భాగవత మహా పురాణము
26 - ఐల గీతము
శ్రీభగవానువాచ ।
మల్లక్షణమిమం కాయం లబ్ధ్వా మద్ధర్మ ఆస్థితః ।
ఆనందం పరమాత్మానమాత్మస్థం సముపైతి మామ్ ॥
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- మానవుని హృదయములో ఆత్మ రూపుడైన పరమాత్మను నేనే. నన్ను తెలియుటకు యోగ్యమైనది మానవ దేహము. దానిని పొంది వ్యక్తి నన్ను నిశ్చలముగా ఆరాధించి పొందును.
గుణమయ్యా జీవయోన్యా విముక్తి జ్ఞాననిష్ఠయా ।
గుణేషు మాయామాత్రేషు దృశ్యమానేష్వవస్తుతః ।
వర్తమానోఽపి న పుమాన్ యుజ్యతేఽవస్తుభిర్గుణైః ॥
గుణకార్యములగు శబ్దాదులు కనబడుచున్ననూ అవి కేవలము మాయ మాత్రమే. మాయాశక్తియొక్క కార్యమగు దృశ్యప్రపంచము మిథ్య. వ్యక్తి ఆత్మజ్ఞాననిష్ఠచే జీవుని ఉపాధినుండి విముక్తుడగును. అట్టి జ్ఞాని దృశ్యప్రపంచమునందే ఉన్ననూ, దానియందు ఆసక్తిని పొందడు. ఎందుకంటే, దృశ్యప్రపంచము యథార్థము కాదు.
సంగం న కుర్యాదసతాం శిశ్నోవరతృపాం క్వచిత్ ।
తస్యానుగస్తమస్యంధే పతత్యంధానుగాంధవత్ ॥
దుష్టులు కేవలము ఉదరమును సంతృప్తి పరుస్తూ భోగపరాయణులై ఉందురు. సాధకుడు ఎక్కడైనా ఎప్పుడైనా అట్టివారితో సంగమును చేయరాదు. వారి సంగమును చేయువాడు, గ్రుడ్డివాని వెనుక నడిచే గ్రుడ్డివాడు వలె, వివేకమునపహరించే అజ్ఞానాంధకారములో పడిపోవును.
ఐలస్సమ్రాడిమాం గాథామగాయత బృహచ్చ్రవాః । ఉర్వశీవిరహాన్ముహ్యన్నిర్విణ్ణశ్శోకసంయమే॥
పురూరవ చక్రవర్తి గొప్ప కీర్తి గలవాడు. ఆయన ఊర్వశియొక్క విరహముచే వ్యామోహితుడై, పిదప వైరాగ్యముచే శోకమునుండి విముక్తుడాయెను. అపుడాయన విరక్తుడై ఈ గాథను గానము చేసెను.
త్యక్త్వాఽఽత్మానం ప్రజంతీం తాం నగ్న ఉన్మత్తవన్నృపః ।
విలపన్నన్వగాజ్జాయే ఘోరే తిష్ఠేతి విక్లబః ॥
తనను విడిచి పెట్టి ఊర్వశి వెళ్లిపోవుచుండగా వ్యాకులుడైన ఆ పురూరవ చక్రవర్తి దిగంబరముగా, భయంకరివగు ఓ భార్యా! నిలుము అని ఏడుస్తూ, పిచ్చివాడు వలె ఆమె వెంట వెళ్లాను.
కామానతృప్తోఽనుజుషన్ క్షుల్లకాన్ వర్షయామినీః ।
న వేద యాంతీర్నాయాంతీరుర్వశ్యాఽఽకృష్ట చేతనః ॥
తుచ్చములైన భోగములను నిరంతరముగా సేవిస్తున్నా ఆ చక్రవర్తికి తృప్తి కలుగలేదు. ఆయన మనస్సు ఊర్వశిచే ఆకర్షించబడెను. ఆయనకు సంవత్సరముల కాలము రాత్రులు వచ్చుట గాని, పోవుట గాని తెలియదు.
ఐల ఉవాచ ।
అహో మే మోహవిస్తారః కామకశ్మలచేతసః ।
దేవ్యా గృహీతకంఠస్య నాయుఃఖండా ఇమే స్మృతాః ॥
పురూరవ చక్రవర్తి పలికెను -- ఊర్వశీదేవి సో కంఠమును కౌగిలించగా కామనలచే నా మనస్సు కలుషితమై పోయెను. నా వ్యామోహముయొక్క విస్తృతి వర్ణనాతీతము. అది యెంతటిదంటే, ఆయుష్టుయొక్క అంశలైన ఈ సంవత్సరములు నాకు తెలియకుండా వెళ్లిపోయెను.
