11 - సముద్ర మథనము - ఇంద్రుడు నముచిని సంహరించుట

శ్రీశుక ఉవాచ ।

 అథో సురాః ప్రత్యుపలబ్దచేతసః

పరస్య పుంసః పరయానుకంపయా ।

 జఘ్నుర్బృశం శక్రసమీరణాదయః

తాంస్తాన్ రణే యైరభిసంహతాః పురా ॥

ఇదివరలో దేవతలు రాక్షసుల చేతిలో దెబ్బలను తినియున్నారు. కానీ ఇప్పుడు పురుషోత్తముని సర్వాతీశాయియగు దయచే వారి మనస్సు లలోని ధైర్యము రాక్షసుల మాయచే వీగి పోలేదు. అప్పుడు ఇంద్రుడు, వాయువు, అగ్ని మొదలగు దేవతలు ఆ రాక్షసులను యుద్ధములో గట్టిగా దెబ్బ తీసిరి.

వైరోచనాయ సంరభో భగవాన్ పాకశాసనః ।

 ఉదయచ్ఛద్యదా వజ్రం ప్రజా హా హేతి చుక్రుశుః ॥

పూజనీయుడు, పాకాసురుని సంహరించినవాడు అగు ఇంద్రుడు విరోచన పుత్రుడగు బలిపై కోపించి వజ్రమును పైకి ఎత్తగా, ప్రజలు అయ్యో అయ్యో! అంటూ ఆక్రోశించిరి.

వజ్రపాణిస్తమా హేదం తిరస్కృత్య పురఃస్థితమ్ ।

 మనస్వినం సుసంపన్నం విచరంతం మహామృధే ॥

ధైర్యశాలియగు విరోచనుడు యుద్ధసామగ్రిని నిండా ఉంచుకొని, ఆ గొప్ప యుద్ధములో అంతటా సంచరిస్తూ యుద్దమును చేయుచుండె ను. ఆయన తన ముందుకు రాగానే ఇంద్రుడు వజ్రము చేతబట్టి తిరస్కార పూర్వకముగా ఆయనతో ఇట్లు పలికెను.

నటవన్మూఢ మాయాభిర్మాయేశాన్నో జిగీషసి ।

 జిత్వా బాలాన్నిబద్ధాక్షాన్నటో హరతి తద్ధనమ్ ॥

ఓరీ మూర్ఖ! నటుడు పిల్లలను మంచి మాటలతో వశము చేసు కొని, వారి కళ్లకు గంతలు కట్టి వారి వద్ద ఉండే సొమ్మును అపహరించును. నీవు కూడ అదే విధముగా మాయలతో మమ్ములను జయించ గోరుచున్నావు. కాని, మేము మాయలకు అధిపతులము.

ఆరురుక్షంతి మాయాభిరుత్సిసృప్సంతి యే దివమ్ ।

 తాన్ దస్యూన్ విధునోమ్యజ్ఞాన్ పూర్వస్మాచ్చ పదాదధ: ॥

ఎవరైతే మాయలతో స్వర్గమును చేరాలని గాని, స్వర్గమును దాటి పై లోకములకు వెళ్లాలని గాని కోరెదరో, వారు మూర్ఖులైన చోరులు. వారిని నేను ఇదివరలో ఉన్న స్థానముకంటె కూడ క్రిందకు పడ గొట్టెదను.

సోऽహం దుర్మాయిన స్తేఽద్య వజ్రేణ శతపర్వణా ।

 శిరో హరిష్యే మందాత్మన్ ఘటస్వ జ్ఞాతిభిస్సహ ॥

             ఓరీ మందబుద్దీ! చెడ్డ మాయలను చేసే నీ తలను అట్టి నేను ఇప్పుడే వంద కణుపుల వజ్రముతో ఊడగొట్టెదను. నీవు నీ బంధువులతో గూడి కాసుకొనుము.

బలిరువాచ ।

 సంగ్రామే వర్తమానానాం కాలచోదితకర్మణామ్ ।

 కీర్తిర్జయోఽజయో మృత్యుస్సర్వేషాం స్యురనుక్రమాత్ ॥

బలి ఇట్లు పలికెను --- కాలముచే ప్రేరితులై కర్మలను చేస్తూ యుద్ధమును చేయుచున్నవారందరికి కీర్తి, జయము, అపజయము, మర ణము వరుసగా కలుగుచునే యుండును. 

