స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని బ్రహ్మోత్తర ఖండము
21 అధ్యాయము
తా ॥ సూతునివచనము - అని బ్రహ్మర్షి చెప్పిన అమృత సన్నిభమైన వార్తను విని రాజు ఆనందపడి చేతులు జోడించి ఇట్లన్నాడు - (1) రాజువచనము - ఓహో వనసహవాసము పురుషులను సమస్త పాపముల నుండి శుద్ధిచేస్తుంది. కామక్రోధ ములను చంపేది. జనములకు ఇష్టాన్ని కూర్చేది. (2) సామాయాతమము నష్టమైంది. జ్ఞాన దృష్టి ప్రకాశించింది. నీదర్శన మాత్రంతో అమరోత్తమ ప్రాయుణ్ణైనాను. (3) ఈ బాలుల పూర్వ చరిత్రను బాగా విన్నాను. ఓ ముని! భవిష్యత్తులో గూడా నా పుత్రుని చరిత్రను వినదలిచాను (4) ఇతని ఆయుస్సు ఎంతకాలము, ఈతని భాగ్యాన్ని చెప్పండి. విద్య కీర్తి శక్తి, శ్రద్ధ భక్తి ఎలాంటివి (5) ఓ ముని! ఇవన్నీ పూర్తిగా మీరు చెప్పండి. నీ శిష్యుణి, భుృత్యుణి, నిన్ను శరణువేడాను. (6) అనగా పరాశరుని వచనము - చెప్పరానిది ఏదైనా ఉంటే దాన్నెట్లా చెబుతాను. దాన్ని విని ధైర్య వంతులైన జనులు కూడా విషాదాన్ని పొందుతారు. (7) ఐనా అబద్ధం లేకుండా మనస్ఫూర్తిగా అడిగే మీకు స్నేహం వల్ల చెప్పకూడనిది కూడా చెప్తాను ఓరాజ, (8) ఈ నీకుమారునికి పన్నెండు సంవత్సరాలు గడిచాయి. ఇకముందు ఏడవరోజున మరణిస్తాడు (2) అనే ఆతని మాటను కాలకూటం లాటి దాన్ని విని మూర్ఛపోయి దుఃఖిస్తూ రాజు భూమి పై పడ్డాడు. (10) ఆతనిని లేపి ఓ దార్చి కరుణతో ఆ ముని ఇట్లన్నాడు. భయపడొద్దు. ఓ నృపతీ! నీకు హితం బోధిస్తాను. (11) సృష్టికన్న ముందు, నిరాలోకము, నిష్కలము, వరమైనది. ఒకటి చిదానందమయమైన జ్యోతి అదే తొలిది అది కేవలం శివుడే (12) అతడి తొలుత రజో రూపుడైన బ్రహ్మను తననుండి సృష్టించి, ఆతనిని దృష్టియందు ఏర్పరచి అతనికి వేదాలను ఇచ్చాడు (13) తిరిగి ఈశుడు ఆత్మ తత్వ సంగ్రహమును ఇచ్చాడు. సర్వోపనిషతల సారాన్ని రుద్రాధ్యాయాన్ని ఇచ్చాడు (14) ఒక్కటే, అవ్యయము పాత బ్రహ్మజ్యోతి, ననోతనము, శివాత్మకము పరతత్వము రుద్రాధ్యయ నందుంది (15) ఆ ఆత్మభువు, విరాట్టు నాల్గు వదనములలో విశ్వాన్ని నృజించాడు. లోకముల స్థితికొరకు నాల్గువేదములను సృజించాడు (16) యుజ్ఞముల మధ్యలో బ్రహ్మయొక్క దక్షిణముఖంనుండి అశేష ఉపనిషత్తుల సారము రుద్రాధ్యాయము వచ్చింది(17)
