భాగవత మహా పురాణము
23 - భిక్షుగీతము
బాదరాయణిరువాచ ।
స ఏవమాశంసిత ఉద్ధవేన భాగవతముఖ్యేన దాశార్హముఖ్యః ।
సభాజయన్ భృత్యవచో ముకుందస్తమాబభాషే శ్రవణీయవీర్యః ॥
వ్యాసపుత్రుడగు శుకమహర్షి ఇట్లు పలికెను -- దాశార్హవంశీయులలో ప్రముఖుడగు శ్రీకృష్ణుడు మోక్ష ప్రదాత. ఆయన పరాక్రమము వీవసాంపైనది. . భగవద్బక్తులలో ముఖ్యుడైన ఉద్ధవుడీ విధముగా ప్రశ్నించగా, ఆయన ఆతని మాటను సత్కరించి, ఆతనితోనిట్లు పలికెను.
శ్రీభగవానువాచ ।
బార్హస్పత్య స వై నాత్ర సాధుర్వై దుర్జనేరితైః ।
దురుక్తైర్భిన్నమాత్మానం యస్సమాధాతుమీశ్వరః ॥
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- బృహస్పతిశిష్యుడవగు ఓ ఉద్దవా! దుర్జనులు పలికిన చెడు మాటలచే క్షోభిల్లిన మనస్సును సమాధాన పరచుటలో సమర్థుడైన సజ్జనుడు ఈ లోకములో నిశ్చయముగా లేడు.
న తథా తప్యతే విద్ధః పుమాన్ బాణైస్సుమర్మగైః ।
యథా తుదంతి మర్మస్థా హ్యసతాం పరు షేషవః ॥
దుర్జనులు పలికిన పరుషవచనములు .హృదయమనే మర్మస్థానమునందు నిలిచి వ్యక్తికి చాల పీడను కలిగించును. మర్మస్థానములయందు గట్టిగా బాణములచే కొట్టబడిన వ్యక్తి కూడా నిశ్చయముగా అంతటి పీడను పొందడు.
కథయంతి మహత్పుణ్యమితిహాసమిహోద్ధవ ।
తమహం వర్ణయిష్యామి నిబోధ సుసమాహితః ॥
ఓ ఉద్దవా! ఈ విషయములో పెద్దలు పవిత్రమైన వృత్తాంతమునొకదానిని గొప్పగా చేప్పెదరు. దానిని నేను చెప్పెదను. నీవు చిత్తమును బాగుగా ఏకాగ్రము చేసి తెలుసుకొనుము.
కేనచిద్భిక్షుణా గీతం పరిభూతేన దుర్జనైః ।
స్మరతా ధృతియుక్తేన విపాకం నిజకర్మణామ్ ॥
ఒక భిక్షువును దుర్జనులు పరాభవించిరి. కాని, ఆయన ధైర్యమును కోల్పోలేదు. ఆయన అదంతా తన కర్మల ఫలమేనని గుర్తించి, ఒక గీతమును పాడేను.
అవంతిషు ద్విజః కశ్చిదాసీదాఢ్యతమశ్ర్శీయా ।
వార్తావృత్తిః కదర్యస్తు కామీ లుబ్ధోఽతికోపనః ॥
అవంతి దేశములో ఒకానొక బ్రాహ్మణుడు ఉండెను. ఆతడు వ్యవసాయము, వర్తకము మొదలైన వృత్తులను చేసి ధనమును కూడబెట్టి పెద్ద ధనవంతుడాయెను. కాని, ఆతడు పరపీడాపరాయణుడు, కాముకుడు, లోభి, మిక్కిలి కోపిష్టి.
జ్ఞాతయోఽతిథయస్తస్య వాజ్మాత్రేణాపీ నార్చితాః ।
శూన్యావసథ ఆత్మాఽపి కాలే కామైరనర్చితః ॥
ఆతడు జ్ఞాతులను, అతిథులను మాట మాత్రముచేనైననూ సత్కరించలేదు. శూన్యమైన ఇంటిలో ఆయా సమయములలో ఆతడు తాను కూడ ఏ భోగములలోనైననూ సంతోషముగా జీవించలేదు.
దుశ్శీలస్య కదర్యస్య ద్రుహ్యంతే పుత్రబాంధవాః ।
దారా దుహితరో భృత్యా విషణ్ణా నాచరన్ ప్రియమ్ ॥
దుష్టస్వభావముతో పరపీడాపరాయణుడైన ఆతని ప్రవర్తనచే దుఃఖితులైన కొడుకులు, బంధువులు, భార్య, కుమార్తెలు, సేవకులు ఆయనకు ప్రియమును చేయకుండిరి; పైగా, ద్రోహమును చేసిరి.
తస్యైవం యక్షవిత్తస్య చ్యుతస్యోభయలోకతః ।
ధర్మకామవిహీనస్య చుక్రుధుః పంచ భాగినః॥
యక్షులు ధనమును దాచెదరే గాని భోగించరు. ఈతడట్టివాడు. ఈతడి విధముగా ఇహపరముల రెండింటికీ చెడినాడు. ఆతని జీవితములో ధర్మము లేదు, కామము లేదు. మనిషి సంపదలో దేవతలు, పితరులు, మనుష్యులు, ప్రాణులు, ఋషులు అనే ఐదుగురికి వాటా ఉండును. పిల్లికి బిచ్చము పెట్టని వీనిపై ఆ ఐదుగురు యజ్ఞదేవతలు కోపించిరి.
