స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని బ్రహ్మోత్తర ఖండము

20 అధ్యాయము

తా సూతుని వచనము - ఇక రుద్రాక్ష మాహాత్మ్యాన్ని సంక్షిప్తంగా వర్ణిస్తాను. వినే వారికి చదివే వారికి అన్ని పాపములను నశింప చేసేది (1) భక్తుడైనా కాకపోయినా నీచుడైనా, నీ చతరు డైనా ఎవరు, రుద్రాక్షను ధరిస్తారో, వారు అన్ని పావముల నుండి ముక్తు లౌతారు (2) రుద్రాక్ష ధారణ పుణ్యప్రదమైంది. దేనితోను పోల్చరానిది. తత్వ దర్శులైన మునులు దీనిని మహా వ్రతమన్నారు (3) ధ్రువ వ్రతుడై వేయి రుద్రాక్షలు ధరించిన వానిని దేవతలంతా నమస్కరిస్తారు. రుద్రుడెట్లాగో ఆతడట్లా (4) వేయి లేకపోతే పదహారు పదహారు చేతులకు ధరించాలి ఒకటి శిఖలో చేతులు పన్నెండు వన్నెండు (5) కంఠ మందు ముప్పది రెండు తల పై నలుబది, చెవులకు ఒక్కొక్క దానికి ఆరేసి వక్షంలో నూట ఎనిమిది ధరించాలి. రుద్రాక్షలను ధరించినవారు రుద్రునివలే పూజింపబడుతారు (6) ముత్యం, పగడం, స్పటికం, వెండి, వైడూర్యం, బంగారం వీటితో కూడిన వానిని రుద్రాక్షలను ఎవరు ధరిస్తారో వారు శివులౌతారు (7) కేవలం రుద్రాక్షలను కూడా దొరికి నంతవరకు ఎవరు ధరిస్తారో అతనిని పావములు తాకవు, సూర్యుని చీకట్లు తాకనట్లు (8) రుద్రాక్షమాలతో జపింపబడిన మంత్రము అనంత ఫలాన్నిస్తుంది. రుద్రాక్ష లేకుండా జపం చేస్తే అది అంతంత మాత్రం ఫలితాన్నిస్తుందీ (9) అధిక పుణ్యాన్నిచ్చే రుద్రాక్ష ఒక్కొటైన ఎవని శరీరంలో లేదో వాని జన్మ వ్యర్థము. ఒకవేళ త్రిపుండ్రం లేకపోతే కూడా (10) రుద్రాక్షను తలలో కట్టుకొని శిరః స్నానము ఎవరు చేస్తారో వారికి గంగా స్నాన ఫలము కలుతుంది. ఇందులో అనుమానం లేదు (11) నీటితో అభిషేకం లేకుండా ఎవరు రుద్రాక్షను పూజిస్తారో వారు, లింగపూజకు ఏ ఫలమో అదే ఫలం పొందుతారు నిశ్చయము (12) ఏక వక్త్రములు, వంచ వక్త్రములు, కొన్ని పదకొండు ముఖములు కలవి. పదునాల్గు ముఖములవి కొన్ని ఈ రుద్రాక్షలన్ని లోక పూజితములు (13) శంకరాత్మకమైన రుద్రాక్షను రోజు భక్తితో పూజిస్తే దరిద్రుడైనా రాజరాజ శ్రియాన్వితుడౌతాడు (14) బుద్ధిమంతులు ఇక్కడ ఈ పుణ్యమైన కథను చెప్తారు. విన్నా కీర్తించినా మహాపాపముల నశింపచేసేది (15).    

