9 - సముద్ర మథనము - శ్రీహరి మోహినీ రూపమును దాల్చుట

శ్రీశుక ఉవాచ

 తేऽన్యోన్యతోఽసురాః పాత్రం హరంతస్త్యక్తసౌహృదాః

 క్షిపంతో దస్యుధర్మాణ ఆయాంతీం దదృశుః స్త్రియమ్

ఆ రాక్షసులు ప్రేమను విడిచి పెట్టి దోపిడీగాండ్ర వలె ప్రవర్తిస్తూ ఆ కలశమును ఒకరినుండి మరియొకరు లాగుతూ విసిరి వేయుచుండిరి. ఇంతలో తమ వైపు వచ్చుచున్న యువతిని వారు కనుగొనిరి.

అహో రూపమహో ధామ అహో అస్యా నవం వయః

 ఇతి తే తామ భి ద్రుత్య పప్రచ్ఛుర్జాతహృచ్ఛయాః

ఆహా! ఏమి రూపము! ఆహా! ఏమి కాంతి! ఆహా! ఈమె వినూత్న యౌవనవతి! అని వారు తలచిరి. వారి హృదయములో మన్మథుడు ఉద యించెను. అపుడు వారు ఆమె వైపు పరుగెత్తి ఇట్లు ప్రశ్నించిరి.

కా త్వం కంజపలాశాక్షి కుతో వా కిం చికీర్షసి

కస్యాసి వద వామోరు మథ్నంతీవ మనాంసి నః

పద్మపత్రములవంటి కన్నులు గల ఓ సుందరీ! నీవు ఎవతెవు? ఎక్కడనుండి వచ్చితివి? ఏమి చేయగోరుచున్నావు? నీవు ఎవని దానవు? చెప్పుము. నీవు మా మనస్సులను కలచి వేయుచున్నట్లున్నావు.

న వయం త్వాఽమరై ర్దై త్యైస్సిద్ధగంధర్వచార ణైః

 నాస్పృష్టపూర్వాం జానీమో లోకేశైశ్చ కుతో నృభిః

దేవతలు, రాక్షసులు, సిద్దులు, గంధర్వులు, చారణులు, లోకపాల కులు కూడ నిన్ను ఇదివరలో స్పృశించి యుండరని మాకు తెలియక పోలే దు. నిన్ను మానవులు స్పృశించి యుండరని వేరుగా చెప్పవలయునా?

నూనం త్వం విధినా సుభ్రూః ప్రేషితాసి శరీరిణామ్

 సర్వేంద్రియమనఃప్రీతిం విధాతుం సఘృణేన కిమ్

            చక్కని కనుబొమలు గల ఓ సుందరీ! దైవము దయతో ప్రాణుల సకలేంద్రియములకు మనస్సునకు ప్రీతిని కలిగించుటకై నిన్ను పంపినాడా యేమి? అవును, అదియే నిశ్చయము.

సా త్వం న స్స్ప ర్ధమానానామేకవస్తుని మానిని

జ్ఞా తీనాం బద్ధవైరాణాం శం విధత్స్వ సుమధ్యమే

సన్నని నడుము గల ఓ అభిమానవతీ! మేము జ్ఞాతులమే. అయి ననూ, ఒకే వస్తువు విషయములో పోటీ పడి గట్టి వైరమును పూనియుంటి మి. దైవముచే పంపబడిన నీవు మాకు (వైరమును తొలగించి) మఖమును కలిగించుము.

వయం కశ్యపదాయాదా భ్రాతరః కృతపౌరుషాః

విభజస్వ యథాన్యాయం నైవ భేదో యథా భవేత్

మేము కశ్యప ప్రజాపతి పుత్రులము, సోదరులము. అమృతము కొరకై మేము సమానముగా శ్రమించినాము. కావున, మాకు న్యాయమును అతిక్రమించకుండా, కలహము రాని విధముగా అమృతమును పంచి పెట్టుము. పంచి పెట్టుటలో భేదబుద్ధికి తావు ఉండనే రాదు.

ఇత్యుపామంత్రితో దైత్యైర్మాయాయోషిద్వపుర్హరిః

 ప్రహస్య రుచిరాపాంగైర్నిరీక్షన్నిదమబ్రవీత్

కపటమగు యువతి వేషమును దాల్చియున్న శ్రీహరిని రాక్షసులీ విధముగా ప్రార్థించిరి. అపుడాయన నవ్వి, ప్రీతిని కలిగించే కడకంటి చూపు లతో వారిని చూస్తూ, ఇట్లు పలికెను.