తదవధ్యానవిగ్రస్తపుణ్యస్కంధస్య భూరిద।
అర్థోఽప్యగచ్ఛన్నిధనం బహ్వాయాసపరిశ్రమః ॥
ఆ మహాయజ్ఞదేవతలననాదరము చేయుటచే ఆతనికి ఉన్న ఏదో కొద్దిపాటి పుణ్యము కూడ వినష్టమయ్యెను. ఆతడు ఎంతో కష్టపడి ధర్మకామములను విడిచి పెట్టి డబ్బును కూడబెట్టెను. ఆ డబ్బు వలన ఆతనికి మిగిలినది శ్రమ మాత్రమే. అది కూడ వినష్టమయ్యెను.
జ్ఞాతయో జగృహుః కించిత్కించిద్దస్యవ ఉద్ధవ ।
దైవతః కాలతః కించిద్బ్రహ్మబంధోర్నృపార్థివాత్ ॥
ఓ ఉద్దవా! ఆ బ్రాహ్మణాధముని సంపదలో కొంత భాగమును బంధువులు లాగుకొనగా, చోరులు కొంత పట్టుకుపోయిరి. ఆతని సంపద దైవము (ఇల్లు అంటుకొనుట ఇత్యాది) వలన కొంత, కాలము వలన కొంత (నిలవ ఉంచిన ధాన్యము చెడిపోవుట ఇత్యాది) నష్టము కాగా, ఇతర జనులు కొంత పట్టుకుపోయిరి. కొంత సంపద రాజు ఖజానాకు చేరెను.
స ఏవం ద్రవిణే నష్టే ధర్మకామవివర్జితః ।
ఉపేక్షితశ్చ స్వజనైశ్చింతామాప దురత్యయామ్ ॥
ఆతనికి ధర్మకామములు ముందే లేవు. ఇప్పుడు అర్థము కూడ విన మాగెను. బంధువులాతనిని పట్టించుకోలేదు. అపుడాతడు అతిక్రొవి.. : శిక్యము కాని దుఃఖమును పొందెను.
తస్యైపం ధ్యాయతో దీర్ఘం నష్టరాయస్తపస్వినః ।
ఖిద్యతో బాష్పకంఠస్య నిర్వేదస్సుమహానభూత్ ॥
ఆతడీ విధముగా సంపద నశించి ఖేదమును పొంది దీర్భముగా చింతిల్లెను. కన్నుల వెంబడి నీరు స్రవించ ఆతని కంఠము గద్గదమాయెను. అపుడాయనకు చాల పెద్ద వైరాగ్యము కలిగెను.
స చాహేదమహో కష్టం వృథాఽఽత్మా మేఽనుతాపితః ।
న ధర్మాయ న కామాయ యస్యార్థాయాస ఈదృశః ॥
ఆతడిట్లు పలికెను --- అయ్యో! కష్టము! నేను దేహమును వ్యర్థముగా నిరంతరము తపింపజేసితిని. నేను ధనము కొరకై పడిన ఇటువంటి శ్రమ వలన ధర్మము సిద్ధించలేదు, భోగమైననూ సిద్ధించలేదు.
ప్రాయేణార్థాః కదర్యాణాం న సుఖాయ కదాచన ।
ఇహ చాత్మోపతాపాయ మృతస్య నరకాయ చ ॥
పరపీడాపరాయణులయొక్క ధనము తరచుగా ఏ కాలమునందైననూ సుఖమునీయదు. వారీ లోకములో శరీరమును కష్ట పెట్టెదరు; మరణించి నరకమును కూడ పొందెదరు.
యశో యశస్వినాం శుద్దం శ్లాఘ్యా యే గుణినాం గుణాః ।
లోభస్స్వల్పోఽపి తాన్ హంతి శ్విత్రో రూపమివేప్సితమ్ ॥
తెల్ల మచ్చ అందమైన రూపమును కూడ చెడగొట్టును. అదే విధముగా, లోభము అల్పమే అయినా, కీర్తిమంతుల స్వచ్చమగు కీర్తిని, గుణవంతుల కొనియాడదగిన గుణములను చెడగొట్టును.
అర్థస్య సాధనే సిద్ధ ఉత్కర్షే రక్షణే వ్యయే ।
నాశోపభోగ ఆయాసస్త్రాసశ్చింతా భ్రమో నృణామ్ ॥
మానవులు సంపదను ప్రోగుచేయుటలో, ప్రోగు చేసినదానిని పెంచుటలో, దానిని కాపాడుటలో శ్రమ, భయము, మానసికాందోళన, భ్రమ (అధర్మమునందు ధర్మబుద్ది) లను పొందెదరు. ఆ సంపదను ఖర్చు చేయునప్పుడు, అది వినష్టమైనప్పుడు, భోగించునప్పుడు కూడ మానసికాందోళనను పొందెదరు.
