స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని బ్రహ్మోత్తర ఖండము

3 అధ్యాయము

తా రాజిట్లనెను- ఓ బ్రహ్మన్ ! మీరు మార్గంలో ఆశ్చర్యకరమైనది ఏమి చూచారు. ఎక్కడ చూచారు. దానిని నాకు చెప్పండి దానిని విని నేను కృతకృత్యుడనౌతాను. అని అనగా (1) గౌతముడిట్లన్నాడు - ఓరాజ! గోకర్ణంనుండి నేను వస్తూ ఒకచోట, మధ్యాహ్న సమయంకాగా స్వచ్ఛమైన సరస్సును చూశాను (2) అక్కడ నీటిని ముట్టి ప్రయాణవు బడలికను తీర్చుకొని దట్టమైన చల్లనినీడ గల మఱ్ఱి వృక్షాన్ని ఆశ్రయించాను (3) అక్కడికికొద్దిదూరంలోచండాల స్త్రీని. వృద్ధురాలిని గుడ్డి దానిని, కృశించిన ఆకారంగల దానిని వాడిన ముఖంగలదానిని, ఆహారం లేనిదానిని, అనేక రోగములతో పీడింపబడిన దానిని (4) శరీరమంతా కుష్టురోగపు పుండుగల దానిని, పైకి వస్తున్న పురుగులతో ఆకులమైనదానిని, చీము, నెత్తురుకలిగిన మునతనం గలిగిన నడుము గలదాన్ని (5) క్షయతోకూడి నందున గొంతు తడబడిబాధపడుతున్న దానిని, రాలిపొయిన పండుగల దానిని, అవ్యక్తురాలిని, మాటిమాటికి పొర్లుతున్న దానిని (6) ఉగ్రుడైన సూర్యుని కిరణములతో తాకబడిన తీక్ష్ణమైన దుమ్ముతో కప్పబడిన దానిని, మలముముత్రము చీము వీటితోపూయబడిన శరీరంగల దానిని, రక్తపువాసనతో చేరరానిదానిని (7) కఫరోగంతో అతి ఉచ్చ్వాసంతో పడిపోయిన నాడి గల దానిని అనేక భాదలు గల దానిని, జారిపోయిన వెంట్రుకలు, అవయవములు కలదానిని మరణమునకు దగ్గరలో ఉన్నదానిని చూచాను (8) అటువంటి బాధగల ఆమెను చూచి నేను దయగల వాడనైనాను. ఆమె మరణముకై ఎదురుచూస్తూ, క్షణకాలం అక్కడే ఉన్నాను. (9) తనకిరణములతో అంతరిక్షస్థానాన్ని తడువుతున్నట్టుగాఉన్న, శివకింకరులు తీసుకవస్తున్న దేపవిమానాన్ని చూచాను (10) అందులో సూర్యచంద్రులు అగ్ని వీరితేజస్సుల వలె పంజరంలో విమానంలో సూర్యునిలాగా వెలిగే శివకింకరులను చూచాను (11) వారు త్రిశూలము, ఖట్వాంగము, (కపాలము) కత్తి, ఒర, చర్మము (డాలు) కత్త చేతధరించి ఉన్నారు. సగము చంద్రుని భూషణముగా ధరించారు. దట్టమైన చంద్ర కుందములవంటి కాంతులుగలవారు (12) కిరీట కుండల ములలో వెలిగిపోతున్నారు. సర్పమును వలయముగా కలిగి ఉన్నారు. శివుని అనుచరులు. శుభలక్షణములు గలవారిని నలుగురిని నేను చూచాను (13) విమానమందున్నకిందికి వస్తున్నవారిని చూచి నేను చాలా ఆశ్చర్యపడ్డాను. వేగముగా వారిని సమీపించి ఆకాశమందున్నవారిని అడిగాను (14) మీకు త్రిదశోత్తములకు నమస్కారము త్రిలోచనుని శ్రీచరణములను అనుసరించే మీకు నమస్సులు త్రిలోకరక్షావిధిని వహించేవారు. త్రిశూలము, డాలు, కత్తి, గద ధరించినవారు మీరు (15) మీరు మహేశ్వరుని పాదములను అనుసరించు వారని తెలిసింది నాకు. లోకరక్షణ కొరకై సదామీప్రయాణము కాక ఆనందాన్ని కల్గించేందుకా (16) కాకనర్వజనులపాపరాశిని నశింపచేసేందుకు ప్రయత్నిస్తున్నారా. మీరిక్కడికెందుకొచ్చారో దయతో నాకు చెప్పండి (17) అని అనగా శివదూతలు ఇట్లన్నారు - ఈమె, ముందర కన్పిస్తున్నది ముసలిస్త్రీ. చండాలస్త్రీ. చావసిద్ధంగా ఉంది. ఈమెను తీసుకుపోవటానికి వచ్చాము, ప్రభువు మమ్ములను ఆజ్ఞాపించాడు (18) అని శివ దూతలు అనగా తిరిగి నేనిట్లడిగాను. మనసంతా ఆశ్చర్యంతో నిండిపోగా వారికెదురుగా చేతులు జోడించి నిలిచి ఇట్లన్నాను (19) ఈమె పావుత్మురాలు. ఘోరమైనది, చండాలస్త్రీ, ఈమె ఎట్లా అర్హురాలు. యజ్ఞవేది పైకి అధ్వర్యుల మధ్యకు, కుక్కలాగా ఈమెవిమానము ఎక్కుటకు ఎట్లా అర్హురాలు (20)    

