భాగవత మహా పురాణము
28 - పురంజనోపాఖ్యానము - అవిజ్ఞాత వైదర్భీ సంవాదము
నారద ఉవాచ ।
సైనికా భయనామ్నో యే బర్హిష్మన్ దిష్టకారిణః ।
ప్రజ్వారకాలకన్యాభ్యాం విచేరురవనీమిమామ్ ॥
నారద మహర్షి ఇట్లు పలికెను --- ఓ బర్హిష్మత్ మహారాజా! భయుడని ప్రసిద్దిని గాంచిన ఆ యవనప్రభుని సైనికులు ఆయన ఆదేశ మును పాలించువారై, ప్రజ్వారునితో మరియు కాలకన్యతో గూడి, ఈ భూమండలమును సంచరించిరి.
త ఏకదా తు రభసా పురంజనపురీం నృప ।
రురుదుర్భౌమభోగాఢ్యం జరత్పన్నగపాలితామ్ ॥
ఓ మహారాజా! ఒకనాడు వారు పురంజనుని నగరమును వేగ ముగా ముట్టడించిరి. భూమండలములోని భోగములతో సంపన్నమై యున్న ఆ పురమును ముసలి పాము సంరక్షించుచుండెను.
కాలకన్యాపీ బుభుజే పురంజనపురం బలాత్ ।
యయ్యాఖీభూతః పురుషస్సద్యో నిస్సారమియాత్ ॥
కాలకన్య కూడ పురంజనుని పురమును బలాత్కారముగా ఆక్ర మించి భోగించెను. కాలకన్యచే ఆక్రమించబడిన వ్యక్తి వెంటనే సత్తువను పూర్తిగా కోల్పోవును.
తయోపభుజ్యమానాం వై యవనాస్సర్వతోదిశమ్ ।
ద్వార్భిః ప్రవిశ్య సుభృశం ప్రార్ధయన్ సకలాం పురీమ్ ॥
కాలకన్య ఆ నగరమును ఆక్రమించి భోగించుచుండగా, యవ నులు అన్ని దిక్కులనుండియు ద్వారముల గుండా లోపల ప్రవేశించి, ఆ నగరమునంతనూ చాల తీవ్రమగు వినాశమునకు గురి చేసిరి.
తస్యాం ప్రపీడ్యమానాయామభిమానీ పురంజనః ।
అవాపోరువిధాంస్తాపాన్ కుటుంబీ మమతాకులః ॥
కుటుంబమునకు యజమానియగు పురంజనునకు ఆ పురమునం దు, దానికి చెందిన వ్యక్తులయందు ఇది నాది, నా వారు అనే అభిమానము మెండు. ఆ కారణముగా, ఆ పురము తీవ్రముగా ముట్టడించబడినప్పుడు, ఆతడు చాల వ్యాకులతను చెందినవాడై పలువిధములగు దుఃఖములను పొందెను.
కన్యోపగూఢ నష్టశ్రీః కృపణో విషయాత్మకః ।
నష్టప్రజ్ఞో హృతైశ్వర్యో గంధర్వయవనైర్బలాత్ ॥
కాలకన్య కౌగిలికి చిక్కిన పురంజనుని అందమంతయు నశించే ను. దీనుడగు ఆతని మనస్సు ఇంకనూ విషయభోగములయందు లగ్నమై యుండెను. ఆతని వివేకము కూడ నశించెను. గంధర్వులు, యవనులు ఆతని సంపదను కొల్లగొట్టిరి.
విశీర్ణాం స్వపురీం వీక్ష్య ప్రతికూలాననాదృతాన్ ।
పుత్రానౌత్రాకనుగామాత్యాష్ఠాయాం చ గతసౌహృదామ్ ॥
ఆత్మానం కన్యయా గ్రస్తం పంచాలానరదూషాతాన్ ।
దురంతచింతామాపన్నో న లేభే తత్ప్రతిక్రియామ్ ॥
పురంజనుని నగరము శిథిలమయ్యెను. ఆతని పుత్రులు, పౌత్రు లు, అనుచరులు, మంత్రులు పురంజనుని యెడల ఆదరమును చూపుట మానీ వ్యతిరేకులైరి. భార్యకు కూడ ఆయనపై ప్రేమ తొలగిపోయెను. పంచాలదేశము శత్రువులచే పాడు చేయబడెను. తాను కాలకన్యచే ఆక్ర మించబడి యుండెను. ఈ స్థితిని కనుగొనిన పురంజనునకు అంతము లేని దుఃఖము కలిగెను. దీనినుండి బయట పడే ఉపాయమేమియు ఆయనకు తోచలేదు.