నాహం వేదాభినిర్ముక్తస్సూర్యో వాఽభ్యుదితోఽముయా ।
ముషితో వర్షపూగానాం బతాహాని గతాన్యుత ॥
అయ్యో! నేనీ ఊర్వశి వ్యామోహములో పడిపోతిని. నేను నిద్రిస్తూండగానే సూర్యుని ఉదయాస్తమయములు కూడా తెలియకుండా దీనముపై దినము చొప్పున అనేకదశాబ్దములు గడిచిపోయినవి.
అహో మే ఆత్మసంమోహో యేనాత్మా యోషితాం కృతః ।
క్రీడామృగశ్చక్రవర్తీ నరదేవశిఖామణిః ॥
అయ్యో! నాకెంతటి ఆత్మవిస్మృతి కలిగినదియో! ఆ కారణముగా, చక్రవర్తిని, మహారాజులలో అగ్రగణ్యుడను అగు నేను యువతులు ఆడుకొనే బొమ్మ (కోతి) ను అయితిని.
సపరిచ్చదమాత్మానం హిత్వా తృణమివేశ్వరమ్ ।
యాంతీం స్త్రీయం చాన్వగమం నగ్న ఉన్మత్తవద్రుదన్ ॥
నేను రాజ్యాదులతో కూడిన చక్రవర్తిని. నన్ను గడ్డిపోచను వలె విడిచి పెట్టి ఆ యువతి వెళ్లిపోవుచుండెను. నేను దిగంబరుడనై పిచ్చివాడు వలె ఏడుస్తూ ఆమె వెంట బడితిని. .
కుతస్తస్యానుభావస్స్యాత్తేజ ఈశత్వమేవ వా ।
యోఽన్వగచ్ఛం స్త్రీయం యాంతీం ఖరవత్పాదతాడితః ॥
నేను కాలిచే తన్నబడిన గాడిద వలె, వెళ్లిపోవుచున్న యువతి వెంట పడితిని. అట్టి నాయందు ప్రభావము గాని, తేజస్సు గాని, చక్రవర్తిత్వమే గాని ఏల ఉండును?
కిం విద్యయా కిం తపసా కిం త్యాగేన శ్రుతేన వా ।
కిం వివిక్తేన మౌనేన స్త్రీభిర్యస్య మనో హృతమ్ ॥
ఎవని మనస్పైతే యువతులచే అపహరించబడినదో, పొనికి ఉపాసనచే గాని, తపస్సుచే గాని, సన్న్యాసముచే గాని, అధ్యయనముచే గాని, ఏకాంతవాసముచే గాని, మౌనముచే గాని ఏమి ప్రయోజనము?
స్వార్థస్యాకోవిదం ధిజ్ మాం మూర్ఖం పండితమానినమ్ ।
యోఽహామీశ్వరతాం ప్రాప్య స్త్రీభిర్గోఖరవజ్జితః ॥
నేను పురుషార్థము (ఆత్మతత్త్వము) తెలియని మూర్ఖుడను. కాని, పండితుడననే అభిమానము గల నా గురించి నింద యగుగాక! చక్రవర్తినైన అట్టి నన్ను స్త్రీలు ఎద్దును వలె, గాడిదను వలే వశము చేసుకున్నారు.
సేవతో వర్షపూగాన్మే ఉర్వశ్యా అధరాసవమ్ ।
న తృప్యత్యాత్మభూః కామో వహ్నిరాహుతిభిర్యథా ॥
నేను అనేకదశాబ్దముల కాలము నిరంతరముగా ఊర్వశియొక్క మత్తెక్కించే అధరామృతమును పానము చేసితిని. అయినా, నా మదిలోని కామనకు తృప్తి కలుగలేదు. నెయ్యి వేస్తూంటే అగ్ని చల్లారదు గదా!
పుంశ్చల్యాఽపహతం చిత్తం కో న్వన్యో మోచితుం ప్రభుః ।
ఆత్మారామేశ్వరమృతే భగవంతమధోక్షజమ్ ॥
ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరుడు కాని శ్రీహరి భగవానుడు ఆత్మారాములకు ప్రభుడు. ఊర్వశిచే అపహరించబడిన చిత్తమును విడి పించుటకు ఆయన తప్ప మరియొక సమర్థుడు ఎవడు గలడు?(లేడు).
