శ్రీ మద్భాగవతము - ఏకాదశ (11వ) స్కందము

Table of Contents

15 - యోగ సిద్ధులు

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను ... ఇంద్రియములను జయించి ప్రాణాయామమును అభ్యసిస్తూ, మనస్సును ఏకాగ్రము చేసి నా పై ధారణ చేసే యోగికి అణిమ మొదలైన సిద్ధులు ఉపస్థితములగును.

ఉద్ధవుడిట్లు పలికెను -- ఓ అచ్యుతా! ఏ ధారణచే ఏ సిద్ది ఏ విధముగా కలుగునో చెప్పుము. సిద్ధులెన్ని? యోగులకు సిద్ధులనిచ్చేది నీవే.

 ధారణయొక్క అభ్యాసములో నిష్ణాతులైన యోగులు పద్దెనిమిది సిద్దులు గలవని చెప్పెదరు. వాటిలో ఎనిమిది ప్రధానముగా నాయందు మాత్రమే గలవు (ఇతరులయందు తక్కువగా ఉండును). పది సత్త్వగుణముయొక్క ఉత్కర్షచే కలుగును.

అణిమ (చిన్నది యగుట), మహిమ (పెద్దది యగుట), లఘిమ (తేలిక యగుట) అనే మూడు సిద్దులు దేహమునకు సంబంధించినవి. ఆయా ప్రాణుల ఇంద్రియముల జ్ఞానమును పొందగల్గుట ప్రాప్తి అనే ఇంద్రియసిద్ధి. ఇహపరలోకములయందలి భోగములను పొందగల్గుట ప్రాకామ్యము. భౌతికశక్తులను శాసించే శక్తి ఈశిత్వము (మనస్సిద్ధి).

గుణకార్యములగు శబ్దాదివిషయములయందు ఆసక్తి లేకుండుట వశీత్వము. దేనిని కోరితే దానిని పూర్ణముగా పొందుట కామావసాయిత్వము. ఈ ఎనిమిది సిద్ధులు నాకు సహజసిద్ధములు.

ఈ దేహమునందు ఆకలిదప్పికలు లేకుండుట, దూరమునందున్న శబ్దములను వినుట, దూరమునందలి దృశ్యములను చూచుట, మనస్సుయొక్క వేగమువంటి వేగమును కలిగియుండుట, కోరిన రూపమును పొందుట, ఇతరదేహమునందు ప్రవేశించుట అనేవి సిద్ధులు.

తనకు నచ్చినప్పుడు మరణించుట, దేవతలు వలె అప్సరసలతో కలిసి క్రీడించుట, సంకల్పించిన వస్తువును పొందుట, ఆదేశము వ్యర్థము కాకుండా అంతటా పాటించబడుట అనేవి సిద్దులు.

భూతభవిష్యద్వర్తమానకాలములయందలి పదార్థములను తెలియుట, చలి-వేడి మొదలైన ద్వంద్వములచే ప్రభావితుడు కాకుండుట, ఇతరుల మనస్సు స్థానము మొదలగువాటిని తెలియగల్గుట, అగ్ని-సూర్యుడునీరు-విషము-ఆయుధములు ఇత్యాదుల గమనమును నిలిపివేయుట, పరాజయము లేకుండుట అనేవి సిద్ధులు.

యోగధారణవలన లభించే ఈ సీద్దుల పేర్లను చెప్పితిని. ఏ ధారణ వలన ఏ సిద్ధి ఏ విధముగా కలుగునో నేను చెప్పెదను, తెలుసుకొనుము.

గంధాదిభూతసూక్ష్మములు నా శక్తులు. సాధకుడు మనస్సును వాటితో ఏకాకారము చేసి ధారణ చేయవలెను. నా సూక్ష్మశరీరమైన గంధాదితన్మాత్రలను ఉపాసించువాడు అణిమ అనే సిద్ధిని పొందును.

సమష్టిజ్ఞానశక్తి యైన మహత్తత్త్వము పరమేశ్వరుడనగు నా సూక్ష్మశరీరము. ఆ మహత్తత్త్వమును ధారణ చేయు సాధకుడు మహిమ అనే సిద్ధిని పొందును. ఇంతేగాక, పంచభూతములు కూడ నా శరీరమే. వాటిపై వేర్వేరుగా ధారణ చేయువాడు ఆయా భూతముల మహత్త్వ మును పొందును. ఇది కూడ మహిమయే. కాబట్టి, మహిమ యనగా పృథివి వలె బరువుగా నగుట ఇత్యాది భూతముల మహిమను పొందుట.

భూతములయొక్క పరమాణువులే స్థూల-ఉపాధిగా గల నన్ను ప్రేమతో ధ్యానించే యోగి లఘిమ అనే సిద్ధిని పొంది, కాలముయొక్క సూక్ష్మాంశమగు పరమాణువు వలె తేలికదనమును పొందును.

