భాగవత మహా పురాణము
31 - శ్రీకృష్ణ భగవానుడు అవతారమునుపసంహరించుట
శ్రీశుక ఉవాచ ।
అథ తత్రాగమద్భ్రహ్మా భవాన్యా చ సమం భవః ।
మహేంద్రప్రముఖా దేవా మునయస్సప్రజేశ్వరాః ॥
శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను --- దారుకుడు వెళ్లిన తరువాత అక్కడకు బ్రహ్మదేవుడు, శివుడు, పార్వతీదేవి, దేవేంద్రుడు-అగ్ని మొదలగు దేవతలు, ప్రజాపతులు, మహర్షులు విచ్చేసిరి.
పితరస్సిద్దగంధర్వా విద్యాధరమహోరగాః ।
చారణా యక్షరక్షాంసి కిన్నరాప్సరసో ద్విజాః॥
పితృదేవతలు, సిద్దులు, గంధర్వులు, విద్యాధరులు, గొప్ప నాగులు, చారణులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు, అప్సరసలు, మైత్రేయుడు మొదలైన బ్రాహ్మణులు విచ్చేసిరి.
ద్రష్టుకామా భగవతో నిర్యాణం పరమోత్సుకాః ।
గాయంతశ్చ గృణంతశ్చ శౌరేః కర్మాణి జన్మ చ ॥
వారికి శ్రీకృష్ణ భగవానుని నిర్యాణమును చూడవలెననే కోరిక, అతిశయించిన ఉత్కంఠ ఉండెను. వారు శూరవంశమునందు అవతరించిన శ్రీకృష్ణుని లీలలను గానము చేస్తూ ఆయనను స్తుతించుచుండిరి..
వవృషుః పుష్పవర్షాణి విమానావలిభిర్నభః ।
కుర్వంతస్సంకులం రాజన్ భక్త్యా పరమయా యుతాః ॥
ఓ పరీక్షిన్మహారాజా! వారు పూలవానలను కురిపించిరి. వారి విమానముల పంక్తులచే ఆకాశము రద్దీగా నుండెను. వారు సర్వాతిశాయి భక్తిని కలిగియుండిరి.
భగవాన్ పితామహం వీక్ష్య విభూతీరాత్మనో విభుః ।
సంయోజ్యాత్మని చాత్మానం పద్మనేత్రే న్యమీలయత్ ॥
సర్వవ్యాపకుడగు శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మదేవుని, తన విభూతులైన ఇంద్రాదులను చూచేను. ఆయన , చిత్తమును తన స్వరూపమునందు విలీనము చేసి, పద్మములవంటి కన్నులను మూసుకొనెను.
లోకాభిరామాం స్వతనుం ధారణాధ్యానమంగలమ్ ।
యోగధారణయాఽఽగ్నేయ్యా దగ్ధ్వా ధామావిశత్స్వకమ్ ॥
జనులకు మనోహరమైన ఆ రూపమును ధారణ చేసి ధ్యానించినచో మంగళములు కలుగును. అట్టి తన దేహమును ఆయన అగ్నిదేవతా సంబంధమైన యోగధారణచే దహించి, వైకుంఠధామమును ప్రవేశించెను.
దివి దుందుభయో నేదుః పేతుస్సుమనసశ్చ ఖాత్ ।
సత్యం ధర్మో ధృతిర్భూమేః కీర్తిశ్ర్శీశ్చను తం యయుః ॥
దేవదుందుభులు మ్రోగినవి. ఆకాశమునుండి పుష్పములు పడినవి. భూలోకమునుండి సత్యము, ధర్మము, దైర్యము, కీర్తి, సంపద కూడ ఆయన వెంట వెళ్లినవీ.
దేవాదయో బ్రహ్మముఖ్యా న విశంతం స్వధామని ।
అవిజ్ఞాతగతిం కృష్ణం దదృశుశ్చాతివిస్మితాః ॥
తన ధామమును ప్రవేశిస్తున్న శ్రీకృష్ణుని గతిని, బ్రహ్మదేవుడు ప్రముఖుడుగా గల దేవతలు మొదలగువారు గుర్తించలేకపోయిరి. వారు చాల ఆశ్చర్యపడిరి. .
సౌదామన్యా యథాఽఽవకాశే యాంత్యా హిత్వాఽభ్రమండలమ్ ।
గతిర్న లక్ష్యతే మర్త్యైస్తథా కృష్ణస్య దైవతైః ॥
ఆకాశమునందు మేఘమండలమును విడిచి పెట్టి వెళ్లుచున్న మెరుపు తీగయొక్క గతిని మానవులు కనుగొనలేరు. అదే విధముగా, శ్రీకృష్ణుని గతిని దేవతలు కనుగొనలేకపోయిరి.
