భాగవత మహా పురాణము
17 - వివిధధర్మముల నిరూపణ
గొప్ప బాహువులు గల ఓ శ్రీపతిప్రభూ! పూర్వము నీవు ఆ హంసరూపముతో ఏ విధముగానైతే బ్రహ్మదేవుని కొరకు ధర్మమును చెప్పితివో, అది చెప్పుము. ఉత్కృష్టమగు ఆ ధర్మము సుఖప్రదము.
స ఇదానీం సుమహతా కాలేనామిత్రకర్శన ।
న ప్రాయో భవితా మర్త్యలోకే ప్రాగనుశాసితః ॥
శత్రువులను కృశింపజేసే ఓ శ్రీకృష్ణా! నీవు పూర్వము ఉపదేశించిన ఆ ధర్మము చాల పెద్ద కాలము తరువాత ఇప్పుడు మానవలోకములో ఇంచుమించు లుప్తమైనది. భవిష్యత్తులో కూడ ఉండబోదు.
వక్తా కర్తాఽవితా నాన్యో ధర్మస్యాచ్యుత తే భువి ।
సభాయామపి వైరించ్యాం యత్ర మూర్తిధరాః కలాః ॥
ఓ అచ్యుతా! భూలోకమునందు గాని, విద్యలు రూపు దాల్చి ఉండే బ్రహ్మదేవుని సభయందు గాని, ధర్మమును బోధించి ఆచరించి రక్షించేవాడు నీకంటే మరియొకడు లేడు.క్షేమాయ - కల్యాణము కొరకు, సనాతనాన్ - సనాతనములైన, ధర్మాన్ - ధర్మములను, ఆహ - చెప్పెను.
శ్రీశుక మహర్షి ఇట్లు చెప్పెను -- తన భక్తులలో ప్రముఖుడగు ఉద్దవుడీ విధముగా ప్రశ్నించగా, ఆ శ్రీకృష్ణ భగవానుడు ప్రీతి జెంది, మానవుల కల్యాణము కొరకై సనాతనములైన ధర్మములను ఉపదేశించెను.
శ్రీభగవానువాచ ।
ధర్మ్య ఏష తవ ప్రశ్నో నైశ్శ్రేయసకరో నృణామ్ ।
వర్ణాశ్రమాచారవతాం తముద్ధవ నిబోధ మే ॥
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలి కెను --- ఓ ఉద్ధవా! నీ ధర్మబద్ధమైన ప్రశ్న వర్ణాశ్రమధర్మములను పాలించే శీలము గల మానవులకు మోక్షసాధనము. నీవు దానిని నానుండి తెలుసుకొనుము.
ఆదౌ కృతయుగే వర్ణో నృణాం హంస ఇతి స్మృతః ।
కృతకృత్యాః ప్రజా జాత్యా తస్మాత్కృతయుగం విదుః ॥
కల్పాదియందలి కృతయుగమునందు జనుల (ఒకే ఒక) వర్ణమునకు హంస అని పేరు. జనులు పుట్టుకతోనే కృతార్థులుగా నుండెడివారు. కావుననే, ఆ యుగమునకు కృతయుగమని పేరు.పుట్టినవారు; యే - ఎవరైతే; ఆల్మాచారలక్షణాః - తమ శీలము (ప్రవృత్తి) జ్ఞాపకముగా గలవారు.
విరాట్ పురుషుని నోరు, చేతులు, తొడలు, పాదములనుండి క్రమముగా బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రులు ప్రకటమైరి. శీలము (ప్రవృత్తి) యే వారి వర్ణమునకు జ్ఞాపకము.
గృహాశ్రమె జఘనతో బ్రహ్మచర్యం హృదో మమ ।
వక్షఃస్థానా ద్వనేవాసో న్యాసశ్శీర్షణి సంస్థితః ॥
నా హృదయమునుండి బ్రహ్మచర్యము, నడుమునుండి గార్హ స్థ్యము, వక్షఃస్థలమునుండి వానప్రస్థము, తలనుండి సన్న్యాసము ప్రకటమైనవి.
వర్ణానామాశ్రమాణాం చ జన్మభూమ్యనుసారిణీః ।
ఆసన్ ప్రకృతయో నౄణాం నీచైర్నీచోత్తమోత్తమైః ॥
వర్ణాశ్రమములకు చెందిన మానవుల స్వభావములు పుట్టిన స్థానమునకు తగ్గట్లుగా -- క్రింది స్థానముచే తక్కువదిగను, పై స్థానముచే గొప్పదిగను -- ఉండెను..
