స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని బ్రహ్మోత్తర ఖండము

18 అధ్యాయము

తా సూతులిట్లన్నారు - ఇప్పుడు నేను సర్వ ధర్మములలో ఉత్తమోత్తమమైన దానిని చెప్తున్నాను. ఉమా మహేశ్వరమని ఈ వ్రతం పేరు. ఇది సర్వ అర్థములను సిద్ధింప చేసేది (1) ఆనర్త దేశంలో పుట్టినవాడు నేదరథుడు అని ద్విజుడు. కలత్రము పుత్రులు కలవాడు. విద్వాసుడు. ఉత్తమ వంశ జాతుడు (2) ఈ విధముగా గృహ స్థాశ్రమంలో ఉన్న ఆ బ్రాహ్మణునకు కమలముల వంటి లోచనములు గల కన్య శారద అను పేరు గలది ఉండేది (3) రూప లక్షణములు గల పన్నెండు సంవత్సరాల వయస్సు కల ఆ బాలను, భార్య చనిపోయిన ఒక బ్రాహ్మణుడు పద్మనాభు డనే వాడు యాచించాడు (4) మహాధనవంతుడు శాంతుడు, ఎవరు రాజునకు స్నేహితుడు ఐన అతడడిగితే, ఇవ్వకపోతే యాచన భంగమౌతుందనే భయంతో, తండ్రి ఆ కన్యను అతనికిచ్చాడు. (5) మధ్యాహ్న కాలమందు మామ ఇంట్లో వివాహమాడిన ఆ విప్రుడు సాయంకాలము సంధ్య చేయటానికి సరస్సు తీరానికి వెళ్ళాడు (6) విధిగా సంధ్యను ఉపాసించి ఆ చీకట్లో తిరిగి వచ్చాడు దారిలో పాము కరువగా తన కర్మవశాత్తు మరణించాడు ఆతడు (7) పెళ్ళైన అతడు మరణించగానే త్వరగా అతని బంధువులు ఆశ్రమమలు, కన్యక అందరు శోక సంతప్తులై ఏడ్చారు. (8) ఆతనిని వదలి అతని బంధుజనులంతా తమతమ ఇళ్ళకు వెళ్ళారు శారద విధవరాలై తండ్రి ఇంటిలోనే ఉండింది (9) భూతములలో ఆచ్చాదితమైన భోజనంలో (వాన) భర్త లేకుండా కొన్ని మాసములు ఆ బాల తండ్రి ఇంట్లో గడిపింది (10) ఒక రోజువై ధ్రువుడను పేరుగల చాలా వృద్దుడైన ముని గ్రుడ్డివాడు శిష్యుల చేయిపట్టుకొని వారి ఇంటికి వచ్చాడు (11) ఆ వృద్ధుడు ఇంటికి రాగా బంధువులు ఎక్కడికో పోగా తన దైవమే సాక్షాత్తుగా వచ్చినట్లు ఆ బాల తలచింది (12) ఓ మహాభాగ! మీకు స్వాగతము. ఈ పీఠమందు కూర్చోండి. ఓ మునినాథ నీకు నమస్కారము. మీకు నేను ఏమి ప్రియమాచరించాలి (13) అని పలికి భక్తి పాదములు కడిగి, ఆలసిన అతనికి విసన కర్రతో విసిరి మునిని సంతోష పరిచింది (14) ఆలసిన వానిని పీఠమందు కూర్చోబెట్టి తన చేతిలో అభ్యంగం చేసి(చేయించి) స్నానం చేసిన విధి ప్రకారము దేవార్చన చేసిన మునిని (15) సుఖంగా ఆసనముందు కూర్చున్న వానిని ఆతనిని ధూపమాల్య సులేపనములలో పూజించి శ్రేష్ఠమైన అన్నములతో ఆదర పూర్వకంగా భుజించేసింది (16).   