కామానభిలషన్ దీనో యాతయామాంశ్చ కన్యయా ।
విగతాత్మగతి స్నేహః పుత్రదారాంశ్చ లాలయన్ ॥
కాలకన్య కారణముగా పురంజనునకు భోగ్యవస్తువులయందు సారము అనుభవమునకు వచ్చుట ఆగిపోయెను. అయిననూ, ఆతడు వాటినే కోరుచుండెను. ఆతడు పుణ్యమును చేయకప"గుటచే పుణ్యలోకప్రాప్తి లేదు. ఇహలోకములో పుత్రాదుల ప్రేమ కూడ ఆతనికి లభించుట లేదు. ఆతడు పుత్రులను భార్యను వారి ప్రేమ కొరకై బుజ్జగించుచుండెను.
గంధర్వయవనాక్రాంతాం కాలకన్యోపమర్ధితామ్ ।
హాతుం ప్రచక్రమే రాజా తాం పురీమనికామతః ॥
పురంజనుని పురమును గంధర్వులు, యవనులు ఆక్రమించిరి. కాలకన్య ఆ పురమును భగ్నము చేసెను. కావుననే, ఆ రాజు ఇష్టము లేకున్ననూ, ఆ పురమును విడిచి పెట్టే ప్రయత్నమునారంభించెను.
భయనామ్నో గ్రజో భ్రాతా ప్రజ్వారః ప్రత్యుపస్థితః ।
దదాహ తాం పురీం కృత్స్నాం భ్రాతుః ప్రియచికీర్షయా ॥
భయుడని ప్రసిద్దిని గాంచిన యవనప్రభుని పెద్ద అన్నగారగు ప్రజ్వారుడు ఇంతలో ఆ నగరమునకు వచ్చెను. ఆతడు తన సోదరునకు ప్రియమును చేయగోరి ఆ పురమునకంతకూ నిప్పు పెట్టెను.
తస్యాం సందహ్యమానాయాం సపౌరస్సపరిచ్చదః ।
కౌటుంబికః కుటుంబిన్యా ఉపాతప్యత సాన్వయః ॥
ఆ పురము తగులబడుచుండగా, కుటుంబమునందు ఆసక్తి గల పురంజనుడు పురజనులతో, సేవకులతో, పుత్రాదులతో గూడినవాడై భార్యతో బాటుగా చాల తాపముననుభవించెను.
యవనోపరుద్ధాయతనో గ్రస్తాయాం కాలకన్యయా ।
పుర్యాం ప్రజ్వారసంసృష్టః పురపాలోకన్వతప్యత ॥
కాలకన్య పురమును ఆక్రమించెను. యవనులు పురపాలకుడగు నాగుని ఇంటిని ముట్టడించిరి. ప్రజ్వారుడు కూడ ఆ నాగుని పీడించెను. అపుడా నాగు నిరంతరమగు తాపముననుభవించెను.
న శేకే సోకవితుం తత్ర పురుకృచ్చోరువేపథుః ।
గంతుమైచ్చత్తతో వృక్షకోటరాదివ సానలాత్ ॥
పెద్ద ఆపద వచ్చి పడిన కారణముగా అధికముగా వణుకుచున్న పురపాలకుడగు నాగము ఆ పురమును రక్షించలేక పోయేను. కావుననే, నిప్ప గల చెట్టు తొర్రవంటి ఆ పురమునుండి నిష్క్రమించవలెనని ఆ నాగము తలపోసెను.
శిథిలావయవో యర్చి గంధర్వైరతపౌరుషః ।
యవనైరరిభీ రాజన్నుపరుడ్లో రురోద హ ॥
ఓ మహారాజా! ఆ నాగముయొక్క అవయవములన్నియు శిథిల మయ్యెను. దాని పౌరుషమును, గంధర్వులు అపహరించిరి. అది పారిపోవు టకు యత్నించగా, శత్రువులగు యవనులు దానిని అడ్డుకొనిరి. అప్పుడది ఏడ్చెను.
దుహితౄః పుత్రపౌత్రాంశ్చ జామిజామాతృహర్షదాన్ ।
స్వత్వావశిష్టం యత్కించిధృహకోశపరిచ్ఛదమ్ ॥
అహం మమేతి స్వీకృత్య గృహేషు కుమతిర్గృహీ ।
దధ్యే ప్రమదయా దీనో విప్రయోగ ఉపస్థితే ॥
గృహస్థుడగు పురంజనుడు దేహమునందు నేను అనే బుద్ది, దేహ మునకు సంబంధించిన ఇంటియందు నాది అనే బుద్దిని కలిగియుండెను. ఇట్టి తప్పు ధారణలు గల గృహస్థుడైన ఆ పురంజనుడు భార్యతోడి వియోగము సంప్రాప్తము కాగా, దీనుడయ్యెను. ఆతని వద్ద నాది అనదగ్గది ఇల్లు, ధనము, సామగ్రి కొద్దిగా మిగిలియుండెను. ఆతడు ఆ సమయములో ఆ మిగిలిన ఆస్తిని, కూతుళ్లను, కొడుకులను, మనుమలను, కోడళ్లను, అల్లుళ్లను, సేవకులను గురించి చింతిస్తూ గడిపెను.