శ్రీభగవానువాచ

కథం కశ్యపదాయాదాః పుంశ్చలాం మయి సంగతాః

 విశ్వాసం పండితో జాతు కామినీషు న యాతి హి

శ్రీభగవానుడిట్లు పలికెను --- కశ్యప ప్రజాపతి పుత్రులగు మీరు కులటనగు నన్ను అనుసరించుటకు కారణమేమి? ఎందుకంటే, వివేకి కామ మును ఉద్దీపింపజేసే యువతిని ఏ కాలమునందైననూ విశ్వసించడు.

సాలావృక్షాణాం స్త్రీణాం చ స్వైరిణీనాం సురద్విషః

సఖ్యాన్యాహురనిత్యాని నూత్నం నూత్నం విచిన్వతామ్

             దేవతలను ద్వేషించే ఓ రాక్షసులారా! తోడేళ్లు కొత్త కొత్త మాంస మును, స్వేచ్చాచారిణులగు యువతులు కొత్త కొత్త పురుషులను వెదుకు చుందురు. వారు చేసే స్నేహములు అస్థిరములని పెద్దలు చెప్పేదరు.

శ్రీశుక ఉవాచ

ఇతి తే క్ష్వేలితైస్తస్యా ఆశ్వస్తమనసోఽసురాః

 జహసుర్భావగంభీరం దదుశ్చామృతభాజనమ్

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను - ఈ విధముగా ఆమె పలికిన కపటపు మాటలచే రాక్షసులకు మనస్సులో విశ్వాసము కలిగెను. అపుడు వారు ఆమెయందలి ప్రేమ బయట పడకుండా, గంభీరముగా నవ్వి, అమృత కలశమును ఆమెకు ఇచ్చివేసిరి.

తతో గృహీత్వాఽమృతభాజనం హరిః

బభాష ఈషత్స్మితశోభయా గిరా

 యద్యభ్యు పేతం క్వచ సాధ్వసాధు వా

కృతం మయా వో విభజే సుధామిమామ్

తరువాత శ్రీహరి ఆ అమృత కలశమును తీసుకొని, చిన్న చిరున వ్వుతో శోభిల్లే వాక్కుతో ఇట్లు పలికెను - ఏ అంశములోనైననూ నేను చేయబోయేది మంచిది గాని, చెడు గాని మీకు అంగీకారమయ్యే పక్షము లో, నేనీ అమృతమును పంచి పెట్టెదను.

ఇత్యభివ్యాహృతం తస్యా ఆకర్ణ్యాసురపుంగవాః

 అప్రమాణవిదస్తస్యాస్తత్తథేతన్వమంసత

ఆమె పలికిన ఈ మాటను ఆ రాక్షస శ్రేష్ఠులు వినిరి. ఆమె అభిప్రా యము వారికి తెలియలేదు. సరే అని వారు ఆమె షరతునకు తమ అంగీ కారమును తెలిపిరి.

అథోపోష్య కృతస్నానా హుత్వా చ హవిషాఽనలమ్

 దత్త్వా గోవిప్రభూతేభ్యః కృతస్వస్త్యయనా ద్విజైః

తరువాత ఆమె ఒకరోజు ఉపవసించెను. మరునాడు ఆమె స్నానము చేసి అగ్నిలో హవిస్సును హోమము చేసి, ఆవులకు ఇతరప్రాణు లకు ఆహారమును వేదవేత్తలకు ధనాదికమును ఇచ్చి, వేదవేత్తలచే స్వస్తి వాచనమును పఠింప జేసెను.

యథోపజోషం వాసాంసీ పరిధాయాఽహతాని తే

 కుశేషు ప్రావిశన్ సర్వే ప్రోగగ్రేష్వభిభూషితాః

వారందరు తమ ప్రీతికి తగ్గట్లుగా కొత్త వస్త్రములను ధరించి అలంకారములను చేసుకొనిరి. అపుడు వారు తూర్పు వైపు కొనలు గల దర్భలయందు కూర్చుండిరి.

