14 - పృథూపాఖ్యానము - వేనరాజు మరణించుట

మైత్రేయ ఉవాచ

భృగ్వాదయ స్తే మునయో లోకానాం క్షేమదర్శినః

 గోప్తర్యసతి వై నృణాం పశ్యంతః పశుసామ్యతామ్

 వీరమాతరమాహూయ సునీథాం బ్రహ్మవాదినః

 ప్రకృత్యసంమతం వేనమభ్యషించన్ పతిం భువః

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- వేదవేత్తలగు భృగువు మీద లగు మహర్షులు జనుల క్షేమమును గురించి చింతిల్లెదరు. ప్రజలను రక్షించే రాజు లేకపోతే ప్రజలు పశువుల వలే ఒకరినొకరు దోచుకొనెదరని వారు భావించిరి. వారు వీరుడగు వేనుని తల్లియైన సునీథతో సంప్రదించిరి. మంత్రులు మొదలగు రాజ్యాధికారులకు మరియు ప్రజలకు స్వభావమును బట్టి వేనుడు సమ్మతము కాదు. అయిననూ, వారు ఆతనినే రాజ్యమునకు ప్రభువుగా పట్టాభిషిక్తుని చేసిరి.

శ్రుత్వా నృపాసనగతం వేనమత్యుగ్రశాసనమ్

 నిలిల్యుర్దస్యవస్సద్యస్సర్ప్చస్తా ఇవాఖవః

మిక్కిలి కఠినమగు-శిక్షలను విధించే వేనుడు రాజసింహాసనమున ధిష్టించినాడని విని దొంగలు వెంటనే, పామునకు భయపడిన ఎలుకలు వలె, తమ కార్యకలాపములను కట్టిపెట్టి, అజ్ఞాతములోనికి వెళ్లిపోయిరి.

స ఆరూఢనృపస్థాన ఉన్నద్ధోష్టవిభూతిభిః

 అవమేనే మహాభాగాన్ స్తబ్ధస్సంభావితస్స్వతః

ఆ వేనుడు రాజసింహాసనముపై కూర్చుండగానే చాల గర్వ మును.పొందెను. ఎనిమిది దిక్కులలో ఆతని శాసనమునకు తిరుగు లేకుండెను. ఆతడు తన గొప్పలు తానే చెప్పుకుంటూ, అడ్డు ఆపు లేకుండా, మహాత్ములను అవమానించ దొడగెను.

ఏవం మదాంధ ఉతి నిరంకుశ ఇవ ద్వీపః

పర్యటన్ రథమాస్థాయ కంపయన్నివ రోదసీ

ఈ విధముగా వేనుడు ఐశ్వర్యమదముచే కన్ను మిన్ను కానరా కుండా అడ్డు ఆపు లేని ప్రవృత్తి గలవాడయ్యెను. ఆతడు, మావటీని అంకు శపు భయము లేని ఏనుగు వలే, రథముపై పర్యటిస్తూ భూమిని అంతరిక్ష మును వణికించెను.

న యష్టవ్యం న దాతవ్యం న హోతవ్యం ద్విజాః క్వచిత్

 ఇతి న్యవారయద్ధర్మం భేరీ మోషేణ సర్వశః

బ్రాహ్మణులు ఎక్కడైననూ యజ్ఞములను, దానములను, హోమ ములను చేయరాదు అనే భేరీశబ్దపూర్వకముగా చాటింపు వేయించి, ఆ వేనుడు ధర్మకార్యములను ఆపించెను.

వేనస్యావేక్ష్య మునయో దుర్వృత్తస్య విచేష్టితమ్

మృశ్య లోకవ్యసనం కృపయోచుస్స్మ సత్రిణః

చెడు స్వభావము గల వేనుని ఈ దుశ్చేష్టలను చూచి మహర్షులు జనులకు కలిగిన కష్టమును గురించి ఆలోచించి, దయ గలవారగుటచే ఒక చోట సమావేశమై ఇట్లు పలికిరి.

అహో ఉభయతః ప్రాప్తం లోకస్య వ్యసనం మహత్

దారుణ్యుభయతో దీప్త ఇవ తస్కరపాలయోః

ఆశ్చర్యము! జనులకు ఒకవైపు చోరులనుండి, రెండవవైపు రాజు నుండి పెద్ద ఆపద రెండు వైపులా వచ్చి పడినది. కట్టెకు రెండు వైపులా మంట పెట్టినప్పుడు మధ్యలోనుండే పురుగుల వలె, జనులు ఒకవైపు చోరులు, మరియొక వైపు రాజు వీరి మధ్యలో నలిగిపోవుచున్నారు.