లోకాంతరం గతవతి మయ్యనాథా కుటుంబినీ ।
వర్తిష్యతే కథం త్వేషా బాలకాననుశోచతీ ॥
నేను పరలోకమునకు వెళ్లిన తరువాత విగతభర్తృక, పెద్ద కుటుం బము గలది అగు ఈ నా భార్య పిల్లల గురించి దుఃఖిస్తూ రోజులను ఎట్లు గడుపగల్గునో?
న మయ్యనాశితే భుంక్తే నాస్నాతే స్నాతి మత్పరా ।
మయి రుష్ట సుసంత్రస్తా భర్త్సితే యతవాగ్బయాత్ ॥
నా భార్య పతివ్రత. నేను భోజనము చేయకపోతే ఆమె కూడ భోజనము చేయదు. నేను స్నానము చేయకపోతే, ఆమె కూడ స్నానము చేయదు. నేను కోపిస్తే ఆమె చాల భయపడును. నేను బెదిరించినప్పుడు ఆమె భయముతో మౌనమును వహించెడిది.
ప్రబోధయతి మావిజ్ఞం వ్యుషితే శోకకర్శితా ।
వర్మైతధృహమేధ్యం వీరసూరపి నేష్యతి ॥
నేను పొరపాటు చేయబోవునంతలో ఈమె నన్ను హెచ్చరించెడిది. ఈమె వీరులగు పుత్రులను కన్నది. కాని, నేను పొరుగూరు వెళ్లినచో, వియోగదుఃఖముతో కృశించిపోవును. అట్టి ఈమె నేను మరణించిన పిదప ఇంటి వ్యవహారములను నడుపునా ?
కథం ను దారకా దీనా దారకీర్వాపరాయణాః ।
వర్తిష్యంతే మయి గతే భిన్ననావ ఇవోదదౌ ॥
ఈ నా పుత్రులకు, పుత్రికలకు నేను తప్ప మరియొక దిక్కు లేదు. నేను మరణించగా, దీనులైన వీరు సముద్రములో నావ భగ్నమైన యాత్రికులు వలె, జీవితమును ఎట్లు వెళ్లదీ సెదరో ?
ఏవం కృపణయా బుద్ధ్యా శోచంతమతదర్షణమ్ ।
గ్రహీతుం కృతధీ రేనం భయనామాభ్యపద్యత ॥
ఈ విధముగా పురంజనుడు దీనమగు బుద్దితో శోకించుచుండెను. అది ఆయనకు కలుగవలసిన శోకము కాదు. ఇంతలో, ఆయనను పట్టుకో నుటకు భయుడు అని ప్రసిద్ధిని చెందిన యవనరోజు వచ్చి పడెను.
పశువద్యవనైరేష నీయమానస్వకం క్షయమ్ ।
అన్వద్రవన్నానుపథాశ్శోచంతో భృశమాతురాః ॥
పురంజనుని యవనులు ఈ విధముగా పశువును వలె తన స్థాన మును గురించి తీసుకొని పోవుచుండగా, మిక్కిలి కలత చెందిన ఆతని అనుయాయులు దుఃఖిస్తూ ఆయన వెంట నడచిరి.
పురీం విహాయోపగత ఉపరుద్ధో భుజంగమః ।
యదా తమేవాను పురీ విశీర్ణా ప్రకృతిం గతా ॥
శత్రువులచే ముట్టడించబడిన పురపాలకుడగు నాగుడు పురమును విడిచి పెట్టి వెళ్లిపోయెను. ఆ వెనువెంటనే ఆ నగరము శిథిలమై చుట్టూ ఉండే ప్రకృతిలో కలిసిపోయెను.
వికృష్యమాణః ప్రసభం యవనేన బలీయసా ।
నావిందత్తమసావకవిష్టస్సఖాయం సుహృదం పురః ॥
బలవంతుడగు యవనుడు పురంజనుని బలాత్కారముగా లాగివే యుచుండెను. కాని, అజ్ఞానముచే కప్పివేయబడియున్న పురంజనుడు తనకు పూర్వములో హితమును చేసిన మిత్రుని (అవిజ్ఞాతుని) స్మరించలేక పోయెను.
తం యజ్ఞపశవోకనేన సంజ్ఞప్తా యేదయాలునా ।
కుఠారైశ్చిచ్ఛిదు క్రుద్ధాస్స్మరంతోకమీవమస్య తత్ ॥
పురంజనుడు క్రూరాత్ముడై యజ్ఞములో పశువులను సంహరించి యుండెను. ఆతని ఆ క్రూరత్వమును గుర్తు చేసుకొని, ఆ పశువులు వానిని గొడ్డళ్లతో నరికినవి.
