భాగవత మహా పురాణము
15 - వామనావతారము - బలి స్వర్గముపై విజయమును పొందుట
రాజోవాచ ।
బలేః పదత్రయం భూమేః కస్మాద్ధరిరయాచత ।
భూత్వేశ్వరః కృపణవల్లబ్ధార్థోఽపి బబంధ తమ్ ॥
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- శ్రీహరి సర్వేశ్వరుడై ఉండియు దీనుడు వలే బలి చక్రవర్తిని మూడడుగుల భూమిని యాచించు టకు కారణమేమి? ప్రయోజనము సిద్ధించిన తరువాత కూడ ఆయన బలిని బంధించుటకు కారణమేమి?
ఏతద్వేదితుమిచ్ఛామో మహత్కౌతూహలం హి నః ।
యజ్ఞేశ్వరస్య పూర్ణస్య బంధనం చాప్యనాగసః ॥
మాకు ఈ విషయమును తెలియవలెననే ఉత్కంఠ అధికముగా గలదు. యజ్ఞమునకు ప్రభువు, పూర్ణుడు అగు శ్రీహరి యాచించుట, బలి నిరపరాధియే అయినా ఆయనను బంధించుట ఎట్లు సంభవమాయెను?
శ్రీశుక ఉవాచ ।
పరాజితశ్రీరసుభిశ్చ హాపీతో హీంద్రేణ రాజన్ భృగుభిస్స జీవితః,
సర్వాత్మనా తానభజద్భృగూస్ బలిశ్శిష్యో మహాత్మాఽర్థనివేదనేన.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! ఇంద్రుడు బలిని ఓడించి ఆతని సంపదను హరించుటయే గాక, ఆతని ప్రాణములను కూడ తీసెను. అపుడు గొప్ప శీలము గల ఆ బలిని భృగువంశీయులు బ్రతి కించిరి. ఆయన వారికి శిష్యుడై పదార్థములను సమర్పిస్తూ అన్ని విధము లుగా వారిని సేవించెను.
తం బ్రాహ్మణా భృగవః ప్రియమాణా
అయాజయన్ విశ్వజితా త్రిణాకమ్ ।
జిగీషమాణం విధినాఽభిషిచ్య
మహాభిషే కేణ మహానుభావాః ॥
భృగు వంశీయులగు బ్రాహ్మణులు గొప్ప ప్రభావము గలవారు. వారు బలి యెడల చాల ప్రసన్నులైరి. స్వర్గమును జయించ గోరే బలిని వారు యథావిధిగా మహాభిషేకముతో అభిషేకించి, విశ్వజిద్యాగమును చేయించిరి.
తతో రథః కాంచనపట్టనద్ధో హయాశ్చ హర్యశ్వతురంగవర్ణాః ।
ధ్వజశ్చ సింహేన విరాజమానో హుతాశనాదాస హవిర్భిరిష్టాత్॥
తరువాత హవిస్సులచే ఆరాధించబడిన అగ్నినుండి బంగర వస్త్ర ముచే కప్పబడిన రథము, ఇంద్రుని గుర్రములవలె పచ్చని గుర్రములు, సింహముతో ప్రకాశించే ధ్వజము కూడ ఆవిర్భవించెను.
ధనుశ్చ దివ్యం పురటోపనద్ధం తూణావరిక్తౌ కవచం చ దివ్యమ్,
పితామహస్తస్య దదౌ చ మాలామమ్లానపుష్పాం జలజం చ శుక్రః।
బంగరు రేకు తొడిగిన దివ్యమైన ధనుస్సు, అక్షయములైన తూణీ రములు, దివ్యమగు కవచము కూడ ప్రకటమయ్యెను. తాతగారు ప్రహ్లా దుడు ఆ బలికి వాడని పుష్పముల మాలను, శుక్రాచార్యుడు శంఖమును ఇచ్చిరి.
ఏవం స విప్రార్జితయోధనార్థస్తైః కల్పితస్వస్త్యయనోఽథ విప్రాన్ ।
ప్రదక్షిణీకృత్య కృతప్రణామః ప్రహ్లాదమామంత్ర్య నమశ్చకార ॥
ఈ విధముగా బలికి యుద్ధపరికరములను ఆ బ్రాహ్మణులు యజ్ఞము ద్వారా సంపాదించి పెట్టిరి. వారు స్వస్తివాచనములు పలుకగా ఆతడు వారికి ప్రదక్షిణ నమస్కారములను చేసి, ప్రహ్లాదునకు నమస్కరించి ఆయన వద్ద సెలవు తీసుకోనెను.
