స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని బ్రహ్మోత్తర ఖండము
7 అధ్యాయము
తా ॥ సూతులిట్లనిరి - అని ముని చేప్పగా ఆ స్వాధి విప్ర వనిత మరల ఆతనికి నమస్కరించి శివ పూజా విధిక్రమాన్ని అడిగింది.(1) శాండిల్యుని వచనము - రెండు పక్షము లందు త్రయోదశి యందు నిరాహారుడు కావాలి. అస్తమయం ఉన్న మూడు గడియలు ముందు స్నానం చేయాలి (2) శుక్లవస్త్రములు ధరించి, ధీరుడై మాటను అదుపులో ఉంచుకొని నియమం కలవాడై, సంధ్యా జప విధులుచేసి శివ పూజను ఆరంభించాలి (3) దేవుని ఎదుట కొత్తనీటితో మంచిగా అలికి, గుండ్రమైన, అందమైన మండపమును తెల్లని వస్త్రములతో ఏర్పరచి బుధుడు (4) చాందిని మొదలగు వానితో అలంకరించి ఫలము పుష్పము కొత్త మొలకలు ఏర్పరచి ఐదు రంగులుకల, విచిత్ర పద్మాన్ని వ్రాసి (5) శుభమైన స్థిరాసన మందు భక్తితో అక్కడ కుర్చొని, సమస్త పూజోప కరణములను బాగా సంపాదించి శుచియై (6) ఆగమోక్తమైన మంత్రంతో బుద్ధిమంతుడు పీఠమును మంత్రించాలి. ఆత్మశుద్ధిని, భూతశుద్ధి మొదలగు వానిని క్రమంగా ఆచరించాలి (7) బీజములు బిందువులతో కలిపి మూడుసార్లు ప్రాణాయామం చేసి, వీని మాతృ కలను ఆ పరాదేవతను వీధి ప్రకారము ధ్యానించి (8) మాతృకలను సమాప్తి చేసి పరమశివుని తిరిగి ధ్యానించి, వామ భాగమందు గురువును నమస్కరించి దక్షిణ దిక్కులో గణపతిని నమస్కరించాలి (9) భుజములు, తొడ లందు ధర్మాదులను ఉంచి నాభియందు పార్శ్వము లందు అధర్మాదులను అనంతాదులను, హృదయ పీఠముందు మనువును ఉంచాలి (10) ఆధారశక్తి మొదలుకొని జ్ఞానాత్మను వరుసగా చెప్పిన ప్రకారము ఉంచి, బాగుగా భావింపబడిన హృత్పద్మముందు (11) నవశక్తి మయమైన, రమ్యమైన దానియందు దేవుడు ఉమాపతిని ధ్యానించాలి. కోటి చంద్రులతో సమానమైన త్రినేత్రుడైన చంద్రశేఖరుని (12) పింగళ వర్ణముగల జడలుగల వానిని, మౌళి యందు రత్నములతో వెలుగొందు వానిని, నీలగ్రీవుని, ఉదారమైన అంగములు కలవానిని, నాగహారములతో శోభించువానిని (13) వరద అభయ హస్తములు గల వానిని, వాగ వలయమును కేయూరములుగా అంగదములుగా ముద్రికలుగా ధరించిన వానిని (14) వ్యాఘ్ర చర్మము ధరించిన వానిని, రత్నసింహాసన ముందున్న వానిని శివుని ధ్యానించి ఆతని వామ భాగముందు గిరి కన్యకను ధ్యానించాలి (15) వెలుగుతున్న జపా ప్రసూనము వంటి కాంతి గల దానిని, స్త్రీ ని, మనోనయనము లను ఆనందింప చేసే దానిని (16) బాల ఇందువును తలలో గల దానిని, స్నిగ్ధమైన దానిని, నల్లని వంగిన తల నీలాలు గల దానిని, తుమ్మెదల గుంపు వలె అందమైన దానిని, నీల అలకలతో వెలుగు దానిని (17) మట్టి కుండలములతో వెలిగే ముఖ మండలము కల దానిని, నూతన మైన కుంకుమ వంక చిహ్నముతో ఉన్న కపోలములనే దర్పణము గలదానిని, (18) మధురమైన చిరునగవుతో వెలిగే అరుణ అధర పల్లవము గల దానిని, శంఖము వంటి కంఠము గల దానిని, మంగళకరమైన దానిని, ఎదుగుతున్న కుచములను తామర మొగ్గలు గలదానిని (19).
తా ॥ పాశము అంకుశము అభయము అభీష్ట ఫలమిచ్చే నాలుగు చేతులు గల దానిని అనేక రత్నములతో వెలిగే కంకణముతో చిహ్నత మైన ముద్రిక గల దానిని (20) వలిత్రయముతో వెలిగే బంగారు బడ్డాణముతో కూడిన దానిని, రక్త మాలలను, వస్త్రములను ధరించిన దానిని, దివ్య చందనము కలిగిన దానిని (21) దిక్పాలుర వనితల శిరస్సులతో నమస్కరింవ బడే పాద పద్మములు కల దానిని, రత్న సింహాసన మందు కూర్చున్న దానిని, సర్పరాజును కప్పుకున్న దానిని (22) ఐన దేవిని పార్వతిని, మహాదేవుని ధ్యానించి, న్యాస క్రమంగా పూజించి గంధాదులతో క్రమంగా పూజించి (23) ఐదుగురు బ్రహ్మలతో, చెప్పిన స్థానములందు కాని హృదయమందు కాని అర్చించాలి. దేహ మందు మూల మంత్రంతో విడిగా పుష్పాంజలిని హృదయ మందు మూడు విధములుగా పూజించి (24) సాధకుడు మూల మంత్రంతో తాను స్వయంగా శివుడై, పిదప మళ్ళీ క్రమంగా బ్రహ్మ పీఠమందు దేవుని పూజించాలి (25) పూజ ఆరంభ మందు చక్కగా అక్కడ సంకల్పం చెప్పాలి. చేతులు జోడించి హృదయంలో శంకరుని ధ్యానించాలి (26) ఋణము, పాతకము, దౌర్భాగ్యము వీని నివృత్తి కొరకు సమస్త పాపముల నాశనం కొరకు ఓ శంకర! నా పై దయచూవు (27) దు:ఖ శోకములనే అగ్నిలో తపించిన వాణ్ణి, సంసార భయంతో పీడింవబడిన వాణ్ణి, బహురోగములతో వ్యాకులుణ్ణైన వాణ్ణి, దీనుణ్ణి, ఓ వృషభ వాహన! నన్ను రక్షించు (28) ఓ దేవ దేవేశ! రా ఓ మహాదేవ! అభయం కూర్చేవాడా! రా పార్వతితో కూడి నేను చేసే నీ పూజను స్వీకరించు (29) అని సంకల్పించి విధి ప్రకారము బాహ్య పూజను ఆచరించాలి. సవ్యావ నవ్యములతో గురువైన గణపతిని పూజించాలి (30) క్షేత్రేశుడైన వాస్తోష్పతిని ఈ శాన్య కోణమందు పూజించాలి. క్రమంగా వాగ్దేవిని పూజించాలి. పిదప కాత్యాయనిని పూజించాలి. (31) ధర్మము జ్ఞానము వైరాగ్యము, ఐశ్వర్యము, అంతకుడు వీరిని పూజించాలి. స్వరములతో ఈశానాది కోణములందు పీఠ పాదములను వరుసగా పూజించాలి. బిందు విసర్గలతో అధర్మాదులను పూజించాలి. (32) నాల్గు దిక్కులందు సత్వ రూపముతో, మధ్యలో తారకతో కూడిన అనంతుని, సత్వాది త్రిగుణములను తంతు రూపము గల వానిని పీఠమందుంచాలి (33) పై కప్పిన దానియందు లక్ష్మితో శివునితో కూడిన మాయను (34) దాని చివర తామరను తిరిగి మొత్తం మూడు మండలములను పత్రములు కేసరములు కింజల్కములతో నిండిన దానిని తార అక్షరములతో వ్రాయాలి (35) మూడు పద్మములను అట్లా, ఆదరంతో మధ్య మండలమందు పూజించి వామను, జ్యేష్ఠను రౌద్రిని, భాగాదులను దిక్కులలో పూజించాలి (36).