స్తేయం హింసాఽనృతం దంభః కామః క్రోధస్స్మయో మదః ।
భేదో వైరమవిశ్వాసస్సంస్పర్ధా వ్యసనాని చ ॥
సంపదలను ప్రోగు చేయునప్పుడు ఇతరుల సొత్తును అపహరించుట, డబ్బు కొరకై ప్రత్యక్షముగా లేదా పరోక్షముగా ఇతరులను పీడించుట, అసత్యభాషణము, ఇతరులను వంచించుటకు అనువైన వేషధారణము మొదలైన డాంబీకము, ధనాశ, అది తీరని కోపము అనే దోషములు గలవు. సంపద పోగైన తరువాత గర్వము, ఇతరులను తిరస్కరించుట, గొప్పవారు తక్కువ వారు అనే భేదబుద్ధి, వైరము, ఇతరులను నమ్మకుండుట, అధికమగు పోటీ తత్త్వము, వ్యసనములు (వ్యభిచారము, మద్యపానము, జూదము) అనే దోషములు ఉండును.
ఏతే పంచదశానర్థా హ్యర్థమూలా మతా నృణామ్ ।
తస్మాదనర్థమర్థాఖ్యం శ్రేయోఽర్థీ దూరతస్త్యజేత్ ॥
మానవులకు ఈ పది హేను దుఃఖ హేతువులు. నిశ్చయముగా ధనమే మూలముగా గలవని చెప్పబడినది. కాబట్టి, మోక్షమును కోరే సాధకుడు ధనమనే పేరు గల దుఃఖ హేతువును దూరముగా విడిచి పెట్టవలెను.
భిద్యంతే భ్రాతరో దారాః పితరస్సుహృదస్తథా ।
ఏకాస్నిగ్ధాః కాకిణినా సద్యస్సర్వేఽరయః కృతాః ॥
అన్నదమ్ములు, భార్య, తల్లిదండ్రులు, మిత్రులు ప్రేమబంధముతో ఒక్కటిగా కలిసి ఉంటారు. కానీ, వీరందరు పావలా డబ్బులు కారణముగా కలహించుకొని వెంటనే శత్రువులుగా మారిపోతారు.
అర్థేనాల్పీయసా హ్యేతే సంరబ్ధా దీప్తమన్యవః ।
త్యజంత్యాశు స్పృధో ఘ్నంతి సహసోత్సృజ్య సౌహృదమ్ ।
ఎందుకంటే, మిక్కిలి అల్పమైన ధనము నిమిత్తముగా వీరు మనస్సులో క్షోభ జెంది కోపముతో మండి పడెదరు. వీరు స్పర్ధ గలవారై వెంటనే ప్రేమను విడిచి పెట్టి శీఘ్రముగా బంధుత్వమును త్యజించి అపకారము చేయుదురు.
లబ్ధ్వా జన్మామరప్రార్థ్యం మానుష్యం తద్ద్విజాగ్ర్యతామ్ ।
తదనాదృత్య యే స్వార్థం ఘ్నంతి యాంత్యశుభాం గతిమ్ ॥
మనిషిగా పుట్టాలని దేవతలు కూడ కోరుకుంటారు. దానిలో కూడ బ్రాహ్మణత్వము గొప్ప. దానిని పొంది కూడ ఎవరైతే దానిని అనాదరము చేసి తమ పురుషార్థమును చెడగొట్టుకొనెదరో, వారు అపవిత్రమైన నరకాదులను పొందెదరు.
స్వర్గాపవర్గయోర్ద్వారం ప్రాప్య లోకమిమం పుమాన్ ।
ద్రవిణే కోఽనుషజ్జేత మఽనర్థస్య ధామని ॥
ఈ మానవజన్మ స్వర్గమునకు, మోక్షమునకు కూడ ద్వారము. మరణించబోయే ఏ మానవుడు అట్టి జన్మను పొంది కూడ ధనమునందాసక్తిని కలిగియుండును? ఆపదలన్నింటికీ ధనమే మూలము.
దేవర్షిపితృభూతాని జ్ఞాతీన్ బంధూంశ్చ భాగినః ।
అసంవిభజ్య చాత్మానం యక్షవిత్తః పతత్యధః ॥
వ్యక్తియొక్క సంపదలో దేవతలు, మహర్షులు, పితరులు, ప్రాణులు, అతిథులు వాటాదారులు. వారికి పెట్టకుండా సగోత్రీకులకు, బంధువులకు కూడ పెట్టకుండా, తాను తినకుండా, కేవలము యక్షులు వలె ధనమునకు కాపలా కాస్తూ ఉండేవాడు అధఃపతితుడగును.
వ్యర్థయాఽర్థేహయా విత్తం ప్రమత్తస్య వయో బలమ్ ।
కుశలా యేన సిద్ధ్యంతి జరఠః కిం ను సాధయే ॥
ధనమును సంపాదించే ప్రయత్నము ఎందుకూ పనికి రానిది. దాని వలన పురుషార్థము విస్మరించబడును. వివేకులు ధనమును యోగ్యముగా ఖర్చు చేసి కృతార్థులగుదురు. నా ధనము పోయినది. వయస్సు, బలము లుప్త మైనవి. ముదుసలిని. నేనేమి సాధించగలను?(ఏమీ సాధించలేను).
కస్మాత్సంక్లిశ్యతే విద్వాన్ వ్యర్థయాఽర్దేహయాఽసకృత్ ।
కస్యచిన్మాయయా నూనం లోకోఽయం సువిమోహితః ॥
ధనమును ప్రోగు చేసే ప్రయత్నము వ్యర్థము. తెలివైనవాడు కూడ . నిరంతరముగా ఆ ప్రయత్నముతో ఎందువలన క్లేశపడు చున్నాడు? ఈ మానవుడు నిశ్చయముగా ఒకానొకని (ఈశ్వరుని మాయచే గట్టి మోహమును పొంది యున్నాడు.
