స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని బ్రహ్మోత్తర ఖండము

22  అధ్యాయము

తా సూతునివచనము - ఈ విధముగా శివమైన మార్గమును శివుడే చెప్పాడు.సంసార బద్దులైన నరులకు వెంటనే ముక్తి నిచ్చేది. వరమైనది (1) దుర్మెధనులైన నరులకు, వేదములలో అధికారం లేని వారికి ద్విజాతి బంధువులకు స్త్రీలకు, శరీరధారులందరికి (2) ఇది సాధారణ మార్గము. సాక్షాత్తుగా కైవల్య సాధనము మహా మునులు సేవించేది. దేవతలతో పూజింపబడేది (3) ఆశివ కథాశ్రపణము సంసార భయనాశకము వెంటనే ముక్తి నిచ్చేది. శ్లాఘించ తగినది ప్రాణులందరికి పవిత్రమైనది (4) అజ్ఞాన తిమిరాంధులకు ఈ దీపము జ్ఞాన సిద్ధిని కల్గించేది. భవరోగ బదులకు సేవించ తగిన ఉత్తమ ఔషధము (5) మహాపాతకము లనే శైలములకు వజ్రఘాతము వలె దారుణమైనది. కర్మ బీజములకు బెదిరింపు సర్వ సంపదలకు సాధనము (6) భువన పావనమైన శంభు కధను ఎప్పుడూ ఎవరు వింటారో అనరులు ఈ లోకంలో రుద్రులే అనుమానంలేదు (7) శూలి గాధ వినేవారి యొక్క అట్లాగే కీర్తించే పనుల యొక్క పాదరజములే లోకాలకు తీర్ధములు, అని మునులన్నారు. (8) అందువల్ల ముక్తిని చేరటానికి ఎవరిష్ట పడతారో వారు భక్తిలో ఎప్పుడు శివ సంబంధమైన పురాణ కధను వినాలి. (9) ఎప్పుడూ వినటానికి శక్తి చాలకపోతే నరుడు పౌరాణిక కధను నియతాత్ముడై ప్రతిరోజా ముహూర్త కాలమైనా వినాలి. (10) ఒకవేళ ప్రతిరోజూ వినటానికి నరుడు ఆశక్తుడై తేడై పుణ్యమాసములందు, పుణ్యదినమందు పుణ్యతిథులందు (11) ఎవడు వింటాడో పురాణములలో చెప్పిన ఈ రమ్యమైన కథను కర్మ మహాటవిని కాల్చేసి సంసారాన్ని దాటేస్తాడు 12)ముహూర్తము గాని, అందులో సగం కాలము, కాని పావన కథకు భక్తి ఎప్పుడు, ఎవరు వింటారో వారికి దుర్గతిలేదు. (13) సర్వయజ్ఞములకు ఏ ఫలమొ సర్వ దానములు ఏ ఫలమొ ఒక సారి పురాణం విన్నందువల్ల ఆ ఫలాన్ని నరుడు పొందుతాడు (14)విశేషించి కలియుగంలో పురాణ శ్రవణం కన్న పరమమైన ధర్మము నరులకు లేదు. పరమైనముక్తి పధము లేదు మరొకటి (15) పురాణ శ్రవణాం కన్నన మరొకటి లేదు. అందువల్లనే మనుష్యుల కల్పద్రుమమువలె మహా ఫలకరము (16) కలిలో హినాయుషులైన నరులు, దుర్బలులు, శ్రమపీడితులు, దుర్మేధనులు, దుఃఖభాజమలు, ధర్మాచారవర్జితులు అధికం అని 