తా ॥ కాశ్మీర దేశంలో భద్ర సేనుడని రాజు ఉండేవాడు. అతని కొడుకు బుద్ధిమంతుడు, వీర్యవంతుడు సుధర్ముడు అని ఉండేవాడు (16) అతని మంత్రి కొడుకు పదుణుడు తారకుడని ఉండేవాడు. రాజపుత్రునకు ఆతడు మిత్రుడు చాలా మంచివాడు (17) వారిద్దరు చాలా స్నేహం కలవారు కుమారులు, రూపంలో అందగాళ్ళు, విద్యాభ్యాస పరులు బాల్యంలో కలిసి ఆడుకునే వాళ్ళు.(18) వాళ్ళు ఎప్పుడూ అన్ని అవయవములందు రుద్రాక్షలు ఆభరణంగా ధరించేవారు మంచి అవయములవారు ఎప్పుడూ భస్మం ధరించేవారు (19) హారరే యూర కటక కుండలాది విభూషణములు బంగారు రత్నములు కలవి వదలి వారు రుద్రాక్షలు ధరించేవారు (20) రోజు రుద్రాక్షమాలలు కలవారు. రుద్రాక్షలు కరకంకణములు కలిగిన వారు రుద్రాక్షలు కంఠాభరణంగా కలవారు ఎప్పుడూ రుద్రాక్షలు కుండలములుగా గలవారు (21) హేమరత్నాది అలంకారాలు వారికి మట్టి,రాళ్ళ వలెను కన్పించేవి. జనులు ఎంత చెప్పినా రుద్రాక్షలను వదలలేదు. (22) ఆ కాశ్మీరరాజు యొక్క గృహమునకు అనుకోకుండా పరాశరుడు మునివరుడు, సాక్షాత్తు పితామహునివలె వచ్చాడు (23) ధర్మభృతులలో శ్రేష్ఠుడైన ఆ రాజు అతనిని విధి ప్రకారము పూజించాడు . త్రికాలజ్ఞుడైన మహామునిని సుఖంగా కూర్చున్న వాణ్ణి ఆ రాజు అడిగాడు. (24) రాజ వచనము - ఓ భగవాన్ ! ఈతడు నాకుమారుడు ఆతడు నా మంత్రి కుమారుడు రత్నాభరణములందు స్పృహలేని వారు రుద్రాక్షధారులు (25) రత్నా కల్పములను స్వీకరించటానికి ఎప్పుడు నేను ఆదేశిస్తున్నా వారు నా మాటను దాటవేస్తున్నారు. రుద్రాక్షలందే తత్పరులు (26) వీరు ఎప్పుడూ ఎవరితోనూ ఈ బాలురు ఉపదేశాన్ని పొందలేదు. ఈ స్వాభావిక వృత్తి కుమారులకు ఎట్లా వచ్చింది (27) అనగా పరాశరుని వచనము- ధీమంతుడైన నీ పుత్రుని సంగతి చెబుతాను, ఓరాజ! విను. విస్మయా వహమైన మంత్రి పుత్రుని పూర్వ వృతాన్ని నీ వడిగినట్లు చెబుతాను విను (28) పూర్వం నంది గ్రామంలో మహానంద అని ప్రసిద్ధమైన ఒక వారవనిత, శృంగార లలితా కృతి గలది ఉండేది. (29) పూర్ణేందు సదృశమైన ఛత్రము బంగారుతో ప్రకాశించే యానము, మంచి దండము గల చామరాలు బంగారు పాదుకలు (30). 

తా ॥ విచిత్రమైన అంబరములు చాలా విలువైనవి, కాంతి వంతమైనవి, చంద్రరశ్మి వంటి శయ్యలు, హిరణ్మయమైన మంచములు (31) నూర్లకొలది ఆవులు,బఱ్ఱె లు, నూర్కకొలది దాసజనము (32) సర్వాభరణములలో వెలిగే శరీరాలు గల, నవ యౌవనవతులైన దాసీజనము, అమూల్యమైన భూషణములు నవరత్నములలో వెలిగేవి (33) గంధ కుంకుమ కస్తూరి కర్పూర అగరు లేపనములు, చిత్రమైన మాలల శిరోభూషణములు, స్వేచ్చగా మృష్టాన్న భోజనము (34) నానాచిత్ర వితానములలోడివ వాఖాధాన్యమయమైన