2 - గజేంద్రోపాఖ్యానము - గజేంద్రుని మొసలి పట్టుకొనుట

శ్రీశుక ఉవాచ ।

ఆసిద్గిరివరో రాజంస్త్రికూట ఇతి విశ్రుతః ।

క్షీరోదేనావృతశీమాన్ యోజనాయుతముచ్ఛ్రితః ॥

             శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! త్రికూటము అని వినుతికెక్కిన అందమైన పర్వతము గలదు. పదివేల యోజనముల ఎత్తు గల ఆ పర్వతమును పాల సముద్రము చుట్టువారి యుండును.

తావతా విస్తృతః పర్యక్ త్రిభిశ్శృంగైః పయోనిధిమ్ ।

దిశః ఖం రోచయన్నా స్తే రౌప్యాయసహిరణ్మయైః ॥

దాని చుట్టు కొలత కూడ అంతే ఉండెను. దానికి వెండి, ఇనుము, బంగారముల మూడు శిఖరములు ఉండెను. అవి సముద్రమును, దిక్కుల ను, ఆకాశమును ప్రకాశింప జేసెను.

అన్యైశ్చ కకుభస్సర్వా రత్నధాతువిచిత్రితైః ।

నానాద్రుమలవాగుల్మైర్నిర్ఘో షెర్నిర్ఘరాంభసామ్ ॥

ఆ పర్వతముయొక్క ఇతరములగు శిఖరములు రత్నములతో మరియు గైరికాది ధాతువులతో వేర్వేరు రంగులను కలిగియున్నవి. వాటిపై ఉండే వివిధములైన చెట్లు, తీగలు, పొదలు, కొండకాలువల నీటి గలగలలు దిక్కులనన్నింటినీ ప్రకాశింప జేయుచుండెను.

స చావనిజ్యమానాంఘ్రిసమంతాత్పయఊర్మిభిః ।

కరోతి శ్యామలాం భూమిం హరిన్మరకతాశ్మభిః ॥

సముద్రతరంగములు ఆ పర్వతముయొక్క పాదభూములను అన్ని వైపులా ప్రక్షాళనము చేయుచుండును. పచ్చని మరకత మాణిక్య ములు పొదిగియున్న ఆ పర్వతముయొక్క రాళ్లు అచటి నేలను శ్యామల వర్ణము గలదిగా చేయుచున్నవి.

సిద్ధచారణగంధర్వవిద్యాధరమహోరగైః ।

కిన్న రైరప్సరోభిశ్చ క్రీడద్భిర్జుష్టకందరః ॥

సిద్దులు, చారణులు, గంధర్వులు, విద్యాధరులు, గొప్ప నాగులు, కిన్నరులు, అప్సరసలు కూడ ఆ పర్వతగుహలను సేవించుచుందురు.

యత్ర సంగీతసన్నా దైర్నదద్దుహమమర్షయా ।

అభిగర్జంతి హరయః శ్లాఘినః పరంకయా ॥

అచట సంగీతముయొక్క చక్కని ధ్వనులతో గుహలు ప్రతిధ్వనిం చగా, సింహములు తమకు ప్రతిపక్షులైన సింహములు గర్జించుచున్నవనే ఆశంకతో అటువైపు తిరిగి అసహనముగా గర్జించుచున్నవి. సింహముల ప్రతాపము లోకప్రసిద్ధమైనదే గదా!

నానారణ్యపశువ్రాతసంకులద్రోణ్యలంకృతః ।

చిత్రద్రుమసురోద్యానకలకంఠవిహంగమః ॥

ఆ పర్వతమునందలి లోయలు పలురకముల అడవి జంతువులతో రద్దీగా అందముగా నున్నవి. ఆ పర్వతమునందలి ఉద్యానములలో దేవ తలు సంచరించెదరు. అచటి రకరకముల చెట్లపై పక్షులు మధురముగా కూయుచుండును.

సరిత్సరోభిరచ్ఛోదైః పులినైర్మణివాలుకైః ।

దేవస్త్రిమజ్జనామోదసౌరభాంబ్వనిలైర్యుతః ॥

ఆ పర్వతమునందలి కొండ కాలువలలో మరియు సరస్సులలో స్వచ్చమగు నీరు గలదు. ఆ జలములలో దేవతాస్త్రీలు జలకాలాడుటచే ఆ జలములు, వాటి పైనుండి వీచే గాలులు పరిమళ భరితములై యుండు ను. అచటి సరస్సుల ఇసుక తిన్నెలు మణుల గుట్టల వలె ప్రకాశించును.

