స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని బ్రహ్మోత్తర ఖండము
11 అధ్యాయము
తా ॥ సూతులిట్లన్నరు - పింగళ అనే ఏ వేశ్యను గూర్చి నేను ముందు చెప్పానో, శివభక్తార్చన వల్ల ఆ పుణ్యంవల్ల పాత శరీరాన్ని వదలి (1) తిరిగి ఆమె చంద్రగదునిభార్య యందు జన్మించింది రూపఓఉధార్యగుణములతో కూడింది. కీర్తిమాలిని అని పేరు (2) భద్రాయువు కూడా అక్కడే రాజపుత్రుడైనాడు. మహా తపస్సంపన్నుడు శుచిలో ఉన్నట్లు ఆ వణిక్ పతి ఇంట్లో ఆతడు సూర్యునిలా పెరిగాడు. (3) ఆ వైశ్యనాధునకు ఒక కుమారుడు ఉత్తముడు ఉన్నాడు అతని పేరు సునయుడు రాజసూనునకు స్నేహితుడైనాడు (4) వాళ్ళిద్దరు మిక్కిలి స్నేహంగలవారు రాజ, వైశ్యకుమారులు. రకరకాల ఆటలు ఆడేవారు, ఉదారమైన ఆతారంగలవారు, రత్నాభరణాలు గలవారు (5) ఆ రాకుమారునకు ఆ వణికృతి బ్రాహ్మణులతో సంస్కారములు చేయించాడు తన పుత్రునకు గూడా విస్తారంగా చేయించాడు (6) వారు సకాలంలో ఉపనయనాన్ని పొంది గురు శుశ్రూష యందు ఆసక్తులైనారు. వినయం గల వారై అన్నివిద్యలను సమ కూర్చుకున్నారు. (7) రాజకుమారునకు పదహారు సంవత్సరాలు వచ్చాక తిరిగి ఆ ఋషభయోగి ఆ ఇంటికి వచ్చాడు (8) ఆ రాణి ఆ రాకుమారుడు వచ్చిన శివయోగిని మాటిమాటికి నమస్కరించి ఇద్దరు ఆనందంతో పూజించారు (9) వారు పూజించగా ఆ యోగి ఆనందించి, కరుణ గలవాడై రాజపుత్రునితో ఇట్లన్నాడు (10) శివయోగి వచనము - నీవు కుశలంగా ఉన్నావా ఓ తండ్రి ! మీ తల్లిగారు కూడా క్షేమంగా ఉన్నారా. నీవు అన్ని విద్యలను స్వీకరించావా (11) నీవు గురువులకు నిరంతరం శుశ్రూష చేస్తున్నావా. నమస్కరిస్తున్నావా, ఓ కుమార నీకు ప్రాణప్రదమైన గురువును కదా (12) అని యోగీశ్వరుడు పలుకగా ఆ రాజ్ఞి వినయం గలదై ఆమె తన కొడుకును అతని పాదములపై నేపి ఆ యోగితో ఇట్లా పలికింది (13) ఈ కొడుకునీవాడు. ఓ గురు ! నీవితనికి ప్రాణమిచ్బిన గురువువు. ఈ శిష్యుణ్ణి మీరు కరుణతో అనుగ్రహించాలి (14) బంధువులంతా విడిచి పెట్టిన ఈతనిని అనాధను పాలించండి. ఈతనికి బాగా సజ్జనమార్గాన్ని మీరు ఉపదేశించండి (15) అని రాణి ప్రార్థించగా మహామతి శివయోగి రాకుమారునకు సన్మార్గాన్ని ఉపదేశించాడు (16)
