స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని బ్రహ్మోత్తర ఖండము

8 అధ్యాయము

తా సూతుని వచనము - ఎల్లప్పుడు ఆనందమయ మైనది, శాంత మైనది, నిర్వికల్ప మైనది, నిరామయ మైనది, అవాద్య మైన శివ తత్వమును తెలుసుకున్న వారు వరమును పొందుతారు (1) కామ భోగముల నుండి వీరక్తులై ఆ కారణమైన శక్తిని పరమైన దానిని శివుని యందు చేసిన వారికి ముక్తి తప్ప సంసారము లేదు. వారు ధీరులు (2) విషయం తెలియకుండా (భోగములందు ఆసక్తి లేక) శివుని యందు ఎవరు ప్రేమను చూపుతారో వారు విషయములతో తిరస్కరింపబడరు, ఆ ఫలాలను అనుభవిస్తున్నా కూడా (3) ఏదో విధముగా ఏ భావనతో నైనా శివభక్తి కలిగిన నరుడు, కాలంతో పాటు మరణించడు, అతడు ఉత్తమ గతికి చేరుతాడు (4) విషయములందు లగ్నమైన మనస్సు కలవాడైనా ఉత్తమ స్థానాన్ని పొందదలిస్తే తన కర్మలతో శివుని పూజించాలి. భోగముల చివర శివుని పొందుతాడు (5) విషయ వాదనలను వదలుటకు అశక్తులైన వారికి ఎవరికైన వారికి కర్మమయమైన కామధేనువు వంటిది (6) సంసారం మాయా మయమైనా వదలి చిరమైన సుఖాన్ని దేహాంతమందు ముక్తిని ఎవరు కోరుకుంటారో వారికి ఇది ధర్మంగా చెప్పబడింది. (7) స్వర్గ అపసర్గములకు ఎప్పుడూ ఈ లోకంలో శివపూజ కారణము. సోమవారము, ప్రదోష కాలమందు విశేష కాలముందు ఉత్తమము. (8) ఒక్క సోమవారము నాడే శివార్చనను ఎవరు చేస్తారో వారికి ఈ లోకంలో కాని పైలోకంలో కానీ దుర్లభమైనది ఏదీ లేదు (9) సోమవారం నాడు ఉపవసించి, శుచియై జితేంద్రియుడై శివుని వైదికమైన లేదా లౌకికమైన విధానములతో శివుని పూజించాలి విధి ప్రకారంగా (10) బ్రహ్మచారి గృహస్తుడు, కన్యక, ముత్తైదువ, విధవ ఎవరైనా శివుని పూజించి ఈప్సిత వరాన్ని పొందుతారు (11) ఇక్కడ నేనో కథ చెబుతాను విన సొంపైనది. వింటే ముక్తిని పొందుతారు. శివభక్తి కలుతుంది (12) ఆర్యావర్త మందు ఒకరాజు ఉండేవాడు ధర్మవంతులలో  శ్రేష్ఠుడు. చిత్రవర్మ అని అతని పేరు. దురాత్ములకు ఆతడు యముడు (13) ధర్మసేతువును రక్షించేవాడు చెడు మార్గంలో వెళ్ళే వారిని శాసించేవాడు. సమస్త యజ్ఞములను చేసినవాడు. శరణు కోరిన వారిని రక్షించేవాడు (14) సకల పుణ్యములను ఆచరించిన వాడు. అన్ని సంపదలను ఇచ్చినవాడు. శత్రు సమూహమును జయించినవాడు శివముకుందులకు భక్తుడు (15) ఆతడు అనుకూలురైన భార్య లందు శక్తి వంతులైన పుత్రులను పొంది చాలా కాలమునకు తాను కోరుతున్నట్లుగా సుందరమైన ముఖంగల ఒక కన్యను పొందాడు (16) అతడు అదృష్టవశాత్తు హిమవంతుడు పార్వతిని పొందినట్లు ఒక కూతురును పొంది తనను దేవన దృశునిగా, తన కోరికలు నెరవేరినట్లుగా భావించాడు (17).  

