15 - పృథూపాఖ్యానము - పృథువు పట్టాభిషిక్తుడగుట

మైత్రేయ ఉవాచ

అథ తస్య పునర్విరపుత్రస్య మహీపతేః

 బాహుభ్యాం మథ్యమానాభ్యాం మిథునం సమపద్యత

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- తరువాత మరల ఆ మహ ర్టులు పుత్రసంతానము లేని ఆ వేనరాజుయొక్క భుజములను మథించగా, ఒక స్త్రీపురుషుల జంట పుట్టెను.

తద్దృష్ట్వా మిథునం జాతమృషయో బ్రహ్మవాదీనః

 ఊచుః పరమసంతుష్టా విదిత్వా భగవత్కలామ్

ఆ విధముగా పుట్టిన ఆ జంటను చూచి బ్రహ్మవేత్తలగు ఆ మహ ర్హులు వారిలో భగవానుని అంశను గుర్తించి చాల సంతోషించినవారై, ఇట్లు  పలికిరి.

ఋషయ ఊచుః

ఏష విష్ణోర్బగవతః కలా భువనపాలినీ

ఇయం చ లక్ష్మ్యాస్సంభూతిః పురుషస్యానపాయినీ

మహర్షులు ఇట్లు పలికిరి --- ఈతడు శ్రీహరి భగవానుని లోకము లను పాలించే అంశమే. పరమపురుషుడగు శ్రీహరిని లక్ష్మీదేవి ఏ కాల మునందైనా విడిచియుండదు. ఈమె అట్టి లక్ష్మీదేవియొక్క అవతారము.

అత్ర తు ప్రథమో రాజ్ఞాం పుమాన్ ప్రథయితా యశః

 పృథుర్నామ మహారాజో భవిష్యతి పృథుశ్రవాః

వీరిద్దరిలో పురుషుడు రాజులలో ప్రథముడై కీర్తిని విస్తరింప జేయ గలడు, ఈతడు పృథువు అనే పేరుతో ప్రసిద్ధిని గాంచి, గొప్ప కీర్తి గల మహారాజు అగును.

ఇయం చ సుదతీ దేవీ గుణభూషణభూషణా

అర్చిర్నామ వరారోహా పృథుమేవావరుంధతీ

చక్కని దంతములతో ప్రకాశించే ఈ సుందరి గుణములకు, భూష ణములకు కూడ అలంకారము. ఈమె కూడ అర్చి అనే పేరుతో ప్రసిద్ధిని గాంచి, పృథువును తన వశము చేసుకొనగలదు.

ఏష సాక్షాద్దరేరంశో జాతో లోకరిరక్షయా

ఇయం చ తత్పరా హి శ్రీరనుజజ్ఞేనపాయినీ

సాక్షాత్తుగా శ్రీహరియే లోకములను రక్షించగోరి ఈ పృథువు. రూపములో అవతరించినాడు. లక్ష్మీదేవి శ్రీహరియే పరాయణము గలది యై, ఆయనను ఏ కాలమునందైననూ విడిచియుండదు. కావుననే, ఆయన వెంటవెంటనే లక్ష్మీదేవి ఈ అర్చి యై అవతరించినది.

మైత్రేయ ఉవాచ

ప్రశంసంతి స్మ తం విప్రా గంధర్వప్రవరా జగుః

 ముముచుస్సుమనోధారాస్సిద్ధా నృత్యంతి స్వఃస్త్రియః

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- బ్రాహ్మణులు ఆ పృథువును కొనియాడిరి. గంధర్వులలో ఉత్తములగు తుంబురుడు మొదలగువారు గానమును చేసిరి. సిద్ధులు పుష్పవృష్టిని కురిపించిరి. అప్సరసలు నాట్య మాడిరి.