గృహము, బహుసహస్ర రత్నములు గల కోటి సంఖ్యాధికమైన ధనము (35) ఇంత వైభవమున్నా ఆవేశ్య కామం లేనట్టిది, నిత్యము శివ పూజారతురాలు, సత్య ధర్మ పరురాలు (36) సదాశివ కథలందు ఆసక్తికలది శివుని నామ కథలందు ఓఉత్సుకము కలది, శివభక్తుల పాదములందు తల వంచేది, ఎప్పుడూ శివభక్తి యందాసక్తి గలది (37) వినోదం కొరకు ఆ వేశ్య నాట్యమంటపం మధ్యన నుండి రుద్రాక్షలలో అలంకరించి ఒక కోతిని ఒక కోడిని (38) కరతాళములలో గీతములలో ఎవ్వరూ స్వయంగా నటించేసేది. తిరిగి సఖరాండ్రతో చుట్టబడి గట్టిగా నవ్వేది (39) రుద్రాక్షలతోనే కేయూర కరాభరణ భూషణములు చేయగా వాటిని ధరించి కోతి ఆమె శిక్షణతో పిల్లవానివలె నాట్యం చేసేది. (40) శిఖ యందు రుద్రాక్ష కలిగి కోడి కోతితో పాటు చాలా సేపు నాట్యం చేసేది. నృత్యజులు చూపే వారికి చిత్రమన్పించేట్లుగా (41) ఒకసారి ఆమె భవనమునకు. ఒక వైశ్యుడు శివవ్రతి వచ్చాడు. ఆతడు రుద్రాక్షలు ధరించాడు త్రిపుండ్రము గలవాడు. మమకారంలేని వాడు కృతి (42) ఆతడు భస్మాన్ని ధరించి, విశదమైన ప్రకోసమందు కంకణం ధరించి మహారత్నములు పరిచినట్లు, కరుణ అర్కునివలె వెలిగిపోతూ (43) ఉన్నాడు. వచ్చిన అతనిని వచ్చిన అతనిని అవేశ్య చాలా ఆనందంతో పూజించి ఆతని ప్రకోసమునకున్న కంకణాన్ని చూచి ఆశ్చర్యంలో ఇట్లా అంది (44) మహారత్నములతో కూడిన ఆ కంకణము.మీ చేతికుంది అది నా మనసును హరిస్తోంది. ఓ సాధు! అది దివ్యశ్రీ భూషణములకు ఉచితమైంది అని. (45) అన్న ఆ నవరత్నములతో కూడిన దానిని కరభూషణమందు ఆశ గలదానిని చూచి ఉదారమతి గల వైశ్యుడు నవ్వుతూ ఇట్లన్నాడు (46) వైశ్యుని వచనము - ఈ రత్నవరమందు దీవ్యమైన దాని యందు నీ మనస్సుకు ఆశుంటే దాన్నే తీసుకో సంతసించి దీనికి మూల్యమిస్తావా (47) అనగా వేశ్య అంది - మేము స్వేచ్ఛగా తిరిగే వాళ్ళం వేశ్యలు పతివ్రతలు కాము. మా కులోచిత ధర్మం వ్యభిచారము అనుమానంలేదు (48) ఈ రత్న ఖచితమైన కరభూషణాన్ని ఇస్తే రాత్రింబగళ్ళు మూడు రోజులు నీ భార్యనౌతాను నేను అని అనగా. (49) 

తా వైశ్యుని వచనము - ఓ వారవల్లభ! నీ మాట నిజమై నట్లైతే అది అట్లాగే కాని రత్న వలయాన్ని ఇస్తాను. మూడు రోజులు నా వధువువు కమ్ము. (50) ఈ వ్యవహారంలో సూర్యచంద్రులు ప్రమాణము మూడు సార్లు సత్యము అని పలికి నా హృదయాన్ని స్పృశించు ఓ ప్రియ (51) అని అనగా వేశ్య వచనము - మూడు రోజులు రాత్రింబగళ్ళు నీకు భార్యపై సహధర్మాన్ని ఆచరిస్తాను అని ఆమె అతని హృదయాన్ని స్పృశించింది (52) ఆమెకు ఆ వైశ్యుడు రత్న కంకణాన్ని ఇచ్చాడు. రత్నమయమైన లింగాన్ని ఆమె చేతిలో పెట్టి ఇట్లా అన్నాడు (53) ఇది