18 - వానప్రస్థ సన్న్యాస ధర్మములను నిరూపణ

కేశరోమనఖశ్మశ్రుమలాని బిభృయాద్దతః

న ధావేదప్సు మజ్జేత త్రికాలం స్థండిలేశయః  

తలపై జుట్టు, రోమములు, మీసములు, గెడ్డము అనే శరీరమాలిన్యము లను పట్టించుకోరాదు. దంతముల సౌందర్యము కూడ అపేక్షితము కాదు. మూడు పూటలా దేహమును నీటిలో ముంచవలె. నేల పై పరుండవలెను.

గ్రీష్మే తప్యేత పంచాగ్నీన్ వర్షాస్వాసారషాడ్ జలే

ఆకంఠమగ్నశ్శిశిర ఏవంవృత్తస్తపశ్చరేత్

వేసవిలో చుట్టూ నాలుగు అగ్నులు, పైన సూర్యుడనే అగ్ని, వెరసి అయిదు అగ్నుల మధ్యలో దేహమును తపింపజేస్తూ తపస్సు చేయ వలెను. వర్షకాలములో వర్షధారలను సహించవలెను. చలికాలములో మెడ వరకు నీటిలో మునిగి, ఈ విధముగా ఉంటూ తపస్సు చేయవలెను.

అగ్నిపాకం సమశ్నీయాత్కాలపక్వమథాపి వా

ఉలూఖలాశ్మకుట్టో వా దంతోలూఖల ఏవ వా

వేదవేత్తలు వానప్రస్థునకు గృహస్థునితో సమానముగా అగ్నిహోత్రము, దర్శపూర్ణమాసలు, చాతుర్మాస్యలు అను కర్మలను విధించిరి.

ఏవం చీర్ణేన తపసా మునిర్ధమనిసంతతః

మాం తపోమయమారాధ్య ఋషిలోకాదు పైతి మామ్  

ఈ విధముగా తపస్సుచే శుష్కించిన వానప్రస్థుడు బయటకు కనబడే నాడులతో వ్యాపించబడియుండును. ఆయన మహర్లోకమును, అక్కడనుండి నన్ను పొందును. నేను జ్ఞానమే స్వరూపముగా గలవాడను.

య స్త్వేతత్కృచ్చతశ్చీర్ణం తపో నిశ్శ్రేయసం మహత్

కామాయాల్పీయసే యుంజ్యాద్బాలిశః కోఽపరస్తతః

కష్టసాధ్యమైన ఈ గొప్ప తపస్సు మోక్షసాధనము. దీనిని మిక్కిలి అల్పమైన సంసారభోగము కొరకు ఎవడు వినియోగించునో, వానికంటే మూర్ఖుడు మరియొకడు ఎవడు గలడు? (ఎవ్వడూ లేడు).

.

కామనలు లేనివాడు సన్న్యాసవిధినతిక్రమించకుండా నన్ను ఆరాధించి సర్వస్వమును ఋత్విక్కునకిచ్చి, అగ్నులను తన ప్రాణమునందారోపించుకొని (ప్రాజాపత్యేష్టిని చేసి) సన్న్యసించవలెను.

విప్రస్య వై సన్న్యసతో దేవా దారాదిరూపిణః

విఘ్నాన్ కుర్వంత్యయం హస్మానాక్రమ్య సమియాత్పరమ్  

వేదవేత్త సన్న్యసించునప్పుడు, తమను దాటివేసి పరమపదమును పొందుననే భావముతో, దేవతలు వానికి భార్య, పుత్రుడు మొదలగు రూపములతో నిశ్చయముగా విఘ్నములను కలిగించెదరు.

బిభృయాచ్చేన్మునిర్వాసః కౌపీనాచ్చాదనం పరమ్

త్యక్తం న దండపాత్రాభ్యామన్యత్కించిదనాపది

మననశీలుడగు సన్న్యా సి వస్త్రమును ధరిస్తే, అది కేవలము కౌపీనమును కప్పేది నడుమునకు వస్త్రము మాత్రమే కావలెను. అంతకు మించి వస్త్రము వద్దు. ఆపద వచ్చినప్పుడు తప్పించి, విడిచి పెట్టిన సంపదలోనుండి దండకమండలములను తప్ప ఇతరమును తీసుకోరాదు.