అరాజకభయాదేష కృతో రాజారతదరణః

 తత్వోప్యాసీద్భయం త్వద్య కథం స్యాత్స్వస్తి దేహినామ్

దేశములో అరాచకము వచ్చునేమో యను భయముతో రాజసిం హాసనమునకు అర్హత లేని ఈ వేనుని మనము రాజుగా చేసినాము. కాని, ఇప్పుడు వీని వలన కూడ ప్రజలకు భయము వచ్చి పడినది. ఈ స్థితిలో జనులకు మేలు కలిగే ఉపాయమేమి?

అహేరివ పయఃపోష పోషకస్యాప్యనర్థభృత్

వేనః ప్రకృత్యైవ ఖలస్సునీథాగర్భసంభవః

త్రాచుపామునకు పాలను పోసి పెంచినచో, అది పెంచినవానినే కాటు వేయును. అదే విధముగా ఈ వేనుడు మనకు చేసినాడు. సునీథా దేవి కడుపున పుట్టిన ఈ వేనుడు స్వభావము చేతనే దుష్టుడు.

నిరూపితః ప్రజాపాలస్స జిఘాంసతి వై ప్రజాః

 తథాపి సాంత్వయేమాముం నాస్మాంస్తత్పాతకం స్పృశేత్

మనము ప్రజలను పాలించే రాజుగా అభిషేకించిన ఈ వేనుడు తానే స్వయముగా ప్రజలను హింసించ గోరుచున్నాడు. అయినప్పటికీ, మనము వీనికి నచ్చజెప్పెదము. అట్లు చేయుట వలన, వీడు చేసే పాపము మనకు చుట్టుకొనకుండును.

తద్విద్వద్భిరసద్వృత్తో వేనోస్మాభిః కృతో నృపః

 సాంత్వతో యది నో వాచం న గ్రహీష్యత్యధర్మకృత్

 లోకధిక్కారసందగ్ధం దహిష్యామస్స్వతేజసా

వేనుడు దుష్టుడని తెలిసియే మనము దుష్టశీలుడగు ఆ వేనుని రాజుగా చేసినాము. అధర్మములను చేయుచున్న ఆ వేనునకు మనము నచ్చజెప్పెదము. ఇప్పటికే ఆతడు జనుల ధిక్కారముచే మృతప్రాయుడై ఉన్నాడు. మనము చెప్పిన సలహాను ఆతడు వినని పక్షములో, మనమాత నిని మన తేజస్సుచే దహించి వేసెదము.

ఏవమధ్యవసాయైనం మునయో గూడమన్యవః

ఉపవజ్యాబ్రువన్ వేనం సాంత్వయిత్వా చ సామభిః

మహర్షుల కోపము రహస్యముగా నుండును. వారీ విధముగా నిశ్చయించుకొని, ఈ వేనుని వద్దకు వెళ్లిరి. వారు ముందుగా ఆతనిని ప్రియోక్తులతో తమకు అనుకూలముగా చేసుకొని, తరువాత ఇట్లు పలికిరి.

మునయ ఊచుః

నృపవర్య నిబోధైతద్యతే విజ్ఞాపయామ భోః

 ఆయుశ్రీర్బలకీర్తీనాం తవ తాత వివర్ధనమ్

మహర్షులు ఇట్లు పలికిరి --- ఓ మహారాజా! వత్సా! మేము నీకు ఒక విన్నపముమ చేసెదము. దీనిని పాటించినచో, నీ ఆయుర్దాయము, ఏ సంపద, బలము మరియు కీర్తి వర్ధిల్లును. నీవు దీనిని జాగ్రత్తగా విని తెలుసుకొనుము.

ధర్మ ఆచరితః పుంసాం వాజ్మనఃకాయబుద్దిభిః

 లోకాన్ విశోకాన్ వితరత్యథానంత్యమసంగినామ్

మానవుడు బుద్దితో ధర్మమును నిశ్చయించుకొని మనోవాక్కాయ ములతో దానిని ఆచరించవలెను. అట్లు చేయుట వలన వానికి ఇహపరలోక ములలో శోకము ఉండదు. మరియు, అట్టి వ్యక్తి ఇహాముత్రఫలభోగవిరక్తు డైనచో, ఆ ధర్మము వానికి మోక్షమునకు దారి (జ్ఞానము) ని సుగమము చేయును.

