నారాయణ ఉవాచ- నారాయణు డిట్లు నారదునితో ననెను-
శివుడు యుద్ధవృత్తాంతమును తెలిసికొని స్వయముగా తన గణములతో రణరంగమునకేగెను. శివుడు రణ రంగమునకు రాగానే శంఖచూడుడు ఏమానమునుండి కిందికి దిగి తీపునకు మిక్కిలి భక్తితో దండప్రణామము చేసెను. ఆ తరువాత వెంటనే విమానము నెక్కి యుద్ధ సన్నాహము చేయమొదలిడెను,
శివదానవుల యుద్దము ఒక సంవత్సరము గడిచినను వారిలో ఎవరు కూడ గెలవలేదు, ఓడలేదు. అందువలన పరమశివుడు తన శస్త్రములను వదలి కూర్చుండెను. ఆట్లే శంఖచూడుడు తన ఆయుధములను పక్కకు పెట్టి రథము పై కూర్చుండెను. శంకరుడు తనతోటి జరిగిన యుద్ధములో చనిపోయిన వారినందరిని తిరిగి బ్రతికించెను.
ఈ సమయమున మహామాయావియగు శ్రీ మహావిష్ణువు వృద్ధ బ్రాహ్మణ వేషముతో ఆ రణరంగమునకు వచ్చెను.
వృద్ధ బ్రాహ్మణ ఉవాచ- వృద్ధ బ్రాహ్మణుడిట్లు పలికెను-
రాజేంద్ర! విప్రుడనైన నాకు భిక్షపెట్టుము. నీవు సమస్త సంపదలను దానము చేయువాడవు. నిరాహారుడైన వానికి, వృద్ధునకు, దప్పిగొన్న వానికి, ఆతురునకు దానము తప్పక చేయదగినది. నామనసులోమన్న కోరికను నీవు ఒప్పుకొనిన తరువాత వివరించి చెప్పెదను అని వృద్ధ బ్రాహ్మణుడు ఆడుగగా శంఖచూడుడు ప్రసన్నభావముతో సరేనని ఒప్పుకొనెను. ఆప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు నేను నీడలో నున్న కవచమును కోరి వచ్చితిననగా ఆ రాక్షసుడు తనమెడలో మన్న కవచమును బ్రాహ్మణునకు తీసియిచ్చెమ.. వృద్ధ బ్రాహ్మణ రూపధారి యగు శ్రీహరి శంఖచూడుని కవచమును తీసికొని తులసి దగ్గరకు శంఖచూడుని వేషములో వెళ్ళి ఆమెను చెరచెను. తులసీదేవి పాతివ్రత్యము భంగము కాగానే శంకరుడు శ్రీహరి యిచ్చిన రూలమును శంఖచూడునిపై ప్రయోగించెను. దాని ఆగ్రభాగమున విష్ణువు, మధ్యభాగమున బ్రహ్మదేవుడు మూలభాగమున పగమ శివుడు శూలమును పట్టుకొను స్థలమున కాలుడు ఆధిష్టించియుండిరి. ఆది నూరుగురు సూర్యుల మధ్యాహ్న ప్రభవలె వెలుగుచుండెను. సమస్త బ్రహ్మాండభాండమునంతయు సంహరింపగల శక్తి గలది. అటువంటి శూలమును శంఖచూడుని పై పరమశివుడు ప్రయోగించెను. ఆ సమయమున శంఖచూడుడు తన విల్లును వదిలి పెట్టి యోగాసనమున కూర్చుండి శ్రీకృష్ణ చరణాంబుజములను స్మరించుకొనుచుండెను. శివుడు ప్రయోగించిన శూలము తగులగవే శంఖచూడునీ శరీరము భస్మమైపోయినది. ఆరని సారధి భస్మమైనాడు. అప్పుడు శంఖచూడుడు దివ్యరూపమును ధరించీ గోపాలకుని వేషముతో రత్న భూషణ భూషితుడై మురళిని చేతబట్టి అనేకాలంకార శోభితులైన గోపాలకులు వెంటరాగా గోలోకమునకు పోయెను.
శంఖచూడుడు దివ్యశరీరమును ధరించి గోలోకమునకు పోయి అచ్చటనున్న రాధామాధవుల పాదపద్మములకు నమస్కరించెను. వారు తిరిగి తమ లోకమునకు వచ్చిన సుదాముని అత్యంత ఎత్యల్యములో చూచిరి.
భూలోకమున శంఖచూడుని సంహరించిన శ్రీహరి రూలము తిరిగి పరమేశ్వరుని చేరినది. శంకరు డా శూలములో దానవుని ఆస్థికలను లవణ సముద్రమున కలిపెను. శంఖచూడుని అస్థికలనుండి అనేకవిధములైన శంఖజాతులు పుట్టినవి. ఆ topములు దేవతార్చనలో ప్రశస్తమైనవి, శంఖతోయము దేవలకు చాలా ఇష్టమైనది. శంఖ శబ్దము వినబడుచోట లక్ష్మీదేవి యుండును. శఖతీర్థమున స్నానము చేసినచో సమస్త తీర్థములందు స్నానము చేసిన ఫలము కల్గును.
శిపుడు శంఖచూడుని చంపి కైలాసము చేరెను. దేవతలకు తమ రాజ్యము తిరిగి లభించుటచే చాలా సంతోపడిరి. వారు శివునిపై పుష్పవర్షమును కురిపించిరి. వారు శివుని అనేకరీతుల కొనియాడిరి.
శ్రీ బ్రహ్మవైవర్తమహాపురాణమున రెండవదగు ప్రకృతి ఖండమున వారద నారాయణ సంవాదములోని తులస్యుపాఖ్యానమునందలి శంఖచూడవధలో శంఖ ప్రస్తావనను ఇరువదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 20 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
The very moment Tulasī's chastity was compromised, Lord Śiva cast His glowing trident at Shankhachūḍa on the battlefield, reducing the Asura king's physical body to ashes and releasing the soul of Sudāmā to return triumphantly to Goloka. Meanwhile, Tulasī realized that the person in her bed was not her husband but the Supreme Lord Śrī Vishṇu, and in Her deep grief She cursed Him to become a hard black stone. Lord Śrī Vishṇu lovingly solaced Her, revealing that Her curse would manifest as the sacred Shālagrāma stone in the Gaṇḍakī River, while Her body would transform into the holy Tulasī plant, whose leaves would be forever essential for His worship, uniting them in eternal spiritual reverence across all worlds.