అనంతపారే తమసి మగ్నో నష్టస్మృతిస్సమాః ।
శాశ్వతీరనుభూయార్తిం ప్రమదాసంగదూషితః ॥
తామేవ మనసా గృష్ణన్ బభూవ ప్రమదోత్తమా ।
అనంతరం విదర్భస్య రాజసింహస్య వేశ్మని ॥
పురంజనుడు అంతము లేని వ్యాప్తిగల అజ్ఞానమునందు మునిగి యున్నవాడగుటచే, భార్యయందలి ఆసక్తిచే వాని మనస్సు కలుషితము య్యెను. ఆతనికి స్మృతి కూడ నశించేను. ఆతడు చిరకాలము నిరంతర మగు దుఃఖముననుభవించేను. ఆతడు మనస్సులో భార్యను మాత్రమే ధ్యానించుటచే, ఆ దు:ఖానుభవము పూర్తి అయిన పిదప, రాజులలో ఉత్త ముడగు విదర్భ దేశాధిపతికి కుమార్తెయై జన్మించెను. ఆమె అతిశయించిన సౌందర్యము గలది.
ఉపయేమే వీర్యపడొం వైదర్బీం మలయధ్వజః ।
యుధి నిర్జిత్య రాజన్యాన్ పాండ్యః పరపురంజయః ॥
పాండుదేశాధిపతియగు మలయధ్వజుడు శత్రువుల నగరములను జయించిన దిట్ట. ఆతడు రాజులను యుద్దములో జయించి, పరాక్రమమునే శుల్కముగా భావించే విదర్భరాజపుత్రికను వివాహమాడెను.
తస్యాం స జనయాంచక్ర ఆత్మజామసితేక్షణామ్ ।
యవీయసస్సప్త సుతాన్ సప్త ద్రవిడభూభృతః ॥
ఆతనికి ఆమెయందు నల్లని కన్నులు గల ఒక కుమార్తె, ఆ పిదప ఏడ్గురు కొడుకులు కలిగిరి. ఆ ఏడ్గురు ద్రవిడదేశమునందు రాజులైరి.
ఏకైకస్యాభవత్తేషాం రాజన్నర్బుదమర్బుదమ్ ।
భోక్ష్యతే యద్వంశధర్మహీ మన్వంతరం పరమ్ ॥
ఓ మహారాజా! వారికి ఒక్కోక్కనికి చాల సంతానము కలిగెను. వారి వంశమునందు జన్మించిన వారు మన్వంతరము పూర్తి అగునంతవరకు, ఆ తరువాత కూడ భూమిని పాలించగలరు.
అగస్త్యః ప్రాగ్దుహితరముపయేమే ధృతవ్రతామ్ ।
యస్యాం దృఢచ్యుతో జాత ఇద్మవాహాత్మజో మునిః ॥
మలయధ్వజుని పెద్ద కుమార్తె దృఢమగు ప్రతనిష్ఠ గలది. ఆమెను అగస్త్యమహర్షి వివాహమాడెను. వారికి దృడచ్యుత మహర్షి పుట్టెను. ఇద్మ వాహుడు దృడచ్యుతుని పుత్రుడు.
విభజ్య తనయేభ్యః క్ష్మాం రాజర్షిర్మలయధ్వజః ।
ఆరిరాధయిషుః కృష్ణం స జగామ కులాచలమ్ ॥
ఆ రాజర్షియగు మలయధ్వజుడు రాజ్యమును కొడుకులకు పంచి యిచ్చి, తాను శ్రీకృష్ణుని ఆరాధించే కోరికతో తమ వంశమునకు చెందిన మలయపర్వతమునకు వెళ్లాను.
హిత్వా గృహాన్ సుతాన్ భోగాన్ వైదర్బీ మది రేక్షణా ।
అన్వధావత పాండ్యేశం జ్యోత్నేవ రజనీకరమ్ ॥
విదర్భ రాజపుత్రి గొప్ప సుందరి, యువతియే అయిననూ, ఇంటిని పుత్రులను భోగములను విడిచి పెట్టి, వెన్నెల రాత్రికి ప్రభువగు చంద్రుని వెంట ఉండే విధముగా, పాండ్యమహారాజగు మలయధ్వజుని వెంట మలయపర్వతమునకు వెళ్లెను.
తత్ర చంద్రవశా నామ తామ్రపర్ణి వడోదకా ।
తత్పుణ్యసలిలైర్నిత్యముభయత్రాత్మనో మృజన్ ॥
అచట చంద్రవశ, తామ్రపర్ణి, వడోదక అను మూడు నదులు గల వు. మలయధ్వజుడు వాటి పవిత్రములగు జలములలో ప్రతిదినము స్నాన మును చేయుచూ, దేహముయొక్క మాలిన్యమును మాత్రమే గాక, మనో మాలిన్యమును కూడ పోగొట్టుకొనుచుండెను.
