భాగవత మహా పురాణము
19 - భక్తి, జ్ఞానము, యమనియమముల నిరూపణ
జ్ఞానికైతే నేనే ప్రియుడను. జ్ఞాని నన్నే తానే కోరే ఫలముగా, దానిని పొందే సాధనముగా కూడ స్వీకరించును. నేను తప్ప మరియొక ఫలము - స్వర్గము గాని, మోక్షము గాని - జ్ఞానికి ప్రియము కాదు.
జ్ఞానవిజ్ఞానసంసిద్ధాః పదం శ్రేష్ఠం విదుర్మమ ।
జ్ఞానీ ప్రియతమోఽతో మే జ్ఞానేనాసౌ బిభర్త మామ్ ॥
శాస్త్రజ్ఞానము, ఆత్మానుభవములచే జీవన్ముక్తిని పొందిన మహాత్ములు నా సర్వాతిశాయియగు స్వరూపమును యెరుగుదురు. కావుననే, నాకు జ్ఞాని అతిశయించి ప్రియుడు. ఈతడు జ్ఞానము (ఆత్మనిష్ణు) చే నన్ను హృదయములో ధరించును.
తపస్తీర్థం జపో దానం పవిత్రాణీతరాణి చ ।
నాలంకుర్వంతి తాం సిద్ధిం యా జ్ఞానకలయా కృతా ॥
జ్ఞానముయొక్క లేశమైననూ గొప్ప శ్రేయస్సును కలిగించును. జ్ఞానముచే కలిగే శ్రేయస్సును తపస్సు, తీర్థస్నానము, జపము, దానము, వైదికకర్మలు మొదలైనవి ఏవీ వర్ధిల్లజేయలేవు (అది నిశేయసము).
తస్మా జ్ జ్ఞానేన సహితం జ్ఞాత్వా స్వాత్మానముద్దవ ।
జ్ఞానవిజ్ఞానసంపన్నో భజ మాం భక్తిభావతః ॥
ఓ ఉద్ధవా! దేహము-ఇంద్రియములు-మనస్సు అనే మూడు ప్రకారములు గల ఈ ప్రకృతివికారము నిన్ను ఆశ్రయించి భాసిల్లుచున్నది. ఇది అజ్ఞానకల్పితము. ఎందుకంటే, ఇది ఆది-అంతములలో లేకుండా మధ్యలో మాత్రమే ప్రతీతమగుచున్నది. దీనికి ఉండే పుట్టుక- పెరుగుట మొదలగు ఈ వికారములు అధిష్టానమగు నీయందు ఉండునా? (ఉండవు). ఆది-అంతములలో లేనిది మధ్యలో కూడ ఉండదు. ఆది-అంతములలో ఉన్నది మాత్రమే మధ్యలో కూడ ఉండును.
ఉద్ధవ ఉవాచ ।
జ్ఞానం విశుద్ధం విపులం యథైతద్వైరాగ్యవిజ్ఞానయుతం పురాణమ్ ।
ఆఖ్యాహి విశ్వేశ్వర విశ్వమూర్తే త్వద్భక్తియోగం చ మహద్విమృగ్యమ్ ॥
ఉద్ధవుడిట్లు పలికెను --- ఓ జగన్నాథా! జగద్రూపముగా నీవే ప్రకటమై ఉన్నావు. ఆత్మజ్ఞానము విస్తృతమైనది. వైరాగ్యము, ఆత్మానుభవములతో కూడిన ఆ జ్ఞానము మిక్కిలి శుద్దికరము. సనాతనమైన ఆ జ్ఞానమును, మహాత్ములచే అన్వేషించబడే నీ భక్తియోగమును కూడ ఉన్నది ఉన్నట్లుగా చెప్పుము.
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- పూర్వము మేమందరము వెనుకనుండి వినుచుండగా యుధిష్ఠిర మహారాజు ధర్మపరాయణులలో శ్రేష్ఠుడగు భీష్ముని ఇదే ప్రశ్నను ఇదే విధముగా అడిగెను.
నివృత్తే భారతే యుద్ధే సుహృన్నిధనవిహ్వలః ।
శ్రుత్వా ధర్మాన్ బహూన్ పశ్చాన్మోక్షధర్మానపృచ్ఛత ॥
మహాభారతయుద్దము ముగిసెను. ధర్మరాజు అనేకములగు (రాజ) ధర్మములను విని, భీష్ముని మోక్షధర్మములను గురించి ప్రశ్నించెను.
తానహం తేఽభిధాస్యామి దేవవ్రతముఖాచ్ఛ్రుతాన్ । జ్ఞానవైరాగ్యవిజ్ఞానశ్రద్ధాభక్త్యుపబృంహితాన్ ॥
భీష్ముని నోటినుండి మేము విన్న ఆ ధర్మములు శాస్త్రజ్ఞానము, వైరాగ్యము, ఆత్మానుభవము, శ్రద్ధ, భక్తులతో నిండి యున్నవి. వాటిని నేను నీకు చెప్పెదను.