తస్య ద్రోణ్యాం భగవతో వరుణస్య మహాత్మనః ।

ఉద్యానమృతుమన్నామ ఆక్రీడం సురయోషితామ్ ॥

 సర్వతోకలంకృతం దివ్యైర్నిత్యం పుష్పఫలద్రుమైః ।

ఆ పర్వతపు లోయలో సర్వాత్మభావము గల వరుణ భగవానుని ఉద్యానము గలదు. ఋతుమత్ అని ప్రసిద్ధి గాంచిన ఆ ఉద్యానమునందు దేవతాస్త్రీలు విహరించుచుందురు. ఆ ఉద్యానము అంతటా అన్ని కాల ములలో దేవలోకమునకు చెందిన పుష్పములు, పళ్లు, చెట్లతో చాల శోభగా నుండును.

మందారైః పారిజాతైశ్చ పాటలాశోకచంపకైః ॥

చూతైః ప్రియాయైః పనసైరామైరావ్రతకైరపి ।

క్రముకైర్నాలికేరైశ్చ ఖర్జూరైరీజపూరకైః ॥

మధూకైస్సాలతాలైశ్చ తమాలైరసనార్జునైః ।

అరిష్ణోదుంబరప్లక్షేర్వటైః కింశుకచందనైః ।

పిచుమందైః కోవిదారైస్సరలైస్సురదారుభిః ।

ద్రాక్షేక్షురంభోజంబూభిర్భదర్యక్షాభయామలైః ॥

బిల్వైః కపిత్థైర్జంబీరైర్వృతో భల్లాతకాదిభిః ।

మందారములు, పారిజాతములు, కలిగొట్టు చెట్లు, అశోకవృక్షము లు, సంపెంగ చెట్లు, వివిధరకముల మామిళ్లు, రకరకముల ద్రాక్ష మొక్క లు, పనసలు, అంబాళపు చెట్లు, పోక చెట్లు, కొబ్బరి చెట్లు, ఖర్జూరపు చెట్లు, మాదీఫల వృక్షములు, ఇప్ప, మద్ది, తాటి, ఉలిమిరి, వేగిస, ఏరువు ద్ది, కుంకుడు, మేడి, జువ్వి, మర్రి, మానేరు, గంధము, వేము చెట్లు, రక్త కాంచన వృక్షములు, తెల్లతెగడ, దేవదారు, చెరుకు మొక్కలు, అరటి, నేరే డు, రేగు, తాండ్ర, వట్టివేరు, నేల ఉసిరి, మారేడు, వెలగ, నిమ్మ, జీడిమా మిడి మొదలగు చెట్లు ఆ పర్వతము పై గలవు.

తస్మిన్ సరస్సువిపులం లసత్కాంచనపంకజమ్ ॥

 కుముదోత్పలకహోరశతపత్రశ్రియోర్జితమ్ ।

మత్తషట్పదనిర్ఘుష్టం శకుంతైశ్చ కలస్వనైః ॥

             ఆ ఉద్యానములో మిక్కిలి విశాలమైన సరస్సు గలదు. దానిలో ప్రకాశించే బంగరు పద్మములు గలవు. అది తెల్ల కలువలు, నల్ల కలువలు, చెంగలువలు, తామర పువ్వుల శోభతో సంపన్నమై యుండెను. అది మధు రముగా కూసే పక్షులతో, మత్తెక్కిన తుమ్మెదలతో ప్రతిధ్వనించుచుండెను.

హంసరండవాకీర్ణం చక్రా హ్వైస్సారసైరపీ ।

జలకుక్కుటకోయష్టిదాత్యూహకులకూజితమ్ ॥

ఆ సరస్సు హంసలు, కారండవ పక్షులు, జక్కవ, బెగ్గురు పక్షులతో ఎడము లేకుండా నిండియుండెను. నీటి కోళ్లు, గ్రుడ్డి కొంగలు, భరత పక్షుల గుంపులతో ఆ సరస్సు ప్రతిధ్వనించుచుండెను.

