరుడుగా ఉంచుకొందును. నీ పేరు తలచుకొని బయట ఎక్కడనైనా ప్రాణములను వదిలినచో అతనికి చాలాకాలము సాలోక్యమను మోక్షమును ప్రసాదింతును. నాపేరును స్మరించుచు నీ నీటిలో కాక బయట ఎక్కడైనను ప్రాణములు వదిలినయెడల ఆతనికి బ్రహ్మకాలమువరకు సాలోక్యమోక్షమును ప్రసాదింతును.
ఎల్లప్పుడు సామంత్రమును స్మరించుచు నాకు పెట్టిన నైవేద్యమును భుజించువారు పుణ్యతీర్థములో చనిపోయినను, ఇతర ప్రదేశములందు చనిపోయినను విశేషమేమియు ఉండదు. వారు' ముల్లోకములను పవిత్రము చేయజాలుదురు. అట్లే రత్నవిమానమునెక్కి వారు, వారి బంధువులు సుదుర్లభమైన గోలోకము చేరుదురు.
భక్తులయొక్క సన్నిధి వలన తెలిసి, తెలియక ఎక్కడ చనిపోయినను వారు పవిత్రులై జీవన్ముక్తులగుదురు.
శ్రీమన్నారాయణుడు గంగాదేవితో ఆమె మహాత్మ్యమును, శ్రీహరిపాదభక్తుల గొప్పతనమును తెలిపి భగీరథునితో గంగను భక్తితో పూజించి, నీ కోరికలు తీర్చుకొమ్మనెను. అందువలన భగీరథుడు గంగా దేవిని "కౌథుమ” మహర్షి చెప్పిన ధ్యాన స్తోత్రములచే పూజించి, పరమాత్మ, ఈశ్వరుడైన శ్రీకృష్ణునకు నమస్కరించెను.
భగీరథుని నమస్కారములందుకొనిన శ్రీహరి అప్పుడు ఆంతర్ధానము చెందెను.
సారద ఉవాచ- సొరదు డిట్లనెను-
ఓ స్వామీ! భగీరథుడు గంగా దేవిని పూజించిన ధ్యాన, స్తోత్ర పూజాక్రమములను నాకు వివరించి చెప్పుడు.
శ్రీనారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లనెను-
ఉదయమే లేచి నిత్యకృత్యములన్నియు తీర్చుకొని స్నానము చేసి ఉతికిన బట్టలు కట్టుకొని పాదములు కడుగుకొని, ఆచమనము చేసి భక్తితో పూజకు కూర్చొనవలయును. తొలుత వినాయకుని, సూర్యునీ, అగ్నిని, విష్ణువును, శివుని, దుర్గాదేవిని పూజించిన వాడే ఈపూజచేయుటకు అర్హుడు.
విఘ్నములు తొలగుటకు వినాయకుని, పాపములు పోవుటకు సూర్యుని, తాను పరిశుద్దుడగుటకు అగ్నినీ, ముక్తికై విష్ణువును, బుద్ధి, జ్ఞానములకై దుర్గను శివుని పూజించవలెను. ఆతరువాత ఈ పూజకై ఉపక్రమింపవలెను.
సమస్త పాపములను తొలగించు కొథుమోక్తమైన ధ్యానాదికమును నీవు వినుము.
గంగాదేవి తెల్లని చంపక పుష్పమువంటి కాంతి కలదీ, పాపములను పోగొట్టునది. శ్రీకృష్ణుని నుండి జన్మించినది. బంగారు వన్నెగల వస్త్రమును ధరించునది. రత్నభూషణములు కలది. పూర్ణచంద్రునివలె తెల్లనైనదీ, నారాయణునకు ఇష్టురాలు, సత్సౌభాగ్యసమన్విత. మాలతీ మాలగల కొప్పుగలది. చందనపుచుక్కలతో సున్న సిందూర బిందువులతో అలంకృత, చెక్కిలి ప్రదేశమున అనేక చిత్రములు కల కస్తూరి పత్రములు కలది. దొండపండు వంటి పెదవులు, ముత్యాలవంటి దంతములు - కలది. అందమైన ముఖము, బృహత్ శోణి, పద్మములవంటి పాదములు కలది. ఆ పాదములు రత్నాభరణములు కలవి. దేవేంద్రాది దేవతలు ననుస్కరించుచున్నందువలన వారి శిరస్సులందున్న మందార పుష్పముల మకరందముతో ఎఱ్ఱనైనది. ఆ గంగాదేవిని మునీంద్రులెల్లప్పుడు సేవించుచుందురు, ఆమె మోక్షమును కోరుపోరికి మోక్షమును, కాముకులకు స్వర్గమునిచ్చును. భక్తులననుగ్రహించునది, వైకుంఠమునిచ్చునది ఆగు గంగాదేవిని నమస్కరింతును.
