13 - రాబోయే మన్వంతరముల వర్ణనము

శ్రీశుక ఉవాచ

మనుర్వివస్వతః పుత్రశ్శ్రాద్ధదేవ ఇతి శ్రుతః

సప్తమో వర్తమానో యస్తదపత్యాని మే శృణు

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- సూర్యదేవుని పుత్రుడు శ్రాద్ధదే వుడు అని ప్రసిద్ధి గాంచినవాడు ఇప్పుడు ఏడవ మనువుగా ఉన్నాడు. ఆయన సంతానమును గురించి నేను చేప్పెదను. వినుము.

ఇక్ష్వాకుర్నభగశ్చైవ ధృష్టశ్శర్యాతిరేవ చ

 నరిష్యంతోఽథ నాభాగస్సప్తమో దిష్ట ఉచ్యతే

   కరూషశ్చ పృషధ్రశ్చ దశమో వసుమాన్ స్మృతః

 మనోర్వైవస్వతస్యైతే దశ పుత్రాః పరంతప

శత్రువులను తపింపజేసే ఓ మహారాజా! ఇక్ష్వాకువు, నభగుడు, ధృష్ణుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూషుడు, పృష ధ్రుడు, వసుమంతుడు అనే పదిమంది వైవస్వత మనువుయొక్క పుత్రులు అని మహాత్ములు చెప్పెదరు.

ఆదిత్యా వసవో రుద్రా విశ్వేదేవా మరుద్గణాః

అశ్వినావృభవో రాజన్నింద్ర స్తేషాం పురందరః

ఓ మహారాజా! ఆదిత్యులు, వస్తువులు, రుద్రులు, విశ్వేదేవతలు, మరుత్తుల గణములు, అశ్వినీ దేవతలు, ఋభువులు అనువారలు దేవగణ ములు. వారి ఇంద్రుడు పురందరుడు.

కశ్యపోऽత్రిర్వసిష్ఠశ్చ విశ్వామిత్రోఽథ గౌతమః

 జమదగ్నిర్భరద్వాజ ఇతి సప్తర్షయస్స్మృతాః

కశ్యపుడు, అత్రి, వసిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమద గ్ని, భరద్వాజుడు అనువారలు సప్తర్షులు అని చెప్పెదరు.

అత్రాపి భగవజ్జన్మ కశ్యపాదదితేరభూత్

 ఆదిత్యానామవరజో విష్ణుర్వామనరూపధృక్

ఈ మన్వంతరమునందు కూడ విష్ణు భగవానుడు అవతరించెను. ఆయన కశ్యపునకు అదితియందు ఆదిత్యుల తమ్ముడగు వామనుడై జన్మించెను.

సంక్షేపతో మయోక్తాని సప్త మన్వంతరాణి తే

భవిష్యాణ్యథ వక్ష్యామి విష్ణోశ్శక్త్యాన్వితాని చ  

నేను ఏడు మన్వంతరముల గురించి నీకు సంక్షేపముగా చెప్పితి ని. తరువాత విష్ణువుయొక్క శక్తితో గూడి భవిష్యత్తులో రాబోయే మన్వంత రములను గురించి కూడ చెప్పగలను.

వివస్వతశ్చ ద్వే జాయే విశ్వకర్మసుతే ఉభే

 సంజ్ఞా ఛాయా చ రాజేంద్ర యే ప్రాగభిపితే తవ

ఓ మహారాజా! సూర్యభగవానునకు సంజ్ఞ, ఛాయ అనే ఇద్దరు భార్యలు గలరు. వారిద్దరు విశ్వకర్మయొక్క పుత్రికలే. వారిని గురించి నీకిది వరలో చెప్పియుంటిని.

తృతీయాం వడవామేకే తాసాం సంజ్ఞాసుతాస్త్రయః

 యమో యమీ శ్రాద్ధదేవశ్ఛాయాయాశ్చ సుతాన్ శృణు  

సూర్యునకు వడవ అనే మూడవ భార్య కూడ గలదని కొందరు చెప్పెదరు. ఆ భార్యలలో సంజ్ఞకు యముడు శ్రాద్ధదేవుడు అనే పుత్రులు, యమున అనే పుత్రిక కలిగిరి. ఛాయయొక్క పుత్రులను గురించి కూడ వినుము.