శంఖతూర్యమృదంగాద్యా నేదుర్దుందుభయో దీవి

 తత్ర సర్వ ఉపాజగ్ముర్దేవర్షిపితృణాం గణాః

అంతరిక్షములో శంఖములు తూర్యములు మద్దెళ్లు దుందుభులు మొదలగు వాద్యములు మ్రోగినవి. అచటకు దేవతలు, మహర్షులు, పితృ దేవతలు అందరు గణములుగా విచ్చేసిరి.

బ్రహ్మా జగద్గురుర్దేవైస్సహాసృత్య సురేశ్వరైః

వైన్యస్య దక్షిణే హస్తే దృష్ట్వా చిహ్నం గదాభృతః

 పాదయోరరవిందం చ తం వై మేనే హరేః కలామ్

 యస్యా ప్రతిహతం చక్రమంశస్స పరమేష్ఠినః

జగత్తునకు తండ్రియగు బ్రహ్మగారు దేవతలతో మరియు లోకపా లకులతో కూడి అచటకు వచ్చెను. ఆయన పృథువు కుడిచేతిలో గదాధారి యగు శ్రీహరియొక్క చిహ్నముగు, చక్రమును, పాదములయందు పద్మ మును చూచెను. ఎవని. చేతిలో ఇతరరేఖలతో తెగిపోకుండా చక్రము ఉండునో, ఆతడు పరమేశ్వరుని అంశయే యగును.

తస్యాఃభిషేక ఆరబ్ధో బ్రాహ్మణైర్బ్రహ్మవాదిభిః

ఆభిషేచనికాన్ యస్మా ఆజహ్రుస్సర్వతో జనాః

వేదవేత్తలగు బ్రాహ్మణులు ఆ పృథువుయొక్క పట్టాభిషేకమును ఆరంభించిరి. జనులు అన్ని దిక్కులనుండియు అభి షేక ద్రవ్యములను తీసుకు వచ్చిరి.

సరిత్సముద్రా గిరయే నాగా గావః ఖగా మృగాః

 ద్యౌః క్షితిస్సర్వభూతాని సమాజహ్రురుపాయనమ్

నదులు, సముద్రములు, పర్వతములు (వాటి అధిష్టాన దేవతలు), సర్పములు, గోవులు, పక్షులు, మృగములు, స్వర్గలోకము, భూదేవి, సకల ప్రాణులు బహుమతులను తీసుకు వచ్చిరి.

సోభిషిక్తో మహారాజస్సువాసాస్సాధ్వలంకృతః

 పత్న్యార్చిషాలంకృతయా విరేజ్వేగ్నిరివాపరః

చక్కని వస్త్రములను దాల్చి, బాగుగా అలంకరించబడిన పృథువు మహారాజుగా పట్టాభిషిక్తుడైనాడు. ఆతడు చక్కగా అలంకరించుకున్న తన భార్యయగు అర్చిస్సుతోగూడి రెండవ అగ్నివలె విశేషముగా ప్రకాశించెను.

తస్మై జహార ధనదో హైమం వీర వరాసనమ్

వరుణస్సలిలస్రావమాతపత్రం శశిప్రభమ్

వీరుడవగు ఓ విదురా! కుబేరుడు ఉత్తమమగు బంగరు సింహాసన మును, వరుణుడు నీటిని స్రవిస్తూ చంద్రుని వలె ప్రకాశించే శ్వేతచ్ఛత్ర మును పృథువునకు బహుమతిగా ఇచ్చిరి.

వాయుశ్చ వాలవ్యజనే ధర్మః కీర్తిమయీం ప్రజమ్

 ఇంద్రః కిరీటముత్కృష్టం దండం సంయమనం యమః

పృథువునకు వాయువు వింజామరలను, ధర్ముడు కీర్తిని వర్ధిల్ల జేసే మాలను, ఇంద్రుడు చాల గొప్ప కిరీటమును, యముడు శత్రువులను వశము చేసుకొనే దండమును బహుమతులుగా ఇచ్చిరి.

