స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని బ్రహ్మోత్తర ఖండము
5 అధ్యాయము
తా ॥ సూతులిట్లన్నారు - శివుడు గురువు. శివుడు దేవుడు, శివుడు బంధువు. శరీరధారులకు శివుడు ఆత్మ శివుడు జీవము. శివుని కన్న మరొకటి లేదు (1) శివుని ఉద్దేశించి ఏ కొంచం దానం చేసిన జపం, హోమం చేసినా అది అనంత ఫలదమని చెప్పబడింది. అన్ని ఆగమములలో నిశ్చయింపబడింది (2) శివునకు భక్తితో పత్ర పుష్పమో, ఫలమో, జలమో ఇస్తే, అల్వాల్ప మైనా అది అనంతాన్నిస్తుంది. (3) సకలా గనుము లందు నిశ్చితమైన సకల ధర్మములను వదలి, శివుని భజించినవాడు అన్ని బంధనముల నుండి ముక్తు డౌతాడు (4) తన కొడుకు యందు ఎంత ప్రీతో, భార్య యందు ధనమందేంత ప్రీతో అంత ప్రీతి శివ పూజ యందు చూపిస్తే శివుడు రక్షిస్తాడు. అనే దానిలో ఆశ్చర్యమేముంది. (5) అందువల్ల కొందరు మహాత్ములు అన్ని విషయములను నుత్తు పదార్థాలను శివపూజ కొరకు విడిచి పెడ్తారు. దుస్త్యజమైన తమ దేహాన్ని విడుస్తారు (6) శివుని స్తుతించే నాలుకే నాలుక శివుని ధ్యానించే మనస్సే మనను. శివుని కథను విసడంలో ఆసక్తి చూపే చెవులే చెవులు. అతనిని పూజించే చేతులే చేతులు (7) ఆతనిని చూచే కళ్ళే కళ్ళు పూజ యందు శివునకు నమస్కరించే శిరస్సే శిరస్సు. శివ క్షేత్రములు భక్తితో తిరిగే పాదములే పాదములు (8) ఎవని ఇంద్రియములన్ని శివ కర్మలందు ఉంటాయో ఆతడు సంసారం నుండి ముక్తుడౌతాడు భుక్తిని ముక్తిని పొందుతాడు (9) శివభక్తి కలిగిన మర్త్యుడు కాని చండాలుడు కాని ఆడది కాని మగవాడు కాని షండుడు కాని వెంటనే సంసారం నుండి ముక్తులౌతారు (10) కులంతో కాని ఆచారంతో కాని శీలంతో కాని గుణంతో కాని పనిలేదు. శివుని యందు భక్తిలేశ మాత్రమే నా కల్గినవాడు ప్రాణులందరి నమస్కరించ తగినవాడు (11) ఉజ్జయినిలో చంద్ర సేనుడను రాజు ఉండేవాడు. ఇంద్రుడే రెండవ రూపంలో మానవ రూపంలో జన్మించాడా అన్నట్లుండేవాడు (12) ఆ పురంలో ఉండే మహాకాల పరమేశ్వరుని ఈ చంద్రసేన రాజు భక్తితో పూజించేవారు (13) ఆ రాజునకు నఖుడుగా శివ పరిషత్తు యందలి శ్రేష్ఠుడు ఉండేవాడు. జీతాభద్రుడు మణిభద్రుడు అందరిచే నమస్కరింపబడేవాడు (14) ఆ రాజునకు శంకరానుగుడైన మణిభద్రుడు ప్రసన్నుడై ఆ మహామతి దివ్యమైన చింతామణి నిచ్చాడు (15) ఆ మణి కౌస్తుభమణి వలె ప్రకాశిస్తోంది. సూర్యునిలా వెలుగుతోంది. దాన్ని చూచినా, దాని గూర్చి విన్నా, దాన్ని ధ్యానించినా అది మనుష్యుల ఆలోచనలను తీర్చేది (16) దాని శాంతి లేశము తగులగానే కాంస్యము రాగి రూపంగా ఉన్నది. రాళ్ళు మొదలగునవి ఇతరమైనవి. వెంటనే బంగారముగా మారసాగాయి (17) ఆ చింతామణిని ఆరాజు కంఠమందు కట్టుకొని సింహాసనము దగ్గరకు వెళ్ళాడు. రాజు దేవతల మధ్యలో సూర్యునిలా వెలుగసాగాడు (18) ఎప్పుడూ కంఠమందు చింతామణిని ధరించే రాజును గూర్చి విని పెరిగిన తృష్ణ కలవారై రాజులందరు హృదయ క్షోభగలవారైనారు (19) స్నేహంతో కొందరు అడిగారు రత్నాన్ని. కొందరు దుర్మదులు దాఁర్ష్ట్యంతో అడిగారు. మత్సరం గల ఆ రాజులు ఆ మణి దైవలబ్ధమని గ్రహించలేదు (20).