తా ॥ ఋషభునివచనము - ప్రతి స్మృతి పురాణములలో సనాతన ధర్మము చెప్పబడింది. జనులు ఎల్లప్పుడు వర్ణాశ్రమాను సారంగా ఆచరించాలి (17) ఓ కుమార సజ్జనుల మార్గాన్ని అనుసరించు. మంచి వారి మార్గంలో నడువు. దేవ ఆజ్ఞను దాటొద్దు. దేవ హేళనము చేయొద్దు. (18) గోదేవగురు విప్రుల విషయంలో ఎల్లప్పుడూ భక్తితో ఉండు. అతిధిగా చండాలుడు వచ్చినా ఎప్పుడూ గౌరవించు (19) సత్యం విడువద్దు. ప్రాణ సంకటం వచ్చి నాసరే. గోబ్రాహ్మణుల రక్షణ కొరకు ఎక్కడైనా నీవు కొంచం అసత్యం మాట్లాడు (20) పరుల వస్తువుల పై, పర స్త్రీ ల పై, దేవబ్రాహ్మణుల వస్తువుల పై ఆశ పెట్టుకోకు. ఓ మహానుభావ! దుర్లభమైన వస్తువుల పై గూడా ఆశ పెటుకోకు. (21) సత్కధయందు, సదాచారమందు నద్ర్వతమందు సత్ ఆగమమందు ధర్మాదుల సంగ్రహ ముందు ఎప్పుడూ ఆశపడు ఓమహామతి ! (22) స్నానము, జపము, హోమము, స్వాధ్యాయము, పితృ తర్పణము, గోసేవ అతిధి పూజలు వీని యందు ఆలస్యం చేయొద్దు. ఓ పుణ్యాత్ముడ. (23) క్రోధము, ద్వేషము, భయము, శార్యము, లోభత్వము, తగని కోపము, కౌటిల్యము, దంభము, ఉద్వేగము, వీటిని శ్రమించి యైనా విడిచి పెట్టు (24) నీవు క్షత్రియ ధర్మ మందున్న వాడ వైనా వ్యర్థంగా హింసచేయొద్దు. వ్యర్థంగా తగాదా వ్యర్థంగా మాట్లాడటం, పరనింద, వీటిని విడిచి పెట్టు (25) వేట జూదము పానము స్త్రీలు, ఆడసొత్తులు వీనియందు (ఆశవద్దు) అధిక ఆహారం తినటం, అతి క్రోధము, అతి నిద్ర, అతి శ్రమము (26) అధికంగా మాట్లాడటం, అతిగా ఆటలు, ఎల్లప్పుడూ విడిచి పెట్టు (27) అతి విద్యను, అతి శ్రద్ధను, అతి పుణ్యమును, అతి స్మరణమును, అతి ఉత్సాహమును, అతి ఖ్యాతిని అతి థైర్యమును సాధించు (28) నీ భార్యలందు కామివిగా నిజ శత్రువులందు కోపంగా ఉండు. పుణ్య నిచయమందు, లోభంకలిగి ఉండు. అధర్మ మాచరించే వారి యందు అసూయ కలిగి ఉండు. (29) పాఖండులను ద్వేషించు. సజ్జనులందు అనురాగం కలిగి ఉండు. చెడు నీతి యందు అర్థంకానట్టుగా ఉండు. పిసినారి మాటలందు చెవిటి వాడివికా (30) ధూర్తుడు, చండుడు, శఠుడు, క్రూరుడు, కితవుడు, చవలుడు, ఖలుడు పతితుడు, నాస్తికుడు, వక్రుడు (బుద్ధి) వీరిని దూరం నుండే వదిలి పెట్టు. (31) తన ప్రశంసమ చేసుకోవద్దు. ఇతరుల ఇంగితాన్ని తెలుసుకో. ధనమందు, కుటుంబ మందరి యందు అత్యాసక్తు డవుగా ఎప్పుడూ కావద్దు (32) భార్య, పతివ్రత, తల్లి శ్వశురుడు, సజ్జనుడు, గురువు వీరిమాటల పై ఎప్పుడూ విశ్వాస ముంచు (33).
