నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-
నారదా! స్వాహాదేవి, స్వధాదేవి చరిత్రలను నీకు వినిపించితిని. ఇప్పుడు దక్షిణాదేవి చరిత్రను చెప్పెదను. జాగ్రత్తగా వినుము.
పూర్వకాలము గోలోకమున సుశీలయను గోపిక శ్రీహరికి ప్రియురాలుగానుండెను. ఆ సుశీల రాధాదేవికి ముఖ్యమైన చెలికత్తె, మిక్కిలి గౌరవింపదగినదీ అందగత్తెకూడ. ఇంకను ఆ సుశీల మంచిరూపము కలది. కోమలమైన ఆవయవములు కలది. కమలములవంటి కన్నులు కలది. సుశ్రోణి, సుస్తని, న్యగ్రోధపరీమండల, రత్నాలంకారములు కలది, చిరునవ్వుతో ఉండునది.
తెల్లని చంపక పుష్పమువంటి కాంగలది. లేడికన్నులవంటి కన్నులుగలది. కామశాస్త్రమున మంచి అనుభవము కలది. భావమును త్వరగా గ్రహించునది రసికురాలు. ఆమె రాధాదేవియొక్క దక్షిణభాగమున ఒకప్పుడుండెను.
మధుసూదనుడు తన ప్రియురాలి దగ్గర రాధాదేవిని చూచి భయముతో తలవంచుకొను.
రాధాదేవి ఎఱ్ఱని ముఖముతో ఏజని తామరలవంటి కన్నులతో, కోపముతో అవయవములదురుచుండగా వేగముగా ఆచ్చటికి వచ్చుచుండెను. దానిని గమవీంచి సుశీలా, రాధాదేవులమధ్య విరోధమేర్పడునని శ్రీకృష్ణుడంతర్థానమునొందెను. దావీవీ గమనించి సుశీల భయముతో తానుకూడ ఆంతర్ధానము చెందెను.
ఆ యాపదను చూచి గోపికలందరు చేతులు జోడించుకొని భక్తితో తలలు పంచుకొని ఓ దేవీ మమ్ములను రక్షింపుమనీ మాటిమాటికి వేడుకొనుచు రాధాదేవియొక్క పొదపద్మములపై వ్రాలిరి. అట్లే సుదాముడు మొదలగు గొల్లలందరు భయముతో రాధాదేవిని శరణువేడిరి.
పరమేశ్వరియగు రాధాదేవి పరుగెత్తుచున్న తన భర్తను, తన స్నేహితురాలిని చూచి తన సహచరిని కోపముతో ఈవిధముగా శపించెను. సుశీలా! నేటినుండి నీవి గోలోకమునమండినచో వెంటనే భస్మమైపోదువు.
దేవదేవీశ్వరి యగు రాధాదేవి సుశీలను శపించి రాపమధ్యమున రాపేశ్వరుడగు శ్రీకృష్ణుని రమ్మని పిలిచాను. కానీ కృష్ణుడచ్చటకు రాలేదు. అందువలన రాధాదేవి విరహముతో క్షణమొక యుగముగా భావించెను.
ఓ కృష్ణ ప్రాణనాథ! ప్రాణములకన్న మిన్నయైన ప్రియుడా! ప్రాణములకు అధిష్టాన దేవత! వీపు వెంటనే రమ్ము. నీవు లేనిచో నేను బ్రతుకలేను.
స్త్రీకి గర్వము పతివలననే వచ్చును. మంచి స్త్రీకి భర్తవలసవే గౌరవము కలుగును. కులస్త్రీకి పతియే బంధువు, దేవత, గొప్ప సంపద, శరీరముగల సుఖము. అతడే ధర్మమును సుఖమును, ఎల్లప్పుడు ప్రీతినీ, శాంతినీ సన్మానమును ఇచ్చువాడు. స్వామీ ఆమెకు చాలా గొప్పవాడు. స్త్రీకి భర్తను మించిన బంధువు లేడు.