తా ॥ రాజులందరి యాచనను ఈ రాజు వ్యర్థం చేశాక, అన్ని దేశాల రాజులు అప్పుడు హడావిడి చేశారు. (21) సౌరాష్ట్రులు, కైకయులు, శాల్వులు, కలింగ శకమద్రకులు పాంచాల అవంతి సౌవీరులు మాగధ మత్స్య సృంజయులు (22) వీరు ఇతరులైన రాజులు, గుఱ్ఱములు రథములు, ఎనుగు సైన్యం కలవారై చంద్ర సేనుని యుద్ధంలో జయించటానికి పరాక్రమంతో ఉద్యమించారు (23) వారంతా చక్కని సంరంభము కలవారై భూమిని కంపింప చేస్తూ అధిక సైన్యం కలవారై ఉజ్జయినీ యొక్క నాల్గు ద్వారాలను అడ్డగించాడు (24) ఉద్ధతులైన రాజులు తన వట్టణాన్ని అడ్డగించటాన్ని రాజు చూచి ఆ చంద్ర సేనుడు ఆ మహాకాలునే శరణు వేడాడు (25) నిర్వికల్పుడై నిరాహారుడై ఆ రాజు దృఢ నిశ్చయం గల వాడై రాత్రింబగళ్ళు, మరో ఆలోచన లేకుండా గౌరీశుని పూజించ సాగాడు (26) ఈ మధ్యలో ఆ పట్టణంలో ఉండే ఒక గోపిక ఒకే కొడుకు గలది, భర్త లేనిది చాలాకాలం అక్కడే ఉండి (27) ఆమె ఐదు సంవత్సరాల బాలుని తీసుకొని, భర్తలేనిది, రాజు చేసే గిరిజావతి పూజను చూచింది (28) అంతా ఆశ్చర్యకరమైన శివపూజా మహోదయమును ఆమె చూచి నమస్కరించి తిరిగి తన శిబిరానికి వెళ్ళింది (29) ఇదంతా ఏమీ వదలకుండా ఆ గొల్ల వనిత కుమారుడు చూచి విరక్తి నిచ్చే శివపూజను కుతూహలంతో ఆచరించాడు (30) శూన్యమైన శిబిరోత్తమం లోని అందమైన పాషాణాన్ని తెచ్చి తన శిబిరానికి కొద్ది దూరంలో శివ లింగాన్ని కల్పించాడు (31) తన చేతులతో ఏవో కొన్ని పూలు తెచ్చి, ఆ లింగానికి స్నానం చేయించి, భక్తితో పూజించాడు (32) గంధ అలంకార వస్త్రములను ధూపదీప అక్షతలు మొదలగు వానిని కృత్రిమంగా ఏర్పరచి దివ్యమైన నైవేద్యాన్ని కూడా కల్పించాడు (33) మనోరమమైన పత్రపుష్పములతో మరల మరల పూజించి, వివిధమైన నృత్యము చేసి తిరిగి తిరిగి నమస్కరించాడు. (34) ఈ రకంగా శివుని పూజిస్తున్న అనన్య మనస్కుడైన పుత్రుని ఆ గోపిక చూచి ప్రేమతో భోజనానికి పిలిచింది (35) అనేక సార్లు తల్లి పిలిచినా ఆతడు పూజయందే మనస్సు గలవాడై బాలుడు కూడా భోజనాన్ని ఇష్టపడలేదు. అప్పుడు తల్లే స్వయంగా వచ్చింది (38) శివుని ఎదుట కళ్ళు మూసుకొని కూర్చున్న ఆతనిని చూచి చేయి బట్టలాగింది. కోపంతో కొట్టింది (37) లాగినా కొట్టినా తన కొడుకు రాకపోతే