తా ॥ మెల్లగా చక్కగా భుజించి తృప్తుడై ఆనంద నిర్భరుడై ఆనందించి ఆ అంధ ముని ఆమెకు ఆశీర్వచనం చేశాడు (17) త్వరగా భర్తతో విహరించి, సర్వ గుణములతో వరిష్టుడైన కొడుకును అతనితో పొంది,లోకంలో గొప్పకీర్తిని పొంది దేవతలకు ప్రసాద (అనుగ్రహ) యోగ్యురాలవు కమ్ము (18) అని పలికినాడు ఆ ముని కళ్ళు లేనివాడు, ఆ మాటలు విని బాల విన్మితమై చేతులు జోడించి ఇట్లా అంది (19) ఓ బ్రహ్మ నీ వచనము నిజము కావాలి ఎప్పుడూ అబద్ధం రాదు. మంద భాగ్యురాలైన నాకీ విషయం ఎట్ల ఫలిస్తుంది. (20) వర్షం పర్వతం మీద పడ్డట్టు, సత్కారమును కుక్కకు చేసినట్లు, బ్రహ్మవిదుల ఆశీర్వాదము కూడా మందభాగ్యురాలైన నా విషయంలో వ్యర్థమే (21) ఓ బ్రహ్మన్! ఈ నేను విధవను దుష్కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నాను. మీ ఈ ఆశీర్వాదమునకునే యెట్ల యోగ్యురాలనౌతాను అనగా (22) ముని వచనము - నిన్ను చూడకుండా, గుడ్డివాణ్ణైనా నేను ఇప్పుడు ఏం చెప్పానో దాన్ని సాధిస్తాను. ఓ శుభురాల! నా ఆజ్ఞను పాలించు (23) నీవు ఉమా మహేశ్వరము అనే వ్రతాన్ని ఆచరిస్తే ఆ వ్రత మాహాత్మ్యంతో వెంటనే శ్రేయస్సును పొందుతావు అనగా (24) శారద వచనము - ఆచరించ వీలు కాని దైనా మీరు ఉపదేశించిన దానిని ప్రయత్న పూర్వకముగా ఆచరిస్తాను. ఆ వ్రతమేమిటో నాకు చెప్పండి. ఓ బ్రహ్మన్! విస్తారంగా దాని విధానాన్ని తెలువండి (25) ముని ఇట్లన్నాడు - చైత్ర మందు కానీ మార్గ శిరమందు కాని శుక్లపక్షంలో శుభదినమందు గురువు అనుజ్ఞతో చెప్పిన విధంగా ప్రచారంభం చేయాలి (26) రెండు పర్వములందలి అష్టమి యందు మరి చతుర్ధశి యందు విధి ప్రకారము సంకల్పం చేసి ప్రాతః స్నానము చేయాలి (27) పితృ దేవతలను తృప్తిపరచి తన భవనానికి వెళ్ళి చాందిని మొదలగు వానితో అలంకృతమైన దివ్యమైన మంటపాన్ని ఏర్పరచాలి (28) ఫలములు, చిగురుటాకులు పుష్పాదులు తోరణములు అమర్చాలి. దాని మధ్యలో ఐదురంగులలో ముగ్గుతో పద్మం వేయలి (29) బయట పదునాల్గు దళాలు, ఇరవై రెండు దళాలు దానిమధ్య ఎనిమిది దళాలు కలిగిన (30) దాన్ని గీసి ఐదు రంగులతో మవోరమంగా తీర్చి పిదప చతురస్రం చేయాలి. లోపల గుండ్రంగా ఉండటము శ్రేయస్కరము (31) ధాన్యము, బియ్యము దాని మధ్యలో ఆపై కూర్చ ఉంచాలి. కూర్చపై నీటితో నిండిన కలశము నుంచాలి (32). 

