స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని బ్రహ్మోత్తర ఖండము

12 అధ్యాయము

తా ఋషభునివచనము - విశ్వ వ్యాప్తియైన ఈశ్వరుని మహాదేవుని నమస్కరించి, శివమయమైన పరమ, (కవచమును) నరులకు అన్ని విధముల రక్షణ నిచ్చే దానిని చెప్తాను (1) శుచియైన ప్రదేశమందు కూర్చొని చెప్పిన విధంగా ఆసనం ఏర్పరచుకొని, జితేంద్రియుడై, ప్రాణములను అధీనమందుంచుకొని, అవ్యయుడైన శివుని ధ్యానించాలి. (2) హృత్పుండరీకం మధ్య యందున్న తన తేజస్సుతో ఆకాశ అవకాశాన్ని వ్యాపించిన అతీంద్రియుడైన సూక్ష్ముడైన అనంతుడైన ఆద్యుడైన సదానందమయుడైన మహేశుని ధ్యానించాలి. (3) ధ్యానంలో కర్మ బంధములన్ని తొలగిపోయి, మనస్సు చిరకాలము చిదానందమందు నిమగ్నముగా, షడక్షర వ్యాసమందు ఆత్మ నుంచి శివ కవచంలో రక్ష చేయాలి (4) అఖిల దేవాలాతుడైన దేవుడు గంభీరమైన సంసార రూప మందు పడిన నన్ను రక్షించని. ఆ నామము దివ్యమైంది. శ్రేష్ఠ మంత్రమునకు మూలమైంది నా హృదయ మందున్నది నా పాపములన్ని పోగొట్టని (5) విశ్వమూర్తి అంతట నన్ను రక్షించని, జ్యోతిర్మయుడు, ఆనందఘనుడు, చిదాత్మ అణువుకన్న అణువు, గొప్పశక్తి కలవాడు ఆతడు ఒక్కడే ఈశ్వరుడు అన్ని భయముల నుండి నన్ను రక్షించని (6) భూ స్వరూపములో విశ్వాన్ని భరిస్తున్నాడు. అష్టమూర్తి గిరీశుడు భూమి నుండి, నన్ను రక్షించని. నీటి రూపంలో ఉండి ప్రజలను బ్రతికిస్తున్న ఆ స్వామి జలము నుండి నన్ను రక్షించని (7) కల్ప అవ సానమందు లోకములనన్నిటిని కాల్చి నాట్యం చేసే లీలా రూపి కాలరుద్రుడు దవాగ్ని నుండి సుడిగాలి మొదలగు వాటి భయం నుండి సమస్త తాపముల నుండి నన్ను రక్షించని (8) మండుతున్న మెరుపు, బంగారంలా వెలిగే, విద్యార్థులకు భయం లేకుండా గొడ్డలి చేత ధరించిన చతుర్ముఖుడు, తత్పురుషుడు త్రినేత్రుడు, ప్రాచి యందు ఉన్న నన్ను ఎల్లప్పుడు రక్షించని (9) గొడ్డలి, వేదములు, అంకుశము, పాశము, శూలము కపాలము, ఢక్క, అక్షమాల, అల్లెత్రాడు ధరించిన చతుర్ముఖుడు, నీలకాంతి గలవాడు త్రినేత్రుడు ఐన అఘోరుడు దక్షిణ దిక్కుయందు నన్ను రక్షించని (10) కుంద పుష్పము, చంద్రుడు, శంఖము, స్పటికము వీని వలె వెలిగేవాడు వేదములు ఆక్షమాల, వరద హస్తము అభయ చిహ్నము గలవాడు, త్రినేత్రుడు నాల్గు ముఖములు గలవాడు గొప్ప శక్తి కలవాడు అట్టి వద్యోధి జాతుడు నన్ను వడమటి దిక్కున రక్షించని (11) శ్రేష్ఠమైన అక్షమాల, అభయహస్తము ఖడ్గము చేత ధరించిన, తామరలోని కింజల్కముల వంటి వర్ణముగల త్రిలోచనుడు, చతుర్ముఖుడు వామదేవుడు ఉత్తర దిక్కులో