భాగవత మహా పురాణము
31 - నారద ప్రచేతస సంవాదము
మైత్రేయ ఉవాచ ।
తత ఉత్పన్నవిజ్ఞానా ఆశ్వధోక్షజభాషితమ్ ।
స్మరంత ఆత్మజే భార్యాం విసృజ్య ప్రావ్రజన్ గృహాత్ ॥
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- శ్రీహరి నిర్దేశించిన కాలము పూర్తి అయిన తరువాత ఆ ప్రచేతసులు శ్రీహరియొక్క వచనమును స్మరించి, కొడుకునకు భార్యను అప్పజెప్పి, ఇంటిని విడిచి సన్న్యసించిరి.
దీక్షితా బ్రహ్మసత్రేణ సర్వభూతాత్మమేధసా ।
ప్రతీచ్యాం దిశి వేలాయాం సిధోకభూద్యత్ర జాజలిః ॥
వారు పడమరదిక్కునందలి సముద్రతీరమునకు వెళ్లి, బ్రహ్మవిచా రమునకు సంకల్పమును చేసిరి. ఆ విచారమునందు సర్వప్రాణులయందు తానే ఆత్మరూపముగా నున్నాననే సత్యము గుర్తించబడును. అది జాజలి మహర్షి ముక్తిని పొందిన స్థానము.
తాన్నిర్జితప్రాణమనోవచోదృశో
జితాసనాన్ శాంతసమానవిగ్రహాన్ ।
పరేమలే బ్రహ్మణి యోజితాత్మనః
సురాసు రేడ్యో దదృశే స్మ నారదః ॥
ఆ ప్రచేతసులు సర్వక్రియలనుండి విరమించుకొని, మౌనమును పాటిస్తూ, కళ్లు మూసుకొని, నిటారుగా కూర్చున్నవారై, ఆసనమును జయించి, ప్రాణాయామమును చేసి, మనోనిగ్రహమును సంపాదించిరి. వారు శుద్దమగు పరబ్రహ్మయందు మనస్సును నిలిపియుంచిరి. వారిని నారదమహర్షి చూచెను. ఆయనను దేవతలు మాత్రమే గాక, రాక్షసులు కూడ కొనియాడుచుందురు.
తమాగతం త ఉత్థాయ ప్రణిపత్యాభినంద్య చ ।
పూజయిత్వా యథాదేశం సుఖాసీనతథాస్తువన్ ॥
నారదుడు రాగానే వారు లేచి నిలబడి నమస్కరించి ఆయన రాకను ప్రశంసించిరి. ఆయనకు యోగ్యమగు ఆసనమునిచ్చి పూజించిరి. ఆయన సుఖముగా కూర్చుండియుండగా, వారిట్లు స్తుతించిరి.
ప్రచేతస ఊచుః ।
స్వాగతం తే సురర్వేద్య దిష్ట్యా నో దర్శనం గతః ।
తవ చంక్రమణం బ్రహ్మన్నభయాయ యథా రవేః ॥
ప్రచేతసులు ఇట్లు పలికిరి --- ఓ దేవర్షీ! నీకు స్వాగతము. దైవా నుగ్రహముచే నీవు మాకు కనబడితివి. సూర్యుని సంచారముచే లోకము లకు వెలుగు కలిగి భయము పోవును. అదే విధముగా నీ సంచారముచే లోకులకు జ్ఞానోదయమై సంసారభయము తొలగును.
యదాదిష్టం భగవతా శివేనాధోక్షజేన చ ।
తద్గృహేషు ప్రసక్తానాం ప్రాయశః క్షపితం ప్రభో ॥
ఓ ప్రభూ! శివ భగవానుడు మరియు శ్రీహరి కూడ ఆత్మతత్త్వ మును ఉపదేశించినారు. కాని, మేము చాల కాలము గృహవిషయములలో గట్టి ఆసక్తిని కలిగియుండుటచే, ఆ ఉపదేశమును చాలవరకు మరచితిమి.
తన్నః ప్రద్యోతయాధ్యాత్మజ్ఞానం తత్త్వార్థదర్శనమ్ ।
యేనాంజసా తరిష్యామో దుస్తరం భవసాగరమ్ ॥
కావున, నీవు మాకు యథార్థమగు అద్వయవస్తువుయొక్క సాక్షా త్కారమును కలిగించే ఆత్మజ్ఞానమును ప్రకాశింప జేయుము. దాని వలన మేము తరించ శక్యము కాని సంసారసముద్రమును తేలికగా తరించెదము.