తా ॥ ఆలోచించి కృపతో భగవాన్ బాదరాయణుడు వారి హితం కొరకు పురాణమును పేరుగల సుధా రసాన్ని చేశాడు (18) ఈ అమృతాన్ని ప్రయత్న పూర్వకముగా తాగితే ఇది అజరామ రత్వాన్నిస్తుంది. శంభుని కధామృతము కులాన్నే అజరామరం చేస్తుంది (19) బాలుడు, యువకుడు, దరిద్రుడు, వృద్ధుడు, దుర్బలుడు ఎవరైనా పురాణజుడైతే వానిని ఎప్పుడు నమస్కరించాలి. సుకృతం కోరేవారు వారిని పూజించాలి. (20) నీచ బుద్ధిని పురాణఖని పై ఎప్పుడూ ఉంచరాదు. ఎవరి వక్త్రాంబుజము నుండి వాణి వస్తుందో అది శరీర ధారులు కామధేనువు (21) లోకంలో జన్మంలో గుణంతో గురువు లున్నారు. వాళ్ళందరిలో పురాణజ్ఞుడు వరుడైన గురువు (22) వేల కోట్ల జన్మలలో అయ్యి అయ్యి నశిస్తాడు. గురువు కన్న వేరైన వాడెవడు తిరిగి రాని జీవితాన్ని (జన్మలేదు) ఇచ్చేవాడు (23) పురాణజ్ఞుడు, శుచి యైనవాడు దాంతుడు, శాంతుడు, మత్సరం లేనివాడు, సాధువు కారుణ్యం గలవాడు, వాగ్మి ఐన సుధీమంతుడు పుణ్యకధను చెప్పాలి. (24) పౌరాణితద్విజుడు వ్యాసంపై కూర్చొని, ప్రసంగాన్ని సమాప్తి చేయకుండా ఎవనికి నమస్కరించరాదు. (25) ధూర్తులు, దుర్వృత్తులు, జయించే బుద్ధిగలవారు ఇతరులు, అలాంటి కుటిల నడవడి కలవారి ముందర కధను చెప్పరాదు (26) దుర్జనులు లేని, శూద్రులు. శ్వాపదములులేని, ద్యూతవదనం కానిచోట కధను బుద్ధిమంతుడు చెప్పాలి (27) సద్గ్రామమందు సుజనులున్నచోట, సుక్షేత్రమందు, దేవతాలయమందు పుణ్యమైన నదీతీరమందు పుణ్యకధను చెప్పాలి (28) శివభక్తి కలవారు ఇతర కార్యములపై ఆసక్తి లేనివారు, వాగ్యతులు బాగా వినగలిగిన వారు, అచంచలులు ఆట్టిశ్రోతలు పుణ్యభాగులు (29) అభక్తులైన మనుజాధములు ఈ కధను వింటారో వారికి పుణ్య ఫలములేదు. జన్మజన్మలలో దుఃఖం కల్గుతుంది (30) పురాణాన్ని పూజించకుండా తాంబూలాది కానుకలు ఇవ్వకుండా కూడా ఈ కధను భక్తితో విన్న దరిద్రులు కూడా పాపులౌతారు (31) కధను చెబుతూ ఉంటే వేరేపైపు పోయే నరులు మరో జన్మలో నశిస్తారు. వారి భార్యలు సంపదలు కూడా (32) పావనమైన కధను తలపాగ ధరించి ఎవరు వింటారో వారు బాలకులై జన్మిస్తారు. మనుజాధములైన పాపులౌతారు. (33) పావనమైన కధను వింటూ తాంబూలం సేవించే వీరిలో యమకింకరులు నరకంలో వీరి విష్ఠాని తినిపిస్తారు (34) 