నన్ను రక్షించని (12) వేదములు, అభయము, యజ్ఞము, అంకుశము, కత్తి, పాము, కపాలము, ఢక్క, అక్షతము శూలము వీటిని చేత ధరించిన, తెల్లని కాంతిగల పంచముఖుడు, పరమ ప్రకాశుడు ఈశానుడు పైన నమ్న రక్షించని (13) నా తలను చంద్రమౌళి రక్షించని భగనేత్ర హారిణా నేత్రముల రక్షించని విశ్వనాథుడు వివాహితను రక్షించని (14) శ్రుతులలో పొగడబడిన కీర్తిగల ఆతడు నా చెవులను రక్షించవి. కపాలి ఎవడ్రూ వాకపోలముల రక్షించని పంచ వక్త్రుడు నా వక్త్రాన్ని రక్షించని వేద జిహ్వడు నా జిహ్వను సదా రక్షించని (15) గిరీశుడు నీలకంఠుడు నా కంఠాన్ని రక్షించని. పినాకపాణి నా చేతులను రక్షించని ధర్మబాహువు నా బాహుమూలములను రక్షించని దక్షమఖ నాశకుడు నా వక్షః స్థలమును రక్షించని (16) గిరీంద్రమును ధనువుగా గలవాడు నా ధనువును రక్షించని. మదనాంతక శత్రువు నా మధ్యభాగమును రక్షించని. హేరంబుని తండ్రి నా నాభిని రక్షించని. ధూర్జట ఈశ్వరుడు వాటిని రక్షించని (17) కుబేరమిత్రుడు నా తొడలను రక్షించని, జగదీశ్వరుడు నా రెండు జానువులను రక్షించని. వృషభమున జండాలో గలవాడు నా జంఘములను రక్షించని, సురలతో నమస్కరించబడే పాదాలు గలవాడు నా పాదాలను రక్షించని దినం తొలి యానంలో నన్ను మహేశ్వరుడు రక్షించని, వామదేవుడు మధ్య యామమందు మూడవ యామమందు త్ర్యంబతుడు, దివాంతయామమందు వృషధ్వజుడు నన్ను రక్షించని (19) శశిశేఖరుడు నిశ ఆదులందు నన్ను రక్షించవి. నిశీధమందు గంగాధరుడు నన్ను రక్షించని. వినసావమందు గౌరీవతినను రక్షించని ఎల్లప్పు డు మృత్యుంజయుడు నన్నురక్షించని. చుట్టుముట్లు నన్ను ఎల్లప్పుడు మృత్యుంజయుడు నన్నురక్షించని (20) శంకరుడు, లోపల ఉన్ననన్ను రక్షించని బయట ఉన్న నన్ను స్థాణువు సదా రక్షించని. వీటి మధ్యయందు పశుపతి నన్ను రక్షించని. చుట్టు ముటు నన్ను ఎల్లప్పుడు శివుడు రక్షించని (21) నిల్చున్న నన్న భువనములకు ఒకే నాధుడైనవాడు రక్షించేవి. వెళ్తున్న నన్ను ప్రమధ అధివాధుడు రక్షించని. తూర్పున్న నన్ను వేదాంత వేద్యుడు రక్షించని. నిద్రించిన నన్ను అవ్యయుడు శివుడు రక్షించని (22)

ఓం నమోభగవతే సదా శివాయ సకల తత్వాత్మకాయ, కలతత్వ విహారాయ, సకల లోకైక కర్త్రే సకల లోకైక భర్త్రే సకలలోక హర్త్రే, సకల లోకైక గురవే, సకల లోకైక సాక్షిణీ, సకలనిగమ గుహ్యాయ, సకల వరప్రదాయ, సకల దురితార్తి భంజనాయ సకల జగధభయంతరాయ, సకల లోకైక శంకరాయ, శశాంక శేఖరాయ, శాశ్వత విభావాయ, నిర్గుణాయ, నిరుపమాయ, నీరూపాయ, విరాభాపాయ, నిరామయాయ, విప్రు