మైత్రేయ ఉవాచ ।
ఇతి ప్రచేతసాం పృష్టో భగవాన్నారదో మునిః ।
భగవత్యుత్తమశ్లోక ఆవిష్టాత్మాబ్రవీన్నృపాన్ ॥
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా మహారా జులగు ప్రచేతసులు ప్రశ్నించగా, పూజ్యుడగు నారద మహర్షియొక్క మనస్సు ఉత్తమమగు కీర్తి గల శ్రీహరియందు సంలగ్నమయ్యెను. ఆయన వారితో నిట్లనెను.
నారద ఉవాచ ।
తజ్జన్మ తాని కర్మాణి తదాయుస్తన్మనో వచః ।
నృణాం యేనేహ విశ్వాత్మా సేవ్యతే హరిరీశ్వరః ॥
నారదుడిట్లు పలికెను --- జగద్రూపములో ప్రకటమైన శ్రీహరియే ఈ జగత్తునకు ఆత్మ. మానవులకు జగన్నాథుడగు శ్రీహరి సేవలో విని యోగించిన జన్మయే జన్మ; శ్రీహరిని సేవించుటకు చేసే కర్మలే కర్మలు; శ్రీహరి సేవలో వినియుక్తమైన ఆయుర్దాయమే ఆయుర్దాయము; శ్రీహరిని స్మరించే మన స్సే మనస్సు; శ్రీహరిని కీర్తించే వాక్కే వాక్కు.
కిం జన్మభిస్తిభిర్వేహ శాక్లసావిత్రయాజ్ఞి కైః ।
కర్మభిర్వా త్రయీప్రోక్తేః పుంసోకపి విబుధాయుషా ॥
శ్రుతేన తపసా వా కిం వచోభిశ్చిత్తవృత్తిభిః ।
బుద్ద్యా వా కిం నిపుణయా బలేనేంద్రియరాధసా ॥
కిం వా యోగేన సొంఖ్యేన న్యాసస్వాధ్యాయయోరపి ।
కిం వా శ్రేయోభిరన్యైశ్చ న యత్రాత్మప్రదో హరిః ॥
శ్రీహరి భక్తులకు తనను తాను సమర్పించుకొనును. భక్తులకు ఆత్మజ్ఞానముననుగ్రహించేది శ్రీహరియే. అట్టి శ్రీహరితోడి సంబంధము లేనిచో, మంచి వంశములో పుట్టుట, ఉపనయనము అనే రెండవ జన్మ, యజ్ఞము అనే మూడవ జన్మ, వేదవిహితములైన కర్మలు, దేవతలకు వంటి ఆయుర్దాయము, శాస్త్ర శ్రవణము, తపస్సు, గొప్ప వాక్కులు, మనస్సు లోని గొప్ప ఆలోచనలు, నిపుణమగు బుద్ధి, శరీరబలము, ఇంద్రియ పాట వము, యోగాభ్యాసము, కేవలమగు ఆత్మానాత్మవివేకము, సన్న్యాసము, వేదాధ్యయనము, ఇతరములగు శ్రేయస్సాధనములు మొదలగువాటితో మానవునకు ప్రయోజనమేమున్నది?
శ్రేయసామపి సర్వేషామాత్మా హ్యవధిరర్థతః ।
సర్వేషామపి భూతానాం హరిరాత్మాత్మదః ప్రియః ॥
వాస్తవములో శ్రేయస్సాధనములన్నింటికి ఆత్మయే అవధి (అనగా, ఆత్మజ్ఞానమునకు దారి తీసే సాధనములు మాత్రమే శ్రేయస్కరములు). ఆత్మజ్ఞానమునిచ్చే శ్రీహరియే సకలప్రాణులకు ప్రియమగు ఆత్మ.
యథా తరోర్మూలని షేచనేన
తృప్యంతి తత్సంధభుజోపశాఖాః ।
ప్రాణోపహారాచ్చ యథేంద్రియాణాం
తథైవ సర్వార్హణమచ్యుతేజ్యా ॥
చెట్టు మొదట్లో నీరు పోసినచో, మ్రాను పెద్ద చిన్న కొమ్మలు సర్వ మునకు రసము అందును. ప్రాణశక్తికి ఆహారమును సమర్పించినచో, ఇంద్రియములన్నింటికీ శక్తి లభించును. అదే విధముగా, శ్రీహరిని అర్చించినచో, సకలజగత్తును అర్చించినట్లే యగును.