కందాష్టిభిర్మూలఫలైః పుష్పపర్టైస్తృణోదకై ।
వర్తమానశ్శనైర్గాత్రకర్శనం తప ఆస్థితః ॥
దుంపలు, గింజలు, వ్రేళ్లు, పళ్లు, పుష్పములు, ఆకులను భుజి స్తూ, ఒకప్పుడు నీటిని మాత్రమే త్రాగి శరీరమును నిలబెట్టుకుంటూ, ఆతడు క్రమముగా శరీరమును కృశింపజేసే తపస్సును అనుష్టించెను.
శీతోష్ణవాతవర్షాణి క్షుత్పిపాసే ప్రియాప్రియే ।
సుఖదుఃఖ ఇతి ద్వంద్వాన్యజయత్సమదర్శనః ॥
సర్వమునందు ఈశ్వరుని దర్శించే ఆ మలయధ్వజుడు, శీతోష్ణ ములు వాతవర్షములు ఆకలిదప్పికలు ఇష్టానిష్టములు సుఖదుఃఖములు అనే ద్వంద్వములను సమచిత్తముతో జయించెను.
తపసా విద్యయా పక్వకషాయో నియమైర్యమైః ।
యుయుజే బ్రహ్మణ్యాత్మానం విజితాక్షానిలాశయః ॥
మలయధ్వజుడు తపస్సును ఉపాసనను చేసి, యమములను (సత్యము, అహింస, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము), నియమ ములను (శౌచము, తపస్సు, సంతోషము, స్వాధ్యాయము, ఈశ్వరప్రణిధా నము) పాటిస్తూ, తద్ద్వారా వాసనలను నిర్మూలించి, ప్రాణాయామమును, ప్రత్యాహారము (ఇంద్రియనిగ్రహము) ను, ధారణను, ధ్యానమును చేసి, మనస్సును పరబ్రహ్మయందు విలీనము (సమాధి) చేసెను.
ఆస్తే స్థాణురివైకత్ర దివ్యం వర్షశతం స్థిరః ।
వాసుదేవే భగవతి నాన్యద్వేదోద్వహన్ రఖమ్ ॥
ఆతడు ఒకే స్థానమునందు వంద దివ్యసంవత్సరములు బండరా యివలె నుండి తపస్సును చేసెడివాడు. ఆతడు వాసుదేవ భగవానుని యందు ప్రీతిని చేయుచూ, ఇతరమును తెలియకుండెను.
స వ్యాపకతయాత్మానం వ్యతిరిక్తతయాత్మని ।
విద్వాన్ స్వప్న ఇవామర్శసాక్షిణం విరరామ హ ॥
ఆత్మ దేహేంద్రియమనస్సంఘాతమునంతను వ్యాపించియు న్ననూ, ఈ సంఘాతముకంటే విలక్షణముగనే యున్నది. స్వప్నములో వలె జ్ఞాత, జ్ఞేయము రెండు ఆత్మ చైతన్యమునందు మాత్రమే ప్రకాశించుచున్నవి. ఆత్మను ఆ విధముగా అంతఃకరణవృత్తులకు సాక్షిగా తెలుసుకొని, ఆతడు సకలవ్యవహారములనుండియు విరమించెను.
సాక్షాద్బగవతోత్తేన గురుణా హరిణి నృప ।
విశుద్ధజ్ఞానదీ పేన స్ఫురతా విశ్వతోముఖమ్ ॥
పరే బ్రహ్మణి చాత్మానం పరం బ్రహ్మ తథ్యాత్మని ।
వీక్షమాణో విహాయేక్షామస్మాదుపరరామ హ ॥
ఓ మహారాజా! సాక్షాత్తు పరమగురువగు శ్రీహరి భగవానుడు ఆతని అంతఃకరణములో విశుద్ధమగు ఆత్మజ్ఞానము అనే దీపమును ప్రకాశింపజేసెను. ఆ జ్ఞానము ఆతని హృదయమునందు సర్వతోముఖముగా ప్రకాశించెను. దాని ప్రభావముచే ఆతడు పరబ్రహ్మ (దేశకాలవస్తుపరిచ్చేద ములకు అధిష్ఠాత) యందు ఆత్మను, ఆత్మ (దేశకాలవస్తుపరిచ్చేదములకు ద్రష్ట) యందు పరబ్రహ్మను దర్శించెను. దానితో ఆతని మనోవృత్తులు కూడ విలీనమయ్యెను. ఆతడు దేహమును విడిచి పెట్టెను.