సమష్టియందలి సాత్త్వికాహంకారము నో ఉపాధియే. అట్టి నాపై ఏకాగ్రమగు మనస్సును ధారణ చేస్తూ నన్ను ఉపాసించే యోగి ప్రాప్తి అనే సిద్ధిని పొంది, సకలప్రాణుల ఇంద్రియములకు ఆత్మభావమును పొందును.

నేను మాయాశక్తిని ఉపాధిగా చేసుకొని సమష్టి ప్రాణశక్తిగా - ప్రకటమైనాను. దారము పువ్వులను వలే సకలప్రాణులను ఒకే ప్రాణశక్తి యందు నిలిపి ఉంచే హిరణ్యగర్భతత్త్వము నా రూపమే. అట్టి సోయందు, మనస్సును ధారణ చేయువాడు ప్రాకామ్యమవే సిద్ధిని పొందును. ఆ సిద్ది (ఇహపరముల భోగములను పొందుట) నాయొక్క సర్వోత్కృష్టమైన శక్తి.

కాలరూపుడై ముల్లోకములను శాసించుచున్నాడు. ఆయనపై చిత్తమును ధారణ చేయు యోగి ఈశిత్వమనే సిద్ధిని పొంది దేహాదులను, జీవులను ప్రేరేపించగల్గును.

బ్రహ్మాండము, మహత్తత్త్వము, అవ్యక్తము అనే మూడు ఉపొధులకు అతీతమైన సచ్చిదానందమే జాగ్రత్స్వప్నసుషుపులకు అతీతమైన ప్రత్యగాత్మ. ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము అనే ఆరు గుణములు సంపూర్ణముగా ఉన్నందున ఆ పరబ్రహ్మకే భగవానుడు. అనియు, సకలప్రాణులలో ఆత్మరూపుడై యుండుట వలన నారాయణుడనియు పేరు. అట్టి నా పై ధారణ చేసే యోగికి వశిత్వమనే సిద్ధి లభించి నా ధర్మములైన ఐశ్వర్యాదులు ఆతనియందు ప్రకటమగును.

నిర్గుణపరబ్రహ్మనగు నాయందు శుద్ధమైన మనస్సును ధారణ చేసే సాధకుడు బ్రహ్మానందమును పొందును. కామావసాయిత (కామనలు సమాప్తమగుట) అనే సిద్ధి అదియే.

శ్వేతద్వీపపతి (అనిరుద్ధమూర్తి) నగు నేను సత్వగుణప్రధానుడనై ధర్మమును ప్రవర్తిల్లజేసెదను. అట్టి నాపై చిత్తమును ధారణ చేసే మానవునకు ఆకలిదప్పికలు, జరామరణములు, శోకమోహములు అనే ఆరు ఊర్ములు తొలగిపోయి శుద్ధమగు స్వరూపమును పొందును.

హిరణ్యగర్భరూపుడనగు నా స్వరూపము ఆకాశము వలే నిర్మలము, వ్యాపకము. దానియందు మనస్సుతో సోదమును ధ్యానము చేయు యోగి అచట అభివ్యక్తమయ్యే ప్రాణుల హక్కులను దూరమునుండే వీనును.

చూపును సూర్యునియందు, సూర్యుని కూడ చూపునందు సంయోగము చేసి, ఆ సంయోగమునందు నన్ను ధ్యానము చేయు యోగి దూరదర్శనమనే సిద్ధిని పొంది జగత్తులో దేనినైననూ చూడగల్గును.

మనస్సును, దేహమును, దేహముననుసరించి ఉండే ప్రాణవాయువుతో సహా నాయందు బాగుగా ధారణ చేయవలెను. దాని ప్రభావముచే మనోజవమనే సిద్ధి కలిగి, మనస్సు ఏ దేశమును సంకల్పిస్తే, దేహము క్షణములో ఆ దేశమును పొందును.

నాయందలి ధారణకు సకలసిద్దులనిచ్చే ప్రభావము గలదు. దావీచే యోగి మనస్సుతో ఏయే అభీష్టరూపముమ ధారణ చేయునో, ఆయా రూపమును పొందును.

దేహేంద్రియసంఘాతమును వశము చేసుకున్న యోగీ. ఇంకో ప్రాణియొక్క దేహమును ప్రవేశించగోరినచో, తనను ఆ దేహమునందు ధారణ చేయవలెను. అప్పుడు సూక్ష్మశరీరము దేహమును విడిచి పెట్టి వాయువుగా మారి, తుమ్మెద ఒక పువ్వునుండి ఇంకో పువ్వుమీదకు వెళ్లే విధముగా, ఆ దేహములోనికి ప్రవేశించును. ఇదియే పరకాయప్రవేశము.