సావర్ణిస్తపతీ కన్యా భార్యా సంవరణస్యయా

శనైశ్చరస్తృతీయోఽభూదశ్వినౌ వడవాత్మజౌ

సావర్ణి ఛాయయొక్క పెద్ద కొడుకు. తపతి ఆమె కుమార్తె. శనైశ్చ రుడు ఆమె మూడవ సంతానము, తపతీ సంవరణుని భార్య ఆయెను, వడ వ పుత్రులు అశ్వినీ దేవతలు.

అష్టమేఽoతర ఆయాతే సావర్ణిర్భవితా మనుః

 నిర్మోకవిరజస్కాద్యాసావర్ణితనయా నృప

ఓ మహారాజా! ఎనిమిదవ మన్వంతరములో సావర్ణి మనువు కాగ లడు. నిర్మోకుడు, విరజస్కుడు, అర్వవీరుడు మొదలగువారు సావర్ణి యొక్క పుత్రులు కాగలరు.

తత్ర దేవాస్సుతపసో విరజా అమృతప్రభాః

తేషాం విరోచనసుతో బలిరింద్రో భవిష్యతి

ఆ మన్వంతరములో సుతపసులు, విరజులు, అమృతప్రభలు అనే గణములు దేవతలు కాగా, వారికి విరోచనుని పుత్రుడగు బలి ఇంద్రుడు కాగలడు.

దత్త్వేమాం యాచమానాయ విష్ణవే యః పదత్రయమ్

రాద్ధమింద్రపదం హిత్వా తతస్సిద్ధిమవాప్స్యతి  

మూడు అడుగులను యాచించే విష్ణువునకు ఆ బలి ఈ భూమిని దానము చేసి, తనకు లభించిన ఇంద్రపదవిని విడిచిపెట్టి, తరువాత ఆయన మోక్షమును పొందగలడు.

యోऽసౌ భగవతా బద్దః ప్రీతేన సుతలే పునః

 నివేశితోఽధికే స్వర్గాదధునాఽఽస్తే స్వరాడివ

ఒకప్పుడు బలిని శ్రీహరి భగవానుడు బంధించెను. కాని, ఆత నిపై ప్రసన్నుడైన భగవానుడు ఆతనిని స్వర్గముకంటె గొప్పదియగు సుత లమునందు ఉంచెను. ఆతడు ఇప్పటికీ అక్కడనే ఇంద్రుడు వలె ఉన్నాడు.

గాలవో దీప్తిమాన్ రామో ద్రోణపుత్రః కృపస్తథా

 ఋష్యశృంగః పితాస్మాకం భగవాన్ బాదరాయణః

  ఇమే సప్తర్షయస్తత్ర భవిష్యంతి స్వయోగతః

 ఇదానీమాసతే రాజన్ స్వే స్వ ఆశ్రమమండలే

ఓ మహారాజా! ఆ మన్వంతరమునందు గలవుడు, దీప్తిమంతు డు, పరశురాముడు, ద్రోణాచార్యుని పుత్రుడగు అశ్వత్థామ, కృపాచార్యు డు, ఋష్యశృంగుడు, మా తండ్రి పూజనీయుడు అగు బాదరాయణ వ్యాసుడు అనువారలు సప్తర్షులు కాగలరు. వీరు ఇప్పుడు తమ యోగశ క్తిచే తమ తమ ఆశ్రమస్థానములయందు ఉన్నారు.

దేవగుహ్యాత్సరస్వత్యాం సార్వభౌమ ఇతి ప్రభుః

స్థానం పురందరాద్ధృత్వా బలయే దాస్యతీశ్వరః

శ్రీహరి ప్రభుడు దేవగుహ్యుడు, సరస్వతి అనే దంపతులకు పుత్రుడై సార్వభౌముడు అనే పేరుతో ప్రసిద్ది గాంచును. ఆ ప్రభుడు పురం దరుడనే ఇంద్రుని వద్దనుండి స్వర్గస్థానమును లాగుకొని బలి చక్రవర్తికి ఈయగలడు.

నవమో దక్షసావర్ణిర్మనుర్వరుణసంభవః

 భూతకేతుర్దీప్తికేతురిత్యాద్యాస్తత్సుతా నృప

             ఓ మహారాజా! వరుణుని పుత్రుడగు దక్షసావర్ణి తొమ్మిదవ మనువు కాగలడు. భూతకేతువు, దీప్తికేతువు, పంచహోత్రుడు మొదలగు వారు ఆయన పుత్రులు కాగలరు.

