స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని బ్రహ్మోత్తర ఖండము
1 అధ్యాయము
తా ॥ జ్యోతిర్మాత్రస్వరూపుడు, నిర్మలజ్ఞానమే చక్షువుగాగలవాడు, శాంతుడు, లింగమూర్తి, బ్రహ్మఐన శివునకు నమస్కారము. (1) ఋషులిట్లన్నారు. సూత! మీరు ఉత్తమమైన విష్ణు మాహాత్మ్యాన్ని చెప్పారు. సమస్త పాపముల హరించేది, పుణ్యప్రదమైనది. మేము సంక్షిప్తంగా విన్నాము (2) ఇప్పుడు త్రిపురద్వేషియైన వాని మాహాత్మ్యమును వినదలిచాము. ఆతని భక్తుల యొక్క మాహాత్మ్యము గూడా సమస్త పాపమునశింపచేసేది వరమైనది. (3) వారి మంత్రముల మాహాత్మ్యాన్ని ఓ ద్విజ సత్తమ! ఆతని కథల ప్రభావము, ఆతని యెడ భక్తికల్గిన దానిప్రభావము వర్ణించండి. అనగా (4) సూతులిట్లన్నారు - ఇదే నరులకు సనాతనమైన ఉత్తమశ్రేయస్సు. ఈశ్వరుని కధలయందు నిర్హేతుకభక్తి కలగటమే శ్రేయస్సు. (5) అందువల్ల ఆతని భక్తిలేశ మాహాత్మ్యాన్ని నేను వర్ణిస్తున్నాను. కల్పకాలమంత ఆయుస్సు ఉన్నా విస్తారంగా చెప్పటం సాధ్యంకాదు. (6) పుణ్యము లన్నింటికి శ్రేయస్సులన్నింటికి, యజ్ఞములన్నిటికి జపయజ్ఞము ఉత్తమము (7) అందులో మొదట జపయజ్ఞఫలము. గొప్ప శుభాన్నిచ్చేది. మహర్షులు శివసంబంధమైనది షడక్షరములుకలది దివ్యమైన మంత్రమని అన్నారు (8) త్రిపురాంతుడు దేవతలకు వరమమైన దేవుడు అట్లాగే శైవషడక్షరమంత్రము మంత్రములలో పరమ మంత్రము. (9) ఈ పంచాక్షరమంత్రము జపించేవారికి ముక్తినిచ్చేది. సిద్ధిని కోరే సమస్తముని శ్రేష్ఠులు దీనిని సేవిస్తున్నారు. (10) దీని అక్షరముల మాహాత్మ్యాన్ని చెప్పుటకు బ్రహ్మ చాలడు. శ్రుతులు ఎక్కడ సిద్ధాంతంచేశాయో పరమంగా మరలినాయో (11) ఆనర్వజ్ఞుడు, పరిపూర్ణుడు నచ్చిదానంద లక్షుణుడు శివుడు శైవమైన శుభమైన పంచాక్షరమందు రమిస్తున్నాడు (12) సర్వోపనిషత్తులకు ఆత్మరూపమైన ఈ మంత్రరాజముతో మునులందరు, నిరామయమైన పరబ్రహ్మనుపొందారు (13) ఇక్కడ పరమాత్ముడైన శివునియందు నమస్కారంతో జీవత్వము ఐక్యాన్నిపొందింది అందువల్ల ఈ మంత్రము పరబ్రహ్మమయము (14) భవ పాశ నిబద్ధులైన ప్రాణులక్షేమం కొరకు ఆద్యమైన ఓంనమఃశివాయ అనుమంత్రమును శివుడు స్వయంగా చెప్పాడు (15).