ఇటువంటి ధ్యానపద్ధతిలో గంగాదేవిని ధ్యానించి షోడశోపచారములతో ఆమెను పూజించవలెను. ఆసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, స్నానం, అనులేపనం, వస్త్రం, భూషణం, మాల్యం, గంధం, ధూపం, దీపం, నైవేద్యం, శీతలబిలం, తాంబూలం, శయ్య అనునవి షోడశోపచారములు. షోడశోపచార పూజ చేసి చేతులు జోడించుకొని నమస్కరించినచో ఆశ్వమేధ ఫలము లభించగలదు.
నారద! పాపములను తొలగించునది పుణ్యములనిచ్చునది అగు బ్రహ్మ విష్ణుల సంవాదమును, కొథుమోక్షస్తోత్రమును ఇప్పుడు వినుము.
శ్రీ బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లు పలికెను-
ఓ మహావిష్ణూ! నిన్ను నమస్కరింతును. పాపములను తొలగించి పుణ్యములను కలిగించు గంగాదేవి స్తోత్రమును వినదల్చితినని బ్రహ్మదేవుడు పలికెను.
శ్రీనారాయణ ఉవాచ- నారాయణుడిట్లు చెప్పెను.
గంగాదేవి శివుని సంగీతమునకు ముగ్ధుడైన శ్రీకృష్ణుని శరీరము నుండి, రాధాదేవి యొక్క శరీరము మండి ఉద్భవించినది. సృష్టికి పూర్వము గోలోకమున రాసమండలమున ఉన్న శంకరుని సమీపమున ఉండినది. ఆమె కార్తీక పౌర్ణమినాడు పుట్టినది. ఆ గంగ గోలోకమున కోటి యోజనముల విస్తీర్ణములో లక్షకోట్ల యోజనముల దూరము ప్రవహించుచున్నది. వైకుంఠలోకమున అరువై లక్షల యోజనముల వైశాల్యముతో దానికి నాలుగేట్లున్న దైర్ఘ్యములో నున్నది. ఆ గంగానదియే బ్రహ్మలోకమున ఇరవై . లక్షల యోజనముల వైశాల్యములో దానికి నాలుగురెట్లు పొడవుతో నున్నది, శివలోకమున ఆ గంగానది ముపైలక్షల యోజనముల వైశాల్యముతో వైశాల్యానికి ఐదురెట్లు పొడవై ప్రవహించుచున్నది. ఇంద్రలోకమున ఆరుయోజనముల విస్తీర్ణముతో దానికి పదిరెట్లెక్కువైన పొడవుతో ప్రవహించుచున్నది. అట్లే ఆ నది ధ్రువలోకమున లక్షయోజనముల విస్తీర్ణములో దానికి ఏడురెట్లు ఎక్కువగా ఉన్న పొడవుతో నున్నది. చంద్రలోకమున లక్షయోజనముల విస్తీర్ణమై దానికి ఆరురెట్లున్న ధైర్యముతో కన్పించును. సూర్యలోకమున అరవై వేల యోజనముల వైశాల్యముతో దానికి పదిరెట్లెక్కువున్న ధైర్యముతో కనిపించును. అదే విధముగా సత్యలోకమున లక్షయోజనముల విస్తీర్ణముతో ఆరులక్షల పొడవుతో ప్రవహించుచున్నది. అట్లే కైలాసమున ఒక వేయి యోజనముల విస్తీర్ణముతో ఏడువేల యోజనముల పాడవుతో కన్పించును.
ఈ గంగానది పాతాళ లోకమున భోగవతి యను పేరుతో కనిపించును. అచ్చట పది యోజనముల వైశాల్యము వందయోజనముల పొడవుతో ప్రవహించుచున్నది. భూమి పై నున్న గంగను అలకనంద యని పిలుతురు, ఒక క్రోసు వైశాల్యముతో అంతే ఉన్న దైర్ఘ్యముతో భూమిపై కనిపించును.
ఈగంగానది సత్యలోకమున పాలవలె తెల్లగానుండును. త్రేతాయుగమున పూర్ణచంద్రుని వలె తెల్లగా ఉండును. ద్వాపరయుగమున చందనపు కాంతితో కలియుగమున నీటి కాంతితో నున్నది.
అమెయొక్క ప్రభావము గురించి వేదములలో పురాణములలో కన్పించును. పవిత్రమైనది. పాపములను తొలగించునది ఐన గంగా దేవిని నమస్కరింతును.
