స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని బ్రహ్మోత్తర ఖండము

17 అధ్యాయము

తా ఋషులిట్లన్నరు - వేదవేదాంగ తత్వజ్ఞులైన గురువులలో బ్రహ్మ వాదులలో ఉపదేశం పొందిన నరులు వెంటనే సిద్ధిని పొందుతారు. (1) ఇతర జనుల వలె సామాన్యులైన గురువులతో నీతి కోవిదులతో ఉపదేశం పొందిన నరులకు ఎటువంటి సిద్ధి లభిస్తుంది. (2) అనగా సూతులిట్లన్నారు. శ్రద్ధయే సర్వ ధర్మములకు ఎక్కువ హితం చేసేది శ్రద్దవల్ల నే నరులకు రెండు లోకములలో సిద్దికలుగుతుంది (3) శ్రద్ధతో భజించేవారికి శిల కూడా ఫలితాన్నిస్తుంది. భక్తిలో మూర్ఖుడు పూజించినా గురువు. సిద్ధిని కల్గిస్తాడు (4) శ్రద్ధతో మంత్రాన్ని చదివితే అది అబద్ధమైనా (బద్ధంకానిది) ఫలాన్నిస్తుంది. శ్రద్ధతో దేవుని పూజిస్తే ఆతట నీచును కూడా ఫలమిస్తాడు. (5) అశ్రద్ధతో చేసిన పూజ దానము యజ్ఞము, తపస్సు, వ్రతము, నిష్పలమౌతాయి అంతా, సంధ్య వృక్షంయొక్క పూవు వలె (6) అంతటా సంశయం గలవాడై శ్రద్ధా హినుడై అతి చంచలుడై పరమార్థం నుండి భ్రష్టుడైన వాడు సంసారం నుండి ముక్తినొందడు (7) మంత్రము, తీర్ధము, ద్విజుడు, దేవుడు, దైవడు, మందు, గురువు వీరి యందు ఎటువంటి భావన ఉంటే అటువంటి ఫలితం కలుతుంది (8) అందువల్ల ప్రపంచమంతా భావంతో నిండింది. పుణ్యము, పావము అన్ని భావంను అనువరించే భావపానునకు ఆ రెండు ఎప్పుడూ కలుగవు. (9) ఇక్కడ వరము ఆశ్చర్యకరమైన కథమ వర్ణిస్తున్నాము. సర్వ మర్త్యులకు అశ్రద్ధ దేని నుండి (పుణ్యం) వెంట నేని వర్తింపచేస్తుందో (10) పాంచాల రాజువకు వంకేతువు అని ప్రసిద్ధుడైన పుత్రుడు ఉండేవాడు. సర్వ గుణములు కలవాడు. ఎప్పుడూ క్షత్ర ధర్మాన్ని అనుసరించే వారు (11) ఆతడొకసారి కొద్ది మంది భృత్యులతో కలిపి ఆ మహాబలుడు వేటకై అనేక మృగములతో కూడిన అడవికి వెళ్ళాడు (12) ఆతని భృత్యుడు ఒక శబరుడు వేటకై అడవిలో తిరుగుతూ జీర్ణమైన, చీలిన వతితమైన దేవాలయాన్ని చూచాడు (13) అక్కడ స్థండిలం పైన పడి భిన్నమైన పీఠమును చూచాడు. ఋజువైన శివలింగమును సూక్ష్మమైన దానిని తన భాగ్యమే మూర్తి భవించినట్లుగా ఉన్న దానిని చూచాడు (14) అతడు దాన్ని తీసుకొని పూర్వ కర్మ ప్రేరితుడై వేగంగా వచ్చి ధీమంతుడైన ఆ రాజపుత్రునకు చూపాడు (15).   

