స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని బ్రహ్మోత్తర ఖండము

16 అధ్యాయము

తా సూతుని వచనము - ఓ శ్రేష్ఠమైన మునులారా! నామదేవుని భాషణమును వినండి (1) నామదేవుని వచనము - నానా ధాతువులతో చిత్రంగా ఉన్న మందర పర్వతంలో పూర్వము నానా పత్వములతో కూడిన నానా ద్రుమములతో, లతలతో కూడిన (2) ఆ చోటుకు ఒకసారి విశ్వవందితుడు భగవాన్ కాలాగ్ని రుద్రుడు భూతేశుడు పరమేశ్వరుడు స్వేచ్ఛగా వచ్చాడు (3) కోట రుద్రులు (గజాలు) ఎదురుగా ఉన్నారు. వారి మధ్యలో దేవదేవుడు త్రిలోచనుడు కూర్బున్నాడు (4) అక్కడికి దేవతలతో పాటు సుర శ్రేష్ఠుడు పురందరుడు వచ్చాడు. అట్లాగే అగ్ని వరుణ వాయు యమ వైవ స్వతులు వచ్చారు (5) చిత్ర సేవాది గంధర్వులు, ఖేచరులు, పన్నగులు, విద్యాధరులు, కింపురుషులు, సిద్దులు, సాధ్యులు, గుహ్యతులు (6) బ్రహ్మర్షులు వసిష్ఠాదులు, మహర్షులు, నారదాదులు, మహాత్ములు పితరులు ప్రణీశ్వరులు దక్షాదులు (7) ఊర్వశ్యాద్య ప్సరసలు చండికాది మాతలు, ఆదిత్యులు వసువులు దస్రులు, విశ్వ దేవులు మహౌజనులు (8) లోక సంహరణ కములైన ఇతర భూత వతులు, మహాకాలుడు, నంది, అట్లాగే శంఖపాలకులు (9) మహాబలి వీరభద్రుడు, మహాబలుడు శంకు కరుడు, ఘంటాకరుడు, దుర్ధరుడు, మణిభద్రుడు, వృకోదరుడు (10) కుండోదరుడు, విభటులు, బలశాలి కుంభోదరుడు, మందోదరుడు, కర్షధారుడు, కేతువు భృంగి, రిటి (11) భూతనాధులు అట్లాగే ఇతరులైన మహౌజనులు, మహాకాయులు, కృష్ణ వర్ణులు, శ్వేతవర్ణులు, కొందరు మండూకం వంటి శాంతి గలవారు (12) హరిత వర్ణం వారు ధూవర, ధూమ్ర, కర్పుర, పీత, లోహిత వర్ణముల వారు, చిత్ర వర్ణులు, విచిత్ర అంగముల వారు, చిత్ర లీలలవారు, మదోత్కటులు (13) నానా ఆయుధములు చేత ధరించిన వారు నానా వాహనముల వారు, భూషణముల వారు కొందరు వ్యాఘ్రముఖులు, కొందరు సూకరముఖులు, మృగాననులు (14) మొసలి మొగాలవారు కొందరు కుక్కల వంటి ముఖాలవారు నక్కలవంటి మొఖాలవారు ఒంటెల ముఖాలవారు (15) శరభ భేరుండ, సింహఅశ్వ, ఉక్త్ర, బక అసము ఏకవక్త్ర ద్వివక్త్ర, త్రివక్త్రులు, విర్ముఖులు (16) పాదపానులు అనేక పాదాల వారు, అనేక చెవులవారు, ఒకే చెవి వారు, ఒకే చేతివారు, మూడు చేతుల వారు ఐదు చేతులవారు, చేతులు లేనివారు (17).   