తా ॥ ఇది మునులందరితో మరీచి అత్రి మొదలగువారితో దేవతలతో ధరించ బడింది. వారు తమ శిష్యులకు చెప్పారు. (18) వారి శిష్యులతో వారి పుత్రులతో క్రమంగా వచ్చిన వారితో ఈ రుద్రాత్మకవేద సారము ధరించబడింది. వారికి ప్రసాదించారు. (19) ఇదే పరమమంత్రము. ఇదే పరమతవము. రుధ్రాద్యాయ జపము పురుషులకు కైవల్య సాధకము (20) మహాపాతకులు, ఉపపాతకులు ఎవరైనా దీనిని చదివినవారు జపించిన మాత్రం చేత వెంటనే వారు ఉత్తమ గతికి చేరుతారు (21) బ్రహ్మసత్ అనత్ మిత్రయోనులను సృష్టించాడు. దేవ తిర్యక మనుష్యులు మొదలగు వారిని సృష్టించాడు. దానితో ఈ జగత్తు సంపూరిత మైంది. (22) తమ జన్మకు అనుగుణ మైన కర్మలు వారికి సృష్టించాడు. లోకులు ఆ కర్మ లాచరిస్తున్నారు. అ ఫలితమను భవిస్తున్నారు. (23) లోకసృష్టి నడిచే కొరకు ప్రజా ప్రతి స్వయంగా తన వక్షస్థలము నుండి, వృష భాగంనుండి ధర్మా ధర్మములను సృష్టించాడు. (24) ధర్మాన్నే అనుసరించిన వారు దాని ఫలాన్ని పుణ్యాన్ని పొందుతారు. అధర్మ మాచరించేవారు పాపఫలాన్ని అనుభవిస్తారు. (25) పుణ్యకర్మలఫలము స్వర్గము. పాప మునకు ఫలము నరకము. వాటికి బ్రహ్మ ఇద్దరు అధిపులను ఏర్పరచాడు వారు ఇంద్రుడు, యముడు (26) కామ క్రోధ లోభ మద మాసాదులు ఇతరములు అధర్మమునకు మతులు అంతా నరకనాయకులు (27) గురుతల్ప గమనము సురాపానము ఆట్లాగే చండాల స్త్రీ గమనము వీరు కామమునకు సంతానము ప్రధానంగా చెప్పబడ్డారు (28) క్రోధంవల్ల పితృ వధ పిదప మాతృవధ ఒక కన్య బ్రహ్మహత్య వీరు క్రోధమునకు సంతానము (29) దేవస్వహరణము, బ్రహ్మస్వహరణము, స్వర స్తేయము వీరు లోభమునకు సంతానము అని చెప్పబడ్డారు (30) యముడు ఈ చండాలురను పాతక నాయకులను పిలిచి న రథవృద్ధి కొరకు ఆధిపత్యం ఇచ్చాడు (31) యముని ఆజ్ఞ పొంది ఈ తొమ్మిది మంది, పాతకనాయకులు (32) తమ భృత్యులు ఉపపాతకులతో కూడిన రతాన్ని పాలించసాగారు. కైవల్య సాధన మైన రుద్రాధ్యాయం భూమికి వచ్చాక (33) ఈ పాతకనాయకులంతా భయపడి పరుగెత్తారు. ఇతర ఉపపాతకములతో కూడి యమునకు విజ్ఞాపన చేశారు. (34) ఓ దేవ! మహారాజ మీకు జయము. మేము నీ బంట్లము. నరకవృద్ధి కొరకునీవు మమ్ములను సాధికారులను చేశాను. (35) ఇప్పుడు మేము లోకంలో ఉండటానికి అవనరుల మైనాము. ఓ ప్రభు. రుద్రాధ్యాయ అనుభావంతో విశ్శేషంగా దగ్ధులమైనాము. పరుగెత్తాము (36)