తా ॥ ఓ ప్రభు ! ఈ అందమైన లింగాన్ని చూడు నేను దీన్ని ఇక్కడ చూచాను. దీనిని పూజిస్తాను, నాకున్నంతలో, ఆదరంగా (16) దీని పూజా విధాన మేమిటో చెప్పు. దేవుడైన మహేశ్వరుడు మంత్ర మెరిగిన వారితో, ఎరుగని వారితో పూజింపబడితే సంతోషించే ఆ పూజ చెప్పు (17) అని అనిషాదుడు రాకుమారుని అడుగగా ఆతడు వీనిని చూచి నవ్వి పరిహాస మెరిగినవాడై ఇట్లా చెప్పాడు. (18) సంకల్ప పూర్వకముగా ఎప్పుడూ కొత్త నీటితో అభిషేకం చేయాలి. శుద్ధమైన ఆసన మందు కూర్చొని శుభ్రమైన గంధముతో కొత్త అక్షతలలో అడవి ఆకులు, పూలతో ధూప దీపములతో పూజించాలి (19) చితా భస్మమును మొదట ఉపహారంగా కల్పించాలి. తాను అనుభవించ తగిన అన్నముతో బుధుడు నైవేద్యం కల్పించాలి. (20) పిదప ధూపదీపాదులను ఉపచారములను కల్పించాలి. నృత్యము వాదిత్రము, గీతాదులను చెప్పిన ప్రకారం కల్పించాలి (21) విధి ప్రకారము నమస్కరించి బుధుడు ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇది సాధారణమైన శివ పూజా విధి నీకు చెప్పాము. (22) చితా భస్మ ఉప హారంలో శివుడు వెంటనే సంతోషిస్తాడు (23) సూతులిట్లన్నారు - పరిహాసరసంతో ఈ విధంగా ఈ యజమానితో శాసింపబడి ఆ చండుకుడనే శబరుడు ఆ మాటలను శిరసా వహించాడు (24) పిదప తన ఇంటికి వచ్చి లింగరూపీ మహేశ్వరుని ప్రతిరోజు పూజించ సాగాడు. చితా భస్మాన్ని ఉపహారంగా చేయసాగాడు. (25) తనకు ప్రియమైన గంధ పుష్ప అక్షరాదులను శంభువడు నివేదన చేసి నిత్యము ఆ పిదపా, అవే ఉపయోగించేవాడు (26) ఇట్లా మహేశ్వరుని భక్తితో భార్యతో కూడి పూజించసాగాడు. శబరుడు సుఖాన్ని పొంది కొన్ని సంవత్సరాలు గడిపాడు (27) ఒకసారి శభరోత్తముడు శివపూజకై ఆరంభించాడు. పాత్రమందు నింపిన చితాభస్మము ఏ కొంచేం కూడా కల్పించలేదు. (28) ఇక అతడు తొందరగా దూరంగా వెతుకుతూ, ఆంతటా తిరుగుతూ చితా భస్మాన్ని పొందలేక పోయాడు. అలసి పోయి తిరిగి ఇంటికి వెళ్ళాడు (29)పిదప తన భార్యను పిలిచి శబరుడు ఇట్లా అన్నాడు. నాకు చితా భస్మం లభించలేదు. ఏమి చేయాలో చెప్ప ఓ ప్రియ! (30). 

తా ॥ ఈ వేళ వారు పాపాత్ముడనైనందుడు శివపూజకు అంతరాయం ఏర్పడింది. పూజ లేకుండా క్షణం కూడా నేను జీవించ దలుచు కోలేదు (31) పూజ ఉపకరణం లభించకపోతే ఉపాయమేమిటో నాకు తెలియదు. సకల అర్థములనిచ్చే గురువు ఆజ్ఞ తప్పి పోగూడదు (32) అని వ్యాకులితుడైన భర్తను చూచి శబరాంగన ఇట్టా అంది. భయపడొద్దు నీవు. నీకు ఉపాయం చెప్తాను (33) చాలా కాలం నుండి ఉన్న ఈ గృహాన్ని తగులబెట్టి నేను అగ్నిలో ప్రవేశిస్తాయి. అప్పుడు చితా భస్మమౌతుంది (34) శబరుడిట్లన్నాడు. ధర్మార్ధ కామ మోక్షములకు దేహము వరము సాధనము. సుఖార్థమైన నవయౌవనమైన అ దేహాన్ని ఎట్లా విడుస్తావు. (35) ఇప్పుడు నీకు సంతానం లేదు. విషయములను అనుభవించలేదు. ఈ శరీరము అనుభవములకు తగినది ఇట్టి దేహాన్ని తగుల బెట్టడానికి ఎట్లా ఇష్టపడుతున్నావు (36) అనగా శబరి ఇట్లా అంది. జీవితమునకు జన్మకు ఇదే సాఫల్యము, పరుల కొరకు ఎవడు ప్రాణాన్ని వదులుతాడో స్వయంగా శివుని కొరకై వదిలితే చెప్పేదేముంది (37) ఘోరమైన తపస్సు చేశారు. పూర్వం నేనేమైనా దానం చేశానా. శివపూజ ఏమైనా చేశానా నూర్ల పూర్వ జన్మలలో (38) నా తండ్రి పుణ్యమేమో. నా తల్లి కృతార్థ తపమే శివుని కొరకు సమిధనై అగ్నిలో ఈ శరీరాన్ని వదులుతాను (39) అని ఆమె స్థిరమైన బుద్ధిని చూచి శంకరుని యందు ఆమెకు గల భక్తిని చూచి అట్లాగే అని పలికి దృఢ సంకల్పంతో శబరుడు పూజించాడు (40) ఆమె భర్తను చేరి స్నానం చేసి శుచియై ఆలంకరించుకొని ఇంటిని తగులబెట్టి ఆ అగ్నికి భక్తితో ప్రదక్షిణం చేసింది (41) తన గురువు నకు నమస్కారం చేసి హృదయంలో సదాశివుని ధ్యానించి, అగ్ని ప్రవేశమునకు అనీముఖమై చేతులు జోడించి ఇట్లా పలికింది. (42) శబరి వచనము - నా ఇంద్రియములు నీకు పూలు కాని. ఓ దేవ! ఈ శరీరము వీడు అగరు ధూపం కాని నా హృదయం నీకు దీపం కాని నా ప్రాణములు హవిస్సు కాని కరణములు నీకు అక్షతలు కాని ఈ జీవుడు ఇప్పుడు పూజా ఫలం కాని (43) నాకు సర్వధవాధి పత్యము వద్దు. స్వర్గభూమి పదము వద్దు. విధాత యొక్క అచలమైన పదము వద్దు. మళ్ళీ పుడ్తే జన్మ జన్మలలో నేను నీ పాద పద్మములందుండే ముకరంద మునా స్వాదించే తుమ్మెదను కావాలి (44) నూర్ల కన్న ఎక్కువగా నాకు జన్మలు కలుగని ఒ దేవ! నా చిత్రమందు ఆబోధ హేతువైన మాయ కలుగొద్దు. క్షణంలో సగం కాలం కూడా నీ చరణార విందముల నుండి నా హృదయము. తొలగిపోరాదు. ఓ ఈ నమస్కారము, నీకు నమస్కారము (45). 

తా ॥ అని దేవేశుని ప్రార్థించి శబరి దృఢ నిశ్చయంతో మండుతున్న అగ్నిలో ప్రవేశించింది. క్షణంలో భస్మమై పోయింది (46) శబరుడు ఆ భస్మాన్ని ప్రయత్న పూర్వకముగా గ్రహించి కాలిపోయిన ఇంటి సమీప మందు చక్కగా శివపూజ చేశాడు (47) ఇక పూజాంత మందు ప్రసాద గ్రహణమునకు తగిన, రోజు వస్తున్న, చేతులు జోడించిన వినయము గల భార్యను స్మరించాడు. (48) స్మరించినంతలో వచ్చిన వెనుక నిల్చున్న ఆమెను చూచాడు. పూర్వపు అవయవములతోనే భక్తి నమ్రురాలై స్వచ్ఛంగా నవ్వుతున్న దానిని (49) ఆమెను శబరుడు వెనుకటిలా చేతులు జోడించి ఉన్న భార్యను చూచి, భస్మంగా మిగిలిన ఇల్లు వెనుకటిలా ఉండటం చూచీ (50) అగ్ని తేజస్సుతో దహిస్తుంది. సూర్యుడు కిరణాలతో దహిస్తాడు. రాజు దండంతో దహిస్తాడు. బ్రాహ్మణుడు మనస్సుతో దహిస్తాడు (51) ఇది కలా లేక మాయ భ్రమనా అని విస్మయ సంభ్రాంతుడై ఆమెను తిరిగి అడిగాడు (52) నీవెట్లా వచ్చావు. అగ్నిలో బూడిద వైనావు కదా. ఇల్లు కాలిపోయింది. ఎట్లా పూర్వం వలె తిరిగి నిలిచింది (53) అనగా శబరి ఇట్లా అంది. ఇంటిని మండించి అగ్నిలో నేను ప్రవేశించినపుడు పన్ను నేనెరుగను. అగ్నిని చూడలేదు (54) ఏ కొంచెం తాపము కలుగలేదు. వీటిలో ప్రవేశించినట్లని పించింది. సుషుపుని వలె అర క్షణంలో తిరగి క్షణంలో మేల్కొన్నాను. (55) ఇంతలో భవనము తగలబడకుండా బాగానే ఉన్నట్లు చూచాను. ఇప్పుడు దేవ పూజాంత మందు ప్రసాదం తీసుకోవటానికి వచ్చాను (56) ఈ విధముగా పరస్పరము ప్రేమతో దంపతులు మాట్లాడుకుంటుండగా వారి ఎదుట అద్భుతమైన దేవ విమానము ప్రత్యక్షమైనది (57) నూరు చంద్రులవలె వెలిగి ఆ విమానమందు నలుగురు ఈశ అనుచరులు ముందున్నారు. నిషాద దంపతులను చేతిలో తీసుకొని రూపం వదలని వారిని విమానంపై ఉంచారు (58) ఆనిషాద దంపతుల ఆ శరీరము ఆ క్షణంలోనే శివదూతల కర స్పర్శవల్ల వారి సారూప్యాన్ని పొందింది (59) అందువల్ల పుణ్యకర్మలన్నింటిలో శ్రద్ధను ఆచరించాలి. నీచుడైన శబరుడు కూడా శ్రద్ధతో మిగుల గతిని పొందాడు. (60) సకల వర్గ జనులలోని ఉత్తమమైన జన్మతో పనిలేదు. సకల శాస్త్ర విచారము కలిగిన విద్యతో పనిలేదు. ఎవని హృదయంలో ఎప్పుడూ పరమేశభక్తి ఉందో వానికన్న ధన్యుడైన పురుషుడు ముల్లోకములలో ఎవడున్నాడు (61) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతియ బ్రహోత్తర ఖండమందు భస్మ మాహాత్మ వర్ణనమనునది పదునేడవ అధ్యాయము.