ప్రాఙ్మఖేషూపవిష్టేషు సురేషు దితిజేషు చ

 ధూపొమోదితశాలాయాం జుష్టాయాం మాల్యదీపకైః

తస్యాం నరేంద్ర కరభోరురుశద్దుకూల-

శ్రోణీతటాలసగతిర్మదవిహ్వలాక్షీ

సా కూజతీ కనకనూపురశింజితేన

కుంభస్తనీ కలశపాణిరథావివేశ

మాలలతో మరియు దీపములతో అలంకరించి ధూపముతో పరి మళ భరితము చేయబడిన శాలయందు దేవతలు మరియు రాక్షసులు తూర్పునకభిముఖముగా కూర్చుండిరి. అప్పుడు సుందరమగు అవయవ ములు గల ఆ యువతీ బంగరు కాలియందేలు ప్రతిధ్వనించుచుండగా కల శము చేతబట్టి ఆ సభలో ప్రవేశించేను. ఆమె కన్నులు సంతోషముతో స్వాధీనత తప్పియుండెను. అందమైన చీరతో ప్రకాశించే విశాలమైన కటి భాగము గల ఆమె మెల్లగా నడచి వచ్చెను.

తాం శ్రీసఖీం కనకకుండలచారుకర్ణ

నాసాకపోలవదనాం పరదేవతాఖ్యామ్

 సంవీక్ష్య సంముముహురుత్స్మితవీక్షణేన

దేవాసురా విగలితస్తనపట్టికాంతామ్

లక్ష్మీదేవితో సరిదూగే ఆమె సాక్షాత్తుగా పరదేవతా (పరబ్రహ్మ) రూపిణియే. ఆమె ముఖము బంగరు కుండలములతో అందమైన చెవులు ముక్కు మరియు చెక్కిళ్లతో ప్రకాశించెను. కంచుకముయొక్క కొన కొద్దిగా జారుచుండగా ఆమె చిరునవ్వుతో దేవతలను మరియు రాక్షసులను చూచుచుండెను. ఆమెను తదేకముగా చూచే ఆ దేవతలు, రాక్షసులు మోహమును పొందిరి.

అసురాణాం సుధాదానం సర్పాణామివ దుర్నయమ్

మత్వా జాతినృశంసానాం న తాం వ్యభజదచ్యుతః

పుట్టుకతోడనే క్రూరులైన రాక్షసులకు అమృతమునిచ్చుట సర్ప ములకు పాలను పోయుట వంటి నీతి విరుద్ధమగు చర్య. ఇట్లు తలపోసి శ్రీహరి అమృతమును వారికి పంచి ఈయలేదు.

కల్పయిత్వా పృథక్ పంక్తీరుభయేషాం జగత్పతిః

 తాంశ్చోపవేశయామాస స్వేషు స్వేషు చ పంక్తిషు

జగన్నాథుడగు శ్రీహరి దేవతలకు, రాక్షసులకు ఇద్దరికీ వేర్వేరు పంక్తులనేర్పాటు చేసి, వారిని తమ తమ పంక్తులలో కూర్చుండ బెట్టెను.

దైత్యాన్ గృహీతకలశో వంచయన్నుప సంచరైః

 దూరస్థాన్ పాయయామాస జరామృత్యుహరాం సుధామ్

శ్రీహరి కలశమును పట్టుకొని రాక్షసులకు దగ్గరగా సంచరిస్తూ వారిని వంచించి, దూరముగానున్న దేవతలకు అమృతమును త్రావించెను. అమృతమును త్రోవువారికి ముసలిదనము గాని, మరణము గాని ఉండవు.

తే పాలయంతస్సమయమసురాస్స్వకృతం నృప

 తూష్ణీమాసన్ కృత స్నేహాః స్త్రీవివాదజుగుప్సయా

ఓ మహారాజా! ఆ రాక్షసులకు ఆమెపై ప్రేమ ఏర్పడెను. పైగా వారు స్త్రీతో కలహించుట జుగుప్సను కలిగించే చర్య అని భావించిరి. కావుననే, వారు తాము చేసుకున్న ఒప్పందమును పాలిస్తూ మిన్నకుండిరి.

తస్యాం కృతాతిప్రణయాః ప్రణయాపాయకాతరాః

 బహుమానేన చాబద్ధా నోచుః కించన విప్రియమ్        

ఆ రాక్షసులకు ఆమెయందు అధికమగు ప్రేమ కలిగెను. ఆ ప్రేమకు భంగము కలుగునేమో యను భయము వారిలో ఉండెను. పైగా, ఆమే వారికి చాల మర్యాదనిచ్చెను. అది కూడ వారిని కట్టివేసెను. ఈ కార ణములచే, వారు పరుషముగా ఒక్క మాటనైననూ పలుకలేదు.