బోధితస్యాపి దేవ్యా మే సూక్తవాక్యేన దుర్మతేః ॥
మనోగతో మహామోహో నాపయాత్యజితాత్మనః ॥
దుర్బుద్దినగు నేను మనస్సును జయించకపోతిని. నాకు ఊర్వశీదేవి యథార్థవచనములతో బోధించినది. అయినా, నా మనస్సులో తిష్ట వేసిన మహావ్యామోహము తొలగిపోవుట లేదు.
కిమేతయా నోఽపకృతం రజ్జ్వా వా సర్పచేతసః ।
రజ్జుస్వరూపావిదుషో యోఽహం యదజితేంద్రియః ॥
ఈ త్రాడుయొక్క స్వరూపము తెలియక పామని భ్రమించుపొనికి త్రాడు ఏమి అపకారమును చేసినది? అదే విధముగా, నేను ఇంద్రియజయము లేనివాడను. నాకు ఊర్వశి ఏమి అపకారము చేసినది?(ఏమీ చేయలేదు).
క్వాయం మలీమసః కాయో దౌర్గంధ్యాద్యాత్మకోఽశుచిః ।
క్వ గుణాస్సౌమనస్యాద్యా హ్యధ్యాసోఽవిద్యయా కృతః ॥
అధికమగు దుర్గంధముతో, రోగాది దోషములతో నిండిన ఈ దేహము మిక్కిలి మలినము, అపవిత్రము. ఈ దేహమెక్కడ? పుష్పములవంటి సౌకుమార్యము, సుగంధము మొదలైన గుణములెక్కడ? ఇది నిశ్చయముగా అజ్ఞానముచే చేయబడే అధ్యారోపమే.
పిత్రోః కిం స్వం ను భార్యాయాస్స్వామినోఽగ్నేశ్శ్వగృధ్రయోః ।
కిమాత్మనః కిం సుహృదామితి యో నావసీయతే ॥
ఈ దేహము కన్న తల్లిదండ్రులదా? కట్టుకున్న భార్యదా? ఉద్యోగమిచ్చి పాలించే ప్రభువుదా? మరణించిన తరువాత తగులబెట్టే అగ్నిదా? తగులబెట్టకుండా వదిలి వేసినచో భక్షించే కుక్కలకు, గ్రద్దలకు చెందినదా? సుఖదుఃఖములననుభవించే తనదేనో? ఉపకారము చేసిన బంధువులదా? దేహము విషయములో నిశ్చయము చేయలేము.
తస్మిన్ కలేవరేఽమేధ్యే తుచ్చనిష్ఠే విషజ్జతే ।
అహో సుభద్రం సునసం సుస్మితం చ ముఖం స్త్రీయాః ॥
అపవిత్రమైన ఆ దేహము తుచ్చమైన అంతమును పొందును. ఆహా! యువతియొక్క ముఖము చాల మంగళకరము. ముక్కు, చిరునగవు చాల అందమైనవి అంటూ వ్యక్తి దానియందు అధికమగు ఆసక్తిని పొందును.
త్వఙ్మాంసరుధిరస్నాయుమేదోమజ్జాఽస్థిసంహతౌ ।
విణ్మూత్రపూయే రమతాం కృమీణాం కియదంతరమ్ ॥
చర్మము, మాంసము, రక్తము, నాడులు, క్రొవ్వు, మూలుగు, ఎముకలు, మలము, మూత్రము, చీముల సముదాయమే దేహము. అట్టి దేహమునందు రమించే మానవులకు, క్రిములకు తేడా యెంతటిది?
అథాపి నోపసజ్జేత స్త్రీషు స్త్రైణేషు చార్థవిత్ ।
విషయేంద్రియసంయోగాన్మనః క్షుభ్యతి నాన్యథా ॥
ఇంద్రియముల ద్వారా భోగ్యవిషయములతో సంయోగము కలిగి నప్పుడు మాత్రమే మనస్సు అలజడి జెందును. అట్టి సంయోగము లేనిచో మనస్సు శాంతముగనే యుండును. కావున, పురుషార్థము దెలిసిన వివేకి యువతులతో, యువతులకు వశమై ఉండేవారితో సంగమును చేయరాదు.