తా ॥ ఎప్పుడూ నిన్ను నీవు రక్షించుకో. అప్రమత్తుడవు, దృఢదీక్ష గల వాడవుకా. తన భృత్యులందైనా ఎప్పుడైనా విశ్వాసాముంచరాదు (34) విశ్వసించిన వానిని ఎప్పుడూ చంపొద్దు. వాడు దొంగైనా సరే, ఓ మహామతి ! పాపులు కాని వారిపై అనుమానం వద్దు. సత్యం నుండి చలించవద్దు (35) అవాధుడు, కృపణుడు, వృద్ధుడు, స్త్రీ, బాలుడు, తప్పు చేయని వాడు, వీరిని రక్షించు. నీ ధనం వెచ్చించి, నీ ప్రాణముల నిచ్చి, నీ బుద్ధిని వినియోగించి, నీ శక్తిని బలాన్ని చూపి (36) శరణాగతు లైన శత్రువు వధార్ హుడైన వానిని చంపొద్దు. అపాత్రు డైన సుపాత్రు డైన నీచు డైన గొప్పవాడైన (37) ఎవడైనా సరే యాచిస్తే చాలు వారికి నీ తల నైవా ఇవ్వు. ప్రతయత్నపూర్వకముగా ఎప్పుడూ కీర్తినే సంపాదించు (38) రాజులకు విద్వాంసులకు కీర్తియే భూషణము. మంచి కీర్తి వల్ల లక్ష్మి లభిస్తుంది. సత్కీర్తి వల్ల పుణ్యం వస్తుంది. (39) సత్కీర్తితో లోకం వెలిగి పోతుంది. వెన్నెలలో చంద్రునిలాగా ఏనుగులు గుఱ్ఱములు బంగారము, రత్నరాశి పర్వత మంత కుప్ప (40) అపకీర్తివల్ల వచ్చిందే దైనా త్వరగా వాటిని గడ్డిపోచలా విడిచిపెట్టు. తల్లి కోపము, తండ్రి కోపము, గురువు కోపము, ధననాశము (41) పుత్రుల అపరాధము, బ్రాహ్మణుల అపరాధము వీటిని క్షమించు, ద్విజుల అనుగ్రహం కలిగేట్టుగా వారికి మేలుచేయి (42) ద్విజోత్తములు, సంకట మందున్నరాజును ఉద్ధరించాలి. ఆయుస్సు, యశము, బలము, సౌఖ్యము, ధనము, పుణ్యము, ప్రజోన్నతి (43) వీటిని నీకర్మవల్ల అధించిన దానిని నీవు ఎల్లప్పుడూ సేవించు. దేశము, కాలము, శక్తి కార్యము, ఆకార్యము (44) అన్ని బాగా విచారించి ఎప్పుడు కర్మ నాచరించాలి, ప్రయత్న పూర్వకముగా ఎవరిని బాధించొద్దు. ఇతరుల బాధను నివారించు. (45) శక్తి వంతమైన మంచి నీటితో చోరులను దుష్టులను బాధించు. స్నానము, జపము, హోమము, దైవ పితృకర్మలు వీనియందు (46) తొందరవద్దు. నిద్ర, భోజనం వీని విషయంలో తొందరుండని. దాక్షిణ్యముగల, అశఠమైన, సత్య వంతుడైన, జనులకు మనోహరమైన (47) అల్పాక్షరములు కల, అనంతార్ధంము గల మాట మాట్లాడు, ఓ మహామతి. అంతట భయంలేకుండా ఉండు, శత్రువు లందు, ఆపద లందునూ (48) భ్రహ్మ కులాన్ని చూసి భయపడు. పాపమైన గురుశాసనమై భయపడొద్దు. జ్ఞాతు లందు, బంధువు లందు, విప్రు లందు, భార్య లందు, తనయు లందు, (49) సమభావంతో వర్తించు అట్లాగే భోజన పంక్తిలోను సమానంగా వర్తించు (49 1/2)