రత్నమయమైన శివలింగము నా ప్రాణంతో సమానమైంది. ఓ కాంత దీన్ని నీవు రక్షించాలి. దానికి హాని జరిగితే నాకు మృతి (54) అట్లాగే అని ఆ స్త్రీ ఆ రత్న లింగాన్ని తీసుకొని నాట్యమంటప మందలి స్తంభమందు ఉంచి ఇంట్లోకి వచ్చింది. (55) ఆమె ఆ వైశ్యునితో రాత్రి విటధర్మం ప్రకారం కలిగింది. మృదు తల్పంతో కూడిన మంచము పై హాయిగా పడుకుంది (56) పిదప అర్థరాత్రి యందు నాట్యమంటవం మధ్యలో అకస్మాత్తుగా అగ్నిపుట్టింది. దానిని ఆవరించింది (57) మంటపం కాలిపోతుంటే త్వరగా లేచి తొందరగా ఆ వేశ్య కోతిని బంధనం నుండి విడిపించింది (58) ఆ కోతి బంధ విముక్తురాలై ఆ కోడితో కూడా భయపడి అనేక అగ్ని కణములను చిమ్ముతూ దూరంగా పరుగెత్తింది (59) స్తంభంతో పాటు రాలి ఆ లింగము తునకలైంది. వేశ్య వైశ్యుడు ఇద్దరు చూచి చాలా దుఃఖాన్ని పొందారు (60) ప్రాణంతో సమానమైన లింగం కాలిపోవటం చూచి ఆ వైశ్య వతి, స్వయంగా నిర్వేదాన్ని పొంది చనిపోదలిచాడు (61) నిర్వేదంతో చాలా దుఃఖంతో వైశ్యుడు ఆమెతో ఇట్లా అన్నాడు. శివలింగం పగిలిపోతే నేను బ్రతుక దలచుకోలేదు (62) ఓ భద్రే వాడు నీ బలాధికులైన భృత్యులతో చితిని ఏర్పరచు. శివుని యందు మనస్సు నిలిపి, అగ్నిలో ప్రవేశిస్తాను. (83) ఒకవేళ బ్రహ్మ ఇంద్ర విష్ణ్యాదులు నన్ను ఏకమై వారించినా, ఈ క్షణంలో ధైర్యంగా అగ్నిలో ప్రవేశించి ప్రాణాలు వదుల్తాను (64) ఆతని ఈ దృఢనిశ్చయాన్ని తెలుసుకొని ఆమె చాలా దుఃఖించి, తన నగరానికి బయట తన భృత్యులతో చితిని ఏర్పాటు చేసింది (65).

తా ॥ ఆ వైశ్యుడు శివ భక్తితో పవిత్రుడై మండుతున్న అగ్నికి ప్రదక్షిణం చేసి జనులు చూస్తుండగా ధీరుడు అగ్ని ప్రవేశం చేశాడు. ఆ యువతి పశ్చాత్తాప పడింది (88) ఇక దుఃఖంతో ఆ స్త్రీ సునిర్మలమైన ధర్మాన్ని తలచి బంధువులందరిని చూచి ఈ విధంగా కరుణంగా మాట్లాడింది (67) రత్న కంకణాన్ని తీసుకొని నేను నిజం చెప్పాను. మూడు రోజులు ఆ వైశ్యునకు భార్యగా అంగీకరించాను (68) నేను చేసిన కర్మతో శివ వ్రతయైన ఈ వైశ్యుడు మరణించాడు. అందువల్ల ఇతనితో పాటు నేను అగ్నిలో ప్రవేశిస్తాను. సధర్మచారిణి అని చెప్పాను. అది నిజము చూడండి (69) త్రిభువనేశ్వరులు దేవతలు సత్యంతో ప్రీతినొందుతారు. సత్యాసక్తి ఉత్తమ ధర్మము. సత్యమందే అన్ని ఉన్నాయి. (70) సత్యంతోనే స్వర్గమోక్షములు అసత్యంతో పరాగతిలేదు. అందువల్ల సత్యాన్ని ఆశ్రయించి అగ్నిలో ప్రవేశిస్తాను (71) అని ఆమె దృఢ నిశ్చయంతో బంధువులు వద్దంటున్నా సత్యలోప భయంవల్ల ఆ నారి ప్రాణములు విడువటానికి మనస్సు నిశ్చయించుకొంది (72) అంతా శివభక్తులకు ఇచ్చి సదాశివుని