తా ॥ ప్రతి గ్రామ మందు నదీ కూలమందు పుణ్య ఆయతనములందు రుద్ర జవులు వ్యాపిస్తే లోకంలో ఎట్లా తిరుగాలి మేము (37) ప్రాయశ్చిత్త సహస్రములను ఇంకా లెక్కించటంలేదు. రుద్రజపమందలి అక్షరములనే సహించుటకు అనమరులమైనాము. (38) లోకములను చంపే మహాపాతక ముఖ్యులమైన మాకు రుద్రణవము గొప్ప ఘోరము భయము రుద్ర జపము పెద్ద విషము (39) భరించరాని ఘోర విషమిది ఇదీ మాకు పెద్ద వ్యసనము. రుద్ర జపం వల్ల వచ్చిన దానిని తొలగించ గల వాడివి నీవే (40) అని పాతకనాయకులు యమునితో చెప్పగా యముడు బ్రహ్మ దగ్గరకు వచ్చి అతని కంతా చెప్పాడు (41) ఓ దేవ దేవ ! జగన్నాథ ! నిన్నే శరణు వేడాను. పాప మాచరించిన వారిని నరులను గ్రహించేందుకు నీవు నియమించావు. (42) ఇప్పుడు భూమిలో పాపియైన నరులు లేరు. పాతక సమూహమంతా రుద్రాధ్యాయంతో నాశనమైంది (43) పాతకుల సమూహం నశించాక నరకం శూన్యమైతే నా రాజ్యమే నిష్పలము (44) అందువల్ల ఓ భగవాన్! మీరే ఉపాయ మాలోచించాలి. నరుల పైన స్వామిత్వము పోకుండా చూడండి (45) యముడు బాధ పడుతూ ఇట్ల బ్రహ్మతో చెప్పగా రుద్ర జడులకు విఘాతం కల్గించే కొరకు ఉపాయాన్ని కల్పించాడు (46) అ విద్యకు ఇద్దరు సంతానము దుర్మధ, అశ్రద్ధ అని (ఆడ) శ్రద్ద మేధలకు విఘాతం కల్గించేవి. వీటిని నరుల పై వదిలాడు (47) వారితో లోకం మోహాన్ని పొంది, రుద్రాధ్యాయం నుండి జనులు పరాజ్ ముఖులు కాగా యముడు తన నివాసానికి వచ్చి తాను కృతార్థుడైనట్లు భావించాడు (48) పూర్వజన్మ పాపములతో నరులు అల్పాయుషు లౌతారు. రుద్రాన్ని జపించే నరులకు ఆ పాపాలు నశిస్తాయి (49) అన్ని పాపాలు నశిస్తే దీర్ఘాయువు బలము, ధృతి, ఆరోగ్యము, జనము ఐశ్వర్యము అన్ని ప్రాణులకు పెరుగుతాయి. (50) రుద్రాధ్యాయంతో మహేశ్వరునికి అభిషేకం చేసేవారు ఆ నీటితో స్నానం చేస్తే వారు మృత్యువును దాటుతారు (51) రుద్రా ధ్యాయంతో జపం చేసిన నీటితో స్నానం చేసిన వారికి మృత్యు భయంలేదు. వారు శివలోకంలో వెలుగొందుతారు. (52) శతరుద్రాభిషేకంతో నరుడు శతాయుడౌతాడు. అశేష పాపముల నుండి ముక్తుడై శివునకు ప్రీతిపాత్రుడౌతాడు (53).