తా ॥ రంగు వస్త్రాన్ని కలశముపై ఉంచాలి. దానిపై శివపార్వతుల విశుభమైన బంగారు ప్రతిమలను ఉంచాలి. ఉంచి ఐశ్వర్యం ఉన్నంతలో భక్తితో పూజించాలి (33) పంచామృతముతో స్నానం చేయించి శుద్దోదకంతో స్నానం చేయించి ఏకాదశ రుద్రాన్ని జపించి, ఎనిమిది వందల సార్లు వంచాక్షరిని జపించి (34) ఆభిమంత్రించి తిరిగి ఉంచి పీఠమధ్య మందుంచి పూజించాలి. స్వయంగా శుద్ధాసన మందు కూర్చొని ఉతికిన తెల్లని వస్త్రముల బుద్ధిమంతుడు ధరించి (35) మంత్రంతో పీఠమును ఆ మంత్రించి ప్రాణాయా మమాచరించాలి. సంకల్పించి అక్కడ, శివుని ఎదుట చేతులు జోడించి, ఇట్లా పలకాలి (36) వరమైన పాపములను జన్మాంతర శతములందు నేను చేసిన వానిని అన్నింటిని నశింపచేసే కొరకు శివ పూజను ఆరంభిస్తున్నాను (37) సౌభాగ్య విజయ, ఆరోగ్య, ధర్మఐశ్వర్యముల అభివృద్ధి కొరకు స్వర్గ అవసర్గముల సిద్ధి కొరకు శివ పూజను చేస్తున్నాను (38) అని సంకల్పాన్ని ఉచ్చరించి విధిగా చక్కగా పిదప అంగన్యాసం చేసి ఈశుని పార్వతిని ధ్యానించాలి. (39) కుంద పూలు చంద్రుడు వానివలె తెల్లని వానిని, నాగాభరణ భూషితుని వరద అభయహస్తుని, పరశువు మృగమును ధరించిన వానిని (40) కోటి సూర్యులతో సమానమైన వానిని జగత్తునకు ఆనందకారణమైన వానిని, గంగా జలస్పర్శతో దీర్ఘమైన పింగళ జడలు ధరించిన వానిని (41) ఉరగేంద్రుని వణములనుండి కల్గిన మహాముకుటముతో అలంకరింపబడిన వానిని శీతాంశు ఖండములతో వెలిగే కోటీర అంగద భూషణముల వానిని (42) వికసించిన ఫాలనేత్రం కలవానిని, అట్లాగే సూర్యచంద్రులు నేత్రములు గలవానిని, నీలకంఠుని నాల్గు చేతులవానిని, ఏనుగ చర్మ ధారిని (వస్త్రుని) (43) రత్న సింహాసన మందు కూర్చున్న వానిని, నాగా భరణ భూషితుని ధ్యానించి, దేవిని దివ్య వస్త్రముల దానిని, పదివేల బాల సూర్యుల కాంతి గల దానిని (44) బాల వేషను, సూక్ష్మాంగిని, బాల చంద్రుని తలలో గల దానిని, పాశ అంకుశ, వర అభితులను ధరించినదానిని,నాల్గు చేతుల దానిని (45) అనుగ్రహము నకు తగిన ముఖము కల దానిని అంబను లీలారసమందు విహరించే దానిని, కురవక, అశోక, పున్నాగ,నవ చంపకములతో వెలిగిపోతూ (46) వానిని తలలో గల దానిని, వికసించిన మల్లికలతో కూడిన ముంగురులు కలదానిని, కాంచీ కలాపముతో కూడిన జమునా భోగములో ప్రకాశించే దానిని (47) ఉదారమైన కింకిణీ శ్రేణులు గల నూపురములతో కూడిన పాదముల జంట గల దానివి, గండ మండలమందు తగిలిన రత్నకుండలములతో వెలిగే దానిని (48).  