తా ॥ పుట్టినప్పటి నుండి ఆశుచిప్రాయురాలు. పాపిని పాపులను అనుసరించేది. దురాచారురాలైన ఇటువంటి ఈమెను శివలోకానికి ఎట్లాతీసుకెళతారు (21) ఈమెకు శివజ్ఞానములేదు. ఘోరమైన తపస్సు చేయలేదీమె. సత్యము దయ ఈమెకు లేవు. ఈమె నెట్లా తీసుకెళతారు. (22) పశుమాంసమును ఆహారంగాతీసుకుంటోంది. కల్లుతో కడుపు నింపుకుంటోంది. జీవహింస చేసేది రోజు, ఈమెనెట్లా తీసుకెళుతారు (23) పంచాక్షరీజపం ఈమె చేయలేదు. శివపూజ చేయలేదు. శివున్ని ధ్యానించ లేదు. ఈమెనెట్లా తీసుకెళుతారు. (24) శివతిధిన ఉపవసించలేదు. శివపూజచేయలేదు భూతదయ అంటే ఈమెకు తెలియదు. శివునకు బిల్వపత్రాన్ని అర్పించటం ఈమెకు తెలియదు. ఇష్టాపూర్తాదియాగములుతెలియవు. మరి ఈమెనెట్లా తీసుకెళతారు. (25) తీర్థములలో స్నానం చేయలేదు. దానాలు చేయలేదు. వ్రతాలు ఆచరించలేదు. ఈమె నెట్లా తీసుకెళతారు. (26) చూడటమే తగదు ఈమెను మాట్లాడటం అంతకన్న తగదు. సత్సంగం లేని, చండాలురాలైన ఈమెను ఎట్లా తీసుకెళతారు. (27) పూర్వజన్మలలో సంపాదించిన పుణ్యం ఏమైనాఉందా అట్లా గైతే కుష్ఠురోగంతో పురుగులతో ఎందుకు భాదింపబడుతోంది (28) ఇది ఈశ్వరచర్య. శరీరధారులు తప్పించుకోరాదిది. పాపాత్ములు కూడా దయతో పరమపదానికి తీసుకు పోబడుతారా (29) అని నేను వారితో ఆనగా, ఆ దేవ దేవుడైన శివుని దూతలు నాతో అన్ని సంశయములు భేదిస్తూ ప్రేమతో ఇట్లన్నారు (30) శివదూతల వచనములు - ఓ బ్రహ్మన్! నీకు వినాలనే కుతూహలముంటే చాలా ఆశ్చర్యకరమైనదానిని విను. ఈచండాలిని ఉద్దేశించి నీవిప్పుడు ఏమి అన్నావో గదా (31) పూర్వజన్మలో ఈమె ఒక బ్రాహ్మణకన్యక సుమిత్ర అని పేరు. సంపూర్ణచంద్రునివలె ముఖంగలది. (32) వికసించిన మల్లెపూలమాలవలె సుకుమారమైన అంగములుకలది. కైకేయద్విజుకురుతనమ ఈమె ఈస్త్రీ (33) అన్ని లక్షణములు గల ఈమెను అపర రతీదేవివలె ఉన్న దానిని, తండ్రి ఇంటిలో పెరుగుతున్న దానిని జనులు చూచి ఆశ్చర్యపడ్డారు (34) రోజురోజుకు పెరుగుతూ, బంధువులతో బాగా లాలింపబడుతూ ఆమె మెల్లగా మన్మధుని ధనస్సు లాగా యావ్వనాన్ని పొందింది (35) బంధువర్గంతో కూడిన ఆ కుమారిక వీధివశాత్తు ఒక బ్రాహ్మణ కుమారునకు తండ్రి ఇచ్చాడు (36) నవయవ్వనంగల ఆమె భర్తను పొంది శుభాచారంగలదై బంధువులు కూడి ఉండగా సుఖించింది (37) కౌలవశంవల్ల ఆమె భర్త తీవ్రమైన రోగంతో బాధపడి, రూపయౌవ్వనములతో అందగాడైనా చనిపోయాడు, ఓ ముని! (38) భర్త చనిపోగా దుఃఖంతో హృదయం దగ్ధంకాగా సుశీలగా విజితేంద్రియగా కొన్ని మాసములు ఉంది (39) ఇక యౌవనంతో ప్రతిరోజు పెరిగిపోతూన్న ఆమె హృదయం మన్మథునితో కంపించిపోయింది (40). 