కిం ధనైర్ధనదైర్వా కిం కామైర్వా కామదైరుత ।
మృత్యునా గ్రస్యమానస్య కర్మభిర్వోత జన్మ దైః ॥
మృత్యువుచే కబళించివేయబడుచున్న మానవునకు ధనముతో గాని, ధనమునిచ్చే వారితో గాని, విషయభోగములతో గాని, కోరికలను తీర్చే వారితో గాని, జన్మలనిచ్చే (కామ్య) కర్మలతో గాని ఏమి ప్రయోజనము? .
నూనం మే భగవాంస్తుష్టస్సర్వదేవమయో హరిః ।
యేన నీతో దశామేతాం నిర్వేదశ్చాత్మనః ప్లవః ॥
సకలదేవతారూపుడైన శ్రీహరి భగవానుడు నా యెడల నిశ్చయముగా ప్రీతి జెంది నన్నీ దశకు చేర్చియుండును. నాకు వైరాగ్యమే పడవ.
సోఽహం కాలావశేషేణ శోషయిష్యేoఽగమాత్మనః ।
అప్రమత్తోఽఖిలస్వార్థే యది స్యాత్సిద్ధ ఆత్మని ॥
నాకింకా ఆయుష్టు మీగిలియున్నచో, ఆ కాలములో తపస్సు చేసి శరీరమును శుష్కింప జేసెదను. సకలపురుషార్థముల విషయములో పావ ధానుడనై యుండెదను. మనస్సునందు సంతోషమును కలిగియుండెదను.
తత్ర మామనుమోదేరన్ దేవాస్త్రీభువనేశ్వరాః ।
ముహూర్తేన బ్రహ్మలోకం ఖట్వాంగస్సమసాధయత్ ॥
నేనే చేసే ఆ సాధనయందు ముల్లోకములను పాలించే దేవతలు నన్ను అనుగ్రహించెదరు గాక! ఖట్వాంగ మహారాజు గంట సేపులో బ్రహ్మలోకమును సాధించెను.(కాబట్టి నిరాశ పడనక్కరలేదు).
శ్రీభగవానువాచ ।
ఇత్యభిప్రేత్య మనసా హ్యావంత్యో ద్విజసత్తమః ।
ఉన్ముచ్య హృదయగ్రంథీన్ శాంతో భిక్షురభూన్మునిః ॥
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- అవంతిదేశీయుడైన ఆ బ్రాహ్మణోత్తముడు మనస్సులో ఈ విధముగా నిశ్చయించుకొనెను. హృదయమునందలి ముడులైన అహంకార మమకారములనాయన విడిచి పెట్టి శాంతుడాయెను. ఆయన మననశీలుడైన సన్న్యాసి ఆయెను.
స చచార మహీమేతాం సంయతాత్మేంద్రియానిలః ।
భిక్షాఽర్థం నగరగ్రామానసంగోఽలక్షితోఽవీశత్ ॥
అయన మనస్సును, ఇంద్రియములను, శ్వాసను నియంత్రించి అసంగుడై భిక్ష కొరకు ఈ భూలోకములో సంచరించెను. ఆయన గుర్తు పట్టలేని విధముగా నగరములను, గ్రామములను ప్రవేశించెడివాడు.
తం వై ప్రవయసం భిక్షుమవధూతమసజ్జనాః ।
దృష్ట్వా పర్యభవన్ భద్ర బహ్వీభిః పరిభూతిభిః ॥
మంగళకరుడవగు ఓ ఉద్దవా! పెద్ద వయస్సులో మలినుడై ఉన్న ఆ భిక్షుకుని చూచి దుష్టజనులు అనేకవిధములుగా ఆయనను తిరస్కారము చేసి పరాభవించిరి.
కేచిత్త్రీవేణుం జగృహురేకే పాత్రం కమండలుమ్ ।
పీఠం చైకేఽక్షసూత్రం చ కంథాం చీరాణి కేచన ।
ప్రదాయ చ పునస్తాని దర్శితాన్యాదదుర్మునేః ॥
కొందరు ఆ మునియొక్క త్రిదండమును, కొందరు భిక్షాపాత్రను, కొందరు కమండలమును, మరికొందరు ఆసనమును, ఇంకొందరు జపమాలను కూడ లాగుకొనిరి. కొందరు చినిగియున్న కట్టు వస్త్రమును, కొందరు ఆయన వద్ద గల గుడ్డ పేలికలను లాగుకొనిరి. వారు వాటిని దాచి మరల చూపించి, ఇచ్చి మరల లాగుకొనిరి.
అన్నం చ భైక్ష్యసంపన్నం భుంజానస్య సరిత్తటే ।
మూత్రయంతి చ పాపిష్ఠాః ష్ఠీవంత్యస్య చ మూర్ధని ॥
ఆయన భిక్షాటనముచే లభించిన అన్నమును నది ఒడ్డున కూర్చుని తినుచుండగా ఆ మహాపాపులు మూత్రము చేసి, ఆతని తల పై ఉమిసిరి.
