స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని బ్రహ్మోత్తర ఖండము

14 అధ్యాయము

తా సూతులిట్లన్నారు - సింహాసనమును పొందిన వీరుడు భద్రాయు మహారాజు ఒకసారి భార్యతో కూడి, అందమైన అడవిలో ప్రవేశించాడు (1) వికసించిన అశోకపు మొగ్గలు కొత్త చిగురుగల, బాగా వికసించిన మల్లికా ఖండము లందు కూస్తున్న భ్రమరములతో కూడిన (2) నవ కేసరముల వాసనతో భద్ధులై రాగి జనులు ఆనందించగా, అప్పడే మొగ్గలెత్తిన అశోకతమాల గహనముల మధ్య(3) పూల గుత్తులతో వంగిన మాధవీ వన మంటప మందు పగడపు పూలతో ప్రకాశించే మామిడి కొమ్మలతో కూడిన (4) పున్నాగ వనము లందు తిరిగే పుంస్కా కిలల ధ్వని గల రమ్యమైన వసంత సమయ మందు భార్యతో కూడి ఆతడు విహరించాడు (5) కొద్ది దూరంలో ఏడుస్తున్న, పరుగెత్తుతున్న బ్రాహ్మణ దంపతులను, పులితో అనుసరింపబడుతున్న వారిని, రాజు చూచాడు. (6) ఓ మహారాజ రక్షించు, ఓ రాజ కరుణానిధి రక్షించు. ఆ పులి మమ్మల్ని చంపటానికి వేగంగా పరుగెత్తుకొస్తోంది. (7) ఇది పర్వత మంత ఉంది. సర్వప్రాణులకు భయంకరమైంది. మా దగ్గరికి వచ్చి మమ్మల్ని తినకముందే మమ్మల్ని రక్షించు ఓ భూపతి! (8) అనే అరువును విని ఆ రాజు ధనస్సును తీసుకున్నాడు. ఇంతలో పులి వచ్చి మధ్యలో ఆ స్త్రీ ని పట్టుకుంది (9) హానాథ, నాథ, ఓ కాంత! ఓ శంభు! జగత్పతి! అని ఏడుస్తున్న ఆమెను భీషణంగా అది పట్టుకున్నంతలో (10) ఆరాజు తీక్ష్ణమైన భల్లములతో ఆ పులిని కొట్టాడు. వాటితో కొంచము గూడా ఆ పులి వ్యధ చెందలేదు. వర్షంతో పర్వతం చలించనట్లుగా (11) ఆ పులి మహా బలం కలది రాజు అస్త్రముతో వ్యథ నోందక, ఆ నారిని బలవంతంగా పట్టుకొని త్వరగా పరుగెత్తింది (12) పులి, భార్యను ఎత్తుక పోవటంచూసి విప్రుడు చాలా దుఃఖితుడై ఓ ప్రియ! ఓ బాల! ఓ కాంత! ఓ పతివ్రత! అని ఏడ్చాడు. (13) ఒంటరిగా నన్ను ఇక్కడ వదలి లోకాంతరానికి ఎట్లా వెళ్ళావు. ప్రాణముల కన్నా ప్రియమైన నిన్ను వదలి ఎట్లా జీవిస్తాను (14) ఓ రాజ! ఏ మహాప్రాలే, శ్లాఘ్యమైన ధనువేది. పన్నెండువేల మహా నాగులను మించిన నీబలమేది (15).    