మత్స్యకచ్చపసంచారచలత్పద్మరజఃపయః ।

కదంబవేతసనలనీపవంజులకైర్వృతమ్ ॥

చేపలు, తాబేళ్లు కదలుచుండగా పద్మములు కదిలి రాలిన పుప్పొడితో ఆ సరస్సులోని నీరు నిండియుండెను. కడిమి చెట్లు, నీటి ప్రబ్బలి చెట్లు, కిక్కన గడ్డి, మంకెన చెట్లు, తినాస చెట్లతో ఆ సరస్సు తీర ముల వెంబడి నిండి యుండెను.

కుందైః కురవకాశోకైశ్శిరీ షైః కుటజేంగుదైః ।

కుబ్జక్రైస్స్వర్ణయూథీభిర్నాగపున్నాగజాతిభిః ॥

 మల్లికాశతపత్రైశ్చ మాధవీజాలకాదిభిః ।

శోభితం తీరజైశ్చాన్యైర్నిత్యర్తుభిరలం ద్రుమైః ॥

ఆ సరస్సు తీరమునందు గన్నేరు, గోరంట, కంకేళి, దిరిసెన, అవి సె, గార, ఉత్తరేణి, ఎర్ర టెంకాయ, అడవి మొల్ల, పొన్న, సురపొన్న, ఉసి రి, గురివింద, అరటి మొదలగు ఇతరములగు చెట్లు, మల్లె తీగలు, తామర మొక్కలు పెరుగుతూ ఆ సరస్సుయొక్క శోభను మిక్కిలి ఇనుమడింప జేయుచుండెను. ఆ చెట్లు అన్ని ఋతువులలో పూలతో, పళ్లతో నిండి యుండెను.

తత్రైకదా తద్గిరికాననాశ్రయః కరేణుభిర్వారణయూథపశ్చరన్,

సకంటకాన్ కీచకవేణు వేత్రవద్విశాలగుల్మం ప్రరుజన్వనస్పతీన్ ।

ఆ అడవిలో ఒక గజేంద్రుడు నివసించుచుండెను. అది ఒకనాడు తన గుంపులోని ఆడు ఏనుగులతో గూడి సంచారము చేస్తూ, ముళ్ల చెట్ల ను, విశాలమైన సన్న వెదురు వేదురు వేము డొంకలను విరుగకొట్టుచుండె

యద్ధంధమాత్రాద్ధరయో గజేంద్రా

వ్యాఘ్రదయో వ్యాలమృగాస్సఖడ్గాః ।

మహోరగాశ్చాపి భయాద్ద్రవంతి

సగౌరకృష్ణాశ్శరభశ్చమర్యః ॥

ఆ ఏనుగు వాసన తగిలినంత మాత్రాన సింహములు, మిగిలిన పెద్ద ఏనుగులు, పెద్దపులులు ఖడ్గమృగములు మొదలగు క్రూరమృగము లు, పెద్ద సర్పములు, గౌరమృగములు, నల్ల యిర్రులు, మీగండ్ల మేకములు, సవరపు మెకములు కూడ భయముతో పరుగు తీయుచుండును.

వృకా వరాహా మహిషర్క్షశల్యా గోపుచ్చసాలావృకమర్కటాశ్చ ।

అన్యత్ర క్షుద్రా హరిణాశ్శశాదయశ్చరంత్యభీతా యదనుగ్రహేణ॥

ఆ ఏనుగు అనుగ్రహమును పొందిన తోడేళ్లు, అడవి పందులు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు, ఏదుపందులు, కొండముచ్చులు, అడవి కుక్కలు, కోతులు, లేళ్లు, కుందేళ్లు మొదలగు అనేక చిన్న జంతువులు దానికీ దూరముగా సంచరించును.