స తే మా వినశేద్వీర ప్రజానాం క్షేమలక్షణః

 యస్మిన్ వినష్ట నృపతిరైశ్వర్యాదవరోహతి

ఓయీ వీరా! ప్రజల క్షేమమే ధర్మమునకు చిహ్నము. అట్టి ధర్మము నీయందు నశించకుండును గాక! ఆ ధర్మమే నశించినచో, రాజు తన పదవిని సంపదను కోల్పోయి పతితుడగును.

 రాజన్నసాధ్వమాత్యేభ్యత్చోరాదిభ్యః ప్రజా నృపః

 రక్షన్ యథా బలిం గృహన్నిహ ప్రీత్య చ మోదతే

ఓ రాజా! రాజు ప్రజలను చెడు మంత్రులనుండి, చోరులు మొద లగు వారినుండి రక్షిస్తూ, వారినుండి ధర్మబద్ధముగా పన్నును వసూలు. చేయవలెను. అట్లు చేయు రాజు ఈ లోకములో మాత్రమే గాక, పరలోక ములో సుఖముల ననుభవించును.

యస్య రాష్ట్రే పురే చైవ భగవాన్ యజ్ఞపూరుషః

 ఇజ్యతే స్వేన ధర్మేణ జనెర్వర్ణాశ్రమాన్వితైః

 తస్య రాజ్ఞో మహాభాగ భగవాన్ భూతభావనః

పరితుష్యతి విశ్వాత్మా తిష్ఠతో నిజశాసనే

ఓ మహారాజా! రాజు తన రాజ్యములోనే గాక రాజధానీ నగర ములో కూడ జనులు స్వధర్మ పరాయణులై తమ తమ ధర్మములను నిర్వర్తిస్తూ, యజేశ్వరుడగు శ్రీహరి భగవానుని ఆరాధించునట్లు చూడవలెమ. అట్లు చేయు రాజు ఆ భగవానుని శాసనమును పాలించినవాడగును. సకల ప్రాణులను పాలించే శ్రీహరియే సకలప్రాణులలో ఆత్మరూపముగా నున్నా డు. అట్టి శ్రీహరి ఆజ్ఞను పాలించే రాజు విషయములో ఆయన సంతుష్టుడు గును.

తస్మింస్తుష్టే కిమప్రాప్యం జగతామీశ్వరేశ్వరే

లోకాస్సషాలా హ్యేతస్మై హరంతి బలిమాదృతాః

జగత్తులో ఇంద్రాది. ప్రభువులకు కూడ శ్రీహరియే ప్రభువు. ఆయన. సంతోషించినచో; అట్టి భక్తునకు, పొంద: శక్యము కానిది యేమి. ఉండును? ఏలయనగా; లోకపాలకులతో సహా పకలప్రాణులు. ఆ శ్రీహరి (లేదా, శ్రీహరి భక్తని) కొరకు సాదరముగా పూజోపహారములను సమ ర్పించుచున్నారు.

తం సర్వలోకామరయజ్ఞసంగ్రహం

త్రయీమయం ద్రవ్యమయం తపోమయమ్

 యజ్ఞర్విచిత్రైర్యజతో భవాయ తే

 రాజన్ స్వదేశాననురోద్ధుమర్హసి

ఓ రాజా! సకలలోకములను, లోకపాలకులను, వాటిని కర్మఫల రూపముగా పొందించే యజ్ఞములను, వేదరూపుడు వేదప్రతిపాద్యుడు అగు శ్రీహరియే నియంత్రించుచున్నాడు. ఆయనయే సకల (యజ్ఞ) ద్రవ్య ముల రూపములో నున్నాడు. తపస్సు కూడ ఆయన రూపమే. అట్టి శ్రీహ రిని రకరకముల యజ్ఞములచే జనులు ఆరాధించుట చేతనే నీవు జన్మించి, వర్దిల్లుచున్నావు. కావున, నీవు కూడ నీ దేశవాసులను అనుసరించుట, వారిని యజ్ఞములయందు ప్రవర్తిల్ల జేయుట యోగ్యముగా నుండును.