నవైకాదశ పంచ త్రీన్ భావాన్ భూతేషు యేన వై ।
ఈ క్షేతాథైకమ ప్యేషు త జ్ జ్ఞానం మమ నిశ్చితమ్ ॥
సృష్టికి పూర్వము ఉన్న కారణతత్త్వమే ప్రళయము తర్వాత కూడ మిగిలియుండును. మధ్యలో కూడ అదియే ఉండును. అదియే ఒక కార్యరూపమునుండి మరియొక కార్యరూపములోనికి అనువర్తించు చుండును. కార్యములన్నీ నశించిన పిదప అదియే మిగిలియుండును. అట్టి కారణతత్త్వమే సత్ (యథార్థము) అని తెలియవలెను.
శ్రుతిః ప్రత్యక్ష మైతిహ్యమనుమానం చతుష్టయమ్ ।
ప్రమాణేష్వనవస్థానాద్వికల్పాత్స విరజ్యతే ॥
శ్రుతి, ప్రత్యక్షము, ఐతిహ్యము, అనుమానము అని ప్రమాణములు నాలుగు. నేహ నానాస్తి కించన ఇత్యాది శ్రుతులు, చైతన్యముకంటె భిన్నముగా ఏదీ అనుభవమునకు వచ్చుట లేదు అనే ప్రత్యక్షము, జగత్తు మిథ్య అనే మహాపురుషప్రసిద్ధి, దృశ్యమగుట వలన జగత్తు మిథ్య అనే అనుమానము, అనే ప్రమాణములు ద్వైతప్రపంచము మిథ్యయని నిర్ధా రించును. కావున, ఆ వివేకి ద్వైతప్రపంచమునుండి విరక్తుడు కావలెను.
కర్మణాం పరిణామిత్వాదావిరించాదమంగలమ్ ।
విపశ్చిన్నశ్వరం పశ్యేదదృష్టమపి దృష్టవత్ ॥
నా పరిచర్యయందు ఆదరము, సాష్టాంగనమస్కారము, నా పూజకంటే ఎక్కువగా నా భక్తుని పూజించుట, సకలప్రాణులలో నన్నే దర్శించుట అనువాటి వలన భక్తి కలుగును.
మదర్థేష్వంగచేష్టా చ వచసా మద్గుణేరణమ్ ।
మయ్యర్పణం చ మనసస్సర్వకామవివర్జనమ్ ॥
శరీరవ్యాపారమును నా కొరకై పూజాదికర్మలయందు (నాకు సమర్పితులైన భక్తుల సేవయందు) నియోగించుట, వాక్కుచే నా గుణములను కీర్తించుట, సకలకామనలను విడిచి పెట్టి మనస్సును నాకు సమర్పించుట అనేవి భక్తిసాధనములు.
మదర్థేఽర్థపరిత్యాగో భోగస్య చ సుఖస్య చ ।
ఇష్టం దత్తం హుతం జప్తం మదర్థే యద్వ్రతం తపః ॥
నా ఆరాధన విషయమై భోగమును, సుఖమును విడిచి పెట్టి డబ్బును ఖర్చు చేయవలెను. యాగము, దానము, హోమము, జపము, వ్రతము, చిత్తము
రజోగుణముచే వ్యాప్త మై మిథ్యాజగత్తునందు నిష్ణ గల ఆ చిత్తము ఎప్పుడైతే ఇంద్రియములతో గూడి ద్వైతజగత్తునందు ఇటునటు పరుగులు తీయునో, అప్పుడు విపరీతము (అధర్మము, అజ్ఞానము, సంసారాసక్తి, బంధము) కలుగును.
ధర్మో మద్భక్తీకృ త్ప్రోక్తో జ్ఞానం చైకాత్మ్యదర్శనమ్ ।
గుణేష్వసంగో వైరాగ్య మైశ్వర్యం చాణిమాఽఽదయః ॥
నాయందు భక్తిని కలిగించే సాధనమే ధర్మమని మహాత్ములు చేప్పెదరు. అంతటా ఒకే ఆత్మను దర్శించుట జ్ఞానము. గుణకార్యములగు శబ్దాది విషయములయందు ఆసక్తి లేకుండుటయే వైరాగ్యము. అణిమ (చిన్నగా అగుట), లఘిమ (తేలికగా అగుట) మొదలైన సిద్ధులే ఈశ్వరభావము.
ఉద్ధవ ఉవాచ ।
యమః కతివీధః ప్రోక్తో నియమో వాఽరికర్శన !
కశ్శమః కో దమః కృష్ణ కా తితిక్షా ధృతిః ప్రభో ॥
పండితుడెవరు? మూర్ఖుడెవరు? మంచి దారి యేది? చెడు దారి యేది? స్వర్గమేది? నరకమేది? బంధువు యెవరు? ఇల్లు ఏది?
క ఆడ్యః కో దరిద్రో వా కృపణః కః క ఈశ్వరః ।
ఏతాన్ ప్రశ్నాన్మమ బ్రూహి విపరీతాంశ్చ సత్పతే ॥
సత్పురుషులను పాలించే ఓ శ్రీకృష్ణా! ధనవంతుడు యెవరు? దరిద్రుడు ఎవరు? దీనుడెవరు? ఈశ్వరుడెవరు? ఈ ప్రశ్నలను, వీటికి విరుద్ధములైన అశమ-అదమాదులను కూడ నాకు చెప్పుము.