తా ॥ వామాది నవ శక్తులను నవ స్వరముగల వానిని పూజించాలి. హృదయమందు బీజ త్రయోద్యముతో పీఠ మంత్రముతో పూజించాలి. (37) ఆవృత్తులతో ప్రథమాంగములతో, ఐదు మూర్తి శక్తులతో, త్రిశక్తి మూర్తులతో, ఇతరమైన రెండు నిధులతో కూడిన (38) అనంతాదులతో కూడిన మాతలతో వృషాదులతో కూడిన, అణిమాది నదులతో, ఆయుధములు గల ఇంద్రాదులతో (39) వృషభ క్షేత్ర చండేశ దుర్గలు నందనందులు, గణేశుడు, సైన్యపుడు వీరంతా తమ తమ లక్షణములతో కూడి ఉండగా (40) అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ఈశత్వ, వశిత్వ, ప్రాప్తి, ప్రాకామ్యములు (41) ఈ అష్టైశ్వర్యములు, ఇవి తేజోరూపమైనవి. ఐదుగురు బ్రహ్మలు, హృల్లేఖాదులతో కూడా క్రమంగా (42) ఉమాది లింగములతో, ఇంద్రాదులతో పూజ చేయాలి అని మునులు చెప్పారు. ఉత్తరం మొదలుగా ఉమ, చండేశ్వరాదులను పూజించాలి. (43) ఈ విధముగా ఆవరణములతో కూడిన తేజో రూపుడైన సదాశివుని, ఉమతో కూడిన దేవుని ఉపచారములతో పూజించాలి (44) చక్కగా ప్రతిష్టించిన శంఖ తీర్థముతో పంచామృతములతో, చక్కగా రుద్ర సూక్తములతో మహాదేవుని అభిషేకించి (45) వివిధ మంత్రములతో ఆసనాది ఉపచారములను కల్పించాలి. బంగారు ఆసనమును కల్పించాలి. దివ్య వస్త్రమును దానిపై ఉంచాలి (46) అష్టగుణములు కల అర్ఘ్యమును, శుద్దోదకముతో పాద్యమును దానితోనే ఆచమనమును ఇవ్వాలి. మధు ఉత్తరమైన మధు పర్కమును ఇవ్వాలి (47) తిరిగి ఆచమనం ఇవ్వాలి. మంత్రములతో స్నానం ఏర్పరచాలి. ఉపవీతము, వస్త్రము, భూషణములు ఇవ్వాలి. అష్టాంగములు గల గంధమును పవిత్రమైన దానిని నివేదించాలి (48) పిదప బిల్వ మందార కళార తామరలను, ధత్తూరము, కర్ణికారము, శఠ పుష్పము, మల్లిక (49) కుశలు, అపామార్గము, తులసి, మాధవి, చంపక మొదలగునవి, బృహతి, కరవీరములు, దొరికిన విధంగా సాధకుడు (50) వాసన గల వివిధ మాలలను నివేదించాలి. అలాగరు నుంచి పుట్టిన ధూపాన్ని విమలమైన శుభమైన దీపాన్ని (51) విషకం అర్పించాలి (బొట్టు). పిదవ పాయస నైవేద్యము, నేయి, ఊరగాయలు, మోదకములు, అపూవములు, శర్కర, గుడము (52) మధువు, దధి, జలపానము నివేదన చేయాలి. ఆహవిస్సుతోనే, మంత్రభావితమైన అగ్నిలో హోమంచేయాలి (53) ఆగమోక్షవిధితో గురువుల వాక్యములతో నియంత్రించ బడుతూ శివునకు నైవేద్యము ఇవ్వాలి. తిరిగి ఉత్తమ తాంబూల మివ్వాలి (54) ధూపము, నీరాజనము, రమ్యమైన ఛత్రము, ఉత్తమమైన దర్పణము సమర్పించాలి. శాస్త్ర ప్రకారము మంత్రములతో వైదిక తాంత్రికములతో సమర్పించాలి. (55) శక్తి చాలనిచో స్వయంగా ధనహీనుడైతే ధనానికి తగ్గట్టే పూజించాలి. గౌరీశుడు భక్తితో ఇచ్చిన పుష్పమాత్రంతోనైనా ఆనందిస్తాడు (56).
తా ॥ పిదప అంగ భూతులైన సకల గణేశాదులను పూజించాలి. రకరకాల స్తవములతో మతించి బుధుడు సాష్టాంగ నమస్కారము చేయాలి (57) పిదప వృష చండేశ్వరాదితులకు ప్రదక్షిణం చేసి విధి ప్రకారము పూజను సమాప్తి చేసి గిరిజా పతిని ప్రార్థించాలి (58) ఓ దేవ జగన్నాథ జయము, ఓ శంకర శాశ్వతుడ జయము. సర్వసురాధ్యక్ష! జయము. సర్వ సురార్చిత జయము (59) సర్వ గుణాతీత జయము. సర్వ వరప్రద జయము. నిత్య, నిరాధార జయము. విశ్వంభర అవ్యయ జయము (60) విశ్వ ఏకవేద్య ఈశ జయము. నాగేంద్ర భూషణ జయము. గౌరీపతే శంభు జయము. చంద్రార్థ శేఖర జయము (61) కోటి అర్క సంకాశ జయము. అనంత గుణాశ్రయ జయము (62) రుద్ర విరూపాక్ష జయము. అచింత్య నిరంజన జయము. నాధ కృపానందు జయము. భక్త ఆర్తి భంజన జయము. దుస్తర సంసార సాగర ఉరణ, ప్రభుజయము (63) సంసారమందు ఆరుడనైన ఖేదము నందే నా యందు దయచూపు ఓ మహాదేవ. సర్వపాప భయమును తొలగించి నన్ను రక్షించు ఓ పరమేశ్వర! (64) మహా దారిద్ర్యంలో మునిగిన మహా పాప హతుడనైన, మహా శోకంతో నష్టుడనైన మహా రోగంతో బాధపడుతున్న (65) ఋణ భారంతో చుట్టబడిన, కర్మలతో తగలబడి పోతున్న గ్రహములతో బాగా పీడింప బడుతున్న నా యందు దయచూపు ఓ శంకర! (66) దరిద్రుడు పూజాంత మందు గిరిజాపతిని ఇట్టాగ ప్రార్థించాలి. డబ్ళు గలవాడైనా, రాజైనా దేవుని ఈశ్వరుని ప్రార్థించాలి (67) దీర్ఘాయువు, సదా ఆరోగ్యము, కోశవృద్ధి, బలోన్నతి, నిత్యము ఆనందము నీ దయవల్ల నాకు కలగని ఓ శంకర! (68) శత్రువులు నశించని నా గ్రహములు అనుగ్రహించని. దస్యులు నశించని. రాష్ట్ర మందు జనలు ఆపదలు లేకుండ ఉండని (89) దుర్భిక్షము, మారీ సంతాపములు భూమియందు శమించని. సర్వసస్యముల సమృద్ధి కలుగని, దిక్కులు సుఖంగా ఉండని (70) ఈ విధముగా ప్రదోష సమయమందు గిరిజాపతిని దేవుని ఆరాధించాలి. పిదప బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. దక్షిణలతో తృప్తి పరచాలి. (71) సర్వపాపముల నశింపచేసేది సర్వదరిద్రముల నశింపచే సేది. శివపూజను గూర్చి నేను చెప్పాను. అన్ని అభీష్టమైన వరముల నిచ్చేది (72)
తా ॥ మహాపాతక సమూహములు అధికమైన ఉప పాతకములు, శివ ద్రవ్యాపహరణం తప్ప అన్నీ తొలగించవచ్చు. (73) బ్రహ్మహత్యాది పాపములకు పురాణములందు స్మృతులందు ప్రాయశ్చిత్తములు కన్పించాయి. శివ ద్రవ్యాన్ని హరించిన వారి ప్రాయశ్చిత్తము లేదు. (74) అధికంగా చెప్ప పనిలేదు. సగం శ్లోకంలో చెప్తాను. బ్రహ్మహత్యా శతమునైనా శివపూజ నశింప చేస్తుంది. (75) నేను నీకు ఈ ప్రదోషమందు శివపూజను గూర్చి చెప్తాను. ప్రాణులన్నింటికి ఇది రహస్యమైంది. ఇందులో అనుమానం లేదు (76) ఈ పిల్లలతో కుడా ఇట్ల పూజ చేయించండి. అందువల్ల సంవత్సరంలోనే ఉత్తమ సిద్ధిని పొందుతారు. (77) అని శాండిల్యుడు చెప్పగా విని ఆ బ్రాహ్మణ స్త్రీ ఆ పిల్లలతో కూడి ముని పాదాలకు నమస్కరించింది (78) విప్ర స్త్రీ వచనము - నేనీవేళ కృతార్ధు రాలినైనాను. మీ దర్శనం వల్లనే ఓ భగవాన్! ఈ ఇద్దరు కుమారులు నిన్నే శరణు వేడారు (79) వీడు నా కుమారుడు. ఓ బ్రహ్మన్! శుచి వ్రతుడని వీని పేరు ఈ రాజసుతుని పేరు ధర్మ గుప్తునిగా నేను పెట్టాను (80) వీరు నేను మీ చరణ దాసులము ఓ భగవాన్! వరమైన దారిద్ర్య సాగరమందు పడిన మమ్ములను ఉద్ధరించు (81) అని శరణు పొందిన ద్విజాంగనను, అమృతము వంటి మాటలతో ఓదార్చి, ఆ ముని కుమారులకు శివారాధన మంత్ర విద్యను ఉపదేశించాడు (82) ఇట్లా మునితో ఉపదేశింపబడిన ఆ కుమారులు, బ్రాహ్మణి, ఆమునికి నమస్కరించి పోయి వస్తామని చెప్పి శివమందిరం నుంచి వెళ్ళారు. (83) నాటి నుండి ఆ పిల్లలిద్దరు మునివర్యుని ఉపదేశాన్ననుసరించి ప్రదోష సమయ మందు పార్వతీశుని పూజను త్వరగా చేయసాగారు. (84) ఇట్లా ద్విజ రాజకుమారులు దేవుని పూజిస్తుండగా నాలుగు నెలలు సుఖంగా గడిచాయి, వారికి (85) ఒకసారి రాజపుత్రుడు లేకుండా ఈ బ్రాహ్మణ కుమారుడు నదీ తీరానికి స్నానం చేయటానికి వెళ్ళాడు. స్వేచ్చగా తిరిగాడు (86) అక్కడ ప్రవాహపు దెబ్బతో భిన్నమైన కోటగోడలో స్థూలంగా కన్పిస్తున్న నిధాన కలశాన్ని చూచాడు. (87) దానిని చూచి త్వరగా ఆనందం ఎక్కువైన వాడై దైవమిచ్చిన దానినిగా భావించి తల పై ధరించి ఇంటికొచ్చాడు. (88) త్వరత్వరగా తెచ్చి బలంగా కలశాన్ని అక్కడ ఉంచి, భవనం చివర ఉంచి తల్లితో ఇట్లన్నాడు (89) ఓఅమ్మ! అమ్మ! గిరిజా పతి యొక్క ఈ ప్రసాదాన్ని చూడు ఆకరుణాత్ముడు కుంభరూపంలోని ధానాన్ని చూపాడు (90) అప్పుడు ఆశ్చర్యపడిన ఆతల్లి రాకుమారుని పిలిచి తన పుత్రుని అభినందించి శివార్చనను మెచ్చుకుంటూ ఇట్లా అంది. (91) ఓ కుమారులార! నా మాటను వినండి. ఈ నిధాన కలశమును సమంగా పంచి తీసుకోండి. నాశాసనం మీది గౌరవంతో (92).
తా ॥ అనే తల్లి మాటలను విని ద్విజనందనుడు ఆనంద పడ్డాడు. శంకరార్చన యందు విశ్వాసం కలవాడై రాజపుత్రుడు ఆమెతో ఇట్లా అన్నాడు (93) ఓ తల్లి! ఇది నీకొడుకు సుకృతం వల్లనే లభించింది. నేను తీసుకోను. పంచిన ధనాన్ని తీసుకోను (94) తన సుకృతం వల్ల వచ్చిన దానిని ఆతడు తానే అనుభవించని. ఆ భగవాన్ ఈశుడు నామీద దయ చూపుతాడు (95) ఈవిధంగా శివుని పూజించే, వారికి తిరిగి ఆ ఇంట్లోనే వారికి ఒక సంవత్సర కాలం గడిచింది (96) ఒకసారి ఆ రాకుమారుడు ఆ బ్రాహ్మణ కుమారునితో వనంత మాసంలో అడవిలో తిరుగ సాగాడు (97) ద్విజనృపాత్మజులు అడవిలో దూరంగా వెళ్ళారు. నూర్లకొలది గంధర్వ కన్యలు క్రీడిస్తున్నారక్కడ. వారిని వీరు చూచారు (98) వారంతా అందమైన సర్వావయవములు కలవారు మనోహరంగా విహరిస్తున్నారు. బ్రాహ్మణ కుమారుడు దూరం నుండి చూచి రాకుమారునితో ఇట్లన్నాడు (99) ఇక ముందుకు వెళ్ళగూడదు. ముందు స్త్రీలు విహరిస్తున్నారు. విమల ఆశయం గల బుధులు స్త్రీ సన్నిదానమును విడిచి పెడ్తారు. (100) వీరు మోనగించే వాళ్ళు. మంచి యౌవ్వన దుర్మదులు. జనులను చూచి మోహింప చేస్తారు. మాటలతో ఒప్పించటంలో సమర్ధులు. (101) అందువల్ల స్త్రీ సన్నిధిని విడిచి పెట్టాలి. వారితో భాషించరాదు. విద్వత్ బ్రహ్మచారీ, నిజ ధర్మమందున్న వారు విశ్లేషించి మాట్లాడరాదు (102) అందువల్ల స్త్రీలు క్రీడించే చోటికి వెళ్ళటానికి నేనిష్ట పడటంలేదు. అని పలికి ద్విజ పుత్రుడు మరలి పోయి దూరంగా నిలబడ్డాడు (103) ఇక ఆ రాజపుత్రుడు కౌతుకంతో నిండిన మనసుగల వాడై వారు విహరించే ప్రదేశానికి ఒక్కడే భయం లేకుండా వెళ్ళాడు (104) అక్కడ గంధర్వ కన్యలలో మధ్యలో ఒక వర ఆనన వస్తున్న రాజపుత్రుని చూచి మనసులో ఇట్లా ఆలోచించింది. (105) ఓహో ఎవడి ఉదారాంగుడు యువకుడు, సర్వాంగ సుందరుడు. మదించిన ఏనుగు వంటి నడకవాడు లావణ్యమను అమృతమునకు వారిధి (108) విలాసంతో చంచలమైన విశాలమైన కన్నులవాడు మధురమైన చిరునగవుతో మృదులవే నవాడు మన్మథుని వంటి రూప సంపదవాడు సుకుమారమైన అంగలక్షణ ముల వాడు (107) అని ఆశ్చర్యపడి ఆ బాలరాకుమారుని దూరం నుండే చూచి సఖులందరిని చూచి ఈ మాట అంది (108) దీనికి దగ్గరలో ఓ సఖులార! ఒక ఉత్తమ వనముంది. విచిత్రమైన చంపక అశోక పున్నాగ వకుళ ములతో కూడింది (109) ఆ అడవికి మీరంతా వెళ్ళి చాలా పూలను తెంపుకొని మీరు తిరిగి రాండి. అప్పటి దాకా నేనిక్కడుంటాను (110).