 యజ్ఞేన యుష్మద్విషయే ద్విజాతిభిః

వితాయమానేన సురాః కలా హరేః

 స్విష్టాస్సుతుష్టాః ప్రదిశంతి వాంఛితం

తద్దేలనం నార్హసి వీర చేష్టితుమ్

ఓ వీరా! నీ సామ్రాజ్యములో బ్రాహ్మణులు యజ్ఞములను చేసి శ్రీహరియొక్క అంశలైన దేవతలను చక్కగా ఆరాధించి సంతోష పెట్టుచున్నారు. వారు అట్లు చేయుటచే, నీ వాంఛితమును దేవతలు నెరవేర్చెదరు. కావున, ఆ దేవతలను, శ్రీహరిని తిరస్కరించుట నీకు తగదు.

వేన ఉవాచ

బాలిశా బత యూయం వా అధర్మే ధర్మమానినః

యే వృత్తిదం పతిం హిత్వా జారం పతిముపాసతే

ఆశ్చర్యముగా నున్నది! అధర్మమును ధర్మమని భావించే మీరు నిశ్చయముగా మూర్ఖులు. నేను మీకు జీవికను కలిగించుచున్నాను. అట్టి ప్రభువునగు నన్ను మీరు విడిచి పెట్టి, భర్తను విడిచి జారుని సేవించే స్త్రీవ లె, మీరు మరియొక ప్రభువు (విష్ణువు) ను సేవించుచున్నారు.

అవజానంత్యమీ మూఢ నృపరూపిణమీశ్వరమ్

నానువిందంతి తే భద్రమిహ లోకే పరత్ర చ

ఈ మూర్ఖులు రాజు రూపములోనుండే ఈశ్వరుడనైన నన్ను అవ మానించుచున్నారు. వీరికి ఈ లోకములో గాని, పరలోకములో గాని ఈపైన శుభము కలుగదు.

కో యజ్ఞపురుషో నామ యత్ర వో భక్తిరీదృశీ

భర్తృ స్నేహవిదూరాణాం యథా జారే కుయోషితామ్

భర్త ప్రేమకు దూరమైన (దూరముగానుండే) దుష్టయువతీ జారు నియందు ప్రీతిని కలిగియుండును. అదే విధముగా, మీరు యజ్ఞపురుషునియందు గొప్ప భక్తిని కలిగియున్నారు. ఈ యజ్ఞపురుషుడెవరు?

విష్ణుర్విరించో గిరిశ ఇంద్రో వాయుర్యమో రవిః

 పర్జన్యో ధనదస్సోమః క్షితిరగ్నిరపాం పతిః

 ఏతే చాన్యే చ విబుధాః ప్రభవో వరశాపయోః

దేహే భవంతి నృపతేస్సర్వదేవమయో నృపః

విష్ణువు, బ్రహ్మ, కైలాసాధిపతియగు శివుడు, ఇంద్రుడు, వాయు వు, యముడు, సూర్యుడు, మేఘుడు, కుబేరుడు, చంద్రుడు, పృథివీ దేవ త, అగ్ని, జలాధిపతియగు వరుణుడు మొదలగు దేవతలందరు వరముల ను గాని, శాపమును గాని ఇచ్చుటకు సమర్థులు. వీరందరు రాజుయొక్క దేహములో నుండెదరు. రాజు సర్వదేవతాస్వరూపుడు.

తస్మానాం కర్మభిర్విప్రా యజధ్వం గతమత్సరాః

బలిం చ మహ్యం హరత మత్తేకన్య కోకగ్రభుక్ పుమాన్

ఓ బ్రాహ్మణులారా! కావున, మీరు మీ ఓర్వలేనిదనమును త్రోసిపు చ్చి, కర్మల ద్వారా నన్నే ఆరాధించుడు. పూజోపహారములను నాకే సమ ర్పించుడు. అగ్రపూజను స్వీకరించదగిన యజ్ఞపురుషుడు నేను తక్క మరియొకడు ఎవడు గలడు?

మైత్రేయ ఉవాచ

 ఇత్తం విపర్యయమతిః పాపీయానుత్పథం గతః

 అనునీయమానస్తద్యాచ్ఞాం న చక్రే భ్రష్టమంగలః

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ఓ విదురా! పాపస్వభావము గల వేనుని బుద్ధి భ్రాంతమై యుండెను. తప్పు దారిన నడిచే ఆ వేనుని పుణ్యము నశించెను. కావుననే, మహర్షులు నచ్చజెప్పిననూ, ఆతడు వారి కోరికను మన్నించలేదు.