స ఘర్మతప్తః కరిభిః కరేణుభిర్వృతో మదచ్యుత్కలభైరనుద్రుతః,

గిరిం గరిమ్ణా పరితః ప్రకంపయన్ని షేవ్యమాణోకాలికులైర్మదాశనైః।

సరోనిలం పంకజరేణురూషితం

జిఘ్రన్ విదూరాన్మదవిహ్వలేక్షణః ।

వృతస్స్వయూఢన తృషార్దితేన తత్

సరోవరాభ్యాశమథాగమద్దుతమ్ ॥

ఆ ఏనుగు చుట్టూ మిగిలిన మగ మరియు ఆడ ఏనుగులు చుట్టు వారియుండెను. మదమును స్రవించే ఏనుగు గున్నలు దాని వెనుక పరుగె త్తుచుండెను. దాని బరువుచే పర్వతము చుట్టూ అధికముగా కంపించుచుం డెను. మదమును భక్షించే తుమ్మెదల గుంపులు దాని చుట్టూ తిరుగుచుం డెను. పద్మముల పుప్పొడిచే సుగంధితమైన వాయువు సరస్సు మీదనుండి వీచుచుండగా, అది ఆ గంధమును చాల దూరమునుండియే ఆఘ్రాణించేను. మదముచే దాని కన్నులు మూసుకొని పోవుచుండెను. అది వేడి వలన తాపమును పొందియుండెను. ఆ ఏనుగు దప్పికతో ఇబ్బంది పడుచున్న తన గుంపు తనను చుట్టువారి రాగా, అప్పుడు ఆ సరస్సు ఒడ్డును వేగ ముగా చేరుకొనెను.

విగాహ్య తస్మిన్నమృతాంబు నిర్మలం

హేమారవిందోత్పలరేణువాసితమ్ ।

పపౌ నికామం నిజపుష్కరోద్ధృత-

మాత్మానమద్బిస్నపయన్ గతక్లమః ॥

ఆ సరస్సులోని స్వచ్చమైన నీరు బంగరు రంగు గల పద్మములు మరియు కలువల పుప్పొడితో సుగంధీతమై యుండెను. ఆ ఏనుగు దానిలో దిగి తనపై నీళ్లను చల్లుకుంటూ, అమృతమువంటి ఆ నీటిని కడుపు నిండా త్రాగి సేద దీరేను.

స్వపుష్కరేణోద్ధృతశీకరాంబుభిః

నిపాయయన్ సంస్నపయన్ యథా గృహీ ।

ఘృణీ కరేణుః కలభాంశ్చ దుర్మదో

నాచష్ట కృచ్చం కృపణ్వేజమాయయా ॥

             గృహస్థునకు వలెనే ఆ ఏనుగునకు తన గున్నలపై ప్రేమ, ఆడు ఏనుగులపై ఆసక్తి అధికము. మిక్కిలి మదించియున్న ఆ ఏనుగు తన తొండముతో నీటిని పైకి తీసి, తుంపరలతో వాటికి చక్కగా స్నానము చేయిస్తూ వాటిచే చక్కగా ఆ నీటిని త్రాగిస్తూ, దేవుని మాయచే తనపై పడబోవుచున్న ఆపదను అది కనుగొనలేదు.

తం తత్ర కశ్చిన్నృప దైవచోదితో

గ్రాహో బలీయాంశ్చరణే రుష్యాగ్రహీత్ ।

యదృచ్చయైవం వ్యసనం గతో గజో

యథాబలం సోతిబలో విచక్రమే ॥

ఓ రాజా! ఆ సరస్సులోని బలశాలియగు ఒకానొక మొసలి దైవ ముచే ప్రేరితమే కోపముతో ఆ ఏనుగు కాలును పట్టుకొనెను. ఈ విధ ముగా ఆ ఏనుగు ఈశ్వరేచ్చచే అనుకోకుండా ఆపదలో పడెను. కానీ అది చాల బలము గలది. అది తన బలమునకు తగ్గట్లుగా పరాక్రమించి, విడిపిం చుకొనే ప్రయత్నమును చేసెను.

తథాతురం యూథపతిం కరేణవో

వికృష్యమాణం తరసా బలీయసా ।

విచుక్రుశుద్దీనధియోకపరే గజాః

పార్ష్ణగ్రహాస్తారయితుం న చాశకన్ ॥

ఆ విధముగా బలశాలియగు మొసలి బలముగా లాగుచుండగా ఆ ఏనుగు స్వాధీనత తప్పియుండెను. ఆడు ఏనుగులు దీనమైన అంతఃకరణ ములతో ఆ గజేంద్రుని గురించి ఆక్రోశించుచుండెను. ఇతరగజములు . కూడ దానిని వెనుకనుండి పట్టుకొని లాగుటకు ప్రయత్నించినవి. అయిన నూ, అవి ఆ గజేంద్రుని సరస్సునుండి బయటకు దాటించలేక పోయినవి.

