భాగవత మహా పురాణము
20 - గుణదోషముల వ్యవస్థ - వేద తాత్పర్యము
గుణదోషభిదాదృష్టిమంతరేణ వచస్తవ ।
నిశ్శ్రేయసం కథం నౄణాం ని షేధవిధిలక్షణమ్ ॥
విధిని షేధరూపమగు వేదము నీ వాక్కే. గుణదోషములయొక్క భేదదర్శనము లేకుండా ఆ వేదము మానవులకు పురుషార్థసాధనము ఎట్లు కాగల్గును? (గుణదోషదర్శనమే దోషమనే మాట యెట్లు చెల్లును?)
పితృదేవమనుష్యాణాం వేదశ్చక్షుస్తవేశ్వర ।
శ్రేయస్త్వనుపలబ్రేఽర్థే సాధ్యసాధనయోరపి ॥
ఈశ్వరా! పితృదేవతలకు, దేవతలకు, మానవులకు ప్రత్యక్షాది ప్రమాణ ములచే తెలియబడని స్వర్గమోక్షాదుల విషయములో మాత్రమే కాకుండా, సాధనసాధ్యములయందు (యజ్ఞము సాధనము, స్వర్గము సాధ్యము) కూడ నీ వాక్కు అగు వేదమే శ్రేష్ఠమైన కన్ను (తెలుసుకొనే ఉపాయము).
గుణదోషభిదాదృష్టిర్నిగమాత్తే న హి స్వతః ।
నిగమేనాపవాదశ్చ భిదాయా ఇతి హ భ్రమః ॥
ఏ వ్యక్తి కైతే ప్రయత్నము లేకుండానే నా గాథలు, నా పూజలు మొదలగువాటియందు శ్రద్ధ కలిగినదో, వైరాగ్యము లేకున్నా అధికమగు విషయాసక్తి లేదో, అట్టివానికి భక్తియోగము సిద్ధిని కలిగించును.
తావత్కర్మాణి కుర్వీత న నిర్విద్యేత యావతా ॥
మత్కథాశ్రవణాదౌ వా శ్రద్దా యావన్న జాయతే ॥
ఎంతవరకైతే వైరాగ్యము కలుగదో, నా గాథలను వినుట, మననము చేయుట మొదలగువాటిపై శ్రద్ధ కలుగదో, అంతవరకు కర్మలను చేయవలె.
స్వధర్మస్థో యజన్ యజ్ఞైరనాశీఃకామ ఉద్ధవ ।
న యాతి స్వర్గనరకౌ యద్యన్యన్న సమాచరేత్ ॥
ఓ ఉద్ధవా! ఫలకామన లేకుండా స్వధర్మనిష్ఠుడై నన్ను యజ్ఞములతో ఆరాధించే వ్యక్తి, కామ్య-నిషిద్ధకర్మలను చేయకున్నచో, స్వర్గనరకములను పొందడు.
వివేకవంతుడగు మానవుడు నరకజన్మను వలె స్వర్గ ప్రాప్తిని కూడ కోరరాదు (ఆ కర్మలను చేయరాదు). ఈ భూలోకములో మనుష్యజన్మ నైననూ కోరరాదు. ఎందుకంటే, మనుష్యజన్మలో కూడ దేహమునందలి అభిమానముచే పురుషార్థమునుండి జారిపోవుట సంభవమే.
ఏతద్విద్వాన్ పురా మృత్యోరభవాయ ఘటేత సః ।
అప్రమత్త ఇదం జ్ఞాత్వా మర్త్యమప్యర్థసిద్ధిదమ్ ॥
ఆ వివేకి ఈ విషయము (దేహాభిమానము పతన హేతువు) ను తెలుసుకొని, ఈ దేహము పురుషార్థసిద్ధికి సాధనమే అయినా మరణించే స్వభావము గలదని గుర్తించవలెను. ఆతడు మరణించుటకు ముందే పునర్జన్మ లేని మోక్షము కొరకు ప్రయత్నము చేయవలెను.
ఛిద్యమానం యమైరేతైః కృతనీడం వనస్పతిమ్ ।
ఖగస్స్వకేతముత్సృజ్య క్షేమం యాతి హ్యలంపటః ॥
ఏలయనగా, లంపటము (ఆసక్తి) లేని పక్షి తాను గూడు కట్టుకొని నివసిస్తున్న చెట్టును యమునివంటి (నిర్దయులైన) ఈ జనులు (అహో రాత్రములనే యమదూతలు) నరుకుచుండగా, దానిని విడిచి పెట్టి క్షేమమును పొందును.
యదారంభేషు నిర్వణ్ణో విరక్తస్సంయతేంద్రియః ।
అభ్యా సేనాత్మనో యోగీ ధారయేదచలం మనః ॥
కర్మలయందు నిర్వేదము, కర్మఫలములయందు విరక్తి గల సాధకుడు జితేంద్రియుడై అభ్యాసముచే తన మనస్సును నిశ్చలముగా నిలుపవలెను.
ధార్యమాణం మనో యర్హి భామ్యదాశ్వతవస్థితమ్ ।
అతంద్రితోఽనురోధేన మార్గేణాత్మవశం నయేత్ ॥
మనస్సును ధారణ చేస్తూ ఉన్నా అది స్థిరము లేనిదై వెంటనే ఇటునటు తిరుగాడును. అప్పుడు సాధకుడు సోమరిదనము లేకుండా, నచ్చజెప్పుట అనే ఉపాయముచే ఆ మనస్సును తన వశము చేసుకొనవలెను.