ఓ బ్రహ్మదేవుడా! గంగానది యొక్క నీటి తుంపరలే కోటి జన్మలలో చేసిన బ్రహ్మహత్యాది పాపములనన్నిటిని హరించును. ఇరువది యొక్క పద్యములలో నున్న గంగాస్తోత్రము పాపములనన్నిటిని హరించి పుణ్యమును కలిగించును.
ఈస్తోత్రమును ప్రతిదినము గంగా దేవిని పూజించి ఎవడు చదువునో అతడు అశ్వమేధ యాగఫలితముననుభవించును. ఈ స్తోత్రమును ప్రతిదినము ఉదయముననే లేచి చదివినచో పుత్రులు లేని వాడికి పుత్రులు లభింతురు. భార్యాహీనునకు భార్య లభించును. రోగి రోగమునుండి ముక్తిని పొందును. కారాగృహబద్దుడు కూడ ముక్తిని పొందును. కీర్తి కావలెనను కొవినచో చక్కని కీర్తిలభించును. మూర్ఖుడైనా పండితుడై కీర్తిని పొందును. ఆతని దుఃస్వప్నములన్ని నశించి శుభము జరుగును. గంగాస్నానము వల్ల కలుగు ఫలితములన్నింటిని పొందును.
నారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లు పలికెను-
భగీరథ చక్రవర్తి ఈ స్తోత్రముచే గంగాదేవిని సంతోషపెట్టి ఆనదిని వెంట తీసికొని తన పూర్వీకులైన సాగరులు నశించిన స్థలమునకు తీసికొని వెళ్ళాను. ఆ సగరపుత్రులు గంగానది యొక్క వాయుస్పర్శచేతనే వైకుంఠమునకు వెళ్ళిరి. భగీరథుడు గంగాదేవిని భూమి పైకి తెచ్చినందువలన ఆమెకు “భాగీరథీ" యను పేరు వచ్చినది.
నారద! ఈవిధముగా నీకు గంగోపాఖ్యానము నంతయు తెలిపినాను. ఇంకను నీవు తెలిసికొనవలెనన్న విషయములు గలవేని ఆడుగుమని నారాయణుడనెను.
నారద ఉవాచ- నారద మహర్షి ఇట్లనెను-
శ్రీకృష్ణపరమాత్మ, రాధాదేవి శివసంగీతమునకు ముగ్ధులై ద్రవమైనప్పుడు ఏమి జరిగినది. అచట నున్నవారు ఏమి చేసిరి మొదలగు విషయములను వివరించి చెప్పుడు.
నారాయణ ఉవాచ- నారాయణుడు ఇట్లు చెప్పెను-
కార్తీక పౌర్ణమినాడు రాధ ఒక మహోత్సవమును జరిపినది. ఆ ఉత్సవకాలమున రాసమండలమున శ్రీకృష్ణపరమాత్మ రాధాదేవిని ఆదరించి ఆచ్చట కూర్చుండెను. శ్రీకృష్ణునిచే ఆదరింపబడిన రాధాదేవిని బ్రహ్మాది దేవతలు ఋషులందరు గౌరవించి స్తుతించిరి.
ఆసమయమున సరస్వతీ దేవి శ్రీకృష్ణుని గూర్చిన పాటలను మనోహరముగా పాడినది. ఆమె పాటకు బ్రహ్మదేవుడు సంతోషపడి మహారత్నముల మాలికను, చూడామణిని ఆమెకు ఇచ్చెను. శ్రీకృష్ణుడు ఆన్నిరత్నముల కంటెను మిన్నయైన కౌస్తుభరత్నమును, రాధాదేవి రత్నముల హారమును, నారాయణుడు మనోహరమైన వనమాలను, లక్ష్మీదేవి అమూల్యమైన మకర కుండలములను, దుర్గాదేవి సుదుర్లభమైన విష్ణుభక్తిని ధర్ముడు ధర్మబుద్దిని, కీర్తిని, అగ్ని బంగారు వన్నెగల వస్త్రమును, వాయువు మణి నూపురములనిచ్చెను.
ఆసమయమున శంకరుడు బ్రహ్మదేవునిచే ప్రేరితుడై శ్రీకృష్ణుని గురించి పాటలు పాడెను. అతని పాటలు విని దేవతలందరు చిత్రములోని బొమ్మలవలె నిశ్చేష్టులైరి. కొంత కాలమునకు స్మృతిని పొంది చూడగా ఆ స్థలమంతయు జలముతో నిండినట్లు, శ్రీహరి రాధాదేవి అక్కడలేనట్లు కనుగొనిరి. భగవంతుడు రాధాదేవీతో బలమైనందువలన అచ్చటనున్న దేవతలు, ఋషులు, గోపికలు, గొల్లలు అందరు ఏడ్చిరి.