పతిం పరమధర్మజ్ఞం వైదర్బీ మలయధ్వజమ్ ।
ప్రేమ్ణా పర్యచరద్దిత్వా భోగాన్ సా పతిదేవతా ॥
విదర్భ రాజకుమారీ పతియే దైవముగా గల సాధ్వి. ఆమె భోగము లను విడనాడి, పరమధర్మాత్ముడైన తన భర్త మలయధ్వజుని ప్రేమతో సేవించెను.
చీరవాసా ప్రతక్షామా వేణీభూతశిరోరుహా ।
బభావుపపతిం శాంతా శిఖా శాంతమివానలమ్ ॥
వైదర్భి నారబట్టలను దాల్చి నియమనిష్ఠలను పాటించుటచే చిక్కి పోయెను. ఆమె జుట్టు జడలు కట్టెను. భర్త సమీపమునందు ఆమె చల్లారు చున్న అగ్నియందలి పొగ లేని జ్వాల వలె ప్రకాశించెను.
అజానతీ ప్రియతమం యదోపరతమంగనా ।
సుస్థిరాసనమాసాద్య యథాపూర్వముపాచరత్ ॥
మలయధ్వజుడు మిక్కిలి స్థిరమగు ఆసనమునందుండియే మర ణించెను. ఆ కారణముచే తన ప్రియతముడగు భర్త మరణించినాడనే సంగతి ఆ వైదరికి తెలియలేదు. ఆమె పూర్వమునందు వలెనే ఆయన వద్దకు వెళ్లి సేవలను చేసెను.
యదా గోపాలభేతాంధ్రవూష్మాణం పత్యురర్చతీ ।
ఆసీత్సందిగ్నహృదయా యూథభ్రష్టా మృగీ యథా ॥
ఆమెకు భర్త పాదములను పూజించుచుండగా, వేడి తగలలేదు. అప్పుడామె, గుంపునుండి విడిపోయిన లేడి వలె, హృదయములో చాల ఆందోళనను చెందెను.
ఆత్మానం శోచతీ దీనమబంధుం విక్లబాశ్రుభిః ।
స్తనావాసిచ్య విపినే సుస్వరం ప్రరురోద సా ॥
తోడు ఎవ్వరైననూ లేని తన దైన్యమునకు ఆమే చాల వగచెను. దుఃఖము వలన ప్రవహించిన కన్నీటితో ఆమే స్తనములు అంతటా తడిసిపో యెను, ఆమె ఆ అడవిలో మధురమగు స్వరముతో గట్టిగా రోదించెను.
ఉత్తిష్ఠోత్తిష్ట రాజర్ష ఇమాముదధిమేఖలామ్ ।
దస్యుభ్యః క్షత్తబంధుభ్యో బిభ్యతీం పాతుమర్హసి ॥
ఓ రాజర్షీ! లెమ్ము, లెమ్ము. సముద్రమే మొలనూలుగా గల ఈ భూదేవికి దోపిడీగాండ్ర వలన, అయోగ్యులగు క్షత్తియుల వలన భయము పెచ్చు మీరినది. ఈ భూమిని నీవే రక్షించవలసి యున్నది.
ఏవం విలపతీ బాలా విపినేనుగతా పతిమ్ ।
పతిత పాదయోర్బర్తూ రుదంత్యక్రూణ్యవర్తయత్ ॥
భర్తతో బాటుగా అడవికి వెళ్లిన ఆ సుందరి ఈ విధముగా దుఃఖిస్తూ, భర్త పాదములపై పడి ఏడుస్తూ, కన్నీటిని ప్రవహింప జేసెను.
చితిం దారుమయీం చీత్వా తస్యాం పత్యుః కలేవరమ్ ।
ఆదీప్య చానుమరణే విలపంతీ మనో దధే ॥
ఆమె కట్టెలతో చితిని పేర్చి, భర్త దేహమును దానిపై తగులబెట్టె ను. ఆమె అప్పుడు ఏడుస్తూ, తాను కూడ భర్తతో బాటుగా మరణించుటకు నిశ్చయించుకొనెను.
తత్ర పూర్వతరః కశ్చిత్సఖా బ్రాహ్మణ ఆత్మవాన్ ।
సాంత్వయన్ వల్గునా సామ్నా తామహ రుదతీం ప్రభో ॥
ఓ మహారాజా! ఆమెకు చాల పూర్వమునందలి మిత్రుడొకడు ఆ సమయములో అచటికి వచ్చెను. ఆయన ఆత్మజ్ఞానియగు బ్రాహ్మణుడు. ఆయన ఏడ్చుచున్న ఆమెను చూచి, మనోహరమగు ప్రియవాక్యములతో ఓదారుస్తూ, ఇట్లు పలికెను.