తదిదం కాలరశనం జనాః పశ్యంతి సూరయః ।

 న హృష్యంతి న శోచంతి తత్ర యూయమపండితాః ॥

ఆ ఈ జయాపజయములు, కీర్తి-అపకీర్తులను కాలము నియం త్రించును. ఈ విషయము తెలిసిన వివేకవంతులు మంచికి హర్షముతో గెంతులు వేయరు; చెడుకు శోకముతో క్రుంగిపోరు. కాని, మీరు ఈ వివే కము గలవారు కారు.

న వయం మన్యమానానామాత్మానం తత్ర సాధనమ్ ।

 గిరో వస్సాధుశోచ్యానాం గృహ్ణీమో మర్మతాడనాః ॥

జయాపజయములకు కర్తలము మేమే అని మీరు తలపోయుచుం దురు. మీ అజ్ఞానమునకు సత్పురుషులు మీపై జాలి పడెదరు. అట్టి మీపై హృదయములో గాయమును చేసే నిందావాక్యములను ప్రయోగించుట మాకు సమ్మతము కాదు.

శ్రీశుక ఉవాచ ।

 ఇత్యాక్షిప్య విభుం వీరో నారాచైర్వీరమర్దనః ।

 ఆకర్ణపూర్ణైరహనదాక్షేపైరాహతం పునః ॥

బలి వీరులను సంహరించే వీరుడు. ఆయన ఈ విధముగా ఇంద్రు నకు ఆక్షేప వచనములచే దుఃఖమును కలిగించెను. అంతేగాక, నారిని చెవి వరకు లాగి విడిచిన బాణములతో ఆయన ఇంద్రుని కొట్టెను.

ఏవం నిరాకృతో దేవో వైరిణా తథ్యవాదినా ।

 నామృష్యత్తదధిక్షేపం తోత్రాహత ఇవ ద్విపః ॥

బలి ఈ విధముగా సత్యమును పలికి తిరస్కరించగా, దేవేంద్రుడు అంకుశముచే పొడవబడిన ఏనుగు వలె ఆ బలియొక్క ఆక్షేప వచనమును సహించ లేకపోయెను.

ప్రాహరత్కులిశం తస్మా అమోఘం పరమర్దనః ।

సయానో న్యపతద్భూమౌ ఛిన్నపక్ష ఇవాచలః ॥

శత్రుసంహారకుడగు ఇంద్రుడు మొక్కవోని వజ్రముతో ఆ బలిని కొట్టగా, ఆయన విమానముతో బాటుగా రెక్కలు తెగగొట్టబడిన పర్వతము వలే నేలపై కుప్పకూలేను.

సఖాయం పతితం దృష్ట్వా జంభో బలిసఖస్సుహృత్ ।

అభ్యయత్సౌహృదం సఖ్యుర్హతస్యాపి సమాచరన్ ॥

జంభాసురుడు బలికి మిత్రుడు, హితకారి. ఆయన క్రింద బడిన తన మిత్రుని చూచెను. తన మిత్రుడు హతుడైననూ ఆయనకు హితమునే చేయువాడై ఆ జంభుడు ఇంద్రుని ఎదుటికి వచ్చెను.

స సింహవాహ ఆసాద్య గదాముద్యమ్య రంహసా ।

 జత్రావతాడయచ్ఛక్రం గజం చ సుమహాబలః ॥ 

మహాబలిశాలియగు ఆ జంభాసురుడు సింహవాహనముపై ఇంద్రుని దగ్గరకు వచ్చి వేగముగా గదను పైకెత్తి కొంకులపై కొట్టెను. ఆతడు ఐరావతమును కూడ కొట్టెను.

గదాప్రహారవ్యథితో భృశం విహ్వలితో గజః ।

జానుభ్యాం ధరణీం స్పృష్ట్వా కశ్మలం పరమం యయౌ ॥

గద దెబ్బచే పీడను పొందిన ఆ ఏనుగు పూర్తిగా స్వాధీనత తప్పి రెండు మోకాళ్లపై నేలపై గూలిపోయెను. అది అప్పుడు చాల ఎక్కువ సేపు మూర్ఛను పొందెను.

తతో రథో మాతలినా హరిభిర్దశశతైర్వృతః ।

 ఆనీతో ద్విపముత్సృజ్య రథమారురు హే విభుః ॥ 

అప్పుడు మాతలి వేయి గుర్రములను పూన్చిన రథమును తీసు కురాగా, దేవేంద్రుడు ఏనుగును విడిచి పెట్టి ఆ రథము పై ఎక్కెను.