బ్రహ్మా బ్రహ్మమయం వర్మ భారతీ హారముత్తమమ్

హరిస్సుదర్శనం చక్రం తత్పత్న్యవ్యాహతాం శ్రియమ్

బ్రహ్మగారు వేదరూపమగు కవచమును, సరస్వతీ దేవి ఉత్తమ మగు హారమును, శ్రీహరి సుదర్శన చక్రమును, ఆయన భార్యయగు లక్ష్మీదేవి నాశము లేని సంపదను పృథువునకు ఇచ్చిరి.

దశచంద్రమసిం రుద్రశ్శతచంద్రం తథాకంబికా

 సోమోనమృతమయానశ్వాంస్త్వష్టా రూపాశ్రయం రథమ్

పృథువునకు రుద్రుడు కత్తినీయగా, పార్వతీదేవి డాలును ఇచ్చే ను. ఆ కత్తి ఒరకు చంద్రబింబమును పోలియున్న పది బుడిపెలు, డాలుకు వంద బుడి పేలు ఉండెను. చంద్రుడు అలసట, మరణము లేని గుర్రముల నిచ్చెను. త్వష్ట (విశ్వకర్మ) సౌందర్యనిధానమగు రథమునిచ్చెను.

 అగ్నిరాజగవం చాపం సూర్యో రశ్మిమయానిషూన్

భూః పాదుకే యోగమయ్యా ద్యౌః పుష్పావలిమన్వహమ్

అగ్ని పృథువునకు మేక మరియు గోవుయొక్క కొమ్ముతో చేసిన ధనస్సును, సూర్యుడు కిరణముల వలె వేగముగా పయనించే బాణముల ను, భూదేవి ఎక్కడి కైననూ క్షణకాలములో తీసుకుపోయే శక్తి గల పాదరక్ష లను, స్వర్గాధిష్టాన దేవత ప్రతిదినము పుష్పమాలను ఇచ్చిరి.

నాట్యం సుగీతం వాదిత్రమంతర్దానం చ ఖేచరాః ఋషయశ్చాశిషస్సత్యాస్సముద్రశ్శంఖమాత్మజమ్

ఆకాశసంచారులగు గంధర్వాదులు పృథువునకు నాట్యములో, చక్కని సంగీతములో, వాద్యములను వాయించుటలో సామర్థ్యమును మాత్రమే గాక, అంతర్ధానమయ్యే శక్తిని కూడ ఇచ్చిరి. మహర్షులు అమోఘములగు ఆశీర్వచనములను పలికిరి. సముద్రుడు. తనలో పుట్టిన శంఖమును పృథువునకు ఇచ్చెను.

సింధవః పర్వతా నద్యో రథవీథర్మహాత్మనః

సూతోథ మాగధో బందీ తం స్తోతుముపతస్థిరే

సముద్రములు, పర్వతములు, నదులు విశాలహృదయుడగు పృథువుయొక్క రథము తమగుండా నిరాటంకముగా పయనించునట్లు వర మునిచ్చినవి. అపుడు సూతుడు (పురాణకథలు తెలిసినవాడు), మాగధుడు (రాజుయొక్క వంశవృక్షము తెలిసినవాడు) మరియు వంది (తెలివిగా సందర్భోచితముగా మాటలాడువాడు) పృథువును స్తుతించుటకు ఉపక్ర మించిరి.

స్తావహింస్తానభిప్రేత్య పృథుర్వైన్యః ప్రతాపవాన్

మేఘనిర్రోదయా వాచా ప్రహసన్నిదమబ్రవీత్

స్తోత్రపాఠకులు స్తుతించుటకు ఉపక్రమించుచుండగా, ఆ విషయ మును వేనుని పుత్రుడగు పృథువు గమనించెను. ప్రతాపశీలియగు ఆయన నవ్వుతూ మేఘధ్వనివలె గంభీరమగు వాక్కుతో ఆ స్తోత్రపాఠకులనుద్దే శించి ఇట్లు పలికెను.