తా ॥ ఏక నేత్రులు, చతుర్నేత్రులు, పొడుగువారు, పొట్టివారు, ఈశుడైన భూతనాథుని చుట్టు ముట్టి సేవిస్తున్నారు (18) అప్పుడు మహాతేజస్సంపన్నుడు మునులలో శ్రేష్ఠుడు బుద్ధిమంతుడు ధర్మాత్ముడు సనత్కుమారుడు ఆ జగదీశ్వరుని చూడటానికి వచ్చాడు (19) ఆ దేవదేవుని విశ్వశుని, కోటి సూర్యుల కాతి గల వానిని మహా ప్రళయ కాలమందు క్షోభించే ఏడు సముద్రముల వంటి పెద్ద ధ్వని గలవానిని (20) ప్రళయ కాలాగ్ని వంటి ఆటో సంకల వానిని (వేగిరపాటు) జటామండలము కలవానిని, క్షీణించని ఫాలనయనుని జ్వాలతో మానం కాని ముఖం గల వానిని (21) వెలుగుతున్న చూడామణిలో శశిఖండంలో శోధించే వానిని వామకర్ణ మందు తక్షకుని, దక్షిణమందు వాసుకిని (22) కుండములుగా ధరించిన వానిని నీలరత్నము వంటి గొప్ప హనువు గలవావివి (చెకలి) నీలగ్రీవుని మహా బాహవును, నాగహారంతో వెలిగే వానిని (23) ఫణిరాజలే కంకణ, అంగద ముద్రికలుగా వెలిగే వానిని అనంత గుణములు గల సహస్ర మణులతో వెలిగే ఒడ్డాణము కవానిని (24) వ్యాఘ్ర చర్మ ధరువి, ఘాంట, దర్పణములలో అలంకరింప బడిన వానిని, కర్కోటకుడు, మహాపద్ముడు, ధృతరాష్ట్ర ధనంజయులు (25) వీరితో ధ్వనించే మావుర సంఘర్షణ గల పాదపద్మములలో వెలిగే వానిని, ప్రాసలో మరఖ ట్వాంగశూలటం సథమస్సుక్లను ధరించిన వానిని (26) అప్రధృష్యుడు, ఆనిర్ధేశ్యుడు, అచింత్యాకారుడు ఐన ఈశ్వరుని, రత్నసిమ్హాసన నారూఢుని మహాముని నమస్కరించాడు. (27) భక్తి భారంతో నిండిన అంతరాత్మ గలవాడై అతడు ప్రతి సమ్మతమైన వాక్కులతో ఆ శివుని స్తుతించి చేతులు జోడించి, వినయంతో వంచిన తల గలవాడై శుభప్రదమైన ధర్మములనన్నిటిని అడిగాడు (28) ముని, ఏ ఏ ధర్మాల నడిగాడో వాటినన్నిటిని పూర్తిగా రుద్రుడు భగవాన్ చెప్పాడు. తిరిగి ముని అడిగాడు (29) సనత్కుమారుని వచనము - ఓ భగవాన్ ! నీ ముఖము నుండి ముక్తి హేతువైన ధర్మములను నేను విన్నాను. ఏ ధర్మాలతో నరులు ముక్త పాపులై సంసార సముద్రాన్ని దాటుతారో విన్నాను. (30) విభు! తక్కువ అయానము, గొప్ప ఫలము గల గొప్ప ధర్మాన్ని నరులకు వెంటనే ముక్తినిచ్చేదాన్ని నాకు దయతో చెప్పండి (31) అభ్యానంలో ఎక్కువగా ఉన్న ధర్మములు, శాస్త్రాల్లో కనిపించేa వేలాది ధర్మములు వాటిని బాగా సేవిస్తే కాలమందు సిద్ధినిస్తాయా ఇవ్వవా (32) అందువల్ల లోకంలో పాతమైన, రహస్యమైన, భుక్తిముక్తి సాధనమైన ధర్మాన్ని నీ అనుగ్రహం వల్ల తెలుసుకోదలిచాను ఓ మహేశ్వర! (33) అనీ అనగా శ్రీ రుద్రుని వచనము - ధర్మములన్నింటిలో ఉత్తమమైనది శ్రుతిలో చెప్ప బడ్డదే. సర్వ ప్రాణులకు రహస్యమైనది ఏమిటి అంటే త్రిపుండ్రధారణము (34). 

తా సనత్కుమారుని వచనము - ఓ జగత్పతి! భగవాన్! త్రిపుండ్ర నిధిని చెప్పండి ఓ మహేశ్వర! నీ అనుగ్రహంతో యథార్థంగా తెలుసుకో దలిచాను (35) స్థానము లెన్ని. ద్రవ్య వేది శక్తి ఎవరు. దేవత ఎవరు. ప్రమాణ మేమి. కర్త ఎవరు మంత్రము లేవి. దాని ఫలమేమి (36) ఇదంతా మొత్తం త్రిపుండ్ర లక్షణాన్ని చెప్పండి, జగత్పతి! లోకములను అనుగ్రహించే కొరకు (37) రుద్రులిట్లన్నారు - కాలిన గోమయం నుండి వచ్చే భస్మము అగ్నేయమున బడుతుంది. అదే ద్రవ్యము త్రిపుండ్రము నకు అని అన్నారు ఓ మహాముని (38) బ్రహ్మమయము లైన సద్యో జాతాది ఐదు మంత్రములతో పరిగృహ్యాన్ని అనే మొదలగు మంత్రములతో భస్మాన్ని అభిమంత్రించాలి (39) మనస్తోక అనే మంత్రంలో రాసుకొని త్ర్యంబక మును శిరస్సు యందు పూసుకోవాలి. త్రియాయుషాది మంత్రములతో లలాట మందు. రెండు భుజములందు ధరించాలి. మంత్రముతో