యతవాచం వాచయంతి తాడయంతి న వక్తి చేత్ ।
తర్జయంత్యపరే వాగ్బిః స్తేనోఽయమితి వాదినః ।
బధ్నంతి రజ్జ్వా తం కేచిద్బధ్యతాం బధ్యతామితి ॥
మౌనముగా ఉన్న ఆయనను కొందరు మాటలాడించెదరు. ఆయన మాటలాడకపోయినచో కొట్టెదరు. మరికొందరు, ఈతడు చోరుడు అనే మాటలతో బెదిరించెదరు. కొందరు కట్టివేయుడు, కట్టివేయుడు అంటూ త్రాళ్లతో కట్టివేసెదరు.
క్షిపంత్యేకేఽవజానంత ఏష ధర్మధ్వజశ్శఠః ।
క్షీణవిత్త ఇమాం వృత్తిమగ్రహీత్స్వజనోజ్ఘితః ॥
ఈతడు పైకి ధర్మాత్ముడుగా కనబడినా లోపల మోసగాడు. సంపద పోవుటచే ఈతడీ భీక్షావృత్తిని స్వీకరించినాడు. ఈతనిని బంధువులు విడిచి పెట్టిరి, అంటూ కొందరాయనను తిడుతూ అవమానించేడివారు.
అహో ఏష మహాసారో ధృతిమాన్ గిరిరాడివ ।
మౌనేన సాధయత్యర్థం బకవద్దృఢనిశ్చయః ॥
ఇత్యేకే విహసంత్యేన మేకే దుర్వాతయంతి చ ।
తం బబంధుర్నిరురుధుర్యథా క్రీడనకం ద్విజమ్ ॥
ఆహా! ఈతడు పెద్ద బలము గలవాడు, పర్వతరాజు వలె స్థిరమైన చిత్తము గలవాడు. మౌనముగా ఉంటూనే తన పనిని సాధిస్తాడు. మౌనంగా ఉండి చేపలను పట్టే కొంగ వలె దృఢమైన నిశ్చయము గలవాడు, అని కొందరీయనను పరిహసించెదరు. మరికొందరైతే ఆయన పై చెడు గాలిని విడిచి పెట్టెడివారు. ఆ బ్రాహ్మణుని వారు ఆటబొమ్మను వలె కట్టివేసి, తన దారిన వెళ్లకుండా అడ్డుకొనిరి.
ఏవం స భౌతికం దుఃఖం దైవికం దైహికం చ యత్ ।
భోక్తవ్యమాత్మనో దిష్ఠం ప్రాప్తం ప్రాప్తమబుధ్యత ॥
ఈ విధముగా ఆయనకు ఆధ్యాత్మిక-ఆధిభౌతిక-ఆధిదైవిక (శీతోష్ణాది) దుఃఖములు మరల మరల కలిగెను. అది తన ప్రారబ్దమేననియు, అనుభవించదగినదేననియు ఆయన తలపో సెను (వ్యాకులుడు కాలేదు).
పరిభూత ఇమాం గాథామగాయత నరాధమైః ।
పాతయద్భిస్స్వధర్మస్థో ధృతిమాస్థాయ సాత్త్వికీమ్ ॥
నీచులైన జనులు ఆయనను తన సాధుధర్మమునుండి పడద్రోయుటకై పరాభవించిరి (ఆధునికకాలములోని ర్యాగింగ్). కాని, ఆయన తన సాధుధర్మమునందే గట్టిగా నిలబడెను. ఆయన సాత్త్వికధృతి (అన్ని పరిస్థితులలో ధైర్యము కోల్పోకుండా ఉండుట) ని స్వీకరించి ఈ గాథ (అప్రయత్నముగా వెలువడిన ఉపదేశవాక్యము) ను గానము చేసెను.
ద్విజ ఉవాచ ।
నాయం జనో మే సుఖదుఃఖ హేతుర్న దేవతాఽఽత్మా గ్రహకర్మకాలాః ।
మనః పరం కారణమామనంతి సంసారచక్రం పరివర్తయేద్యత్ ॥
బ్రాహ్మణుడు పలికెను - నా సుఖదుఃఖములకు హేతువు ఈ జనులు, దేవత, శరీరము, గ్రహములు, కర్మ, కాలము కావు. కేవలము మన స్సే కారణమని పెద్దలు చెప్తారు. మన స్సే సంసారచక్రమును త్రిప్పుచున్నది.
మనో గుణాన్ వై సృజతే బలీయస్తతశ్చ కర్మాణి విలక్షణాని ।
శుక్లాని కృష్ణాన్యథ లోహితాని తేభ్యసవర్ణాస్సృతయో భవంతి ॥
అధికబలము గల మనస్సు నిశ్చయముగా గుణకార్యములగు వృత్తులను సృష్టించును. ఆ వృత్తులనుండి సాత్త్విక(పుణ్య)-తామస(పాపు-రాజస(మిశ్రమ)ములై వేర్వేరు లక్షణములు గల కర్మలు కలుగును. ఆ కర్మలనుండి వాటికి తగ్గ (ఉత్తమ-నీచ-మధ్యమములైన) జన్మలు కలుగును.