బ్రహ్మరుద్రాదయస్తే తు దృష్ట్వా యోగగతిం హరేః ।
విస్మితాస్తాం ప్రశంసంతస్స్వం స్వం లోకం యయుస్తదా ॥
శ్రీకృష్ణుడు యోగముచే తన ధామమును చేరుటను చూచి ఆ బ్రహ్మదేవుడు, రుద్రుడు మొదలగువారు ఆశ్చర్యమును పొందిరి. పోరా యోగమాయావైభవమును కొనియాడుతూ, తమ తమ లోకములకు వెళ్లిరి.
రాజన్ పరస్య తనుభృజ్జననాప్యయేహా
హా మాయావిడంబనమవేహీ యథా నటస్య ।
సృష్ట్వాఽఽత్మనేదమనువిశ్య విహృత్య చాంతే
సంహృత్య చాత్మమహినోపరతస్స ఆస్తే ॥
ఓ పరీక్షిన్మహారాజా! పరమాత్మకు దేహధారులయందు పుట్టుట, నిర్యాణము, లీలలు నటునకు వలే మాయచే అనుకరణము మాత్రమేనని తెలియుము. ఆయన తననుండి ఈ జగత్తును సృష్టించి, దానియందు ప్రవేశించి, విహరించి, అంతమునందు ఉపసంహరించును. అప్పుడాయన జగత్కార్యమునుండి నివృత్తు డై అఖండసద్రూపముతో నిలిచియుండును.
మర్త్యేన యో గురుసుతం యమలోకనీతం
త్వాం చానయచ్ఛరణదః పరమాస్త్రదగ్ధమ్ ।
జిగ్యేఽoతకాంతకమపీశమసావనీశః .
కిం స్వావనే స్వరనయన్మృగయుం సదేహమ్ ॥
శ్రీకృష్ణుడు యమలోకమునకు కొనిపోబడిన గురుపుత్రుని మానవదేహముతో తీసుకువచ్చెను. ఆ శరణాగతరక్షకుడు బ్రహ్మాస్త్రముచే దహించబడిన నిన్ను కాపాడెను. ఆయన మృత్యుంజయుడగు రుద్రుని జయించెను. కిరాతుని దేహముతో సహా స్వర్గమునకు పం పెను. ఆయన తనను, తనవారిని రక్షించుట చేతకానివాడా?(కాదు).
తథాప్య శేష స్థితిసంభవాప్యయేష్వనన్య హేతుర్యద శేష శక్తిధృక్ ।
నైచ్చత్ప్రణేతుం వపురత్ర శేషితం
మర్త్యేన కిం స్వస్థగతిం ప్రదర్శయన్ ॥
సకలజగత్తుయొక్క సృష్టి స్థితిలయములకు రెండవది లేని (అభిన్ననిమిత్తపాదన) కారణము శ్రీకృష్ణుడే. ఎందుకంటే, ఆయన సకలశక్తులను ధరించియున్నాడు. కాని, ఆయన ఈ లోకములో దేహమును నిలిపి ఉంచుటకు ఇష్టపడలేదు. దేహము మరణించేది. దానితో పని యేమి? ఆత్మనిష్ఠులు మోక్షమును పొందెదరు. ఈ సత్యమును సాధకులకు ప్రదర్శించుటకే ఆయన అట్లు చేసెను.
య ఏతాం ప్రాతరుత్థాయ కృష్ణస్య పదవీం పరామ్ ।
ప్రయతః కీర్తయేద్భక్త్యా తామేవాప్నోత్యనుత్తమామ్ ॥
శ్రీకృష్ణుని ఈ వైకుంఠగమనలీల సర్వోత్తమమైనది. దీనిని ఎవడైతే ఉదయమే నిద్ర లేచి సావధానుడై భక్తితో కీర్తించునో, అట్టివాడు ఆ సర్వోత్తమమైన గతినే పొందును.
దారుకో ద్వారకామేత్య వసుదేవోగ్రసేనయోః ।
పతిత్వా చరణావస్రైర్న్యషించత్కృష్ణవిచ్యుతః ॥
దారుకుడు శ్రీకృష్ణుడు లేకుండా ద్వారకకు వచ్చి, వసుదేవ-ఉగ్ర సేనుల పాదములపై పడి కన్నీళ్లతో అభిషేకించెను.