తా ॥ ఎత్తైన ఆసనం పై కూర్చొని దాంభికంగా కధను విన్నవారు అక్షయమైన నరకములను అనుభవించి వారు కాకు లౌతారు (35) వీరాసన మందు కూర్చుని, మంచే యందు కూర్చుని సత్కధను విన్నవారు వంకర కాళ్ళ వారౌతారు (36) నమస్కరించ కుండా వినేవారు విషవృక్షాలౌతారు. పడుకొని వినేవారు నరులు ఆజగరులౌతారు (37) కధ చెప్పే వ్యక్తితో సమానమైన ఆసన మందు కూర్చొని వినేవారు గరుతల్పగుల పాపాన్ని పొంది నరకం వెళ్తారు (38) పురాణజుని నిందించేవారు పాప హర మైన కథను నిందించేవారు, ఆ నరులు నూరుజన్మలు కుక్కలౌతారు (39) కధ నడుస్తుండగా, మధ్యలో మాట్లాడే వారు తొలుత గాడిదలౌతారు.ఆ పిదప ఊసరవెల్లులౌతారు. (40) ఎప్పుడైనా ఒక సారి నరులు ఈ పుణ్యమైన కథను వినరో వారు ఘోర నరకములను భవించి పిదప అడవిపందులౌతారు (41) ఏ నరులు కీర్తిస్తున్న కధను విని ఆనందిస్తారో, వారు కధను వినకున్నప్పటికిని వారు శాశ్వతమైన పరప వదమును చేరుకుంటారు (42) కధను కీర్తిస్తుంటే విఘ్నం చేసే శరులు కోటి సంవత్సరాలు నరకమనుభవించి గ్రామ సూకరములౌతారు (43) పుణ్యమైన పౌరాణిక కధను ఎవరు వినిపిస్తారో ఆ నరులు కోటికల్పముల కాలము ప్రధముడై బ్రహ్మస్థానంలో ఉంటాడు (44) పురాణజునకు ఏ నరులు ఆసనము కొరకు కంబల అజిన వస్త్రములు మంచ, ఫలకము, ఇస్తారో వారు (45) స్వర్గ లోకం చేరి ఇష్టమైన భోగములనుభవించి బ్రహ్మాది లోకము లందు ఉండి పిదప నిరామ యవదమునకు చేరుతారు (46) పురాణజునకు ఎవరు కొత్త సూత్రవసనమిస్తారో వారు భోగులు, జ్ఞాన సంపన్నులు ఔతారు ప్రతి జన్మ మందు (47) మహాపాతకములు కలవాడు, ఉప పాతకాలుచేసిన వారు పురాణ శ్రవణం వింటేనే వారు పరమపదానికి చేరుతారు. (48) ఓ ద్విజోత్తములార ! ఇక్కడ ఒక పుణ్యమైన ఇతి హాసాన్ని చెబుతాను. వివే వారి పాపములనంతా నశింపచేస్తుంది. విచిత్రసు మనోహరమైనది (49) దక్షిణా పథ మధ్యమందు బాష్కలమును పేరుగల గ్రామముంది. అక్కడ ఉన్న వారంతా మూఢులు కర్మ వివర్జితులు (50) అక్కడ బ్రహ్మచారులు లేరు. ఆంధ్రతినతులకు వరాటముఖులు. జవస్వాధ్యాయములులేని వారు, పర స్త్రీలయందు విషయములందు ఆతురులు (51) 

