నారద ఉవాచ- నారదుడిట్లనెను –
ఓ రాయణముమీ! నీవలన ప్రకృతికి సంబంధించిన అన్ని విషయములను తెలిసికొంటిని. ఐనమ ఆ దేవియొక్క కవచమున స్తోత్రమును నాకు వివరించి చెప్పుము.
నారాయణ ఉవాచ- నారాయణుడు నారదునితో నిట్లనెను –
ప్రకృతి రూపిణియగు దుర్గాదేవిని పూర్వము శ్రీకృష్ణుడు లోకమందలి రాసమండలమున చైత్రమాసమున పూజించెను. తరువాత మధుకైటభులతో యుద్దము చేయుచున్నప్పుడు శ్రీమహావిష్ణువు ఆ దేవిని పూజించెను. అట్లే బ్రహ్మదేవుడు తన ప్రాణసంకటమేర్పడినదని తలచి ఆ దేవిని పూజించెను. ఆ తరువాత త్రిపురాసుర యుద్ధ సమయమున త్రిపురారియగు శివు డాదుర్గాదేవిని పూజించేమ. అట్లే వృత్రాసురునితో యుద్ధము జరుగుచున్న సమయములో ఇంద్రు డా దేవిని పూజించెను. అట్లే దేవతలు స్థానభ్రష్టులై ప్రాణాపాయ సంకట పరిస్థితిలోనున్నప్పుడు ఆ దేవిని పూజించిరి. ఆ తరువాత మునీంద్రులు, మనుషులు, సురథుడు మొదలైన రాజు లో దుర్గాదేవిని పూజించిరి. ఈ విధముగా ప్రతికల్పములో ఆ దేవిని పూజించుచున్నారు.
ఇక నారదా! సమస్త విఘ్నములను తొలగించునది, సుఖమును, మోక్షమును కలిగించు ఆ దేవియొక్క స్తోత్రమున వినుము.
శ్రీకృష్ణ ఉవాచ- శ్రీకృష్ణుడిట్లు పలికెన (స్తుతించెను) –
ఓ దుర్గా! నీవు అందరకు తల్లివి, మూలప్రకృతివి, ఈశ్వరివి. సృష్టి జరుగునప్పుడు నీవే తొలుత జన్మించితివి. నీవు సత్వరజస్తమోగుణ స్వరూపిణివి. నీవు నిజముగా విర్గుణవేయొసము దేవకార్యమునకై, భక్తులకై సగుణ స్వరూపిణిదీ, సనాతనివి. తేజోమూర్తివి అగుచున్నావు. అట్లే భక్తుల నెల్లప్పుడు అనుగ్రహించుదావవు. ఈ ప్రపంచముననున్న పమప్త రూపములు నీవే. అట్లే నీపు ప్రపంచమునమన్న సమస్త జీవులకు ఈశ్వరివి. అన్నిటికి ఆధారభూతవు, పరాత్పరపు, సమస్త కారణములు నీవే సర్వపూజ్యపు, నిరాశ్రయపు, సర్వజ్ఞవు, సర్వతోభద్రపు, సర్వమంగళ మంగళవు నీవే. నీవే సమస్త బుద్ధి స్వరూపవు, సర్వశక్తి స్వరూపిణివి సర్వజ్ఞానములనిచ్చు దేవివి. సర్వభావినిని అంతయు నీవే.
అట్లే దేవతలకు యజ్ఞమున చరుపు మొదలగు వస్తువులను దానముచేయునప్పుడు నీవు అగ్ని పత్నీయగు స్వాహాదేవి రూపములో ఉంటున్నావు. పితృయజ్ఞమున స్వధారూపిణివిగా అన్ని దానములలో సర్వశక్తి స్వరూపిణివగు దక్షిణా స్వరూపమున కనిపించుచున్నావు. నిద్ర, దయ, తృష్ణ ఆకలి, క్షమ, శాంతి, శాశ్వతసృష్టి శ్రద్ధా, పుష్టి తంద్ర, సిగ, శోభ, దయ, అన్నియు నీ స్వరూపములే. పుణ్యముచేసికొన్నవారికి సంతోషరూపిణిగా, పాపులకు కలహటజముగా, సజ్జనులకు సంపదగా, దుష్టులకు ఆపదగా దర్శనమొసగుచున్నావు. సమస్త జీవులకు కర్మమయివైన శక్తి రూపిణిగా కనీపించుచున్నాను. దేవతలు తమ స్థానములను పోగొట్టుకొనినప్పుడు వారికి తిరిగి వారీ అధికారములనీప్పించితివి. దేవతల కొరకు సమస్త రాక్షసులను వీచే సంహరించితివి.