అప్పుడు బ్రహ్మదేవుడు ధ్యానమువలన శ్రీకృష్ణుడు రాధతో కలిసి ద్రవభూతుడైనాడని అది అతని అభీప్సితమని గుర్తించెను. అందువలన దేవతలందరు పరమేశ్వరుని స్తుతించి నీస్వరూపమును మాకు తిరిగి చూపించుమని, అదియే మా అందరి కోరికయని తెల్పిరి.
అప్పుడు వారికి ఆశరీరవాణి స్పష్టము, మధురమైన మాటలతో ఇట్లనినది. నేను సర్వాత్మ స్వరూపుడను. ఈ రాధాదేవి భక్తుల ననుగ్రహించుటకు రూపము ధరించిన శక్తి స్వరూపిణి. మాకు దేహముయొక్క అవసరముండదు. మనువులు, మానవులు, మునులందరు, వైష్ణవులు నామంత్రమును జపించి పవిత్రులై నన్ను చూచుటకు నాలోకమునకు వత్తురు. మీకందరకు నా రూపమును చూడవలెనని యున్నచో పరమశివుడు నా ఆజ్ఞను పరిపాలించును. అట్లే బ్రహ్మదేవుడు నా ఆజ్ఞననుసరించి వేదాంగములను శాస్త్రములను, అన్నీ కోరికలు తీర్చు ఆపూర్వమంత్రములు గల స్తోత్రములను, కవచములను, థ్యానములు గల పూజావిధిని చేసి జాగ్రత్తగా రక్షించును.
వేలు, వందల జనులలో ఒకడు నామంత్రోపాసకుడగును. అట్టివారే నా మంత్రముచే పవిత్రమై నాలోకమునకు వత్తురు. లేనిచో అందరు గోలోకముననే ఉందురు. నామంత్రమును ఉపాసించనిచో ఈజగమే నిష్ఫలమగును. విధాతయొక్క సృష్టిలోని జనులు కొందరు భూమిపై నివసించగా, మరికొందరు స్వర్గములో నివసింతురు. మరి కొందరు పాతాళలోకమున నుండగా ఇంకను కొందరు బ్రహ్మలోకమున నుందురు. కొందరు వైష్ణవులు నాలోకమున నివసింతురు. ఈ విధముగా శాస్త్రరచన చేయుదునని పరమ శివుడు ఈ దేవతలమధ్య ప్రతిజ్ఞచేసినచో నా రూపును మీరు చూడగలరు. అని ఆకాశవాణి దేవతలతో పల్కెను.
ఆకాశవాణి మాటలు విని జ్ఞానేశుడైన పరమశివుడు గంగనీటిని చేతిలో పట్టుకొని విష్ణుమాయకు సంబంధించిన మంత్రములతో వేదసారమగు శాస్త్రమును చేయుదునని ప్రతిజ్ఞ చేసెను. ఈగంగనీరును పట్టుకొని ప్రతిజ్ఞచేసి తద్భిన్నముగా ప్రవర్తించిన మానవుడు బ్రహ్మ బ్రతికియున్నంతవరకు నరకమున ఉండునని దేవతలందరి ముందు ప్రతిజ్ఞచేయగనే శ్రీకృష్ణపరమాత్మ రాధాదేవితో అక్కడ ఆవిర్భవించెను.
దేవతలందరు రాధాదేవితో నున్న శ్రీకృష్ణుని చూచి మహానందముతో తిరిగి ఉత్సవమును చేసికొనిరి. ఆ తరువాత శంకరుడు వేదసారమగు శాస్త్ర రచన చేసెను. ఈ విధముగా గంగాదేవి గోలోకమున రాధాకృష్ణులనుండి పుట్టినది. ఆమె భక్తి ముక్తిని కలిగించునది. శ్రీకృష్ణ స్వరూపియైన ఆ గంగా దేవి సమస్త జనులచే పూజలనందుకొన్నది.
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణములో రెండవదైన ప్రకృతి ఖండములోని నారద నారాయణ సంవాదములో గంగోపాఖ్యానమనే పదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 10 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
This soul-stirring chapter expounds upon the boundless spiritual merits, material prosperity, and final liberation attained by living beings who revere, bathe in, or drink the sacred waters of River Gaṅgā. It details how touch, sight, and remembrance of Gaṅgā purify a person from the most severe spiritual offenses, granting long life, health, righteous progeny, and ultimate ascension to the transcendent realm of Vaikuṇṭha. The narrative concludes with a sacred hymn of praise to Goddess Gaṅgā, encouraging all spiritual aspirants to hold Her holy waters in eternal reverence and seek Her motherly shelter in their daily spiritual practice.