కథయామాస నిధనం వృష్ణీనాం కృత్స్నతో నృప ।
తచ్చ్రుత్వోద్విగ్నహృదయా జనాశ్శోకవిమూర్ఛితాః ॥
ఓ పరీక్షిన్మహారాజా! యాదవులు పూర్తిగా నశించిన విషయమును దారుకుడు చెప్పెను. దానిని విని ఉద్వేగముతో నిండిన హృదయము గల జనులు శోకముచే మూర్చిల్లిరి.
తత్ర స్మ త్వరితా జగ్ముః కృష్ణ విశ్లేషవిహ్వలాః ।
వ్యసవశ్శేరతే యత్ర జ్ఞాతయో ఘ్నంత ఆననమ్ ॥
శ్రీకృష్ణుని వియోగముచే వ్యాకులు రైన జనులు తలలు బాదుకుంటూ, తమ జ్ఞాతులు ప్రాణములు పోయి పడి ఉన్న చోటికి వేగముగా వెళ్లిరి.
దేవకీ రోహిణీ చైవ వసుదేవస్తథా సుతౌ ।
కృష్ణ రామావపశ్యంతశ్శోకార్తా విజహుస్స్మృతిమ్ ॥
దేవకీ, రోహిణి, వసుదేవుడు తమ పుత్రులైన బలరామశ్రీకృష్ణులు కొనరాక శోకముచే పీడితులై స్పృహను కోల్పోయిరి.
ప్రాణాంశ్చ విజహుస్తత్ర భగవద్విరహాతురాః ।
ఉపగుహ్య పతీంస్తాంస్తాంశ్చితామారురుహుః స్త్రియః ॥
శ్రీకృష్ణ భగవానుని వియోగముచే దుఃఖితులై వారు అక్కడనే ప్రాణములను విడిచిరి. స్త్రీలు తమ తమ భర్తల దేహములను కౌగిలించి చితిని అధిష్ఠించిరి.
రామపత్న్యశ్చ తద్దేహముపగుహ్యాగ్నిమావిశన్ ।
వసుదేవపత్న్యస్తద్గాత్రం ప్రద్యుమ్నాదీన్ హరేస్స్నుషాః ।
కృష్ణపత్న్యోఽవిశన్నగ్నిం రుక్మిణ్యాధ్యాస్తదాత్మికాః ॥
బలరాముని భార్యలు ఆయన దేహమును, వసుదేవుని భార్యలు ఆయన దేహమును, శ్రీకృష్ణ భగవానుని కోడళ్లు తమ భర్త లైన ప్రద్యుమ్నుడు మొదలగువారి దేహములను కౌగిలించుకొని అగ్ని ప్రవేశము చేసిరి. శ్రీకృష్ణుని భార్యలగు రుక్మిణి, సత్యభామ మొదలగువారు ఆయననే ధ్యానిస్తూ అగ్నిని ప్రవేశించిరి.
అర్జునః ప్రేయసస్సఖ్యుః కృష్ణస్య విరహాతురః ।
ఆత్మానం సాంత్వయామాస కృష్ణ గీతైస్సదుక్తిభిః ॥
ప్రియతముడైన శ్రీకృష్ణుని వియోగముచే అర్జునుడు దుఃఖమును పొందెను. ఆతడు శ్రీకృష్ణుడు ఉపదేశించిన గీతలలోని సత్యవచనములతో తనను తానే ఓదార్చుకొనెను.
బంధూనాం నష్ట గోత్రాణామర్జునస్సాంపరాయికమ్ ।
హతానాం కారయామాస యథావదనుపూర్వశః ॥
సంతానము నశించి తాము కూడ సంహరించబడిన బంధువులకు క్రమముగా అర్జునుడు పరలోకసాధనమైన పితృకర్మను యథావిధిగా చేయించెను.
ద్వారకాం హరిణా త్యక్తాం సముద్రోఽప్లావయత్ క్షణాత్ ।
వర్జయిత్వా మహారాజ శ్రీమద్భగవదాలయమ్ ॥
ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణ భగవానుడు విడిచి పెట్టిన ద్వారకను, శ్రీకృష్ణ భగవానుని నివాసమును మినహాయించి, సముద్రము క్షణకాలములో ముంచివేసెను.
నిత్యం సన్నిహితస్తత్ర భగవాన్ మధుసూదనః ।
స్మృత్యాఽశేషాశుభహరం సర్వమంగలమంగలమ్ ॥
మధు కైటభసంహారియగు శ్రీహరి అక్కడ నిత్యసన్నిధియై ఉన్నాడు.. దానిని స్మరించుటచే సకలములైన అశుభములు తొలగిపోవును. అది మంగళములలో కెల్లా మంగళకరము.