తా ॥ ఆతడొక సారి జాతక లక్షణములు తెలిసిన సాధువులను బ్రాహ్మణ ముఖ్యులను పిలిచి, కుతూహలంతో నిండిన మనస్సు గలవాడై కన్య పుట్టిన ఫలమును చెప్ప మన్నాడు (18) అందులో, చాలా విషయాలు తెలిసిన ఒక బ్రాహ్మణుడు ఇట్లా చెప్పాడు. ఓ రాజ! ఈ సీమంతిని అను పేరుగల కన్య (19) పార్వతి వలే మాంగల్యము కలది, దమయంతి వలె రూపవంతురాలు. భారతి వలె కళలో ఆరితేరినది. లక్ష్మి వలే మహాగుణములు కలది. (20) దేవతల తల్లి వలే మంచి సంతతి గలది. జానకి వలే నియమ పాలన కలది. సూర్యకాంతి వలే మంచి కాంతిగలది, చంద్రిక వలే మనోహరమైనది (21) పదివేల సంవత్సరాలు భర్తతో కలిసి ఆనందిస్తుంది. ఎనిమిదిమంది తనయులను ప్రసవించి చాలా సుఖపడుతుంది. (22) అని పలికిన బ్రాహ్మణుని రాజు ధనముతో పూజించాడు. ఆతని వాగ మృతాన్ని విని రాజు చాలా ఆనందపడ్డాడు (23) ఇక మరో బ్రాహ్మణుడు కాంతివంతుడు ధైర్యవంతుడు ఇట్లన్నాడు. ఈమె పదునాల్గవ నంవత్సరములో వైధవ్యాన్ని పొందుతుంది. (24) అనే ఆతని మాటలను వజ్రము వలె కఠినమైన వానిని విని, క్షణం సేపు రాజు చింతా వ్యాకుల మానసు డైనాడు. (25) పిదప బ్రాహ్మణుల యందు దయగల ఆ రాజు అందరిని పంపించి, ఇదంతా దైవలీల అని భావించి, ఆ రాజు నిశ్చింతుడైనాడు (26) ఆ బాల సీమంతిని క్రమంగా శైశవాన్ని విడిచింది. తన చెలి కత్తెల ద్వారా తనకు భవిష్యత్తులో వైధవ్యము రానున్నదని తెలుసుకున్నది (27) ఆ బాలిక చాలా నిర్వేదాన్ని పొంది చింతించ సాగింది. యాజ్ఞవ ల్క్యముని భార్యయైన మైత్రేయిని ఇట్లా అడిగింది. (28) ఓ తల్లి భయంతో నేను నీ పాదములను ఆశ్రయించాను. సౌభాగ్యాన్ని పెంపొందించే పనిని నాకు చెప్పండి. (29) అని ఆశ్రయించిన రాజ కూతురుతో ముని పత్ని ఇట్ల అంది. ఓ తన్వంగి శివునితో కూడిన పార్వతిని శరణు వేడు (30) సోమవారము నాడు శివుని గౌరిని చక్కగా పూజించు. స్నానం చేసి ఉపవసించి, స్వచ్చమైన (విరజ) వస్త్రములు ధరించి (31) మాటలను అదుపులో ఉంచుకొని, నిశ్చలమైన మనస్సుతో తగిన విధంగా పూజ చేసి, పిదవ బ్రాహ్మణులకు భోజనం పెట్టి శివుణ్ణి చక్కగా అనుగ్రహ పరచుకో (32) అభిషేకంలో పాపక్షయము, పీఠ పూజనంవల్ల సామ్రాజ్యము, గంధమాల్య అక్షతల అర్పణం వల్ల అఖిల సౌభాగ్యములు సౌఖ్యము (33) ధూప దానముతో సౌగంధ్యము, దీప దానమువల్ల కాంతి, నైవేద్యము వల్ల మహాభోగము తాంబూల దానమువల్ల లక్ష్మి (34) నమస్కారం వల్ల ధర్మార్థ కామ మోక్షములు, జపం వల్ల అష్ట ఐశ్వర్యాది సిద్ధి (35) హోమంవల్ల సర్వకామ సమృద్ధి కలుగుతాయి. బ్రాహ్మణ భోజనం వల్ల దేవతలందరికి ఆనందం కలుగుతుంది (36). 

తా ॥ ఈ విధముగా సోమవారము నాడు శివుని పూజించి పార్వతిని గూడా పూజించి, గొప్ప ఆపద నైనా పొందితే దాని బాధ నుండి దాని నుండి తప్పి పోతావు (37) భయానకమైన ఘోరాతి ఘోరమైన మహా క్లేశమును పొందినా, శివపూజ ప్రభావంతో గొప్ప భయాన్ని తరించగలవు (38) ఈవిధంగా సీమంతిని చక్కగా బోధించి తిరిగి ఆ సతి వెళ్ళింది. ఆపరారోహ రాజపుత్రి అట్లాగే చేసింది (39) దమయంతి యందు నలునికి ఇంద్ర సేనుడని కొడుకు పుట్టాడు. వానికి చంద్రసన్నిభుడైన చంద్రాంగదుడని పేరు గల కొడుకు పుట్టాడు (40) చిత్రవర్మ రాజు ఆ రాకుమారుని పిలచి, పెద్దల అనుజ్ఞతో సీమంతిని కన్యను ఆతనికిచ్చాడు (41) ఆ వివాహ కర్మయందు అక్కడ పెద్ద ఉత్సవం జరిగింది. అక్కడ రాజులందరు గుమిగూడారు. (42) ఆమె వివాహాన్ని సకాలంలో చేసుకొని చంద్రాంగదుడు కృతార్దుడైనాడు. కొన్ని మాసములు అక్కడే మామ గారింట్లో ఉన్నాడు (43) బలవంతుడైన ఆ రాకుమారుడు ఒకసారి యుమునా నదిని దాటడానికి, కొందరు స్నేహితులతో గూడి విలాసం కొరకు ఒక పడవ నెక్కాడు (44) అతడు కాళింది నదిని దాటుతుండగా విధి వశం వల్ల సుడులతో కొట్టబడి పడవలో జాలరులతో సహ ఆ రాజపుత్రుడు మరణించాడు (45) ఆ నదీ తీరంలో హాహా కారాలు చెలరేగాయి. చూస్తున్న సైనికుల అరుపులు దేవలోకాన్ని స్పృశించాయి (46) కొందరు మునిగి చచ్చారు. కొందరు మొసళ్ళకు బలియైపోయారు. కొందరు రాజవుఁతాదులు మహాజలంలో కన్పించకుండా పోయారు (47) దానిని విని రాజు చిత్రవర్మ అతి విహ్వలుడై యమునా నది తీరానికి వచ్చి నిర్విచేష్టుడైనాడు (48) దీనిని విని రాజపత్నులు కూడా చైతన్య హీనులైనారు. దానిని సీమంతిని విని భూమిపై మూర్ఛతో పడిపోయింది (49) అట్లాగే ఇతర మంత్రి ముఖ్యులు పురోహితులు నాయకులు విహ్వలులై శోక సంతప్తులై వెంట్రుకలు విరబోసికొని ఏడ్చారు (50) ఆ ఇంద్రసేన రాజు పుత్రుని వార్త విని చాలా దుఃఖితుడై విని భార్యలతో కూడి చైతన్యం కోల్పోయి పడిపోయాడు (51) ఆతని మంత్రులు అతని పౌరులు ఆ దేశ వాసులు, బాలులు వృద్ధులు వనితలు అంతా శోకవిహ్వలులై ఏడ్చారు (52) శోకంతో కొందరు రొమ్ములు బాదుకున్నారు. కొందరు తలలు బాదుకున్నారు. హా రాజపుత్ర, ఓ తండ్రి ఎక్కడున్నావు, ఎక్కడున్నావు అంటూ తిరిగారు (53) ఈవిధముగా శోకాకులమై దీనమై ఇంద్రసేన మహీపతి నగరము త్వరగా క్షోభనందింది. చిత్రవర్మ నగరం కూడా అట్లాగే అంది (54). 