తా ॥ మహోత్తములైన బంధువర్గం ఆమెను రహస్యంగా శాసించి వామదనునితో ఆకర్షించబడ్డ  ఆస్త్రీ తన మననును అరికట్టు కోలేకపోయింది. (41) రూపయౌవనములు గల ఆమె తీవ్రంగా మన్మధావిష్టురాలై విశ్లేషించి విధవ ఐనా జార మార్గాన్న నుసరించింది. (42) విచక్షణగల ఆమె జారిణి అని ఎవ్వరితో గుర్తించబడలేదు. అసత్తమురాలామె కొంత కాలంవరకు తన దురాచారాన్ని కప్పిపుచ్చుకొంది (43) దోహదములు (గర్బిణిలక్షణాలు) ఆమెనాక్రమించాయి. ముఖమున్ తా నములు మేఘం వలె నల్లబడ్డాయి. కొంతకాలానికి బంధువర్గం కూడా ఆమెను విటదూషితురాలుగా తెలుసుకున్నాయి (44) బంధువర్గము భయపడి మహాక్లేశంతో ఎడతెగని దుఃఖాన్ని పొందింది. స్త్రీలు కామంతోనశిస్తారు. బ్రాహ్మణులు హీనసేవతో నశిస్తారు (45) రాజలు బ్రహ్మదండనతో నశిస్తారు. యతులు భోగములను కూర్చుకొనటంవల్ల నశిస్తారు. కుక్క ముట్టిన అన్నము, సురతోకలిపిన పాలు (46) కుష్టురోగంతో కూడిన రూపము చెడిపోతాయి. అట్లాగే కుస్త్రీలతో కులమునశిస్తుంది. అని అందరు ఆలోచించి వతి సోదరులంతా ఏకమై (47) ఆమెను కొప్పుపట్టి ఈడుస్తూ ఆమెను గోత్రం నుండి దూరంగా వదిలారు. ఘటోత్సర్గంతో పాటు (ఒకరు అమెబంధువులందరితో విడువబడి (48) తిరుగుతూ రతి ప్రియేద్రునితో పాటు రమించసాగింది. అమె గ్రామం నుండి బయటకు వెళ్ళింది.ఆమెను మరొకశూద్రుడు చూచాడు (49) వాడు బలిసిన ఎతైన రొమ్ములు గల ఆవరారోహానుచూచి ఆ చూద్రనాయకుడు ఆ విధవను మంచి మాటలతో ఇంటికి తీసుకవచ్చాడు. ఆమె అతని పెద్ద భార్యయై (రాణి) వానితో రాత్రింబగళ్ళు (50) రమిస్తూ గృహమునకు అధికారిణియై ఒకచోట ఉంది. అక్కడ ఆమె మాంసం భుజిస్తూ రోజు కల్లుతాగుతూ (51) రతిప్రియమై ఆశూద్రునితో రమిస్తూ ఒక కొడుకునుకన్నది. ఒకసారి భర్త ఎక్కడికోవెళ్ళగా ఆమెకల్లుతాగి (52) మదిరామదంతో చంచలమై మాంసాన్ని ఆహారంగా కావాలనుకొంది బహిఃప్రదేశంలో (కొట్టంలో) ఆవులతో పాటు మేకలను ఉంచితే చూచి (53) ఆచిమ్మ చీకట్లో రాత్రిపూట, ఆమె కత్తి తీసుకొని వెళ్ళింది. మదావేశంలో ఆలోచించకుండా మాంసమందలి ప్రేమతో మేక అనుకొని (54) ఒక ఆవు దూడను ఏడుస్తున్నదాన్ని చంపింది, రాత్రిపూట అదురగ చంపినదాన్ని ఇంటికి తీసువచ్చి దానిని లేగగా అమె గ్రహించి (55) భయపడి ఏదో కొంచం పుణ్యకర్మ ఉన్నందువల్ల శివ శివుని పలికింది. ఆమె కొంచం సేపు ఆలోచించి, మాంసము రక్తమునీటి పైశతో (56) గోవత్సమునే చీల్చి తన కిష్టమైన ఆహారంగా చేసుకుంది లేగ యొక్క సగం శరీరంతో ఆమె ఆహారాన్ని చేసుకొని (57) ఆ లేగ మిగిలిన సగం శరీరాన్ని అక్కడ పెట్టి బయటికెళ్ళి కపటంగా అరవ సాగింది. ఒక పులికొట్టంలోని ఈ లేగదూడను చంపివేసింది అని (58) ఆమె అరుపు అందరి ఇళ్ళల్లోకి వినిపించింది. ఆ పిదప శూద్రులంతా వచ్చి ఆమెదగ్గర నిలబడ్డారు (59) గోవత్సమును చూచి పులి దీన్ని చంపేసిందని దుఃఖించారు. వాళ్ళంతా వెళ్ళాక ఆరాత్రిగడిచాక (60).  