తా ॥ కృషీవలులు, శస్త్రధరలు, నిర్దేవులు, వక్రస్వభావులు, జ్ఞాన వైరాగ్య లక్షణమైన పరమ ధర్మమును తెలుసుకోలేరు (52) స్త్రీలు పాప నిరతులైన వారు, స్వైరిణులు, కామలాలసులు, దుర్బుదులు, కుటిలగులు, మద్ర్వతా చారములు లేనివారు (53) అక్కడ విదురుడను దురాత్ముడు బ్రాహ్మణాధముడు వేశ్యావతి ఉండేవాడు. అతనికి భార్య ఉన్నా తప్పు మార్గంలో వెళ్ళేవాడు. (54) తన భార్యను బందువులను వదిలి ప్రతిరాత్రి వేశ్యా భవనం చేరి స్మరపీడితుడై రమించేవాడు (55) ఆతని భార్య రాత్రిపూట విముక్తయైనవ యౌవ్వన ఆమే స్మరుని ఆవేశాన్ని సహించనిదై జారునితో కూడి ఆనందించింది (56) ఒక సారి ఆ దురాచారను జారునితో కూడిన దాన్ని చూచి ఆమె భర్త త్వరగా కోపంతో పరుగెత్తాడు (57) ఇంతలో జారుడు పరుగెత్తాక భార్యను తీసుకుని ఆ దురాశయుడు ముష్ఠి బంధంతో కొట్టాడు. మాటి మాటికి కొట్టాడు (58) ఆమెను ఆతడు బాధించగా ఆమె కోపంతో నిర్భయంగా భర్తతో ఇట్ల అంది. నీవు ప్రతిరోజు వేశ్యతో సుఖిస్తున్నావు. నాగతేమిటి. (59) నేను అందగత్తెను, వయస్సు గల దానిని. స్త్రీ నిజామార్తవై నీ సంగమం లేకుండా ఎట్లా సహిస్తాను. (60) ఆమె అట్లనగా ఆ బ్రాహ్మణాధముడు ఇట్లన్నాడు. నీవు చెప్పింది. నిజమే. అందువల్ల నీకు హితమైన దానిని చెప్తాను. (61) జారుల నుండి ధనం తీసుకొని వారికి వరమైన ఆనందాన్ని ఇవ్వు. ఆ ధనమంతా నాకు ఇవ్వు దాన్ని నేను వేశ్యా స్త్రీలకిస్తాను (62) ఇట్లా నా కోరిక, కూడా పూర్ణమౌతుంది. ఓ వరానన ! అట్లాగే అని ఆ స్త్రీ భర్త మాటను స్వీకరించింది. (63) ఈ విధముగా దురాచారమందు ప్రవృత్తులైన ఆ దంపతులు. కాలవశాత్తు మరణించాడు, ఆ విప్రుడు, శూద్ర స్త్రీ భర్త (64) భర్త మరణించాక ఆ స్త్రీ పుత్రులతో పాటు తన ఇంటి యందు చాలా కాలముంది. కొంచెం యవ్వనం గడిచాక (65) ఒకసారి దైవయోగంవల్ల పుణ్యవర్వం రాగా ఆ స్త్రీ తన బంధువులతో కూడి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళింది. (66) అక్కడ తీర్థ జలమందు స్నానంచేసి, ఒక దేవతాలయ మందు దేవ ముఖ్యుల పుణ్యమైన పౌరాణిక కధను విన్నది (67) జారవ ర్తులైన స్త్రీలకు యమకింకరులు నరకమందు వారి స్మర మందిరమందు బాగా కాల్చిన లోహపు పరిఘను పెడ్తారు (68) అని పౌరాణికుడు చెప్పిన ధర్మ సంహితమైన దానిని విని, అతనితో బ్రాహ్మణ పుంగవునితో రహస్యంగా ఈమె భయపడి ఇట్లా అంది. (69) ఓ బ్రహ్మన్ ! పాపం తెలియక నేను చెడుగా ప్రవర్తించాను. యౌవన మందు కామచారంతో కౌటిల్యంగా ప్రవర్తించాను. 