పారా మరీచిగర్భాద్యా దేవా ఇంద్రోఽద్భుతస్స్మృతః

ద్యుతిమత్ప్రముఖాస్తత్ర భవిష్యంత్యృషయస్తతః

ఆ మన్వంతరమునందు పారులు, మరీచిగర్బులు, సుధర్ములు మొదలగువారు దేవతలు కాగా, అద్బుతుడు ఇంద్రుడు కాగలడు. ద్యుతి మంతుడు, మేధాతిథి మొదలగువారు సప్తర్షులు కాగలరు.

ఆయుష్మతోఽoబుధారాణామృషభో భగవత్కలా

 భవితా యేన సంరాద్ధాం త్రిలోకీం భోక్ష్యతేఽద్భుతః  

శ్రీహరి భగవానుడు ఆయుష్మంతునకు అంబుధారయందు ఋష భుడు అనే పేరుతో అవతరించగలడు. ఆయన ముల్లోకములను స్వాధీ నము చేసుకొని ఈయగా, అద్బుతుడు వాటిని భోగించగలడు.

దశమో బ్రహ్మసావర్ణిరుపశ్లోకసుతో మహాన్

 తత్సుతా భూరి షేణాద్యా హవిష్మత్ప్రముఖా ద్విజాః

ఉపశ్లోకుని పుత్రుడు, మహాత్ముడు అగు బ్రహ్మసావర్ణి పదవ మనువు కాగలడు. భూరి షేణుడు, సుక్షేత్రుడు మొదలగువారు ఆయన పుత్రులు కాగలరు. హవిష్మంతుడు మొదలగువారు సప్తర్షులు కాగలరు.

హవిష్మాన్ సుకృతిస్సత్యో జయో మూర్తిస్తదా ద్విజాః

సువాసనవిరుద్ధాద్యా దేవాశ్శంభుస్సు రేశ్వరః

హవిష్మంతుడు, సుకృతి, సత్యుడు, జయుడు, మూర్తి, అప్రతి ముడు మొదలగువారు సప్తర్షులు కాగా, సువాసనులు, విరుద్ధులు, సుఖులు మొదలగువారు దేవతలు మరియు శంభుడు దేవేంద్రుడు కాగలరు.

విష్వక్సేనో విషూచ్యాం తు శంభోస్సఖ్యం కరిష్యతి

 జాతస్స్వాం శేన భగవాన్ గృహే విశ్వసృజో విభుః

భగవానుడగు శ్రీహరి ప్రభుడు విశ్వసృజ్, విషూచి అనే దంపతు లకు తన అంశచే విష్వక్సేనుడు అనే పేరుతో జన్మించి, శంభుడనే ఇంద్రు నితో మైత్రిని నేరపగలడు.

మనుర్వై ధర్మసావర్ణి రేకాదశమ ఆత్మవాన్

 అనాగతాస్తత్సుతాశ్చ సత్యధర్మాదయో దశ

             జితేంద్రియుడగు ధర్మసావర్ణి పదకొండవ మనువు కాగలడు. ఆయనకు సత్యధర్ముడు, క్షేమధన్వ మొదలగు పదిమంది పుత్రులు కలుగ గలరు.

విహంగమాః కామగమా నిర్వాణరుచయస్పురాః

 ఇంద్రశ్చ వైధృత స్తేషామృషయశ్చారుణాదయః

ఆ మన్వంతరమునందు విహంగములు, కామగములు, నిర్వాణ రుచులు అనే దేవగణములు ఉండెదరు. వారికి వైధృతుడు ఇంద్రుడు కాగ లడు. అరుణుడు, హవిష్మంతుడు మొదలగువారు సప్తర్షులు కాగలరు.

ఆర్యకస్య సుతస్తత్ర ధర్మ సేతురితి స్మృతః

 వైధృతాయాం హరేరంశస్త్రీలోకీం ధారయిష్యతి

ఆ మన్వంతరములో శ్రీహరి ఆర్యకునకు వైధృతయందు ధర్మసే తువు అనే పేరుతో అంశయై జన్మించి, ముల్లోకములను కాపాడగలడు.

భవితా రుద్రసావర్ణీ రాజన్ ద్వాదశమో మనుః

 దేవవానుపదేవశ్చ దేవశ్రేష్ఠాదయస్సుతాః  

ఓ మహారాజా! రుద్రసావర్ణి పన్నెండవ మనువు కాగలడు. ఆయనకు దేవవంతుడు, ఉపదేవుడు, దేవశ్రేష్ఠుడు, విదూరథుడు మొదలగు వారు పుత్రులు కాగలరు.