తా ॥ నీ శంఖంతో ఖడ్గంతో మంత్ర అస్త్ర విద్యతో ప్రయోజనమేమి. ఆ ప్రయత్నంతో పనేమి అధికమైన ప్రభావంతో ప్రయోజనమేమి.(16) ఇంకా నీలో ఏఏ శక్తులున్నాయో అవన్నీ వ్యర్థ మైనాయి. నీవు వనంలో నివసించే జంతువును నివారించటానికి అసమర్ధుడి వైనావు (17) క్షతము నుండి రక్షించట మనేది క్షత్రియునకు పరమమైన ధర్మము కులోచిత ధర్మ మందు పనికి రాని నీ బ్రతుకుతో ప్రయోజనమేమీ (18) రాజులు ఆర్తుల శరణార్థుల ప్రాణాలు రక్షిస్తారు.  ప్రాణముతో అర్థముతో ఉన్నవారే ధర్మజులు. అవి లేనివారు మృతప్రాయులు (19) గార్హస్థులై ధనవంతులై దాన హీనులైన వారి కన్నా బిచ్చ మెత్తటం మేలు. ఆర్త త్రాణ విహీనులైన వారికి బ్రతుకుతన్న చావు మేలు. (20) రాజు విషం తినటం ఉత్తమము. అగ్నిలో దూకంట ఉత్తమము. అనాథలు ప్రపన్నులు కృపణులు వీరిని రక్షించకపోవటం కన్న విషం తినటంమేలు (21) అని విలపిస్తున్న తన పరాక్రమాన్ని గర్జిస్తున్న ఆ మాటలు రాజుని శోకంతో తనలోనే ఇట్లా చింతించాడు. (22) నా పౌరుషం నశించింది, ఈ రోజు అదృష్టం బాగా లేనందువల్ల ఈ వేళ నా శీర్తీ నశించింది. అధికమైన పాప మొచ్చింది (23) కాలానికి తగిన ధర్మం నశించింది. మంద భాగ్యుణ్ణి దుర్మతిని. నిజంగా నా సంపదలు, రాజ్యము, ఆయుష్యము నశిస్తాయి (24) పురుషుడు కాని వాని సంపదలు, భోగములు పుత్రదారధనములు, అదృష్టం వల్ల క్షణం పైకి లేస్తాయి. క్షణంలో నశిస్తాయి. (25) అందువల్ల ఈ బ్రాహ్మణుని, భార్యాహీనుని దుఃఖంతో బాధపడుతున్న వానిని నా ప్రియమైన ప్రాణము లిచ్చైనా దుఃఖ హీనుణ్ణి చేస్తాను (26) అని నిశ్చయించుకొని మనసులో ఆ భద్రాయువు నృప సత్తముడు నా మీద, దయచూపు. కాంతిహీనుణ్ణి క్షత్ర బంధువును నేను. ఓ మహాబుద్ధి! దుఃఖాన్ని వదలు నీకు కావలసిన అర్థాన్ని ఇస్తాను (28) ఈ రాజ్యము, రాణి నా ఈ శరీరము, ఇదంతా నీ అధీనమే. నీ అభిలాష ఏమిటో చెప్పు (29) బ్రాహ్మణ వచన మిట్లా - అంధునకు ఆదర్శాలతో పనేమి. బిచ్చమెత్తి జీవించే వారికి ఇళ్ళతో పనేమి! మూర్ఖునకు పుస్తకంతో పనేమి. స్త్రీలేని వానికి, ధనంతో పనేమి (30). 