తా ॥ వృద్ధులతో ఓదార్చ బడిన చిత్రవర్మ రాజు మెల్లగా నగరానికి వచ్చి తన కూతురును ఓదార్చాడు (55) ఆ రాజు నీళ్ళలో మునిగిన అల్లునకు ఆతని బంధువులతో, అక్కడికి వచ్చిన వారితో ఔర్ధ్వదైహిక  క్రియలు పూర్తిగా చేయించాడు. (56) ఆ సీమంతిని సాధ్వి భర్త నేమతిలో కలది ఆ సతి తండ్రి వద్దన్నా స్నేహంగా వైధవ్యాన్ని పొందింది (57) మునిపత్ని ఉపదేశించిన శుభమైన సోమవార వ్రతాన్ని ఆ శుభాచార విడిచి పెట్టలేదు, వైధ్యవ్యాన్ని పొందినప్పటికీ (58) ఈ విధంగా పదునాల్గవ ఏట చాలా దారుణమైన దుఃఖాన్ని పొంది శివుని పాదాలను ధ్యానిస్తూ మూడు సంవత్సరాలు గడిపింది. (59) పుత్ర శోకంతో ఉన్మక్తుడైన ఇంద్ర సేన మహీపతిని ఎదిరించి అతని పాలివారు పరాక్రమంతో రాజ్యాన్ని ఆక్రమించారు. (60) శూరులైన పాలి వారితో రాజ్యాన్ని కోల్పోయి సంతానం లేని ఆ రాజు బంధింపబడి భార్యతో గూడి కారాగారంలో ఉంచబడ్డాడు. (81) చంద్రాంగదుడు కూడా, ఆతని పుత్రుడు యమునా జలంలో మునిగాడు. క్రింది క్రిందికి మునుగుతూ ఈతడు, ఉరగ స్త్రీలను చూచాడు (62) జలక్రీడలందు నర్తు లైన వారు రాజకుమారుని చూచి ఆశ్చర్యపడి ఆతనిని వన్నగాలయ మైన పాతాళమునకు, క్రిందికి తీసుకెళ్ళారు (63) వేగంగా తీసుకుపో బడుతూ ఆ సర్ప స్త్రీలతో ఆ రాకుమారుడు, పరమాద్భుతమైన రమ్యమైన తక్షకుని పురంలో ప్రవేశించాడు (64) ఆ రాజ తనయుడు మహేంద్ర భవనంతో సమాసమైన దానిని చూచాడు. మహా రత్నములతో వెలిగేది, వెలుగులతో వెలిగిపోతున్నది (65) వజ్ర వైడూర్య ఇంద్రనీలాది మణుల మేడలతో నూరులతో నిండినది. మాణిక్యములతో చేసిన గోపుర ద్వారములు కలది, ముత్యాల తోరణాలతో ఉజ్జ్వలమైంది (68) చంద్ర కాంత స్థలముతో రమ్యమైన దానిని, బంగారు ద్వారములు తలుపులు కలది, అనేకము లైన నూర్ల వేల మణిదీపములతో వెలిగేది (67) ఆ భవనం ఆ సభా భవనం మధ్యలో రత్న సింహాసన మందు కూర్చున్న తనని చూచాడు. పన్నగముల కధీశుడు అనేక నూర్ల పడగలతో వెలిగిపోతున్న తక్షకుని (68) దివ్యాం బరధరుని, వెలిగిపోతున్న వాణ్ణి, రత్నకుండలములతో ప్రకాశిస్తున్న వాణ్ణి, రకరకాల రత్నాలు కలిగిన కిరీటము కాంతితో వెలిగేవాణ్ణి (69) వణులలోని మణులతో వాని కాంతితో కూడిన లెక్కలేనంత మంది పన్నగోత్తములు కలవానిని చేతులు జోడించి ఉన్నవారు కలవానిని, చిత్ర రత్నములతో అలంకరింపబడిన వానిని (70) రూపము యావనము మాధుర్యము విలాపమైన గతులతో శోభించే, వేలమంది నాగకన్యలతో చుట్టూ చుట్టబడి ఉన్న వానిని (71) దివ్య ఆభరణములు వెలిగే అవయవములు, కలవానిని దివ్య చందనముతో పూయబడిన వానిని కాలాగ్నివలె భరింపరాని తేజస్సుతో ఆదిత్యుని వలె వెలుగొందేవానిని (72) చూచాడు. 