తా ॥ దొండపండు వంటి పెదవి యొక్క ఎర్రనీ కాంతితో వెలిగే దంతముల మొగ్గలు గల దానిని, గొప్ప నైయోగ్యమైన రత్నముల కంఠా భరణము తారహారములు వానితో వెలిగే దానిని (49) నవమాణిక్యముల వంటి అందమైన కంకణములు ఆంగధ ముద్రికలు కల దానిని రక్త వస్త్రము ధరించిన దానిని, రత్నమాలలుమై పూతలు కల దానిని (50) ఉబికియున్న బలిసిన ఉరద్వంద్వములతో తిరస్కరింపబడిన తామర మొగ్గలు గల దానిని, విలాపంగా కదులుతున్న సల్లని కనుచూపుల దానిని, భక్తులపై అనుగ్రహం చూపే దానిని (51) ఇట్లా (ఇద్దరివి) హృత్పద్మమందు జగత్తునకు పితరులైన శివపార్వతులను ధ్యానించి, శివపార్వత్యాత్మకమైన మంత్రాన్ని జపించి ఆ పిదప బయటి పూజ చేయాలి (52) రెండు ప్రతిమలను ఆవాహన చేసి ఆనవాదులు కల్పించాలి. మంత్ర మెరిగినవారు ఈ మంత్రంతో శివపార్వతులకు అర్ఘ్య మివ్వాలి (53) పార్వతీనాథ నమనస్సులు నీకు త్రిలోక్యములకు వరమిచ్చేవాడ, త్ర్యంబఠ ఈశ, మహాదేవ అర్ఘ్యాన్ని స్వీకరించు. నీకు నమస్కారము (54) ఓ దేవదేవేశి! ప్రసన్నుల భయహారిణి! నీకు నమస్కారము. ఓ అంబిక! వరదే! దేవి! శివప్రియ! అర్ఘ్యమును స్వీకరించు. (55) అని మూడుసార్లు ఉచ్చరించి చక్కగా అర్ఘ్యమివ్వాలి. అక్షతలు గంధము పుష్పములు, ధూప, దీవములను చక్కగా కల్పించాలి (56) పాయ సాన్నము, ఘృతం కలిపింది నైవేద్యంగా పెట్టాలి. మూల మంత్రంలో హవిస్సును వేస్తూ నూట ఎనిమిది మార్లు హామం చేయాలి (57) పిదపప నైవేద్యాన్ని తీసివేసి ధూవ నీరాజనాదుల ఏర్పరచి తాంబూల నివేదన చేసి చక్కగా నమస్కారం చేయాలి (58) ఇక ఉపచారములతో పూజించి విప్ర దంపతులకు భోజనం పెట్టాలి (59) ఇట్లా సాయంకాల పూజ కూడా చేసి విప్రుల అనుజ్ఞ పొంది, మాట్లాడకుండా పాలతో కూడిన హవిష్యమును రాత్రి భోంచేయాలి. (60) ఇట్లా సంవత్సర కాలం వ్రతం చేయాలి, బుధుడు రెండు పక్షము లందు చేయాలి. పిదప సంవత్సరం నిండాక ప్రతోద్యాపన ఆచరించాలి (61) శతరుద్ర జపంతో కూడిన జలంతో ఆ విగ్రహాలకు స్నానం చేయించాలి. ఆగమోక్త మంత్రంతో పార్వతి శివులను పూజించి (62) వస్త్రములు, సువర్ణము, కలశము, ప్రతిమ వీటన్నిటిని సదాచారం గలిగిన మంచి ఆచార్యునకు ఇచ్చి, బ్రాహ్మణులను యథాశక్తిగా పూజించి భక్తితో భోజనం పెట్టాలి (63) వారికి దక్షిణనివ్వాలి, గోవులు బంగారము, వస్త్రములు మొదలగునవి. వారి అనునంది, ఇజన బంధువులతో కూడి భుజించాలి (64) ఇట్లా భక్తితో త్రైలోక్య ప్రసిద్ధమైన ఈ వ్రతాన్ని ఎవరు చేస్తారో, ఇరువది ఒక్క కులము వారిని ఉద్ధరించి, భోగములను ఇష్టమైన వాటిని అనుభవించి (65). 