తా ॥ అనేక మంత్రములతో ఏం పని తీర్థములతో కాని, తపస్పుతో కాని, ఆధ్వరములతో కాని వానికేం పని. వాడికి ఓం నమః శివాయ అనే మంత్రముహృదయుగోచర మైతే చాలు (16) దేహదారులు ఒక్కసారి ఈ మంత్రాన్ని ఉచ్చరించనంతవరకు ధారుణమైన దు:ఖ నంకులమై సంసారమందు భ్రమిస్తారు. (17) మంత్రములకు అధిరాజరాజు ఇది. సర్వవేదాంతములకు ఇది శేఖరము. సర్వజ్ఞానములకు స్థానమది. అదే షడక్షరము. (18) ఇది కైవల్యమార్గమునకు దీపము. అవిద్య అనే సముద్రానికి ఓడ. మహాపాతకములకు దావాగ్ని ఆ మంత్రమే షడక్షర మంత్రము (19) అందువల్ల ఈ మంత్రము, పంచాక్షరము, అన్నింటిని ఇచ్చేది అని. ముక్తి కోరేవారు స్త్రీలైనా శూద్రులైనా అందరూ ఈ మంత్రాన్ని ధరించవచ్చు. (20) దీనికి దీక్షగాని హోమము కాని, సంస్కారమునితర్పణముకాని అవసరంలేదు. కాలము, ఉపదేశముఅవసరంలేదు. ఈ మంత్రము సర్వదా సర్వదాశుచియే (21) మహాపాతకములనాశంకొరకు శివ అను రెండక్షరాలు చాలు. నమస్కార మాచరించినవారు ముక్తి కల్పింపబడుతారు (22) నదురువుతో ఉపదేశంపొంది పావన క్షేత్రంలో జపించినవారికి వెంటనే కోరిననిధిని ఇస్తారనటంలో ఆశ్చర్యమేముంది (23) అందువల్ల సద్గురువు నాశ్రయించి, ఈ నాయకమంత్రమును గ్రహించాలి. పుణ్యక్షేత్రములో జపిస్తే వెంటనే సిద్ధినిస్తుంది (24) గురువులు నిర్మలులు, శాంతులు, సాధువులు, మితభాషులు, కామక్రోధవినిర్ముక్తులు, సదాచారులు, జితేంద్రియులు (25) వీరు (ఇలాంటి గురువులు) దయతో ఈ మంత్రాన్ని ఇస్తే త్వరగా సిద్ధిస్తుంది. జప యోగ్యమైన క్షేత్రములగూర్చి సంక్షేమంగా చెబుతాను. (26) ప్రయాగ, పుష్కరము రమ్యమైన కేదారక్షేత్రము, సేతుబంధనము గోకర్ణము, నైమిశారణ్యము ఇవి నరులకు వెంటనే నిధినిస్తాయి. (27) ఇక్కడ పెద్దలు ప్రాచీనమైన ఇతిహాసాన్ని చెబుతారు. మాటి మాటికి గాని ఒక్కసారిగా గాని విన్నవారికి మంగళాన్ని ఇస్తుంది (28) మథురలో దాశార్హుడని యదుశ్రేష్ఠుడు ఉండేవాడు. ఆతడు బుద్ధిమంతుడు మహోత్సాహంకలవాడు, మహాబలుడు ఆరాజు. (29) శాస్త్రమెరిగినవాడు. నీతివాక్యములు చెప్పేవాడు శూరుడు, ధైర్యవంతుడు, అమీతద్యుతికలవాడు. ఎదిరించరానివాడు, గంభీరుడు, యుద్దంలో మడమతిప్పని వాడు (30) మహారథుడు మహేష్వాసుడు, నానాశాస్త్రార్థకోవిదుడు, వదాన్యుడు, రూపసంపన్నుడు యువకుడు మంచి లక్షణములుకలవాడు (31) వరాననమైన కాశిరాజు కూతురును ఆతడు వివామ మాడాడు. ఆమె పేరు కళావతి, రూప శీల గుణా న్విత మనోహరమైనది (32) వివాహమయ్యాక ఆ రాజు తన మందిరమునకు వచ్చి, శయనమందు అధివసించిన ఆమెను రాత్రియందు సంగమము కొరకు పిలిచాడు (33).
తా ॥ ఆమె తన భర్తతో పిలువబడుతూ అనేక మార్లు ప్రార్థింపబడ్డా అతని యందు ఆమె మనస్సు బంధింపబడలేదు. అతని సమీపానికి రాలేదు (34) సంగమమునకు పిలువబడినాతన భార్య ఎప్పుడు రాలేదో అప్పుడు రాజు బలవంతంగా హరించటానికి ఆమె దగ్గరకు వచ్చాడు (36) రాణి వచనము - ఓ రాజ నన్ను ముట్టకు కారణమెరిగిన దానిని వ్రతమందున్నాను. ధర్మాధర్మములెరిగినవాడవు. నాయందు సాహసం చేయొద్దు (38) ప్రియముగా భుజించేదే రుచిస్తుంది బుద్ధిమంతులకు దంపతుల ప్రీతి యోగం వల్లనే సంగమము.
