స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని బ్రహ్మోత్తర ఖండము
13 అధ్యాయము
తా ॥ సూతులిట్లన్నారు - దశార్ణ అధిపతియైన మహా భుజుడైన ఆ వజ్రబాహనకు మగధరాజు బలవంతుడైన రాజు శత్రు వైనాడు (1) ఆతని పేరు హేమరథుడు. బాహుశాలి. రణోత్కటుడు. అనేక సైన్యంతో ఆవరించి ఆ బలవంతుడు దశార్ణమును అడ్డగించాడు (2) ఆతని, అణచ వీలులేని సైన్యాధిపతులు దశార్ణ దేశానికి చేరి వసు రత్నములను గ్రహించారు. ఇళ్ళను తగులబెట్టారు. (3) కొందరు ధనం స్వీకరించారు. కొందరు బాలురను కొందరు స్త్రీలను గ్రహించారు. కొందరు గోవులను స్వీకరించారు. కొందరు ధాన్యపు రాశులు గ్రహించారు. కొందరు ఆరాధాన్యములను గృహ ఉద్యానములను నశింపచేశారు (4) ఈ విధముగా ఆ రాజ్యాన్ని నశింపచేసి స్త్రీ, గోధనములను స్వీకరించ దలిచి ఆ వజ్రబాహు నగరిని మాగధుడు ఆవరించినాడు. (5) రాజు నర్యాకులమైన నగరాన్ని చూచి వజ్రబాహువు సైనికులతో కుడి త్వరగా యుద్ధానికి బయలుదేరాడు. (6) వజ్రబాహు రాజు మంత్రులతో కూడి మగధులతో యుద్ధం చేశాడు. శత్రువులను చంపాడు (7) వజ్రబాహువు, మహేష్వానువు పండ్లు కొరుకుతూ రథమందుండి బాణ వర్షములు విసురుతూ చాలా యుద్ధంచేశారు (8) యుద్ధం చేస్తున్న దశార్ణ రాజును చూచి యుద్ధ మందు ఎదురులేని వానిని చూచి మగధ సైనికులంతా ఆతనినే త్వరగా చుట్టుముట్టారు. (9) ధృఢ విక్రములైన మాగధులు బాగా యుద్ధంచేసి ఆ సైన్యాన్ని నశింపచేశారు. జయశ్రీని పొందారు. (10) కొందరాతని రధాన్ని విరిచారు. కొందరాతని ధనుస్సును వీరిచారు. ఒకడాతని సూతుని చంపాడు. ఇంకొకడు కత్తిని లాక్కున్నాడు (11) ఖడ్గ ధనస్సులు విరిగి, రథం విరగి సారధి చచ్చిన వానిని బలవంతంగా పట్టుకొని బలవంతులు నృపతిని కోపంతో బంధించారు (12) ఆతని మంత్రి గణాన్ని ఆతని సైన్యాన్ని జయించివారు, జయం కోరే మాగధులు ఆతని నగరంలో ప్రవేశించారు (13) అశ్వములను నరులను గజములను ఉష్ట్రములను పశువులను ధనమును గ్రహించారు. యువతుల నందరిని అందమైన కన్యతలను స్వీకరించారు (14) రాజుగారి మహిషులను (భార్యలు) వేలకొలదీ దాసీ జనాన్ని బంధించారు. రత్నములతో, నిండిన కోశాగారాన్ని ఆ ఆతతాయులు గ్రహించారు. (15) నగరిని నశింప చేసి స్త్రీ గోధనాదికమును హరించి వజ్ర బాహువును బలవంతంగా బంధించి రథమందుంచి వెళ్ళి పొయారు (16) ఇట్లా కోలాహలంగా దారుణంగా రాష్ట్రం నాశనం కాగా బలవంతుడైన భద్రాయువు రాజపుత్రుడు ఆ వార్తను విన్నాడు. (17) శత్రువులు బంధించిన తండ్రిని అవహరింపబడిన తల్లులను, నశించిన దశార్ణ రాష్ట్రమును గూర్చి విని సింహంవలె అరిచాడు (18) ఆతడు ఖఢ్గ శంఖములను తీసుకొని వైశ్యపుత్రుని సహాయం కలవాడై పళ్ళు కొరుకుతూ గుఱ్ఱాన్నెక్కి కుమారుడు జయకాంక్షతో (19) వేగంగా ఆ ప్రదేశానికి వచ్చి మాగధులతో నిండిన చోటికి వచ్చి, తగులబడిపోతున్న ఏడుస్తున్న, స్త్రీ నుత గోధనములు పొగొట్టుకున్న దానిని (20) రాజ జనమునంతా చూచి భయంతో మాన్యమైన రాజ్యాన్ని చూచి, క్రోథంతో నిండిన మనస్సుగలవాడై వేగంగా శత్రు సైన్యంలో ప్రవేశించి, చెవిదాకా ధనుస్సును లాగి బాణ పరంపరను వదిలాడు (21) రాజపుత్రుని బాణములతో ఆ శత్రువులను చంపుతూ ఉండగా, అతనికి ఎదురేగి వారు వేగంగా బాణములతో అధికంగా బాధించారు (22).