తా ॥ అందువల్ల నేను భార్య లేని వాణ్ణి భోగాలేమి అనుభవించలేదు. అందువల్ల నీ అగ్ర మహిషిని కామం కొరకు నా కివ్వు (31) రాజిట్లన్నాడు - ఓ బ్రహ్మన్! ఈ నీ ధర్మమేమిటి. ఈ నీ గురు శాసన మేమిటి. స్వర్గమునకు దారి కాదు. అపకీర్తికరము. పరుల భార్యను కోరటము (32) ధనము నిచ్చే వాళ్ళు, రాజ్యము నిచ్చే వాళ్ళు ఏనుగులు గుఱ్ఱముల నిచ్చే వాళ్ళు ఉన్నారు. ఒకచో తమ దేహాన్నిచ్చే వాళ్ళు ఉన్నారు. కాని భార్యనిచ్చే వాళ్ళు లేరు. (33) పరదారలను అనుభ వించటంవల్ల వచ్చే పాపం ను నూరు ప్రాయశ్చిత్తములు చేసుకున్నా కడుగు కోలేము. (34) అనగా బ్రాహ్మణ వచనము - బ్రహ్మ వధ ఘోరము. మధ్య పానము ఘోరము. ఐనా తపస్సులో నశింప చేస్తాను పారదారికమైన పాపాన్ని నశింపచేయటం ఒక లెఖ్ఖా. అందువల్ల నాకు నీ భార్యను ఇవ్వు (35) లేకపోతే భయార్ధులను రక్షించనందువల్ల నరకానికి తప్పకుండా పోతావు. అనే బ్రాహ్మణుని మాటలవల్ల భయపడి రాజు ఆలోచించసాగాడు. రక్షించనందువల్ల వచ్చే పాపం గొప్పది. దానికన్న పత్నీ దానమే నయం (36) అందువల్ల బ్రాహ్మణ శ్రేష్ఠునకు పత్నిని దానం చేసి పావం నుండి ముక్తుడనై వెంటనే అగ్నిలో దూకుతాను. దానివల్ల కీర్తికూడా వస్తుంది. (37) అని మనస్సులో నిశ్చయించుకొని, అగ్నిని వెలిగించి ఆ బ్రాహ్మణుని పిలిచి తన భార్యను ఉదక పూర్వకముగా దానం చేశాడు. (38) స్వయంగా స్నానం చేసి శుచియై దేవతలకు నమస్కరించి ఆ అగ్నికి రెండుసార్లు ప్రదక్షిణంచేసి చక్కగా శివుని ధ్యానం చేశాడు (39) అగ్నిలో పడుతున్న తన పాదములందు మనను నిలిపిన ఆ బ్రాహ్మణునికి జగత్పతి ప్రత్యక్షమైనాడు విశ్వేశుడు అతనిని చూచాడు (40) ఆ ఈశ్వరునకు ఐదు వక్త్రములు మూడు నేత్రములు. పినాకము చంద్రకళ తలపై ఉన్నాయి. పింగళమైన జడలు వేళాడు తున్నాయి. (41) తామర కాడ వలె తెల్లగా, గజ చర్మం వస్త్రంగా కలిగి, తలలోగంగా తరంగములు ఓలలాడగా, నాగేంద్రములు హారములు కంకణములు, ఉంగరములు, కిరీటములు, అంగదములు కుండలములు వీటన్నిటితో ఉజ్వలంగా ఉండగా చూచాడు (42) త్రిశూలము, ఖట్వాంగము గొడ్డలి, కవచము, మృగము అభయ వరద హస్తములు పినాకము ఇవన్ని చేతులలో కలవాడు ఆయన. వృషభం పై కూర్చున్నాడు. శితి కంతుడు ఈశుడు ఇట్లా ఎదురుగా కన్పిస్తే రాజు చూచాడు (43) అప్పుడు ఆకాశంనుండి దివ్యమైన పూల వాన వేగంగా పడింది. దేవ వాద్యాలు మ్రోగాయి. దేవతలు నాట్యం చేశారు. (44) గానం చేశారు. నారదాదులు సనకాదులు సురర్షులు వచ్చారు. ఇంద్రాది లోకేశులు అమలురైన బ్రహ్మేశులు (45) వచ్చారు. వారి మధ్య మహాదేవుడు ఉమతో కూడి కూర్చుని ఉన్నాడు. భక్తితో నమ్రుడైన రాజు పై కరుణాసారమును వర్షించాడు (46). 