ఆతడు తన భార్యను భరించుచున్నందువలన భర్తయని, పాలించుటచే పతియని భార్యయొక్క శరీరమునకు ఈశుడు కావున స్వామియని, కామమును తీర్చువాడు కాపున కాంతుడని, సుఖబంధమువలన బంధువనీ ప్రియమును కలిగించువాడు కావున యుడని, ఐశ్వర్యమునిచ్చుచున్నందువలన ఈడని, ప్రాణేశుడు కాపువ ప్రాణవాయకుడనీ, రతిని కల్గిoచుచున్నందువలన రమణుడవి, పిలువబడుచున్నాడు. స్త్రీకి భర్తకన్న ప్రియుడు ఎపరుకారు. పుత్రుడు భర్తయొక్క శుక్రమువలన జన్మించును కావున భర్త ప్రియుడైనాడు.
స్త్రీకి నూరుగురు పుత్రులకంటెను తన భర్త చాలా ప్రియమైనవాడు. చెడు నడకగల స్త్రీ తనయొక్క ప్రియుని తెలిసికొవలేదు.
సమప్త తీర్థములలో చేయు స్నానము, సమష్ణ యజ్ఞములను చేయు దీక్ష, భూ ప్రదక్షిణము, సమష్ఠ తపప్పులు, వ్రతములు, మహాదానములు, ఉపవాసములు, ఇతర పుణ్యకార్యములు, గురుపుమ, బ్రాహ్మణుని, దేవతలను సేవించుట మొదలగునవి భర్తయొక్క పాదసేవలో పదహారవ వంతైన కాజాలపు, స్త్రీకి గురువు. బ్రాహ్మణుడు, ఇష్టదేవత వీరందరికంటే భర్త శ్రే ష్ణుడు. పురుషులకు విద్యనిచ్చువానివలె స్త్రీకి భర్త గురువగుచున్నాడు.
నేను మూడు లక్షల గోపస్త్రీలకు, మూడు లక్షల గోపకులకు రమ మొదలగు గోపికలకు ఆ శ్రీకృష్ణ పరమాత్మయొక్క ఆనుగ్రహము వలననే యజమానురాలినైతిని.
ఈవిధముగా శ్రీకృష్ణుని అనుగ్రహమువలననే ఉన్నతస్థానమువనున్నను అతనిపై కోపపడితిని. తన భర్త ఇంకొక స్త్రీతో చనువుగా ఉండుటను ఏ భార్య సహించలేదు. ఇది స్త్రీలందరికి సహజమైనది. స్వభావమునకు విరుద్ధముగా ఎవ్వరు ప్రవర్తింపలేరు.
పై విధముగా రాధాదేవి తన భర్తయగు కృష్ణునిగూర్చి పలికి, ఆ శ్రీకృష్ణుని చక్కని భక్తితో ధ్యానించెను. ఆ ధ్యానబలమువలన శ్రీకృష్ణుని రాధ పొందగలిగెను. సుశీల యను పేరుగల దక్షిణాదేవి వెంటనే ఆ స్థలమునువదలి గోలోకమునుండి భ్రష్టయై చాలాకాలము శ్రీకృష్ణపరమాత్మ గురించి తపమాచరించి లక్ష్మీదేవియొక్క శరీరమున ఆంతర్ధానముచెందెను.
నాటినుండి దేవతలు ఎంతగొప్పని యజ్ఞము చేసినను దాని ఫలితమును మాత్రము పొందలేకపోయిరి. అందువలనవారు బాధపీడితులై బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళిరి. బ్రహ్మదేవుడు దేవతల బాధలను చక్కగా విని, శ్రీమన్నారాయణుని చక్కగా మనస్సులో ధ్యానించుకొని ఆతని ఆసుగ్రహమును పొందిను. అందువలన శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మియొక్క శరీరమున విలీనమైన భూలక్ష్మిని బయటకు తీసి బ్రహ్మదేవునికిచ్చెను. బ్రహ్మదేవుడా భూలక్ష్మియైన దక్షిణను సత్పురుషులు చేయు సత్కార్యములు పరిపూర్ణమగుటకై యజనకిచ్చివేసెను. యజ్ఞదేవత ఆ దక్షిణాదేవిని శాస్త్రప్రకారముగా పూజించి ఆమెనిట్లు స్తుతించెను.