తా ॥ చూచి రాకుమారుడు ధీరడు సభా స్థలమందు నమస్కరించి లేచి చేతులు జోడించి ఆతని తేజస్సుతో కళ్ళు మూసుకు పోగా (73) నాగరాజు కూడా ఆ రాజపుత్రుని చూచి, ఈతడెవరు, ఇక్కడికెందు కొచ్చాడు అని ఆ నాగ కన్యలను అడిగాడు. (74) వారిట్ల చెప్పారు. మేము ఈతనిని యమునా నది నీళ్ళలో అనుకోకుండా చూచాము. ఈతని కులము ,పేరు మాకు తెలియదు. మీ దరికి తెచ్చాము (75) అప్పుడు మహాత్ముడైన తక్షకుడు రాజ పుత్రు నడిగాడు, ఎవరి కుమారునివి, నీవెవరు, నీదేశమేది, ఎట్ల ఇక్కడికి వచ్చావు (76) అనగా రాజపుత్రుడు ఈ మాటలను విని తక్షకునితో ఇట్లన్నాడు (77) రాజపుత్రుని వచనము – భూమండల మందు నిషధ అని ఒక దేశము ఉంది. దానికి నలుడను పేరుగల కీర్తి గల అధివుడు రాజైనాడు. ఆ రాజు పుణ్యకీర్తి దమయంతికి భర్త శుభుడు (78) అతనికి ఇంద్ర సేనుడు అను పేరు గల పుత్రుడు, మహాబలుడు ఆతని పుత్రుణ్ణి నా పేరు చంద్రాంగదుడు. కొత్తగా పెళ్ళైశ్వశురాలయ మందు ఉన్నాను. యమువాతో యమందు తిరుగుతూ దైవ ప్రేరణ వల్ల (79) ఈ నాగకన్యలతో మీ దగ్గరకు తీసుకురాబడ్డాను. జన్మాంతరములలో సంపాదించిన పుణ్యముల వల్ల మీ పాదములను నేను చూచి (80) ధన్యుడైనాను. నా తల్లిదండ్రులు కృతార్ధు లైనారు. మీరు దయతో నన్ను చూచారు. నాతో మాట్లాడారు (81) అని సూతులిట్లన్నారు - ఉదారమైన తడబాటు లేని మృదువైన మాటలను విని తక్షకుడు తిరిగి ఔత్సుక్యం తో రాకుమారునితో ఇట్లా మాట్లాడాడు (82) తక్షకుని వచనము - ఓ నరేంద్రుని వారసుడ భయపడకు ధైర్యాన్ని వహించు. మీరు దేవులందరిలో ఏ దేవుని ఎల్లప్పుడు పూజిస్తారు. (83) రాజ పుత్రుని వచనము - ఏ దేవుడు అందరు దేవులలో మహాదేవుడవి పిలువబడు తున్నోడో ఆ విశ్వాత్మునే శివునే ఉమాపతినే మేము పూజిస్తాము (84) ఆతని తేజస్సు అంశలేశంతో ధూళిలో ప్రజాపతి రూపం కల్పించి విశ్వాన్ని సృజించాడు. ఆ మహేశ్వరుడే మాకు పూజ్యుడు (85) ఆతని అంశతో దివ్యమైన సాత్వికతను పొంది సనాతనమైన విష్ణువున్నాడు. ఆతడు ఈ విశ్వాన్ని భరిస్తున్నాడు. భూతాత్ముడైన శివుని మేము పూజిస్తాము (86) ఎవని అంశతో తమస్సుతో కాలాగ్ని సన్నిభుడైన రుద్రుడు పుట్టాడు. అంతమందు ఈ విశ్వాన్ని అతడు హరిస్తాడు. ఆతడు ఈశ్వరుడు మాకు పూజ్యుడు (87) ఎవడు విధాతకు విధాతో, కారణమునకు కారణమో, తేజస్సులకు తేజస్సో, ఆ శివుడే మాకు ఉత్తమ గతి. (88) ఎవడు దగ్గరుండి దూరమైననాడో, పాపాత్ములకు, నశించని స్థానము కలవాడెవడో ఆ శివుడు మాకు పరమగతి (89) అగ్ని యందు, భూమి యందు, వాయుజలము లందు, ఆకాశ మందు ఎవడు ఉన్నాడో, ఎవడు విశ్వాత్ముడో, ఆ సదాశివుడు మాకు పూజ్యుడు (90) సర్వభూతములకు ఎవడు సాక్షీ, ఎవడు ఆత్మస్థుడో నిరంజనుడో, లోకము ఎవని ఇచ్చాధీనమో ఆ శివుని మేము పూజిస్తాము (91) 