ఇతి తేరసత్కృతా స్తేన ద్విజాః పండితమానినా

భగ్నాయాం భవ్యయాన్టాయాం తస్మై విదుర చుక్రుధు

ఓ విదురా! తాను పండితుడనని తలపోసే ఆ వేనుడు ఈ విధ ముగా ఆ బ్రాహ్మణులను అవమానించి, వారి భవ్యమగు (మంగళకరమగు) కోరికను భగ్నము చేసెను. అపుడు వారికి ఆతనిపై కోపము కలిగెను.

హన్యతాం హన్యతామేష పాపః ప్రకృతిదారుణః

 జీవజ్జగదసావాశు కురుతే భస్మసాద్ధవమ్

పాపి, స్వభావము చేతనే క్రూరుడు అగు ఈ వేనుని చంపుడు, చంపుడు. వీడు జీవించియున్నచో, సామ్రాజ్యమును తొందరలోనే నిశ్చయ ముగా బూడిదగా మార్చును.

నాయమరత్యసద్వృత్తో నరదేవవరాసనమ్

 యోనధియజ్ఞపతిం విష్ణుం వినిందత్యనపత్రపః

దుష్టప్రవృత్తిగల ఈ వేనుడు శ్రేష్టమగు రాజసింహాసనమువకు తగినవాడు కాదు. యజ్ఞేశ్వరుడై జగత్తును పాలించే శ్రీహరిని, ఈతడు సిగ్గును విడచి, అధికముగా నిందించుచున్నాడు.

కో వైనం పరిచక్షీత వేనమేకమృతే శుభమ్

ప్రాప్త ఈదృశమైశ్వర్యం యదనుగ్రహభాజనః

పాపియగు ఈ వేనుడు తాను ఎవని అనుగ్రహమునకు పాత్రుడై ఇట్టి మహైశ్వర్యమును పొందినాడో, అట్టి శ్రీహరిని నిందించుచున్నాడు. అట్టి పనిని ఈ వేనుడు ఒక్కడు తక్క మరియెవ్వరు చేయుదురు?

ఇత్తం వ్యవసితా హంతుమృషయో రూడమన్యవః

నిజఘ్నుర్హుంకృతైర్వేనం హతమచ్యుతనిందయా

మహర్షులలో కోపము స్పష్టముగా కానవచ్చుచుండెను. వారాత నిని సంహరించుటకే నిశ్చయించిరి. శ్రీహరిని నిందించి ఆతడు అప్పటికే . మృతప్రాయుడై ఉండెను. వారు హుంకారములను చేయగానే ఆతడు మరణించేను.

ఋషిభిస్వా శ్రమపదం గతే పుత్రకలేవరమ్

 సునీథా పాలయామాస విద్యాయోగేన శోచతీ

అప్పుడా మహర్షులు తమ తమ ఆశ్రమములకు వెళ్లిరి. సునీథ దుఃఖిస్తూనే, మంత్రప్రభావముచే మరియు ఇతరములగు ఉపాయములతో, తన పుత్రుని దేహమును కాపాడెను.

ఏకదా మునయస్తే తు సరస్వత్సలిలాప్లుతాః

 హుత్వాగ్నీన్ సత్కథాశ్చక్రురుపవిష్టాస్సరత్తటే

ఒకనాడా మహర్షులు సరస్వతీనదిలో స్నానమాడి, అగ్నిహోత్రక ర్మను పూర్తి చేసుకొని, ఆ నది ఒడ్డున కూర్చుండి ఈశ్వరుని గాథలను చెప్పుకొనుచుండిరి.

వీక్ష్యోత్థితాన్ మహోత్పాతానాహుర్లోకభయంకరాన్

 అప్యభద్రమనాథాయ దస్యుభ్యో న భవేద్భువః

జనులకు మహాభయమును గొల్పే చెడు శకునములు ఒక్క ఉదు టున ఆవిర్భవించినవి. అపుడా మహర్షులు వాటిని చూచి ఇట్లు తలచిరి : రాజు లేని ఈ దేశమునకు చోరుల వలన అమంగళములు కలుగవు గదా?

ఏవం మృశంత ఋషయో ధావతాం సర్వతోదిశమ్

 పాంసుస్సముత్థితో భూరిశ్చోరాణామపి లుంపతామ్

ఆ మహర్షులు ఈ విధముగా చర్చించుచుండిరి. ఇంతలోనే చోరులు దోపిడీలను చేయుచూ అన్ని దిక్కులయందు పరుగులు తీయు చుండగా, అధికమగు దుమ్ము బాగా పైకి లేచినది.