తా ॥ శివ దర్శనంతో క ల్గిన ఆనందంతో కోరికలు విజృభించగా ఆనందభాష్పాలు ఎక్కువై శరీరం తడిసిపోగా, రోమాంచము కలుగగా గొంతు గధదంగా మట బొంగురు పోగా చేతులు జోడించి మాటలతో మతించాడు. (47) రాజు వచనము - అనాథుడు (తనపై ఎవరులేరు అని) అవ్యయుడు, ప్రధానుడు, అవ్యక్తగుణుడు, మహతైన వాడు అట్టిదేవుని నమస్కరిస్తున్నాను. కారణంలేని వాడు, తారణములకు కారణమైనవాడు వరుడు శివుడు చిదానందమయుడు ప్రశాంతుడు (48) విశ్వసాక్షి ఐన నీకు నమస్సులు. ఈ జగత్తునకు కర్తవు. నీ స్థానమేదో తెలియదు, హృదయంలో ఉన్నాను. అందువల్ల విద్వాంసులు చిత్తమును నిరోధించి, అనేక యోగములతో విధిని వెతుకుతున్నారు (49) ఏకాత్మను భావించే వారికి నీవు ఒకే రూపుడవు. అనేక రకాల బుద్ధి గలవారికి అనేక రూపుడవు. ఇంద్రియాతీతుడవు. ఉదయ అస్తమయ విభ్రమములకు సాక్షివి. నీ అడుగు జాడ మనః వథము నుండి సంహరించిపోతుంది. (50) మాటలడు బుద్ధికి అందరాని నిన్ను, మోహంలేని, పరమాత్మరూపుడవైన నిన్ను గుట్టేక నిషులమై, ప్రకృతి యందు లీనమైన, కుత్పితమైన శరీరంగల వేను వా మాటలతో ఎట్లా స్తుతించగలను (51) అయినా భక్తితో ఆశ్రయించే వారికి పొందదగిన వినీపాద పద్మములు. ఆ నమస్కరించిన వారి ఆర్తిని తొలగించేవి. పరమైన సంసార దవాగ్నితో ఏడితుడనై వేను నిత్యము సంసారభీతి శాంతి కొరకు : సేవిస్తున్నాను (52) దేవదేవునకు నమస్కారము. మహాదేవునకు శంభునకు త్రిమూర్తి రూపునకు సృష్టిస్థితి లయకారునకు నమసా (53) విశ్వవు ఆదిరూపునకు నమస్కారము విశ్వవు ప్రథమ సాక్షికి నమస్కారము. సత్ మాత్రమే తత్వముగా గలవానికి నక (54) సర్వక్షేత్రములందు నివసించే వానికి, క్షేత్రములందు భిన్నభిన్నముగా ఆత్మశక్తి గలవానికి, ఆశత్తునకు, శక్తి ఆభాపముగా భూయనుడవైన నీకు నమస్కారము. (55) ఆ భాపరహితునకు, నిత్యునకు సత్యజ్ఞానములు అంతరాత్మగాగల వానికి విదూరునకు, అశేషకర్మల మండి ముక్తుడైన వానికి కర్మహీనుడు (56) వేదాంత వేద్యునకు, విదూరునకు, అశేష ముఠుడైన వాని కర్మ వృత్తి నుండి నివృతుడైన వానికి నమస్కారము (57) కల్యాణ వీర్యునకు, కల్యాణ ఫలదాయి అనంతునకు, మహత్తునకు, గొంతునకు, శివరూపునకు నమస్కారము (58) అమౌరునకు, సుమారునకు, ఘోరమైన పా చీల్చువానికి, భరునకు భవనకు భంజనునకు, గరీయమునకు నమస్కారము. ధ్వష్ణమోహనకు, విశదమైన (59) నమస్కారము. ఓ జగన్నాధ! నన్ను రక్షించు. ఓ శంకర, శాశ్వత నన్ను రక్షించు. రుద్ర విరూపాక్ష, నన్ను గ అవ్యయ నన్ను రక్షించు (60) శంభు, చంద్రశేఖర,శాంతమూర్తి, గౌరీశ, చంద్రుడు, సూర్యుడు అగ్ని వీ/ గంగాధర, అంధక సంహారి, పుణ్యకీర్తి, భూతేశ, భూ ధరమందు నివసించేవాడ నీకు ఎల్లప్పుడు నమస్కారమ ఈ విధముగా రాజుదేవుని మహేశ్వరుని భగవంతుని ప్రార్థించగా ఆతడు, పార్వతిపాటు ప్రసన్నుడై ఆదఁ