తా ॥ ఒక్కడు, ఆద్యుడు ఐన పురాణ పురుషుని గుణముల వికృతితో భిన్న భిన్నమని చెబుతారో, కొందరు క్షేత్రజ్ఞుడని కొందరు చతుర్ధుడని, కొందరు కూటస్థుడని ఎవరి నంటారో ఆ శివుడే మాకు గతి (92) ఏ ఆలయాన్ని ముట్టుకోలేరో, ఎవడు అచింత్య తత్వం కలవాడో, ఎవని స్థానము అంతము లేనిదో, ఆ స్వరూపమును నమస్కరించు. ఆత్మ భాజులకు మనో వాక్కుల వృత్తి ఎక్కడో ఆ పరమ శివుడు మాకు పూజ్యుడు (93) అతని ప్రసాదమును పొంది సజ్జనులు ఉజ్జ్వలమైన ఇంద్ర పదవిని కూడా కోరటంలేదు. కర్మలనే బేడి కాలచక్రములు దాటి, భయం లేకుండా ఎవని దయవల్ల తిరుగుతారో ఆ శివుడే మకు గతి (94) పాప రోగములకు ఆయన స్మృతి విఘాతము, వుల్కవ జన్మ పొందిన వారికి విఘాతం కల్గించేది వాని స్మృతి. ఆతని స్వరూపమును పూర్తిగా శ్రుతులు చెప్పలేవు. అట్టి శివునకు మేము ఎల్లవ్వడు పూజ చేస్తాము. (95) ఆతని తల పై ఆకాశ గంగ స్థానం పొందింది. అతని శరీరంలో స్థానం పొందినది భగవతి జగదంబిక. ఆతనికి తక్షక వాసులు కుండలములు. అట్టి అర్థ శశాంకమౌలి మాకు గతి (96) వేద శిఖరాగ్రములందు ఎవని పాద పద్మములున్నాయో యోగుల హృదయమందు ఎవని మూర్తి ఎప్పుడూ ఉందో, ఎవని రూపం సకల తత్వములను భావింప చేస్తుందో, అట్టి గుణ సర్గమును జయించిన ఈశుని మేము పూజిస్తున్నాము (97) సూతులిట్లన్నారు. అతని మాటలను తక్షకుడు విని ప్రతి మానసుడై మహాదేవుని యందు భక్తి గల్గిన వాడై రాజపుత్రునితో ఇట్లన్నాడు (98) తక్షకుని వచనము - నేను సంతసించాను. ఓ రాజేంద్ర నందన! నీకు మేలు కలుగని. బాలుడవైనా పరతత్వమైన, పరాత్పరుడైన శివుని తెలుసుకున్నావు (99) ఇది రత్నమయలోకం వీరు అందమైన చూపులు గల అబలలు వీరంతా కల్పద్రుమాలు, బావులు అమృతరసం నీరుగా గలవి. (100) ఇక్కడ ఘోరమైన మృత్యుభయము, జరారోగ పీడలేవు. యధేష్టంగా తిరుగు. యధోచితమైన భోగములను అనుభవించు (101) అని నాగరాజు చెప్పగా ఆ రాకుమారుడు, చేతులు జోడించి, ఉదారమైన బుద్ధికలవాడై చాలా ప్రీతితో ఇట్లా పలికాడు (102) నేను సకాలంలో వివాహం చేసుకున్నవాణ్ణి. నా భార్య సువ్రత. రోజు శివపూజ చేస్తుంది. ఆమె తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు (103) వారు నేనీ వేళ చనిపోయారని తలచి చాలా దుఃఖిస్తూన్నారు. ఒకవేళ ప్రాణాలు విడిచారో కాక అదృష్టవశాత్తు ప్రాణాలతో ఉన్నారో (104) అందువల్ల చాలా రోజులు నేనిక్కడ ఉండరాదు. దయతో నన్ను ఆ లోకానికి పంపించండి. (105) అని పలికే నరదేవ పుత్రుని సురపాదవం నుండి వచ్చిన, దివ్యమైన శేష్ఠమైన అన్నములతో, శ్రేష్ఠమైన గంధ వస్త్రములను మాలలు, రత్నములు విచిత్రమైన దివ్యాభరణములు ఇవ్వటం ద్వారాను సంతోషపరచి (108) వివిధ భోగములతో ఆనంద పరచి భుజగముల అధిరాజ తిరిగి ఇట్లన్నాడు. ఎప్పుడెప్పుడు నీవు స్మరిస్తావో అప్పుడప్పుడు నేను నీ ఎదుట కనిపిస్తాను  (107). 