అనీహ ఆత్మా మనసా సమీహతా హిరణ్మయో మత్సఖ ఉద్విచష్టే ।
మనస్స్వలింగం పరిగృహ్య కామాఞ్జషన్నిబద్ధో గుణసంగతోఽసౌ॥
పరమాత్మ క్రీయాసంగము లేని చైతన్యప్రకాశఘనము, జీవునకు హిత కారి. పరమాత్మ సంకల్పించే మనస్సుతో కూడి ఉన్నా, ఉదాసీనముగా సాక్షి యై ఉండును. కాని, జీవుడు మనస్సుతో తాదాత్మ్యమును చెంది మన సే సూక్ష్మమగు శరీరము గలవాడగును. జీవుడు గుణకార్యములగు ఇంద్రియములపై, వాటి విషయములపై ఆసక్తి కలిగియుండును. ఆ జీవుడు భోగవిషయములను సేవిస్తూ సంసారములో బద్ధుడై యుండును.
దానం స్వధర్మో నియమో యమశ్చ శ్రుతాని కర్మాణి చ సద్ర్వతాని ।
సర్వే మనోనిగ్రహలక్షణాంతిః పరో హి యోగో మనసస్సమాధిః ॥
దానము, తన ధర్మమునాచరించుట, యమనియమములు, అధ్యయనములు, కర్మలు, మంచి ప్రతములు అనే సర్వమునకు అంతిమఫలము మనస్సుయొక్క నిగ్రహమే. ఎందుకంటే, మనస్సుయొక్క ఏకాగ్రత సర్వోత్కృష్టమైన యోగము.
సమాహితం యస్య మనః ప్రశాంతం
దానాదిభిః కిం వద తస్య కృత్యమ్ ।
అసంయతం యస్య మనో వినశ్యద్దానాదిభిశ్చేదపరం కిమేభిః ॥
ఎవని మనస్సు ఏకాగ్రమై ప్రశాంతముగా నుండునో, వానికి దానధర్మాలతో పని యేమియో చెప్పుము (ఏమీ లేదు). ఎవనీ మనస్సు - విక్షిప్తమై యుండునో, లేదా లయమై (నిద్ర) ఉండునో, వానికి దానధర్మాల వలన ఒరిగే ఇంకో ఫలమేమున్నది?(ఏమీ లేదు).
మనోవశేఽన్యే హ్యభవన్ స్మ దేవా మనశ్చ నాన్యస్య వశం సమేతి,
భీష్మో హి దేవస్సహస్సహీయాన్యుంజ్యాద్వశే తం స హి దేవ దేవః.
ఇతరములైన ఇంద్రియములు, దేవతలు కూడ మనస్సునకు వశమై ఉన్నారు. కాని, మనస్సు మాత్రము ఇంద్రియములకు, దేవతలకు కూడ వశమై లేదు. ఇది నిశ్చయము. ఎందుకంటే, సంసారభయమును కలిగించే మనస్సు అనే దేవుడు బలవంతులలోకెల్లా బలవంతుడు. ఆ దేవుని నిగ్రహించి వశపరచుకున్న ఆ వ్యక్తి దేవతలకు కూడ దేవత యగును.
తం దుర్జయం శత్రుమసహ్యవేగమరుంతుదం తన్న విజిత్య కేచిత్,
కుర్వంత్యసద్విగ్రహమత్ర మర్త్యైర్మిత్రాణ్యుదాసీనరిపూన్విమూఢాః।
మనస్సునకు రాగద్వేషములయందు ఉండే వేగమును సహించుట చాల కష్టము. మనస్సు మర్మములను పీడించే శత్రువు. దానిని జయించుట చాల కష్టము. అతిమూర్ఖులగు కొందరు అట్టి ఆ మనస్సును జయించకుండా ఈ లోకములో ఇతరమనుజులతో వ్యర్థమైన (నరక హేతువగు) కలహమునకు దిగెదరు. మనస్సును జయించలేని కారణముగా వారీ లోకములో జనులను మిత్రులు, ఉదాసీనులు, శత్రువులు అనే విభాగము చేసి ప్రవర్తించేదరు.
దేహం మనోమాత్రమిమం గృహీత్వా।
మమాహమిత్యంధధియో మనుష్యాః ।
ఏషోఽహమన్యోఽయమితి భ్రమేణ దురంతపారే తమసి భ్రమంతి ॥
ఈ దేహము మనోవృత్తిరూపముగా కల్పితము మాత్రమే. కాని, వివేకాంధులైన మానవులు ఈ దేహమునందు నాది-నేను అనే భ్రమను కలిగియుందురు. వారు ఈ దేహము నేను అని, మరియొక దేహము ఇతరుడు అని భ్రమించెదరు. వారు సంసారసముద్రములో పరిభ్రమించే దరు. అజ్ఞానమనే ఆ సముద్రమునకు అంతము పలికే ఆవలి తీరమే లేదు.
జనస్తు హేతుస్సుఖదుఃఖయోశ్చేత్కిమాత్మనశ్చాత్ర హి భౌమయోస్తత్,
జిహ్వాం క్వచిత్సందశతి స్వదద్భిస్తద్వేదనాయాం కతమాయ కుప్యేత్।
ఒక వ్యక్తియొక్క సుఖదుఃఖములకు ఇంకో వ్యక్తి కారణమైనచో, ఆత్మకు ఏమి యగును?(ఏమి సంబంధము?) కర్తయా? కర్మయా? ఏదీ కాదు. ఎందుకంటే, ఆ కర్తృత్వకర్మత్వములు పృథివీవిరములైన దేహములకు మాత్రమే. భోజనము చేయునప్పుడు ఒకడు తన పళ్లతో నాలుకను కొరికినాడనుకొనుడు. ఆతడప్పుడు దేనిపై కోపించును?