దక్షిణాదేవి పరిశుద్ధమైన బంగారు పన్సెగలది, కోటిచంద్రులకాంతి గలది. మిక్కిలి అందమైనది. కమలములవంటి ముఖముతో కమలములవలె విశాలమైన నేత్రములతో మహాలక్ష్మీదేవి అవయవములనుండి పుట్టిన దక్షిణాదేవి బ్రహ్మదేవునిచే పూజలందుకొన్నది. ఆమె పరిశుద్ధమైన వస్త్రములను ధరించినది. దొండపండువంటి పెదవులు కలది. అందమైన పలువరుస కలది, ఆమె తన కప్పులో మాలతీమాలను, మెడలో గరాభరణములమ, పాపిటలో పిందూరబిందువులను ధరించి తన వేషముతో ముమలను పహితము మోహింపచేయునది. ఎత్తైన నితంబములలో పీనపయోధరములతో మన్మథునకు ఆధారమైన దక్షిణాదేవి మదనుని బాణములచే మిక్కిలి పీడింపబడినది.
యజ్ఞదేవుడు మదమనిచే బాధపడుచున్న సుందరియగు దక్షిణాదేవిని చూచీ మూర్చపడెను. అప్పుడాతడు బ్రహ్మదేవుడు నిర్దేశించిన పద్దతిలో తనామెను వివాహమాడెమ.
యజ్ఞదేవుడా రమణిని వివాహము చేసికొని నిర్జన వనమునకామెను తీసికొనివెళ్ళి వంద దివ్య సంవత్సరములామెతో సుఖముగా ఉండెను.
ఆ దేవి పన్నెండు దీవ్య సంవత్సరములు గర్భమును ధరించి సమస్త కర్మలయొక్క ఫలములనిచ్చు పుత్రుని కన్నది. దక్షిణాదేవి సత్కర్మల ఫలితములనిచ్చుచుండగా ఆమె పుత్రుడు పత్కర్మలు పరిపూర్ణమైన తరువాత ఫలితములనొసగును.
యజ్ఞదేవుడు దక్షిణాదేవితో తన పుత్రునితో కలసి సత్కర్మల ఫలితమునొసగునని వేదములు తెలసిన వారందురు.
యజ్ఞదేవత దక్షిణాదేవిని, సర్వకర్మ ఫలితములనొసగు పుత్రునిబడసి, వైదిక కర్మలు సక్రమముగా నిర్వర్తించు వారందరికి ఫలితమునొసగెను. దేవతలు తమ కోరికలు తీర్చుకొని తమ తమ నివాసముల కేగిరి.
వారదా! ఈ వృత్తాంతమునంతయు ధర్మదేవత చెప్పగా నేను వింటిని. ఆనీ నారాయణుడనెను.
సత్కర్మలు చేసి వెంటనే దక్షిణనివ్వవలెనని అప్పుడే ఆ కర్మఫలము లభించునని వేదములందు చెప్పబడినది.
కర్త కర్మ పరిపూర్ణముగా చేసి బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వనిచో ఆ దక్షిణపరిమాణము కాలముగవనుసరించి పెరుగుచుండును. ముహూర్తకాలము తర్వాత రెట్టింపు దక్షిణనీయవలెను. ఒకరాత్రి గడచినచో ఆరురెట్లెక్కువగా దక్షిణనీయవలెను. మూడు రాత్రులు గడచినచో పదిరెట్లెక్కువగానియ్యవలెను. అట్లే వారము గడచినచో ఇరవై రెట్లెక్కువ దక్షిణనీయవలెను. మాసము గడచినచో లక్షరెట్లు, సంవత్సరము గడచినచో మూడుకోట్ల రెట్లెక్కువగా ధనమునీయవలెను. ఐనను ఆ కర్మయంతయు నిష్పాలమగును.
ఈవిధముగా సంవత్సరమువరకు దక్షిణనీయనిచో కర్త బ్రాహ్మణుల ధనమపహరించిన వాడగును. ఆతడు మరల సత్కర్మలు చేయుటకు ఆరుడు కాడు, అపవిత్రుడగును. లక్ష్మీదేవి అతనికి శాపము పెట్టుచు అతని ఇంటిమండి వెళ్ళిపోపును.
