స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని బ్రహ్మోత్తర ఖండము

15 అధ్యాయము

తా సూతుని వచనము - శివయోగియైన ఋషభుని అనుభవము వర్ణించాను. మరో శివయోగి యొక్క ప్రభావాన్ని కూడా చెపుతాను (1) భస్మము యొక్క మాహాత్మ్యాన్ని సూక్ష్మంగా వర్ణిస్తాను. పాపులైన జనులు దానిని విని కృతకృత్యులౌతారు (2) మహాతపస్సంపన్నుడైన వామదేవుడను పేరుగల శివయోగి ఒకరున్నారు. నిర్ద్వంద్వుడు, నిర్గుణుడు, శాంతుడు, నిస్సంగుడు, సమదర్శనుడు (3) ఆత్మయందు ఆనందించేవాడు, జితక్రోధుడు, గృహము దార లేనివాడు. ఆలోచించకుండా వెళ్ళేవాడు (ఇబ్బందులు లెక్కించడు)మౌని సంతుష్టుడు, దానం పట్టడు (4) శరీరం నిండా భస్మం గలవాడు, జటా మండలం గలవాడు. వల్కల అజినములు కలవాడు. భిక్షను మాత్రమే గ్రహించేవాడు. (5) ఆతడొకసారి లోకంలో తిరుగుతూ అందరిని అనుగ్రహింపదలిచి మహాఘోరమైన క్రౌంచారణ్యాన్ని అనుకోకుండా ప్రవేశించాడు (6) ఆ జనం లేని అడవిలో మిక్కిలి భయంకరముగా ఆకలి దప్పికలతో బాధపడే ఒక బ్రహ్మరాక్షసుడు ఎవ్వడు ఒంటరిగా ఉండేవాడు (7) వచ్చిన ఆ శివాత్ముని ఆ బ్రహ్మరాక్షసుడు చూచి ఆకలితో పీడింపబడి వేగంగా, చంపటానికి అనుసరించాడు. (8) మహాకాయుడు నోరు తెరిచిన వాడు భీమ దంష్ట్రుడు, భయానకుడు వస్తున్నవాణ్ణి చూచి యోగీశుడు కదులలేదు (9) మౌరుడైన రాక్షసుడు వేగంగా పరుగెత్తి చేతులలో బంధించి, కదలిక లేని శివయోగిని పట్టుకున్నాడు. (10) ఆతని శరీర స్పర్శతోనే వెంటనే అతని పాపాలన్నీ పోయి ఆ బ్రహ్మరాక్షసుడు ఘోరంగా విషణుడై పూర్వజన్మ స్మృతి నందాడు (11) చింతామణి స్పర్శతో లోహము బంగారమైనట్లుగా, జంబూనదిని పొంది మట్టి బంగారమైనట్లు (12) మానస సరస్సును చేరి కాకులు హంసలైనట్లు, అమృతాన్ని ఒక సారి త్రాగి నరుడు దేవత్వ మందినట్లు (13) గా, మహాత్ములు దర్శన స్పర్శవాదుల వల్ల పాపాత్ములను పవిత్రులను చేస్తారు. అందువల్లనే సత్సంగము దుర్లభమైంది (14) పూర్వము క్షుత్పిపాసారుడైనవాడు, మౌరాత్ముడు, అడవిసంచారి, వాడు వెంటనే తృప్తినంది పూర్ణానందుడైనాడు. (15) ఆ యోగి శరీరమందలి తెల్లవి భస్మ కణములతో స్పర్శ కలిగి వెంటనే ఘనమైన పాపపు చీకట్లు తొలగిపోగా, పూర్వ జన్మ స్మృతిని పొంది, ఆ రాక్షసుడు, ఆ యోగి పాద పద్మములకు నమస్కరించి ఇట్లన్నాడు (16) రాక్షసుని వచనము - ఓ మహాయోగి! నన్ననుగ్రహించండి. ఓ కరుణానిధి, అనుగ్రహించండి, భవతులైన వారికి, ఆనందమనే అమృతవారిధి అనుగ్రహించండి (17).   