దుఃఖస్య హేతుర్యది దేవతాస్తు కిమాత్మనస్తత్ర వికారయోస్తత్,
యదంగమంగేన నిహన్యతే క్వచిత్క్రుధ్యేత కస్మై పురుషస్స్వదేహే.
సుఖదుఃఖములకు హేతువు ఇంద్రియాభిమాని దేవతలు అన్న పక్షములో, వాటితో ఆత్మకు ఏమి సంబంధము? ఎందుకంటే, ఆ కర్తృత్వభోక్తృత్వములనే వికారములు ఇంద్రియదేవతలకే చెందును. తన దేహములో ఒకచోట ఒక అంగముచే మరియొక అంగము కొట్టబడినచో, ఆ వ్యక్తి దేనిపై కోపించును?(దేని పైననూ కోపించడు).
ఆత్మా యది స్యాత్సుఖదుఃఖ హేతుః కిమన్యతస్తత్ర నిజస్వభావః ।
న హ్యాత్మనోఽన్యద్యది తన్మృషా స్యాత్।
క్రుధ్యేత కస్మాన్న సుఖం న దుఃఖమ్ ॥
ఆత్మయే సుఖదుఃఖములకు కారణము అన్నచో, ఆ పక్షమునందు ఇతరము వలన యేమి గలదు?(ఏదీ లేదు). అప్పుడు సుఖదుఃఖములు ఆత్మయొక్క స్వభావములే యగును. పైగా, ఆత్మకంటె వేరుగా మరి యొకటి లేనే లేదు. ఉన్నట్లైతే, అది మిథ్యయే యగును. సుఖము లేదు, దుఃఖము లేదు. కాబట్టి కోపించుటకు కారణమేమున్నది?(ఏమీ లేదు).
గ్రహా నిమిత్తం సుఖదుఃఖయోశ్చేత్కిమాత్మనోఽజస్య జనస్య తే వై,
గ్రహైర్గ్రహస్యేవ వదంతి పీడాం క్రుధ్యేత కస్మై పురుషస్తతోఽన్యః ।
సుఖదుఃఖములకు గ్రహములు కారణమనే పక్షములో, పుట్టుక. లేని ఆత్మకు గ్రహములతో సంబంధమేమున్నది? గ్రహసంబంధము పుట్టే దేహమునకు మాత్రమే. పైగా, ఒక గ్రహముయొక్క పీడ మరియొక గ్రహమునకు ఉండునని దైవజ్ఞులు చేప్పెదరు. అట్టిచో, వ్యక్తి దేనిపై కోపించవలెను? దేహము పైనా? గ్రహము పైనా?, పురుషుని యథార్థస్వరూపము దేహముకంటె, గ్రహములకంటె విలక్షణమైనది.
కర్మాస్తు హేతుస్సుఖదుఃఖయోర్వై కిమాత్మనస్తద్ధి జఢాజఢత్వే ।
దేహస్త్వచిత్పురుషోఽయం సుపర్ణః।
క్రుధ్యేత కస్మై న హి కర్మ మూలమ్ ॥
సుఖదుఃఖములకు కారణము కర్మ అన్నచో, ఆత్మకు కర్మసంబంధమేమున్నది?(ఏమీ లేదు). ఏలయన, జడచేతనముల గ్రంథియందు మాత్రమే కర్మ సంభవమగును. దేహమైతే జడము. ఈ ఆత్మ శుద్ధజ్ఞానస్వరూపము (కావున, అజ్ఞానముచే తప్ప గ్రంథియే సంభవము కాదు). కాబట్టి, వాస్తవమైన కర్మ లేనే లేదు. ఈ స్థితిలో దేనిపై కోపము చేయవలెను?(మనస్సు మాత్రమే సుఖదుఃఖ హేతువు).
కాలస్తు హేతుస్సుఖదుఃఖయోశ్చేత్కిమాత్మనస్తత్ర తదాత్మకోఽసౌ,
నాగ్నేర్హి తాపో న హిమస్య తత్స్యాత్
క్రుధ్యేత కస్మై న పరస్య ద్వంద్వమ్ ॥
సుఖదుఃఖములకు కాలము హేతువన్నచో, ఆ పక్షమునందైననూ ఆత్మకు ఏమి సంబంధము?(ఆత్మ కాలాతీతము). ఈ జీవుడు పరమాత్మయొక్క అంశమే. కాబట్టి, కాలము జీవుని ఏమీ చేయలేదు. ఎల్లాగంటే, అగ్నికి జ్వాలల వలన తాపము, మంచునకు చలి ఉండవు గదా! కాబట్టి, దుఃఖము వచ్చినప్పుడు దేనిపై కోపించవలెను? వాస్తవములో, జీవుడు సుఖదుఃఖాది ద్వంద్వములకు అతీతుడు. కావున, విచారించినచో సుఖదుఃఖములు వాస్తవములే కావు.