 పృథురువాచ

 భోస్సూత హే మాగధ సౌమ్య వందిన్

లో కేకధున్వాస్పష్టగుణస్య మే స్యాత్

 కిమాశ్రయో మే స్తవ ఏష యోజ్యతాం

మా మయ్యభూవన్ వితథా గిరో వః

ఓయీ సూతా! ఓయీ మాగధా! ప్రసన్నమగు శీలము గల ఓ వందీ! నా గుణములు ఇంకనూ లోకములో వెల్లడి కాలేదు. అట్టి స్థితిలో ఇప్పుడు మీకు నన్ను స్తుతించుటకు విషయమేమున్నది? కావున, మీరు నన్ను స్తుతించవలదు. నన్ను స్తుతించుట ద్వారా మీ వాక్కులు పొల్లు కారాదు.

తస్మాత్పరోక్షేకస్మదుపశ్రుతాన్యలం

 కరిష్యథ స్తోత్రమపీచ్యవాచః

 సత్యుత్తమశ్లోకగుణానువాదే

జుగుప్సితం న స్తవయంతి సభ్యాః

మీ వాక్కులు మధురమైనవి. కావున, మీరు మరియొక సమయ ములో నేను లేనప్పుడు నా కీర్తిని గురించి అధికముగా స్తుతించవచ్చును. పవిత్రమగు కీర్తి గల శ్రీహరియొక్క గుణగానము ఉండగా, శిష్ట పురుషులు అల్పుడగు మానవుని స్తుతించరు.

 మహద్గుణానాత్మని కర్తుమీశః కః స్తోవకైః స్తావయత్వేసతోకపి

 తేవస్యాభవిష్యన్నితి విప్రలబ్లో జనావహాసం కుమతిర్న వేద

ఒకడు మహాత్ముల గుణములను తనలో సంపాదించుటయందు సమర్థుడు కావచ్చును. కాని, అట్టివాడు తనలో లేని గుణములను ఉటం కిస్తూ చేసే స్తుతులను ఎట్లు ఇతరులచే చేయించును? వీడు శ్రమించి ఉంటే ఈ గుణములు. వీనిలో ఉండి ఉండెడివి అని జనులు అట్లు స్తుతులను చేయించుకొనే వ్యక్తిని నిందించెదరు. జనులు చేసే ఈ అవ హే ళనమును కూడ అట్టి మందబుద్ధి గ్రహించలేకపోవును.

ప్రభవో హ్యాత్మనః స్తోత్రం జుగుప్సంత్యపి విశ్రుతాః

హ్రీమంతః పరమోదారాః పౌరుషం వా విగర్హితమ్

వినయము, గొప్ప ఔదార్యము గల వారు తాము అధర్మమార్గ ములో చూపిన నిందితమైన పరాక్రమముయొక్క ప్రస్తావమును ఏవగించు కొనెదరు. అదే విధముగా, లోకప్రఖ్యాతి గాంచినవారు సమర్థులే అయి - ఉన్ననూ, ఆత్మస్తుతిని ఏవగించుకొనెదరు.

వయం త్వవిదితా లోకే సూతద్యాపి వరీమభిః

కర్మభిః కథమాత్మానం గాషయిష్యామ బాలవత్

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే చతుర్థస్కంధే పృథూపాఖ్యానే

పృథుపట్టాభిషేకవర్ణనం నామ పంచదశోఽధ్యాయః

ఓ సూతా! మేము ఇంకనూ ఉత్తమమగు కర్మలను చేసి లోక ములో ప్రతిష్టను గడించినవారము కాము. అట్టిచో, అవివేకి వలే నా ప్రతివి నేనే ఎట్లు చేయించుకొన గల్గుదును?

శ్రీమద్భాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధములో పృథూపాఖ్యానమునందు పృథువు పట్టాభిషేకమును వర్ణించే పదిహేనవ అధ్యాయము ముగిసినది.