తస్య తత్పూజయన్ కర్మ యంతుర్దానవసత్తమః ।

 శూలేన జ్వలతా తం తు స్మయమానోఽహనన్మృధే ॥

రాక్షసశ్రేష్ఠుడగు జంభుడు ఆ సారథి యుద్ధములో చేసిన పనిని అభినందించెను. అపుడాతడు చిరునవ్వు నవ్వుతూ ఆ సారథిని మాత్రము మండే శూలముతో కొట్టెను.

సే హే రుజం సుదుర్మర్షాం సత్త్వమాలంబ్య మాతలిః ।

 ఇంద్రో జంభస్య సంక్రుద్ధో వజ్రేణాపాహరచ్ఛిరః ॥

మాతలి ధైర్యమును చిక్కబట్టి మిక్కిలి సహించ శక్యము కాని ఆ నొప్పిని సహించెను. ఇంద్రుడు జంభునిపై చాల కోపించి, వజ్రముతో వాని తలను నరికి వేసెను.

జంభం శ్రుత్వా హతం తస్య జ్ఞాతయో నారదాదృషేః ।

 నముచిశ్చ బలః పాకస్తత్రాపేతుస్త్వరాన్వితాః ॥ 

జంభుడు హతుడైనాడని నారద మహర్షి చెప్పగా విని, వాని బంధువులైన నముచి, బలుడు, పాకుడు వేగముగా ఆ స్థానమునకు వచ్చి పడిరి.

వచోభిః పరుషైరింద్రమర్ధయంతోఽస్య మర్మసు ।

శరైరవాకిరన్మేఘా ధారాభిరివ పర్వతమ్ ॥ 

ఆ ముగ్గురు మర్మస్పర్శియగు పరుషవాక్యములతో ఆ ఇంద్రు నకు పీడను కలిగిస్తూ, మేఘములు పర్వతముపై వర్షధారలను వలె, ఆత నిపై బాణములను వర్షించిరి.

హరీన్దశశతాన్యాజౌ హర్యశ్వస్య బలశ్శరైః ।

తావద్భిరర్దయామాస యుగపల్లఘుహస్తవాన్ ॥

 బలుడు అలవోకగా పెద్ద సంఖ్యలో బాణములను విడువగలిగే నైపుణ్యము గలవాడు. ఆతడు యుద్ధములో ఇంద్రుని వేయి గుర్రములపై వేయి బాణములను ఒకే సారి ప్రయోగించి వాటికి పీడను కలిగించెను.

శతాభ్యాం మాతలిం పాకో రథం సావయవం పృథక్ ।

సకృత్సంధానమోక్షేణ తదద్భుతమభూద్రణే ॥

పాకుడు ఒకే సారి రెండు వందల బాణములను సంధానము చేసి వందతో మాతలివి, వందతో రథముయొక్క ప్రతి అంగమును కొట్టెను. అది యుద్ధములో ఆశ్చర్యము ఆయెను.

నముచిః పంచదశభిస్స్వర్ణపుంఖైర్మ హేషుభిః ।

 ఆహత్య వ్యనదత్సంఖ్యే సతోయ ఇవ తోయదః ॥

నముచి యుద్దమునందు బంగరు క్రింది భాగములు గల పది హేను గొప్ప బాణములతో ఇంద్రుని కొట్టి, నీటితో నిండిన మేఘము వలె, గర్జించెను.

సర్వతశ్శరకూటేన శక్రం సరథసారథిమ్ ।

ఛాదయామాసురసురాః ప్రావృట్సూర్యమివాంబుదాః ॥ 

రాక్షసులు ఇంద్రుని, ఆతని రథమును, దాని సారథిని బాణముల సమూహముతో అన్ని వైపులా, వర్షాకాలమునందలి సూర్యుని మేఘములు వలె, కప్పివేసిరి.