తా ఈశ్వరుని వచనము - ఓ రాజా! నీ భక్తితో, నీ స్తోత్రంతో సంతోషించాను. అనన్య చిత్తంతో, నిత్యము ఎల్లప్పుడూ నన్ను పూజించావు. అందుకు సంతసించాను (63) నీ భావం పరీక్షించే కొరకు బ్రాహ్మణుడనై నేను వచ్చాను. పులితో తీసుకుపోబడిన ఆ దేవి పార్వతి (64)నీ బాణములతో గాయపడని పులి మాయమైనది. నీ ధర్మాన్ని పరీక్షించదలచి నీ భార్యను యాచించాను (65) ఈ కీర్తి మాలిని యొక్క నీ యొక్క శక్తిచే సంతుష్టి నొందాను. ఓ మానద. వరమిస్తాను. దుర్ధభమైన దైనా కోరుతో (66) అనగా రాజువచనము - ఓ దేవ! నీవు పరమేశ్వరుడవై ఉండి, భవతావరీతుడనైన నాకు ప్రత్యక్షమైనావు. ఇదే నాకు వరము. (67) వరములనిచ్చే నీ నుండి మరో వరాన్ని కోరను ఓ దేవ! నేను నా రాణి, నా తల్లి, తండ్రి (68) పద్మాకరుడనే వైశ్యుడు, అతని పుత్రుడు సునయుడు వీరందరిని ఎప్పుడూ నీ ప్రక్కన ఉండేట్లుగా చేయి, ఓ మహాదేవ! (69) అని అనెను. మతవి వచనము మహాభాగ రాణి కీర్తి మలివి నమస్కరించి గిరీశుని భక్తితో సంతోషపరచి ఉత్తమమైన వరాన్ని కోరింది (70) రాజ్ఞీ పచనము - నా తండ్రి చంద్రాంగదుడు నా తల్లి సీమంతిని ఓ మహాదేవ! వారు కూడా ప్రక్కన ఉండేట్లు అనుగ్రహించు అని అనగా (71) గౌరీశుడు భక్త వత్సలుడు ప్రసన్నుడై అట్లాగే కానిమ్మని అన్నాడు. వారికి కావలసిన వరాలిచ్చి కలంలో అంతర్షితుడైవాడు (72) ఆ రాజు కూడా దేవతలతో పాటు, శివుని అనుగ్రహాన్ని పొంది, కీర్తి మాలినితో కూడి, ప్రియమైన సుఖాలను అనుభవించాడు. (73) పదివేల సంవత్సరాలు, బలము ఔన్నత్యములకు ఎదురులేకుండా రాజ్యం పాలించి, రాజ్యాన్ని పుత్రులపై ఉంచి శివుని ఉత్తమ స్థానాన్ని చేరాడు (74) రాజేంద్రుడు చంద్రాంగదుడు రాజ్ఞీ సీమంతుని గిరీశుని భక్తితో పూజించి శివ వేదాన్ని చేరారు (75) ఈ పవిత్రమైన పావనాశకమైన విచిత్రమైన, శివుని గుణములను వివరించే పరమ రహస్యమైన దానిని ఎవరు బుధులకు విన్పిస్తారో, ప్రయత్న పూర్వకముగా చదువుతారో వారు భోగముల వై భవాన్ని పొంది చివర శివుని పొందుతారు (76) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర వంతయందు తృతీయమైన బ్రహోత్తర ఖండమందు భద్రాయు శివ ప్రసాదాన్ని పొందటమనే కథ అనునది పదునాల్గవ అధ్యాయము.