యోగి కాలి మడమతో మూలాధారమును నొక్కి పెట్టి ప్రాణశక్తిని హృదయము, వక్షఃస్థలము, కంఠము, శిరస్సులయందు క్రమముగా పైకి తేవలెను. దానిని బ్రహ్మరంధ్రము ద్వారా పరబ్రహ్మయందు విలీనము చేసి దేహమును విడిచి పెట్టవలెను (స్వచ్ఛందమృత్యువనే సిద్ధి).

దేవతలు విహరించే ఉద్యానమునందు విహరించే కోరిక గల యోగి. శుద్ధసత్త్వమయుడనగు నన్ను భావన చేయవలెను. అప్పుడు సత్త్వగుణముయొక్క అంశలైన దేవతాస్త్రీలు విమానము పై సమీపమునకు వచ్చెదరు.

సత్యస్వరూపుడనగు నాయందు నిష్ఠ గల వ్యక్తి మనస్సును నాపై ఏకాగ్రము చేసి బుద్ధితో ఎప్పుడైనా ఏ విధముగా సంకల్పించునో, ఆ విధముగా దానిని బాగుగా పొందును.

నేను సర్వమును నియంత్రించే స్వతంత్రుడను. ఈశిత్వవశిత్వసిద్దులు గల నన్ను ధ్యానించే వ్యక్తి కూడ నా స్వభావమును పొందును. నా ఆజ్ఞ వలెనే ఆతని ఆదేశము కూడ దేని (ఎవని) వలనైననూ అడ్డుకొనబడదు.

నాయందలి భక్తిచే పరిశుద్ధమైన అంతఃకరణము కలిగి ధారణను అభ్యసించే యోగియొక్క బుద్ధిలో భూతభవిష్యద్వర్తమానకాలముల సంగతులు (తన) జననమరణముల సమాచారముతో సహా భాసించును.

మననశీలుడగు యోగి చిత్తమును నాయందు ఏకాగ్రము చేయుటచే శాంతముగా నుండును. యోగముచే పరిపక్వమైన ఆతని దేహమునకు, నీరు జలజంతువులకు వలె, అగ్ని-నీరు మొదలైనవి హాని చేయవు.

నా అవతారములు శ్రీవత్సము-పద్మము మొదలగు చిహ్నములతో, చక్రము మొదలగు ఆయుధములతో, జెండా-గొడుగు-వింజామర మొదలగు చక్రవర్తిచిహ్నములతో కూడియుండును. ఆ అవతారములను ధ్యానించే యోగి పరాజయమును పొందడు.

 ఈ విధముగా చిత్తెకాగ్రతను అభ్యసిస్తూ నన్ను ధ్యానించే మనన శీలుడగు యోగికి పైన చెప్పిన సిద్ధులు నిశ్శేషముగా ఉపస్థితములగును.

దేహమును, బాహ్యేంద్రియములను, మనస్సును జయించి, ప్రాణాయామమును, సొరాయణుడనగు నాయందు ధారణను అభ్యసిస్తూ మననశీలుడైన యోగికి మిక్కిలి దుర్లభమైన ఆ సిద్ది యేది? (ఏదీ లేదు),

ఈశ్వరప్రాప్తి అనే ఉత్తమమైన యోగమునభ్యసించే యోగి. పరమేశ్వరునిలో ఐక్యమగును. అట్టి యోగికి ఈ సిద్దులు కొలమును వ్యర్థము చేయుటకు హేతువులగుటచే ఆటంకములని పెద్దలు చెప్పెదరు.

ఈ లోకములో చేపలకు పుట్టుకచే జలస్తంభసిద్ధి గలదు. మందులతో వృద్ధాప్యమును పొయిదా వేసే సిద్ధి కలుగవచ్చును. తపస్సుచే విశ్వామిత్రుడు కొత్త లోకమును రచించే శక్తిని పొందెను. మంత్రములచే వశీకరణము మొదలైన సిద్దులు కలుగవచ్చును. యోగముచే సాధకుడు వీటినన్నింటినీ పొందగలడు. కాని, యోగముచే సిద్ధించే మోక్షము మాత్రము ఇతరోపాయములతో సిద్ధించదు.

సకలసిద్దులకు మాత్రమే గాక, బ్రహ్మవేత్తలచే బోధించబడిన యోగమునకు, జ్ఞానమునకు, ధర్మమునకు (బ్రహ్మవేత్తలకు) కూడ కారణము నేనే; పాలకుడను, ప్రభుడను కూడ నేనే.

సకలప్రాణులలో నేను ఆత్మస్వరూపుడను, అంతర్యామిని. బయట కూడా అపరిచ్చిన్నుడనగు నేనే సర్వమును వ్యాపించియున్నాను. ప్రాణుల దేహములయందు పంచభూతములు లోపల, బయట కూడా ఉన్నట్లే, నేను కూడ లోపల, బయట వ్యాపించి ఉన్నాను.

శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో

యోగసిద్ధులను వర్ణించే పది హేనవ అధ్యాయము ముగిసినది .