తా ॥ అని ఆదేశించగా సఖి వర్గము అడవిలోకి వెళ్ళింది. ఆ గంధర్వ కాంత రాకుమారుని యందు దృష్టి నిలిపి నిలిచి పోయింది (111) నవ యౌవన శాలిని ఐన ఆతన్వంగిని చూచి స్వరూప సంపదతో తిలోత్తమను మించిన ఆ బాలను చూచి (112) రాజపుత్రుడు వచ్చి కౌతుకంతో విప్పారిన కళ్ళు గలవాడై దైవయోగం వల్ల మదనుని బాణబాధకు గురైనాడు (113) గంధర్వ తనయ కూడా వచ్చిన రాకుమారునకు లేచి త్వరగా ఆతనికి వల్లవముల ఆసనాన్ని ఏర్పరచింది (114) ఉపచారముల పొంది కూర్చొన్న ఆతనిని చేరి ఆ సుమధ్యమ ! ఆతని రూప గుణములతో ధైర్యము నశించి ఆ కులమైన ఇంద్రియములు కలదై ఇట్లా అడిగింది. (115) నీవెవరు ఏ దేశంనుండి ఇక్కడకు వచ్చావు ఓ కమలపత్రాక్ష ! ఎవరి కుమారుడవు అని ప్రేమతో అడుగగా అంతా ఆతడు వివరించాడు (116) నేను విదర్భ రాకుమారుణ్ణి. తల్లిదండ్రులు నశించారు. శత్రువులు రాజ్య మాక్ర మించారు. నేను పర రాష్ట్రంలో ఉన్నాను. (117) అంతా చెప్పి తిరిగి ఆ రాకుమారుడు ఆమె నడిగాడు. ఓ వామోరు ! నీ వెవరు. ఇక్కడ నీకేం పని. ఎవరి కూతురువు నీవు (118) హృదయంలో ఏమి కోరుకుంటున్నావు. ఇక్కడ ఏం చెప్ప దలిచావు అని ఆమెతో అనగా ఆమె అతనితో అంది ఓ రాజేంద్ర నత్తమ విను (119) ద్రవిడుడని పేరుగలవాడు గంధర్వడు లాగ్రణి ఒకడున్నాడు. అతని కూతురును నేను నా పేరు అంశుమతి (120) వస్తున్న నిన్ను చూచి నీతో మాట్లాడాలని ఆశతో నేను, చెలులందరిని వదలి ఒంటరిగా ఉన్నాను, ఓ మహామతి (121) సంగీత విద్యలన్నింటిలో సన్నుమించి మరొకతె లేదు. నా యోగంతో దేవతా స్త్రీలంతా ఆనందిస్తున్నారు (122) నేను అన్ని కళలలో ఆరితేరిన దాన్ని. సర్వ జనుల ఇంగిత మెరిగిన దాన్ని. నీ కోరికను నేను తెలుసుకున్నాను. నా పై నీ మనసు లగ్నమైంది (123) అట్లాగే నాఔత్సుఖము దైవికంగా ప్రతిపాదితమైంది. ఇక ముందు మనిద్దరికి స్నేహ భేదము ఇక్కడ కలుగరాదు (124) అని పలికి అతనితో, ఆమె గంధర్వ నందిని ప్రేమతో త్వరగా తన రొమ్ముల పైని సొమ్మైన ముత్యాల హారమును ఆతనికిచ్చింది. (125) ఆ అద్భుత హారాన్ని తీసుకొని ఆతడు ఆమె ప్రేమలో వ్యాకులుడై ఆ రాకుమారుడు మిక్కిలి ఆనంద భరముతో ఉత్సహించిన ఆమెతో ఇట్లన్నాడు (126) ఓ భీరు! నీవు నిజం చెప్పాను. ఐనా నేనొకటి చెప్తాను. రాజ్యం పోగొట్టుకున్న నన్ను విశ్వసించి (ఏమిలేనినాడు) నా కెట్ల ప్రియురాలు అవుతావు (127) నీవు తండ్రి గల దానవు. తండ్రి ఆజ్ఞను మీరి ఓ బాల ! స్వచ్చందంగా చేయటానికి మూడురాలిలా నీ వెట్లా సమర్ధురాలివి. (128) అని అనగా అతని మాటలు విని అతనితో ఆమె ఇట్లా అంది. అట్లాగే కాని. నేనట్లాగే చేస్తాను. కౌతుకాన్ని చూడు (129) ఓ కాంత నీ భవనానికి వెళ్ళు. తిరిగి ఎల్లుండి ప్రొద్దున్నే ఇక్కడికిరా. కొంచేం పనుంది. అబద్ధంకాదు అని (130).