ఆమె లింగాన్ని దూరంగా పారవేసి ఆ పూజను నాశనం చేసింది (38) హా హా! అని ఏడుస్తున్న తన కొడుకును భయ పెట్టి అప్పుడు ఆ గోపి కోపంతో తిరిగి తన ఇంట్లోకి వచ్చింది (39) తల్లి తన శివ పూజను పాడు చేయటం చూచి దేవ! దేవ! అని ఏడ్చాడు. ఆ బాలుడు పడిపోయాడు. (40) స్మృతి నశించి త్వరగా కన్నీరు దొరలగా స్మృతిని పొంది క్షణంలో కళ్ళు తెరిచాడు (41).
తా ॥ పిదప మణి స్తంభములతో వెలిగిపోతూ బంగారు ద్వారము తలుపులు తోరణము కలిగి, మహా యోగ్యమైన నీలమైన అమలమైన వజ్ర వేదిక గలిగి ఆ శిబిరమే శివాలయముగా మారింది (42) తపింప చేయబడిన అనేక బంగారు కలశములు విచిత్ర మైనవిగా కలిగి వెలిగిపోతున్న స్పటిక భవన ప్రదేశం వలె మనోహరమై రమ్యమైన ఆ శివపురమును, శ్రేష్ఠమైన పీఠం మధ్యలో రత్నములతో కూడిన లింగమును ఆ బాలుడు చూచాడు (43) ఆతడు చూచి త్వరగా లేచి భయము ఆశ్చర్యము కల్గిన మనస్సు కలవాడై పరమ ఆనంద సాగర మందు సంతోషంతో నిమగ్నుడైనట్లు (44) తెలుసుకొని శివ పూజ మాహాత్మ్యాన్ని తెలుసుకొని ఆ ప్రభావం వల్ల తన తల్లి యొక్క పాపశాంతి కొరకు దండము వలె భూమి పై బడి నమస్కరించాడు (45) ఓ ఉమావతీ! దేవ! మా తల్లి యొక్క దురితాన్ని క్షమించండి. మూడురాలైన తమను తెలుసుకొనని ఆమెను క్షమించి ఓ శంకర! నీవు ప్రసన్నుడవు కమ్ము (46) నీ భక్తివల్ల కలిగిన ఏదైనా పుణ్యము నాలో ఉంటే దానివల్ల కూడా, “శివ! నాతల్లి నీదయను పొందని (47) అని ప్రార్థించి గిరీశుని మాటిమాటికి నమస్కరించి, సూర్యుడు అస్తమించాక బాలుడు, శివాలయము నుండి వెళ్ళిపోయాడు (48) ఆ పిదప తన శిబిరాన్ని పురందరుని (ఇంద్రుని) పురంవలె ఉన్న దానిని చూచాడు. వెంటనే బంగారు మయమైన విచిత్ర వైభవముతో వెలగిపోతున్న దానిని చూచి (49) ఆతడు భవనం లోపలికి ప్రవేశించి ఆ రాత్రి ఆనందిస్తూ, మహామణి గణములతో నిండిన, బంగారు రాసులతో వెలుగుతున్న (50) భవనంలో తన తల్లిని, ఏ భయములేని దానిని, స్మరిస్తున్న దానిని, మహా విలువగల రత్నపర్యంక మందు తెల్లని పడకను అధివసించిన దానిని, (51) రత్న అలంకారములతో వెలిగిపోతున్న అవయవములు కలదానిని, దివ్యమైన వస్త్రములతో ప్రకాశిస్తున్న దానిని, దివ్య లక్షణములు కలదానిని, సాక్షాత్తు దేవతా స్త్రీవలె ఉన్నదానిని (52) చూచి వేగంగా సంభ్రమముతో విప్పారిన కళ్ళు గలవాడై, ఆమెను లేపసాగాడు. అమ్మ మేలుకో. నీవు క్షేమమే కదా. ఈ గొప్ప అద్భుతాన్ని చూడు (53) అని మహాత్ముడైన తన పుత్రునితో మేల్కొలుప బడ్డదీ ఆ గోపిక. ఆ తల్లి నవ్వుతోంది. కిరీటంతో వెలిగిపోతుంది. ఆమెను చూచాడు. (54) ఆమె త్వరగా లేచి అదంతా చూచింది. తాను అపూర్వంగా కన్పించింది. బాలురుడు కొత్తగా కన్పిస్తున్నాడు (55) తన ఇల్లు కొత్తగా కన్పిస్తోంది. ఇదంతా చూచి సుఖంతో విహ్వలురాలైంది. పుత్రుని ముఖం నుండి శివుని అనుగ్రహం అంతా విని (56) నిరంతరము శివుని ఆరాధించే రాజుకు తెలిపింది. నియమాన్ని పూర్తిచేసి ఆ రాత్రి ఆ రాజు త్వరగా వచ్చి (57) శివుని సంతోష పెట్టిన గోపకుమారుని ప్రభావాన్ని చూచాడు. శివుని స్థానము బంగారుమయమైంది. లింగము మణులతో కూడింది (58) అట్లాగే గొల్ల స్త్రీ యొక్క, మాణిక్య శ్రేష్ఠములతో వెలిగే ఇంటిని అంతా చూచి రాజు మంత్రులు పురోహితులు (59) కొద్ది క్షణాలు ఆశ్చర్యపడ్డారు. రాజు పరమానంద భరితుడైనాడు. ఆనందంతో (ప్రేమ) కన్నీళ్ళు వదులుతూ ఆ పిల్లవానిని కౌగిలించు కున్నాడు. (60) ఇట్లా అత్యద్భుతమైన శక్తిగల శివమహత్మ్యాన్ని కీర్తించినందు వల్ల పౌరుల సంభ్రమము తోను ఆ రాత్రి ఒక పండుగలా గడిచింది (61).
తా ॥ పిదప ఉదయ మందు యుద్ధం కొరకు పట్టణాన్ని అడ్డగించి ఉన్నారు. రాజులు చారుల ద్వారా పరమ అద్భుతాన్ని విన్నారు (62) ఆ రాజులు వైరాన్ని విడిచి త్వరగా, అతిగా చకితులై, శస్త్రములు పారవేసి, చంద్ర సేనునితో అనుజ్ఞ పొంది నగరంలో ప్రవేశించారు (63) అందమైన నగరంలో ప్రవేశించి మహాకాలునికి నమస్కరించి ఆ రాజులంతా ఆ గొల్ల స్త్రీ గృహమునకు వచ్చారు (64) అక్కడ చంద్ర సేనుడు ఎదుర్కొని వారిని పూజించాడు. చాలా విలువైన ఆసనము లందు కూర్చుండి, ప్రీతితో చాలా ఆశ్చర్యంతో కూడి ఆనందించారు. (65) గోప కుమారుని పై అనుగ్రహంతో ఆ శివాలయము ఏర్పడింది. దాన్ని మహాలింగాన్ని చూచీ తమ బుద్ధిని శివుని యందు నిలిపారు (66) ఆ గోపకుమారుని పై ప్రేమ గలవారై ఆ రాజులంతా అతనికి ధనము, బంగారము రత్నములు గోమహిషములు మొదలగు ధనమును (67) ఏనుగులు, గుఱ్ఱములు రథములను బంగారు ఛత్రములు పల్లకి