తా॥ నారదుడిట్లనెను. “సూర్య ప్రతిష్ఠ కొఱకు పాడ్యమి, విదియ, చతుర్థి, పంచమి, నవమి, త్రయోదశి, పూర్ణిమ యనునవి యోగ్యతిథులుగఁజెప్పఁబడినవి. (1) సోమ, గురు, బుధ, శుక్రవారములు సౌమ్యగ్రహదినములు. ఇవి ప్రతిష్టా యజ్ఞ కర్మకు శ్రేష్ఠములని చెప్పబడినవి. (2) ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్విని, రోహిణి, పునర్వసు, హస్త, జేష్ఠ, శ్రవణము, లేక భరణి యనునీ నక్షత్రములందు సూర్యప్రతిమా స్థాపనము శ్రేష్ఠమైనది. (3) భూమిని చక్కగా శోధించి, ఊక, వెంట్రుకలు, ఇసుక, బొగ్గు, జాయి, ఎముకలు మున్నగునవి లేకుండునట్లు చూచి, (4) సూర్యమూర్తిని ప్రతిష్టించు వేదిక నాలుగు మూరల వైశాల్యము కలిగి యుండవలెను. (5) మండపము పదిమూరల విస్తృతి కలిగియుండవలెను. మండలమును విధిపూర్వకముగ వృక్షశాఖలతో నిర్మింపజేయవలెను. (6) నదీ సంగమ స్థానమునుండి మట్టిని తేవలయును భూమిని అలికి శ్రేష్టమైన కుండమును నిర్మింపజేయవలెను. (7) తూర్పుదిక్కున శుభప్రదమైన చతురస్రా కారపు కుండమును, దక్షిణ భాగమున అర్థచంద్రాకృతిగల కుండమును, పడమటి దిక్కున వర్తులాకారపు కుండమును, (8) ఉత్తరమున పద్మాకారపు కుండమును నిర్మింపవలెను. అప్పుడు ఐదేసిమూరల తోరణములను సిద్ధము చేయవలెను. (9) మజ్జి, మేడి, మారేడు, మోదుగు, రావి, జెమ్మి, చందన వృక్షములు మండలాదుల నిర్మాణమునకు శ్రేష్ఠములని చెప్పబడినవి.
తా. బుద్ధిమంతుడైన వాడు తెల్లని వస్త్రములను ధరించి, చిత్రమైన లలాట భూషణములను ధరించి, జపమాలలు ధగి చి తోరణములను చేయవలెను. (11) తూర్పు తోరణమును “అగ్నిమీళే' మంత్రముతోను, దక్షిణతోరణమును 'ఇ షేతోర్ణేత్వా” మంత్ర ముతోడను (12) పశ్చిమ భాగమున గల తోరణమును 'అగ్న ఆయాహి' మంత్రముతోను ఉత్తర తోరణమును 'శంనోదేవీ' మంత్రముతోను పూజింపవలెను. (13) తెల్లచందనపు పూతలతోడను, కంఠములకు నలంకరించిన శుభ ప్రదములైన భూషణముల తోడను ప్రకాశించు బంగారు కలశ ములను (14) యవలు, బియ్యము, అన్నములతో వస్త్రాలంకారములతోడి స్వరూపములతో గలమూకుళ్లను. 'ఆజిస్ర' మంత్రముతో స్థాపింపవలెను.
స్తంభముల సమూహములను వస్త్రములచేతను, చిత్ర పటములతోను టెక్కెములతోను అద్దములతోను, పతాకములతోను, చామరములతోను, మేలుకట్టులతోను అలంకరింపవలెను (16) శంఖనాదములు, ఘంటాఘోషలు, పాటలు, శుభనినాదములు, మంగళ వాద్యముల మ్రోతలు, భేరీ భాంకారములు, వేదపాఠములు (17) జయజయ నినాదములు మొదలగువానితో మహోత్సవమును నిర్వహింపవలెను. విచిత్రములైన పతాకములచేత పూజాపుష్పముల చేత (18) వివిధవర్ణముల పూలదండల మేలుకట్టులతో అంతటను వెదజల్లబడిన పువ్వుల మొగ్గల మొలకలతో శోభాయమానముగ నలంకరింపబడియున్న స్థానమున దర్భలు పరచిన వేదిక పై దేవతా విగ్రహమును స్థాపింపవలేను. (19) పచ్చని వర్ణముగల పతాకమును తూర్పుదిక్కున ఇంద్రుని కొఱకు, ఎఱ్ఱని పతాకమును ఆగ్నేయ దిక్కున, అగ్ని దేవుని కొఱకు, దక్షిణ దిక్కునందు నల్లని పతాకమును యముని కొఱకు ప్రత్యేకింపవలెను.
తా.నల్లని కాటుక వంటి వర్ణముగల పతాకమును నిరృతి కొఱకు నైరృతి దశయందు, 134 పడమటి దిక్కున తెల్లని పతాకమును వరుణునికొఱకును, వాయవ్యమున వాయుదేవుని కొఱకు నల్లనీ పతాకమును, (21) కుబేరుని కొఱకు పచ్చని పతాకమును ఉత్తర దిక్కునను, ఈశానుని కొఱకు ఈశాన్యదిక్కున వివిధ వర్ణములుగల పతాకమును ఏర్పరుప వలెను. అటు పిమ్మట తెల్లని పిండి, కుంకుమలతో పద్మమును లిఖింపలేను. (22) 'వైద్యా వేదీ' యను మంత్రము చేత వేదిక నంతటను స్పృశించుట యగును. పూర్వాగ్రములు, ఉత్తరాగ్రములునైన కుశలకు ఆచ్చాదించుచు (23) యోగేయోగే' యనేడు మంత్రముచే కుశాచ్చాదనమును పూర్తి చేయవలెను. అచ్చటనే మృదూత్తరచ్ఛదవతియైన శయ్యమ సిద్ధము చేయవలయును. (24) అట రెండు నీటి కుండల నుంచవలెను. విచిత్రముగ నుండునట్లు దీప పంక్తులను, భక్ష్యభోజ్య అన్నపానములతో సహా అలంకరింపవలెను. (25) వివిధములైన పిండివంటలు, లడ్డువములను, పాయసమును, పులగమును దధ్యోదనముతోకూడ ఏర్పాటుచేసి యుంచవలెను. (26) చంద్రునితో సమానముగ ప్రకాశించు స్వచ్ఛమైన పెరుగును, అందమైన చిత్రమును అటనుంచవలెను.
శ్రీ భవిష్యమహాపురాణమునందలి బ్రహ్మపర్వాంతర్గత సప్తమీ కల్పమునందు సాంబోపాఖ్యానమున సూర్య ప్రతిష్ఠయందు మండల విధి వర్ణనమనెడు నూట ముప్పది నాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 134 of the Bhavishya Purāṇa is as follows:
The maṇḍala used specifically in the pratiṣṭhā ceremony — more elaborate than the daily worship maṇḍala described in Chapter 123 — is described here with its precise measurements, the sequence in which its elements are drawn, and the mantras accompanying each stroke. The pratiṣṭhā maṇḍala is a large, complex structure that encompasses the cosmic solar order in geometric form: the central lotus of nine petals (representing the nine grahas with Sūrya at the centre), surrounded by a sixteen-petal lotus (representing the sixteen kalās of Sūrya), enclosed within a square boundary with gates in the four directions. The image being consecrated is placed at the central point of this maṇḍala, and the entire ceremony proceeds within the sacred space that the maṇḍala has established.