శమో దమస్తప శ్శౌచం సంతోషః క్షాంతరార్జవమ్ ।
మద్భక్తిశ్చ దయా సత్యం బ్రహ్మ ప్రకృతయస్త్విమాః ॥
శాస్త్రవాక్యములయందు విశ్వాసము, దానమునందు నిష్ణ, ఇతరులను మోసగించకుండుట, వేదవేత్తలను సేవించుట, ధనమును ప్రోగుచేయు నప్పుడు చాలు అనే చిన్న తలంపు లేకుండుట అనేవి వైశ్యస్వభావములు.
శుశ్రూషణం ద్విజగవాం దేవానాం చాప్యమాయయా ।
తత్ర లభ్ధేన సంతోషశ్శూద్రప్రకృతయస్త్విమాః ॥
వేదవేత్తలకు, గోవులకు, దేవతలకు కూడ కపటము లేకుండా సేవ చేయుట, దానిచే లభించిన దానితో తృప్తి పడుట శూద్రస్వభావములు.
అశౌచమనృతం స్తేయం నాస్తిక్యం శుషవిగ్రహః ।
కామః క్రోధశ్చ తర్షశ్చ స్వభావోఽo తేవసాయినామ్ ॥
శౌచము లేకుండుట, అసత్యము, చౌర్యము, నాస్తికుడై యుండుట, నిష్కారణవైరము, భోగములయందు కోరిక, కోపము, దురాశ అనునవి వర్ణాశ్రమధర్మహీనుల స్వభావములు.
అహింసా సత్యమస్తేయమకామక్రోధలోభతా ।
భూతప్రియహితేహా చ ధర్మోఽయం సార్వవర్ణికః ॥
ఆతడు దంతధావనము, వస్త్రములను ఉదుకుట అనువాటిని అలంకారము కొరకు చేయరాదు. ఆతని ఆసనము ఎర్రగా ఉండరాదు.
స్నానభోజనహో మేషు జపోచ్చారే చ వాగ్యతః ।
న చ్ఛింద్యాన్నఖరోమాణి కక్షోపస్థగతాన్యపి ॥
స్నానము, భోజనము, హోమము, జపము, విసర్జనములను చేయు నప్పుడు బ్రహ్మచారి మౌనమును పాటించవలెను. గోళ్లను, జుట్టును, బాహు-ఊరుమూలములయందలి రోమములతో సహా తీసివేయరాదు.
రేతో నావికిరేజ్జాతు బ్రహ్మవ్రతధరస్వయమ్ ।
అవకీర్ణేఽవగాహ్యాప్సు యతాసుస్త్రీపదీం జపేత్ ॥
బ్రహ్మచర్యము ఒక వ్రతము. బ్రహ్మచారి ఒకప్పుడైననూ బుద్ధి పూర్వకముగా రేతస్సును సన్నము చేయరాదు. రేతస్సు స్కన్న మైనచో స్నానము చేసి, ప్రాణాయామమును చేసి, గాయత్రిని జపించవలెను. .
అగ్న్యర్కాచార్యగోవిప్రగురువృద్ధసురా ఞ్ఛుచిః ।
సమాహిత ఉపాసీత సంధ్యే చ యతవాగ్జపన్ ॥
అనుమతితో ఇతరము (వస్తాదికము) ను దేనినైననూ సావధానుడై (చాపల్యము లేకుండా) వినియోగించవలెను.
శుశ్రూషమాణ ఆచార్యం సదోపాసీత నీచవత్ ।
యానశయ్యాఽఽసనస్థానైర్నాతిదూరే కృతాంజలిః ॥
ఆచార్యుని బ్రహ్మచారి తక్కువవాడు వలే సేవ చేయవలెను. ఆచార్యుడు వెళ్లుచున్నప్పుడు చాల దూరము కాకుండా వెనుక నడువవలెను. ఆచార్యుడు పరుండినప్పుడు చాల దూరము కాకుండా పరుండవలెను. ఆయన కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు చాల దూరము కాకుండా చేతులు జోడించి నిలువవలెను.
ఏవంవృత్తీ గురుకులే వ సేద్బోగవివర్జితః ।
విద్యా సమాప్యతే యావద్బిభ్రద్వ్రతమఖండితమ్ ॥
బ్రహ్మచారి అఖండమైన బ్రహ్మచర్యవ్రతమును ధరించి భోగములను విడిచి పెట్టి, విద్య సమాప్తమయ్యే వరకు ఈ విధమైన నడవడితో గురుకులములో నివసించవలెను.
యద్యసౌ ఛందసాం లోకమారోక్ష్యన్ బ్రహ్మవిష్ణ పమ్ ।
గురవే విన్య సేద్దేహం స్వాధ్యాయార్థం బృహద్వ్రతః ॥
గృహస్థుడు కానివాడు (బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్న్యాసి) యువతులను చూడరాదు; వారిని స్పృశించరాదు; వారితో కబుర్లాడరాదు; వారితో పరిహాసము, సంకేతము మొదలగువాటిని విడిచి పెట్టవలెను. సంభోగములోనున్న పశుపక్ష్యాదులకు ఎదురు వెళ్ల(చూడ)రాదు.