ధ్యానించి, అగ్నికి మూడు ప్రదక్షిణలు చేసి ప్రవేశించటానికి సిద్దమై నిలిచింది (73) మండుతున్న అగ్నిలో పడుతున్న ఆమెను, తన పాదములపై నిలిపిన మనస్సుగల దానిని విశ్వాత్ముడు, శివుడు ప్రాదుర్భవించి స్వయంగా వారించాడు (74) తాను ఆ అఖిలదేవదేవుని త్రిలోచనుని, చంద్రకళావతం సుని కోటిశంక సూర్య అనలుల వలె భాసించే వానిని చూచి స్తబ్దఐనట్లు భీత  ఐ నటు ఐ అట్లాగే నిలబడింది. (75) ఆ విహ్వలురాలును, పరిత్రనురాలను, వణుకుతున్న దానిని, జడంగా ఐన దానిని కన్నీరు కారుస్తున్న దానిని చేతికి తీసుకొని ఓదార్చి ఇట్లన్నాడు. (76) శివుని వచనము - నీ సత్యము, ధర్మమును నా పై నీ నిశ్చలభక్తిని పరీక్షించటానికై నీ దగ్గరకు వైశ్యుడనై నేను వచ్చాను (77) మాయవల్ల అగ్నిని కల్పించి నాట్య మంటపాన్ని కాల్చాను. రత్నలింగాన్ని కాల్చి ఆగ్నిని వర్షించాను (78) వేశ్యలు కపటమాచరించేవారు, స్వైరిణులు జనవంచకలు ఆ నీవు సత్యాన్ని అనుసరించివాతో పాటు అగ్నిలో ప్రవేశించావు (79) అందువల్ల నీకు దేవతలకు లభించని భోగములను ఇస్తున్నాను. దీర్ఘ ఆయుస్సు దీర్ఘ ఆరోగ్యము సంతాన వృద్ధి నీవు ఏదేది కోరితే అదంతా నీకు ఇస్తాను. ఓ సుశ్రోణి! అని (80) అనగా సూతుల వచనము - అని గౌరీశుడు పలుకగా ఆ వేశ్య ఇట్లాఅంది (81) వేశ్యవచనము - నాకు భోగాల ఫై కోరికలేదు. భూమి పై కాని స్వర్గంలో కాని పాతాళమందు కాని నీ పాదాంబుజ స్పర్శకన్న వేరే ఇతరమైన దానిని దేనిని కోరను (82) ఈ భృత్యులు, దాసులు, నా ఇతర బంధువులు అందరు మి పూజా వత్తులై ఉన్నారు. మీ యందే తమ ప్రవృత్తులను కలిగివారు (83) వీరందరిని, నాతోపాటు నీ వరమైన స్థానానికి తీసుకువెళ్ళి వనోరమైన పునర్జన్మ భయం లేకుండా చేయి. నీకు నమస్కారము (84) అట్లాగే అని ఆమె మాటను శివుడు అభినందించి ఆమెతో పాటు వారిని కూడా పరమపదానికి తీసుకెళ్ళాడు (85) పరాశరుని వచనము - నాట్య మండపిక కాలినప్పుడు ముందు దూరంగా పారవేయబడ్డవారు అక్కడ మిగిలినవారు కుక్కట మర్కటములు వారే (86) కాలంలో మరణించిన ఆమె నాట్య పతి నీ కుమారుడైనాడు. ఈ కుక్కుటము మంత్రి కుమారుడు (87) రుద్రాక్ష ధారణ వల్ల కలిగిన పూర్వజన్మ పుణ్యంతో ఈ పిల్లలిద్దరు గొప్ప కులంలో పుట్టారు. (88) శుద్ధ మానవులై పూర్వ అభ్యాసంవల్ల రుద్రాక్షలు ధరించారు. ఈ జన్మలో ఆ శివుని పూజించి ఆ లోకానికి వెళ్లారు. (89) ఈ పిల్లల ప్రవృత్తి ఇది అని చెప్పాను. శివభక్తురాలైన ఆమె కథ ఇంకేమి అడగదలిచావు (90) అని స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహోత్తరఖండమందు రుద్రాక్షమహిమ వర్ణన మనునది ఇరువదవ అధ్యాయము.