తా ॥ అమె భర్త ఇంటికి వచ్చి గృహమందలి విట శ్రేష్టురాలిని చూచాడు. కొంతకాలం గడిచాక ఆ శూద్ర స్త్రీ (61) కాలాధీనమై యముని మందరీరానికి వెళ్ళింది. యముడు ధర్మాన్ని చూసి అమే పూర్వ కర్మను చూసి (62)నరకం నుండి విడిచి పుచ్చి చండాల జాతి దానినిగా చేశాడు. అమె భ్రష్టమై యమపురం నుండి వచ్చి చాండా గర్భాన్ని ఆశ్రయించింది (63) పిదప జాత్యంధు రాలైంది. (పుట్టుగుడ్డి) చల్లారిన అగ్నిలా నల్లగా ఐంది. ఆమె తండ్రి ఒక చండాలుడు దేశంలో ఎక్కడో ఉన్నాడు (64) అటువంటి దాన్నైనా ఆవిడను దయతో పోషించింది తల్లి. తిన తగని చెడిపోయిన కుక్క ముట్టిన దుర్గంధమైన అన్నంతో (65) తాగరాని చారు మొదలగు వానితో తల్లి పిల్లను పోషించింది. పుట్టుగుడ్డి ఆమె చిన్నతనం నుండే కుష్ఠు వ్యాధితో బాధ పడసాగింది. (66) ఏ చండాలుడు ఆమెను పెళ్ళి చేసుకోలేదు. అతి దుర్భగ ఆమె, అమె బాల్యం గడిచాక ఆమె తల్లిదండ్రులను వదిలి పెట్టింది (67) దుర్భగ అని బంధవులు సహోదరులు ఆమెను వదిలారు. పిదప ఆకలితో దీనురాలై దు:ఖిస్తూ చూపు లేనిదై (68) చేత కట్టె పట్టుకొని చేత మట్టి పాత్రధరించి కష్టం మీద తిరగసాగింది. పట్టణాల్లో కూడా ప్రతిరోజు యాచిస్తూ తిరుగసాగింది. (69) చండాలులు ఇచ్చిన ఎంగిలి పిండంతో ఆకలిని తృప్తి పరచింది. ఇట్లా చాలా కష్టంమీద చాలా జీవితాన్ని గడిపి (70) ముసలి తనంతో అన్ని అవయవములు ఆక్రమింపబడగా ఎడతెగని దుఃఖాన్ని పొందింది. అన్న పానవస్త్రములు లేకుండా ఆమె ఒకసారి మహాజనులను (71) ఆయాస పడుతూ శివతిథి యందు(గోకర్ణమునకు) వెళ్ళి అధ్వగులను గూర్చి తెలుసుకొంది. ఆ దేవయాత్రయందు దేశదేశాంతరముల నుండి వెళ్ళే వారిని చూచింది (72) వారు విప్రులు, అగ్నిహోత్రం కలవారు, ఆడవాళ్ళు తోడున్నారు. మహాత్ములు, రాజులు, అంతఃపుర స్త్రీలతో నున్నారు. ఏనుగులు రధములు గుఱ్ఱములు తోడున్నాయి (73) పరివార ఘోష ఉంది. యావచ్ఛత్రాదులతో శోభిస్తున్నారు. అట్లాగే విట్ శూద్రులు ఇతరులు అన్నిరకాల వారు వేలకొలది ఉన్నారు (74) వారంతా నవ్వుతూ పాడుతూ నాట్యంచేస్తూ, పరుగెత్తుతూ ఉన్నారు. వాసన చూస్తూ, తాగుతూ, స్వేచ్చగా వెళ్తూ ప్రతిగర్జనచేస్తూ ఉన్నారు. (75) ఈ ప్రయాణంలో మనుషుల సందడి చాలా ఎక్కువైంది అని అంతా గోకర్ణానికి వెళ్తుంటే శివ మందిరానికి వెళ్తుంటే (76) దేవతలంతా విమానాల్లో కూర్చొని కౌతుకంతో చూస్తున్నారు. ఇక ఈ చండాలి కూడా వస్త్రము, భోజనము, దప్పికతో బాధపడుతూ (77) ఈ మహాజనాన్ని యాచించటానికి మెల్లమెల్లగా కదిలింది. మరో స్త్రీ చేతిసాయంతో పూర్వజన్మలో చేసిన కర్మ వశంవల్ల కొన్నిరోజులు వెళ్తూ వెళ్తూ గోకర్ణతానికి చేరింది (78) మార్గానికి కొద్ది దూరంలో కూర్చొని చేతులు చాచి యాచిస్తు మాటమాటికి బాటసారులతో దీనంగా మాట్లాడ సాగింది (79) పూర్వజన్మలో సంపాదించిన పాప సమూహంతో చాలా నాళ్ళ నుండి పీడింపబఢనాడు ఆహారన్నిచ్చి నా మీద దయ చూపండి ఓ జనులార! (80).    