శౌచమాచమనం స్నానం సంధ్యోపాసనమార్జవమ్ ।
తీర్థ సేవా జపోఽస్పృశ్యాభక్ష్యాసంభాష్యవర్జనమ్ ॥
సర్వాశ్రమప్రయుక్తోఽయం నియమః కులనందన ।
మద్భావస్సర్వభూతేషు మనోవాక్కాయసంయమః ॥
వంశమునానందింపజేసే ఓ ఉద్దవా! బాహ్య-ఆంతరశౌచము, ఆచమనము, స్నానము, సంధ్యోపాసనము, ఋజుస్వభావము, తీర్థములను సేవించుట, జపము, స్పృశించకూడనివాటిని స్పృశించకుండుట, తినకూడనివాటిని తినకుండుట, మాటలాడకూడని దుష్టులతో మాటలాడకుండుట, సకలప్రాణులయందు నన్ను (ఈశ్వరుని) దర్శించుట, మనస్సు-వాక్కు-దేహములను నియంత్రించుకొనుట అనేవి అన్ని ఆశ్రమములవారు పాటించదగిన ధర్మములు.
ఏవం బృహద్వ్రతధరో బ్రాహ్మణోఽగ్నిరివ జ్వలన్ ।
మద్భక్తస్తీవ్రతపసా దగ్ధకర్మాశయోఽమలః ॥
ములలో క్రిందదానినుండి పైదానికి వెళ్లవచ్చును. నా ఏకాంతభక్తుడు ఆశ్రమ హీనుడుగా ఉండరాదు, పై ఆశ్రమమునుండి క్రిందిదానికి వెళ్లరాదు.
గృహార్థీ సదృశీం భార్యాముద్వ హేదజుగుప్సితామ్ ।
యవీయసీం తు వయసా యాం సవర్ణామనుక్రమాత్ ॥
గృహస్థుడు కాగోరిన బ్రహ్మచారి తనకు తగిన అమ్మాయిని వివాహము చేసుకొనవలెను. దోషములు లేని ఆ అమ్మాయి సమానవర్ణమునకు చెందినది, వయస్సులో చిన్నది కావలెను. ఆ తరువాత క్రమముగా తరువాతి వర్ణముల అమ్మాయిని వివాహము చేసుకొనవచ్చును.
ఇజ్యాఽధ్యయనదానాని సర్వేషాం చ ద్విజన్మనామ్ ।
ప్రతిగ్రహోఽధ్యాపనం చ బ్రాహ్మణ స్యైవ యాజనమ్ ॥
ఉపనీతులందరికి యజ్ఞ-వేదాధ్యయన-దానములకు యోగ్యత గలదు. కాని, దానమును స్వీకరించుట, వేదమును బోధించుట, యజ్ఞమును చేయించుట అనువాటికి బ్రాహ్మణునకు మాత్రమే యోగ్యత గలదు.
ప్రతిగ్రహం మన్యమానస్తవ స్తేజోయశోనుదమ్ ।
అన్యాభ్యామేవ జీవేత శిలైర్వా దోషదృక్తయోః ॥
పొలములలో, బజారులో జారి పడిన గింజలతో రోజును గడిపివేస్తూ సంతుష్టమైన చిత్తము గల ఆ బ్రాహ్మణుడు గొప్ప, నిష్కల్మషమైన ధర్మమును సేవించు చున్నాడు. ఆతడు చిత్తమును నాయందే సమర్పించి, అధికమగు సంసారాసక్తి లేకుండా ఇంటిలోనే ఉంటూనే, మోక్షమును పొందును.
సముద్ధరంతి యే విప్రం సీదంతం మత్పరాయణమ్ ।
తానుద్ధరిష్యే నచిరాదాపద్భ్యో నౌరివార్ణవాత్ ॥
దారిద్యముతో కష్టపడుతూ నాయందు ఏకాంతభక్తి గల వేదవేత్తను ఎవరైతే గట్టెక్కిస్తారో, వారిని నేను ఆపదలనుండి, నావ సముద్రమునుండి వలె, ఉద్దరించెదను.
సర్వాస్సముద్గరేద్రాజా పితేవ వ్యసనాత్ప్రజాః ।
ఆత్మానమాత్మనా ధీరో యథా గజపతిర్గజాన్ ॥
గజేంద్రుడు తన దండులోని ఏనుగులను కాపాడుతూ తనను కాపాడు కొనును. అదే విధముగా, రాజు ధీరుడై ప్రజలను తండ్రివలె ఆపదలనుండి గట్టెక్కిస్తూ, తనను కూడ తానే తెలివితేటలతో ఉద్ధరించుకొనవలెను.