అలక్షయంతస్తమతీవ విహ్వలా విచుక్రుశుర్దేవగణాస్సహానుగాః,

అనాయకాశ్శత్రుబలేన నిర్జితా వణిక్పథో భిన్ననవో యథార్ణవే।

శత్రువులను రాక్షసులచే జయించబడిన దేవగణములు వారి అను చరులతో బాటుగా ఆక్రోశించిరి. వారికి ఇంద్రుడు కానరాలేదు. నాయకుడు లేని ఆ దేవతలు, సముద్రమధ్యములో నావ పగిలిన వర్తకులు వలె, చాల ఆదుర్దాను చెందిరి. -

తతస్తురాషాడిషుబద్దపంజరాత్

 వినిర్గతస్సాశ్వరథధ్వజాగ్రణీః ।

 బభౌ దిశః ఖం పృథివీం చ రోచయన్

స్వతేజసా సూర్య ఇవ క్షపాత్యయే ॥

అప్పుడు గుర్రములు, జెండా, సారథి, రథములతో బాటుగా ఇంద్రుడు బాణములచే కట్టబడిన పంజరమునుండి బయట పడెను. అపు డాయన రాత్రి గడచిపోగా సూర్యుడు వలె తన తేజస్సుతో దిక్కులను, ఆకాశమును. భూమినీ కూడ ప్రకాశింప జేయుచుండెను.

నిరీక్ష్య పృతనాం దేవః పరైరభ్యర్దితాం రణే ।

ఉదయచ్ఛద్రిపుం హంతుం వజ్రం వజ్రధరో రుషా ॥

వజ్రధారియగు దేవేంద్రుడు యుద్ధమునందు శత్రువులు తన సైన్యమును పీడించుటను చూచెను. ఆయన కోపముతో శత్రువును సంహీ రించుట కొరకై వజ్రమును పైకెత్తెను.

స తేనైవాష్టధారేణ శిరసీ బలపాకయోః ।

జ్ఞాతీనాం పశ్యతాం రాజన్ జహార జనయన్ భయమ్ ॥

ఓ మహారాజా! ఆ ఇంద్రుడు ఎనిమిది ధారలు గల ఆ వజ్రము తోనే బలాసుర పాకాసురులయొక్క తలలను వారి బంధువులు చూచు చుండగా నరికెను. ఆ బంధువులు చాల భయపడిరి.

నముచిస్తద్వధం దృష్ట్వా శోకామర్షరుషాన్వితః ।

 జిఘాంసురింద్రం నృపతే చకార పరమోద్యమమ్ ॥

ఓ మహారాజా! వారిద్దరి వధను చూచిన నముచికి శోకము, అస హనము, కోపము కలిగెను. ఆతడు ఇంద్రుని చంప గోరి, చాల పెద్ద ప్రయ త్నమును చేసెను.

అశ్మసారమయం శూలం ఘంటావద్ధేమభూషణమ్ ।

 ప్రగృహ్యాభ్యద్రవత్క్రుద్ధో హతోఽసీతి వితర్జయన్ ।

 ప్రాహిణోద్దేవరాజాయ నినదన్మృగరాడీవ ॥

నముచి కోపించి మృగేంద్రుడగు సింహము వలె నినదిస్తూ, లోహ ముతో చేసిన శూలమును గట్టిగా పట్టుకొని దేవరాజగు ఇంద్రుని మీదకు పరుగెత్తాను. ఇదిగో! నీవు చచ్చితివి, అంటూ ఆతడు ఇంద్రుని అధికముగా బెదిరిస్తూ గంటలు, బంగరు ఆభరణములు ఉన్న ఆ శూలమును ఇంద్రుని పైకి విసిరేను.

తదాపతద్గగనతలే మహాజవం

విచిచ్ఛిదే హరిరిషుభిస్సహస్రధా ।

 తమాహనన్నృప కులిశేన కంధరే

రుషాన్వితస్త్రిదశపతిశ్శిరో హరన్ ॥ 

ఓ మహారాజా! ఆకాశతలమునందు మహావేగముగా వచ్చి పడు చున్న ఆ శూలమును ఇంద్రుడు బాణములతో వేయి ముక్కలుగా ఖండిం చేను. కోపమును పొందియున్న దేవరాజు అపుడు ఆ నముచి తలను నరు కగోరి వజ్రముతో వాని మెడపై కొట్టెను.

న తస్య హి త్వచమపి వజ్ర ఊర్జితో

బిభేద యస్పురపతినౌజ సేరితః ।

తదద్భుతం పరమతివీర్యవృత్రభిత్

తిరస్కృతో నముచిశిరోధరత్వచా ॥

బలము గల ఆ వజ్రమును దేవేంద్రుడు బలముగా ప్రయోగించే ను. అయిననూ, అది నముచియొక్క చర్మమును కూడ ఊడగొట్టలేకపో యెను. అది గొప్ప ఆశ్చర్యము! మహాపరాక్రమశాలియగు వృత్రుని సంహ రించిన ఇంద్రుని నముచి మెడపై చర్మము తిరస్కారమునకు గురిచేసెను.