యథైవ సూర్యాతభవంతి వారః
పునశ్చ తస్మిన్ ప్రవిశంతి కాలే ।
భూతాని భూమౌ స్థిరజంగమాని
తథా హరావేవ గుణప్రవాహః ॥
సూర్యుని వలన అంతరిక్షమునుండి వర్షములు పడును. ఆ వర్షజ లమంతయు మరల వేసవి కాలములో అంతరిక్షములోనికి గ్రహించబడు ను. కదిలే మరియు కదలని ప్రాణుల దేహములన్నియు భూమినుండియే పుట్టి, మరల భూమిలోనే విలీనమగును. అదే విధముగా, సత్త్వరజస్తమోగుణాత్మకమగు ప్రకృతియొక్క ప్రవాహరూపమగు ఈ బ్రహ్మాండము శ్రీహరి నుండియే పుట్టి, శ్రీహరిలోననే విలీనమగును.
ఏతత్పదం తజ్జగదాత్మనః పరం
సకృద్విభాతం సవితుర్యథా ప్రభా ।
యథావసవో జాగ్రతి సుప్తశక్తయో
ద్రవ్యక్రియాఃజ్ఞానభిదభ్రమాత్యయః ॥
జగత్తుయొక్క వాస్తవికతత్త్వము శ్రీహరియే. శాస్త్రప్రసిద్ధమైన శ్రీహరియొక్క స్వరూపము ప్రకృతికి అతీతమైనది మరియు స్వయంప్రకా శము. పాంచభౌతికదేహము ప్రకృతికంటే భిన్నముగా నున్నదనియు, ఇంద్రి యశక్తులు ప్రకృతిశక్తికంటే వేరుగానున్నవనియు, తాను పరమాత్మకంటే భిన్నముగా నున్నాననియు మానవులు భ్రమించుచుందురు. ఆ స్వరూప మును ఆత్మరూపముగా తెలుసుకొనుట వలన ఇట్టి భేదభ్రాంతి దూరమగు ను. సూర్యునినుండి వెలువడే కాంతులు సూర్యునికంటే భిన్నముగా లేవు. జాగ్రదావస్థలో ప్రకటమయ్యే ఇంద్రియశక్తులు నిద్రావస్థలో ఏ ఆత్మయందు విలీనమగుచున్నవో, దానికంటే అవి జాగ్రదవస్థలోనైననూ భిన్నముగా ఉన్నట్లు కన్పట్టుటయే గాని, భిన్నముగా లేవు. అదే విధముగా శ్రీహరి నుండి వెలువడిన ఈ జగత్తు శ్రీహరికంటే భిన్నముగా లేదు.
యథా నభస్యభ్రతమఃప్రకాశా
భవంతి భూపా న భవంత్యనుక్రమాత్ ।
ఏవం పరే బ్రహ్మణి శక్తయస్త్వమూ
రజస్తమస్సత్త్వమితి ప్రవాహః ॥
ఓ ప్రచేతసులారా! ఆకాశములో మేఘములు, చీకటి వెలుగులు ఆయా కాలములలో కనబడి మరల అదృశ్యమగుచుండును. అదే విధముగా, శ్రీహరియందు సత్త్వరజస్తమోగుణములరూపములో మాయాశక్తి సృష్టికాలములో ప్రకటమై ప్రళయకాలములో విలీనమగును. ఈ శక్తుల వలననే జగత్తు అనే ప్రవాహము సాగిపోవుచున్నది.
తేనైకమాత్మానమశేషదేహినాం
కాలం ప్రధానం పురుషం పరేశమ్ ।
స్వతేజసా ధ్వస్తగుణప్రవాహ -
మాత్మైకభావేన భజధ్వమద్దా ॥
శ్రీహరియే సకలప్రాణులకు ఆత్మ. కాలరూపుడగు ఆయనయే ఈ జగత్తునకు ఉపాదానమగుచున్నాడు. ప్రకృతికి అతీతుడు మరియు పూర్ణుడు అగు శ్రీహరి చిదనుడు గనుక, ఈ త్రిగుణముల ప్రవాహరూప మగు జగత్తుయొక్క గుణదోషములు ఆయనకు సంక్రమించవు. అట్టి శ్రీహ రిని సాక్షాత్తు ఆత్మకంటే అభిన్నము అనే విధముగా సేవించుడు.