తా ॥ ఆ రాజ కుమారునితో పలికి ఆమె చెలులతో కలిసి ఆ ఆర్వాంగి వెళ్ళిపోయింది. ఆ రాకుమారుడు వెళ్ళాడు (131) ఆతడ బ్రాహ్మణ కుమారుని దగ్గరకు ఆనందంతో వచ్చి, అతనికి అంతా చెప్పి, ఆతనితో పాటు తన ఇంటికి వెళ్ళాడు (132) ఆ విప్ర స్త్రీని ఆ రాకుమారుడు చాలా సంతోష పెట్టి, ఎల్లుండి (మూడోనాడు) అ బ్రాహ్మణ కుమారునితో కలిసి అడవికి వెళ్ళాడు (133) అతడు, ఆ గంధర్వ స్త్రీ చెప్పిన ప్రకారము ఆ స్థానానికి చేరి, తన కూతురుతో కూడి ఉన్న, గంధర్వ రాజును చూచాడు (134) ఆ గంధర్వ పతి వచ్చిన ఆ ఇద్దరు కుమారులను అభినందించి అందమైన ఆసనంలో కూర్చోబెట్టి రాజ పుత్రునితో ఇట్లా అన్నాడు (135) గంధర్వుని వచనము - ఓ రాజేంద్ర పుత్ర నిన్నటి రోజు నేను కైలాసానికి వెళ్ళాను. అక్కడ పార్వతితో కూడి ఉన్న ప్రభువును మహాదేవుని చూచాను(136) ఆ దేవేశుడు నన్ను పిలిచి, అందరు దేవతల సన్నిధిలో ఇట్లన్నాడు,ఆ భగవానుడు,కరుణామృత వారిది, (137)భూమి పైన ధర్మగుప్తుడు అను పేరుగల ఒక రాజపుత్రు డున్నాడు. ఏమి చేయలేనినాడు, రాజ్యభ్రష్టుడు, శత్రువులు అతని రాజ్యాన్ని ఆక్రమించారు (138) ఆ బాలుడు గురువుల వాక్యంతో ఎప్పుడూ నా పూజయందు ఆనక్తుడై ఉంటాడు. ఇవ్వేళ ఆతని పితరులంతా ఆతని ప్రభావం వల్ల నా దగ్గరికొచ్చారు. (139) ఓ గంధర్వసత్తమ ! ఆతనికి నీవు కూడా సాహాయ్యము చేయి. ఆ పిదప ఆతడు రాజ్యాన్ని పొందుతాడు. అతని శత్రువులు నశిస్తారు. (140) అని మహేశ్వరుడు ఆజ్ఞాపించగా నా ఇంటికి వచ్చాను. ఈ నా కూతురుతో కూడా చాలా సేపు ప్రార్థింపబడ్డాను. (141) కరుణాత్ముడైన శివుని ఆజ్ఞను, ఇదంతా తెలుసు కుని ఈనా కూతురును తీసుకొని ఈ ఆడవి మధ్యకు వచ్చాను. (142) అందువల్ల ఈ నా కన్యను అంశుమతిని నీకు ఇస్తున్నాను. నీ శత్రువులను చంపి శివుని ఆజ్ఞ ప్రకారము నీ రాజ్యంలో నిన్ను ఉంచుతాను. (143) ఆ పట్టణంలో నీవు ఈమెతో కూడి ఇష్టమైన సుఖములు, అనుభవించి, పదివేల సంవత్సారాల తరువాత శివుని మందిరానికి వెళ్తావు (144) ఆ ప్రదేశంలో కూడా నా ఈ కన్య నిన్నే పొందుతుంది.దివ్యమైన ఈ స్వదేహంతోనే శివుని సన్నిధిలో (145) ఉంటారు. అని గంధర్వరాజు పలికి ఆ అడవిలో రాకుమారునితో తన కూతురు వివాహాన్ని జరిపించాడు (146) తెల్లని గొడుగు వంటి రాజర్ష వస్తువులు ఇచ్చాడు. మహాఉజ్వలమైన రత్నరాసులను అతనికి ఇచ్చాడు. చంద్రుని వంటి చూడామణిని, ప్రకాశిస్తున్న ముక్తాహారములను ఇచ్చాడు (147) దివ్య అలంకారములను, వస్త్రములను, బంగారువీ కప్పుకునే వస్త్రములను, పదివేల ఏనుగులను, లక్ష నల్లని గుఱ్ఱములను ఇచ్చాడు (148) వేల కొలది బంగారు మయమైన చాలా గొప్పవైన రధములను ఇచ్చాడు. ఇంకా ఒక దివ్య రధమును ఇంద్రాయుధముతో సమానమైన ధనుస్సును ఇచ్చాడు. (149) వేలకొలది అస్త్రములను అక్షయ్య సాయుత ములుగల అమ్ములపొదిలను, , భేదించరాని, కవచాన్ని శత్రువులను మర్దించే సువర్ణ శక్తి నిచ్చాడు (150).