తా ॥ పాపమతిని, ఘోరమైన వాణ్ణి, సర్వ ప్రాణులకు భయం కల్గించేవాణ్ణి అట్టి నేనెక్కడ. కరుణాత్ములైన మీలాంటి మహానుభావుల దర్శనమెక్కడ (18) ఘోరమైన దుఃఖ సాగర మందు పడిన నన్ను ఉద్ధరించు, ఉద్ధరించు. మీ సన్నిధిలో ఉంటే చాలు ఎంతో ఆనందం పెరుగుతుంది (19) అనగా వామదేవుని వచనము - వనేచరుడు ఘోరమైన రాక్షసుడవు నీవెవరు. ఇక్కడెందుకున్నావు. ఈ మహా ఘోరమైన కష్టమైన గతిని ఎల్లా పొందావు. (20) అనగా, రాక్షసుని వచనము - నేను రాక్షసుణ్ణి. కాని ఇంతకు మునుపు ఇరువది ఐదవ జన్మలో యవన రాష్ట్రమునకు రక్షకుణ్ణి. పరాక్రమవంతుణ్ణి దుర్జయుడని పేరుగలవాణ్ణి (21) ఆ నేను దురాత్ముణ్ణి. పాపీయుణ్ణి, స్వేచ్చగా తిరిగేవాణ్ణీ, మదోత్కటుణ్ణి. దండధారుణ్ణి, దురాచారుణ్ణి. ప్రచండుణ్ణి. దయాహీనుణ్ణి. ఖలుడను (22) యువకుణ్ణి. అనేకమంది భార్యలున్నా కామా సక్తుణ్ణి జితేంద్రియుణ్ణి కాను. ఇట్టి పాపీయమైన చేష్టగల మరొకరిని పొందాను (23) ప్రతిరోజు ఇతరమైన కొత్త స్త్రీ ని అనుభవించే మనసు గలవాణ్ణి ఎప్పుడూ. సర్వ దేశముల నుండి, నా ఆజ్ఞతో భృత్యులు ఆడవాళ్ళను తెచ్చేవారు (24) అనుభవించి, అనుభవించి వదలి వారిని ఒక్కొక్కరిని ప్రతిరోజు అంతఃపురమందుంచి, పిదప ఇతర స్త్రీ లను చేరేవాణ్ణి.(25) ఈ విధముగా నా రాష్ట్రము, పర రాష్ట్రము దేశములు గ్రామ పురములు వీటన్నింటి నుండి స్త్రీలను తెప్పించి ప్రతిరోజు రమించేవాణ్ణి ఒకసారి అనుభవించిన దానిని రెండవమారు అనుభవించే వాడిని కాదు (26) నేనను భవించిన స్త్రీలను మరొకడెవ్వరూ అనుభవించే వారు కాదు. అంతఃపురంలో ఉండి రాత్రింబగళ్ళు ఏడ్చువాళ్ళు (27) బ్రహ్మవిట్ క్షత్రి యశూద్రుల స్త్రీ లను నేనెప్పుడు హరించానో అప్పుడు నా రాజ్యమందున్న బ్రాహ్మణులు తమ భార్యలతో పాటు పరుగెత్తి పోయారు (28) భర్తలు కలవారు, కన్యలు, విధవలు, రజస్వలలు వీళ్ళందరిని రప్పించి ఆ  స్త్రీలను కామహతుడ నై రమించాను (29) బ్రాహ్మణ స్త్రీ లు మూడువందలు, నాలుగు వందలు రాజ స్త్రీలు, ఆరువందలు వైశ్య స్త్రీలు, శూద్ర స్త్రీలు వేయిమంది (30) నూరుగురు చండాల స్త్రీలు, బోయజాతి వాళ్ళు వేయిమంది, నాట్యకత్తెలు ఐదువందలు, చాకలి వారు నాలుగు వందలు (31) వార స్త్రీలు లెక్కలేనంత మంది ఇంతమందిని దురాత్ముడనై నేను అనుభవించాను. ఐనా నాకు కామం అంటే తృప్తి కలుగలేదు. (32) ఈ విధముగా దుర్విషయా సక్తుడనై మత్తుడనై, ఎప్పుడూ పానరతుడనైన నన్ను యౌవ్వనంలోనే రాజ యక్ష్మాధి రోగములు ఆశ్రయించాయి. (33) రోగాలతో బాధపడుతూ, సంతాన హీనుడనై శత్రువులు కూడా పీడించగా అమాత్యులు,భృత్యులు విడిచి పెట్టిపోగా నా కర్మవల్ల నేను చనిపోయాను (34). 