ఋతధామా చ తత్రేంద్రో దేవాశ్చ హరితాదయః

 ఋషయశ్చ తపోమూర్తీస్తపస్వ్యాగ్నీధ్రకాదయః

ఆ మన్వంతరమునందు ఋతధాముడు ఇంద్రుడు కాగా, హరి తులు, సుధర్ములు మొదలగువారు దేవగణములు కాగలరు. తపోమూర్తి, తపస్వి, ఆగ్నీధ్రకుడు, ద్యుతి మొదలగువారు సప్తర్షులు కాగలరు.

స్వధామాఖ్యో హరేరంశస్సాధయిష్యతి తన్మనోః

 అంతరం సత్యసహసస్సూనృతాయాస్సుతో విభుః

శ్రీహరి ప్రభుడు సత్యసహసునకు సూనృతయందు స్వధాముడు అనే అంశయై జన్మించి, ఆ మన్వంతరమును రక్షించగలడు.

మనుస్త్రయోదశో భావ్యో దేవసావర్ణిరాత్మవాన్

 చిత్ర సేనవిచిత్రాద్యా దేవసావర్ణిదేహజాః

జితేంద్రియుడగు దేవసావర్ణి పదమూడవ మనువు కాగలడు. ఆయనకు చిత్రసేనుడు, విచిత్రుడు, నయతి మొదలగు పుత్రులు కలుగగలరు.

దేవాస్సుకర్మసుత్రామసంజ్ఞా ఇంద్రో దివస్పతిః

 నిర్మోకతత్త్వదర్శాద్యా భవిష్యంత్యృషయస్తదా

ఆ మన్వంతరమునందు సుకర్ములు, సుత్రాములు అనువారు దేవ గణములు కాగా, దివస్పతి ఇంద్రుడు కాగలడు. నిర్మోకుడు, తత్త్వద ర్శుడు, ధృతిమంతుడు మొదలగువారు సప్తర్షులు కాగలరు.

దేవహోత్రస్య తనయ ఉపహర్తా దివస్పతేః

 యోగేశ్వరో హరేరంశో బృహత్యాం సంభవిష్యతి

శ్రీహరి దేవహోత్రునకు బృహతియందు యోగేశ్వరుడు అనే పేరుతో అంశమై జన్మించి, దివస్పతి అనే ఇంద్రునకు ముల్లోకములను సంపాదించి పెట్టగలడు.

మనుర్వా ఇంద్రసావర్ణిశ్చతుర్దశమ ఏష్యతి

ఉరుగంభీరబుద్ధ్యాద్యా ఇంద్రసావర్ణివీర్యజాః

ఇంద్రసావర్ణి పదునాల్గవ మనువు కాగలడు. ఆయనకు ఉరువు, గంభీరబుద్ధి, భరతుడు మొదలగు పుత్రులు కలుగగలరు.

పవిత్రాశ్చాక్షుషా దేవాశ్శుచిరింద్రో భవిష్యతి

 అగ్నిర్బాహుశ్శుచిశ్శుద్ధో మాగధాద్యాస్తపస్వినః

పవిత్రులు, చాక్షుషులు దేవగణములు కాగా, శుచి ఇంద్రుడు కాగ లడు. అగ్ని, బాహువు, శుచి, శుద్ధుడు, మాగధుడు, ఆగ్నీధ్రుడు మొదలగు వారు సప్తర్షులు కాగలరు.

సత్రాయణస్య తనయో బృహద్భానుస్తదా హరిః

 వితానాయాం మహారాజ క్రియాతంతూన్ వితాయితా

ఓ మహారాజా! ఆ మన్వంతరమునందు శ్రీహరి సత్రాయణునకు వితానయందు బృహద్భానువు అనే పుత్రుడై జన్మించి, వేదోక్తకర్మల పరం పరను విస్తరింప జేయగలడు.

రాజంశ్చతుర్ధ శైతాని త్రికాలానుగతాని తే

ప్రోక్తాన్యేభిర్మితః కల్పో యుగసాహస్రపర్యయః

 ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే భావి

 మన్వంతర వర్ణనం నామ త్రయోదశోఽధ్యాయః

ఓ మహారాజా! నేను నీకు గడచినవి, నడచుచున్నది మరియు రాబోవునవి అగు పదునాల్గు మన్వంతరములను గురించి చెప్పితిని. వేయి మహాయుగమలు ఒక కల్పము అగును. ఈ విధముగా కాలచక్రముయొక్క అవయవమైన కల్పములో పదునాల్గు మన్వంతరముల కాలము ఉండును.

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో భావి మన్వంతరములను వర్ణించే పదమూడవ అధ్యాయము ముగిసినది .