తా ॥ ఇంద్రాది లోకపాలుర స్థానములందు ఆనందిస్తాడు యధార్థము. బ్రహ్మ లోకమందు శాశ్వతమైన విష్ణు లోకమందు ఆనందిస్తాడు (66) ఆపై శివలోకం చేరి అక్కడి తిరిగి నూరు కల్పముల పర్యంతము విస్తారంగా భోగములను అనుభవించి శివుని చేరుతాడు (67) దీనిని మహా వ్రతమని అన్నారు. నీవు కూడా శ్రద్దగా దీన్ని ఆచరించు. మనోరధము ఆత్యంత దుర్లభమైనా నెరవేరుతుంది. (68) అని మునీంద్రుడు ఆదేశించగా ఆ బాల చాలా ఆనందించి సుమనోహరమైన ఆ మాటమ అలా విశ్వాసంతో స్వీకరించింది (69) ఇక వచ్చిన ఆమె పితృ మాతృ సహోదరులు సుఖంగా కూర్చున్న భోజనం చేసిన ఆ మునిని చూచారు (70) ఆ మహాత్మునకు, వారంతా, త్వరగా వచ్చి నమస్కారం చేశారు. అనుగ్రహించండి. మాపై అనుగ్రహించండి అని పలుకుతూ ఆతనిని పూజించారు (71) ఆ సాధ్వి ఆ మునిని పూజించిందని విని, ఆమెపై అనుగ్రహంగా వ్రతం గూర్చి చెప్పారని విని చాలా ఆనందించారు. (72) వారంతా చేతులు జోడించి ఆ ముని పుంగవునితో ఇట్లన్నారు (73) మీ ఆగమన మాత్రంచేత మేమంతా ఈ వేళ ధన్యులమైనాము. మా కులమంతా పవిత్రమైంది. మా గృహం సఫలమైంది (74) ఈమె శారద అనే కన్య వైధవ్యాన్ని పొందింది. అధికమైన ధాట శక్యం కాని ఏదో కర్మయోగం వల్ల ఇట్లా ఐంది. (75) ఆ ఉమె మీ పాదాబ్జములపై శరణు వేడింది. అసహ్యమైన మనోరమైన దుఃఖసాగరం నుండి ఈమెను ఉద్ధరించండి. (76) మీరు కూడా మా గృహ సమీపమందు ఇక్కడే ఉండండి. మా  గృహమఠమందు ఈ స్నాన పూజ జపములకు తగిన చోట ఉండండి. (77) ఆ బాలకుడా మీ పాదార్చన చేస్తూ మీ నన్నిధి యందే వ్రతమాచరిస్తుంది ఓ మహామునీ! (78) సమాప్తి చెందాక, మీ సమీప మందు వ్రతం అయ్యాక మీరు ఇక్కడే ఉండి మమ్మల్ని కృతార్ధులను చేయండి , ఓ గురు! (79) ఇట్లా అందరు ప్రార్థించగా ఆమె భ్రాతలు మొదలగు వారు ప్రార్థించగా అట్లాగే అవి అమువి శ్రేషుడు ఆటభమైవ మతంలో ఉన్నాడు (80) ఆమె కూడా అతడు చెప్పిన మార్గంలో పార్వతి శివులను పూజిస్తూ విమలంగా ఉంటు చక్కగా వ్రతం ఆచరించింది. (81) అని శ్రీ స్కాంద మహా పురాణ మందు ఏకాశీతి సహస్ర సమ్హిత యందు మూడవ దైన భ్రహ్మోత్తర ఖండమందు ఉమా మహేశ్వర వ్రతాచరణ మనునది పదునెనిమిదవ అధ్యాయము.