మనోగతిం న విసృజేజ్జితప్రాణో జితేంద్రియః ।
సత్త్వసంపన్నయా బుద్ద్యా మన ఆత్మవశం నయేత్ ॥
సంసారమునందు రోత పుట్టి విరక్తు డైన వ్యక్తి గురువు యొక్క ఉపదేశమును గ్రహించును. ఆతడు ఉపదేశించబడిన తత్త్వమును నిరంతరముగా ధ్యానించును. అప్పుడాతని మనస్సు దుష్ట స్వభావము (విషయాసక్తి) ను విడిచి పెట్టును.
యమాదిభిర్యోగపథైరాన్వీక్షిక్యా చ విద్యయా ।
మమార్చోపాసనాభిర్వా నాన్యైర్యోగ్యం స్మరేన్మనః ॥
యమనియమాదియోగాంగములు, తత్త్వవిచారరూపమగు విద్య, నన్ను పూజించి ధ్యానించుట అనే ఉపాయములలో ఏదో ఒక దానిచే మనస్సు స్థిరమై యోగగమ్యమైన పరమాత్మపై నిలబడును. మనస్సును జయించుటకు ఇంతకు మించి ఉపాయములు లేవు.
యది కుర్యాత్ప్రమాదేన యోగీ కర్మ విగర్హితమ్ ।
యోగేనైవ ద హేదంహో నాన్యత్తత్ర కదాచన ॥
నా గాథలయందు శ్రద్ధ కలిగిన భక్తునకు నిర్వేదము కర్మలయందు కలిగి వాటి ఫలములయందు కలుగకపోవచ్చును. ఆతడు భోగ్యవిషయములు దుఃఖమయములని తెలిసినా వాటిని విడిచి పెట్టలేక పోవచ్చును. ఆతడా స్థితియందు కూడ దుఃఖమే ఉత్తరఫలముగా గల ఆ భోగములననుభవిస్తూనే, అవి నింద్యములని దృఢనిశ్చయము చేసుకోవాలి. ఆతడు ప్రసన్నచిత్తుడై మరింత శ్రద్దతో నన్ను భజించవలెను.
ప్రోక్తేన భక్తియోగేన భజతో మాఽసకృన్మునేః ।
కామా హృదయ్యా నశ్యంతి సర్వే మయి హృది స్థితే ॥
పైన చెప్పిన విధముగా భక్తియోగముతో నన్ను నిత్యము భజించే భక్తుని హృదయములో నేను స్థిరముగా నుండెదను. అప్పుడాతని కామనలన్నియు నశించును.
భిద్యతే హృదయగ్రంథిశ్చిద్యంతే సర్వసంశయాః ।
క్షీయం తే చాస్య కర్మాణి మయి దృష్టేఽఖిలాత్మని ॥
అష్టాంగయోగము, దానధర్మ ములు, ఇతరత్రేయస్సాధనములు (ప్రతాదులు) అనువాటిచే ఏ ఫలము - స్వర్గము, మోక్షము, లేదా నా ధామము - లభించునో,
ఆ సర్వమును నా భక్తుడు నాపై భక్తి అనే సాధనముచేతనే తేలికగా పొందును. నా భక్తుడు దేనినీ కోరడు. ఒకచో ఏదో విధముగా కోరినట్లైతే అలవోకగా పొందును.
న కించిత్సాధవో ధీరా భక్తా హ్యేకాంతినో మమ ।
పాంఛంత్యపి మయా దత్తం కైవల్యమపునర్భవమ్ ॥
ఏలయనగా, నాయందు ఏకాంతమగు నిష్ఠ గల భక్తులు సాధువులు, వివేకవంతులు. వారు దేనినీ కోరరు. పునర్జన్మ లేని మోక్షమును నేను ఇచ్చినా, దానిని కూడ వారు కోరరు.
నైర పేక్ష్యం పరం ప్రాహుర్నిశ్శ్రేయసమనల్పకమ్ ।
తస్మాన్నిరాశిషో భక్తీర్నిర పేక్షస్య మే భవేత్ ॥
అపేక్ష లేకుండుట సర్వోత్కృష్టము, పురుషార్థసాధనములలో గొప్పది అని మహాత్ములు చెప్పెదరు. కావున, అపేక్ష, అ పేక్ష వలన పుట్టే కోరికలు లేనివానికి నాయందు పూర్ణభక్తి కలుగును.
న మయ్యేకాంతభక్తానాం గుణదోషోద్బవా గుణాః ।
సాధూనాం సమచిత్తానాం బుధేః పరము పేయుషామ్ ॥
Summary of chapter 20 of the Bhāgavata Mahā Purana is as follows:
Śrī Kṛshṇa presented a master synthesis of the three primary Vaidika paths (*Tri-mārga*): **Karma-yoga** (prescribed for those attached to fruitive work), **Jñāna-yoga** (prescribed for those disgusted with material enjoyment and seeking intellectual inquiry), and **Bhakti-yoga** (prescribed for fortunate souls who possess faith in hearing My divine pastimes). He explained that human birth is a rare, precious vessel capable of crossing the ocean of material existence, with scriptural wisdom as a favorable wind and the spiritual master as the expert captain. Kṛshṇa reassured Uddhava that even if a practicing devotee occasionally falls into inadvertent weakness, the inherent purifying power of Bhakti-yoga destroys all sins without requiring separate ritualistic atonements (*Prāyaścitta*).