వంచాయ, నిష్కలంకాయ, నిర్ద్వంద్వాయ, నిఃవంగాయ, నిర్మలాయ, నిర్గమయ, నిత్యరూప విభవాయ, విరుపమ విభవాయ నిరాధారాయ, నిత్యశుద్ధ బుధ సంపూర్ణ సచ్చిదానందా ద్వయాయ పరమ శాంత ప్రకాశతేజో రూపాయ జయజయ మహారుద్ర, మహారౌద్ర భద్రావతార దుఃఖ దావ దారణ మహాభైరవ, కాలభైరవ, కల్పాంత భైరవ కపాల మాలాధర, ఖట్వాంగ ఖఢ్గ చర్మ పాశాంకుశ డమరు శూల చావ బాణగదాశక్తి భిండిపాలతో మరము సలముధ్గర పట్టశ వరకు పరిఘ భుశుండీ శతఘ్నీ చక్రాద్యాయుధ భీషణ కర సహస్రముఖ దంష్ట్రాకరాల వికటాట్టహావ విస్పారిత బ్రహ్మ మండల నాగేంద్ర కుండల నాగేంద్రహార, నాగేంద్ర వలయ, నాగేంద్ర చర్మధర, మృత్యుంజయ త్ర్యంబక త్రిపురాంతక, విరూపాక్ష విశ్వేశ్వర, విశ్వరూప వృషభ వాహన, విష భూషణ విశ్వతో ముఖ పర్వతో రక్ష రక్ష జ్వల జ్వల మహామృత్యు భయం అప మృత్యుభయం నాశయ నాశయ,రోగభయ ముత్పాద యోత్పాదయ విష సర్పభయం శమయ శమయ చోర భయం మారయ మారయ మమ శత్రూన్ ఉచ్చాటయోచ్చాటయ శూలేన విదారయ విదారయ కుఠారేణ భింధి భింది ఖఢ్గేన ఛింధిచింది ట్వాంగిన విపోధయ విపోధయ మునలేన నిష్పేషయ బాణైః వంతాడయ, సంతాడయ రక్షాంసి భీషయ భీషయ భూతాని విద్రావయ విద్రావయ కూష్మాండమేతాల మారీగణ బ్రహ్మరాక్షసాన్ సంత్రాసయ సంత్రాసయ మమా భయంకురుకురు విత్రస్తం మామా శ్వాసయా శ్వాసయా నరక భయత్ మాముద్ధారయోద్ధారయ సంజీవయ సంజీవ యక్షుత్తడ్భ్యాం మాం ఆప్యాయయాప్యాయయ దుఃఖాతురంతం ఆనందయానం దయశివకవచేన మాం ఆచ్ఛాదయా చ్ఛాదయ త్ర్యంబక సదాశివ నమస్తే నమస్తే నమస్తే.  

తా ॥ మార్గ మందు నీలకంఠుడు శైలాది దుర్గము లందు త్రిపురారి, అరణ్య వాసాది మహా ప్రవానమందు, ఉదరశక్తి గల మృగ వ్యాధుడు నన్ను రక్షించని (23) కల్ప అంత కాలమందలి ఆటోవము వలె చాలా కోపం గల, స్పుటమైన అట్టహాసంతో బాగా కదలిన అండ కోశములు (భువనములు) గల, ఘోరమైన శత్రు సేనా సముద్రం వల్ల కల్గునని వారింప శక్యంకాని మహాభయం నుండి వీరభద్రుడు నన్ను రక్షించని (24) కాల్బలము, గుఱ్ఱములు, ఏనుగులు, వీని సమూహములు పది లక్షల కోట్లు వీనితో భయంకరమైన అక్షౌహిణుల శతాన్ని ఆతతాయులను (చంచనుద్యుక్తు డైనవాడు) మృడుడు తన ఘోరకుఠార ధారతో చేదించేవి (25) ప్రళయ అనలం వలే కాంతులు గల, మండుతున్న త్రిపురాంతకుని త్రిశూలము దన్యులను చెంపని. శార్దూలము, సింహము, ఎలుగుబంటు, తోడేలు మొదలగు హింసించే క్రూరజంతువులను ఈశుని ధనువైన పినాకము బాధపెట్టని (26) దుః స్వప్నములు, దుశ్శకునములు, దుర్గతి, దౌర్శనస్యము, దుర్భిక్షము, దుర్వ్యవనములు, భరింపరాని దుష్కీరులు, ఉత్పాతములు, విష భయము, చెడు