తా ॥ ఆయుస్సు నశిస్తుంది. అపకీర్తి వస్తుంది. భాగ్యం నశిస్తుంది. దుర్గతిని పొందుతారు. పురాతనమైన పితరులు స్వర్గం నుండి కింద పడతారు. ధర్మం నుండి తప్పిన నరుని స్థితి ఇది నిశ్చితము (35) ఆ పిదప యముని జింకరులు నన్ను యమ మందిరానికి తీసుకెళ్ళారు. పిదప ఘోరమైన నరక కుండమందు పడవేయబడ్డాను (36) ఆ ఘోరమైన నరక మందు ముప్పది వేల సంవత్సరాలు నేను రేతము తాగుతూ యమ కింకరులలో పీడింపబడుతూ ఉన్నాను (37) పిదప పాపం మిగులగా అడవిలో జనం లేనిచోట పిశాచుణ్ణై సహస్ర శిశ్నములు కలవాడి నైనాను. రోజు ఆకలి దప్పికలతో బాధపడేవాణ్ణి (38) పిశాచ గతిని పొంది దేవతల నూరు శరత్తులను గడిపాను. రెండో జన్మలో నేను ప్రాణ భయంకరమైన పులి నైనాను. (39) మూడవసారి అజగరమైనాను. చతుర్థ జన్మలో తోడేలు నైనాను. పంచమంలో మలందినే పదినైనాను. ఆరవ జన్మలో తొండనైనాను. (40) ఏడవ జన్మలో కుక్కనైనాను. అష్టమ జన్మలో నక్కనైనాను. నవమం లో గవయమైనాను పదవ జన్మలో మృగము నైనాను (41) పదునొకండవ దానిలో కోతి నైనాను. పన్నెండవ జన్మలో గృద్ధ మైనాను. పద మూడవసారి ముంగిసనైనాను. పదునాల్గవ జన్మలో కాకి నైనాను (42) పదిహేనవ సారి గుడ్డేలుగునైనాను. పదహారవ సారి అడవి కోడి నైనాను. పదునేడవ సారి గాడిద నైనాను. పద్దెనిమిదవ జన్మలో పిల్లి నైనాను. (43) పందొమ్మిదవసారి కప్ప నైనాను. ఇరువదవ సారి తాబేలు నైనాను. ఇరువది ఒకటవ హిం చేవ నైనాను. ఇరువది రెండవసారి ఎలుక నైనాను (44) ఇరువది మూడవసారి గుడ్లగూబ నైనాను. ఇరువది నాల్గవపారి అడవి ఏనుగైనాను. ఈ ఇరువది ఐదవసారి జన్మలో బ్రహ్మరాక్షసుడ నైనాను. (45) ఆకలిగొని, ఆహారంలేక, ఈ అడవిలో ఉంటున్నాను. ఇప్పుడు వచ్చిన నిన్ను చూచి చంపదలిచాను. నీ దేహస్పర్శ మాత్రం చేత నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది (46) నీ సమీపంలో గడిచిన వేల జన్మలను ఈవేళ వస్తున్నాను. నిర్వేదం చాలా కలిగింది. నా హృదయం ప్రసన్నమైంది (47) నీ ప్రభావ మిలాంటిది. ఇలాటి శక్తి మీకెలా కలిగింది, ఓ మహామతి! దీనికి తీవ్ర తపస్సు కారణమా తీర్థ సేవపమా (48) యోగం వల్లనా, దేవశక్తి వల్లనా, అనంతశక్తి గల మంత్రములతోనా, ఓ భగవాన్! యథార్థం చెప్పండి. మిమ్మల్ని నేను శరణు వేడాను (49) వామదేవుని వచవం - ఇది నా శరీరానికి తగిలిప భవ్యం యొక్క గొప్ప ప్రభావమి దీవి సంపర్కంవల్ల తమె వృత్తిలో నున్న నీకు ఇంత మంచి బుద్ధి కలిగింది. (50) భస్మశక్తి ఎవరికి తెలుసు, మహాదేవునకు తప్ప ఎవరికీ తెలియదు. శంభువి మాహాత్మ్యం తెలియనట్టే భవతి మహాత్మ్యము తెలియదు (51) పూర్వం నీలాగే ధర్మ వంతుడైన ఒక బ్రాహ్మణుడు మూడుడు ద్రావిడ దేశంలో ఉండేవాడు కర్మవల్ల శూద్రుడైనాడు (52). 