తా ॥ తిరిగి తక్షకుడు రాజ పుత్రునకు స్వేచ్ఛగా వెళ్ళగలిగే గుఱ్ఱాన్ని నానా ద్వీప సముద్రము లందు లోకము లందు ఎదురులేని దానిని ఇచ్చాడు (108)రత్నాభరణములు, దివ్యాభరణములు, వస్త్రములు ఇచ్చాడు వాహనము కొరకు ఒక రాక్షసుని ఆ పన్నగేశ్వరుడు ఇచ్చాడు (109) ఆతనికి సహాయం కొరకు ఒక పన్నగేంద్ర కుమారకుని ఏర్పరచి, తక్షకుడు సంతోషంతో వెళ్ళుము, అని అతనిని విడిచి పెట్టాడు (110) అని చంద్రాంగదుడు రకరకాలైన ధనమును పదిల పరచుకొని, కామ గమనం గల గుఱ్ఱాన్నెక్కి వారితో కలిసి బయలు దేరాడు (111) క్షణకాలంలో ఆ సరిత్ జలము నుండి పైకి వచ్చి దివ్యమైన గుఱ్ఱాన్ని ఎక్కి రమ్యమైన అ సరిత్ తటమందు విహరించాడు (112) ఆ సమయమందు ఆ స్త్రీ సతి, సీమంతిని, చెలికత్తెలతో కూడి అక్కడికి స్నానం చేయటానికి వచ్చింది (113) ఆమె నదీ తీరంలో విహరించే రాకుమారుని చూచింది. అతని వెంట నరరూపుడైన రాక్షసుడు, నాగపుత్రుడు ఉన్నాడు (114) దివ్యరత్నములతో కూడినవాడు, దివ్యమాలలు శిరస్సు యందు గలవాడు. శరీరమందలి దివ్యమైన వాసన పది యెజనముల వరకు వ్యాపిస్తోంది. (115) అ పూర్వా కృతిని చూచి, దివ్యమైన గుఱ్ఱము పై కూర్చున్న వానిని చూచి, జడమైనదై, పిచ్చి దానివలే భయపడ్డ దానివలే, ఆతనినే చూస్తూ నిలిచిపోయింది (116) ఆమెను ఆ రాజేంద్రపుత్రుడు ఎక్కడో చూచానని స్మరిస్తూ ఉన్నాడు. ఆమెకు మెడలో ఆభరణము లేదు. కంఠ సూత్రము లేదు (పు స్త్రీ) (117) వెంట్రుకలు ముడి వేసుకోలేదు. శరీరమునకు ఏ సువాసన పూతలు లేవు. కళ్ళకు కాటుక లేదు. శరీరమంతా కృశించి ఉంది. శోకంతో దూషితమైంది (118) ఆమెను చూచి గుఱ్ఱము పై నుండి దిగినది తీరమందు కూర్చున్నాడు. ఆవరారోహను పిలిచి కూర్చో పెట్టి ఇట్లా అన్నాడు (119) నీవెవరు, ఎవని భార్యవు, ఎవరి కూతురు ఓ సతీ! ఓ అంగన! బాల్యంలోనే దుఃసహమైన ఈ శోక లక్షణమేమిటి (120) అని స్నేహంతో అతడడుగగా ఆమె ఏడుస్తూ, స్వయంగా చెప్పటానికి సిగ్గుపడింది. ఆమె చెలికత్తె అంతా చెప్పింది (121) ఈమె సీమంతిని అని పేరుగలది. నిషధ భూపతికి కోడలు. చంద్రాంగదుని భార్య. చిత్రవర్మ కూతురు (122) ఈమె భర్త దురదృష్టవశాత్తు ఈ మహాజలమందు మునిగిపోయాడు. అందువల్ల ఈమె వైధవ్యాన్ని పొంది బాల దుఃఖంతో చిక్కిపోయింది (123) ఇట్లా మూడు సంవత్సరాలు గడిచాయి. అతి బలీయమైన శోకంతో గడిచాయి. ఇవ్వాళ సోమవారం నాడు స్నానం చేయటానికి ఇక్కడికి వచ్చింది (124). 

తా ॥ ఈమె మామ గారు రాజేంద్రుడు ఆతని రాజ్యాన్ని శత్రువులు హరించారు. బలవంతంగా గ్రహించారు. ఆతనిని బంధించారు. భార్యతో పాటు వారి అధీనంలో ఉన్నాడు (125) ఐనా ఈ శుభాచార! సోమవారం నాడు మహేశ్వరుని, పార్వతితో కూడిన వానిని నిర్మలమైన ఆశయం కలదై మిక్కిలి భక్తితో పూజిస్తోంది (126) సూతుడిట్లన్నాడు - ఈ విధముగా సఖుల ద్వారానే అంతా తెలియజేసి, అసువ్రత! సీమంతిని పిదప స్వయంగా రాకుమారునితో ఇట్లా అంది (127) నీవెవరు. మన్మధుని లాగున్నావు. నీ పక్కనున్న వీరెవరు. నీవు దేవుడివా, నరేంద్రుడివా సిద్ధుడివా గంధర్వుడివా కాక కిన్నరుడివా (128) స్నేహం కలవాని వలె నా వృత్తాంతాన్ని ఎందుకడుగుతున్నావు. ఓ మహాబాహ! నన్నెరుగుదువా నీవు. ఎక్కడైనా నన్ను చూచావా (129) నీవు కూడా స్వజనంవలె ఉన్నావు. ఇంతకు ముందు నిన్ను చూచినట్లు అనిపిస్తోంది నాకు, నిజంగా అంతా చెప్పండి. సాధువులు సత్యమే సారంగా గలవారు (130) సూతులిట్లన్నారు - ఈ మాత్రం పలికి రాకుమారి! కన్నీరు కంఠంలో నిండగా చాలా సేపు ఏడ్చింది. మోహాన్ని పొందింది. భూమిపై పడింది. సఖులు చుట్టుముట్టి ఉన్నారు. ఏమి చెప్పలేకుండా ఉంది (131) చంద్రాంగదుడిదంతా విని ప్రియురాలి శోక కారణాన్ని తెలుసుకొని స్వయంగా శోక సమతులుడై క్షణం ఊరికే ఉండిపోయాడు. (132) ఆ పిదప, రకరకాలైన నిపుణమైన వాక్యములతో తన ప్రియమైన స్త్రీ ని ఓదార్చి, మేము సిద్దులనే దేవులము, కామ గులము అని ఆతడన్నాడు (133) పిదప బలంతో