తా ॥ సజ్జనుల హితోప దేశంతో, పుణ్యకథలందు సమభావంగా ఉండు (50) ధర్మ సంబంధమైన విద్యాగోష్ఠు లందు వరాజ్ముఖుడవుతాడు. ప్రఖ్యాతమైన బ్రహ్మ సంకులమైన శుచియైన పుణ్యజలం సమీపంలో (51) శివమయమైన మహాదేశ మందు నీవు ఎప్పుడూ ఉండాలి. కులట, గణిత ఉన్నచోట, కాముకుడున్నచోట (52) దుర్దేశము, నీచబాధగల ప్రదేశములందు ఎప్పుడూ ఉండొద్దు. త్రిభువనేశ్వరుడైన శివుణ్ణి ఒక్కణ్ణే నీవు ఆశ్రయించినా (53) అందరు దేవతలను ఉపాసించు. ఆ రోజులను గౌరవించు. ఎప్పుడూ శుచిగా, ఎప్పుడూ దక్షునిగా, శాంతునిగా, స్థిరునిగా ఉండు. (54) అరిషడ్వర్గములను ఎల్లప్పుడూ జయించు. ఎప్పుడూ ఏకాంతంగా ఉండు. ఓ అనఘవేద విదులైన విత్రులు, శాంతులు, యతులు, తప్పని కాంతి గలవారు (55) పుణ్య వృక్షములను, పుణ్య నదులను,పుణ్య తీర్థములను గొప్ప సరస్సులు, ధేనువు, వృషభమును రత్నము, పతివ్రతయైన యువతి (56) తన ఇంట దేవతలు వీరిని త్వరగా నమస్కరించాలి. బ్రాహ్మ ముహూర్త మందు లేచి, ఆచమించి, విమల మైన బుద్ధి గలవాడై (57) తన గురువునకు నమస్కరించి ఉమాపతిని ధ్యానించి నారాయణుని, లక్ష్మిని, బ్రహ్మను, వినాయకుని (58) స్కందుని కాత్యాయనీ దేవీని మహాలక్ష్మిని, సరస్వతిని, ఇంద్రాదులను లోకేశులను పుణ్యశ్లోకులను ఋషులను గూడా (59) జ్ఞప్తికి తెచ్చుకొని, ఉదయిస్తున్న సూర్యుణ్ణి ఎప్పుడూ నమస్కరించాలి. గంధము, పుష్పము, తాంబూలము, శాకము, పండిన పండ్లు మొదలగునవి (80) శివునకు నివేదించి అనుభవించు, ప్రియమైన, కొత్తదైన భక్ష్య భోజ్యములను, దానమును, కర్మను, జవమును,స్నానమును, హోమమును, స్మరణను, (61) తపమును, అన్నింటిని శివునకు నివేదించు. తింటున్నా, చదువుతున్నా, నిద్రిస్తున్నా, విహరిస్తున్నా, చూస్తున్నా, వింటున్నా, మాట్లాడుతున్నా, స్వీకరిస్తున్నా శివున్నే అనుసంధించు స్మరించు (62) రుద్రాక్ష కంకణములను కర దండముల రెండింట ప్రకాశిస్తుండగా మాలల మధ్యభస్మముతో తెల్లని త్రిపుండ్రములు ధరించి, పరమమంత్ర రాజమును పంచాక్షరమును పఠిస్తూ ఎప్పుడూ పశుపతి చరణములు ధ్యానిస్తూ ఆనందించు (63) అని సంక్షేపంగా ధర్మ సంగ్రహాన్ని చెప్పాను, ఓ కుమార ! ఇతర పురాణాల్లో విస్తారంగా చెప్పబడింది (64) సర్వ పురాణములలో రహస్యమైన పాపములన్నింటిని హరించే పవిత్రమైన, జయప్రదమైన, అన్ని ఆపదలను తొలగించే మరో శివకవచాన్ని వీ క్షేమం కొరకు చెప్తాను (65) అని శ్రీస్కాందమహా పురాణమందు ఏకాశీతి సహస్ర సంహిత యందు మూడవదైన బ్రహండ మందు భద్రాయువునకు ఋషభుని ఉపదేశ వర్తన మనునది పదునొకండవ అధ్యాయము.