దేవలింగప్రతిచ్ఛన్నస్స్వర్భానుర్దేవసంసది

 ప్రవిష్టస్సోమమపిబచ్చంద్రార్కాభ్యాం చ సూచితః

రాహువు తన యథార్థరూపము కనబడకుండా దేవతల గుర్తులను ధరించి వారి గుంపులో ప్రవేశించి అమృతమును త్రాగెను. కానీ, చంద్రుడు మరియు సూర్యుడు ఆయనను గుర్తు పట్టి శ్రీహరికి చూపించిరి.

చక్రేణ క్షురధారేణ జహార పిబతశ్శిరః

హరిస్తస్య కబంధస్తు సుధయాఽప్లావితోऽపతత్

             శ్రీహరి వాడి యంచులు గల చక్రముతో అమృతమును త్రాగు చున్న రాహువు తలను నరికెను. అమృతము తగలని వాని మొండెము క్రింద పడి మరణించేను. (కేతువు రాహువుయొక్క ఛాయయే గాని, మొండెము కాదు).

శిరస్త్వమరతాం నీతమజో గ్రహమచీక్లుపత్

 యస్తు పర్వణీ చంద్రార్కావభిధావతి వైరధీః

కాని, తల అమరమయ్యెను. స్వయంభువుడగు బ్రహ్మగారు దానిని గ్రహముగా ఏర్పాటు చేసెను. ఆ రాహు గ్రహము వైరబుద్ధి గల దియై పూర్ణిమ, అమావాస్యలయందు సూర్యచంద్రులపై ఆక్రమణను చేయుచుండును.

పీతప్రాయేఽమృతే దేవైర్భగవాంల్లోకభావనః

 పశ్యతామసురేంద్రాణాం స్వం రూపం జగృహే హరిః

దేవతలు ఇంచుమించు పూర్తిగా అమృతమును త్రాగిరి. అప్పుడు లోకములను పాలించే శ్రీహరి భగవానుడు, రాక్షస నాయకులు చూస్తుండ గానే వారిని సరకు చేయకుండా, తన అసలు రూపమును స్వీకరించెను.

ఏవం సురాఽసురగణాస్సమదేశకాల

 హేత్వర్థకర్మమతయోఽపి ఫలే వికల్పాః

తత్రామృతం సురగణాః ఫలమంజసాऽऽపుః

యత్పాదపంకజరజశ్శ్రయణాన్న దైత్యాః

దేవతల మరియు రాక్షసుల గణములు ఈ విధముగా ఒకే స్థాన ములో ఒకే కాలములో సమానమైన ఉపకరణములతో సమానమైన సంక ల్పముతో సమానమైన పరిశ్రమనే చేసిరి. అయననూ, వారికి లభించిన ఫలములలో చాల తేడాలు గలవు. వారిలో శ్రీహరి పాదపద్మముల ధూళిని ఆశ్రయించిన దేవతలకు అమృతము ఫలముగా తేలికగా లభించెను. కాని, భగవానునకు విముఖులగుటచే, రాక్షసులకు ఏదీ దక్కలేదు.

యద్యుజ్యతేఽసువసుకర్మమనోవచోభిః

దేహాత్మజాదిషు నృభిస్తదసత్పృథక్త్వాత్

 తైరేవ సద్భవతి యత్క్రియతేఽపృథక్త్వాత్

సర్వస్య తద్భవతి మూలని షేచనం యత్

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే

సముద్రమథనవృత్తాంతే శ్రీహరేః మోహినీరూపవర్ణనం

నామ నవమోऽధ్యాయః

ప్రాణములు, సంపదలు, కర్మలు మరియు మనస్సులతో మాన వులు తమ దేహము, సంతానము మొదలగువాటి కొరకు చేసే సర్వము భేదబుద్ధితో కూడినది యగుట వలన వ్యర్థమే యగును. కాని, మానవుడు వాటితోనే భగవానుని ఆరాధనను చేసినచో, భగవంతునికంటె భిన్నముగా ఏదీ లేదు గనుక, ఆ సర్వము సఫలమగును. ఎందుకంటే, చెట్టు వేళ్లను తడిపినచో, చెట్టులోని సర్వమునకు నీరు అందును గదా!

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో సముద్ర మథన వృత్తాంతములో శ్రీహరియొక్క మోహినీ రూపమును వర్ణించే తొమ్మిదవ అధ్యాయము ముగిసినది .