ఆకర్షింపబడి పాణి గ్రహణం ఐనట్లుగా ఆమెను అనుమానించి, పులకలతో సర్వావయవములు కలది ఐన ఆమె చెవిలో ఆతడిట్లన్నాడు (134) ఓ వరానన! నీ భర్త లోకంలో నాకెక్కడైనా కనిపిస్తే, వ్రతాచరణంతో ప్రీతుడైతే వెంటనే నీ దరికి వస్తాడు (135) నీ శోకాన్ని తీరుస్తాడు. రెండు మూడు రోజులలో తప్పదు. ఇది చెప్పటానికే వచ్చాను. నీ భర్తకు స్నేహితుణ్ణి నేను (136) ఇందులో అనుమానం లేదు. శివ పాదముల మీద ఒట్టు. అప్పటి దాకా నీ హృదయంలోనే దాచుకో. ఎక్కడా బయట పెట్ట రాదు. (137) ఆమె అతని మాటను విన్నది. సూర్ల అమృ ధారల కన్న ఎక్కువైనది. ఆశ్యర్యంతో కన్నులు చలించగా అతన్నే మాటిమాటికి చూసింది (138) ప్రేమబంధముతో కూడిన మధుర రసం కల వాక్యమును ఇట్లా అంది. విభ్రమ ఉదారములతో కూడి, మధురమైన అపాంగ వీక్షణములు కలిగి (139) తన పాణి స్పర్శతో శరీరమంతా పులకాంకురములు గల వానిని స్వరాదులలో, అంగములలో ఇది వరలో చూచిన లక్షణములు కలవానిని, వయస్సు, రంగు పరీక్షించి అతనిని ఇట్లా అనుకుంది (140) ఈతడే నా భర్త ఐయ్యుండవచ్చు. నిశ్చయము. వేరేవాడుకాదు. ఈతనియందే నా మనస్సు లగ్నమైంది. ప్రేమతో చంచలమైంది (141). 

తా ॥ పరలోకం నుండి ఇక్కడికి వచ్చాడు. ఈ రూపం ఎట్లా వచ్చింది. నశించిన భర్త యొక్క దర్శనము దురదృష్ట వంతురాలికి నాకెట్లా ఔతుంది (142) ఇది కలా, కలకాదా. ఇది భ్రమ, భ్రమ కాదా. ఈతడు ధూర్తుడా కాక ఒక యక్షుడా, గంధర్వుడేనా (143) పరమ ఆపద యందున్నా మునిపత్ని నాకేం చెప్పిందో, ఈ వ్రతాన్ని చేయి అని, దాని ఫలమేనా ఇది (144) ద్విజోత్తముడు, నీకు పదివేల సంవత్సరాలు సౌభాగ్యమని అని అన్నాడో అతని ఆమాట సత్యమా, సత్యమే. ఈశ్వరుడు తప్ప ఎవరు తెలుసుకుంటారు. (145) ప్రతి దినము మంగళకరమైన సూచనలు కన్పిస్తున్నాయి. పార్వతీ నాథుడు ప్రసన్నుడైతే ప్రాణులకు సాధ్యం కానిదేది (146) అని బాగా ఆలోచించి, అనుమానం తొలగిపోయిన ఆమెతో సిగ్గుతో తలవంచిన ఆమె చెవిలో తన ప్రయోజనాన్ని చెప్పాడు (147) ఈ వృత్తాంతము చెప్పటానికి శోకతప్తులైన ఆ తలిదండ్రుల దగ్గరకు వెళ్తాము. ఓ భద్ర! నీకు మేలు కలుగని, వెంటనే భర్తను పొందుతావు (148) అని పలికి గుఱ్ఱాన్ని  ఎక్కి రాకుమారుడు వెళ్ళిపోయాడు. వారితో కలిసి ఆ క్షణం లోనే తన రాష్ట్రాన్ని చేరుకున్నాడు (149) ఆతడు నగర ఉద్యాన ప్రాంతమందు నిలిచి ఆ ఫని పుత్రకుని రాజ సింహాసనముందు కూర్చున్న, తన పగ వారి పైకి వదిలాడు. (150) ఆతడు వెళ్ళి త్వరగా ఇంద్రసేనుని వదలి పెట్టండి. అని వారితో అన్నాడు. అతని కొడుకు చంద్రాంగదుడు పన్నగుల ఆలయం నుండి వచ్చాడు (151) రాజసింహాసనాన్ని వదలి పెట్టండి, మీరు ఆలోచించకండి. లేని వక్షంలో చంద్రాంగదుని బాణములు త్వరగా మీ ప్రాణాలను హరిస్తాయి. (152) ఆతడు యమునా నది నీటియందు మునిగి తక్షక మందిరమునకు వెళ్లి, ఆతని సహాయాన్ని పొంది తిరిగి అక్కడినుండి ఇక్కడికి వచ్చాడు (153) అని చెప్పిన ఆ వృత్తాంతాన్ని అంతావారు విని బాగుబాగు అని సంభ్రాంతులై శత్రువులు పొగిడారు. (154) ఇక ఇంద్ర సేనునకు, త్వరగా చనిపోయిన వారి కుమారిని తిరిగి రాకను తెలిపిరి. నరేశ్వరుని ఆసనం కొరకై వచ్చిన ఆతనిని చూచి పగతురు భయపడ్డారు. (155) పౌరజనులంతా పురోద్యాన మందు రాకుమారుని చూచి రాజు గారికి త్వరగా చెప్పారు. గొప్ప ధనాన్ని పొందారు. (156) కుమారుడు వచ్చిన మాటను విని రాజు ఆనంద బాష్పములు కలవాడై ఈ లోకం మరచిపోయాడు. రాణి కూడా చాలా ఆనందాన్ని పొందింది (157) నాగరికులంతా, మంత్రి వృదులు, పురోహితులు, ఎదురువచ్చి కౌగిలించు కొని ఆతనిని రాజు దరికి తీసుకువచ్చారు. (158) గొప్ప ఉత్సవంతో తన మందిరానికి ప్రవేశించి రాజపుత్రుడు, కన్నీరు కారుస్తూ నూతన తలిదండ్రులకు నమస్కరించాడు (159) పాదము లందు పడిన రాజుక్షణకాలము తెలుసుకోలేకపోయాడు. అమాత్యజనులు మేల్కొలుపగా (చెప్పగా) ఎట్లాగో లేచి క్లిన్నుడై హృదయానికి హత్తుకున్నాడు (160).  