తా ॥ పరమార్తులను రక్షించేవారా! పరమ ఆశీస్సులను ఇచ్చేవారా!. బహు పుణ్యములకు కర్త లైనవారా ! ఓ జనులార! దయ చూపండి. (81) వస్త్రములు, తిండి లేని దాన్ని భూమిపై పడున్న దాన్ని, దుమ్ములో కొట్టుకు పోతున్న దాన్ని, ఓ జనులార! నాపై దయ చూపండి (82) గొప్ప చలి ఎండ వీటితో బాధపడుతున్న దాన్ని గొప్ప రోగంతో పీడింపడిన దాన్ని, గుడ్డిదాన్ని, వృద్ధురాలిని అట్టి నాపై జనులార ! దయ చూపండి (83) చాలా నాళ్ళ నుండి ఉపవాసం వల్ల నా జఠరాగ్ని దీప్తమై పెరుగుతోంది. ఆవయవాలన్నీ మండిపోతున్నాయి. అట్టి నాపై ఓ జనులార ! దయ చూపండి (84) నూర్ల కొలది జన్మలలో కూడా పుణ్యము సంపాయించని, పాపురాలిని మంద భాగ్యురాలిని, అట్టి నాపై దయ జూపండి, ఓ జనులార ! (85) ఈ విధముగా అభ్యర్థిస్తూ చాండాలి, చేతులు చాచగా ఒక పుణ్యాత్ముడైన బాటసారి బిల్వ మంజరి పారవేశాడు (86) తన కొంగులో పడ్డ దానిని ఆమె మాటి మాటికి స్పృశించి తినే వస్తువని భావించి పిదప తొందరగా దూరంగా విసిరేసింది (87) ఆమె చేతినుండి విడువబడి రాత్రిపూట ఆ బిల్వమంజరి ఒక శివ లింగవుతలలో అదృష్టవ శాత్తు పడింది (88) ఆమె ఈ విధంగా శివ చతుర్ధశి రాత్రి యందు బాటసారులను మాటిమాటికి యాచిస్తూ కూడా దైవ యోగంవల్ల ఏమీ పొందలేక పోయింది (89) భద్రకాళి వెనుక ఆమె ఆ రాత్రి నివసించింది. కొద్దిగా ఉత్తర దిక్కులో ఒక స్థానంలో ఆ విగ్రహానికి సగంలో కొద్దిదూరంలో ఉంది (90) ఆ పిదప తెల్లవారి ఆశలన్నీ నశించి అతి దు:ఖంతో బాధపడుతూ స్వదేశమునకు దీనంగా మెల్లగా మరలింది (91) చాలా ఉపవానంతో అలసిపోయింది అడుగడుగునా పడిపోసాగింది. ఏడుస్తూ, అ వేళ రోగాలతో బాధపడుతూ, వణుకుతూ, మిక్కిలి తొట్రుపడ సాగింది (92) సూర్యుని వేడిమితో బాధపడిపోతూ శరీరం నగ్నంగా చేతకట్టె ధరించి కొంతదూరం వచ్చి చైతన్యం లేకుండా పడిపోయింది. (93) ఆ పిదప విశ్వేశ్వరుడు శంభువు దయడు అమృతవారిది, ఈమెను తీసుకురండి అని విమానంతో పాటు మమ్ములను నియమించాడు (94) ఇది ఈ చాండాలి యొక్క నడక నీకి విషయం ఇక్కడ చెప్పాను. ఇట్లా కృపణుల యందు కృప శివుని కృప చూపబడింది. (95) ఓ మహామతి! కర్మ పరిపాకం వల్ల కల్గినగతిని చూడు. అధమయైనా, నిరామయమైన ఉత్తమ స్థానాన్ని చేరుతుందీ (96) ఈమె పూర్వజన్మలో అన్నదానం చేయలేదు. అందువల్లే ఇప్పుడు ఆకలి దప్పులతో బాధపడుతోంది (97) ఈమె మదవేగంతో గుడ్డిదై చాలా ఘోరమైన పాపం చేసింది. అందువల్లనే జాత్యంధురాలైంది, ఈ జన్మలో (98) గోవత్సమని తెలిసి కూడా ఈమె ఇదివరలో భక్షించింది ఆకర్మతో ఈ జన్మలో నిందింపబడిన చాండాలిగా జన్మించింది. (99) ఈమె పూర్వము నజ్జనుల మార్గాన్ని జారమార్గాన్ని అనుసరించింది. ఆకారణంగా చెడు నడవడిక కలిగి దుర్భగ ఐంది (100)   