అథారుహ్య రథం దివ్యం భృగుదత్తం మహారథః ।
సుస్రగ్ధరోఽథ సంనహ్య ధన్వీ ఖడ్గీ ధృతేషుధిః ॥
మహారథుడగు బలి చక్కని మాలను, ధనుస్సును, కత్తిని, తూణీర ములను ధరించి, కవచమును వేసుకొని, భృగువంశీయులు సమకూర్చిన దివ్యమగు రథమునెక్కెను.
హేమాంగదలసద్బాహుస్స్ఫురన్మకరకుండలః ।
రరాజ రథమారూఢో ధిష్ణ్యస్థ ఇవ హవ్యవాట్ ॥
ఆయన చేతులు బంగరు భుజపురులతో ప్రకాశించేను. మెరిసి పోయే మకరాకార కుండలములను ధరించిన ఆ బలి రథమునెక్కి, అగ్ని కుండమునందలి అగ్ని వలె ప్రకాశించెను.
తులైశ్వర్యబలశ్రీభిస్స్వయూథైర్ధైత్యయూథపైః ।
పిబద్భిరివ ఖం దృగ్భిర్ధహద్భిః పరిధీనివ ॥
వృతో వికర్షన్ మహతీమాసురీం ధ్వజినీం విభుః ।
యయావింద్రపురీం స్వృద్ధాం కంపయన్నివ రోదసీ ॥
బలి చక్రవర్తిని రాక్షస సేనానాయకులు తమ తమ సైన్యములతో కూడి చుట్టువారి యుండిరి. బలితో సమానమైన ప్రభావము, బలము, సంపదలు గల ఆ సేనానాయకులు చూపులతో ఆకాశమును త్రాగుచు న్నారా యన్నట్లు, దిక్కులను తగులబెట్టుచున్నారా యన్నట్లు ఉండిరి. బలి పెద్ద రాక్షస సైన్యమును నడుపుతూ మిక్కిలి సమృద్ధమగు ఇంద్రనగరము (అమరావతి) ను చేరెను. ఆయన సైన్యమును నడుపుచుండగా భూలోక స్వర్గలోకములను కంపింప జేయుచున్నాడా యన్నట్లు ఉండెను.
రమ్యాముపవనోద్యానైశ్శ్రీమద్భిర్నందనాదిభిః ।
కూజద్విహంగమిథునైర్గాయన్మత్తమధువ్రతైః ।
ప్రవాలఫలపుష్పోరుభారశాఖామరద్రుమైః ।
ఆ నగరములోని నందనము మొదలైన ఉపవనములు (దగ్గరగా ఉండే పళ్ల తోటలు), ఉద్యానములు (దూరముగా ఉండే పూలదోటలు) కూతలు కూసే పక్షుల జంటలతో, ఝంకారమును చేసే మదించిన తుమ్మె దలతో, కొమ్ముల నిండా చిగుళ్లు పళ్లు పువ్వుల పెను భారము గల దేవ (క ల్ప) వృక్షములతో శోభాయుతములై యుండెను.
హంససారసచక్రాహ్వకారండవకులాకులాః ।
నలిన్యో యత్ర క్రీడంత ప్రమదాస్సుర సేవితాః ॥
హంసలు, బెగ్గురు పక్షులు, జక్కవ పక్షులు, కారండవ పక్షుల సమూహములతో అక్కడి తామర కొలనులు కోలాహలముగా నుండును. వాటియందు దేవతలచే సమ్మానించబడే దేవస్త్రీలు క్రీడించెదరు.
ఆకాశగంగయా దేవ్యా వృతాం పరిఖభూతయా ।
ప్రాకారేణాగ్నివర్ణేన సాట్టాలేనోన్నతేన చ ॥
పూజనీయమైన ఆకాశగంగ అమరావతీ నగరము చుట్టూ అగర్త ఆయెను. ఆ నగరము చుట్టూ అగ్ని వలె ప్రకాశించే ఎత్తైన ప్రాకారము గలదు. దానిపై బురుజులు గలవు.