పితృదేవతలు. ఆ వ్యక్తి ఇచ్చు శ్రాద్ధ తర్పణాదికమును స్వీకరింపరు, ఆట్లే దేవతలు ఆతడు చేయు పూజలను, అతడు యజ్ఞమున ఇచ్చు ఆహుతులను స్వీకరింపరు.
యజ్ఞాది సత్కర్మలలో దాత దక్షిణలివ్వక, దక్షిణ తీసికొనవలసినవాడు దానిని నిరాకరించినచో, బావిలో నీరు చేదునపుడు తాడు తెగినచో తాడు, బొక్కెన నీటిలో పడునట్లు ఆ ఇద్దరు నరకమునకు పోవుదురు. దక్షిణనివ్వనివాడు కుంభీపాకనరకమున లక్ష సంవత్సరములు నరకబాధలనుభవించి, తిరిగి జన్మించినపుడు రోగముతో, దరిద్రుడగును. ఆతడు తనకు ముందుండిన ఏడుతరములవారినీ నరకమునకు పంపును. అందువలన యజ్ఞాది సత్కర్మలయందు తప్పక దక్షిణలు సమర్పించుకొనవలెను.
ఈవిధముగా నారాయణముని నారదునకు దక్షిణాదేవి చరిత్రను తెలిపి ఇంకను ఆతడు తెలిసికొనవలసిన దేమైవ ఉన్నచో అడుగుమనెను.
నారద ఉవాచ- నారదమహర్షి ఇట్లనెను-
శ్రీమన్నారాయణ! దక్షిణలు ఇవ్వక చేసిన శుభకర్మలయొక్క ఫలితము ఎవరికి చెందును? యజ్ఞాదేవత చేసిన దక్షిణాదేవి పూజాపద్ధతి. ఎటువంటిది? వీటిని నాకు తెలుపుము.
నారాయణ ఉవాచ- నారాయణుడు ఇట్లనెను-
యజ్ఞాది సత్కర్మలను దక్షిణలిచ్చుచు ఆచరించినపుడే వాటి ఫలితము లభించును. లేనిచో ఫలమే కలుగదు. ఐనను ఆ సత్కర్మవలన కలుగు ఫలితమును బలిచక్రవర్తి అనుభవించునట్లు వామనుడు పూర్వము కట్టడిచేసెను.
శోత్రియముకాని శ్రాద్దమునందలి వస్తువులు, ఆశ్రద్దతో చేసిన దానము, వృషలిపతియగు బ్రాహ్మణుని పూజాద్రవ్యములను, ఋత్విక్కులేని యజ్ఞఫలమును, శుచిత్వము లేనివాని పూజా ఫలితమును, గురువుపై భక్తిశ్రద్ధలు లేనివాడు చేసిన కర్మఫలమును బలిచక్రవర్తి అనుభవించును,
నారదా! నీకింతవరకు దక్షిణలు లేని యజ్ఞాది ఫలమును పొందు వానిని గురించి తెలిపితివి. ఇక కాణ్వశాఖలో చెప్పబడిన దక్షిణాదేవి స్తోత్రము, ధ్యానము, పూజాది విషయములను నీకు తెల్పుదును.
యజ్ఞదేవతకు బ్రహ్మదేవుని అనుగ్రహమువలన దక్షిణాదేవి లభించగనే ఆందమైన ఆమె రూపమును చూచి అతడు మోహపరవశుడయ్యెను.
యజ్ఞఉవాచ- యజ్ఞదేవుడిట్లు పలికెను-
ఓ దక్షిణాదేవి! నీవు పూర్వము గోలోకమున రాధాదేవికి ఇష్టసఖివి, గోపికలలో శ్రేష్ఠురాలవు. కార్తీక పౌర్ణమినాడు గోలోకమున శ్రీకృష్ణుని దక్షిణాంశమునుండి ఉద్భవించినందువలన నీవు దక్షిణవైతివి. పూర్వము నీకచ్చట సుశీలయను పేరు నీ శీలమునకు తగినట్లుండినది. గోలోకమునుండి నా అదృష్టమువలన ఇచ్చటకు వచ్చితివి. నీవు దయదలచినచో నేను నీకు భర్తనగుదును.