తదుపద్రవమాజ్ఞాయ లోకస్య వసు లుంపతామ్

భర్తర్యుపరతే తస్మిన్నన్యోన్యం చ జిఘంసతామ్

 చోరప్రాయం జనపదం హీనసత్త్వమరాజకమ్

 లోకాన్నావారయన్ శక్తా అపి తద్దోషదర్శినః

వేన మహారాజు మరణించగానే దోపిడీగాండ్రు దోపిడీలను చేయు చుండిరి. జనుల మధ్య వైరములు హింస పెచ్చరిల్లి జనులకు బెడద కలుగుచుండెను. రాజు లేని ఆ రాజ్యములో చోరుల బెడద పెరిగిపోయేను. జనులకు ధైర్యము క్షీణించెను. మహర్షులు ఈ పరిస్థితిని పరికించిరి. వారు దీనిని నివారించే సామర్థ్యము గలవారే అయినా, అట్టి రాజకీయము లలో తమకు దోషము సంక్రమించగలదనే భావనతో, వారు జనులను వారించలేదు.

బ్రాహ్మణస్సమదృక్చాంతో దీనానాం సము పేక్షకః

సవతే బ్రహ్మ తస్యాపి భిన్నభాండాత్పయో యథా

సర్వత్రా పరబ్రహ్మను దర్శించే శాంతస్వభావము గల బ్రహ్మవేత్త యైననూ దీనులను పేక్షించినచో, ఆయన తపస్సు చిల్లు పడిన కుండలోని నీరు (పాలు) వలె, క్షీణించిపోవును.

నాంగస్య వంశో రాజరేరేష సంస్థాతుమర్హతి

అమోఘవీర్యా హి నృపా వం శ్వేస్మిన్ కేశవాశ్రయాః

రాజర్షియగు అంగుని ఈ వంశము వినాశమగుట తగదు. ఏలయ నగా, ఈ వంశములోని రాజులు శ్రీహరిని శరణు జొచ్చి మొక్కవోని పరాక్ర మమును చూపినవారే.

వినిశ్చిత్యైవమృషయో విపన్నస్య మహీపతేః

 మమంథురూరుం తరసా తత్రాసీద్బాహుకో నరః

ఆ మహర్షులు ఈ విధముగా నిశ్చయించుకొని, మరణించిన వేన రాజుయొక్క తొడను వేగముగా మథించగా, అక్కడనుండి ఒక పొట్టివాడు పుట్టెను.

కాకకృష్ణోకతిహ్రస్వాంగే హ్రస్వబాహుర్మహాహనుః

 హ్రస్వపాన్నిమ్ననాసాగ్రే రక్తాక్షస్తామ్రమూర్ధజః

కాకివలె నల్లని ఆ పురుషుని శరీరము మీక్కిలి పొట్టీగానుండెను. వాని చేతులు, కాళ్లు పొట్టి. కాని, దవడలు పెద్దవి. చప్పిడి ముక్కు కొన గల ఆ పురుషుని కన్నులు ఎర్రగనుండెను. వానికి రాగి రంగు జుట్టు ఉండెను.

తం తు తేవనతం దీనం కిం కరోమీతి వాదినమ్

 నిషీదేత్యబ్రువంస్తాత స నిషాదస్తతోభవత్

వత్సా విదురా! తల దించుకొని దీనుడైయున్న ఆ పురుషుడు, నేను ఏమి చేయాలి? అని వారిని ప్రశ్నించగా, వారాతనిని కూర్చుండుము అనిరి. వారు నిషీద (కూర్చుండుము) అని పలుకుట వలన, ఆతడు నిషా దుడు ఆయెను.

తస్య వంశ్యాస్తు నైషాదా గిరికాననగోచరాః

యేనాహరజ్ఞాయమానో వేనకల్మషముల్బణమ్

 ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే చతుర్థస్కంధే పృథూపాఖ్యానే

వేనసంహారో నామ చతుర్ధశోఽధ్యాయః

వాని వంశీయులగు నైషాదులు కొండకోనలలో సంచరించెదరు. ఆతడు పుట్టుచుండగనే వేనుని భయంకరమగు పాపమును తీసుకొనెను.

శ్రీమద్బాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధములో పృథూపాఖ్యానమునందు వేనుని మృతిని వర్ణించే పదునాల్గవ అధ్యాయము ముగిసినది.