తా ॥ ఈ మీ మాటను పురాణార్థముతో కూడిన దానిని విని నాకు చాలా భయం కలిగింది. శరీరం మాటి మాటికి కంపిస్తోంది. (71) దురింద్రియాసక్తురాలిని పాపిని, నరమోహితురాలిని చీచీ. అల్పమైన సుఖం కొరకు ఘోరమైన దుర్గతిని పొంద బోతున్నాను (72) మరణం తర్వాత భయంకరులైన యమ దూతలను ఎట్లా చూడగలను. కంఠ మందు పాశములతో బలంగా బంధించగా నాకు ధైర్యం ఎట్లా కలుగుతుంది. (73) నరకంలో శరీరాన్ని తునకలుగా నరకడం ఎట్లా సహిస్తాను మరిగిన కారపు బురదలో ఎట్లా ఉండగలను (74) క్రిమికీట గాదుల లక్షయౌనులందు ఎట్లా జన్మించెను. దుఃఖ ఓఘములతో పీడింపబడుతూ నిరంతరము ఎట్లా తిరుగను (75) నేటినుండి నాకు భోజనం ఎట్లా రుచిస్తుంది. దు:ఖ వరివతు రాలనై నిద్ర నెట్లా పొందుతాను (76) చచ్చాను, చచ్చాను, దగ్ధురాలివై నాను. హృదయ విదీరు రాలినయ్యాను. ఓ విది! నారు మహా పాపమందు బుద్ధినిచ్చి, పడేశావు (77) తుంగమైన శైలాగ్రమునుండి పడే వానికి, శూలంతో తుచ్చబడ ప్రాణికి ఎంత దు:ఖం కలుతుందో అంత కన్న ఘోరమైన దుఃఖము కోటి గుణితము నాకు కల్గుతోంది. (78) పదివేల అశ్వ మేధాలుచేసి, నూరునంవత్సరాలు గంగలోస్నానంచేసినా, వా గొప్ప పాపమునకు తరచుగా శుద్ధికలుగదు (79) ఏం చేయను. ఎక్కడికి వెళ్ళను. ఎవరిని శరణువేడను. నరకార్ణవ మందు పడే నన్ను లోకంలో రక్షించే వారెవరు (80) నీవేనా గురువును ఓ బ్రహ్మ ! నీవే తండ్రివి. నీవే తల్లివి కూడ, దీనురాలైన నన్ను ఉద్ధరించు, ఉద్ధరించు, నిన్నే శరణు వేడిన దానను (81) అని నిర్వేదాన్ని పొందిన, పాదములందు పడిన ఆమెను దయతో లేపి, ద్విజ పుంగవుడు ఇట్ల న్నాడు (82) బ్రాహ్మణ వచనము - అదృష్టవ శాత్తు సకాలంలో ఈ గొప్ప కధను విని మెల్కొన్నావు. భయపడకు. నీకు సుఖకరమైన గతిని చెబుతాను (83) సత్కధా శ్రవణంవల్లనే నీ బుద్ది ఇట్లా మారింది. ఇంద్రియార్థము లందు వైరాగ్యము పశ్చాత్తాపము ఎంతో కలిగింది. (84) పశ్చాత్తాపమే అన్ని పావములకు ఉత్తమ నిష్కృతి. దానితోనే బుద్ధిమంతుడైన నరుడు వెంటనే ప్రాయశ్చిత్తాన్ని చేసుకుంటాడు (85) శాస్త్ర ప్రకారము అన్ని ప్రాయశ్చిత్తములు చేసుకొని తిరిగి పునీతుడౌతాడు. పశ్చాత్తాపంలేనినరులు ఉత్తమ గతిని పొందరు. (86) సత్కధా శ్రవణం వల్ల ఎప్పుడూ ఉత్తమ గతిని పొందుతారు. పుణ్య క్షేత్రమందు నివాసం వల్ల చిత్తశుద్ధి కలుతుంది. (87)  