బ్రాహ్మణ ఉవాచ ।
కా త్వం కస్యాసి కో వాక్యం శయానో యస్య శోచసి ।
జానానీ కిం సఖాయం మాం యేనాగ్రే విచచర్థ హ ॥
నీవెవరివి? ఎవరి దానవు ? నీవీ వ్యక్తి కొరకు దుఃఖించుచున్నావు. పరుండియున్న ఈతడు ఎవడు? నేను పూర్వమునందు నీతో కలిసి తిరిగిన మిత్రుడను. నన్ను గుర్తు పట్టినావా?
అపి స్మరసి చాత్మానమవిజ్ఞాతసఖం సఖీ ।
హిత్వా మాం పదమన్విచ్చన్ భౌమభోగరతో గతః ॥
ఓ మిత్రమా! నీకు అవిజ్ఞాతుడనే మిత్రుడు ఉండెడివాడు. ఆ సంగతి గుర్తుకు వచ్చినదా? ఆ మిత్రుడను నేనే. నీవు భూలోకమునందలి భోగములయందు ప్రీతి గలవాడవై, నన్ను విడిచి పెట్టి ఆ భోగములు లభించే స్థానమును వెదుక్కుంటూ వెళ్లియుంటివి.
హంసావహం చ త్వం చార్య సఖాయా మానసాయనౌ ।
అభూతామంతరా నౌకస్సహస్రపరివత్సరాన్ ॥
ఓ శ్రేష్ట పురుషుడా! మిత్రులమగు మనమిద్దరము మానససరోవర ములో నివసించెడివారము. మనము వేయి సంవత్సరముల కాలములో ఏ నాడైననూ నివాసస్థానము లేకుండగనే గడిపితిమి.
స త్వం విహాయ మాం బంధో గతో గ్రామ్యమతిర్మహీమ్ ।
విచరన్ పదమద్రాక్షీః కయాచిన్నిర్మితం స్త్రీయా ॥
ఓ బంధుడా! ఇంద్రియభోగములయందు ప్రీతి గల అట్టి నీవు నన్ను విడిచిపెట్టి వెళ్లితివి. నీవు భూమండలములో సంచరిస్తూ, ఒకానొక స్త్రీ నిర్మించబడిన నివాసస్థానమున కనుగొంటివి.
పంచారామం నవద్వారమేకపాలం త్రికోష్టకమ్ ।
షట్కులం పంచవిపణం పంచప్రకృతి స్త్రీధవమ్ ॥
అయిదు ఉద్యానవనములు, తొమ్మిది ద్వారములు, మూడు ప్రాకారములు, అయిదు బజారులు గల ఆ నివాసస్థానమునందు ఒక కాపలాదారు, ఆర్గురు, వ్యాపారస్థులు ఉండెడివారు. అయిదు ద్రవ్యములతో నిర్మించబడిన ఆ స్థానమునకు ఒక యువతి ప్రభ్విగా ఉండెడిది.
పంచేంద్రియార్థా ఆరామా ద్వారః ప్రాణా నవ ప్రభో ।
తేజోబన్నాని కోష్ఠాని కులమింద్రియసంగ్రహః ॥
ఓ పురనాయకా! దేహము అనే జీవుని నివాసస్థానమునకు శబ్ద రూపరసస్పర్శగంధములనే ఇంద్రియగోచరములగు అయిదు విషయములే ఉద్యానములుగా చిత్రించబడినవి. తొమ్మిది ఇంద్రియగోళకములే ద్వారములు. అగ్ని, నీరు, పృథివి అనునవి ప్రాకారములు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, మనస్సు అనే ఆరు ఇంద్రియములు వివిధ విషయ ములను సంగ్రహించే వ్యాపారస్థులుగా వర్ణించబడినారు.
విపణస్తు క్రియాశక్తిర్బూతప్రకృతిరవ్యయా ।
శక్త్యధీశః పుమాంస్త్వత్ర ప్రవిష్ణో నావబుద్యతే ॥
క్రియలను చేసే అయిదు కర్మేంద్రియములే బజారులు. ఈ పురమును కట్టుటకు పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనే పంచభూతములే ద్రవ్యములుగా వినియోగించబడినవి. ఈ ద్రవ్యములు ఖర్చు అయ్యేవి కావు. మాయాశక్తికి అధీశ్వరుడు, పూర్ణచైతన్యస్వరూపుడు అగు పరమాత్మ ఈ పురములో ప్రవేశించి తనను తాను మరచిపోయినాడు.
తస్మింస్త్వం రామయా స్పృష్ణో రమమాణోకశ్రుతస్మృతిః ।
తత్సంగాదీదృశీం ప్రాప్తో దశాం పాపీయసీం ప్రభో ॥
ఓ పురనాయకా! ఆ పురములో నీవు బుద్ది అనే యువతితో తాదా త్మ్యమును చెందితివి. నీవు ఆమే మోహములో పడి రమిస్తూ, ఈశ్వరుని (ఆత్మస్వరూపమును) విస్మరించితివి. ఆ బుద్ధితోడి తాదాత్మ్యము వలననే నీకు దుఃఖపూర్ణమగు ఇట్టి దుర్ధశ సంప్రాప్తమైనది.