కప్పుకునేవాటిని దాసులను దానలను అనేకమైన వాటిని, శివుని కృపను యాచించినవారై ఇచ్చారు (68) అన్ని దేశములలో ఎక్కువగా ఏ ఏ గోపుమారులున్నారో వారందరికి ఈ గోవ బాలునే రాజుగా చేశారు, ఆ రాజులంతా కలిసి (69) ఇక ఇంతలో దేవతలందరితో పూజింపబడి, తేజస్వి వానరేశ్వరుడు హనుమంతుడు కన్పించాడు (70) అతని రాకతో రాజులంతా తొట్రు పాటు నొంది ఎదురేగి, భక్తితో వంగిన తమ తమ ఆకారము గలవారై నమస్కరించారు (71) వారి మధ్యలో కూర్చుండి హనుమంతుడు పూజింపబడ్డాడు. గోప కుమారుణ్ణి కౌగిలించుకొని రాజును చూచి ఇట్లా పలికాడు (72) అందరూ వినండి, రాజలు ఏ ఇతర ప్రాణులున్నారో, మీ కందరికి క్షేమకరము. శరీర ధారులు శివపూజ తప్ప మరో గతిలేదు (73) ఈ గోవసుతుడు అదృష్టవశాత్తు శనివారం ప్రదోష సమయ మందు శివుని మంత్రం లేకుండానే పూజించి మంగళమును పొందాడు. (74) శనివారం ప్రదోష సమయం లభించటము ప్రాణులకు దుర్లభము. అక్కడ కూడా తన వక్షంలో లభించటము ఇంకా దుర్లభ తరము (75) ఈతడు లోకంలో పుణ్యతముడు. గోవతుల కీర్తిని ఇనుమడింప చేసేవాడు. ఈతని వంశంలో ఎనిమిదవ వాడు నందుడను వాడు గొప్ప కీర్తి గలవాడు కలుగ బోతాడు. అతనికి పరాయణుడు స్వయముగా కృష్ణుడై పుత్రుడౌతాడు. (76) నేటినుండి నేడు ఈ లోకంలో గోపాల నందనుడు. శ్రీకరుడను పేరుతో లోకంలో గొప్పకీర్తిని పొందుతాడు (77) సూతుడిట్లన్నాడు - ఈవిధముగా అంజనీ సుతుడు ఆ గోపకుమారుని పలికి శివపూజా విధానాన్ని ఉపదేశించి అక్కడే అదృశ్యడైనాడు (78) ఆ రాజులంతా ఆనందించి పూజించారు చంద్రసేనునితో చెప్పి రాజులు వచ్చిన చోటికి వెళ్ళారు. (79) మహాతేజస్సు గల శ్రీకరుడు కూడా హనుమంతునితో ఉపదేశింపబడి, ధర్మమెరిగిన బ్రాహ్మణులతో కూడి శంభుని పూజచేశాడు (80) కొంతకాలానికి ఆ శ్రీకరుడు ఆ చంద్ర సేన రాజు శివుని భక్తితో పూజించి పరమ, పదమును చేరారు (81) ఇది పరమ రహస్యమైనది. పవిత్రమైనది. కీర్తినిచ్చేది, పుణ్యకరమైనది గొప్ప వృద్ధిని చేకూర్చేది. పాప సమూహమును నశింపచేసేది. గౌరి పాదాంబుజములందు భక్తిని పెంచేది. ఈ కథను మీకు చెప్పాను (82) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు మూడవదైన బ్రహోత్తర ఖండమందు గోపకుమార చరిత వర్ణన మనునది ఐదవ అధ్యాయము.