క్షత్రియుడు ఆపద వచ్చినప్పుడు వైశ్యవృత్తితో గాని, వేటతో గాని, బ్రాహ్మణుడు వలె అధ్యాపనముచే గాని పొట్టపోసుకొనవలెను. అంతేగాని, అధములను ఎన్నడైననూ సేవించరాదు.
శూద్రవృత్తిం భజేద్వైశ్యశ్శూద్రః కారుకటక్రియామ్ ।
కృచ్ఛ్రాన్ముక్తో న గర్హ్యేణ వృత్తిం లిప్సేత కర్మణా ॥
ఆపదలో వైశ్యుడు శూద్రుల పనితో, శూద్రుడు ఆపదలో చాపలల్లుట మొదలగు చేతిపనులవారి వృత్తితో పొట్ట పోసుకొనవలెను. ఆపద తొలగిన తరువాత నిందించదగిన వృత్తితో జీవికను సంపాదించకూడదు.
వేదాధ్యాయస్వధాస్వాహాబల్యన్నా ద్యైర్యథోదయమ్ ।
దేవర్షిపితృభూతాని మద్రూపాణ్యన్వహం యజేత్ ॥
గృహస్థుడు పంచయజ్ఞములను చేయవలెను. వేదాధ్యయనము బ్రహ్మయజ్ఞము. దేవతలు, పితృదేవతలు, ప్రాణులు, మనుష్యులు కూడ నా రూపములే. కావున, ప్రతిదినము దేవతలను హోమముతో (దేవయజ్ఞము), పితృదేవతలను పిండదానముతో (పితృయజ్ఞము), ప్రాణులను ఆహారమునిచ్చి (భూతయజ్ఞము), మనుష్యులను అన్నదాన ముతో (మనుష్యయజ్ఞము), తన విభవమునకు తగ్గట్లుగా ఆరాధించవలెను.
సంతానము, భార్య, ఆప్తులు, బంధువులతో జీవుని కలయిక (సత్రములో) బాటసారుల కలయిక వంటిది. ఏనాటి నిద్రలో ఆనాటి స్వప్నములోని బాంధవ్యములు వలే, దేహముతో బాటే వీరందరితో వియోగము తప్పదు.
ఇత్థం పరిమృశన్ముక్తో గృహేష్వతిథివద్వసన్ ।
న గృహైరనుబధ్యేత నిర్మమో నిరహంకృతః ॥
సాధకుడు ఈ విధముగా (భోగములు నశ్వరములని) విచారము చేస్తూ ఇంటిలో అతిథివలే నుండవలెను. అహంకారమమకారములు లేని గృహస్థుడు ఇంటియందు ఆసక్తుడు కారాదు. అట్టివాడు జీవన్ముక్తుడు.
కర్మభిర్గృహమేధీయైరిష్ట్వా మామేవ భక్తిమాన్ ।
తిష్ఠేద్వనం వోపవిశేత్ప్రజావాన్ వా పరివ్రజేత్ ॥
గృహస్థుడు సంతానమును పొంది భక్తిపూర్వకముగా గృహస్థాశ్రమకర్మలతో నన్ను ఆరాధిస్తూ గృహస్థుడుగనే ఉండవచ్చును. లేదా, వానప్రస్థుడు కాని, సన్న్యా సి కాని కావచ్చును.
యస్త్వాసక్తమతిర్గే హే పుత్రవిత్తైషణాఽఽతురః ।
స్త్రైణః కృపణధీర్మూడో మమాహమితీ బధ్యతే ॥
ఈ విధముగా ఈ గృహస్థుని హృదయము సంసారవాసనలచే విక్షిప్తమై వ్యామోహితమగును. ఆతడు భోగములయందు తృప్తి లేక వారినే (భార్యాపుత్రాదులనే) తలపోస్తూ మరణించి, వివేకజ్ఞానము సుతరాము లేని పశుపక్ష్యాదిజన్మను పొందును.
శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో
వివిధధర్మములను నిరూపించే పదునేడవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 17 of the Bhāgavata Mahā Purana is as follows:
Uddhava requested detailed instructions regarding the traditional Vaidika social structure (*Varṇāśrama-dharma*), asking how human beings in different social classes and spiritual stages can execute their duties to achieve spiritual perfection. Śrī Kṛshṇa explained that the four occupational orders (*Brāhmaṇa, Kshatriya, Vaiśya, Śūdra*) and the four spiritual stages (*Brahmacarya, Gṛhastha, Vānaprastha, Sannyāsa*) emanated from the limbs of His universal form. He detailed the moral virtues, prescribed duties, and spiritual disciplines for a celibate student (*Brahmacārī*) residing in the gurukula, emphasizing humility, cleanliness, guru-seva, and absolute vows of chastity.