భిక్షాటనము చేయవలెను, లబేన లభించిన, తావతా - అంత మాత్రముతో, తు ష్యేత్ - సంతోషించవలెను.

సన్న్యాసి గరించదగినవారిని విడిచి నాలుగు వర్ణముల వారికి చెందిన ఏడు ఇళ్లలో భిక్షను స్వీకరించవలెను. ఆ గృహములు పూర్వనిర్ధారిత ములు కారాదు. లభించినదానితో ఆతడు సంతోషించవలేను.

బహిర్జలాశయం గత్వా తత్రోపస్పృశ్య వాగ్యతః

విభజ్య పావితం శేషం భుంజీతా శేషమాహృతమ్  

సన్న్యాసి గ్రామము బయట జలాశయమునకు వెళ్లి ఆచమనము చేసి మౌనముగా తీసుకువచ్చిన ఆహారమును ప్రోక్షణచే పవిత్రము చేసి తినవలెను. ఎవరైనా యాచిస్తే వారికి ఇచ్చి మిగిలినదంతా తినవలెను.

ఏకశ్చరేన్మహీమేతాం నిస్సంగస్సంయతేంద్రియః

ఆత్మక్రీడ ఆత్మరత ఆత్మవాన్ సమదర్శనః

సన్న్యాసి ఒంటరిగా ఎవరితోనైననూ సంగము పెట్టుకోకుండా భూలోకములో సంచరించవలెను. జితేంద్రియుడగు ఆతనికి విహారము తనయందే, సంతోషము తనయందే (ఇతర పేక్ష లేదు). ధీరుడగు ఆతడు అంతటా ఈశ్వరుని దర్శించును.

కావున, మననశీలుడగు యతి నాయందలి భక్తితో ఐదు జ్ఞానేంద్రియములను, మనస్సును నియంత్రించవలెను. ఆతడు అల్పమగు కామనలనుండి విరక్తుడై ఆత్మస్వరూపమునందలి మహానందమును పొందీ సంచరించవలేను.

పురగ్రామప్రజాన్ సార్థాన్ భిక్షాఽర్థం ప్రవిశంశ్చరేత్

పుణ్యదేశసరిచ్ఛైలవనాశ్రమవతీం మహీమ్

 సన్న్యా సీ భిక్ష కొరకై నగరములను, గ్రామములను, గొల్లపల్లెలను, యాత్రికుల గుంపులను ప్రవేశిస్తూ, పుణ్య క్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యపర్వతములు, పుణ్యవనములు, పవిత్రములగు ఆశ్రమములలో కూడియున్న (భరత) భూలోకములో సంచరించవలెను.

వానప్రస్థాశ్రమపదేష్వభీ క్ ష్ణం భైక్షమాచరేత్ సంసిధ్యత్యాశ్వసంమోహశ్శుద్ధసత్త్వశ్శీలాంధసా

పొలములో పడిన గింజలను ఏరి తెచ్చి వండిన అన్నము అంతఃకరణశుద్ధిని కలిగించును. అట్టి అన్నమును తినుట వలన వ్యామోహము తొలగి శీఘ్రముగా మోక్షము కలుగును. కావున, సన్న్యాసి వానప్రస్థుల ఆశ్రమస్థానములో మరల మరల భిక్షను చేయవలెను.

చిహ్నములతో కూడిన, ఆశ్రమాన్ - ఆశ్రమములను, త్యక్త్వా - విడిచి పెట్టి, చరేత్ - సంచరించవలెను.

ఆత్మస్వరూపనిష్ఠుడైన విరక్తుడు, నిష్కాముడైన నా భక్తుడు విధినిషేధములకు అతీతులు. కావున, అట్టివారు ఆశ్రమములను, వాటి చిహ్నములను విడిచి పెట్టి సంచరించవచ్చును.

బుధో బాలకవత్క్రీడేత్కుశలో జడవచ్చరేత్

వదేదున్మత్తవద్విద్వాన్ గోచర్యాం నైగమశ్చరేత్  

సన్న్యా సి వివేకియే అయినా పిల్లవాడు వలె క్రీడించవలెను (క్రీడించును), నేర్పరియే అయినా మందబుద్దివలె సంచరించును, పండితుడే అయినా పిచ్చివాడు వలే పలుకును, వేదవేత్తయే అయినా ఎద్దువలె నియతము కాని ఆచరణము కలిగియుండును.