స్త్రీబాలవృద్దానాదాయ హత శేషాన్ ధనంజయః ।
ఇంద్రప్రస్థం సమావేశ్య వజ్రం తత్రాభ్య షేచయత్ ॥
యాదవులు సంహరించబడగా మిగిలిన స్త్రీలను, పిల్లలను, వృద్ధులను అర్జునుడు దోడ్కొని ఇంద్రప్రస్థములో ప్రవేశ పెట్టెను. అక్కడ ఆతడు అనిరుద్ధపుత్రుడగు వజ్రుని పట్టాభిషిక్తుని చేయించెను.
శ్రుత్వా సుహృద్వధం రాజన్నర్జునాత్తే పితామహాః ।
త్వాం తు వంశధరం కృత్వా జగ్ముస్సర్వే మహాపథమ్ ॥
ఓ పరీక్షిన్మహారాజా! ఆత్మబంధువులైన యాదవుల సంహారమును గురించి నీ తాతలు అర్జునునినుండి వినిరి. అపుడు వారందరు నిన్ను - వంశమును నిలబెట్టే రాజునుగా అభిషేకించి, హిమాలయమునకు వెళ్లిరి.
య ఏతద్దేవదేవస్య విష్ణోః కర్మాణి జన్మ చ ।
కీర్తయేచ్చ్రద్ధయా మర్త్యస్సర్వపాపైః ప్రముచ్యతే ॥
ఏ మానవుడైతే దేవదేవుడగు శ్రీహరియొక్క ఈ అవతారమును, ' లీలలను కూడ శ్రద్ధతో కీర్తించునో, అట్టివాడు సకలపాపములనుండి , విముక్తుడగును.
ఇత్థం హరేర్బగవతో రుచీరావతార
వీర్యాణీ బాలచరితాని చ శంతమాని ।
అన్యత్ర చేహ చ శ్రుతాని గృణన్మనుష్యో
భక్తిం పరాం పరమహంసగతా లభేత ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ఏకాదశస్కంధే
ఏకత్రింశోఽధ్యాయః ॥
॥ ఏకాదశ స్కంధస్సమాప్తః ॥
శ్రీహరిభగవానుడు మనోహరములైన అవతారములలో శక్తిని సూచించే లీలలను, బాల్యలీలలను కూడ చేసెను. పరమానందమునిచ్చే ఆ లీలలను ఈ గ్రంథమే గాక, ఇతరగ్రంథములు కూడ వర్ణించినవి. వాటిని కీర్తించే మానవుడు పరమహంసలచే పొందబడే శ్రీహరియందు సర్వాతిశాయియైన (ఫలతృష్ణ లేని) భక్తిని పొందును.
శ్రీమద్బాగవత మహాపురాణము పదునొకండవ స్కంధములో
శ్రీకృష్ణ భగవానుడు అవతారమునుపసంహరించుటను వర్ణించే
ముప్పది ఒకటవ అధ్యాయము ముగిసినది (31).
ఏకాదశ స్కంధము ముగిసినది.
హరిః ఓమ్, తత్సత్, శ్రీకృష్ణార్పణమస్తు.
* * * * *
Summary of chapter 31 of the Bhāgavata Mahā Purana is as follows:
Witnessing the complete withdrawal of the Yadu dynasty, Lord Balarāma sat in deep yoga meditation on the seashore, emitted a luminous white serpent (Ananta Śesha) from His mouth, and returned to His eternal spiritual abode. Svayam Bhagavān Śrī Kṛshṇa then walked into the sacred forest of Prabhāsa, seated Himself peacefully beneath a pippala tree, and rested His lotus left foot upon His right thigh. A hunter named **Jāra**, mistaking Kṛshṇa's glowing foot for the face of a deer, shot an arrow tipped with the remaining iron fragment of the cursed club into His foot. Rushing forward, the terrified hunter realized his error and fell at Kṛshṇa's feet begging for mercy. Śrī Kṛshṇa comforted Jāra, assuring him that this was divinely ordained, and dispatched him to heaven.Instantly, a brilliant, incandescent spiritual light emanated from Śrī Kṛshṇa's divine body, illuminating the universe. Accompanied by celestial devatās, Gandharvas, and Rishis showering flowers and playing drums, Svayam Bhagavān Śrī Kṛshṇa ascended in His original, eternal spiritual form (*Sach-cid-ānanda-vigraha*) directly to His supreme spiritual abode in Vaikuṇṭha. Daruka returned to Dvārakā to inform Arjuna, who escorted the surviving women, children, and elders to Indraprastha as the ocean rose to submerge the city of Dvārakā, concluding an era of divine history.