దయయా సర్వభూతేషు సంతుష్ట్యా యేన కేన వా ।
సర్వేంద్రియోపశాంత్యా చ తుష్యత్యాశు జనార్దనః ॥
సకలప్రాణులయందు దయ, లభించినదానితో తృప్తి పడుట, ఇంద్రియములనన్నింటినీ భోగ్యవిషయములనుండి వెనుకకు మళ్లించి శాంతముగా నుండుట అనువాటిచే దుష్టజనశీక్షకుడగు శ్రీహరి తొందరగా ప్రసన్నుడగును.
అపహతసకలైషణామలాత్మ -
న్యవిరతమేధితభావనోపహూతః ।
నిజజనవశరత్వమాత్మనోయన్
న సరతి ఛిద్రవదక్షరసతాం హి ॥
కామనలన్నియు తొలగుటచే సత్పురుషుల హృదయములు స్వచ్చముగా నుండును. వారు అట్టి తమ హృదయములో నిరంతరమగు భక్తిచే శ్రీహరిని ప్రతిష్ఠించేదరు. అక్షరపరబ్రహ్మయగు శ్రీహరి భక్తులకు వశుడై యుండుట అనే నిష్ఠ గలవాడై, వారి హృదయములనుండి హృద యాకాశము వలెనే తొలగిపోడు సుమా!
న భజతి కుమనీషిణాం స ఇజ్యాం
హరిరధనాత్మధనప్రియో రసజ్ఞః ।
శ్రుతధనకులకర్మణాం మదైర్యే
విదధతి పాపమకించనేషు సత్సు ॥
కుత్సితబుద్ధి గల జనులు తాము పెద్ద చదువులను చదివినామనియో, డబ్బు గలవారమనియో, గొప్ప కులమునకు చెందినవారమనియో, పెద్ద పెద్ద పూజలను చేసినవారమనియో గర్వించి, ఇవి ఏమీ లేని సత్పు రుషుల యెడల పాపమునాచరించెదరు. అట్టివారి పూజను శ్రీహరి స్వీక రించడు. ధనమేమీ లేకున్ననూ ఆత్మజ్ఞానమే ధనముగా గల మహాత్ముల హృదయములలోని భక్తిరసము ఆయనకు విదితమే.
శ్రీయమనుచరతీం తదర్థినశ్చ
ద్విపదపతీన్ విబుధాంశ్చ యత్స్వపూర్ణః ।
న భజతి నిజభృత్యవర్గతంత్రః
కథమముముద్విసృజేత్పుమాన్ కృతజ్ఞః ॥
స్వస్వరూపమునందు పూర్ణుడగు శ్రీహరి తన భక్తులకు వశుడై యుండును. కావుననే, ఆయన తనను నిరంతరముగా సేవించే లక్ష్మీ దేవిని, సంపదల వెంటబడే రాజులను, దేవతలను కూడ సరకు చేయడు. చేసిన ఉపకారమును గుర్తులోనుంచుకొనే సత్పురుషుడు ఎవ్వాడు అట్టి శ్రీహరిని కొద్ది సేపైననూ విడిచి పెట్టును?
మైత్రేయ ఉవాచ ।
ఇతి ప్రచేతసో రాజన్నన్యాశ్చ భగవత్కథాః ।
శ్రావయిత్వా బ్రహ్మలోకం యయా స్వాయంభువో మునిః ॥
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- భక్తితో ప్రకాశించే ఓ విదురా! స్వయంభువుడగు బ్రహ్మగారి పుత్రుడైన నారద మహర్షి ఈ విధముగా అనే కములగు భగవద్గాథలను ప్రచేతసులకు చెప్పి, బ్రహ్మలోకమునకు వెళ్లెను.
తేపి తన్ముఖనిర్యాతం యశో లోకమలాపహమ్ ।
హరేర్నిశమ్య తత్పాదం ధ్యాయంతస్తద్గతిం యయుః ॥
శ్రీహరియొక్క కీర్తిని విన్నవారి మాలిన్యములు దూరమగును. ఆ ప్రచేతసులు కూడ అట్టి శ్రీహరి కీర్తిని నారదుని ముఖమునుండి వినిరి. వారు ఆయన పాదములను ధ్యానిస్తూ, ఆయన ధామమును పొందిరి.
ఏతత్తేభిహితం క్షత్తర్యన్మాం త్వం పరిపృష్టవాన్ ।
ప్రచేతసాం నారదస్య సంవాదం హరికీర్తనమ్ ॥
ఓ విదురా! ప్రచేతసులకు నారదునకు శ్రీహరిని కీర్తించే సంవా దము జరిగినది. దానిని చెప్పమని నీవు నన్ను ప్రశ్నించితివి. దానిని ఈ విధముగా నేను నీకు చెప్పితిని.