తా ॥ నీ పుత్రుడు రుద్రంలో పదివేల స్నానాలు చేయని. ఈ భూమిపై ఇంద్రుని వలె పదివేల సంవత్సరాలు ఆనందిస్తాడు (54) ఎదురులేని బలము, ఐశ్వర్యము కలవాడై శత్రువులు నశించిన వాడై అమయములు లేని వాడై, పావ ఓ ఘములు నశించిపవాడై రాజ్యాన్ని ఎదురు లేకుండా శాసిస్తాడు (55) విప్రులు వేదవిదులు, శాంతులు కృతకృత్యులు, ప్రశంసింపబడిన వ్రతం కలవారు, జ్ఞాన యజ్ఞ తపోనిష్ఠులు శివభక్తి పరాయణులు (56) ఔతారు. విమలమైన, మనస్సులో రుద్రా ధ్యాయజపాన్ని బాగా చేయని. వారి జీవ మహత్తు వల్ల వెంటనే శ్రేయస్సు కలుగుతుంది. (57) అని చెబుతున్న ఆ మునినే ఆ రాజు, తన మొదటి క్రియాగురువుగా భావించాడు. ఇంకా ఇతరమైన ధనాశ లేని వేల కొలది మునులను క్షణంలో ఆవాహనచేశాడు (58) ఆ విప్రులు శాంత మనస్సుల వారు వేయిసంఖ్య గలిగినవారు నూరు కలశముల స్థాపించి, అందు పుణ్య వృక్షములరవనుంచి (59) ఆ రాకుమారుని రుద్రాధ్యాయంలో స్నానం చేయించి ఏడవ రోజు రాగా విధి ప్రకారము స్నానం చేయించారు (60) మునిజనులు స్నానంచేస్తుండగా ఆ రాకుమారుడు అకస్మాత్తుగా భయపడి క్షణంలో మూర్ఛ పోయినాడు. (61) త్వరగా ఆతడు లేచి మునులు రక్షణ చేయగా ఇట్టన్నాడు. దండ హస్తుడైన ఒక పురుషుడు వచ్చి (62) నన్ను కొట్ట దలిచాడు శ్రీ మదండం గలవాడు, భయానకుడు. ఆతడు కూడా ఇతరులైన మహా వీరులైన పురుషులలో కొట్ట బడ్డాడు. (63) పెద్దపాశంతో కొట్టబడి దూరంగా తీసుకపోబడ్డట్టు ఐనాడు. మీలో రక్షింపబడుతు ఇంత మాత్రం నేను చూచాను. (64) ఇట్లా పలికిన రాకుమారుని బ్రాహ్మణులు ఆశీర్వాదములతో పూజించారు. భయాన్ని రాజకు తెలిపారు (65) ఆ రాజశ్రేష్ఠులైన ఋషలందరిని దక్షిణలతో పూజించి భక్తి పూర్వకముగా మంచి భోజనంతో భుజింప చేసి (66) ఆ బ్రహ్మ వాదులమునుల ఆశీర్వాదాన్ని తీసుకొని భక్తితో, బంధుజనులతో కూడి సభలో కూర్చున్నాడు (67) వీరుడైన రాజ మునులతో పాటు రాగా మహా యోగి, దేవర్షి వారిదుడు స్వయంగా వచ్చాడు (68) మునుల కు గురువైన, వచ్చిన ఆ నారదుణ్ణి మునీందులలో అఖిలసదస్సులతో పాటు రాజు చూచి భక్తితో సమస్కరించి పీఠమందు కూర్చోబెట్టి ఉపచారములు చేసి రాజిట్లన్నాడు (69) రాజువచనము - ముల్లోకములలో అద్భుతమైనది మీరు చూచింది ఏది దాన్ని మాకు చెప్పండి. మేమంతా మీ వాత్యామృతమందు లాలసులముగా ఉన్నాము. అని అనగా (70) .