తా ॥ బాణ సమూహంతో యుద్ధ దుర్మదులు శత్రువులు కొడ్తుండగా శివవర్మతో (కవచం) రక్షింపబడి ధీరుడు రణంలో చలించలేదు. (23) అకర్షణను ఆతడు వహించి త్వరగా గజ విలానంతో ప్రవేశించి రథములను, ఏనుగులను, పదాతులను కూడా అధికంగా త్వరగా చంపాడు (24) సూతునితో కూడా ఒక యజమానిని చంపి ఆ రాకుమారుడు ఆ రథాన్నే ఎక్కి వైశ్యనందనుడు సారథి కాగా సింహము మృగకులంలో ప్రవేశించినట్లుగా ఆ ధీరుడు రణంలో సంచరించాడు. (25) ఇక అందరు సిద్ధమై ఆతురతతో శూరులు ధనస్సులు ధరించి బలశాలురైన సైన్యాధిపతులు ఆ ఒక్కనినే అనుసరించారు. (26) ఆ వస్తున్న వారి ఎదుట దారుణమైన ఖడ్గాన్ని ఎత్తి తన పౌరుషాన్ని చూపిస్తున్నట్లుగా ఆ మహావీరులను ఎదిరించాడు (27) కరాళుడైన అంతకుని జిహ్వలా ఉన్న ఆ ఖడ్గంము మహోజ్వలమైనది. దానిని చూస్తూనే ఆ ప్రభావంవల్ల ఆచమూపులు (సైన్యాధిపతులు) త్వరగా మరణించారు (28) రణాంగణ మందు వెలిగిపోతున్న ఆ ఖడ్గమును ఎవరెవరు చూస్తున్నారో వారంతా కీటకం వజ్రమును పొంది మరణించినట్లు మరణించారు. (29) ఇక ఈతడు సర్వ సైన్యముల వినశనం కొరకు ఈ మహాభుజుడు ఆకాశాన్ని నింపుతూ (ధ్వనితో) మహాధ్వనిగల శంఖమును పూరించాడు. (30) ఎక్కువ విషాక్తమైనట్లుగా ఉన్న ఆ శంఖనాదంను వినినంత, మాత్రంతో శత్రువులు మూర్ఛితులై భూమి పై పడినారు (31) గుఱ్ఱంపై కూర్చున్నవారు, రథమందు, ఏనుగు పైన ఉన్నవారు వారంతా క్షణంలో స్పృహ లేకుండా ఐ శంఖ నాదంతో కాంతి హీనులై పడిపోయారు (32) భూమి యందు పడిన, స్పృహలేని ఆయుధ పానులైన వారి నందరిని శవప్రాయులుగా భావించి ధర్మ శాస్త్రమెరిగిన ఆతడు చంపలేదు. (33) యుద్ధమందు బద్ధుడైన తన తండ్రిని విడిపించి, శత్రు వశగులైన ఆ రాజు భార్యలను అందరిని వెంటనే విడిపించాడు (34) మంత్రి ముఖ్యుల ఇతరులైన పుర శ్రేష్ఠుల భార్యలను, స్త్రీలను, బాలురను, కన్యలను, అనేకమైన గోధనమును (35) విడిపించి, వారిని శత్రు భయం నుండి ఓదార్చాడు. ఇక శత్రు సైన్యంలో తిరుగుతూ వారి స్త్రీలను పట్టుకున్నాడు (36) గాలివేగం, మనోవేగంగా గల గుణాలను, పర్వతములంత ఏనుగులను బంగారు రథములను, అందమైన దాసీలను (37) వేగంగా అంతా తీసుకొని ఆ ధనమును బాగా తీసుకొని పరాజితుడైన హెమరథ మందున్న మాగధేశుని బంధించాడు (38) ఆతని మంత్రులను రాజులను, ముఖ్య నాయకులను తీసుకొని త్వరగా బంధించి తొందరగా పట్టణంలో ప్రవేశించాడు (39) పూర్వం సమరంలో ఎవరు భగ్నమైనారో, అన్ని దిక్కులు పరుగెత్తారో ఆ మంత్రి ముఖ్యులు విశ్వాన పాత్రులైన నాయకులు తిరిగి వచ్చారు (40) రాకుమారుని పరాక్రమాన్ని చూచి అందరు ఆశ్చర్యపడిన మనస్సు గలవారై వారు ఆతనిని సురశ్రేష్ఠునిగా భూమికి వచ్చిన కారణ జన్మునిగా తలిచారు (41) అహో,మా, గొప్ప భాగ్యము. అహో, మా, తపః ఫలము. ఏదో రకంగా ఈతనితో చంపబడ్డవారు బ్రతికారుగదా (42).
తా ॥ ఈతడు యోగ సిద్దుడా, తపస్సిద్ధుడా, అమరుడా ఈతడు చేసిన ఈ గొప్పవని మనుష్య సాధ్యము కాదు (43) ఈతని తల్లి ఆ గౌరి, తండ్రి శివుడు కావచ్చు. తొమ్మిది అక్షౌహిణుల సైన్యాన్ని అనంత శక్తితో జయించాడు (44) అని ఆశ్చర్యం కలవారై ఆనందంతో పరస్పరము ప్రశంసిస్తున్నారు. అమాత్య జనులు అడుగగా ఈతడు తన గూర్చి ఉన్న దున్నట్లు చెప్పాడు. (45) విస్మయము ఆహ్లాదము అధికమై వచ్చిన, తన తండ్రికి ఆనంద బాష్పములను విడుస్తున్న తండ్రికి ప్రేమ విహ్వలుడై నమస్కరించాడు (46) ఆ రాజు, తన కొడుకు ప్రేమతో నమస్కరించగా త్వరగా గాఢంగా కౌగిలించుకొని ప్రేమ కాతరుడై ఇట్లన్నాడు (47) ఓ మహామతి! నీవెవరు దేవుడవా, మనుష్యుడవా, గంధర్వుడవా, నీ తల్లి ఎవరు, తండ్రి ఎవరు నీ దేశమేది వీ పేరేమి (48) శత్రువులు బంధించిన చచ్చిన వారివలె తేజోహీనులైన మమ్ములను, దయతో ఇక్కడికి వచ్చి శత్రువుల నుండి విడిపించావు (49) ఈ శౌర్యం నీకెట్లా కలిగింది. ధైర్యము తేజస్సు బలోన్నతి ఎట్లా లభించాయి. దేవ అసుర మనుషులతో కూడిన ముల్లోకములను గెలిచే వానివలె ఉన్నావు. (50) వేయి జన్మలతోనైనా మహా తేజస్సు గల నీ ఋణం నుండి విముక్తుడనౌటకు నా శక్తి చాలదు. ఈ దార బంధువులతో కూడినా చేయలేను (51) ఈ పుత్రులు, ఈ భార్యలు, ఈ రాజ్యము, ఈ పురము అన్ని వదలి నా చిత్తము నీ యందే ప్రేమతో బద్దమైంది (52) ఓ కుమర! నా ప్రాణ రక్షకుడ! నాకంతా చెప్పు. ఈ నా భార్యల జీవితము నీ అధీనంలో ఉంది. (53) సూతులిట్లన్నారు. అని అడుగగా భద్రాయువు తన తడ్రితో ఇట్లన్నాడు. ఈతడు వైశ్య సుతుడు సునయుడు నా