వేదవాదరతో న స్యాన్న పాఖండో న హైతుకః

శుష్కవాదవివాదే న కంచిత్పక్షం సమాశ్రయేత్

సన్న్యాసి వేదములో కామ్యకర్మలను స్తుతించే అర్థవాదములయందు ప్రీతి గలవాడు, వేదవిరుద్దమగు ఆచరణము గలవాడు, కేవలతర్కనిష్ఠుడు కాకూడదు. నిషయోజనమగు వాదవివాదములలో సన్న్యాసి ఏ పక్షమునైననూ బలపరచకూడదు.

సన్న్యాసి ధైర్యము గలవాడై ఒక కాలములో భిక్ష దొరకనప్పుడు విషాదమును చెందరాదు, మరియొక కాలములో దొరికినప్పుడు హర్షించరాదు. భిక్ష దొరుకుట, దొరకకుండుట రెండు దైవాధీనములే.

ఆహారార్థం సమీహేత యుక్తం తత్ప్రాణధారణమ్

తత్త్వం విమృశ్యతే తేన తద్విజ్ఞాయ విముచ్యతే  

సన్న్యాసి ఆహారము కొరకు ప్రయత్నమును చేయవలెను. ఎందుకంటే, సన్న్యా సి ప్రాణములను నిలబెట్టుకొని, ఆ శక్తితో ఆత్మవిచారము చేసినచో, ఆత్మజ్ఞానమును పొంది విముక్తుడగును.

యదృచ్ఛయోపపన్నాన్నమద్యాచ్ఛ్రేష్ఠముతాపరమ్

తథా వాసస్తథా శయ్యాం ప్రాప్తం ప్రాప్తం భజేన్మునిః

భోగముల ఉత్తర (తరువాతి) ఫలము దుఃఖమే. వాటియందు వైరాగ్యము కలిగిన బుద్ధిశాలి ఇంకనూ నన్ను పొందే ఉపాయమును నేర్వనిచో గురువు వద్దకు వెళ్లవలెను. ఆ గురువు మననశీలుడు (శ్రోత్రియుడు) కావలెను.

తావత్పరిచరేద్బక్త శ్శ్రద్దావాననసూయకః

యావద్బ్రహ్మ విజానీయాన్మామేవ గురుమాదృతః  

పరబ్రహ్మసాక్షాత్కారము వరకు భక్తుడు గురురూపుడనగు నన్ను శ్రద్ధతో, ఆదరముతో సేవించవలెను. గురువులో దోషములను వెదుకరాదు.

యస్త్వసంయతషడ్వర్గః ప్రచండేంద్రియసారథిః జ్ఞానవైరాగ్యరహితస్త్రిదండముపజీవతి

భార్యతో కలిసి భోగాలననుభవించే గృహస్థునకు కూడ బ్రహ్మచర్యము (భార్య తప్ప మరో స్త్రీని చూడకుండుట), తపస్సు, శౌచము, సంతోషము, ప్రాణుల యెడల మైత్రి ధర్మములు. ఈశ్వరుడనగు నన్ను ఉపాసించుట అన్ని ఆశ్రమములవారికి ధర్మము.

ఇతి మాం యస్స్వధర్మేణ భజేన్నిత్యమనన్యభాక్

సర్వభూతేషు మద్బావో మద్బక్తిం విందతేఽచిరాత్  

ఈ విధముగా ఎవడైతే నిష్కామముగా నిత్యము స్వధర్మముననుష్ఠించి నన్ను సేవించునో, ఆతడు సకలప్రాణులయందు నన్నే దర్శించి, తొందరలో నాయందు దృఢమైన (జ్ఞానరూపమైన) భక్తిని పొందును.

భక్త్యోద్దవానపాయిన్యా సర్వలోకమ హేశ్వరమ్

సర్వోత్పత్త్యవ్యయం బ్రహ్మ కారణం మోపయాతి సః

ఓ ఉద్ధవా! నీవు సజ్జనుడవు. స్వధర్మముతో కూడియున్న భక్తుడు పరబ్రహ్మనగు నన్ను ఏ విధముగా పొందును? అని నీవు ప్రశ్న వేసితివి. ఈ విధముగా నేను నీ ప్రశ్నకు సమాధానమును చెప్పితిని.

శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో

వానప్రస్థ సన్న్యాస ధర్మములను నిరూపించే

పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది .