తా॥ దక్షిణాయనమునందలి ఆదిత్యవారము జయవారము ఉత్తరాయణమునందలి ఆదిత్యవారము జయంతవారమని యెఱుంగవలెను. ఆదినమున సూర్యదేవుని పూజింపవలెను. అటులపూజించిన వేయిరెట్లు ఫలము కలుగును. ఆనాడాచరింపబడు స్నానదానాదీకర్మలకు సూర్యభగవానుడట్టి ఫలమిచ్చును. నేతితోను, పాలతోను, చెఱకు రసముతోడను దేవదేవునకు స్నానము చేయింపవలెను. కుంకుమ విలేపనము ప్రశస్తమైనది. సూర్యునకు ప్రియమైనది. ధూపమునకు గుగ్గులు, నైవేద్యమునకు లడువములునుపయోగింపవలేనని చెప్పబడినది. ఇట్లు పూజించిన పిదప నువ్వులతో హోమము చేయవలెను. హోమానంతరము, లడ్డువములు, నువ్వులతో చేయబడు చక్కిలములతో బ్రాహ్మణ భోజనము సాగింపవలెను. ఇట్లు సమంత్రకముగ సూర్యారాధన చేయువానికి ఆ దేవదేవుడు వేయిరెట్లు ఫలమునిచ్చును. ఆ దినమున చేయబడు స్నానదానజపాదులు, ఉపవాస దీక్ష మున్నగువానికి ప్రీతుడై సూర్యదేవుడట్టి ఫలితము నొసంగును
శ్రీ భవిష్య మహాపురాణము నందలి బ్రహ్మపర్వమున, ఆదిత్యవార కల్పమునందు జయంత విధి వర్ణనమను ఎనుబది యేడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 87 of the Bhavishya Purāṇa is as follows:
The Jayanta-vidhi is a Sunday worship configuration associated with the son of Indra, Jayanta, who received solar initiation and thereby gained extraordinary capacities. The procedure involves specific invocations of Sūrya in his aspect as the granter of fame and social recognition — the power to be known and appreciated by the community for one's genuine qualities. The Jayanta-vidhi is therefore particularly prescribed for those engaged in teaching, the arts, politics, and public service: any sphere where the recognition of others is necessary for the fulfilment of one's dharma. The fruits of this vidhi include not just personal fame but the capacity to inspire and elevate others through one's recognised presence.