భవిష్య మహా పురాణము - బ్రహ్మ పురాణము

45. షష్ఠి కల్పమున కార్తికేయ వర్ణనము

తా బ్రహ్మదేవుడిట్లనెను. “మీకు జాతి కర్మలను గూర్చిన సంశయము కలుగుచుండగా నేను చెప్పెడి సహేతుకమైన ఈ మాట వినుడు. వివరముగ కాకున్నను సమగ్రముగ మఱల చెప్పెదను. వినుడు. మనుష్యులు జాతి, కర్మ అను రెండింటి కలయిక తోడనే సంసిద్ధిని పొందెదరు. దైవము, పురుష ప్రయత్నము రెండును కూడినప్పుడే ఫలప్రాప్తి కలుగునట్లు జాతి, కర్మ అను రెండు కలిసినప్పుడే పురుషుడు సిద్ధి పొందును. పూర్వము మహాతేజస్వియైన యోగీశ్వరుడు తన శిష్యులకు బోధించునప్పుడిటులే చెప్పియుండెను. సంక్షేపముగనైనను సాకల్యముగఁజెప్పెను”. సుమంతుముని యిట్లనెను. “రాజా! పూర్వము ఋషులడిగిన ప్రశ్నకు బ్రహ్మదేవుడిట్లే సమాధానము చెప్పియుండెను. జాతకర్మల సముచ్చయమును గూర్చిన ఈ బ్రహ్మర్షి వాక్యము హేతుబద్ధమైనది. అందువలన కార్తికేయుని గుణించి నీవాశ్చర్యపడనక్కరలేదు. దేవతల మార్గమెప్పుడును దుర్వియమై యుండును.

శతార్ధ సాహస్రసంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున షష్టీకల్పమునందు కార్తికేయ వర్ణనమను నలుబదియైదవ అధ్యాయము సమాప్తము.