న త్వం విదర్బదుహితా నాయం వీరస్సుహృత్తవ ।
న పతిస్త్వం పురంజన్యా రుద్రో నవముఖే యయా ॥
నీవు విదర్భరాజపుత్రికవు కావు. వీరుడగు ఈ మలయధ్వజుడు నీకు భర్త కాదు. పూర్వజన్మలో నిన్ను పురంజని తొమ్మిది ద్వారములు గల పురము (దేహము) లో బంధించినది. ఆ పురంజనికి నీవు భర్తవు కావు.
మాయా హ్యేషా మయాసృష్టా యత్పుమాంసం స్త్రీయం సతీమ్।
మన్యసే నోభయం యద్వై హంసౌ పశ్యావయోర్గతిమ్ ॥
ఈ మాయను నేనే సృష్టించితిని. దానివలననే, నీవు పూర్వజ న్మలో పురంజనుడనే పురుషుడనని తలపోసితివి. ఈ జన్మలో సాధ్వియగు స్త్రీని అని తలపోయుచుంటివి. కాని, ఈ రెండు నీవు కాదు. మనమిద్ద రము హంసలము. నీవు మన యిద్దరి స్వరూపమును తెలుసుకొనుము.
అహం భవాన్న చాన్యస్త్వం త్వమేవాహం విచక్ష్వ భోః ।
న నౌ పశ్యంతి కవయశ్చిద్రం జాతు మనాగపీ ॥
ఓయీ! నేను నీవే. నీవు నాకంటే భిన్నముగా లేవు. నీవు నేనే. ఈ సత్యమును తెలుసుకొనుము. జ్ఞానుల దర్శనములో మన యిద్దరిలో తేడా లేశమైననూ ఏనాడైననూ లేదు.
యథా పురుష ఆత్మానమేకమాదర్శచక్షుషోః ।
ద్విధాభూతమవేక్షేత తలైవాంతరమావయోః ॥
పురుషునకు తన రూపము అద్దములో ఒక రకముగాను, ఇతరవ్య క్రియొక్క కంటిలో మరియొకవిధముగను కనబడును. అదే విధముగా ఒకే పరబ్రహ్మ సమష్టి ఉపాధిలో ఈశ్వరునిగను, వ్యష్టి ఉపాధిలో జీవునిగను కనబడుచున్నది. ఈ విధముగా, మన యిద్దరికి వాస్తవములో లేని భేదము మాయచే కానవచ్చుచున్నది.
ఏవం స మానసో హంసో హం సేన ప్రతిబోధితః ।
స్వస్థస్తద్వ్యభిచారేణ నష్టామాప పునస్స్మృతిమ్ ॥
ఈ విధముగా మానససరోవరనివాసియగు ఆ హంస (జీవుడు) ను మిత్రుడగు హంస (ఈశ్వరుడు) మేల్కొల్పగా, అది తన స్వరూప మును తెలుసుకొని ఆనందించెను. ఆ మిత్రుని వియోగము చేతనే దానికి స్వరూపజ్ఞానము మరుపునకు వచ్చెను. ఇపుడు అది మరల తన స్వరూప మును తెలుసుకొనగలిగేను.
బర్హిష్మన్నేతదధ్యాత్మం పొరోక్ష్యేణ ప్రదర్శితమ్ ।
యత్పరోక్షప్రియో దేవో భగవాన్ విశ్వభావనః ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే చతుర్థస్కంధే పురంజనోపాఖ్యానే అవిజ్ఞాత వైదర్భీ సంవాదో నామ అష్టావింశోఽధ్యాయః ॥
ఓ ప్రాచీనబర్హిష మహారాజా! ఈ ఆత్మతత్త్వమును నేను కథారూ పముగా దాచి పెట్టి చెప్పితిని. ఏలయనగా, జగత్పాలకుడగు శ్రీహరి భగ వానునకు ఇట్టి పరోక్షకథమునందు ప్రీతి మెండు.
శ్రీమద్బాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధమునందు పురంజనోపాఖ్యానములో అవిజ్ఞాత వైదర్భీ సంవాదమనే ఇరువది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 28 of the Bhāgavata Mahā Purana is as follows:
As the city of Purañjana is consumed by the flames ignited by the army of death, Purañjana is dragged away by the attendants of Yamarāja while still deeply attached to his family and wife. Because his final thoughts were absorbed in his wife, Purañjana is reborn in his next life as a woman, the daughter of the King of Vaidarbha, who eventually marries the righteous King Malayadhvaja and undergoes severe spiritual trials.