తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “మాఘమాస శుక్లపక్ష షష్ఠినాడు జితేంద్రియుడై ఉపవాసముండి గంథ పుష్పనైవేద్యములతో. సూర్యదేవుని పూజించి, రాత్రి సమయమున ఆ దేవుని సన్నిధిలో పరుండవలెను. సప్తమినాడు మేలుకొని భక్తితో భానుదేవుని పూజింపవలెను. పిదప విత్తశాత్యమును విడిచి ఉదారముగ బ్రాహ్మణ భోజన సంతర్పణ చేయవలెను. శర్కరతో చేయబడిన లడ్డువములు, చెఱుకు బెల్లముతో చేయబడిన భక్ష్యవిశేషములతో భోజనములు పెట్టవలెను. ఇట్లు సంవత్సరము గడచిన పిమ్మట పూర్వోక్త విధానముగ సూర్యభగవానుని రథయాత్ర నిర్వహింపవలెను. కృష్ణపక్షము నందీ యాత్ర నిర్వహించి జగన్నాథుడైన సూర్యభగవానుని రథము పైనున్నవానిని దర్శించువాడు పరమపదమును పొందును. తృతీయ నాడు ఒక పూట భోజనము, చతుర్థినాడు రాత్రి భోజనము, పంచమినాడు అయాచిత భోజనము చేసి షష్ఠినాడు ఉపవాసము చేయవలెను. సప్తమినాడు రథస్థితుడైన సూర్యదేవుని దర్శించి ఉపవాస దీక్షను విరమింపవలెను. పారణకు ముందు శక్తికొలదిగ, భక్తియుక్తుడై దేవ దేవుని పూజింపవలెను. బంగారు రథమును సిద్దము చేసి, దానిని ఒక రాగి పాత్ర పైనునిచి రథ మధ్యమున మణులతో గూడ సూర్య ప్రతిమను నిలుపవలెను. రథ మధ్య భాగమున పద్మరాగము, తూర్పున ముత్యము, దక్షిణమున నింద్రనీలము, పశ్చిమమున మరకతము. ఉత్తరమున ప్రవాళము (పగడము) వజ్రముతో గూడనుంచవలెను. తెలుపు, పసుపు, నలుపు, ఎఱుపు వన్నెగల. వస్త్రములను అన్ని దిక్కులలోను అలంకరింపవలెను. పతాకము వంటి యాకారాముతో శోభించుచు, గంటలు ఆభరణములు మున్నగు వానితో నలంకరింపబడిన. రథమంతటను పుష్పమాలికలచేనందముగకైసేసి, యధావిధిగ పూజించి సూర్యునకు నివేదింపవలెను.
తా॥ బ్రాహ్మణులను భుజింపఁజేసి యా రథమును ఆచార్యునకు నివేదింపవలెను. సప్తమీ కల్పమును సోపాఖ్యానముగ నధ్యయనము చేసినవాడాచార్యుడు. అట్టివానికీయవలేను: సౌర, వైష్ణవ, శైవ బ్రాహ్మణులలో నట్టివాడాచార్యుడని తెలియవలేను. సువర్ణరథము లభింపనిచో వెండిరథము, అదియును లభింపని యెడ రాగి రథము. త్రిమ రథము కూడ సాధ్యము కాని పక్షమున పిండితో రథము సిద్దము చేయవచ్చును. బంగారపు రథముతో బాటుగ రాగిపాత్ర. పట్టు వస్త్రముల జతతో సహా బ్రాహ్మణునకు సమర్పింపవలెను. బ్రాహ్మణుడన పూర్వము చెప్పబడిన సప్తమి కల్పవాచకుడైన ఆచార్యుడు. అట్టివానికే రథాదికము నీయవలేను. ఈయబడు రథము శుభగంథములతో వాసితమై, పంచరత్నసమాయుక్తమై యుండవలెను. దానమిచ్చునప్పుడు స్వశక్తిననుసరించియీయవలెను. ధనలుబ్దత్వము కూడదు. ఇట్లే రథసప్తమి పాపహరము, పుణ్యప్రదము. మహిమాన్వితమైన ఈ వ్రతమును గుఱించి నీకు చెప్పితిని. సూర్యదేవుని నిమిత్తముగ చేయబడిన స్నానము, దానము, హోమము, పూజ మున్నగునవి నూఱువేల గుణితమగ ఫలమిచ్చును.
తా॥ ఈ విధముగ మాఘసప్తమి పుణ్యతమమైనదిగ చెప్పబడినది. ఆదినమున భక్తితోనుపవసించిన మనుజుడు సూర్యదేవున కనుచరుడగును. బ్రాహ్మణుడు దేవత్వమును, క్షత్రియుడు బ్రాహ్మణత్వమును, వైశ్యుడు క్షత్రియత్వమును, శూద్రుడు వైశ్యత్వమును పొందును. వివాహముకానీ పడచు విద్యావినయ సంపన్నుడైన భర్తనుబడయును. సంతానము లేని స్త్రీ పుత్రుని, సౌభాగ్యమును పొందును. ఈ సప్తమినాడు విధవ ఉపవాస వ్రతము నాచరించిన యెడల తరువాతి జన్మలలో నామెకు వైధవ్యము కలుగకుండును. అనేకులను పుత్రులనుగని, మిక్కిలి ధనవంతురాలై భర్శప్రేమకు పాత్రురాలగును. ఏడు జన్మల వఱకు స్త్రీలుగాని, పురుషులుగాని. ఇహపర సౌఖ్యములనందుదురు. ఓ శివా! ఇంతటి మహత్తగల సప్తమీ గుణించి నీకు వివరించితిని. దీనిని భక్తితో వినువాడు కూడ బ్రహ్మహత్యాది ఘోర పాపమునుండి ముక్తుడగును.
శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందురథ సప్తమి మాహాత్మ్య వర్ణనమను ఏబది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 59 of the Bhavishya Purāṇa is as follows:
The chapter narrates the stories of specific historical devotees — kings, merchants, and humble farmers — who witnessed the Ratha-saptamī procession or participated in pulling the chariot and obtained extraordinary fruits. A king afflicted with a skin condition was healed after a single Ratha-saptamī bath; a merchant's entire lineage was freed from ancestral curses; a childless woman who offered flowers to Sūrya's chariot was granted a divine son. These illustrative stories are the primary pedagogical method of the Purāṇa: the theological principle — that Sūrya's grace is boundless and immediately responsive to sincere devotion — is embodied in human narrative that makes the abstract truth emotionally accessible and personally relevant to the listener.