యోగనిద్ర, యోగరూప, సిద్దిస్వరూప, సిద్దిని కలిగించుదానపు, యోగమును కలిగించుడానపు అంతయునీవే. నీవు బ్రహ్మాణియగు బ్రహ్మశక్తిగా మాహేశ్వరియగు మహేశ్వరుని శక్తిగా, వైష్ణవియగు విష్ణుమాయగా సర్వలోకములకు భయంకరమైన భద్రకాళిగా కన్పించుచున్నావు.
ఓ తల్లీ! నీవు ప్రతిగ్రామమున గ్రామదేవతగా, ప్రతి ఇంటిలో గృహలక్ష్మిగా కన్పించుచువాపు. సజ్జనుల కీర్తిప్రతిష్ఠలు, దుర్జనులయొక్క నింద వీ స్వరూపములే. మహాయుద్ధమున దుష్టులను సంహరించు మహామారిగానున్నావు. నీపు సజ్జనులను తల్లివలె రక్షించుచున్నాపు. నీపు బ్రహ్మాది దేవతలచే ఎల్లప్పుడు నతులు, నుతులనందుకొనుచున్నావు. నీవు బ్రాహ్మణులయొక్క బ్రహ్మతేజస్సుపు, మునులకు తపస్యా రూపిణివి. విద్యావంతులకు విద్యపు, బుద్ధిమంతులకు బుద్ధివి, మేధా, స్మృతిరూపిణివి, ప్రతిభావంతులకు ప్రతిభవు. రాజాలకు ప్రతాపరూపిణివి. వర్తకులకు వాణిజ్య రూపిణివి. సృష్టియందు సృష్టిస్వరూపపు స్థితియందు రక్షారూపిణివిగా కన్పించుచున్నావు.
అదేవిధముగా ప్రళయకాలమున నీవు మహామారిగా అవతరించుచున్నావు, కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రి ఇవిఅన్నియు నీయొక్క రూపములే. నాయొక్క మాయారూపిణివగు నిన్ను ఎవ్వరు అతిక్రమింపజాలరు. అందువలన నీవలన ఈ ప్రపంచమంతయు మోహపరవశమగుచున్నది. ఆ కారణము వలననే విద్వాంసుడు సహితము ప్రాకృతుని వలె మోక్షమార్గము పొందుటకు ప్రయత్నించడు అని శ్రీకృష్ణుడు ఆ దుర్గాదేవిని స్తుతించెను.
మాసపుల కష్టములన్నిటినీ తొలగించు ఈ దుర్గా ప్లాలమును నేమ (శ్రీకృష్ణ పరమాత్మ) చేసితిని. దీనిని పూజాకాలమున పఠించువారికి సర్వసిద్దులు కలుగును. గొడ్డురాలైనను, సంతానము కలిగి చనిపోవుచున్నమ స్త్రీ ఈస్తోత్రమును సంవత్సరమువరకు వీయతముగా వినచో మంచీ పుత్రుని తప్పక పొందును. మహా భయంకరమైన కారాగారముననుప్పను, దృఢబంధనములతో కట్టబడివను ఈ స్తోత్రమును ఒక నెలవరకు చదివినచో బంధముక్తుడగును. క్షయవ్యాధిగ్రస్తుడైనను, . కుఘ్ఠరోగమున్నను, కడుపునొప్పియున్నను, గొప్ప రోగము వచ్చినను ఈ స్తోత్రముమ ప్రతిదినము వినుచు పోయిన సంవత్సరకాలముననే అతడు రోగవిముక్తుడగును. తనపోరు తప్పిపోయిన సమయమున ఈస్తోత్రమును నియతముగా ఒక నెలవరకు విమచున్న యెడల వారిని తిరిగి పొందును. రాజద్వారమున, శ్మశానమున, మహారణ్యమున, యుద్ధరంగమున భయంకరమైన జంతువుల సమీపమున గృహదాహమున. ఇతర కష్టకాలములందు ఈ స్తోత్రమును చదివినచో అతవి కష్టములన్నియు దూరమగును. మహాదరిద్రుడైనను. మూర్ఖుడైనను, ఒక సంవత్సరము వరకు ఈ సోత్రమును చదివినచో అతడు ధనవంతుడు, విద్యావంతుడు తప్పక అగును.
శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణములో రెండవదగు ప్రకృతిఖండమున నారదహారాయణులంవాదమున చెప్పబడిన దుర్గాదేవియొక్క ఉపాఖ్యానమున దుర్గాస్తోత్రమను అరవైయారవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 66 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
Guiding the seeker toward the summit of spiritual life, this chapter expounds upon the doctrine of Śaraṇāgati or total divine surrender to the lotus feet of Parā Prakṛti and Lord Śrī Kṛshṇa. It explains that true surrender involves aligning one's mind, speech, and actions with divine righteousness, abandoning all selfish pride, and trusting unconditionally in the protection of the Supreme Divine Mother and Father. The chapter reassures spiritual seekers that those who surrender completely are personally carried across the dark ocean of material existence by the merciful hand of the Divine Mother.