తస్మాదిండ్ద్రోఽబిభేచ్చతోర్వజః ప్రతిహతో యతః ।

 కిమిదం దైవయోగేన భూతం లోకవిమోహనమ్ ॥

తన వజ్రమును నిర్వీర్యము చేసిన నముచి అనే ఆ శత్రువు వలన ఇంద్రుడు భయపడెను. దైవముయొక్క ఘటన ఇట్లున్నదేమి? ప్రాణులకు విశేషమగు మోహమును కలిగించే ఘటన ఇట్లు ఏల ఘటిల్లినది? అని ఆయన తలపో పెను.

యేన మే పూర్వముద్రీణాం పక్షచ్ఛేదః ప్రజాత్యయే ।

 కృతో నివిశతాం భారైః పతత్రైః పతతాం భువి ॥

 పూర్వము పర్వతములకు రెక్కలుండెడివి. అవి ఇటునటు ఎగు రుతూ నేలపై వాలినప్పుడు ఆ భారముచే ప్రజలు నశించెడివారు. ఆ స్థితిలో నేను ఇదే వజ్రముతో వాటి రెక్కలను నరికితిని.

తపస్సారమయం త్వాష్ట్రం వృత్రీ యేన విపాటితః ।

 అన్యే చాపి బలో పేతాస్సర్వాస్రైరక్షయత్వచః ॥

త్వష్టయొక్క మహాప్రభావశాలియగు తపస్సే వృత్రాసురుడైనది. అట్టి వృత్రుడు మాత్రమే గాక, సకలములైన అస్త్రములచే చెక్కు చెదరని చర్మము గల ఇతరులైన బలశాలురు కూడ ఈ వజ్రముచే చీల్చి వేయబడి నారు.

సోఽయం ప్రతిహతో వజ్రో మయా ముక్తోఽసురేఽల్పకే ।

నాహం తదాదదే దండం బ్రహ్మతేజోఽ       ప్యకారణమ్ ॥

అల్పుడైన రాక్షసునిపై నేను ప్రయోగించిన అట్టి ఈ వజ్రము నిర్వీర్యమైనది. ఇది బ్రహ్మవేత్తయగు దధీచియొక్క తేజస్సే అయిననూ, ఈనాడు ఇది కట్టెవలె నిరర్థకము. కావున, నేను దీనిని స్వీకరించను.

ఇతి శక్రం విషీదంతమాహ వాగశరీరిణీ ।

 నాయం శుష్కైరథో నార్ద్రైర్వధమర్హతి దానవః ॥

ఈ విధముగా ఖేదమును పొందియున్న ఇంద్రుని ఉద్దేశించి ఆకాశ వాణి ఇట్లు పలికెను -- ఈ రాక్షసుని పొడి వస్తువులతో గాని, తడి వస్తువు లతో గాని సంహరించుట సంభవము కాదు.

మయాస్మై యద్వరో దత్తో మృత్యుర్నైవార్ద్రశుష్కయోః ।

 అతోఽన్యశ్చింతనీయస్తే ఉపాయో మఘవన్ రిపోః ॥

వీనికి తడి గాని, పొడి గాని అయిన వస్తువులచే మరణము కలు గనే కలుగదని నేను వరము నిచ్చితిని. కావున, నీవు వీని సంహారము కొరకై మరియొక ఉపాయమును ఆలోచించుము.

తాం దైవీం గిరమాకర్ణ్య మఘవాన్ సుసమాహితః ।

 ధ్యాయన్ ఫేనమథాపశ్యదుపాయముభయాత్మకమ్ ॥

పరమేశ్వరునియొక్క ఆ ఆకాశవాణిని విని ఇంద్రుడు మిక్కిలి ఏకాగ్రమగు చిత్తముతో ధ్యానించెను. అపుడు ఆతనికి నురగ తడి మరియు పొడి అనే రెండు లక్షణములు కలదిగా తోచెను.

న శుషేణ న చార్ద్రేణ జహార నముచేశ్శిరః ।

 తం తుష్టువుర్మునిగణా మాల్యైశ్చావాకిరన్ విభుమ్ ॥

ఇంద్రుడు తడి మరియు పొడి కూడ కాని నురగతో నముచి తలను తొలగించేను. అపుడు మహర్షుల గణములు స్వర్గాధిపతియగు ఆ ఇంద్రుని స్తుతించి, పుష్పములను వర్షించిరి.