తా॥ మదంతో ఆవేశం పొంది విధవగా పూర్వం జారుణ్ణి కౌగిలించుకొంది. ఆ గొప్ప పాపంతో గొప్ప కుష్ఠు వ్యాధిని పొందింది. (101) కామార్త యై ఈమె పూర్వము శూద్రునితో స్వేచ్ఛగా రమించింది. బాగా రక్తము చీము పురుగులతో పాపంతో పీడింపబడింది (102) మంచి వ్రతములు చేయలేదు.ఇష్టా పూర్తాది యాగములు చేయలేదు.ఆ కారణముగా అ పాపంతో ఏ భోగములు లేకుండా ఈమె దూషించబడింది (103) విమూఢతైన ఆమె పూర్వ జన్మలో కల్లు తాగింది. అపాపం కారణంగా క్షయ రోగం బాదతో హృయద శూలంతో పీడింపబడింది (104) ఇక్కడే మర్త్యులందరిలో అన్ని విధములా పాప చిహ్నములే వివేకులైన మహాత్ములు చూస్తున్నారు, ఓ మునిశార్దూల ! (105) ఇక్కడ అధిక రోగములతో బాధపడేవారు ఎవరున్నారో పుత్ర ధనములు లేనివారు ఎవరున్నారో (106) దుర్లక్షణములతో క్లిష్టమైన వారెవరున్నారో, సిగ్గులేని వారు యాచకు లెవరున్నారో, వానము, అన్నము, పానము, శయనము, భూషణములు, అభ్యంజనాదులు లేని వారు ఎవరున్నారో (107) విరూవులు, నిర్విద్యులు, వికలాంగులు, కుభోజనులు ఎవరున్నారో దురాగ్యులు, నిందితులు, పర సేవకులు ఎవరున్నారో (108) వీరంతా పూర్వజన్మలో చాలా పాపం చేసినవారు అని ఆలోచించి ప్రయత్న పూర్వకంగా లోకజన స్థితిని చూచి (109) బుధుడు (పండితుడు) పాపంచేయడు. ఒకవేళ చేస్తే వాడు ఆత్మను చంపుకున్న వాడే. ఈ మానవ దేహము ప్రాణి అనేక కర్మలకు స్థానము (110) ఎప్పుడూ సత్కర్మలనే చేయాలి. దుష్కర్మను ఎల్లప్పుడు వదలాలి. సుఖమును కోరేవాడు పుణ్యం చేయాలి. దు:ఖం కోరేవాడు పాప మాచరించాలి. (111) కుశలుడైన జనుడు లోకంలో రెంటిలో ఒకటి గ్రహిస్తాడు. పరమ దుర్లభమైన ఈ మానుష దేహాన్ని ఆశ్రయించి (112) ఆత్మపాతాన్ని కోరే నరుడు ఒక దేవుని ఆశ్రయించాలి నరుడు ఎల్లపుడూ అన్ని పాపములు చేసినా (113) శివుని ఏకాగ్రచిత్తంతో ధ్యానించాలి. అతడు పాతకాలను దాటుతాడు. పూర్వజన్మలో మరణించిన ఈమె యమాలయానికి వచ్చినప్పుడు (114) యమ సభాసదులకు చాలా చర్చ వచ్చింది. ఈమె బ్రాహ్మణి యైనా సత్కులా చారంతో దూషితమైంది. (115) అందువల్ల మేము ఇక్కడికి తీసుక వచ్చాము నరకానికి వెళ్ళాలా వద్దా. ఈమె బాల్యంలో సంపాదించిన పుణ్య లేశము ఉందా లేదా (116) చాలా బాగా విచారించి శిక్షను విధించండి. మరో రకంగా కాదు బహు జన్మన పానములలో చేసిన పుణ్య పరిపాకంవల్ల (117) నరులకు బ్రాహ్మణ కులంలో ఏదో విధంగా జన్మ లభిస్తుంది. అందువల్ల ఈమె పూర్వజన్మలలో పాపం చేయలేదు (118) లేకపోతే ఈమెకు సత్కులంలో జన్మ ఎట్లా లభిస్తుంది. ఈ జన్మలోనే ఈమె దాటరాని పాపంచేసింది (119) ఐనా ఈమె నరక నివాసమునకు తరచుగా అర్హముకాదు. ఈమె గోవత్సకమును చంపింది. ఆలోచించి భయంతో (120) పూర్వజన్మలో సంపాదించిన కర్మవల్ల ఈమె శివశివ అని పలికింది (120).   