న కేనచిత్క్వాపీ కథంచనాస్య ద్వంద్వోపరాగః పరతః పరస్య । యథాఽహమస్సంసృతిరూపిణస్స్యాదేవం ప్రబుద్ధో న బిభేతి భూతైః॥
అహంకారమే సంసారమును నిరూపించును. ఆ అహంకారమునకు సుఖదుఃఖములు ఉండును. ఆ విధముగా కార్యజగత్తునకు కారణమైన ప్రకృతికి కూడ అతీతమైన ఈ పరమాత్మకు సుఖదుఃఖాది ద్వంద్వముల గ్రహణము.(సంబంధము) ఏ కారణముగానైననూ, ఎప్పుడైననూ, ఎక్క డైననూ, ఏ విధముగానైననూ లేదు. ఈ సత్యమును సాక్షాత్కరించుకున్నవాడు ఇతరప్రాణుల కారణముగా భయపడడు.
ఏతాం సమాస్థాయ పరాత్మనిష్ఠామధ్యాసితాం పూర్వతమైర్మహర్షిభిః ।
అహం తరిష్యామి దురంతపారం తమో ముకుందాంఘ్రిని షేవయైవ ॥
ప్రాచీనులైన మహర్షులు దేహేంద్రియాదులకతీతమైన ఈ ఆత్మయందు నిష్ఠను సేవించిరి. నేను కూడ అటులనే స్వీకరించేదను. అజ్ఞానమనే సంసారసముద్రమునకు అంతము పలికే ఆవలి తీరము లేదు. దీనిని నేను మోక్ష ప్రదాతయగు శ్రీహరి పాదముల సేవచే మాత్రమే దాటి వేయగలను.
శ్రీభగవానువాచ ।
నిర్విద్య నష్టద్రవిణో గతక్లమః ప్రవ్రజ్య గాం పర్యటమాన ఇత్థమ్,
నిరాకృతోఽసద్భిరపి స్వధర్మాదకంపితోఽమూం మునిరాహ గాథామ్.।
శ్రీకృష్ణ భగవానుడు పలికెను -- ఆ భిక్షుకుడు ధనము నశించినప్పుడు విరక్తుడై సన్న్యసించి మనన శీలుడాయెను. ఆయన భూమినంతటా పర్యటిస్తూ ఈ గీతిని పాడెను. దుష్టులు తిరస్కరించినా ఆయన స్వధర్మమునుండి చలించలేదు. ఆయనకు ఖేదము తొలగిపోయెను.
సుఖదుఃఖప్రదో నాన్యః పురుషస్యాత్మవిభ్రమః ।
మిత్రోదాసీనంపవస్సంసారస్తమసః కృతః ॥
మనిషికి సుఖదుఃఖములనిచ్చేది ఇతరులు కాదు. ఇతరులు కలిగించెదరనేది మనస్సుయొక్క భ్రమ. అజ్ఞానము వలన మాత్రమే మిత్రులు, ఉదాసీనులు, శత్రువులు అనే భేదము, సంసారము కలుగును.
తస్మాత్సర్వాత్మనా తాత నిగృహాణ మనో ధియా ।
మయ్యావేశితయా యుక్త ఏతావాన్ యోగసంగ్రహః ॥
నాయనా! సంసారము మనఃకల్పితము మాత్రమే అగుట వలన, నీవు నాయందు ఏకాగ్రము చేయబడిన (నిశ్చయాత్మకమగు) బుద్దితో కూడి మనస్సును అన్ని విధములుగా నిగ్రహించుము. ఇంత (మనోనిగ్రహము) మాత్రమే యోగముయొక్క సారము.
య ఏతాం భిక్షుణా గీతాం బ్రహ్మనిష్ఠాం సమాహితః ।
ధారయన్ శ్రావయన్ శృణ్వన్ ద్వం ద్వైర్నైవాభిభూయతే ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ఏకాదశస్కంధే
త్రయోవింశోఽధ్యాయః ॥
ఈ బ్రహ్మనిష్ఠ ను భిక్షుకుడు గానము చేసెను. దీనిని ఎవడైతే ఏకాగ్రతతో బుద్దియందు ధారణ చేయునో, ఇతరులకు వినిపించునో, లేదా ఇతరుని వలన వినునో, అట్టివానిని సుఖదుఃఖాదిద్వంద్వములు పరాభూతుని చేయలేవు.
శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో భిక్షుగీతమును వర్ణించే ఇరువది
మూడవ అధ్యాయము ముగిసినది (23).
Summary of chapter 23 of the Bhāgavata Mahā Purana is as follows:
To teach Uddhava how a devotee remains undisturbed by physical mistreatment, insults, and harsh words, Śrī Kṛshṇa narrated the historical account of an extraordinarily wealthy but miserly brāhmaṇa from the country of Avanti. After losing all his wealth to thieves, relatives, and natural disasters, the Avanti brāhmaṇa experienced intense spiritual awakening and embraced the renounced order of life (*Tridaṇḍi-sannyāsa*). As he wandered begging alms, wicked men insulted, spat upon, and physically abused him. Remaining completely peaceful, the brāhmaṇa sang the famous **Bhikshu-gīta** (*SB 11.23.42–57*), declaring that neither people, demigods, physical bodies, stars, karma, nor time cause one's happiness and distress; rather, the mind alone is the sole cause of material bondage and suffering. By conquering the mind through devotion to Śrī Kṛshṇa, the sage crossed the ocean of illusion.