శ్రీభగవానువాచ ।
అహింసా సత్యమస్తేయమసంగో హ్రీరసంశయః ।
ఆస్తిక్యం బ్రహ్మచర్యం చ మౌనం స్థైరం క్షమాఽభయమ్॥
శౌచం జపస్తపో హోమశ్శ్రద్ధాతిథ్యం మదర్చనమ్ ।
తీర్థాటనం పరార్థేహా తుష్టిరాచార్య సేవనమ్ ॥
ఏతే యమాస్సనియమా ఉభయోర్ద్వాదశ స్మృతాః ।
పుంసాముపాసితాస్తాత యథాకొమం దుహంతి హి ॥
బుద్ది నాయందు నిష్ఠను కలిగియుండుట శమము. ఇంద్రియముల సంయమము దమము. దుఃఖమును సహించుట తితిక్ష. జిహ్వను, జననేంద్రియమును జయించుట ధృతి.
దండన్యాసః పరం దానం కామత్యాగస్తపస్స్మృతమ్ ।
స్వభావవిజయశ్శౌర్యం సత్యం చ సమదర్శనమ్ ॥
ప్రాణులకు హాని చేయకుండుటయే గొప్ప (అభయ) దానము (ధనమునిచ్చుట మాత్రమే కాదు). కోరికలను విడుచుటయే తపస్సు (ఉపవాసాదులు మాత్రమే కాదు). క్రోధము మొదలైన స్వభావము (వాసన) పై (శత్రువులపై కాదు) విజయమే శౌర్యము. అంతటా పరమాత్మను దర్శించుటయే సత్యము (సత్యభాషణము మాత్రమే కాదు).
ఋతం చ సూనృతా వాణీ కవిభిః పరికీర్తితా ।
కర్మస్వసంగమశ్శౌచం త్యాగస్సన్న్యాస ఉచ్యతే ॥
ప్రియహితమగు పలుకే ఋతమని విద్వాంసులు బహుధా కీర్తించిరి. లౌకికవైదికకర్మలయందు కర్తృత్వాభిమానము లేకుండుటయే శౌచము.
మానసికముగా బాహ్యముపై ఆధారపడకుండుట, దైన్యము లేకుండుట మొదలైన గుణములే శ్రీ. - (ధనము మాత్రమే కాదు). సుఖదుఃఖములకతీతముగా స్వరూపనిష్ఠుడై ఉండుటయే యథార్థ మైన సుఖము (భోగానుభవము కాదు). భోగసుఖమును కోరుటయే దుఃఖము (భోగములు లేకుండుట కాదు). బంధమోక్షములు తెలిసినవాడే పండితుడు (శాస్త్రములను వల్లె వేసినవాడు కాదు).
మూర్ఖో దేహాద్యహంబుద్ధిః పంథా మన్నిగమస్స్మృతః ।
ఉత్పథశ్చిత్తవి క్షేపస్స్వర్గస్సత్త్వగుణోదయః ॥ ।
దేహము, మనస్సు మొదలైనవాటియందు నేను-అనే అభిమానము గలవాడే మూర్ఖుడు (చదువు రానివాడు మాత్రమే కాదు). నన్ను పొందించే జ్ఞానమే మార్గము. మనస్సుయొక్క అలజడియే తప్పు దారి. సత్త్వగుణము వర్ధిల్లుటయే స్వర్గము (పరలోకము మాత్రమే కాదు).
నరకస్తమఉన్నాహో బంధుర్గురురహం సఖే ।
గృహం శరీరం మానుష్యం గుణాఢ్య హ్యాఢ్య ఉచ్యతే ॥
ఉద్దవా! ఈ నీ ప్రశ్నలన్నింటికీ చక్కని సమాధానమీయబడినది. అధిక ముగా వర్ణించి లాభమేమి? గుణదోషదృష్టియే దోషము. గుణదోషముల కతీతముగనుండుటయే గుణము. ఇవియే యథార్థ మైన గుణదోషములు.
శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో భక్తి, జ్ఞానము, యమనియమములను నిరూపించే పందొమ్మిదవ అధ్యాయము ముగిసినది .
Summary of chapter 19 of the Bhāgavata Mahā Purana is as follows:
Śrī Kṛshṇa elaborated on the true definitions of spiritual knowledge (*Jñāna*), realization (*Vijñāna*), detachment (*Vairāgya*), and moral virtue. He explained that genuine knowledge consists of perceiving the non-different presence of the Supreme Being throughout all material transformations, while realization is the direct inner experience of the soul's divine identity. Bhagavān defined true austerity as the detachment from sense enjoyment, true charity as the protection of living beings, true strength as mind control, and true wealth as devotional service unto Him. He instructed Uddhava that ultimate spiritual perfection is achieved when a practitioner perceives Śrī Kṛshṇa residing within every living entity.