తా ॥ సత్కధ వల్ల ఎప్పుడూ ఉత్తమ గతిని పొందినట్లు ఇతరములైన నద్ర్వత ములతో ప్రాణులకు ఉత్తమ గతి కలుగదు (88) తుడిచిన కొద్దీ అద్దం నిర్మల మైనట్లు ఆ సత్కధతో మనస్సు పరమ శుద్ధిని పొందుతుంది (89) విశుద్ధ మైన మనస్సు యందు నరులకు ఉమావతి ధ్యానము సిద్ధిస్తుంది. ధ్యానం వలన మనోవాక్కాయములతో ఏర్పడిన మలినమంతా (90) వెంటనే నశించి, కృతకృత్యులై శంభుని పరమ పదమును చేరుకుంటారు. అందువల్ల పుణ్యం సాధించదలచిన వారికి సత్కధ ఉత్తమ సాధనము (91) కధ వల్ల ధ్యానం సిద్ధిస్తుంది. ధ్యానంవల్ల ఉత్తమ కైవల్యం సిద్ధిస్తుంది. పరమధ్యానము సిద్ధించ కుండా ఈ కధను విన్నవారు మరో జన్మలో ధ్యానాన్ని పొంది ఉత్తమ గతికి చేరుతారు. (92) నా మోచ్చారణ మాత్రంతో మంత్రాన్ని జపించి అజామీలుడు, పశ్చాత్తాపాన్ని పొందిన వాడై ఉత్తమ గతి చేరాడు. (93) నరులకు అన్ని శ్రేయస్సులకు మూలము సత్కథా శ్రవణము. అది లేని వాడు పశువు. వాడు బంధం నుండి ఎట్లా ముక్తుడౌతాడు. (94). అందువల్ల నీవు కూడా అన్ని విషయముల నుండి బుద్ది మరలిన దానవై అధిక భక్తిని పొంది ఎప్పుడు సత్కధను విను. సత్కధను రోజూ విన్నందువల్ల నీ మనస్సు శుద్ధిని పొందుతుంది (95) దానితో విశ్వేశుని ధ్యానిస్తావు. ఆ పిదవ ముక్తి నొందుతావు. శివ పాదములు ధ్యానం చేసే వానికి ఒక జన్మతో ముక్తి (96) కలుతుంది. అనుమానం లేదు. నేను నిజం చెబుతున్నాను. నిజము. అని బ్రాహ్మణుడు చెప్పగా ఆ స్త్రీ కన్నీళ్ళు నిండినదై (97) ఆతని పాదములపై వడి కృతార్ధురాల నైనాను అని పలికింది. ఆ మహాక్షేత్రమందు, ఆ బ్రాహ్మణోత్తముని నుండే (98) కైవల్య ఫలమునిచ్చే సత్కధలను ఆ సాధ్వి విన్నది. ఆ ద్విజుడు ఆమెకు వైరాగ్యముతో కూడిన కధలను చెప్పాడు (99) వాటిని వినగానే నరుడు వెంటనే విషయ వాసనను వదులుతాడు. ఆమే మనను ఎట్లా శుద్ధమైందో ఎట్లా వైరాగ్య రసము నందిందో (100) ఆ ద్విజుడు భక్తితో కూడిన శివకధలను చెప్పాడు. ఎట్లా ఎట్లా ఆమె మనను ప్రసాద గుణమును పొందిందో అట్లా అట్లా మెల్లగా శివుని ధ్యాన యోగమును ఉపదేశించాడు (101) మెల్ల మెల్లగా రజస్త మన్సు లు పోయి నిర్మలత ఏర్పడి నర్వేంద్రియములలో గగ్రహణము తొలగి పోయి, హృదయం విశుద్ధతత్వమై ఆ బ్రాహ్మణ స్త్రీ హృదయము విశ్వేశ్వర రూపచింతన మందు ప్రవేశించింది (102) ఇట్లా సద్గురువును పొంది ఆ స్త్రీ మంచి బుద్ధిని పొంది మాటిమాటికి శివుని యొక్క చిదానంద మయమైన శరీరాన్ని ధరించింది (103) రోజు తీర్థజలమందు స్నానంచేసి జటావల్కలములు ధరించి భస్మం అన్ని అవయవములందు పూనుకొని రుద్రాక్షాలంకారము కలిగి (104) శివనామ జపమందు ఆసక్తు రాలై వాక్కును బంధించి మిత భోజనం కలదై పద్మాసనమందు కూర్చొని అవ్యగ్రురాలై సత్కధలను వినదలచి (105) గురుశుశ్రూషయందు ఆనర్తురాలై అవత్యనుహృజ్జనులను వదలి గురూ వదిష్టయోగంతో శివుని ఈ విధంగా సంతోషపరచింది. (106) 