శ్రీశుక ఉవాచ ।
య ఏష ఉత్తానపదో మానవస్యానువర్జితః ।
వంశః ప్రియవ్రతస్యాపి నిబోధ నృపసత్తమ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! స్వాయం భువమనువుయొక్క పుత్రుడగు ఉత్తానపాదుని వంశమును నీకింతవరకు వర్ణించితిని. ప్రియవ్రతుని వంశమును గురించి కూడ తెలుసుకొనుము.
యో నారదాదాత్మవిద్యామధిగమ్య పునర్మహీమ్ ।
భుక్త్వా విభజ్య పుత్రేభ్య ఐశ్వరం సమగాత్పదమ్ ॥
ప్రియవ్రతుడు నారదునినుండి ఆత్మజ్ఞానమును పొందెను. ఆయన రాజ్యమును భోగించి, తరువాత దానిని పుత్రులకు పంచి యిచ్చి, ఈశ్వరునిలో ఐక్యమయ్యెను.
ఇమాం తు కాషారవినోపవర్జితాం
క్షత్తా నిశమ్యాజితవాదసత్కథామ్ ।
ప్రవృద్ధభావోశ్రుకలాకులో మునేః
దధార మూర్ధ్నా చరణం హృదా హరేః ॥
మైత్రేయ మహర్షి ఈ విధముగా పరాజయమునెరుంగని శ్రీహరి యొక్క సత్కథను వర్ణించి చెప్పెను. దానిని విన్న విదురునకు భక్తి బాగావర్ధిల్లుటచే కన్నీరు స్రవించి ఆయన వ్యాకులుడయ్యెను. అపుడాయన ఆ మహర్షి పాదములకు శిరస్సుతో ప్రణమిల్లి, శ్రీహరి పాదములను హృదయములో ధ్యానించెను.
విదుర ఉవాచ ।
సోయమద్య మహాయోగిన్ భవతా కరుణాత్మనా ।
దర్శితస్తమః పారో యత్రాకించనగో హరిః ॥
విదురుడిట్లు పలికెను --- ఓ యోగిపుంగవా! దయాహృదయుడ వగు నీవీనాడు అజ్ఞానసముద్రముయొక్క ఆవలి తీరము (జ్ఞానము) ను చూపించితివి. ఆ జ్ఞానమును పొందినవారికి ఏమీ లేకున్ననూ, శ్రీహరి ఆశ్రయము లభించును.
శ్రీశుక ఉవాచ ।
ఇత్యానమ్య తమామంత్య్ర విదురో గజసాహ్వయమ్ ।
స్వానాం దిదృక్షుః ప్రయణా జ్ఞాతీనాం నిర్వృతాశయః ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- శాంతచిత్తుడగు విదురుడు ఈ విధముగా మైత్రేయునకు నమస్కరించి, ఆయనవద్ద సెలవు తీసుకొని, తన బంధువులను చూచే కోరికతో హస్తినాపురమునకు వెళ్లెను.
ఏతద్యశృణుయాద్రాజన్ రాజ్ఞాం హర్యర్పితాత్మనామ్ ।
ఆయుర్ధనం యశస్వస్తి గతిమైశ్వర్యమాప్నుయాత్ ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే చతుర్దస్కంధే నారద
ప్రచేతస సంవాదో నామ ఏకత్రింశోఽధ్యాయః ॥
ఓ పరీక్షిన్మహారాజా! శ్రీహరియందు అర్పించబడిన హృదయము గల ఈ మహారాజుల గాథలను విన్నవారికి ఆయుర్దాయము, ధనము, కీర్తి, కల్యాణములు, ఈశ్వరునితోడి ఐక్యము లభించును.
శ్రీమద్బాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధమునందు నారద ప్రచేతస సంవాదమును వర్ణించే ముప్పది ఒకటవ అధ్యాయము ముగిసినది.
నాల్గవ స్కంధము సమాప్తము.
హరిః ఓమ్, తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు.
Summary of chapter 31 of the Bhāgavata Mahā Purana is as follows:
After ruling the earth peacefully for many thousands of years alongside Queen Mārishā, the Pracetās renounce their kingdom and retire to the forest, where they encounter Devarshi Nārada. Nārada instructs the Pracetās on the absolute supremacy of unalloyed devotional service. He explains that just as watering the root of a tree nourishes all its branches and leaves, so serving Svayam Bhagavān Śrī Kṛshṇa fulfills all cosmic obligations and bestows ultimate spiritual perfection.