స్నేహితుడు ఓ రాజ! (54) నేను ఈతని ఇంటి యందు నా తల్లితో కూడి బాగా ఉంటున్నాను. నా పేరు భద్రాయువు నా వృత్తాంతాయును నీరు తర్వాత చెబుతాను. (55) భార్యలతో ముహృజనులతో కూడి పురం ప్రవేశించి ఉండు. నీకు క్షేమం కలగని. శత్రు భయం వదలి సుఖంగా విహరించు (56) ఈ శత్రువులను నేను వచ్చేదాకా వదలడు. నేనీ వేళ త్వరగా నా ఇంటికి(స్థానానికి) వెళ్లాను. (57) అని పలికి రాజుకు పొయి వస్తానని చెప్పి ఆ రాకుమారుడు భద్రాయువు తన భవనమునకు వచ్చి తల్లికి అంతా చెప్పాడు (58) ఆమె ఆనందపడి ఆనంద బాష్పాలు కలిగి తన కొడుకును కౌగిలించుకొంది. ఆ వైశ్యవతి ప్రేమతో కౌగిలించుకొని పూజించాడు (59) ఆ రాజేంద్రుడు వజ్రబాహువు తన మందిరంలో ప్రవేశించి స్త్రీలు పుత్రులు, అమాత్యులతో కూడి చాలా ఆనందించాడు (60) ఆ రాత్రి వేకువ జామున ఋషభుడు యోగిశ్రేష్ఠుడు చంద్రాగదుని వద్దకు సీమంతిని సతి వద్దకు రాజు వద్దకు వచ్చి (61) భద్రాయున్సు ఉత్పత్తిని ఆతని అమానుష క్ర్మను రహస్యంగా ప్రేమతో చెప్పి, నీ కూతురు కీర్తిమాలినిని (62) భద్రాయున్సునకు ఇవ్వు అని ఆ నిషధ రాజునకు చెప్పి దేశకాల అర్థముల తత్వమెరిగిన ఋషభుడు వెళ్ళిపోయాడు (63).
తా ॥ చంద్రాగద రాజు మంగళమునకు ఉచితమైన ముహూర్త మందు భద్రాయుస్సును పిలిచి కీర్తి మాలినవి ఇచ్చాడు (64) వివాహ మయ్యాక ఆ రాజేంద్ర కుమారుడు భార్యతో కూడి హేమాన వస్థుడై చంద్రుడు రోహిణితో కూడినట్టు ప్రకాశించాడు. (65) అతని తండ్రిని వజ్రబాహువును పిలిచి ఆ నైషధరాజ అమాత్యులతో గూడి నగరులో ప్రవేశించి ఎదురేగి పూజించాడు (68) వివాహితుడైన, శత్రునాశకుడైవ భద్రాయుస్సును అక్కడ చూచాడు. పాదములపై పడిన ఆతనివి ప్రేమతో అనందంతో కౌగిలించుకున్నాడు (67) ఈతడు నాకు ప్రాణముల నిచ్చినవాడు, వీరుడు ఈతడు శత్రు నిషూదనుడు. ఇప్పటికి ఈతని వంశమేదో నాకు తెలియదు. అనంత పరాక్రముడితడు. (68) ఓ రాజా! “నీ అల్లుడు చంద్రాంగదుడు మహాబలుడు. ఈతని వంశమును, ఉత్పత్తిని నిజంగా వినదలిచాను (69) అని దశార్ణరాజు ప్రార్థించగా నీషథరాజ ఒంటరిగా కలిసి నవ్వుతూ ఇట్లా చెప్పాడు (70) ఈతడు నీ కుమారుడు ఓ రాజా! శైశవంలో రోగ పీడితుడు. రుజార్తురాలైన తల్లితో