తా ॥ దొంగతనం చేస్తూ, పని లేకుండా, శూద్ర స్త్రీ రతి లాలసుడై ఒకసారి జారుడై వెళ్ళినాడు. ఆ రాత్రి శూద్రుడు వాణ్ణి చంపాడు (53) ఊరి బయట పారవేయబడ్డ ఆ శవం నకు ప్రేత కర్మ జరగాలి. భస్మము పాదమందు గల ఒక కుక్క ఈతని శరీరంను అనుకోకుండా తాకింది (54) ఘోరమైన నరక మందు పడ్డ ఈతనిని శివ కింకరులు తీసుకెళ్ళారు. యమ కింకరులను ఎదిరించి, విమానంలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళారు. (55) శివదూతల దగ్గరకు వచ్చి యముడు కూడా అడిగాడు. మహాపాతకములు చేసిన వీనిని ఎట్లా తీసుకెళుతున్నారు (56) శివదూత లిట్లన్నారు. ఈతనిని శివ విగ్రహాన్ని చూడండి. ఈతని వక్షము, నొసలు, భుజమూలములు భస్మముతో గుర్తించబడ్డాయి. (57) అందువల్ల శివుని ఆజ్ఞవల్ల ఈతనిని తీసుకు వెళ్ళటానికి వచ్చాము. మమ్మల్ని నిరోధించటం వీ వల్లకాదు. ఇందులో మీకు అనుమానం అవసరం లేదు (58) అని యమునితో పలికి శివదూతలు ఆ బ్రాహ్మణుని ఆ పిదప అన్ని లోకాల వారు చూస్తుండగా, అ వామయమైన లోకానికి తీసుకెళ్ళారు (59) అందువల్ల అన్ని పావములకు వెంటనే ఉత్తమమైన బుద్ధి, శంభుని భూషణమైన భస్మము. దాన్నే మేము ఎప్పుడూ ధరిస్తాము. (60) అనగా బ్రహ్మరాక్షసుడు భస్మ మహాతాన్ని విని, తిరిగి విస్తారంగా వినటానికి ఉత్కంత కలవాడై ఇట్లన్నాడు (61) ఓ మహాయోగి! బాగుబాగు నీ దర్శనంతో నేను ధన్యణ్ణైనాను. ఓ ధర్మాత్మ ఈ కుజన్మ నుండి నన్ను విముక్తుణ్ణి చేయి (62) నేను చేసిన పుణ్యం కొంచెముందని నా కన్పిస్తోంది. అందువల్లనే నీ అనుగ్రహంవల్ల ఈ వేళ ముక్తుడైనాను. ఓ ద్విజోత్తమ (63) ఆ రాజు జన్మలో ఒక శివభక్తునకు సద్య ఆ రామములతో కూడిన భూమిని నేను వృత్తిగా ఇచ్చాను (64) యముడు కూడా అదే చెప్పాడు. ఇరువది ఐదవ జన్మలో ఒక యోగి సహవావం వల్ల సంసారం మండి ముక్తి పొందుతావు అని (65) పూర్వజన్మలో సంపాదించిన ఏ కొంచము పుణ్యమో ఈ వేళ ఫలించింది. అందువల్ల మనుష్యులు లేని అడవిలో సమాగమము లభించింది (66) అందువల్ల ఘోర పాపములు గల, కుజన్మలో తిరుగుతున్న నన్ను ఉద్ధరించు ఓ దయవిధి, మంత్రపూతమైన భస్మమును ఇవ్వు (67) (వ్యముమ ఎట్లా ధరించాలి. మంత్రమేది. ఉభమైన విధిఏది రాలది దేశమేది ఒగురు! నాకంతా చెప్పు (68) నీలాంటి మహాత్మ్యులు ఎప్పుడూ లోకహితముడై ఆసక్తి గలవారు తమ పాతమును కోరేవారు కారు. కల్పవృక్షంతో సమానమైన వారు (69) సూతులిట్లన్నారు. ఘోరమైన ఆవనచారి ఆ యోగీశునితో ఆట్లా అనగా ఆ తత్వవిదుడు తిరిగి భస్మ మహాత్యాన్ని వర్ణింపసాగాడు (70) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహాత్తర ఖండమందు భస్మ మహాత్మ కథన మనునది పదునైదవ అధ్యాయము.