తా ॥ ఓ విశ్వేశ! ప్రపంచ లయమునకు ఉనికికి జన్మకు కారణమైనవాడా, లోకములతో నమస్కరింపబడే ఒకే నాథుర, శివ, శాశ్వత, విశ్వరూప, కాలాతీతుడ,

విపరీత గుణములతో కన్పించే వాడ, శ్రీ మన్మహేశ నాయందు నీ కృపాకటాక్షమును ఉంచు (107) ఓ శంభు చంద్రుని తలపై గలవాడ, శాంత మూర్తి, గంగాధర, అమరవర అర్చిత పాద పద్మములు కలవాడ, నాగేంద్రభూషణ, నరేంద్ర మందుండేవాడ, ఈశ, భక్తుల ఆర్తిని హరించేవాడ, నాపై నీ కృపాకటాక్షాన్ని ఉంచు (108) శ్రీ విశ్వనాధకరుణాకర,శూల నీలకంఠ, మదనాంతక, విశ్వమూర్తి, గౌరీ పతి, నపై నీ కృపాకటాక్షాన్ని ఉంచు (109) ఇట్లా ప్రతిరోజు భక్తితో మహేశ్వరుని ప్రార్థిస్తూ సత్కధను వింటూ చక్కగా కర్మబంధాన్ని తెంపుకుంది (110) కొంతకాలానికి ఆ స్త్రీ శరీరాన్ని వదలి మహేశుని అనుచరులతో తీసుకపోబడి శివ మందిరానికి చేరింది (111) అక్కడ దేవతలు ఉమతో పాటు మహాదేవుని సేవిస్తున్నారు. గణేశ, నంది, భృంగి, మొదలగువారిలో వీరభద్రేశ్వరాదులతో (112) సేవించబడుతున్న గౌరీశుని, కోటిసూర్యుల సమాన కాంతి వానిని త్రిలోచనుని, పంచముఖుని, నీలగ్రీవుని, సదాశివుని (113) వామాంకమందు గౌరిని ధరించిన వానిని విద్యుత్చంద్రులవంటి కాంతి గలవానిని చూచి తొందరగా ఆ నారి మాటిమాటికి నమస్కరించి (114) ఆనంద అశ్రుజలములు కలదై రోమహరములతో కూడినదై ఉండగా దయగల పార్వతి శివులు ఆమెను సంమానించారు (115) వరము ఆనందము, వునమైనజ్యోతిమ్పగల శాశ్వతమైన ఆలోకమందునివాసాన్ని పొంది, అచలమైన ఎదురులేని ముఖాన్ని పొందింది. (116) ఆమె ఒకసారి ఉమాదేవిని సమీపించి నమస్కరించి ఇట్లా అడిగింది. నా భర్త ఏ గతిని పొందాడు అని (117) ఆమెతో మహాదేవి ఇట్లుంది. దురాశయం గల నీ భర్త నరక దుఃఖములనుభవించి వింధ్యంలో పిశాచమైనాడు (118) తిరిగి ఆ స్త్రీ త్రిభువనేశ్వరురాలైన ఆ దేవిని అడిగింది. ఏ ఉపాయముతో నా భర్త సద్గతిని పొందుతాడు, అని (119) దేవి ఇట్లా అంది - అతడు మా కధను మహాపుణ్యమైన దానిని ఎప్పుడైనా వింటే, ఈ దుర్గతిని  దాటి ఈ లోకానికి వస్తాడు అని (120) 