గంధర్వముఖ్యౌ జగతుర్విశ్వావసుపరావసూ ।

దేవదుందుభయో నేదుర్నర్తక్యో ననృతుర్ముదా ॥

గంధర్వశ్రేష్టులగు విశ్వావసువు పరావసువు గానము చేసిరి. దేవ తల దుందుభులు మ్రోగినవి. అప్సరసలు ఆనందముతో నాట్యమాడిరి.

అన్యేऽప్యేవం ప్రతిద్వంద్వాన్ వాయ్వగ్నివరుణాదయః ।

సూదయామాసురస్త్రౌఘైర్మృగాన్ కేసరిణో యథా ॥

వాయువు, అగ్ని, వరుణుడు, యముడు మొదలైన ఇతర దేవతలు కూడ తమతో ద్వంద్వయుద్ధమును చేయుచున్న శత్రువులను ఇదే విధముగా అస్త్రముల సమూహములను ప్రయోగించి, లేళ్లను సింహములు వలె, సంహరించిరి.

బ్రహ్మణా ప్రేషితో దేవాన్ దేవర్షిర్నారో నృప ।

వారయామాస విబుధాన్ దృష్ట్వా దానవసంక్షయమ్ ॥

ఓ మహారాజా! రాక్షసులు పూర్తిగా నశించిపోయే పరిస్థితిని చూచి బ్రహ్మగారు దేవర్షియగు నారదుని పంపించెను. ఆయన వచ్చి దేవతలను, వారి అనుచరులగు గంధర్వాదులను రాక్షససంహారమునుండి విరమింపజేసెను.

నారద ఉవాచ ।

భవద్భిరమృతం ప్రాప్తం నారాయణభుజాశ్రయైః ।

 శ్రియా సమేధితాస్సర్వ ఉపారమత విగ్రహాత్ ॥

నారదుడిట్లు పలికెను --- నారాయణుని భుజములను ఆశ్రయిం చిన మీకు అమృతము దక్కినది. మిమ్ములనందరిని లక్ష్మీదేవి చక్కగా వర్దిల్ల జేసినది. కావున, మీరు కలహమునుండి విరమించుడు.

శ్రీశుక ఉవాచ ।

 సంయమ్య మన్యుసంరంభం మానయంతో మునేర్వచః । ఉపగీయమానానుచరైర్యయుస్సర్వే త్రివిష్టపమ్ ॥

దేవతలందరు కోపోద్రేకమును నియంత్రించుకొని నారద మహర్షి మాటను మన్నించిరి. వారు తమ కీర్తిని గానము చేసే అనుచరులతో కూడి స్వర్గమునకు వెళ్లిరి.

యేऽవశిష్టా రణే తస్మిన్నారదానుమతేన తే ।

 బలిం విపన్నమాదాయ అస్తం గిరిముపాగమన్ ॥

ఆ యుద్దమునందు ఏ రాక్షసులు మిగిలి యుండిరో, వారు నార దుని అనుమతితో మరణించిన బలిని తీసుకొని అస్తాచలమునకు వెళ్లిరి.

తత్రావినష్టావయవాన్ విద్యమానశిరోధరాన్ ।

 ఉశనా జీవయామాస సంజీవిన్యా స్వవిద్యయా ॥

ఆ యుద్ధములో అవయవములు పోకుండా మెడపై తల ఉన్న రాక్షసులను శుక్రాచార్యుడు తన సంజీవినీ విద్యతో మరల బ్రతికించెను.

బలిశ్చోశనసా స్పృష్టః ప్రత్యాపన్నేందీయస్మృతిః ।

పరాజితోఽపీ నాఖిద్యల్లోకతత్త్వవిచక్షణః ॥

 ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే

 సముద్రమథనే నముచివధవర్ణనం నామ ఏకాదశోऽధ్యాయః ॥

బలిని శుక్రాచార్యుడు స్పృశించగానే ఆయన తిరిగి బ్రతికెను. ఆయనకు ఇంద్రియశక్తులు, స్మరణము తిరిగి వచ్చెను. ఆయన యుద్ధ ములో పరాజయమును పొందినా, లోకస్వభావము బాగా తెలిసినవాడు గనుక, ఖేదమును పొందలేదు.

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో సముద్ర మథన వృత్తాంతములో ఇంద్రుడు నముచిని సంహరించుటను వర్ణించే పదకొండవ అధ్యాయము ముగిసినది.