నియుధ్యతో రేవమిభేంద్రనక్రయోః

వికరతోరంతరతో బహిర్మిథః ।

సమాస్సహస్రం వ్యగమన్ మహీపతే

సప్రాణయోశ్చిత్రమమంసతామరాః ॥

ఓ మహారాజా! ఈ విధముగా బలశాలురగు ఏనుగు, మొసలి పర స్పరము యుద్ధమును చేయుచుండిరి. ఏనుగు బయటనుండి, మొసలి లోపలినుండి లాగుచుండెను. ఈ విధముగా వేయి సంవత్సరములు గడిచి . పోయెను. దేవతలు కూడ ఆ యుద్దము అద్భుతమని తలపోసిరి.

తతో గజేంద్రస్య మనోబలౌజసాం

కాలేన దీర్ఘేణ మహానభూద్వ్యయః ।

నికృష్యమాణస్య జలీవసీదతో

విపర్యయ్వోభూత్సకలం జలౌకసః ॥

తరువాత దీర్ఘకాలము గడుచునాటికీ, నీటిలోనికి గట్టిగా లాగివేయ బడుతూ ఖేదమును పొందియున్న గజేంద్రునకు మనోబలము, ఇంద్రియ పాటవము, శరీరబలము కూడ చాలవరకు క్షీణించి పోయెను. అదే సమయ ములో, నీటిలో నివసించే మొసలికి ఆ మూడు తల్లక్రిందులు. ఆయెను; అనగా, క్రమముగా అవి వర్ధిల్ల జొచ్చెను.

ఇత్థం గజేంద్రస్స యదాప సంకటం

ప్రాణస్య దేహీ వివశో యదృచ్చయా ।

అపారయన్నాత్మవిమోక్షణే చిరం

దధ్యావిమాం బుద్ధిమథాభ్యపద్యత ॥

ఈ విధముగా దేహాభిమానియగు (బలము పోయి దేహమాత్రావశి ఛుడై యున్న) ఆ గజేంద్రుడు చాల కాలము తనను విడిపించుకొనలేక స్వాధీనత తప్పి ఈశ్వరేచ్ఛతే అనుకోకుండా ప్రాణసంకటమును పొందెను. అపుడాతడు ఆలోచించి, ఈ నిశ్చయమునకు వచ్చెను.

న మామమే జ్ఞాతయ ఆతురం గజాః

కుతః కరిణ్యః ప్రభవంతి మోచితుమ్ ।

గ్రాహేణ పాశేన విధాతురావృతో-

ప్యహం చ తం యామి పరం పరాయణమ్ ॥

ఆపదలోనున్న నన్ను నాతో సమానులగు ఈ ఏనుగులు విడిపించ లేకపోయినవి. ఆడు ఏనుగులు ఎట్లు విడిపించ గల్గును? (లేవు). బ్రహ్మ గారి మృత్యుపాశము ఈ మొసలి రూపములో నన్ను చుట్టివేసినది. నేను పశువునే అయిననూ, ఆ పరమేశ్వరుని శరణు వేడెదను. ఈశ్వరుడే సర్వో తమమైన ఆశ్రయము.

యః కశ్చనేశో బలినోకంతకోరగాత్

ప్రచండవేగాదభిధావతో భృశమ్ ।

భీతం ప్రపన్నం పరిపాతి యద్భయా -

న్మృత్యుః ప్రధావత్యరణం తమీమహి ॥

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే గజేంద్రోపాఖ్యానే

గజేంద్రవిపత్తివర్ణనం నామ ద్వితీయోధ్యాయః ॥

బలశాలియగు మృత్యువు అనే సర్పము భయంకరమగు వేగ ముతో అంతటా పరుగెత్తుచున్నది. దాని వలన భయపడి శరణు పొందినవా నిని ఆ సర్వేశ్వరుడు, ఎవడో వాడు, రక్షించును. ఆయనకు భయపడియే మృత్యుదేవత నిరంతరముగా ప్రాణులయందు ప్రవర్తిల్లుచున్నది. ఆ దేవుని మేము శరణు వేడుచున్నాము.

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో గజేంద్రోపాఖ్యానములో గజేంద్రుని మొసలి పట్టుకొనుటను వర్ణించే రెండవ అధ్యాయము ముగిసినది (2) .