పాటు నీ వితనిని అడవిలో విడిచి పెట్టావు (71) ఈ పిల్లవానితో కూడా ఆ నారి అడవిలో తిరుగుతూ అదృష్టవశాత్తు వైశ్య గృహమును చేరి ఆ వైశ్యునీతో రక్షింపబడింది. (72) బహు రోగార్తుడైన ఈ నీ కుమారుడు చనిపోయాడు. ఎవరో ఒక యోగి రాజు చనిపోయిన ఈతనిని బ్రతికించాడు (73) ఋషభుడను పేరుగల శివయోగి ప్రభావం వల్ల మాత, కుమారుడు దేవసదృశ రూపాన్ని పొందారు (74) ఆతడిచ్చిన ఖడ్గంతో శత్రువుల చంపే శంఖంతో శివకవచంతో అభిరక్షితుడై యుద్ధంలో శత్రువులను జయించాడు. (75) ఈతనికి ఒక్కనికే వన్నెండు వేల ఏనుగుల బలాన్ని ఇచ్చాడు (కలిగి ఉన్నాడు) అన్ని విద్యలలో నిష్ణాతుడు. నాకు అల్లుడైనాడు (76) ఈతనిని తీసుకొని సువ్రత ఐన ఈతని తల్లిని తీసుకొని, రాజా నగరానికి వెళ్ళు. ఉత్తమ శ్రేయస్సును పొందుతావు. (77) అని చంద్రాంగదుడు అంతా చెప్పి, అంతఃపురంలో ఉన్న అతని పెద్ద భార్యను పిలిచి, భూషితురాలైన ఆమెను చూపించాడు (78) అని అంతా విని చూచి ఆ రాజు సిగ్గుపడి మిక్కిలి మూర్ఖత్వం వల్ల పీడింపబడి తన పనిని నిందించుకొని (79) వారిద్దరి దర్శన కౌతుకం వల్ల పరమానందాన్ని పొందాడు. పులకాంకిత సర్వాంగుడై వారిద్దరిని కౌగిలించుకున్నాడు. (80) ఈ విధముగా నిషిధ రాజుతో పూజింపబడి, అభినందింప బడినాడు. ఆతడు చక్కగా భుజించి, మంత్రులతో కూడి (81) తన అగ్ర మహిషితో, పుత్రునితో, కోడలుతో కూడి సవరివారుడై వజ్ర బాహవు తన నగరానికి వెళ్ళాడు (82) ఆతడు, త్వరగా, ఆ భద్రాయువు తండ్రి మందిరమునకు వచ్చి పట్టణ ప్రజలందరికి ఎంతో ఆనందాన్ని కల్గించాడు (83) కాలాంతరమున తండ్రి మరణించాక ప్రాప్తియౌవ్వనుడై భద్రాయువు అద్భుత విక్రముడై భూమినంతా పాలించాడు. (84) హెమరథుడైన మాగధేశుని బంధనం మండి విడిపించాడు. బ్రహ్మర్షుల సన్నిధిలో పరమ మైత్రిని ఏర్పరచుకున్నాడు. (85) ఇట్లా త్రిలోక మహితుడైన శివయోగి పూజను చేసి పురాతన భవమందు కూడా రాజ మానుడు, సహించరాని విసద్గణమునుదాటి, రాజ్యాన్ని పొంది, చంద్రాంగదుని సుతతోపాటు బాగా అనందించాడు (86) అని శ్రీ స్కాంద మహావురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహోత్తర ఖండమందు భద్రాయు వివాహ కథన మనునది పదమూడవ అధ్యాయము.