భావించి జలముతో కూడిన భస్మమును స్కందమందు ధరించాలి. (40) ఈ స్థానములందు మూడు రేఖలుంటాయి. ఓ ముని. పుంగవ, కనుబొమల మధ్య నుండి ఆరంభించి కనుబొమల చివర వరకు ఉండాలి (41) మధ్యమ అనామిక అంగుళుల మధ్య అవరోహణ క్రమంగా అంగువముతో చేసిన రేఖ త్రిపుండ్ర మనబడుతుంది (42) మూడు రేఖలకు ప్రత్యేకంగా తొమ్మిది మంది దేవతలు. అకారము, గార్హపత్యము ఋక్, భూలోకము, రజస్సు (43) ఆత్మ క్రియా శక్తి, ప్రాతః సవనము, మహాదేవుడు ప్రథమ రేఖకు దేవతలు (44) ఉకారము, దక్షిణాగ్ని నభస్సు, సత్వగుణము, యజుస్సు, మధ్యందిన సవనము, ఇచ్ఛాశక్తి, అంతరాత్మ (45) మహేశ్వరుడు రెండవ రేఖకు దేవతలు, మకారము ఆహవనీయము పరమాత్మ తమస్సు, దివము (46) జ్ఞానశక్తి, సామవేదము, తృతీయ సవనము, శివుడు వీరు. మూడవ రేఖకు దేవతలు (47) వీరిని రోజు నమస్కరించి త్రిపుండ్రమును ధరించాలి బుధుడు. ఈ మహేశ్వర వ్రతము సర్వ వేదములలో చెప్పబడింది (48) ముక్తి కాములైన నరులు దీనిని సేవించాలి తిరిగి వారికి పుట్టుక ఉండదు. భస్మంతో శాస్త్ర ప్రకారము త్రిపుండ్రాన్ని ఎవరు ధరిస్తారో (49) బ్రహ్మచారి, గృహస్త్తు, వనస్థుడు, యతికాని, మహాపాతక సంవూతముల నుండి, ఉపపాతకముల నుండి ముక్తులౌతారు (50). 

తా ॥ ఆట్లాగే ఇతరమైన క్షత్ర విట్ శూద్ర స్త్రీ గోహత్యాది పాతకముల నుండి వీర హత్య, అశ్వ హత్యాది పాతకముల నుండి ముక్తు డౌతాడు. అనుమానంలేదు (51) మంత్రం లేకుండ కూడా ఎవరు ఉన్నతమైన మహత్తును తెలుసుకోకుండా కూడా ఆచరిస్తారో ఫాలభాగమందు త్రిపుండ్రమును ధరిస్తారో సరు నర్వ పాపముల నుండి ముక్తులౌతారు (52) పర ద్రవ్య అపహరణము, పరదార స్పర్శ పరనింద, పరక్షేత్ర హరణము, పరపీడనము (53) నస్య ఆరామాది హరణము, గృహదాహాదికర అసత్య వాదము, పిశునత, పౌరుష్యము, వేదవిక్రయము, కూటసాక్ష్యము, వ్రత త్యాగము, రైతవము, నీచ సేవ (54) గోభూహిరణ్యమహిషి(బఱ్ఱె) నువ్వులు, సంబలము, వస్త్రములు, అన్న, ధాన్య, జిలాదులు నీచుల నుండి గ్రహించటం (55) దాసి, వేశ్య విటురాలు, శూద్ర స్త్రీ, నటి, రజస్వల, కన్య, విధవ, వీరితో సంగమము (56) మాంన చర్మ రసాదుల విక్రయముల వణ విక్రయము ఈ విధంగా ఇవి మొదలుగా అసంఖ్యాక పాపములు రకరకము లైనవి (57) ఇవన్ని త్రిపుండ్ర ధారణ వల్ల వెంటవే నశిస్తాయి. శివ ద్రవ్యాప హరణము, శివనింద ఎక్కడైనా (58) శివ భక్తుల నింద ప్రాయశ్చిత్తములతో శుద్ధి నొందదు. ఎవని కంఠమందు రుద్రాక్షమాల లలాటమందు త్రిపుండ్రకము (59) ఉంటే ఆతడు చండాలుడైనా సర్వవర్ణోత్తముడు పూజించతగిన వాడౌతాడు. ఈ లోకంలో ఎన్ని తీర్థాలున్నాయో, గంగాది ఎన్ని నదులున్నాయో (60) వాటన్నిట స్నానం చేసిన వాడౌతాడు. నొసట త్రిపుండ్రధారణ చేసినవాడు. పంచాక్షరము మొదలుగా సప్త కోటి మహామంత్రములు (61) అట్లాగే, ఇతరమైన కోట్ల కొలది శివమంత్రాలు కైవల్య హేతువులు. వాటన్నింటిని జపించిన వారౌతారు. ఎవరు త్రిపుండ్రకాన్ని ధరిస్తారో (62) పూర్వమందు జన్మించిన వేయి మందిని, పుట్టబోయే వేయిమందిని తన వంశంలో పుట్టిన నరులను త్రిపుండ్రధారి ఉద్ధరిస్తాడు (63) ఇక్కడ అన్ని భోగాలను అనుభవించి దీర్ఘాయువు గలవాడై, వ్యాధి వర్షితుడై జీవిత అంత మందు మరణాన్ని సుఖంగా పొందుతాడు (64) అష్టఐశ్వర్యములతో గుణములతో కూడిన శుభమైన దివ్య శరీరాన్ని పొంది, దివ్యవిమానాన్ని అధిరోహించి, దివ్య స్త్రీ శతములతో సేవించబడుతూ (65) విద్యాధరుల, సిద్ధుల, గంధర్వుల, మహౌజస్సు కల ఇంద్రాది లోకపాలుర లోకములందు యథా క్రమముగా భోగములు అనుభవించి (66). 