రుక్మపట్టకపాటైశ్చ ద్వా రైస్స్ఫటికగోపురైః ।
జుష్టాం విభక్తప్రపథాం విశ్వకర్మవినిర్మితామ్ ॥
ఆ నగరములోని ద్వారముల తలుపులకు పట్టీలు వెండివి. దాని పురద్వారములకు స్పటికములు పొదగబడినవి. విశ్వకర్మచే నిర్మించబడిన ఆ నగరమునందు రాజమార్గములు చక్కగా విభాగము చేయబడియున్నవి.
సభాచత్వరరథ్యాడ్యాం విమానైర్న్యర్బుదైర్యుతామ్ । శృంగాటకైర్మణిమయైర్వజ్రవిద్రుమవేదిభిః ॥
అమరావతీ నగరము సభలు, ముంగిళ్లు, రథమార్ధములతో సుసం పన్నమై యుండెను. దానియందు పది కోట్ల విమానములు, మణులు పొది గిన కూడళ్లు, వజ్రములు పగడములు పొదిగిన వేదికలు గలవు.
యత్ర నిత్యవయోరూపాశ్శ్యామా విరజవాససః ।
భ్రాజంతే రూపవన్నార్యో హ్యర్చిర్భిరివ వహ్నయః ॥
ఆ నగరమునందలి యువతులు నిత్యము ఉండే సౌందర్యము, యౌవనము గలవారు. శుద్దమగు వస్త్రములను దాల్చే ఆ సుందరులు ఆభ రణములను దాల్చి, జ్వాలలతో గూడిన అగ్నులు వలె ప్రకాశించెదరు.
సురస్త్రీకేశవిభ్రష్టనవసౌగంధికస్రజామ్ ।
యత్రామోదముపాదాయ మార్గ ఆవాతి మారుతః ॥
ఆ నగరమునందు దేవస్త్రీల కేశములనుండి జారిపడిన సౌగంధిక పుష్పముల మాలల పరిమళమును స్వీకరించి వాయువు మార్గమునందు మెల్లగా వీచుచుండును.
హేమజాలాక్షనిర్గచ్ఛద్దూమేనాగురుగంధినా ।
పాండురేణ ప్రతిచ్చన్నమార్గే యాంతి సురప్రియాః ॥
సుగంధభరితమైన తెల్లని అగురు ధూపము బంగరు కిటికీలనుండి బయటకు వచ్చి మార్గమును కప్పివేయును. అట్టి మార్గమునందు అప్సర సలు నడచుచుందురు.
ముక్తావితానైర్మణి హేమకేతుభిర్నానాపతాకావలభీభిరావృతామ్ । శిఖండిపారావతభృంగనాదితాం వైమానిస్త్రీకలగీతమంగలామ్ ॥
ఆ నగరము అంతటా ముత్యముల చాందినీలు, మణులు గల బంగరు టెక్కెములు, అనేకములైన చిన్నజెండాలు పెట్టిన ఇళ్ల నడికొప్పు లు ఉండెను. నెమళ్లు, ' పావురములు, తుమ్మెదలు ధ్వనిని చేయుచుండెను. దేవస్త్రీల మధురగానములతో ఆ నగరము మంగళప్రద ముగా నుండెను.
మృదంగశంఖానకదుందుభిస్వనైః
సతాలవీణామురజర్ ష్టివేణుభిః ।
నృత్యైస్సవాద్యైరుపదేవగీతకైః
మనోరమాం స్వప్రభయా జితప్రభామ్ ॥
ఆ నగరములో డోళ్లు, శంఖములు, తప్పెట్లు, దుందుభులు, తాళ ములు, వీణలు, మద్దెళ్లు, ఋష్టి అనే వాద్యములు, వేణువులు మొదలగు వాద్యములను వాయిస్తూ గంధర్వులు గానములను చేయుచుండగా, అప్సరసలు నాట్యములను చేయుచుండిరి. ఈ విధముగా మనోహరమైన ఆ నగరము తన కాంతిచే కాంతిదేవిని కూడ జయించినదా యన్నట్లు ఉండెను.