తా ॥ కూతురునకు పరిచర్య చేసే కొరకు ఐదువేల దాసీలను ఇచ్చాడు రకరకాల ధన సంపత్తిని అతని కిచ్చాడు ఆనందంతో (151) ఉగ్రమైన గంధర్వ సైన్యము చతురంగములు కలది, అతనికి సహాయం కొరకు గంధర్వాధీ పతి ఆతని కిచ్చాడు. (152) ఈ విధముగా రాకుమారుడు ఉత్తమమైన సంపదను పొంది, ఇష్టమైన భార్యను పొంది, అమెతో కూడి తన సంపదతో ఆనందించాడు (153) నమయోచితముగా తన కూతురు వివాహమును చేసి గంధర్వాధిపతి విమానమెక్కి స్వర్గానికి వెళ్ళాడు. (154) ధర్మగుప్తుడు వివాహమయ్యాక గంధర్వ సేనతో కూడి, తిరగి తన నగరానికి వచ్చి, శత్రు సైన్యాన్ని సంపాదించాడు (155) గంధర్వ సేన శక్తితో దుర్ధర్షణుని యుద్ధంలో చంపి, శత్రు సైన్యాన్నంతా చంపి తన నగరానికి వచ్చాడు (156) మంత్రులతో మహోత్తమ బ్రాహ్మణులతో కూడి అభిషేకాన్ని పొంది, రత్నసింహాన మందధి రోహించి రాజ్యమును ఎదురు లేకుండా పాలించాడు (157) పూర్వము ఇతన్ని తన కొడుకులా పోషించిన బ్రాహ్మణ వనితయే ఆతనికి తల్లైంది. ఆ బ్రాహ్మణ కుమారుడు. భ్రాతయైనాడు (158) ఆతని భార్య గంధర్వతనయ. ఆతడు విదర్బ నగరాధిపతి. దేవుడైన గిరీశుని పూజించి ధర్మగుప్తుడు రాజైనాడు. (159) ఈ విధంగా ఇతరులూ ప్రదోష సమయ మందు గిరిజా పతిని పూజించి ఈప్సితమైన కామములను పొందుతున్నారు. దేహాంతమందు ఉత్తమ గతిని పొందుతారు (160) సూతుని వచనము - ఇది పుణ్యప్రదమైన వ్రతము ప్రదోష కాలమందు శంకరుని పూజనము. ధర్మ అర్థ కామమోక్షములకు ఇది ఉత్తమ సాధనము (161) పరమాద్బుతమైన ఈ మాహాత్మ్యాన్ని విన్నవారు, శివపూజ చివర ప్రదోషకాల మందు చక్కగా చెప్పిన వారు (162) అట్టి వారికి నూరు జన్మ లందు కూడా దారిద్ర్య ముండదు. జ్ఞాన ఐశ్వర్యములు కలవాడై అంతమందు అతడు శివపురికి వెళ్తాడు (163) దుర్లభమైన మనుజ శరీరాన్ని పొంది పరమేశ్వర పాదపూజ చేసినవారు మాత్ర మేధన్యులు తమ పుణ్యంతో ముల్లోకాలను జయించినవారు. వారి పాదధూళి ఈ లోకాలను పవిత్రం చేస్తూంది. (164) అని శ్రీ స్కాందమహా పురాణమందు ఏకాశీతి నహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మోత్తర ఖండమందు ప్రదోష మహిమ వర్ణన మనునది ఏడవ అధ్యాయము.