తా ॥ ఈమె తన పాప విచ్ఛిత్తి కొరకు ఒక్కసారైనా గొప్ప మంగళాన్నిచ్చే (121) శివనామము ఒకసారి భక్తితో పలికితే పరమ పదానికి పోతుంది. ఒక జన్మలో చేసిన ఈ దారుణ పాపానికి ఏ ఫలముందో దానిని (122) ఈమె చండాల జాతీ స్త్రీ ఐ క్రమంగా అనుభవించనీ దీని కన్నమరో వేరైన నరకం నరులకు ఇక్కడ ఉంది. (123) అనేక దుఃఖముల సమూహముతో మాటిమాటికి పీడింపబడటం కన్న దుష్కలంలో జన్మ, దారిద్ర్యము, మహావ్యాధి విమూఢత్వము (124) ఒక్కొక్కటే నరకము. అన్ని ఏకమైతే ఇంకా చెప్పేదేముంది. పూర్వజన్మ లోని పుణ్య భారంవల్ల వివశమై ఏ పేరు పలికిందో (125) దానితో ఈమె మరో జన్మలో చాలా పుణ్యాన్నిజనాంతరంలో చేస్తుంది. ఆ గొప్పవుణ్యంతో పాప సమూహముల యాతన నుండి విముక్తురాలై (126) అ పురుషులతో తీసుకుపోబడి, అంతమందు పరమపదానికి వెళ్తుంది. ఇటువంటి నరులకు మేము శాసకులముగాదు విచారించి, శివుడు, స్వయంగా ఏది చేస్తే అది చేయని (127) ఈ విధముగా వైవస్వత పురమందు యముడు మొదలుగా అందరు చిత్రగుప్తాదులు ఆలోచించి ఈమెను వదిలారు. ఈమె భూమి పై పడింది (128) తొలుత ఈమె శివ నామాన్ని అసతి ఐ ఉండి ప్రమాదవశాత్తు పలికిందో దానివల్ల ఇప్పుడు ఆ గొప్ప నుకృతంతో తిరిగి శివుని యొక్క బిల్వాంకు రారాధన పుణ్యాన్ని పొందింది. (129) శ్రీగోకర్ణ మందు శివతిథి యందు ఉపవసించి శివుని తల పై బిల్వార్చణ చేసి ఈమె జాగారణం చేసిందా రాత్రి (130) కోరిక లేకుండానే చేసిన పుణ్యానికే ఏ ఫలముందో దానిని అమె ఈ వేళ నీవు చూస్తుండగా అనుభవిస్తోంది. అబద్ధం కాదు (131) గౌతముని వచనము - అని పలికి ఆ శివదూతలు ఆ చండాల యోని నుండి ఉపలేశాన్ని తీసుకొని దివ్యతేజస్సుతో కలిపారు (132) ఆ దీవ్య దేహంతో కలిసిన తేజోరాశితో వెలిగిపోయే ఆమెను ఆ శివకింకరులు ప్రీతులై విమానంలో ఉంచారు (133) ఇక ఆమె పరమ ఉదారమైన రూపలావణ్యములు గలది, దివ్యభూషణములలో వెలిగే శరీరంగలది, దీవ్య అంబరముల ధరించేది (134) దివ్య గంధముగల దివ్య తేజస్సుతో ప్రకాశించే దేహంతో, దివ్యమైన మాలలు తలలో గలిగి విమానంలో వెళుతూ ఆమె ప్రకాశించింది. (135) రత్నచత్రము పతాకాదులతో గీతవాదిత్రని స్వనములతో ఆపరానన శివదూతల మధ్యలో ఆమె ఆనందిస్తూ (136) అనుభవించిన జన్మలను మాటిమాటికి స్మరిస్తూ స్మరిస్తూ భయపడి, భయపడి ధృడమైన ఆశ్చర్యాన్ని చూచి స్వప్నం లోవలె లేచి (137) నేనెవరు, మీరెవరు మహానదులు, ఈ అందమైన లోకమేది, నా శరీరం ఎక్కడికి పోయింది, చండచండాల గోత్రజమైన కష్టమైన శరీరమేది (138) మాయా విలాపం వల్ల కలిగిన గొప్ప ఆశ్చర్యాన్ని చూచాను. నాజన్మ సహస్రములలో మాటిమాటికి తిరిగింది (139) ఓహో! ఈశ్వరపూజా మాహాత్మ్యము ఆశ్చర్యాన్ని కల్గించేది. పత్రమాత్రంతో సంతుష్టుడై ఎవరు తన స్థానాన్ని ఇచ్చారో (140).    