నీవు సత్కర్మలు చేయువారి కర్మలన్నిటి ఫలితములనిచ్చుదానవు. పమస్తకర్మలు నీవులేనిచో మొండిచెట్టువలె నిష్పలమగును. బ్రహ్మ, విష్ణు, శంకరుడు మొదలగు దేవతలు, ప్రకృతికి అతీతుడు పరబ్రహ్మ ఆయిన శ్రీకృష్ణుడు సహితము నీవులేనిచో ఫలితములనివ్వరు.
ఓకాoతా నీవే అన్నిజన్మలలో నాకు శక్తి రూపిణివి. నీవున్నచో నేను సమస్తకర్మలు చేయగలను.
యజ్ఞదేవత ఈవిధముగా దక్షిణాదేవిని స్తుతించగా ఆమె పరమ సంతోషముతో ఆతనివద్దకు చేరెను.
ఈ దక్షిణాదేవి స్తోత్రమును యజ్ఞసమయములందు చదివినచో అతనికి సమస్తయజ్ఞములు చేసిన ఫలితము లభించును.
రాజసూయ, వాజపేయ, గోమేధ, నరమేధ, అశ్వమేధ, విష్ణయజ్ఞము మొదలగు యాగములు ప్రారంభించు సమయమున ఈ స్తోత్రమును పఠించినచో ఆ యజ్ఞము సాంగముగా వీఘ్నములు లేక పూర్తియగును.
ఇది దక్షిణాదేవి ధ్యానము, స్తోత్రము, పూజాదికము, ఆ దక్షిణాదేవిని సాలగ్రామము లేక కలశమున ఆవాహనము చేసి పూజింపవలెను. ఈదేవి లక్ష్మీదేవియొక్క దక్షిణభాగమునుండి పుట్టినది. మహాలక్ష్మి యొక్క అంశస్వరూపిణి. విష్ణుమూర్తియొక్క శక్తిస్వరూపిణి,
ఈదేవిని ఓం శ్రీం క్లీం, క్రైం, దక్షిణాయైస్వాహా అను మూల మంత్రముచే పూజించుచు ఆర్ఘ్యపాద్యాది, షోడశోపచార పూజలను చేయవలెను.
ఈవిధముగా నీకు సుఖమును, సంతోషమును ఫలితమును కలిగించు దక్షిణాదేవి కథనంతయు సవిస్తరముగా తెల్పితిని.
ఈ దక్షిణాఖ్యానమును శ్రద్ధగా విన్నచో అతడు చేయు సత్కర్మలు నిర్విఘ్నముగా పరిపూర్ణమగును.. పుత్రులులేని వారికి పుత్రులు, భార్యలేని వానీకి గుణవతియగు భార్య, విద్యలేనివానికి విద్య, ధనములేనివానికి ధనము, భూమిలేనివానికి భూమి లభించును. కష్టకాలమున, బంధువుల వియోగకాలమున, కారాగారమున బద్ధుడైనప్పుడు దీనిని ఒక నెలవరకు విన్నప్పటికిని అతని కష్టములన్నియు తీరిపోవును.
శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతిఖండమున నారదనారాయణుల సంవాదమున తెల్పబడిన దక్షిణాదేవి చరిత్రలో దక్షిణాదేవి పుట్టుక, ఆమె పూజావిధానము కల నలభైరెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 41 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
Restored to His senses through past suffering, Lord Indra offered a magnificent eulogy to Goddess Lakshmī, praising Her as the source of all beauty, courage, sovereignty, righteousness, and spiritual illumination. He performed Her ritual worship with celestial flowers, gems, and divine incense, reciting her secret Stotra that bestows permanent financial stability and spiritual peace. Overjoyed by Indra's genuine humility and devotion, Goddess Lakshmī granted him the boon that She would return to heaven and never abandon anyone who recites this sacred eulogy with daily devotion and a clean heart.