తా ॥ వరునగా తల్లులకు నమస్కరించి వారి ఆశీర్వాదాన్ని పొంది, ప్రేమాకులులై వారు ఆతనిని కౌగిలించుకోగా ఆరాజ నూనుపు పౌరజనులందరిని గౌరవించాడు. (161) వారి మధ్యలో కూర్చొని తన వృత్తాంతాన్నంతా తన తండ్రికి నివేదించాడు. తక్షకుని మిత్రత్వాన్ని చెప్పాడు (162) భుజంగ రాజు ఇచ్చిన రత్నాది ధన సంచయమును ఆ రాక్షసుడు తెచ్చిన దివ్యమైన ధనాన్నీ అంతా తండ్రికి నివేదించాడు (163) రాజపుత్రుని చరిత్రను విని, చూచి విహ్వలుడై, మహేశుని ఆరాధన వల్ల సంపాదించిన కోడలి సౌభాగ్యముగా తలచాడు (164) సుమంగళకరమైన ఈ వార్తను నిషథ భూవతి, చిత్రవర్మ మహీపతికి చారుల ద్వారా తెలియజేశాడు. (165) అమృతమయమైన వార్తను విని, సంభ్రమముగా ఆతడు లేచి వారికి అధికంగా ధనం ఇచ్చి ఆనంద విహ్వలుడై నాట్యంచేశాడు. (166) ఇక తన కూతురును పిలిచి కౌగిలించుకొని కన్నీళ్ళు నింపుకొని, వైధవ్య లక్షణములు తొలగిన విధంగా భూషణములతో అలంకరించాడు (167) రాష్ట్ర గ్రామపురాదు లందు గొప్ప ఉత్సవం జరిగింది. జనులు అంతటా సీమంతిని యొక్క మంచి నడవడికను ప్రశంసించారు. (168) చిత్రవర్మ నృపతి ఇంద్ర సేనాపతి ఇంద్రసేనజుని పిలిపించి తిరిగి వివాహ విధితో కూతురును ఆతని కర్పించాడు (169) చంద్రాంగదుడు కూడా తక్షకుని ఇంటి నుండి తెచ్చిన రత్నాదులలో, మర్త్యులకు అతి దుర్లభమైన వాటితో తన భార్యను అలంకరించాడు. (170) కాచిన బంగారంలా వెలిగే మైపూతతో దివ్యమైన దానితో అలంకరించాడు. (171) పద్మమందలి కింజల్కముల వర్ణముకల  ఎప్పుడూ వాడని మాలతో, కల్పద్రుమం నుండి వచ్చిన దానితో ఆమె అలంకరించబడి ఆ సతి వెలిగి పోయింది. (172) ఈ విధముగా చంద్రాంగదుడు భార్యను పొంది శుభ సమయమందు మామగారితో అనుమతించబడి తిరిగి తన నగరానికి వెళ్ళాడు (173) రాజేంద్రుడు ఇంద్రసేనుడు కూడా తన కుమారుని రాజ్యమందుంచి, తవస్పుతో శివుని పూజించి సంయముల స్థానాన్ని పొందాడు (174) పదివేల ఏండ్లు తన భార్య సీమంతినితో కూడి చంద్రగదుడు రాజు అనేక సుఖములను అనుభవించాడు (175) ఎనిమిది మంది కుమారులను అందమైన ముఖ సౌందర్యము గల ఒక కూతురును పొందాడు. శివుని పూజిస్తూ ఆ సీమంతిని భర్తతో సుఖించింది. ఇందు వానరం వల్ల ప్రతిరోజు సౌభాగ్యాన్ని పొందింది. (176) సూతుని వచనము - విచిత్రమైన ఈ కథను నేను మీకు చెప్పాను. సోమవార వ్రతం వల్ల కలిగే మహాత్మ్యాన్ని తిరిగి చెప్తాను. (177) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు బ్రహ్మోత్తర ఖండ మందు సోమవార వ్రత వర్ణన మనునది ఎనిమిదవ అధ్యాయము.