తా ॥ ఆనే గౌరి మాటలను విని ఆ స్త్రీ చేతులు జోడించి, ఆ దేవిని ప్రార్థించింది. భర్త పాపాన్ని శుద్ధిచేయమని (121) ఆమె మాటి మాటికి ప్రార్థించగా పార్వతి దయగలదై తుంబురుడనే గంధర్వుణ్ణి పిలిచి ఇట్లా చెప్పింది (122) తుంబుర! నీవు వెళ్ళు నీకు మేలౌతుంది. వింధ్య శైలానికి ఈమెతో వెళ్ళు. ఆక్కడో పిశాచి ఉన్నాడు. ఈమె భర్త చెడు బుడ్డివాడు (123) ఆతని ఎదుట పరమ పుణ్యమైన మా గుణములతో కూడిన కథను చెప్పి దుర్గతి నుండి ముక్తుడైన ఆతనిని శివుని సమీపమునకు తీసుకురా (124) అని దేవి చెప్పగా తుంబురుడు ఆమెకు నమస్కరించి ఆమెతో కూడి వింధ్యాదికి త్వరగా వెళ్ళాడు (125) అక్కడ పెద్ద శరీరం కల ఎర్రని, కళ్ళు గల పెద్ద హనువు గల, నవ్వుతున్న ఏడుస్తున్న, గుఱ్ఱంలా ఎగురుతున్న పిశాచాన్ని చూశాడు (126) బలవంతంగా పట్టి అతనిని తాళ్ళతో కట్టి ఉంచుకొని తుంబురుడు వల్ల కీహస్తుడై గౌరీ పతి కధను చెప్పాడు (127) ఆ పిశాచము మహా పుణ్యమైన శివుని కధను విని పాపమంతా పోయి ఏడురోజులకు స్మృతి నొందాడు (128) అతడు పైశాచ శరీరాన్ని వదలి దివ్య స్వరూపాన్ని పొంది, తాను కూడా పార్వతీ పతి కధలను గానం చేశాడు (129) విమాన మధిరోహించి ఆ దివ్యరూపధారి ఆ తుంబురుడు ప్రక్కనుండగా తన భార్యతో కూడి మహేశ్వరుని గుణాలను గానం చేస్తూ సనాతనమైన కైవల్య పదానికి వెళ్ళాడు. (130) సూతులిట్లా అన్నారు. దురితమును తొలగించే ఈ పుణ్యమైన అఖ్యానాన్నిచెప్పాను. మహేశ్వరునికి ప్రతికూర్చేది నిర్మలజాన సాధకము (131) ఏ మర్త్యుడు దీన్ని వింటాడో చక్కగా కీర్తిస్తాడో ఆతడు ముక్తుడౌతాడు శంభు గుణములను చెప్పటం విచిత్రమైనది. పాపనాశాకము (132) పరమానందాన్ని కల్గించేది. భవ రోగమునకు గొప్ప మందు వివిధ భోగములను అనుభవించి, ఇక్కడ, పిదప ముక్తుడై పరగతికి వెళ్తాడు (133) సూతునివచనము - ఓ మునిసత్తములార - మీరు మహా బాగులు, కృతార్ధులు, ఎవరు ఎల్లప్పుడూ అమృత రసవైనవమైన శంభువు కథను వింటారో (134) వారు జీవలోకమందు జన్మను పొందినట్లు లెఖ ఎవరు విశ్వనాధుని ధ్యానిస్తారో వారు ధన్యులు. ఎవరి వాక్కు గుణములను స్తుతిస్తోంది. ఎవరి చెవులు కథను వింటాయి. అట్టి వారే భవమును దాటుతారు (135) ఏ విధ గుణభేదములలో ఎప్పుడూ రూపం స్పష్టంగా లేని తన మహిమతో అంతటా జగత్తులో బయట, లోఅప్లనీ సమానమో అట్ల తన మనసులో తిరగే, వాజ్మనోవృత్తి కిదూరమైన అనంత ఆనంద సాంద్రుడైన పరమశివుని స్తుతిస్తున్నాను (136) అని శ్రీస్కాందమహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మోత్తర ఖండమందు పురాణ శ్రవణ మహిమ వర్తన మనునది ఇరువది రెండవ అధ్యాయము - 22 - బ్రాహ్మఖండమందు తృతీయమైన బ్రహ్మోత్తరఖండము ఇది సమాప్తమైనది - అని స్కాంద మందు మూడవదైన బ్రాహ్మఖండము సంపూర్ణము.