అదృష్టాదశ్రుతాద్భావాన్న భావ ఉపజాయతే ।
అసంప్రయుంజతః ప్రాణాన్ శామ్యతి స్తిమితం మనః ॥
ఎన్నడూ కనని వినని పదార్థము వలన మనస్సునకు అలజడి కలుగదు. కావున, ఇంద్రియములను విషయములతో ఉపసంహరించిన మనస్సు నిశ్చలమై స్వరూపమునందు విలీనమగును.
తస్మాత్సంగో న కర్తవ్యః స్త్రీషు స్త్రైణేషు చేంద్రియైః ।
విదుషాం చాప్యవిశ్రబ్ధష్షడ్వర్గః కీము మాదృశామ్ ॥
కావున, ఇంద్రియముల ద్వారా యువతులతో మరియు స్త్రీలంపటులతో సంగము చేయరాదు. ఐదు జ్ఞానేంద్రియములు, మనస్సు వెరసి ఈ ఆరు విద్వాంసులకు కూడ నమ్మదగ్గవి కావు. మావంటి వారల విషయములో చెప్పునదేమున్నది?
శ్రీభగవానువాచ ।
ఏవం ప్రగాయన్నర దేవదేవస్స ఊర్వశీలోకమథో విహాయ,
ఆత్మానమాత్మనవగమ్య మాం వై ఉపారమజ్జ్ఞానవిధూతమోహః ।
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలి కెను --- ఆ చక్రవర్తి ఈ విధముగా తన భావావేశమును ప్రకటించి, తరువాత ఊర్వశియొక్క లోకమును విడిచి పెట్టెను. ఆయన తనయందు నన్ను ఆత్మరూపునిగా సాక్షాత్కరించుకొనెను. ఆ జ్ఞానముచే వ్యామోహమంతయు పటాపంచలు కాగా, ఆయన సంసారబంధమునుండి విముక్తుడాయెను.
తతో దుస్సంగముత్సృజ్య సత్సు సజ్జేత బుద్ధిమాన్ ।
సంత ఏతస్య ఛిందంతి మనోవ్యాసంగముక్తిభిః ॥
కాబట్టి వివేకవంతుడగు సాధకుడు దుష్టులతోడి సంగమును విడిచి పెట్టి సజ్జనసంగమును చేయవలెను. సత్పురుషులు వీని మనస్సునందలి విషయాసక్తిని హితవాక్యములతో తెగగొట్టెదరు.
సంతోఽన పేక్షా మచ్చిత్తాః ప్రశాంతాస్సమదర్శినః ।
నిర్మమా నిరహంకారా నిర్ద్వంద్వా నిష్పరిగ్రహాః ॥
సత్పురుషులకు దేనియందైననూ అపేక్ష ఉండదు. వారు చిత్తమును సాయందు నిలిపీ శాంతముగా నుండెదరు. పోరు సర్వమునందు సముడైన ఈశ్వరుని దర్శించుటచే అహంకారమమకారములు లేనిపోరు. వారు సుఖదుఃఖాదిద్వంద్వములకు అతీతులు గనుక పరీగ్రహము (భోగసామగ్రిని ప్రోగు చేయుట) చేయరు.
తేషు నిత్యం మహాభాగ మహాభాగేషు మత్కథాః ।
సంభవంతి హి తా నౄణాం జుషతాం ప్రపునంత్యఘమ్ ॥
మహాభాగ్యవంతుడవగు ఓ ఉద్దవా! గొప్ప భాగ్యము (భక్తి) గల ఆ సత్పురుషులు ఎల్లవేళలా సో గాథలను కీర్తించెదరు. ఆ నో గాథలను సేవించే మానవుల సకలపాపములు నిశ్చితముగా నశించును.
తా యే శృణ్వంతి గాయంతీ హ్యనుమోదంతి చాదృతాః ।
మత్పరాశ్శ్రద్దధానాశ్చ భక్తిం విందంతి తే మయి ॥
ఎవరైతే సాదరముగా ఆ గాథలను వినెదరో, గానము చేయుదురో, వాటి గానమును ప్రోత్సహించెదరో వారు కూడ నిశ్చయముగా నా పై భక్తిని పొంది, నన్ను శ్రద్ధతో ఆరాధించుటయందు నిష్ఠ గలవారు అగుదురు.