తా ॥ నారదునివచనము - నేను ఆకాశంనుండి దిగుతుండగా ఒక మహావిచిత్రాన్ని చూచాను. ఈ ముని పుంగవులతో పాటు దానిని విను ఓ మహారాజ ! (71) నీ కొడుకును చంపటానికి ఈ వేళ మృత్యువు ఇక్కడికి వచ్చాడు. దండహస్తుడు దురాధరుడు. ఎల్లప్పుడూ లోకాలను బాధ పెట్టాడు (72) ఈశ్వరుడు కూడా నీ కొడుకును చంపటానికి ఈతడు వచ్చాడని తెలిసి తన పక్కనున్న వారితో పాటు ఒక వీరభద్రుని ప్రేరేపించాడు (73) ఆతడు వచ్చి నీ కొడుకును హఠాత్తుగా చంపటానికి వచ్చిన యముని పట్టుకొని గట్టిగ బంధించి కోపంతో దండంతో కొట్టాడు (74) జగదీశుని సన్నిధికి తనను తీసుకుపోతున్నట్లు యముడు త్వరగా తెలుసుకొని ఆతడు చేతులు జోడించి ఓ దేవ ! నీకు జయము. అని పలుకుతూ తలవంచి నమస్కరిస్తూ శూలంగల వారితో ఇట్లన్నాడు (75) యముని వచనము - దేవదేవ ! మహారుద్ర వీరభద్ర నీకు నమస్కారము. తప్పులేని నాపై మీకు కోపం ఎట్లా కలిగింది (76) తన కర్మ ననుసరించి చనిపోయిన రాజపుత్రుని కొట్టడానికి సిద్ధపడ్డ మృత్యువు దేమి తప్పో చెప్పు (నాది) ఓ ప్రభు (77) అనగా వీరభద్రుని వచనము - ఆరాజు - తనయుని వయస్సు పదివేల సంవత్సరాలు. రుద్ర స్నానంతో అతని అశుభమంతా పోయింది. ఎట్లా విపత్తి కలిగి ఉంటాడు (78) నీకు సందేహ ముంటే వంసందేహం లేని వాక్యాన్ని, గూర్చి చిత్రగుప్తుని పిలిచి ఈ వేళే అడుగు ఆలస్యం చేయద్దు. (79) అనగా నారద వచనము - యముడు చిత్ర గుప్తుని పిలువగా అతడు వచ్చాడు. నీ కొడుకు ఆయుః ప్రమాణాన్ని అడుగగా ఆతడిట్లన్నాడు (80) అతని ఆయుస్సు పన్నెండు సంవత్సరాలు అని పలికి మరి ఆలోచించి వ్రాసినదాన్ని చూచి పదివేల సంవత్సరాలు అనిచెప్పాడు (81) యముడు భయపడి వీరభద్రునకు నమస్కరించిగా దుర్వార బంధము నుండి మృత్యువును ఎట్లాగో విడిపించాడు (82) వీరభద్రుడు విడిచి పెట్టాక యముడు తన మందిరానికి వెళ్ళాడు. కైలాసానికి వీరభద్రుడు నేను నీదరికి వచ్చాము (83) అందువల్ల ఈ నీ కుమారుడు రుద్రజప ప్రభావంవల్ల, మృత్యుభయాన్ని దాటి, పదివేల సంవత్సరాలు సుఖవంతుడైనాడు (84) అని రాజుకు చెప్పి, పోయివస్తానని చెప్పి నారదుడు స్వర్గానికి వెళ్ళాక, విప్రులంతా ఆనందించి తమ తమ ఆశ్రమాలకువెళ్ళారు (85) ఈ విధంగా కాశ్మీరరాజు రుద్రాధ్యాయ ప్రభావంవల్ల అన్ని దుఃఖాలు దాటి పుత్రునితో పాటు కృతార్ధుడైనాడు (86) పరమేశ్వర మాహాత్మ్యాన్ని ఏ నరులు కీర్తిస్తారో ఈ మాహాత్మ్యాన్ని చెవులతో వింటారో, వారు జన్మ కోటులతో చేసిన పాప రాసుల నుండి విముక్తులై శాంతులై ఇందు మౌళియొక్క పరమ పదమును చేరుకుంటారు (87) అని శ్రీస్కాందమహా పురాణ ముందు ఏకాశీతి వహస్రనంతయందు తృతీయమైన బ్రహ్మోత్తరఖండ మందు రుద్రాధ్యాయమ హిమవర్తనమనునది ఇరుపది ఒకటవ ధ్యాయము (21).