గ్రహముల బాధ వ్యాధులను నాకు కల్గే వీటన్నిటిని జగత్తునకు అధీశుడైన ఈశుడు నశింపచేయని (27) ఓం నమో భగవతే సదా శివాయ, సకలతత్వాత్మతునకు, సకల తత్త్వ విహారునకు సకల లోకముల ఒకే కర్తకు, సకల లోకములకు ఒకే భర్త ఐన వానికి, సకల లోకములకు ఒకే హర్త ఐన వానికి, సకల లోకములకు ఒకే గురువైన వానికి, సకల లోకములకు ఒకే సాక్షి ఐన వానికి సకల నిగమములకు రహస్యమైన వానికి, వకల వరములను ఇచ్చేవానికి, సకల దురితముల ఆర్తిని నశింపచేసే వానికి సకల జగత్తునకు అభయమిచ్చే వారికి సకల లోకములకు ఒకే, మంగళమును చేసే వానికి, శశాంక శేఖరునడు, శాశ్వతమైన తన కాంతిగల వానికి నిర్గుణునకు, నిరుపమునకు, రూపవానునకు, నిరాభాపునకు, నిరామయునకు నిద్ర వంచునతు నిష్కలంకు నకు నిర్ద్వంద్వు నకు నిష్పంగునకు నిర్మలుడు, నిర్గమునకు, నిత్యరూప విభవునకు, నిరుపమ విభవునకు నిరాధారునకు, నిత్య శుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానంద నిర్ద్వంద్వునకు పరమ కాంత ప్రకాశతేజో రూపునకు జయము జయము. మహారుద్ర మహారౌద్ర భద్రావతార దుఃఖ దావదారణ మహా భైరవ కాల భైరవ కల్పాంత భైరవ, కపాలమాలధర, ఖట్వాంగ ఇఢ చర్మ (డాలు) పాశ అంకుశడమరు తలచావ బాణగదాశక్తి భిఒడివాల తోమర ముసలముద్గర, వట్టిశ, పరశు వరిఘ, భుశుండి, శతఘ్నిచక్రము మొదలగు ఆయుధములతో భీషణమైన వేయి చేతుల వాడము ఖదంష్ట్రా కరాళ, వికటాట్ట హాసముతో వచ్చిన బ్రహ్మాండ మండలం కలవాడ, నాగేంద్ర కుండలుడ, నాగేంద్రహార, నాగేంద్రవలయ, నాగేంద్రచర్మధర మృత్యుం జయత్ర్యంబక త్రిపురాంతక, విరూపాక్ష విశ్వేశ్వర, విశ్వరూప, వృషభ వాహన, విష భూషణ, విశ్వతో ముఖ, సర్వతః రక్ష, రక్ష (నన్ను రక్షించు, రక్షించు). జ్వల జ్వల మహామృత్యుభయాన్ని అవ మృత్యు భయాన్ని నశింపచేయి, నశింపచేయి. రోగ భయాన్ని తొలగించు, తొలగించు, విష సర్ప భయాన్ని తగ్గించు తగ్గించు చోర భయాన్ని చంపు చంపు. నా శత్రువులను హలంతో ఉచ్చాటన చేయి, ఉచ్చాటన చేయి.గండ్ర గొడ్డలితో చీల్చు చీల్చు. ఖడ్గంతో భేదించు భేదించు ఖట్వాంగముతో ఛేదించు ఛేదించు. ముసలంతో (రోకలి) చలింపచేయి, చలింపచేయి బాణములలో పొడిచేయి, పొడిచేయి (పిండిచేయి) రాష్ట్రమలను కొట్టు, కొట్టు భూతములను భయ పెట్టు, భయ పెట్టు కూష్మాండ వేతాళ మారీగణ బ్రహ్మరాక్షసులను ద్రవింపచేయి, ద్రవింపచేయి, భయ పెట్టు, భయ పెట్టు. నాకు అభయం ఇవ్వు. బాగా భయపడిన నన్ను ఒదార్చు ఓదార్చు. నరక భయం నుండి నన్ను ఉద్ధరించు ఉద్ధరించు ఆకలి దప్పుల నుండి నన్ను బ్రతికించు బ్రతికించు దుఃఖాకురుడైవ నన్ను ఓదార్చు ఓదార్చు. నన్ను సంతోష పరచు సంతోష పరచు శివ కవచంతో నన్ను కప్పివేయి కప్పివేయి. త్ర్యంబ సదాశివ నమస్తే (నీకు నమస్కారము) నమస్తే తే నమః ఋషభుని వచనము ! ఇది శివ కవచము వరదము నేను చేప్పాను. అన్నిబాధలను శమింపచేసేది అన్ని ప్రాణుల కిది రహస్యమైనది (28) దీనిని ఎల్లప్పుడు ఎవరు ధరిస్తారో ఈ శివ కవచాన్ని వారికి శివుని అనుగ్రహంవల్ల ఎక్కడా భయంకలగదు. (29) క్షీణాయులై మృత్యువును చేరినవారు, మహారోగ హతులైన వారు వెంటనే సుఖాన్ని పొందుతారు. దీర్ఘాయుస్సును పొందుతారు. (30) ఇది అన్ని దారిద్ర్యములను శమింప చేసేది. సుమాంగల్యాన్ని పెంచేది. ఈ శివకవచాన్ని ఎవరు ధరిస్తారో వారు దేవతలను పూజింప బడుతారు (31) మహా పాతక సంఘములనుండి, ఉప పాతకములనుండి ముక్తుడౌతాడు. దేహాంతమందు శివ కవచ ప్రభావంవల్ల శివుని చేరుతాడు. (32) ఓ కుమార! నీవు కూడా శ్రద్ధతో ఈ ఉత్తమమైన శివకవచాన్ని, నేనిచ్చినదాన్ని ధరించు వెంటనే శ్రేయస్సును పొందుతావు. (33) సూతులిట్లన్నారు - ఆ రాకుమారునకు యోగి ఋషభుడు ఇట్లా చెప్పి బాగా ధ్వనించే శంఖాన్ని శత్రువుల చంపే ఖడ్గాన్ని ఇచ్చాడు (34) తిరిగి భస్మాన్ని మంత్రించి అతని శరీరాన్ని అంతా స్పృశించాడు. ఆరువేల ఏనుగుల బలానికి రెట్టింపు బలాన్ని అతనికిచ్చాడు. (35) భస్మ ప్రభావంవల్ల బల ఐశ్వర్యధృతిస్మృతులు పొంది ఆ రాజపుత్రుడు శరత్కాల మందలి సూర్యునిలా కాంతితో ప్రకాశించాడు (36) చేతులు జోడించిన ఆ రాకుమారునితో మళ్ళా ఆ యోగి ఇట్లన్నాడు. ఈ ఖడ్గాన్ని నేను తపో మంత్రశక్తితో ఇచ్చాను (37) తీక్ష్ణమైన అంచుగల దీనిని ఎవరికి చూపిస్తావో అతడు వెంటనే మరణిస్తాడు. ఆ శత్రువునకు ఇది మృత్యువు కూడా సాక్షాత్తుగా, స్వయంగా (38) నీశత్రువులు ఈ శంఖ ధ్వనిని వింటే వారు మూర్చపోతారు, అస్త్రాలు విడిచి చైతన్యం లేకుండా (39) ఈఖడ్గశంఖములు దివ్యమైనవి. శత్రు సైన్యమును నశింపచేసేవి. ఆత్మసైన్యమునకు స్వపక్షము వారికి శౌర్య తేజములను పెంచేవి. (40) దీనిప్రభావం వల్ల శివకవచంతో కూడా పన్నెండు వేల ఏనుగుల బలంతో కూడా (41) భస్మధారణ సామర్థ్యంవల్ల శత్రు సైన్యాన్ని జయిస్తాను. పితృ సింహాసనాన్ని పొంది ఈ భూమిని రక్షిస్తావు. (42) అని తల్లితోపాటు భద్రాయున్పునకు బాగా చెప్పి వారి పూజను పొంది ఆయోగి స్వైర గమనంగా వెళ్ళాడు (43) అని శ్రీస్కాందమహాపురాణమందు ఏశీకాతి సహస్రసంహితయందు తృతీయమైన బ్రహ్మోత్తరఖండమందు ఏమంతిని మాహాత్మ్యమందు భద్రాయు ఉపాఖ్యానమందు శివకవచధన మనునది వన్నెండవ అథ్యాయము.