తా ॥ అని వైరాగ్యము కలిగిన భగవత్పదమును స్మరిస్తున్న ఆమెను వారు దేవ విమానము పై ఎక్కించి అ మహేశ్వర కింకరులు (141) అందరు లోకేశులు ఆశ్చర్యంతో చూస్తుండగా ఆమెను ఆహ్వానించి పరమేశ్వర సన్నిధికి తీసుకెళ్ళారు (142) ఓరాజ! గిరిజాపతి యొక్క గొప్ప ఆశ్చర్యమును చెప్పాను. భక్తి లేశము యొక్క మాహాత్మ్యము అన్ని పాప నమూహములను నశింపచే సేది (143) రాజిట్లన్నారు - ఓ భగవాన్ ! పరమేశుని యొక్క ఏ లోకము ఉత్తమమైంది. నా మీద మీకు దయ ఉంటే దాని లక్షణాన్ని నాకు చెప్పండి (144) అని అనగా గౌతములిట్లన్నరు - బ్రహ్మాది సురనాథుల లోక మందును దుర్లభ మైనట్టి ఆనందము ఎల్లప్పుడు ఎక్కడుంటుందో ఆ లోకము పరమేశ్వరము (145) అంతా ఆధికం గానే ఉంటుంది. అక్కడ జ్యోతి ప్రతిష్ఠింపబడింది. అక్కడ చీకటి యోగంలేదు. అదే పారమేశ్వర లోకము (146) గుణవృత్తిని దాటి యోగులు ఎక్కడికి వచ్చారో, తిరిగి అందులో పడరో అదే పరమేశ్వర లోకము (147) లోభ క్రోధ మదాదులు ఎక్కడ ఉండవో, జవాది అవస్థలు ఎక్కడ లేవో అదీ పరమేశ్వర లోకము (148) నిగమములన్నింటికి ఏది ఒకే క్షేతంగా చెప్పబడుతుందో, ఏ దానికంటే ఉత్తమమైన ధనము లేదో ఆ పదమే పరమేశ్వరము (149) ప్రత్యాహార, ఆసన, ధ్యాన, ప్రాణనం యమవాదులతో యోగమార్గములతో యోగులు సదా పొందటానికి ఎక్కడ ప్రయత్నిస్తారో (150) ఎక్కడ దేవుడు ఎల్లప్పుడు ఆనంద విరల జన రూపంలో ఉంటాడో దేవితో సహ క్రీడిస్తూ ఉంటాడో ఆ లోకము పరమేశ్వరము (151) అనేక వేల కొలది జన్మలలో కూర్చుకున్న పుణ్యరాశులతో పురుషులు స్త్రీలు అధిరోహించి అంతా కలిసి ఎక్కడ ఆడుకుంటున్నారో (152) అధికమైన కాంతి గలిగి, మనోరమమైన తేజోరాశి యందు మునిగిపోయి అహోరాత్రముల ఉనికిని ఎవ్వడూ గుర్తించరో(153) అది పరమేశుని లోకము. కుయోగులకు అది దుర్లభము. భక్తి మపూర్శలైన వారెవరో వారే దానిని పొందుతారు (154) ఎవరు ఆ కథా శ్రవణ కీర్తనములతో ఆనందం కలిగిన వారైనారో, ఎవరు సర్వభూతములకు స్నేహితులో, శమమందు నిష్ఠగలవారో, సంసార చక్రమును దాటి, మోహం తొలగినవారై వారు శంకర పదవిని పొంది సుఖంగా ఆనందిస్తారు (155) అట్లాగే ఓ రాజేంద్ర! నీవు కూడా గిరీశుని ఆలయమైన గోకర్ణమునకు వెళ్ళి, పాపముల సమూహమును తగ్గించుకొని కృతకృత్యత్వాన్ని పొందు (156) అక్కడ అన్ని కాలములలో స్నానముచేసి మహాబలుని పూజించి శివచతుర్దశి యందు చక్కగా ఉపవాసంచేసి (157) రాత్రిపూట జాగరణ చేసి, బిల్వములతో శంకరుని పూజించి, అన్ని పాపముల నుండి ముక్తుడవై శివలోకాన్ని పొందుతావు (పొందు). (158) ఒరాజ! స్వచ్ఛమైన ఈ ఉపదేశాన్ని నేను నీకు చేశాను. నీకు మేలుజరుగని. మిథిలాథిపతి నగరానికి నేను వెళ్తాను (159) అని పోయివస్తానని చెప్పి ప్రతితో గౌతమముని మిథిలకు వెళ్ళాడు. ఆ రాజుకూడా ఆనందించి గోకర్ణమునకు చేరుకున్నాడు (160) అక్కడ మహాదేవునిచూచి స్నానంచేసి మహాబలుని పూజించి, పాపములన్ని తొలగినవాడై శంభువి, పరమైన స్థానాన్ని పొందాడు (161) ఈ కథను ఎవరు నిత్యం వింటారో, శివసంబంధమైన మనోహరమైన కథను భక్తితో వినిపిస్తారో ఆతడు పరమమైన స్థానమునను వెత్తాడు (162) శ్రద్ధతో ఈ కథను ఒకసారి విన్నవాడైనా ఇరువది ఒక్కమంది కులజులతో పాటు శివలోకాన్ని పొందుతాడు (163) శ్రేయస్సుల కన్నింటికి తొలి భీజమైన, నూ రుపుట్టుకలలోని పాపములను నశింపచేసేది, మోహాంధకారమును నశింపచేసేది ఈ చరిత్ర, దేవతలు దీన్ని పాడుతారు. మన్మథుని శత్రువైన శివుని కథ ఇది. ఉదారమైన ఈ కథను క్షేమంగా ఉన్న లోకులైనా ఎల్లప్పుడూ సేవించాలి. అని ఈ కథనంతా చెప్పాను (164) అని ఇది శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన ఆహార ఖండమందు శివచతుర్దశి గోకర్ణ మాహాత్మ్య వర్ణన మనునది మూడవ అధ్యాయము.