తా ॥ వ్రజేశుల పురములందు విపులంగా భోగములనుభవించి బ్రహ్మ పదవిని పొంది అక్కడ కల్పములు. ఆనందిస్తాడు (67) మూడు వందల సంవత్సరాల బ్రహ్మ కల్పముల వరకు విష్ణు లోకమందు రమిస్తాడు (68) పిదప శివ లోకానికి చేరి అక్షయ కాలము అక్కడ రమిస్తాడు. శివ సాయుజ్యాన్ని పొందుతాడు. అతడు తిరిగి జన్మ నెత్తడు (69) సర్వ ఉపనిషత్తుల సారముమ మాటిమాటికి ఆలోచించి ఇదే త్రిపుండ్రకమే పరమ శ్రేయమని నిర్ణయించబడింది (70) ఈ త్రిపుండ్ర మహాత్మ్యాన్ని నేను క్లుప్తంగా చెప్పాను. సర్వప్రాణులకు రహస్యమైనది. దీనిని నీవు దాచాలి (71) అని పలికి భగవాన్ రుద్రుడు అక్కడే అదృశ్యమయ్యాడు. సనత్కుమారుని కూడా బ్రహ్మ పదమునకు చేరాడు. (72) భస్మ సంపర్కం వల్ల నీకు గూడ విమలమైన బుద్ధి కలిగింది. నీవు కూడా శ్రద్ధతో పుణ్యప్రదమైన త్రిపుండ్రాన్ని ధరించు. (73) సూతునివచనము - ఆని పలికి వామదేవుడు శివయోగి మహా తపస్సంపన్నుడు భస్మాన్ని అభిమంత్రించి ఘోరుడైన బ్రహ్మ రాక్షసున కిచ్చాడు (74) దానితో ఆతడు నొసటి యందు అడ్డముగా త్రిపుండ్రకమును ధరించాడు. దాని శక్తి వల్ల వెంటనే బ్రహ్మ రాక్షసత్వాన్ని వదిలాడు. (75) తేజోముండలముతో ప్రకాశిస్తూ సూర్య సంకాశుడైనాడు. దివ్య అవయవములు, రూపము, దివ్యమాలలు, వస్త్రములు, వీనిలో ఉలుడై (76) గురువైన శివయోగి భక్తితో ప్రదక్షిణం చేసి దీవ్య విమానాన్ని అధిరోహించి అతడు పుణ్య లోకములకు వెళ్ళాడు.(77) మహాయోగి వామదేవుడు ఆతనికి పరమగతినిచ్చి గూడ ఆత్మ కలవాడై లోకంలో సాక్షాత్తు స్వయంగా శివుని వలె తిరిగాడు. (78) ఎవరు ఈ భస్మ మాహాత్మ్యాన్ని త్రిపుండ్రమును వింటారో వినిపిస్తారో చదువుతారో అ నరులు పరమైన గతికి చేరుతారు.(79) సంసారం నుండి ముక్తి హేతువైన శివ కీర్తిని ఎవరు చెబుతారో, శివ యోగులు ధ్యానించే శివపాద పద్మములకు ఎవరు నమస్కరిస్తారో శివవ భక్తుల వలె భాసిస్తూ ఎవరు ఫాలమందు త్రిపుండ్రాన్ని ధరిస్తారో వారు తిరిగి ఇక్కడ జననీ గర్భవాసాన్నీ పొందరు (80) అని శ్రీ స్కాంధ  మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మోత్తర ఖండమందు భస్మ మాహాత్మ్యాన్ని చెప్పటమనేది పదహారవ అధ్యాయము.