యాం న ప్రజంత్యధర్మిష్ఠాః ఖలా భూతద్రుహశ్శఠాః ।
మానినః కామినో లుబ్దా ఏభర్హీనా ప్రజంతి యత్ ॥
ధర్మాత్ములు కానివారు, దుష్టులు, ప్రాణులకు ద్రోహమును చేయువారు, రహస్యముగా అపకారమును చేయువారు, గర్విష్ఠులు, కాముకులు, లోభులు ఆ నగరమును చేరలేరు. ఈ దోషములు లేనివారు మాత్రమే ఆ నగరమును పొందెదరు.
తాం దేవధానీం స వరూథినీపతిః
బహిస్సమంతాద్రురుధే పృతన్యయా ।
ఆచార్యదత్తం జలజం మహాస్వనం
దధ్మౌ ప్రయుంజన్ భయమింద్రయోషితామ్ ॥
సేనాపతియగు ఆ బలి దేవతల రాజధానియగు అమరావతిని బయట అంతటా సైన్యముతో ముట్టడించెను. ఆయన ఇంద్రుని భార్యలకు భయము కలిగే విధముగా, ఆచార్యులచే ఈయబడిన గొప్ప ధ్వనిని చేసే శంఖమును పూరించెను.
మఘవాంస్తమభిప్రేత్య బలేః పరమముద్యమమ్ ।
సర్వదేవగణో పేతో గురుమేతదువాచ హ ॥
బలియొక్క ఆ గొప్ప యుద్ధోద్యమమును గురించి తెలుసుకున్న ఇంద్రుడు దేవగణములందరితో గూడి బృహస్పతితో ఇట్లు పలికెను.
భగవన్నుద్యమో భూయాన్ బలేర్నః పూర్వ వైరిణః ।
అవిషహ్యమిమం మన్యే కేనాసీత్తేజసోర్జితః ॥
ఓ పూజనీయా! మనకు పూర్వమునందు శత్రువైన బలి చేయు చున్న యుద్దప్రయత్నము చాల పెద్దది. మనము వీనిని ఎదుర్కొనలేమని నా అభిప్రాయము. ఈతడు ఏ శక్తిచే ఇంతటి శక్తి గలవాడైనాడు?
నైనం కశ్చిత్కుతో వాపి ప్రతివ్యోఢుమధీశ్వరః ।
పిబన్నివ ముఖేనేదం లేహన్నివ దిశో దశ ।
దహన్నివ దిశో దృగ్భిస్సంవర్తాగ్నిరివోత్థితః ॥
ఎవ్వడైననూ ఏ ఉపాయముచేనైననూ వీనిని నెట్టివేయుటకు సమ ర్థుడు కాడు. ఈతడు నోటితో జగత్తును త్రాగుచున్నాడా యన్నట్లు, దిక్కుల నాస్వాదించుచున్నాడా యన్నట్లు, చూపులతో దిక్కులను దహించుచు న్నాడా యన్నట్లు ప్రళయకాలాగ్నివలె ఆవిర్భవించినాడు.
బ్రూహి కారణమేతస్య దుర్ధర్షత్వస్య మద్రిపోః ।
ఓజస్సహో బలం తేజో యత ఏతత్సముద్యమః ॥
నా శత్రువగు ఈతనిని జయించ శక్యము కాదు. ఈతని ఈ స్థితికి కారణమేమి? ఈతనిలో మనోబలము, ఇంద్రియబలము, శరీరబలము ఎక్కడనుండి వచ్చినవి? వాటి ఆధారముగనే ఈతడు ఇంత ఉద్యమమును చేయుచున్నాడు.
గురురువాచ ।
జానామి మఘవన్ శత్రోరున్నతేరస్య కారణమ్ ।
శిష్యాయోపభృతం తేజో భృగుభిర్బ్రహ్మవాదిభిః ॥
ఓ ఇంద్రా! శత్రువుయొక్క ఈ అభివృద్ధికి కారణము నాకు తెలి యును. వేదవేత్తలగు భృగువంశీయులు తమ శిష్యుడగు ఈ బలియందు తేజస్సును నింపినారు.
భవద్విధో భవాన్ వాపి వర్జయిత్వేశ్వరం హరిమ్ ।
నాస్య శక్తః పురః స్థాతుం కృతాంతస్య యథా జనాః ॥
జనులు మృత్యువు యెదుట నిలువలేరు. అదే విధముగా, నీవు గాని, నీవంటివాడు మరియొకడు గాని, సర్వేశ్వరుడగు శ్రీహరిని విడిచి పెట్టినచో, వీని యెదుట నిలబడలేరు.