భక్తిం లబ్దవతస్సాధోః కిమన్యదవశిష్యతే ।
మయ్యనంతగుణే బ్రహ్మణ్యానందానుభవాత్మని ॥
అనంతగుణసంపన్నుడనగు నా స్వరూపము ఆనందానుభవమే. పరబ్రహ్మనగు నాయందు భక్తిని పొందిన సజ్జనునకు మరియొకటి ఏమి మిగిలియుండును?(కర్తవ్యమేదీ మిగిలి ఉండదు).
యథోపశ్రయమాణస్య భగవంతం విభావసుమ్ ।
శీతం భయం తమోఽప్యేతి సాధూన్ సంసేవతస్తథా ॥
అగ్నిదేవుని సేవించువానికి చలి, భయము, చీకటి నశించును. అదే విధముగా, సత్పురుషులను బాగుగా సేవించువానికి జాడ్యము, సంసారభయము, అజ్ఞానాంధకారము నశించును.
నిమజ్జ్యోన్మజ్జతాం ఘోరే భవాబ్ధౌ పరమాయనమ్ ।
సంతో బ్రహ్మవిదశ్శాంతా నౌర్దృడేవాప్సు మజ్జతామ్ ॥
భయంకరమగు సంసారసముద్రములో మునిగి పైకి తేలుతూ (ఉత్కృష్ట నికృష్ణజన్మలు పొందుతూ) ఉండేవారికి -- సముద్రములో మునిగిపోవుచున్నవారికి గట్టి నావ వలె - బ్రహ్మవేత్త లై శాంతులైన సత్పురుషులు సర్వోత్తమమైన ఆశ్రయము.
అన్నం హి ప్రాణినాం ప్రాణ ఆర్తానాం శరణం త్వహమ్ ।
ధర్మో విత్తం నృణాం ప్రేత్య సంతోఽర్వాగ్ బిభ్యతోఽరణమ్ ॥
ప్రాణులకు అన్నమే జీవనము. ఆపదలోనున్నవారికి నేనే రక్షకుడను. మానవులకు మరణించిన తరువాత పుణ్యమే సంపద. సంసార సముద్రములో పడిపోయెదమని భయపడువారలకు సత్పురుషులే రక్షణ.
సంతో దిశంతి చక్షూంషి బహిరర్కస్సముత్థితః।
దేవతా బాంధవాస్సంతస్సంత ఆత్మాఽహమేవ చ॥
సూర్యుడు ఉదయించి బయట చూపును ఇస్తే, సత్పురుషులు ఆత్మ విషయకమైన పూర్ణ మైన చూపు (జ్ఞానము) ను ఇచ్చేదరు. సత్పురుషులే దేవతలు మరియు బంధువులు. ఆత్మ మరియు నేను కూడ సత్పురుషులే.
వైత సేనస్తతోఽప్యేవముర్వశ్యా లోకనిస్పృహః ।
ముక్తసంగో మహీమేతామాత్మారామశ్చచార హ ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ఏకాదశస్కంధే
షడ్వింశోఽధ్యాయః ॥
ఉమాదేవి శాపముచే సుద్యుమ్నుడు స్త్రీభావమును పొంది ఇల ఆయెను. ఆయన కొడుకే పురూరవసుడు (పురూరవుడు). ఆయన ఈ విధముగా అట్టి సత్సంగము వలన ఊర్వశియొక్క లోకమునందలి కామనను, సంగమును విడిచి పెట్టెను. ఆయన ఆత్మనిష్ఠ గలవాడై ఈ భూలోకములో సంచరించెను.
శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో ఐల గీతమును నిరూపించే
ఇరువది ఆరవ అధ్యాయము ముగిసినది (26).
Summary of chapter 26 of the Bhāgavata Mahā Purana is as follows:
Śrī Kṛshṇa narrated the historical history of King Aila (Purūravas), who was once overwhelmingly infatuated with the celestial apsarā Urvaśī. After many years of intense sensory enjoyment, Urvaśī departed, plunging the king into deep sorrow and madness. Over time, King Aila experienced a profound spiritual awakening, realizing that his suffering was caused by his own uncontrolled lust and bad association. He uttered a powerful discourse on the necessity of avoiding bad association (*Dushsaṅga*) and seeking the company of self-realized devotees (*Sādhu-saṅga*). By severing his attachment to worldly lust and surrendering to Bhagavān, King Aila achieved absolute spiritual peace.