తస్మాన్నిలయముత్సృజ్య యూయం సర్వే త్రివిష్టపమ్ ।
యాత కాలం ప్రతీక్షంతో యతశ్శత్రోర్విపర్యయః ॥
కావున, మీరందరు స్వర్గమును విడిచి ఎచ్చటనో దాగియున్నవా రై, కాలమును వేచి చూచుచుండుడు. కాలమే శత్రువు స్థితిని తల్లక్రిందులు చేయగలదు. .
ఏష విప్రబలోదర్కస్సంప్రత్యూర్జితవిక్రమః ।
తేషామేవాపమానేన సానుబంధో వినంక్ష్యతి ॥
వేదవేత్తల బలముచే ఉత్తరోత్తరాభివృద్ధి గల ఈతని పరాక్రమము ఇప్పుడు వృద్ధి చెందియున్నది. ఈతడు మరల ఆ వేదవేత్తలను అవమా నము చేసినప్పుడు మాత్రమే సపరివారముగా వినాశమును పొందగలడు.
ఏవం సుమంత్రితార్థాస్తే గురుణార్థానుదర్శినా ।
హిత్వా త్రివిష్టపం జగ్ముర్గీర్వాణాః కామరూపిణః ॥
యథార్థమైన విచారమును చేసే బృహస్పతి ఈ విధముగా విచా రపూర్వకముగా దేవతల ప్రయోజనమును గురించి సలహానిచ్చెను. అపుడు ఆ దేవతలు తమకు నచ్చిన రూపములను దాల్చి స్వర్గమును విడి చిపెట్టి వెళ్లిరి.
దేవేష్వథ నినేషు బలిర్వైరోచనః పురీమ్ ।
దేవధానీమధిష్ఠాయ వశం నిన్యే జగత్త్రయమ్ ॥
దేవతలు దాగుకొనగా ఆ తరువాత విరోచన పుత్రుడగు బలి దేవ తల రాజధానియగు అమరావతీ నగరమునకు అధీశ్వరుడై ముల్లోకములను తన వశము చేసుకొనెను.
తం విశ్వజయినం శిష్యం భృగవశ్శిష్యవత్సలాః ।
శతేన హయమేధానమనువ్రతమయాజయన్ ॥
జగత్తును జయించి తమను అనుసరించే తమ శిష్యుడగు బలిపై భృగువంశీయులకు ప్రేమ మెండు. వారాయనచే వంద అశ్వమేధ యాగ ములను చేయించిరి.
తతస్తదనుభావేన భువనత్రయవిశ్రుతామ్ ।
కీర్తిం దీక్షు వితన్వానస్స రేజ ఉడురాడిన ॥
తరువాత ఆ యజ్ఞముల ప్రభావముచే ఆ బలి ముల్లోకములలో దిక్కులయందు తన కీర్తిని విస్తరింప జేసి, నక్షత్రాధిపతియగు చంద్రుడు వలె ప్రకాశించేను.
బుభుజే చ శ్రియం స్వృద్దాం ద్విజదేవోపలంభితామ్ ।
కృతకృత్యమివాత్మానం మన్యమానో మహామనాః ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే
బలేస్స్వర్గవిజయో నామ పంచదశోఽధ్యాయః ॥
బలి గొప్ప ఔదార్యము గలవాడు. యజ్ఞములను చేసి తాను కృతార్థుడనైతినని ఆయన తలపోసెను. వేదవేత్తల అనుగ్రహముచే దేవతల సమృద్ధమైన సంపద లభించగా, ఆయన దానిని అనుభవించెను.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో బలి స్వర్గముపై విజయమును పొందుటను వర్ణించే పదిహేనవ అధ్యాయము ముగిసినది .
Summary of chapter 15 of the Bhāgavata Mahā Purana is as follows:
Having been revived by Śukrācārya, King Bali executed the Viśvajit sacrifice under the guidance of the Bhṛgu brāhmaṇas, receiving a divine chariot, celestial armor, and invincible weapons. Reinforced with supreme spiritual potency, King Bali led his army to attack Svargaloka. Realizing that Bali was protected by the spiritual power of the brāhmaṇas, King Indra and the devatās abandoned heaven on the advice of their guru Bṛhaspati, allowing King Bali to occupy the celestial throne and rule the universe.